"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

Darla Bio note Darla Photo for Media లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Darla Bio note Darla Photo for Media లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28 ఆగస్టు, 2020

యోగివేమన విశ్వవిద్యాలయం అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో 28.8.2020 ఆచార్య దార్ల


 యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప వారు నిర్వహిస్తున్న మూడురోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ది.28.8.2020 న  ఒక సమావేశానికి అధ్యక్షత వహించాను. ఆచార్య కాత్యాయనీ విద్మహే, డా. రఘు, డా.తవ్వావెంకటయ్య, డా.హరీనా కళా, డా.షేక్ ఇబ్రహీమ్ ఈ సమావేశంలో పత్రాల్ని సమర్పించారు. నేను కూడా ‘‘డాక్టర్ కట్కూరి మహేందర్ ‘సురకత్తి’ కవిత్వం: దళిత దృక్పథం అనే అంశంపై పత్రాన్ని సమర్పించాను,
తర్వాత జరిగిన డా.పి.సి.వెంకటేశ్వర్లు గారు అధ్యక్షతన జరిగిన సదస్సులో పెద్ద ఓబులేశు నా కవిత్వం ‘‘ నెమలికన్నులు కవిత్వం: దళిత దృక్ఫథం పేరుతో పత్రాన్ని సమర్పించారు.

దీనికి సంబంధించిన లింక్: https://www.youtube.com/watch?v=r55OsIF8NX8

22 ఆగస్టు, 2020

ఆచార్య ఆర్వీయస్ సుందరం గారి ‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’ పై పత్రసమర్పణ

 


ఈ రోజు (22.8.2020) సర్ త్యాగరాయ కళాశాల, చెన్నై వారు నిర్వహించిన ఆచార్య ఆర్వీయస్ సుందరం జీవితం-రచనలు అనే అంశంపై అంతర్జాల అంతర్జాతీయ సదస్సుని నిర్వహించిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించి, ఆంధ్రుల జానపద విజ్ఞానం’పై పత్ర సమర్పణ చేశాను. 

ఆచార్య ఆర్వీయస్ సుందరం జీవితం- సాహిత్యం సదస్సు ( 22.8.2020)

 ఈ రోజు, రేపు ( 22.8.2020 నుండి 23.8.2020) సర్, త్యాగరాయ కళాశాల, చెన్నై వారు ‘‘ఆచార్య ఆర్వీయస్ సుందరం జీవితం- సాహిత్యం’’ పేరుతో ఒక అంతర్జాల అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రారంభసమావేశానంతరం జరిగే తొలిసమావేశానికి నేను అధ్యక్షుడిగా వ్యవరిస్తాను. దీనితో పాటు ఆచార్య ఆర్వీయస్ సుందరం గారి ‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’ పుస్తకంపై పత్రసమర్పణ చేస్తాను. 



12 ఆగస్టు, 2020

Bio note of Prof Darla Venkateswara Rao

‌1973

సెప్టెంబర్ 5 న ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో జన్మించాను. 

‌అమలాపురంలో ఇంటర్మీడియట్, డిగ్రీ ( బి.ఏ.స్పెషల్ తెలుగు) చదివాను.

‌ఎం.ఏ., ఎం.ఫిల్, పిహెచ్.డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, డాక్టరేట్ చేస్తుండగానే  డిగ్రీ కళాశాలలో ఉద్యోగం వచ్చింది.మూడేండ్లు అక్కడ పనిచేసి సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాను.

‌ఆరుద్ర రచనలపై డాక్టరేట్ చేశాను.

‌సుమారు 16 పుస్తకాలు ప్రచురించాను.

‌జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో సుమారు 89 పత్రాలు సమర్పించాను.

‌పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారం ఇచ్చారు.

‌నా కవితలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కొన్ని అనువాదమయ్యాయి

‌వీచిక, బహిజన సాహిత్య దృక్పథం, సాహిత్య మూర్తులు-స్ఫూర్తులు, సాహితీ సౌగంధి, సృజనాత్మక రచనలు చేయడం ఎలా? మొదలైనవి పార్టీలు.

‌నెమలికన్నులు నాకవితా సంపుటి. ఇది ఇంగ్లీష్ లో కి అనువాదం అయ్యింది.

‌నా పర్యవేక్షణలో  19 మంది ఎం.ఫిల్, 10 మంది డాక్టరేట్ పట్టాలు తీసుకున్నారు. 

‌బెంగుళూరు, బెనారస్ విశ్వవిద్యాలయాలు, మరికొన్ని అటానమస్ విద్యాసంస్థలకు తెలుగు శాఖ లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా ఉన్నాను.

‌హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత సాహిత్యం, తెలుగు డయాస్పోరా సాహిత్యం అనే కొత్త కోర్సులను ఎం.ఏ.స్థాయివారికి రూపొందించాను.

‌వివిధ విశ్వవిద్యాలయాల డాక్టరేట్ డిగ్రీలకు ఎడ్యుడికేటర్ గా ఉన్నాను. 

‌ప్రస్తుతం హైదరాబాద్ తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాను.

23 ఆగస్టు, 2019

ఆచార్య దార్లకు ప్రతిభా పురస్కారం



సాహితీ రంగంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్న విశిష్ట సేవలకుగాను విశాల సాహిత్య అకాడమీ 2019వ సంవత్సరం  బి.ఎస్.రాములు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతున్న 'బి.ఎస్.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం' కార్యక్రమంలో గురువారం తెలంగాణ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, ఉత్సవసంఘం నిర్వాహకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా.పత్తిపాక మోహన్, సదస్సు సంచాలకులు డా.నిదానకవి నీరజ తదితరులంతా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు.  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటీ లో తెలుగు ప్రొఫెసర్ గాను, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సుమారు 16 గ్రంథాలను రాశారు. ప్రముఖ పత్రికల్లో ఆయన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తున్నారు.  ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల నుండి అనేక పురస్కారాలను అందుకున్న వార్లకు ప్రతిభా పురస్కారం రావడం పట్ల సహ అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.



                                     (నమస్తే తెలంగాణ దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)


గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సాహిత్య రంగంలో చేస్తున్న విశిష్టసేవలకుగాను హెచ్‌సీయూ తెలుగు ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు ‘బి.ఎస్‌.రాములు ప్రతిభా పురస్కారం 2019’ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో గురువారం నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన బి.ఎస్‌.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం కార్యక్రమంలో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌.రాములు, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సంపాదకులు డా.పత్తిపాక మోహన్‌, డా.నిదానకవి నీరజ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హెచ్‌సీయూలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డీన్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 16 గ్రంథాలను రాయడంతోపాటు ప్రముఖ పత్రికల్లో ఆయన రాసిన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.
(ఈనాడు దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)

(సాక్షి దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)

17 ఏప్రిల్, 2019

“నవ్యత్వమే పరిశోధనలకు నిజమైన ప్రమాణం” -ఆచార్య పొదిలి అప్పారావుగారు

“నవ్యత్వమే పరిశోధనలకు నిజమైన ప్రమాణం”
ముఖ్య అతిథి గా మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు , వేదికపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి, ఆచార్య పులికొండ సుబ్బాచారి, పొట్లూరి హరికృష్ణ, డా॥ ఆవుల మంజులత తదితరులున్నారు.

పరిశోధనల్లో నవ్యత్వం క్షేత్ర పరిశీలన, ప్రయోగాలు, అన్వేషణలవల్లనే సాధ్యమవుతుందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు వ్యాఖ్యానించారు.  హెచ్.సి.యు. మానవీయశాస్త్రాల విభాగం, జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న “జానపద విజ్ఞానం – అధ్యయన ఆవశ్యకత” అనే అంశంపై మంగళవారం జరిగిన ఒక రోజు జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెచ్.సి.యు. దేశ వ్యాప్తంగా నాల్గవ ర్యాంకు రావడానికి విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు మరియు గత పరిశోధకుల సమిష్టి కృషి ఎంతో ఉందన్నారు.  దేశంలో ముందుచూపుతో పరిశోధనలు జరగాలనీ, అలాంటి ముందుచూపు కొత్త విజ్ఞానాన్ని ఇస్తుందని, దీనికి ఇలాంటి జాతీయ సదస్సులు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. 
ఈనాడు దిపత్రికసౌజన్యంతో.... క్లిప్లింగ్ 

ప్రారంభోత్సవ సభలో అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ డీన్ ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిగారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సమకాలీన జానపద విజ్ఞానానికి సంబంధించిన అనేక పరిశోధనల పట్ల అవగాహనకు ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. 


సాక్షి పత్రిక సౌజన్యంతో.... క్లిప్లింగ్ 

వేదికపై ముఖ్య అతిథి గా పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు , ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి, ఆచార్య పులికొండ సుబ్బాచారి, పొట్లూరి హరికృష్ణ, డా॥ ఆవుల మంజులత, డా.డి.విజయలక్ష్మి తదితరులున్నారు.
జానపద కళలు మరియు సాంస్కృతిక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ పొట్లూరి హరికృష్ణగారు ఈ జాతీయ సదస్సును ప్రారంభించారు. రాష్ట్రాలు వేరైనా, దేశంలో ఎక్కడున్న ఎటువంటి పరిశోధనలపైన కూడా తమ సంస్థ సహకారాన్ని అందిస్తుందని, దానిలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని శ్రీ పొట్లూరి హరికృష్ణ అన్నారు.  జానపద కళల పరిణామాన్ని తెలిపే మ్యూజియమును అమరావతిలో త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 


ఆచార్య అప్పారావు పొదిలె, వైస్ ఛాన్సలర్ గార్ని సత్కరిస్తున్న డా. ఆవుల మంజులత తదితరులు 

నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో క్లిప్పింగ్

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధక్ష్యులు డా॥ ఆవుల మంజులతగారు మాట్లాడుతూ జానపదానికీ, పేదరికానికీ, భాషకీ, పేదరికానికీ అవినాభావ సంబంధం ఉందన్నారు.  తెలుగు భాష వల్ల 87% మానవవనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని పరిశోధనలు తెలియజేశాయన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రక్రియను ప్రశంసించారు.  త్వరలో మరొక సదస్సుకి తాను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ఈ సదస్సులో ప్రకటించారు. 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని అభినందిస్తున్న ఆచార్య అప్పారావు, పొదిలె తదితరులు

సదస్సులో కీలకోపాన్యాసం చేసిన ఆచార్య పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ జానపద విజ్ఞానంలో జరుగుతున్న పరిశోధనల తీరుతెన్నుల్ని విశ్లేషించి, భారతీయులు, పాశ్చాత్యుల కృషిని విశ్లేషించారు. జానపద విజ్ఞానంలో పరిశోధనలు చేయడానికి గల అనేక పార్శ్వాలను వివరించారు. 
వార్త దిన పత్రిక సౌజన్యంతో క్లిప్పంగ్.

సదస్సుల లక్ష్యాలను కో-ఆర్డినేటర్ ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు వివరించగా, కో-కోఆర్డినేటర్ డా॥ డి. విజయలక్ష్మిగారు వందన సమర్పణ చేశారు.  సదస్సులో వివిధ విశ్వవిద్యాలయ పరిశోధకులు, తెలుగు శాఖ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిలో సుమారు 16 పరిశోధన పత్రాలు సమర్పించారు.


భూమిపుత్ర తెలుగు దిననపత్రిక, అనంతపురం వారి( E-mail: bhumiputra.net@gmail.com) సౌజన్యంతో

సదస్పులో పాల్గొన్న పరిశోధకులు, విద్యార్థులు

ఈ సదస్సులో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య గోనానాయక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్,  ఆచార్య అప్పల్నాయుడు, ఆచార్య వి.కష్ణ, ఆచార్య సర్రాజు, డా. భుజంగరెడ్డి, డా.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




24 అక్టోబర్, 2018

‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్త్రీవాదం’’ 24 అక్టోబరు 2018

24 అక్టోబరు 2018 వతేదీన సాహిత్య అకాడమీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, తిరుపతి వారు కొలకలూరి మధుజ్యోతి ఆధ్వర్యంలో సంయుక్తంగా ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్త్రీవాదం’’ అనే అంశంపై ఒకరోజు సదస్సుని నిర్వహించారు.

 డాక్టర్ వి.పోతన్న,  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు సంచాలకురాలు ప్రముఖ పరిశోధకురాలు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి,   డాక్టర్ కోయి కోటేశ్వరరావు,మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు డాక్టర్ యువశ్రీ, డాక్టర్ సుభాషిణి, డాక్టర్ లక్ష్మీప్రియ, వివిధ విభాగాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, పురసాహితీ ప్రియులు 

  ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య వి. ఉమ, వంగలకుర్తి విద్యాసాగర్ (కవి, రచయిత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర.), ఆచార్య మూలే విజయలక్ష్మి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, పురుషోత్తం (సాహిత్య అకాడమీ రీజనల్ కో ఆర్డినేటర్) తదితరులు ప్రారంభ సమావేశంలో  అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

Sri.S,P,Mahalingeswar (Regional Secretary, Sahitya Akademi), Prof. Kolakaluri Enoch, Ex.Vice Chancellor, S.V.University, Tirupathi, and  Prof. Darla Venkateswara Rao, Dy.Dean, Students' Welfare, University of Hyderabad, Hyderabad. 

11 అక్టోబర్, 2018

సత్యం, అహింసల స్ఫూర్తి ప్రదాత గాంధీజి

గాంధీజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


గాంధీజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


గాంధీజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆచార్య దార్ల వెంటేశ్వరరావుని సత్కరిస్తున్న ఫ్రెండ్స్ వెల్పేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, స్కూల్ కరస్పాండెంట్  శ్రీ ఫణికుమార్ 

సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు





విద్యార్థినీ విద్యార్థుల చేత గాంధీ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


04 మే, 2018

సుకూన్ -2018 ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆచార్య దార్ల

 సెంట్రల్ యూనివర్సిటీ సుకూన్ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో  రేలారే లేలా జానపద నృత్యగీతాలు, (శివనాగులు ప్రసాద్ బృందం), రాక్ షో  మే 8, 2018 వతేదీ సాయంత్రం జరింగింది. ఈకార్యక్రమాన్ని సుకూన్ సలహాసంఘం చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వీరితోపాటు డా.రాణీరత్నప్రభ , స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీరాగ్, ప్రధానకార్యదర్శి ఆరిఫ్ అహ్మద్ పాల్గొన్నారు.

విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉన్న నైపుణ్యాల్ని   వ్యక్తీకరించడానికి, విశ్వవిద్యాలయం గౌరవమర్యాదల్ని మరింత ఇనుమడించేలా  'సుకూన్' ఉపయోగపడాలి. ప్రతి యేడాది సుకూన్  నిర్వహించుకుంటారు. దీనికి ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిలో అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. సుకూన్ శాంతియుతంగా, ఆహ్లాదంగా  నిర్వహించుకోవడానికి ఒక నియమావళిని ఏర్పరుచుకుంటారు. ఆ నియమావళి ప్రకారం సుకూన్ నిర్వహించుకుంటారు. ఈయేడాది డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు సుకూన్ -2018  కి చైర్మన్ గా ఉన్నారు. డా.పద్మజ , డా. తిరువక్కసు, డా.రాణీరత్నప్రభ, విద్యార్ధి నాయకులు శ్రీరాగ్, అరీఫ్ తదితరులు ఈ సలహా సంఘంలో ఉన్నారు.




ఆంధ్రజ్యోతి, 10 ఏప్రిల్ 2018

21 ఏప్రిల్, 2018

ఉన్నత విద్యాశిఖరం...హెచ్ సీయూ ( ఆంధ్రజ్యోతి, 20 ఏప్రిల్ 2018)

నిన్న (20 ఏప్రిల్ 2018) ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పూర్తి పేజి, మెయిన్ ఎడిషన్ లో యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు గురించి విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని ప్రచురించారు. దానిలో నా అభిప్రాయాన్ని కూడా నా ఫోటోతో సహా ప్రచురించారు.థాంక్యూ ఆంధ్రజ్యోతి!

23 మార్చి, 2018

ఉపరాష్ట్రపతితో జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం

భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ  ఎం.వెంకయ్యనాయుడుగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తదితరులు 

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, న్యూఢిల్లీ వారు ఆదివారం, 18 మార్చి 2018 వతేదీన హైదరాబాదు లో గల  స్వర్ణభారతి ట్రస్ట్ లో 'స్థానిక స్వపరిపాలన   బలోపేతం' అనే అంశంపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు విచ్చేశారు. వీరితో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖామంత్రులు, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పి.జి. విద్యార్థులు సుమారు 41 మంది పాల్గొన్నారు. ఈ బృందానికి డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సమన్వయకర్త గావ్యహరించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రుల అధ్యక్షతన జరిగిన వివిధ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని స్థానికస్వపరిపాలన పటిష్టతకు వివిధ సూచనలు చేశారు. మూడంచెల స్థానిక స్వపరిపాలన సంస్థలు బలోపేతానికి ప్రజలు సక్రమంగా పెన్నులు చెల్లించడంలో పాటు, ఆ నిధులను మరలా ప్రజల సౌకర్యాలు పొందుతున్నారనే నమ్మకం ఏర్పడినప్పుడే స్థానిక స్వపరిపాలన సంస్థలు పటిష్టమవుతాయని హైదరాబాదు విశ్వవిద్యాలయం ప్రతినిధులు వివరించారు. ఈసమావేశంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, అధికారుల చర్చలు కొత్త ఆలోచనలకు తోడ్పడ్డాయని, విధానపరమైన నిర్ణయాల అమలులో గల సాధక బాధకాలు అవగాహనతో పరిశోధనలకు కొత్త ఆలోచనలు కలిగించాయన్నారు.
ఈ బృందంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య రాజమోహనరావు, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా.అలోక్ కుమార్ మిశ్రా, డా. అరుల్ మౌజీ, డా.ఇ.వెంకటేశ్, డా.రాణి రత్నప్రభ, డా.జె.భీమయ్య, డా.నాగమణి, డా. రామదాస్, డా.గంగాప్రసాద్ పరిశోధక విద్యార్థులు ఎం.చంద్రమౌళి, మస్తాన్, కృష్ణవేణి, ఫణి కుమార్ గౌడ్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారితో, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటి బృందం

జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారితో, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటి బృందం

కేంద్రమంత్రి Union Ministers Shri Narendra Singh Tomar తో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తదితరులు

ఈ కార్యక్రమాన్ని 19 మార్చి 2018 వతేదీన రాజ్యసభ టీ.విలో ప్రసారం చేసిన స్నాప్ షాట్ 

సదస్సులో పాల్గొనడానికి  వెళ్తూ...

విద్యార్థులు, పరిశోధకులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

సదస్సుకి బయలు దేరేముందు ఉదయమే సరదాగా కొంతమందితో దిగిన ఫోటో