"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

Awards

యువకవి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావుని భారతీయ దళితసాహిత్య అకాడమీ వారు ఈ ఏడాది (2007) డా.అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డుతో సత్కరించారు. 2007 డిసెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీ, రాజనివాస్ మార్గ్ లో ఎంతో వైభవంగా జరిగిన 23 వ దళిత రచయితల జాతీయ సదస్సులో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ చేతుల మీదుగా డా.దార్ల వెంకటేశ్వరరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన దళిత రచయితల సదస్సులో డా.దార్ల వెంకటేశ్వరరావు “తెలుగు సాహిత్యంలో దళిత (మాదిగ) జీవిత ప్రతిఫలనం " ( Life reflections of Dalits (madigas) in Telugu Literature ) అనే పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సులో జాతీయ స్థాయిలో దళితసాహిత్యం, దళిత జీవతాలకు సంబంధించిన వివిధ అంశాలలో చర్చలు జరిగాయి. చాలామంది తమ పత్రాలను, కథలను, కవిత్వాన్ని భారతీయ సాహిత్య అకాడమీ వారికి సమర్పించారు. వేదికపై వివిధ ప్రాంతాలనుండి వెలువడుతున్న కొన్ని దళిత పత్రికలను ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయంగా ఉన్న వర్ణ, కుల , వర్గ వివక్షలను ఈ సదస్సు సుదీర్గంగా చర్చించింది. భారతదేశంలో ఉత్త్తరాదిలో బహుజన చైతన్యం మిగిలిన రాష్ట్రాలలోనూ రావాలని సదస్సు ఆకాంక్షించింది.


భారతీయ దళితసాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ నుండి అవార్డ్ ను స్వీకరిస్తున్న సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావు

భారతదేశవ్యాప్తంగా వివిధ భాషలలో దళిత సాహిత్యం, సామాజిక, పత్రికా, కళారంగాలలో కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఈ సమావేశాల్లో డా.అంబేడ్కర్, జ్యోతీబాపూలే, మహర్షి వాల్మీకి, సద్గురు కబీర్ , గురు రవిదాస్, బిర్సాముండా, జగజ్జీవన్ రామ్ తదితరుల పేర్లతో జాతీయ స్థాయిలో వివిధ పురస్కారాలను అందజేశారు. వేలాదిగా హాజరైన ప్రతినిధులకు షా ఆడిటోరియం సరిపోలేదు. వివిధ స్థాయి రాజకీయ నాయకులు, మంత్రులు, మాజీ గవర్నర్లు, సాహితీవేత్తలు. కళాకారులు హాజరైన ఈ సమావేశాల్ల్లో భారతీయ దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనాక్షర్ చేతులమీదుగానే పురస్కారాలను స్వీకరించడానికి అత్యధికులు ఉత్సాహం చూపారు. రెండు రోజుల ఈ జాతీయ సదస్సులో వివిధ భాషలలో వెలువడిని దళిత సాహిత్యాన్ని ప్రదర్శించారు.

·        

ఆచార్య దార్లకు ప్రతిభా పురస్కారం



సాహితీ రంగంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్న విశిష్ట సేవలకుగాను విశాల సాహిత్య అకాడమీ 2019వ సంవత్సరం  బి.ఎస్.రాములు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతున్న 'బి.ఎస్.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం' కార్యక్రమంలో గురువారం తెలంగాణ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, ఉత్సవసంఘం నిర్వాహకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా.పత్తిపాక మోహన్, సదస్సు సంచాలకులు డా.నిదానకవి నీరజ తదితరులంతా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు.  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటీ లో తెలుగు ప్రొఫెసర్ గాను, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సుమారు 16 గ్రంథాలను రాశారు. ప్రముఖ పత్రికల్లో ఆయన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తున్నారు.  ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల నుండి అనేక పురస్కారాలను అందుకున్న వార్లకు ప్రతిభా పురస్కారం రావడం పట్ల సహ అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.



                                     (నమస్తే తెలంగాణ దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)


గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సాహిత్య రంగంలో చేస్తున్న విశిష్టసేవలకుగాను హెచ్‌సీయూ తెలుగు ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు ‘బి.ఎస్‌.రాములు ప్రతిభా పురస్కారం 2019’ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో గురువారం నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన బి.ఎస్‌.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం కార్యక్రమంలో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌.రాములు, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సంపాదకులు డా.పత్తిపాక మోహన్‌, డా.నిదానకవి నీరజ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హెచ్‌సీయూలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డీన్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 16 గ్రంథాలను రాయడంతోపాటు ప్రముఖ పత్రికల్లో ఆయన రాసిన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.
(ఈనాడు దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)

(సాక్షి దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)

Received Pratibha Puraskaram Presented by Visala Sahitya Academy, Hyderabad at Ravidrabharati, Hyderabad held on 22 August 2019.

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016 తో  ది: 6 నవంబర్స 2016 న సత్కరిస్తున్న డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావు, ది యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్.సి., ఎస్.టి ఎంప్లాయీస్, సాహితీ విభాగం వరంగల్లు జాతీయ అధ్యక్షులు కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు సాధుమహేందర్ తదితరులు చిత్రంలో ఉన్నారు. 

ఈనాడు, వరంగల్ 7 నవంబర్ 2016 నాటి న్యూస్
అవార్డు గ్రహీతలకు అందించిన ఆహ్వాన పత్రం 
Mahakavi Joshuva National Literary Award -2016, (Award Presented By Prof.R.Seeta RamaRao, Vice Chancellor, Dr.B.R.Ambedkar Open University, Warangal held on 6th December 2016, organized by The United Forum for S.C, S.T, Literary Wing, Warangal, Telangana)

·         Received Dr.Ambedkar National Award-2019 Presented by Dalit Open University, Guntur, A.P, held on 13 July 2019.







మనం చేసే పనిని పవిత్రంగా చేసినప్పుడు, అది దైవకార్యంతో సమానమని సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మాదాపూర్ లోని స్వాతి ఉన్నత పాఠశాలలో జరిగిన మదర్ థెరీసా 109 వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మదర్ థెరీసా సామాజిక సేవను వివరించి, ఆమె జీవితం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి 'విశిష్ట సేవా రత్న' పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా జరిగిన సభకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించి వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 

·         Award: Mother Teresa Visista Seva Puraskharam, Friends Welfare Association, Hyderabad, Research and Social Service, Hyderabad on 25 Aug 2018

ఆచార్య దార్ల కు జెన్నె పురస్కారం-2017

శ్రీమతి జెన్నె మాణిక్యమ్మ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న డా.జెన్నె ఆనంద్ కుమార్, స్వీకరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. కొన్ని కారణాంతరాల వల్ల పురస్కార ప్రదానోత్సవానికి నేను హాజరు కాలేకపోయాను. అందువల్ల 
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకి వచ్చి మరీ డా.ఆనంద్ గారు నా ఆఫీసులో అందజేశారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

·         Smt.Jenna Manikyamba Visita Sahithi  Award -2017, (Award Presented by Smt. Jenne Manikyamba Memorial Trust,  Ananatapuram, Andhra Pradesh,  dated on 16 August 2017


డా.దార్లకు తెలుగు‘వర్సిటీ కీర్తి పురస్కారం ప్రదానం



‘తెలుగు సాహిత్య విమర్శ’ రంగంలో చేసిన విశిష్టమైన కృషి చేసిన వారికి ప్రతి ఏడాదీ ఇచ్చే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తిపురస్కారాన్ని 2012 సంవత్సరానికి గాను ప్రముఖ విమర్శకుడు, కవి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు కి ప్రకటించారు. 2013 నవంబరు 29న హైదరాబాదులోని శ్రీనందమూరి తారకరామారావు కళావేదికపై దుశ్శాలువ, వెయ్యినూటపదహారు రూపాయల నగదుతో డా.దార్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. , ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజీవ్ యువకిరణాలు ప్రోగ్రామ్ చైర్మన్ ఆచార్య కె.సి.రెడ్డి ఈ  పురస్కారాన్ని ప్రదానం చేశారు.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డిఆంధ్రప్రదేశ్ పూర్వ సాంస్కృతిక శాఖ సలహాదారు  డా.కె.వి.రమణాచారి, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, డా. జె. చెన్నయ్య తదితరులు ఈ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఇతర వివిధ రంగాల్లో విశిష్టమైన కృషి చేసిన మరో 31 మందికి కూడా డా. దార్ల వెంకటేశ్వరరావుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాలతో సత్కరించారు.
https://youtu.be/L3A1y86OUBw

·         Received “keerthi Puraskaram for contribution of telugu literary criticism” from Pottisriramulu Telugu University, Hyderabad, on 28 November 2013.

డా.దార్ల వెంకటేశ్వరరావుకి ‘విహంగ’ సాహితీ పురస్కారం

అంతర్జాల తెలుగు మాసపత్రిక ‘విహంగ’  ఈ యేడాది నుండి సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. విహంగ పత్రికలో రచనలు చేస్తున్నవారికి, విహంగ విజయవంతంగా నడవడానికి కృషి చేస్తున్నవారికి ఈ పురస్కారాలను ప్రకటించారు. ఈ యేడాది విహంగ పురస్కారాలను అందుకున్నవారి వివరాలు: కె.వరలక్ష్మి ,కె .గీత ,గబ్బిట దుర్గా ప్రసాద్ , డా.దార్ల వెంకటేశ్వరరావు,
డా.షమీఉల్లా , డా.లక్ష్మి సుహాసిని , విజయ భాను కోటే , బొడ్డు మహేందర్ అందుకున్నారు.  విహంగకి సాంకేతిక సహకారం అందిస్తున్న వర్కింగ్ ఎడిటర్స్ అరసి , పెరుమాళ్ళ రవికుమార్ పురస్కారాలు అందుకున్నారు.
\

·         Vihanga Literary Award-2017, (Award Presented by Prof.S.V.Satyanarayana, Vice- Chancellor, Potti Sree Ramulu Telugu University, held on 11 January 2017, at Sahitya Peetham, Rajahmundry. A.P., organized by Manogna Sahitya, Samkrutika Academy, Rajahmundry)

 సెంట్రల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావు గారి నుండి ఛాన్సలర్ అవార్డు స్వీకరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు


ఆంధ్రజ్యోతి కథనం

 


·         Chancellor’s Award-2016  (Award Presented by Prof. Apparao Podile, Vice Chancellor,  University of Hyderabad, received on 1st October 2016 at 18 Convocation )

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి విజయవాడలో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రధమ మహాసభల్లో ది 10 ఏప్రిల్ 2016న మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధన పురస్కారాన్ని(2016) ప్రదానం చేస్తున్న దృశ్యం

బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ మహాసభల్లో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు

·         Dr.Mallavarapu Johnkavi Research Award 2016 , A.P Bahujana Rachayitala Vedika, Vijayawada, dated on 16 April 2016.

Best Literary Award -2023 

దార్ల (vrdarla.blogspot.com)

Prof. Darla Venkateswara Rao, the Head, Department of Telugu, School of Humanities, University of Hyderabad (UoH), has been honoured with Best Literary Award by the Tamil Cultural Research Centre (TCRC), Palakkad, Kerala on the occasion of the 2-day National Seminar organised  on  Bhinna Drukpatalu in Vanavil K Rachanallo (Different Perspectives in K. Vanavil’s Writings) on December 2, 2023, in collaboration with the Tamil Cultural Research Centre and DAV College, Azmir, for his outstanding contribution to literature.

Prof. Y.P. Venkata Subbaiah, Registrar, Yogi Vemana University, Mr. Vanavil K. Ravi, the eminent poet and advocate, Tamil Nadu, Prof. N. Lakshim Iyer, the Department of Hindi, Central University of Rajasthan, Prof. Madabhushi Sampath Kumar, Director, Classical Telugu Centre, Nellore, were among those who participated in the programme.

The Selection Committee has declared this award based on his research and published books. Along with Prof. Darla Venkateswara Rao, Prof. Chinta Sudhakar, Vice-Chancellor, Yogi Vemana University, Prof. N. Eshwar Reddy, Dr.Uppaladadium Venkateshwara, Dr. Jillella Balaji were among those who have been honoured with the award for their contribution to different fields.

About the Faculty Prof. Darla

Professor Darla Venkateswara Rao, teaches Telugu literature in the Department of Telugu at the Central University of Hyderabad. He is an eminent poet who has published 20 books such as Madiga Chaitanyam (1997), Sahitimurtula Prasasthi(1997), Ganananda Kavi Amrapali Pariseelana (1999), Dalita Tatwikudu (2004), Srujanatmaka rachanalu Cheyadam Elaa? – 2005, Sahitee Sulochanam – 2006, Oka Madiga Smruti: Nagappagari SunderRaju (2007), Dalita Sahityam: Madiga Drukpatham (2008), Veechika (2009),  Punarmulyankanam, (2010) Bahujana Sahitya Drikpatham 2012, Sahiti Murthulu-Spoorthulu (2015), Nemalikannulu (Anthology of Poetry, 2016), Sahiti Sowgandhi (2016), Sahitya Parisodhana Kala: Vidhanam, written by Prof.Gangisetty Lakshminarayana, Edited by Dr.Darla Venkateswara Rao, (2017) Rajasekhara Charitra Navala : Vividha Drikkonaalu, (Student’s Seminar Proceedings), Edited by Dr.Darla Venkateswara Rao, Associate Editor by Sadmeka Lalitha, (2017),  Voice of Dalit: The Poetry of Darla Venkateswara Rao (2018), translated and Introduced by J.Bheemaiah, Published by Prestige Books International, New Delhi, Darla Mata Satakam 2021), Darla Venkateswara Rao & J.Bheemaiah, Cultural Identity and Dalit Literature (Emergence of Madigas in Indian Society), 2021, published by the Prestige Books International, New Delhi, Nemali Kannulu (Autobiography of Prof. Darla, Part-1., which focus on literary criticism. He has set a new trend in poetry by introducing novelty both in content and expression. This manifests his significant contribution to the Indian poetry. Dr. Rao has published several research papers and critical essays on literary criticism. His books are highly recommended for research at various research centres across the country and abroad. Some research has already been carried out on his poetry in Presidency College, University of Madras, Chennai. University teachers and researchers of various academic institutions of Telugu States have written analytical essays and published in leading journals. His poems have also been published in English translation by Sahitya Akademi, New Delhi and Oxford University Press, New Delhi. He also received the best literary award from Sri Potti Sriramulu Telugu University, Hyderabad and the Chancellors Award from the University of Hyderabad. This award comprises a citation for recognition and a cash prize of Rs. 1 lakh meant for academic activities and also, he was conferred Dr. B.R. Ambedkar National Award by the Bharatiya Sahitya Akademi, New Delhi, for his vibrant contribution to the field of criticism and research. He has attended several national and international academic events. He has extensively published in all leading daily, weekly and monthly magazines/academic journals.

Courtesy : Best Literary Award | (uohyd.ac.in)


దిశ దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో
ప్రశంసాపత్రం

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని  ఉత్తమ సాహిత్యవేత్త పురస్కారంతో సత్కరిస్తున్న కవి వానవిల్ కె.రవి, ఆచార్య మాడభూషి, ఆచార్య ఈశ్వర్ రెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం  రిజిస్ట్రార్, ఇతరులు చిత్రంలో ఉన్నారు
నమస్తే తెలంగాణ దినపత్రిక, 3.12.2023 సౌజన్యంతో











No comments: