"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

కవుల ధన్య చరిత శతకం

తెలుగు కవుల ధన్య చరిత శతకం 



శ్రీకరముగను సత్కవి శేఖరులకు

నమిత భక్తిని మ్రొక్కెద నాత్మ లోన

ధరణి వెలుగును పంచెడి ధన్యమూర్తు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత!  (1)


శ్రీలు కురియగ కోరిన చెట్టు వోలె

అడిగినంతనె యీయును అర్థములను

కావ్య సుమముల నల్లెడి కల్ప తరువు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (2)


శ్రీకరముగను వెలుగును జేయునట్లు

మింటి సూర్యుడు చంద్రుడు మేదినినిల

చీకటిని బాపు కవులన్న చిత్రమూర్తు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (3)


శ్రీల నొసగుచు గంధము చెంత జేర

పరిమళము నిచ్చు నెల్లెడ ప్రమదమొసగ

కవన మధురిమ పంచెడి ఘనత వలతు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (4)


శ్రీలు కురియగ కోరిన చెట్టు రీతి

నడిగినంతనె యీయును నర్థములను

కావ్య సుమముల నల్లెడి కల్ప తరువు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత!(5)


నన్నయ భట్టు:


సంస్కృతము నుండి విడివడి చక్కగాను

ఆంధ్ర భాషకు సూత్రము లల్లి నాడు

వాక్కు నకనుశాసను డయ్యె వసుధ పైన

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (6)


ఆది కవి మొదలందరి నార్యులెంచి

కబ్బముల నల్లెరిల పైన కమ్మనగను

జాతి గౌరవమును నిల్పు చతురమతులు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (7)


తేనె లొలికెడి పండ్లను తిన్న యట్లు

సులభ శైలిని పద్యము లల్లి నాడు

తెలుగు జాతికి నిలవగు వెలుగు తోడ

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (8)


ఆది సభ పర్వముల నిల వ్రాసి నాడు

పర్వమారణ్యమధ్యలో నాగి పోయె

నైన నన్నయ కీర్తియు నంత మెరుగు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (9)


ఆది కవియని కీర్తిని నందె నతడు

తెలుగు సాహిత్య పీఠము నిలిపె నతడు

నిలిపె నతడుతెలుగులకు నిత్యకీర్తి

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (10)


కవన మున మువ్వు రందున ఘనుడు వాడు

భారతము నందె యున్నవి పరమ సత్య

ధర్మ మార్గము లెల్లను ధరణి వెలుగ

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (11)



అక్షరములకు రమ్యత నమర జేసి

కథల కతడు ప్రసన్నత కన్నె జేసె

మాధురిని జిల్కె మాటల మహిమ తోడ

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (12)


భాసు రముగను నిలిచెను భట్టు తోడు

సాయ మొసగెను కవికిల శక్తి తోడ

అర్జు నునకిల కృష్ణుడు నండ యట్లు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (13)


తేనెలొలికించు మాటల తీరులందు

భావ గరిమను పంచెడి భక్తవరులు

తెలుగు వెలుగును నిలిపిన దివ్యమూర్తు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (14)


ప్రాస యతులను కూర్చిరి పద్ధతిగను

చక్కనైనట్టి ఛందస్సు శక్తి తోడ

లోక రీతులు తెలిపిన లోక హితులు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (15)


అక్షరములందు ప్రాణము నద్దినారు

సత్య ధర్మములెప్పుడు చాటినారు

నిత్య నూతన శోభల నిచ్చు వారు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (16)


తిక్కనామాత్యుడు:


శ్రీల నొసగును తిక్కన శైలి యెపుడు

కళ్ళ ముందర పాత్రలు కదలు నట్లు

నాట కమ్మును చూచిన నడక తోడ

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (17)


శ్రీకరముగను మువ్వురు సిద్ధ మవగ

వేద తుల్యము భారత మెలమి తోడ

గంగ యమున సరస్వతి గలిసినట్లు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (18)


శ్రీకరముగను నన్నయ జేసినట్టి

అరయగ నరణ్యమాగియు నట్టె యుండ

పూర్తి చేసెను నెర్రన పొందు గాను

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (19)


శ్రీకరంబుగ తిక్కన చేసె నాడు

పదును నైదును పర్వముల్ భవ్యముగను

హరియు హరుడను భేదము మాన్పి నాడు

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (20)


ఎఱ్ణనామాత్యుడు:


శ్రీలు వెలసెను నెర్రన చిత్ర మందు

పరమ శివుని కృపన్ పేరు పడసె నతడు

వర్ణ నలయందు నతుడును వాసి కెక్కె

దార్ల పలికెడు -సుకవుల ధన్య చరిత! (21)


కామెంట్‌లు లేవు: