"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

Media

*ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పరిచయం*
దార్ల వెంకటేశ్వరరావు Darla Venkateswara Rao 
దార్ల వెంకటేశ్వరరావు Darla Venkateswara Rao 
దార్ల వెంకటేశ్వరరావు Darla Venkateswara Rao 








దార్ల వెంకటేశ్వరరావు Darla Venkateswara Rao 
దార్ల వెంకటేశ్వరరావు Darla Venkateswara Rao 
దార్ల వెంకటేశ్వరరావు Darla Venkateswara Rao 



పుట్టి పెరిగింది ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరిలోని , కోనసీమ ప్రాంతం, చెయ్యేరు అగ్రహారంలో…డిగ్రీ వరకూ శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల, అమలాపురంలో డాక్టర్ ద్వానా శాస్త్రి, డాక్టర్ వాడవల్లి చక్రపాణరావు తదితరుల దగ్గర బిఏ స్పెషల్ తెలుగు చదువుకున్నారు. ఆ తర్వాత, ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి. వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా పనిచేసి, ప్రస్తుతం ఆ తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల బోధనానుభవంతో ఎం. ఏ స్థాయిలో తెలుగు డయాస్పోరా సాహిత్యం, సృజనాత్మక సాహిత్యం, పరిశోధన పద్ధతులు, దళిత సాహిత్యం, జనరంజక సాహిత్యం వంటి కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను సమన్వయించుకుంటూ సుమారు 20 మంది చేత ఎంఫిల్, 14 మంది చేత పిహెచ్.డి డిగ్రీలను పూర్తి చేయించారు. సాహిత్య అకాడమీ, పొట్టి శ్రీతెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ తదితర సంస్థలు ప్రచురించిన గ్రంథాలలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి రచనలు తీసుకున్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి బి.ఏ., ఎం.ఏ.తెలుగు వారికి కొన్ని పాఠ్యాంశాలు రచించారు. జాతీయ 












అంతర్జాతీయ సదస్సులలో ఇంకా పరిశోధన పత్రాలను సమర్పించారు. కాకతీయ, యోగివేమన అన్నామలై, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తదితర విశ్వవిద్యాలయాలలో ఈయన రచనలు పాఠ్యంశాలుగా, రిఫరెన్స్ పుస్తకాలుగా ఉన్నాయి. ఈయన కవిత్వం నెమలి కన్నులు పేరుతో తెలుగు లో వెలువడింది. దీని ఇంగ్లీష్ అనువాదం కూడా వచ్చింది. ఈయన కవిత్వాన్ని సాహిత్య అకాడమీతో పాటు ఆక్స్ఫర్డ్ వారు కూడా ప్రచురించారు. చెన్నై లోని మద్రాసు విశ్వవిద్యాలయం, ప్రెసిడెన్సీ కళాశాలల్లో వీరి సాహిత్యంపై పరిశోధనలు జరిగాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం పొందారు. పలు పత్రికలకు సంపాదకులుగా, సభ్యులుగా కూడా వ్యవహరిస్తున్నారు. సుమారు 22 పుస్తకాలను రచించగా, వాటిలో కొన్ని పుస్తకాలకు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులెంతోమంది ముందుమాటలు రాశారు. ఈయన సుమారు రెండు వందల పుస్తకాలకు ముందుమాటలు రాశారు. వందలాది పరిశోధన వ్యాసాలు రాశారు. అనేక పుస్తకాలకు, కవులకు బహుమతులను ఇవ్వడంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సెంట్రల్ యూనివర్సిటీ వారు 45 సంవత్సరాల లోపు వయసు గల అధ్యాపకులకు ఇచ్చే ఛాన్సలర్ అవార్డు, లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంట్ ని అంటున్నారు. 












కుమారు శ్రీనివాసరావు, భార్య శ్రీమతి మంజుశ్రీలతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

భార్య డాక్టర్ మంజుశ్రీతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు




ఆచార్య అయినవోలు ఉషాదేవిగార్ని సత్కరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 2018


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 2019

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 2019


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 2004
Prof.Darla Venkateswara Rao

Prof.Darla Venkateswara Rao

Dr.Darla Venkateswara Rao
Dr.Darla Venkateswara Rao


Dr.Darla Venkateswara Rao 2008
Father and Mother


Dr,Darla Venkateswara Rao receiving award from President Dr. Sumanakshar, Dalit Sahitya Akademy, Delhi
Dr.Darla Venkateswara Rao 2002
Father and Mother

Dr.Darla Venkateswara Rao 2004

డా.దార్ల వెంకటేశ్వరరావు కవిత్వం నెమలికన్నులుసంపుటిని ఈ 12 మార్చి 2016 వతేదీన, హైదరాబాదు విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ సెమినార్ హాల్ లో ఆవిష్కరించారు. కవితా సంపుటిని తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య తుమ్మల రామకృష్ణ ఆవిష్కరించిన ఈ కార్య క్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిత్రంలో వరుసగా ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య ఎన్.ఎస్.రాజు, ఆచార్య తుమ్మల రామకృష్ణ, కవి డా.దార్ల వెంకటేశ్వరరావు, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ,  సెంటర్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్, తెలుగు హెడ్ ఆచార్య జి. అరుణకుమారి, ఆచార్య చంద్రశేఖరరెడ్డి, డా. పిల్లలమర్రి రాములు, డా. మల్లెగోడ గంగాప్రసాద్ లు ఉన్నారు
Book Releasing of Punarmulyankanam at University of Hyderabad, 
డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన పునర్మూల్యాంకనంపుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హైదరాబాదు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య హస్నైన్, ప్రో వైస్ చాన్సలర్ సారంగి, డీన్, స్కూల్ ఆఫ్ హుమానిటీస్ ఆచార్య వెంకట రమణన్  రచయిత దార్ల చిత్రంలో ఉన్నారు.

డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన బహుజన సాహిత్య దృక్పథం గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య హరిబాబు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.కొలకలూరి ఇనాక్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ష్ ప్రొ.వి.కృష్ణ, ప్రముఖ పరిశోధకుడు, సిడాస్ట్ విజిటింగ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, దళిత-ఆదివాసీ అధ్యయన-అనువాద కేంద్రంహైదరాబాద్విశ్వవిద్యాలయం హెడ్ (ఐ/సి),  ప్రొ. ఆర్.ఎస్. సర్రాజుగారు చిత్రంలో ఉన్నారు





డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖరచయిత ఆచార్య ఎన్.గొపిగారు. వేదికపై వరుసగా డా.వంశీరామరాజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, డా.ద్వానాశాస్త్రి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్.గోపి, శ్రీ బైసా దేవదాసు, ఆచార్య జి. అరుణకుమారి, డా. కళావేంకటదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి మొదలైన వారున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5 ఏప్రిల్ 2015 వతేదీన డా.బాబూ జగజ్జీవన్ రామ్ జయంతోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రసంగం చేసిన నాకు, నా శ్రీమతి డా. మంజుశ్రీకి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వియ్యన్నారావుగారు, రెక్టార్ ఆచార్య సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్ ,విద్యార్థినీ విద్యార్థులు  సన్మానం చేశారు.
వ్యాఖ్యానించారు. 
2016లో పద్మశ్రీ వచ్చిన సందర్భంగా డా.టి.వి.నారాయణ గారికి సత్కారాన్ని చేస్తున్న తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా.దార్ల వెంకటేశ్వరరావు, చిత్రంలో గోగుశ్యామల తదితరులున్నారు. 

Felicitation for Prof.Simon Charsley
Darla Venkateswara Rao as a Cadet NCC Officer at Degree College Level



ఎడమవైపు నుండి వరుసగా కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, రాళ్ళబండి కవితాప్రసాద్, కొలకలూరి ఇనాక్, తుమ్మల రామకృష్ణ,  శిఖామణి


ఎడమవైపు నుండి వరుసగా కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, రాళ్ళబండి కవితాప్రసాద్, కొలకలూరి ఇనాక్, తుమ్మల రామకృష్ణ, జూపాక సుభద్ర, శిఖామణి

Dr.Darla VenkateswaraRao
డా// పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు(2009 మార్చి   తేదీన) గ్రంథావిష్కరణ దృశ్యం. చిత్రంలో వరుసగా కలేకూరి ప్రసాద్, డా//దార్ల వెంకటేశ్వరరావు,విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., జూలూరి గౌరీశంకర్, బొజ్జా తారకం, డా// సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


ఒక మరిచిపోలేని అనుభూతి... ఎంతో ఆత్మీయంగా నాపుస్తకాన్ని తీసుకొంటూ సంతకం చేసిమ్మన్నారు కళ్యాణరావుగారు (అంటరానివసంతం నవలారచయిత)



దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద కేంద్రం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ‘‘దళిత-బహుజన సాహిత్యం : చింతన – సమాలోచన’’(నాగప్పగారి సుందరరాజుకేసరాజు కొమరన్నకలేకూరి ప్రసాదుపైడి తెరేష్ బాబుల దృక్కోణాలు-చర్చా గోష్టి) పేరుతో ఒక సాహితీ చర్చాగోష్టిని 26/02/2015 వ తేదీన హైదరాబాద్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, ఆడిటోరియంలో నిర్వహించారు.     

మీటింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది.

నా పుస్తకాన్ని ఈ సమావేశంలో ఆవిష్కరించడం చాలా గౌరవంగా భావించాను.

పుస్తకాన్ని మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఫ్రొ.హరిబాబుగారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.కొలకలూరి ఇనాక్, మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ష్ ప్రొ. వి. కృష్ణ, ప్రముఖపరిశోధకుడు, సిడాస్ట్ విజిటింగ్ప్రొఫెసర్,  ప్రొ. జయధీర్ తిరుమల రావు, దళిత-ఆదివాసీ అధ్యయన-అనువాద      కేంద్రం, హైదరాబాద్విశ్వవిద్యాలయం హెడ్ (/సి),   ప్రొ. ఆర్.ఎస్. సర్రాజుగారు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాక్షి, 27 ఫిబ్రవరి 2015

సమావేశంలో నా పుస్తకంతో పాటు కేసరాజు కొమరన్న రాసిన వ్యాస సంపుటి గుళ్ళ, డా.జి.వి.రత్నాకర్ తెలుగు నుండి హిందీలోకి అనువదించిన కథల సంపుటి ‘‘ శ్రేష్ట్ దళిత్ కహానియా’’, జాజుల గౌరి రాసిన ‘‘ఒయినం’’ పుస్తకాలను ఆవిష్కరించారు.


ప్రారంభసమావేశంలో గోష్టి ప్రాధాన్యాన్ని ప్రొ.ఆర్.ఎస్. సర్రాజుగారు వివరించారు. నాగప్పగారి సుందరరాజుకేసరాజు కొమరన్నకలేకూరి ప్రసాదుపైడి తెరేష్ బాబు మొదలైన వారు చేసిన సాహిత్య, సామాజిక ఉద్యమ దృక్కోణాలను సమావేశంలో పాల్గొన్నవారు సంక్షిప్తంగా వివరించారు.

నేటినిజం 4-3-2015


దార్ల వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
విద్యార్థులతో దార్ల 
వేదికపై ఫ్రొ. ఎండ్లూరి గారితో డా.దార్ల 

సభలో పాల్గొన్న కొంతమంది 

దార్ల రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

సుందరరాజు గురించి మాట్లాడుతున్న డా.దార్ల 

నాగప్పగారి సుందరరాజు గురించి మాట్లాడుతున్న డా.దార్ల 


 సభావేదికపై  తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య మల్లేష్ సంకశాల, ఆచార్య ఎం.గోనానాయక్, డా.దార్ల వెంకటేశ్వరరావు ఉన్న దృశ్యం



భారతదేశ పునర్మిర్మాణంలో విధాన నిర్ణాయక కర్తగాఆ విధానాలను అమలు పర్చిన వాళ్ళలో ఒకరుగా పనిచేసిన డా. బాబూ   జగజ్జీవన్ రామ్ గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో  ఏప్రిల్ 2015 వతేదీన అధికారికంగా నిర్వహించిన సభావిశేషాలను కొన్నింటిని మీతో పెంచుకోవాలనుకుంటున్నాను.  ఈ సభకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. వియన్నారావుగారు అధ్యక్షత వహించి డా. బాబూ జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్యానికి ముందూ తర్వాత అనేక పదవుల్లో పని చేసి దేశ పునర్మిర్మాణానికి కృషిచేశారని కొనియాడారు. సభలో యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు మాట్లాడుతూ చిన్ననాటి నుండే డా.బాబూ జగజ్జీవన్ రామ్ క్రమశిక్షణకు మారుపేరనీ దళితుల ఆత్మగౌరవాన్ని భంగపరిచే పనుల్ని సహించలేకపోయేవారని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్ పట్టేటి మాట్లాడుతూ అనేక బాబూ జగజ్జీవన్ రామ్ శాఖల్లో మంత్రి పదవి నిర్వహించారనీతాను చేపట్టిన ప్రతి శాఖను అంకితభావంలో పటిష్టపరిచారని అన్నారు. ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డా.కె.మధుబాబు మాట్గాలాడుతూ  డా. అంబేద్కర్ కి అనేక సందర్భాల్లోబాబూ జగజ్జీవన్ రామ్ సహకరించారని గుర్తుచేశారు.   సభలో పాల్గొన్న డా. ఉదయ్ కుమార్ డా.జగజ్జీవన్ రామ్ పనులను వివరించి వాటి వల్ల దేశానికీదళితులకీ ఎంతో ప్రయోజనం చేకూరిందని అన్నారు. 

సభలో ప్రధాన వక్తగా నన్ను ఆహ్వానించారు.  వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటూ,వ్యవస్థీకృతంగా పోరాడుతూ దేశానికీఅందులో భాగమైన పీడితదళిత వర్గం,కులాల వారి రక్షణకుశ్రేయస్సుకి డా. బాబూ జగజ్జీవన్ రామ్ పాటుపడిన సంఘటనలకు సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశాను.


డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖరచయిత ఆచార్య ఎన్.గొపిగారు. వేదికపై వరుసగా డా.వంశీరామరాజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, డా.ద్వానాశాస్త్రి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్.గోపి, శ్రీ బైసా దేవదాసు, ఆచార్య జి. అరుణకుమారి, డా. కళావేంకటదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి మొదలైన వారున్నారు.


డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి విజయవాడలో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రధమ మహాసభల్లో ది 10 ఏప్రిల్ 2016న మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధన పురస్కారాన్ని(2016) ప్రదానం చేస్తున్న దృశ్యం

బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ మహాసభల్లో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
30 మార్చి 2016 న తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయంలో ‘తెలుగు నాటక సాహిత్యం-సామాజిక ప్రయోజనం’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ‘మునివాహనుడు నాటక శిల్పం-సామాజికాంశాలు’ అనే పరిశోధన పత్రాన్ని సమర్పించాను. సభకు ఆచార్య ఎల్.బి.శంకరరావు అధ్యక్షత వహించారు. నాతో పాటు డా. మందలపు నటరాజ్, డా.టి.మోహనశ్రీ, డా.శామనపూడి వెంకటేశ్వరరావుగార్లు తమ పత్రాలను సమర్పించారు. 
కీలకోపన్యాసం చేసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గార్ని సత్కరిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పెరియా సామి. చిత్రంలో వరుసగా ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య జి. అరుణకుమారి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య పెరియాస్వామి,  ఆచార్య పంచాన మొహంతి, (డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు ఉన్నారు

ప్రపంచీకరణ-తెలుగు భాష (డా.దార్ల వెంకటేశ్వరరావుతో ఈటివి ఇంటర్వ్యూ)

(తెలుగు వెలుగు కార్యక్రమంలో నా తో జరిపిన సంభాషణను ది15 నవంబరు 2015 తేది నాడు ఆంధ్రప్రదేశ్ ఈటివి ఛానల్ లో 11. 30 గంటలకు ప్రసారం చేశారు.  ఆ విశేషాలను మా విద్యార్థి బడిగె ఉమేశ్ కొంతవరకు లిఖితరూపంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. దాన్ని పాఠకుల సౌకర్యార్థం అందిస్తున్నాను. దార్ల )

ప్రజల భాషకు పట్టం కట్టినప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. ఈ దృష్టితోనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లోను తెలుగుకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. సరైన భాషా విధానాన్ని రూపకల్పన చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని ఆలోచిస్తోంది. కొత్త రాష్ర్టంలో మాతృభాషకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వాలో ఓ సాహిత్య వేత్త మాటల్లో విందాం.  


1.ఈటీవీ  
మీరు కవి, విమర్శకులు, ఎన్నో విలువైన పుస్తకాలు ప్రచురించారు. మీ సాహిత్య ప్రస్థానాన్ని  మా ప్రేక్షకులకు వివరిస్తారా?
దార్ల వెంకటేశ్వరరావు :  తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మారుమూల ఒక గ్రామం చేయ్యేరు అగ్రహారంలో నేను జన్మించాను. మా కుటుంబంలో తొలి తరం విద్యావంతుడిని నేను. అలా గురువుల ప్రోత్సాహంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం. ఏ, చదివి, ఇక్కడే ఎం. ఫిల్, చేసి, ఇక్కడే పిహెచ్.డి. చేసి, ఇక్కడే అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. నా జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను నేను కవిత్వంగా రాశాను. దాన్ని సాధారణీకరించి కవిత్వంగా రాశాను. మా జీవితానికి సంబంధించినటువంటి వస్తువునే కవిత్వ వస్తువుగా మార్చుకున్నాను. నా సాహిత్య వస్తువులో సమకాలీన సమాజం అనిపిస్తుంది. తర్వాత ‘వీచిక’ అనే విమర్శ ఒక విమర్శ గ్రంథాన్ని రాశాను. ‘బహుజన సాహిత్య దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’, ‘సాహితీ మూర్తులు స్ఫూర్తులు’ మొదలైన పదమూడు విమర్శ పుస్తకాలను రాశాను.
            ముఖ్యంగా ఆరుద్ర మీదా  పిహెచ్. డి. పరిశోధన చేశాను. యస్. టి జ్ఞానా నంద కవి గారి ‘‘ఆమ్రపాలి’’  మీదా పరిశోధన చేశాను. ఈ ‘‘ఆమ్రపాలి’’ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. అందుచేత నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడడానికి  గురువులు ఎంతో కారణం.
2. ఈటీవీ : మీరు దళిత కవిత్వంలోని సౌందర్యం గురించి పుస్తకం రాశారు. మరి దళిత కవిత్వం  భాష విషయంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏమిటి ?
దార్ల వెంకటేశ్వరరావు :  మన తెలుగు సాహిత్యాన్ని  పరిశీలించినట్లైతే, మనం ఒక ప్రధానమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి భాషని పాఠ్య గ్రంథాల్లో చూశాం. కవిత్వంలో చూశాం. పరిశోధనలో చూశాం. విమర్శలో చూశాం. అటువంటి భాషలో దళిత సాహిత్యం ఒక మౌలికమైనటువంటి మార్పుని తీసుకొచ్చింది. అది భాషాభివృద్ధికి తోడ్పడింది. దళిత కవులు మూడు తరాలుగా భాషని మనకు అభివృద్ధి పథంలో నడిపించారు. తొలితరం దళితులు పద్య కవిత్వాన్ని రాసి, దాన్లో విజ్ఞాపన పద్ధతిలో రాశారు. కాబట్టి అక్కడ పెద్దగా మార్పేమి కనిపించదు. రెండో తరం వచ్చేసరికి దళిత కవుల్లో ఒక ఆవేశం కట్టలు తెంచుకొని ప్రవహించింది. ఆ ఆవేశంలో వచ్చినటువంటి మార్పు ఆ దశలో మనం గుర్తించ గలుగుతాం. మూడో తరంలో దళిత కవిత్వం వ్యవస్థీకృతమైంది. నిజమైనటువంటి సౌందర్యం ప్రతీకల్తోటి, భావచిత్రాలతోటి తమ పలుకుబడులతో ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి భాషకి ఏమాత్రం తీసుకోకుండా కొత్త కొత్త పదజాలాన్నీ దళిత సాహిత్యంలో తీసుకొచ్చి భాషాభివృద్ధికి దళిత కవులు ఎంతగానో తోడ్పడ్డారు.


 3. ఈటీవీ :  మీరు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధిలో విశ్వవిద్యాలయాల పాత్ర నేడు ఎలా ఉందంటారు?
 దార్ల వెంకటేశ్వరరావు నేను హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత చూసినట్లైతే కనుక, ఇక్కడ పాఠ్య ప్రణాళికల్లో కొంత స్వేచ్ఛ ఉంటుంది- ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చినప్పుడు.  ఆ విధంగా ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో చాలా వరకు భాషాభివృద్ధికి కావాల్సినటువంటి కేవలం పద్య కవిత్వమే కాకుండా, వచన కవిత్వాన్ని, వచన రచనల్ని పాఠ్యాంశాల్లో పెట్టడం వలన మనం భాషాభివృద్ధికి దోహద పడే అంశాల్ని పాఠ్యాంశాలుగా చేరుస్తున్నాం. ఒకప్పుడు కేవలం పద్య కవిత్వంలో మాత్రమే, పద్యాన్నీ మాత్రమే ప్రధానంగా చేసి పాఠ్యాంశాలుండే ఈ క్రమాన్ని సార్వత్రిక విశ్వవిద్యాలయం పాఠ్య ప్రణాలికల్లో వచన రచనలతో పరిపుష్టం చేసింది. తర్వాత జానపద సాహిత్యాన్ని మిగతా విశ్వవిద్యాలయాలు పెట్టినప్పటికీ కూడా, మనకు వచన రచనల్ని పాఠ్యాంశాల్ని చేర్చడం ద్వారా భాషాభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయంలో మనం కాకతీయ విశ్వవిద్యాలయంలో, యోగి వేమన విశ్వవిద్యాలయం వారి పాఠ్యప్రణాలికలు చాలా బాగున్నాయి. వారు కథలకీ, నవలకీ, ప్రాంతీయ సాహిత్యానికీ చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ప్రాంతీయ సాహిత్యం నుండి జీవనాన్ని ఎప్పుడైతే చూశామో అప్పుడు భాషాభివృద్ధి చాలా విస్త్రృతంగా జరుగుతుంది. ఆ విధంగా విశ్వవిద్యాలయాల పాత్ర నిత్య నూతను కోణంలో పాఠ్యప్రణాలికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
4. ఈటీవీ మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం ఉండాలని భాషాశాస్త్రవేత్తలు మేధావులు చెప్తున్నారు. కానీ ప్రాథమిక స్థాయినుంచే ఆంగ్ల విద్యావిధానం విస్తరిస్తున్న నేటి రోజుల్లో తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలంటారు?
   దార్ల వెంకటేశ్వరరావు మనకున్నటువంటిది త్రిభాషాసూత్రం. ఈ త్రిభాషావిధానంలో మాతృభాష, దాంతో పాటు హిందీ, ఆంగ్లం అనేవి కొన్ని తరగతులు వచ్చిన తర్వాత మొదలవుతాయి. కానీ... ప్రస్తుత తరుణంలో ప్రాథమిక స్థాయినుండే ఆంగ్లాన్నీ బలవంతంగా మన మీద రుద్దుతున్నటువంటి విద్యావ్యవస్థ ఇప్పుడిప్పుడే బలంగా మన విద్యాలయాల్లో ప్రవేశిస్తుంది. ప్రతి పౌరుడూ  స్థానిక సమస్యలకంటే కూడా ప్రపంచ పౌరుడిగా మారాలని అని ఆలోచిస్తున్నట్టుగా బయటికి కనిపిస్తుంది. కానీ అది స్థానికమైనటువంటి అంశాల్ని, స్థానిక సంస్కృతిని, స్థానిక ప్రజల యొక్క సమస్యల్నీ అవగాహన చేసుకోకుండా  అది నిర్వీర్యం చేస్తుంది. అందుచేత  మనం చిన్ననాటి నుండే చిన్నచిన్న పద్యాలు,  చిన్న చిన్న శతకపద్యాలు, చిన్న చిన్న పొడుపు కథలు, సామెతలు, కథలు ఇటువంటివన్నీ కూడా పిల్లలకు నేర్పడం ద్వారా మనం భాషని కాపాడుకోవచ్చు. దాంతో  మాతృభాషను  ప్రాథమిక స్థాయిలో అక్కడ ఉన్నా, లేకపోయినా తెలుగు భాషను నేర్పవచ్చు; దాని ద్వారా తెలుగు సాహిత్యాన్నీ కాపాడుకోవచ్చు.  
    ఈటీవీ : యువతలో ‘ఆంగ్లాన్ని చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి’ అన్న భావన ఉంది. మరి తెలుగు భాషపై యువతలో అభిమానం కలిగించడానికి ఏమి చేయాలంటారు? 
   దార్ల వెంకటేశ్వరరావు: యువతీ యువకులకు భాష పట్ల అభిమానం పెరగాలంటే ఆర్ధిక ప్రయోజనాలు కూడా భాషతో ముడిపడి ఉండాలి. ‘మనం చదువుకున్నటువంటి భాషవలన మనకి ఉపాధి లభిస్తుంది’ అనే భరోసా యువతలో కలగాలి. అది కలిగించడానికి  ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఒక రాష్ర్టంలో  ప్రధానమైనటువంటి భాష తెలుగైనప్పుడు, ఆ రాష్ట్రంలో, ఆ జిల్లాలో, ఆ మండలాల్లో వివిధ విషయాల గురించి తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేని వ్యవస్థని మనం కలిగి ఉన్నప్పుడు, మనం తెలుగు చదువుకుంటే ఏమోస్తుందనే భయం సహజంగానే కలుగుతుంది. అందుకే ఈ భయాన్ని పోగొట్టాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. (ఎడిటింగ్ అయిన విషయాలు... సామాన్య ప్రజలకు కూడా జీవోలను, న్యాయస్థానాల్లో తీర్పులను, పోలీసు స్టేషనులో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్)లను తెలుగులోనే అందించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సచివాలయంలో తెలుగులోనే ప్రజల సమస్యల గురించి చర్చించాలి. వాటికి తెలుగులోనే ఉత్తర్వ్యులివ్వాలి. తెలుగు భాష పేరుతో కృత్రికమమైన అనువాదాల్ని ఇవ్వకుండా, ప్రజల భాషలో ఉత్తర్వులు వచ్చేలా చూడాలి. అన్యభాషా పదాలను తొలిదశలో అవసరమైనంత మేరకు స్వీకరించినా తప్పులేదు.) శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం తెలుగును బోధించే ఒక విషయాన్ని కంపల్సరీ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరిగాయో అప్పుడు విద్యార్థులు తెలుగు చదువుకోవడాకి ముందుకు వస్తారు.         
    ఈటీవీ  ప్రపంచీకరణ విస్తరిస్తున్న నేటి తరుణంలో స్థానిక భాషలు, సంస్కృతులు పరిరక్షణలో ప్రజలు, ప్రభుత్వాలు బాధ్యత ఎంతవరకు ఉందంటారు. ?
   దార్ల వెంకటేశ్వరరావు: తెలుగు భాష బ్రతకడం అనేది తెలుగు జీవన విధానం బతకడం. తెలుగు జీవన విధానం బ్రతకడం అంటే తెలుగు సంస్కృతిని మనం పరిరక్షించుకోవటం. ఒకప్పుడు కేవలం కొన్నివర్గాల వారి భాష నిఘంటువుల ఎక్కింది. ఇప్పుడు అన్ని వృత్తుల వారి భాష కూడా నిఘంటువులోనికి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అన్ని వృత్తులు యొక్క భాషా పదజాలాన్నీ మనం సేకరించామో అప్పుడు భాష సంపద్వంతమైతుంది. ‘మన తెలుగు భాష ఇంత గొప్పదా’ అనేది మనకు తెలుస్తుంది. తర్వాత వ్యవహారకోశాలను తయారు చేయాలి. ఇప్పుడు పలుకుబడులు, జాతీయాలు ఉన్నాయి. ఏ పలుకుబడులు ఏ సందర్భంలో వాడతారు. ఏ సందర్భంతో మన కావ్యాల్లో ప్రయోగించారు. ఏ సందర్భాల్లో కథల్లో ప్రయోగించారు. ఏ సందర్భంలో కవితల్లో ప్రయోగించారు.... నవలల్లో ప్రయోగించారు.. అనే  వాటికి సోదాహరణంగా మనం వ్యవహారకోశాల్ని తయారు చేయాలి. అప్పుడు స్థానిక భాష యొక్క సంస్కృతి ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచీకరణలో ఉన్న ఒక లక్షణం  ఏమిటంటే స్థానికంగా జరిగిన ఒక చిన్న విషయాన్ని  ప్రపంచానికి వెంటనే, వేగవంతంగా ప్రపంచానికి తెలిసిపోతుంది. ఉదాహరణకి మనకు కంప్యూటర్ వాడుకలోకి వచ్చింది. దానిలో తెలుగు భాషను వాడుకోగలుగుతున్నాం. అలాగే  అంతర్జాలం వాడుకలోకి వచ్చింది. సోషల్ మీడియాకి దాన్ని విస్తృతంగా ఉపయోగించుకోగలగాలి. వీటి ద్వారా  సెకెన్స్ లో, నిమిషాల్లో ప్రపంచానికి మనం మన భాషనీ, మన కళల్నీ మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. వీటి ద్వారా కూడా మనం భాషనీ, సంస్కృతినీ, మన జీవన విధానాన్ని అంతటినీ వేగవంతంగా మన తెలుగు భాషలోనే తెలియజేయవచ్చు. ఆ విధంగా స్థానికతను విశ్వజనీనత వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. అలా చేసినప్పుడు ప్రపంచీకరణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మన స్థానిక భాషలకేమీ నష్టం పెద్దగా వాటిల్లదు.

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ సిధారెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, యూనవర్సిటి ఆఫ్ హైదరాబాద్ తెలుగు ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య జి. అరుణ కుమారి తదితరులు చిత్రంలో ఉన్నారు. 


కామెంట్‌లు లేవు: