దార్ల
శతకము
శ్రీగణపతి దేవ! శివపార్వతీ పుత్ర!
నీదు దయను పొంద నిన్ను తలతు
పద్యవిద్య సుజన హృద్యంబు చేయరా !
దారి పూల తోట దార్ల మాట! (1)
నీదు దయను పొంద నిన్ను తలతు
పద్యవిద్య సుజన హృద్యంబు చేయరా !
దారి పూల తోట దార్ల మాట! (1)
అన్యభాషలైన అంటరానివికాదు
పద్యమైన నదియు గద్యమైన
ప్రజల భాష నాది పద్యశతకమైన
దారి పూల తోట దాదార్ల మాట! (2)
పద్యమైన నదియు గద్యమైన
ప్రజల భాష నాది పద్యశతకమైన
దారి పూల తోట దాదార్ల మాట! (2)
కప్పలన్నికలిసి చెప్పలేనంతగా
వర్షమొదవువేళ హర్షమొందు
ఎన్నికలకుముందుయెంతహడావిడో!
దారి పూల తోట దార్ల మాట! (3)
వర్షమొదవువేళ హర్షమొందు
ఎన్నికలకుముందుయెంతహడావిడో!
దారి పూల తోట దార్ల మాట! (3)
ఉద్యమించకుండ ఊరించు ప్రకటన
లెన్నియోవెలువడు లెక్కలేదు
ఎన్నికలకు ముందుయెందుకనునుకోర్టు
లెన్నియోవెలువడు లెక్కలేదు
ఎన్నికలకు ముందుయెందుకనునుకోర్టు
దారి
పూల తోట దార్ల
మాట! (4)
తాగికారునడుపతప్పయినప్పుడు
ఓటువేయునపుడునోటునిచ్చి
తనకువేయుమనుటతప్పుకాదందురా
దారి పూల తోట దార్ల మాట! (5)
ఓటువేయునపుడునోటునిచ్చి
తనకువేయుమనుటతప్పుకాదందురా
దారి పూల తోట దార్ల మాట! (5)
కట్టుకున్న
హాయి కాటనుచీరయే
పెట్టవలయు గెంజి పట్టుబట్టి
ఉతికినప్పుడల్ల బతుకేమొ బేజారు
దారి పూల తోట దార్ల మాట! (6)
పెట్టవలయు గెంజి పట్టుబట్టి
ఉతికినప్పుడల్ల బతుకేమొ బేజారు
దారి పూల తోట దార్ల మాట! (6)
రాత్రి
సంచరించు రాక్షసులను
మాట
కృతయుగమున చెల్లు కలినియనిన
సాఫ్టువేరు వాళ్ళు చావగొట్టి విడుచు
కృతయుగమున చెల్లు కలినియనిన
సాఫ్టువేరు వాళ్ళు చావగొట్టి విడుచు
దారి
పూల తోట దార్ల
మాట! (7)
వద్దనిన
కుదరక వచ్చిపడుచు
నుండు
మునిసిపాలిటీల మురికి వోలె
వాట్స' పులుల గుంపు వరమైన శాపంబు
దారి పూలతోట దార్ల మాట! (8)
మునిసిపాలిటీల మురికి వోలె
వాట్స' పులుల గుంపు వరమైన శాపంబు
దారి పూలతోట దార్ల మాట! (8)
ఉప్పు, పసుపు, వేప ఉన్నవనుచునమ్ము
బహుళజాతి వారు బాగుయనిన
మంచిదన్నచాలు మనమంత సిద్ధమే
దారి పూల తోట దార్ల మాట! (9)
బహుళజాతి వారు బాగుయనిన
మంచిదన్నచాలు మనమంత సిద్ధమే
దారి పూల తోట దార్ల మాట! (9)
అమ్మ యనెడు మాట అమృతంబు కురిపించు
అయ్య యనెడు మాట హాయినిచ్చు
మమ్మిడాడియనెడు మాటలవివేలరా
దారి పూలతోట దార్ల మాట! (10)
అయ్య యనెడు మాట హాయినిచ్చు
మమ్మిడాడియనెడు మాటలవివేలరా
దారి పూలతోట దార్ల మాట! (10)
వాక్కునర్థమెపుడుపార్వతీశంకరుల్
కలిసినిలువగలుగు కవనమగుచు
శతకమొకటిచాలు శక్తిముక్తియువచ్చు
దారి పూల తోట దార్ల మాట! (11)
కలిసినిలువగలుగు కవనమగుచు
శతకమొకటిచాలు శక్తిముక్తియువచ్చు
దారి పూల తోట దార్ల మాట! (11)
వ్యాస కాళిదాస, వాల్మీకులాదిగా
కలరు కవులు భావుకత్వనిధులు
అద్భుతంబునిచ్చు సద్భుద్దికలిగించు
దారి పూల తోట దార్ల మాట! (12)
కలరు కవులు భావుకత్వనిధులు
అద్భుతంబునిచ్చు సద్భుద్దికలిగించు
దారి పూల తోట దార్ల మాట! (12)
మనిషిమేఘమైన మనసెంత తేలిక
నింగినిలుచు, మబ్బు నిలవదెపుడు
ఎగిరివచ్చిచిలుక యేదోపలికిపోయె
దారి పూల తోట దార్ల మాట! (13)
నింగినిలుచు, మబ్బు నిలవదెపుడు
ఎగిరివచ్చిచిలుక యేదోపలికిపోయె
దారి పూల తోట దార్ల మాట! (13)
చిత్తమేమొమబ్బు చిత్రమోలెకదులు
అంబరంబుయెపుడు అట్లెనుండు
సత్యమిదియెపొందు నిత్యసంతోషంబు
దారి పూల తోట దార్ల మాట! (14)
అంబరంబుయెపుడు అట్లెనుండు
సత్యమిదియెపొందు నిత్యసంతోషంబు
దారి పూల తోట దార్ల మాట! (14)
తినగలిగిననాడు తిండిదొరకకుండు
తిండికలిగినపుడు తినుట సున్న
తిరిపెమెత్తిశివుడు తిండివిలువచెప్పె
దారి పూల తోట దార్ల మాట! (15)
తిండికలిగినపుడు తినుట సున్న
తిరిపెమెత్తిశివుడు తిండివిలువచెప్పె
దారి పూల తోట దార్ల మాట! (15)
సాగిసాగినదులు సాగరంబునఁజేరు
సాగరంబులన్ని సత్త్రి జేరు
చిత్రమదియచూడ సృష్టి విధానంబు
దారి పూల తోట దార్ల మాట! (16)
సాగరంబులన్ని సత్త్రి జేరు
చిత్రమదియచూడ సృష్టి విధానంబు
దారి పూల తోట దార్ల మాట! (16)
శ్రీనివాసుడిచట సిరులను కురిపించు
కాణిపాకమందు గణపతియును
పుణ్యఫలములిచ్చు ధన్య రాయలసీమ
దారి పూల తోట దార్ల మాట! (17)
కావ్యహిమశిఖరము కాదనలేనిది
మనుచరిత్ర కథయు మనకుదొరికె
రామకథకు మొల్ల రామాయణంబురా!
దారి పూల తోట దార్ల మాట! (18)
కాణిపాకమందు గణపతియును
పుణ్యఫలములిచ్చు ధన్య రాయలసీమ
దారి పూల తోట దార్ల మాట! (17)
కావ్యహిమశిఖరము కాదనలేనిది
మనుచరిత్ర కథయు మనకుదొరికె
రామకథకు మొల్ల రామాయణంబురా!
దారి పూల తోట దార్ల మాట! (18)
లేచివచ్చునేమొ లేపాక్షిబసవన్న
తరచి చూడనద్భుతంబు, యెంత
వెతికినకనుమదియె వేలాడుశిలచూడు
దారి పూల తోట దార్ల మాట! (19)
తరచి చూడనద్భుతంబు, యెంత
వెతికినకనుమదియె వేలాడుశిలచూడు
దారి పూల తోట దార్ల మాట! (19)
కరవునేలకాదు కళలకుపుట్టిల్లు
వనరులుండె పసిడి వజ్రఖనులు
రాగిసంగటిరుచి రాయలసీమదే!
దారి పూల తోట దార్ల మాట! (20)
వనరులుండె పసిడి వజ్రఖనులు
రాగిసంగటిరుచి రాయలసీమదే!
దారి పూల తోట దార్ల మాట! (20)
ఊటలూరు
పోతులూరితత్త్వజ్ఞాని,
రాజ్యమేలినట్టి రాయలుండె
రాళ్ళసీమకాదు రతనాల సీమరా
దారి పూల తోట దార్ల మాట! (21)
రాజ్యమేలినట్టి రాయలుండె
రాళ్ళసీమకాదు రతనాల సీమరా
దారి పూల తోట దార్ల మాట! (21)
వారసత్వమేల వంశపాలనయేల
ప్రజలసేవకొరకు పదవులనుచు
పట్టుకున్నపదవి యట్టులేనుండురా
దారి పూల తోట దార్ల మాట! (22)
ప్రజలసేవకొరకు పదవులనుచు
పట్టుకున్నపదవి యట్టులేనుండురా
దారి పూల తోట దార్ల మాట! (22)
తండ్రిపేరునొకరు తల్లిపేరొక్కరు
చెప్పుకొనుచుకీర్తి కప్పుకొనును
చెప్పెడిదియొకటగు చేయునింకొక్కటి
దారి పూల తోట దార్ల మాట ! (23)
చెప్పుకొనుచుకీర్తి కప్పుకొనును
చెప్పెడిదియొకటగు చేయునింకొక్కటి
దారి పూల తోట దార్ల మాట ! (23)
ఆస్తిదాచుకొనెడి హక్కు ప్రజలకన్న
ప్రభుతకున్నమిన్న బాగుయనుచు
అవసరమునుబట్టి ఆస్తినిచ్చినచాలు
దారి పూల తోట దార్ల మాట! (24)
అవసరమునుబట్టి ఆస్తినిచ్చినచాలు
దారి పూల తోట దార్ల మాట! (24)
గుప్తనిధులు, ఘనులు గుర్తించగలిగిన
గుట్టువిప్పుయాప్పుగూగులమ్మ
మనసువిప్పిచెప్ప మనకది సాధ్యమా
దారి పూల తోట దార్ల మాట! (25)
గుట్టువిప్పుయాప్పుగూగులమ్మ
మనసువిప్పిచెప్ప మనకది సాధ్యమా
దారి పూల తోట దార్ల మాట! (25)
కులముపేరనొకడు బలముందనునొకడు
మతమునింకొకుండు గతమనుచును
వేరొకండునుండు వేర్వేరగుటయేల?
దారి పూల తోట దార్ల మాట ! (26)
మతమునింకొకుండు గతమనుచును
వేరొకండునుండు వేర్వేరగుటయేల?
దారి పూల తోట దార్ల మాట ! (26)
నల్లధనము
పోయి తెల్లధనమువచ్చె
వెయ్యివద్దు రెండువేలు ముద్దు
చిన్ననోటుకన్న మిన్నపెద్దదియేల?
దారి పూల తోట దార్ల మాట! (27)
వెయ్యివద్దు రెండువేలు ముద్దు
చిన్ననోటుకన్న మిన్నపెద్దదియేల?
దారి పూల తోట దార్ల మాట! (27)
నలిగిపోయెజనులు నల్ల ధనము పేర
నోట్ల రద్దువలన కోట్లకొలది
చావురాకబతికి సన్యాసులయ్యేరు
దారి పూల తోట దార్ల మాట! (28)
నోట్ల రద్దువలన కోట్లకొలది
చావురాకబతికి సన్యాసులయ్యేరు
దారి పూల తోట దార్ల మాట! (28)
పట్టపగలుదోచి నిట్టనిలువుముంచు
విజయమాల్య 'మోడి' విజ్ఞులుండు
విజయమాల్య 'మోడి' విజ్ఞులుండు
బ్యాంకు
వైపు పోకు బెంగయెక్కువగును
దారి పూల తోట దార్ల మాట! (29)
దారి పూల తోట దార్ల మాట! (29)
ఏటియమ్ములెన్ని యేర్పాట్లు కలిగించె
శునకములకునవియుసుఖమునిచ్చు
సేదతీర్చు డబ్బు చేరునంతవరకు
దారి పూల తోట దార్ల మాట! (30)
శునకములకునవియుసుఖమునిచ్చు
సేదతీర్చు డబ్బు చేరునంతవరకు
దారి పూల తోట దార్ల మాట! (30)
ముందు
తిండి పెట్టి మూతిని
బిగియించు
జీతమున్న బేంకు గీతగీయు
పట్టుగలిగినట్టి పాలన చూడరా
దారి పూల తోట దార్ల మాట! (31)
జీతమున్న బేంకు గీతగీయు
పట్టుగలిగినట్టి పాలన చూడరా
దారి పూల తోట దార్ల మాట! (31)
కొత్తనోట్ల
వలన కోరివచ్చుననిరి
నోట్లు రద్దు చేయ కోట్ల కొలది
నల్లధనములేదు తెల్లధనములేదు
దారి పూల తోట దార్ల మాట! (32)
నోట్లు రద్దు చేయ కోట్ల కొలది
నల్లధనములేదు తెల్లధనములేదు
దారి పూల తోట దార్ల మాట! (32)
ఆర్ధికవ్యవస్థ అవ్యవ్యగనుండె
భరతదేశమంత భ్రష్టుపట్టె
జనులగోలనేడు ధనమంతయేమాయె
దారి పూల తోట దార్ల మాట! (33)
భరతదేశమంత భ్రష్టుపట్టె
జనులగోలనేడు ధనమంతయేమాయె
దారి పూల తోట దార్ల మాట! (33)
నిద్ర
లేచి మొదలు నిద్రపోవువరకు
మింగవలయు మాత్ర మిగలకుండ
బొజ్జనిండనవియు భోజనమునమించు
దారి పూల తోట దార్ల మాట! (34)
మింగవలయు మాత్ర మిగలకుండ
బొజ్జనిండనవియు భోజనమునమించు
దారి పూల తోట దార్ల మాట! (34)
నరములన్ని
నలిగి, నయనమ్ములన్నియు
కరములన్నియడుగు శరణమనుచు
వరములిమ్మనరు షుగరు మాన్పమందురే
దారి పూల తోట దార్ల మాట! (35)
కరములన్నియడుగు శరణమనుచు
వరములిమ్మనరు షుగరు మాన్పమందురే
దారి పూల తోట దార్ల మాట! (35)
అడగకుండనిచ్చునందరు
సలహాలు
శాస్త్రవేత్తలేరి శాశ్వతముగ
మట్టు బెట్టవారు మధుమేహ జాడ్యంబు
దారి పూలతోట దార్ల మాట ! (36)
శాస్త్రవేత్తలేరి శాశ్వతముగ
మట్టు బెట్టవారు మధుమేహ జాడ్యంబు
దారి పూలతోట దార్ల మాట ! (36)
మృత్యువనిన
జీవి నిత్యము
భయపడు
మనిషియెన్నడైన మరణమొందు
ముందు తెలియనదియె పొందైననరకంబు
దారి పూలతోట దార్ల మాట ! (37)
మనిషియెన్నడైన మరణమొందు
ముందు తెలియనదియె పొందైననరకంబు
దారి పూలతోట దార్ల మాట ! (37)
తినకముందు నొకటి తిన్నప్పుడొక్కటి
పొడుచుకొనవలయును జడుచు కొనకు
మనని చంపు సఖియె మధుమోహనాంగిరా
దారి పూలతోట దార్ల మాట ! (38)
పొడుచుకొనవలయును జడుచు కొనకు
మనని చంపు సఖియె మధుమోహనాంగిరా
దారి పూలతోట దార్ల మాట ! (38)
కదులుమెదులులేక కనపడకుండాను
కాటువేయగలదు కార్పొరేటు!
కరుణయనెడిమాట కపడనిచోటురా
దారిపూలతోట దార్ల మాట! (39)
కాటువేయగలదు కార్పొరేటు!
కరుణయనెడిమాట కపడనిచోటురా
దారిపూలతోట దార్ల మాట! (39)
సంతకంబుపెట్టు సర్జరీకనుచుండు
కథలకథలగుట్ట కార్పొరేటు
జబ్బుమాటకన్న డబ్బుదేమాటరా
దారి పూల తోట దార్ల మాట! (40)
కథలకథలగుట్ట కార్పొరేటు
జబ్బుమాటకన్న డబ్బుదేమాటరా
దారి పూల తోట దార్ల మాట! (40)
ఆస్తిపాస్తులన్ని హరియించిపోయినా
బతికియుండగానె చంపితినును
కార్పొరేటు అనెడి కలియుగ రాక్షసి
దారి పూల తోట దార్ల మాట! (41)
బతికియుండగానె చంపితినును
కార్పొరేటు అనెడి కలియుగ రాక్షసి
దారి పూల తోట దార్ల మాట! (41)
సెలవులెందుకంటె చెప్పలేమనకండి
పిల్లలున్నచాలు పిలిచునండి
కార్పొరేటు కళలు కనిపించిమురిపించు
దారి పూల తోట దార్ల మాట! (42)
పిల్లలున్నచాలు పిలిచునండి
కార్పొరేటు కళలు కనిపించిమురిపించు
దారి పూల తోట దార్ల మాట! (42)
సందువెతుకుకొనుచు సర్వరంగంబులు
వామనుండువోలె వచ్చెనండి
కమ్మగాను చెప్పు కార్పొరేటుకథలు
దారి పూల తోట దార్ల మాట! (43)
వామనుండువోలె వచ్చెనండి
కమ్మగాను చెప్పు కార్పొరేటుకథలు
దారి పూల తోట దార్ల మాట! (43)
వరదవోలెమనము వదిలేటిజలమును
మంచినీరువలెను మరలమనకె
ఇచ్చునండి మార్చి ఇంకుడుగుంతలే
దారి పూల తోట దార్ల మాట! (44)
ఇంటివద్దచూడు ఇల్లాలిముచ్చట్లు
ఇంటిచుట్టుకట్టుఇంకుగుంత
ఇంటిపొదుపుతెలుపు ఇంకుడుగుంతులే
దారి పూల తోట దార్ల మాట! (45)
దాహమైనవారు దారంతవెతుకుచు
వెతికి పట్టు బావి వెతలు తీరు
నీటివాలునట్లెనిలుబెట్టిపట్టరా
దారి పూల తోట దార్ల మాట! (46)
మంచినీరువలెను మరలమనకె
ఇచ్చునండి మార్చి ఇంకుడుగుంతలే
దారి పూల తోట దార్ల మాట! (44)
ఇంటివద్దచూడు ఇల్లాలిముచ్చట్లు
ఇంటిచుట్టుకట్టుఇంకుగుంత
ఇంటిపొదుపుతెలుపు ఇంకుడుగుంతులే
దారి పూల తోట దార్ల మాట! (45)
దాహమైనవారు దారంతవెతుకుచు
వెతికి పట్టు బావి వెతలు తీరు
నీటివాలునట్లెనిలుబెట్టిపట్టరా
దారి పూల తోట దార్ల మాట! (46)
విప్పియుంచకండి విచ్చలవిడిగాను
పళ్ళుతోమునపుడు పట్టనట్టు
ఎల్లవేళలందునల్లానుబిగియించు
దారి పూల తోట దార్ల మాట! (47)
గెడ్డమెపుడుగీయు నడ్డదిడ్డంబుగా
వ్యర్ధమేలనీళ్ళు వదులచుందు
కొద్దినీళ్ళెకోట్లగొంతుతడిపెచూడు
దారి పూల తోట దార్ల మాట! (48)
పళ్ళుతోమునపుడు పట్టనట్టు
ఎల్లవేళలందునల్లానుబిగియించు
దారి పూల తోట దార్ల మాట! (47)
గెడ్డమెపుడుగీయు నడ్డదిడ్డంబుగా
వ్యర్ధమేలనీళ్ళు వదులచుందు
కొద్దినీళ్ళెకోట్లగొంతుతడిపెచూడు
దారి పూల తోట దార్ల మాట! (48)
నీటి
విలువతెలుపు నీకురాయలసీమ
కోరినంతనిచ్చు కోనసీమ
తెచ్చిపంచునెపుడదేభాగ్యనగరము
దారి పూల తోట దార్ల మాట! (49)
కోరినంతనిచ్చు కోనసీమ
తెచ్చిపంచునెపుడదేభాగ్యనగరము
దారి పూల తోట దార్ల మాట! (49)
మనుషులంతయొకటి మర్మంబువేరయా
మట్టియొక్కటైనమానువేరు
విత్తనంబుబట్టి వికసించుబుద్ధులు
దారి పూల తోట దార్ల మాట! (50)
మట్టియొక్కటైనమానువేరు
విత్తనంబుబట్టి వికసించుబుద్ధులు
దారి పూల తోట దార్ల మాట! (50)
కనులనుండిమెరుపు కౌగిలిచ్చువలపు
మాయలజలతారు, మధురవాణి
నగరమంతమించునటనుండదెక్కడా!
దారి పూల తోట దార్ల మాట! (51)
మాయలజలతారు, మధురవాణి
నగరమంతమించునటనుండదెక్కడా!
దారి పూల తోట దార్ల మాట! (51)
ఫోనుతెరవగానె పొంగిపొర్లుచువచ్చు
నీతిబోధచేయు గీతలెన్నొ
నిత్యసత్యమదియె నీతియనగనేల!
దారి పూల తోట దార్ల మాట! (52)
నీతిబోధచేయు గీతలెన్నొ
నిత్యసత్యమదియె నీతియనగనేల!
దారి పూల తోట దార్ల మాట! (52)
మనకుతెలియకుండ మనపేరు ప్రచురించు
రచన చూడ ముఖము రంగుమారు
వివరములను చూసి విస్తుపోకుందుమా?
దారి పూల తోట దార్ల మాట! (53)
రచన చూడ ముఖము రంగుమారు
వివరములను చూసి విస్తుపోకుందుమా?
దారి పూల తోట దార్ల మాట! (53)
కులము, మతములన్ని కుత్సితబుద్ధులు
కలపవలయుగాని కలహమేల?
మంచికన్నమించు మానవత్వములేదు
దారి పూల తోట దార్ల మాట! (54)
కలపవలయుగాని కలహమేల?
మంచికన్నమించు మానవత్వములేదు
దారి పూల తోట దార్ల మాట! (54)
యోగియయ్యెనొకడుభోగవిముఖడయ్యె
నొకడుతాత్వికుండునొక్కడయ్యె
జడకుచిక్కినతని జన్మెంతమోక్షమో
దారి పూల తోట దార్ల మాట! (55)
నొకడుతాత్వికుండునొక్కడయ్యె
జడకుచిక్కినతని జన్మెంతమోక్షమో
దారి పూల తోట దార్ల మాట! (55)
అవసరంబుమేర యన్యభాషలయినా
మాట లాడ వలయు మరువవద్దు
మాతృభాషయేను మనకుజీవనమగు
దారి పూల తోట దార్ల మాట! (56)
మాట లాడ వలయు మరువవద్దు
మాతృభాషయేను మనకుజీవనమగు
దారి పూల తోట దార్ల మాట! (56)
ఊరికంతటికిని పేరేమొపెద్దమ్మ
కల్మషమునెరుగని కరుణశీలి
నన్నుకన్నతల్లి నాగమ్మపేరురా
దారి పూల తోట దార్ల మాట! (57)
కల్మషమునెరుగని కరుణశీలి
నన్నుకన్నతల్లి నాగమ్మపేరురా
దారి పూల తోట దార్ల మాట! (57)
పేరుపెట్టమనియు పెండ్లిపెద్దవనియు
పిలుచుకెలుచువారుతలుచువారు
అమ్మనెపుడుకొలుచు అమ్మవారందురే
దారి పూల తోట దార్ల మాట! (58)
పిలుచుకెలుచువారుతలుచువారు
అమ్మనెపుడుకొలుచు అమ్మవారందురే
దారి పూల తోట దార్ల మాట! (58)
కలిమి
లేములన్ని కష్టసుఖములట్లు
తల్లి దండ్రి యన్న దమ్ములుండు
రక్తబంధమదియె రాదిలసాటిరా
దారి పూల తోట దార్ల మాట! (59)
తల్లి దండ్రి యన్న దమ్ములుండు
రక్తబంధమదియె రాదిలసాటిరా
దారి పూల తోట దార్ల మాట! (59)
కదనరంగమేల కత్తిదూయుటయేల
పద్యమైన కవిత గద్య మైన
సరసమగుటవలయు సకియకౌగిలివోలె
దారి పూల తోట దార్ల మాట! (60)
పద్యమైన కవిత గద్య మైన
సరసమగుటవలయు సకియకౌగిలివోలె
దారి పూల తోట దార్ల మాట! (60)
పొమ్మనుచునుకొట్టు పొయ్యి వీడదుకుక్క
పోయిచూడుమరల పొయ్యినుండు
చెప్పుతినెడికుక్కచెవికేలతాకురా
దారి పూల తోట దార్ల మాట! (61)
రాజకీయవేత్త రానున్నవేళకి
పాఠశాలనున్న బాలలేల?
తేరగొచ్చునేని తెమ్మందురెల్లరన్
చెప్పుతినెడికుక్కచెవికేలతాకురా
దారి పూల తోట దార్ల మాట! (61)
రాజకీయవేత్త రానున్నవేళకి
పాఠశాలనున్న బాలలేల?
తేరగొచ్చునేని తెమ్మందురెల్లరన్
దారి
పూల తోట దార్ల
మాట! (62)
ప్రక్కనున్నవారి పలుకులుకన్నను
పొద్దుపోకచేయు ఫోనుముద్దు
దగ్గరున్ననేమి దుర్గతిపట్టెరా?
దారి పూల తోట దార్ల మాట! (63)
ప్రక్కనున్నవారి పలుకులుకన్నను
పొద్దుపోకచేయు ఫోనుముద్దు
దగ్గరున్ననేమి దుర్గతిపట్టెరా?
దారి పూల తోట దార్ల మాట! (63)
అక్షరసుమమాలనందించి
ప్రేమతో
సంతసమున నన్ను సత్కరించె
గుండెనుందువయ్య! గురవయ్య! కవివర్య!
దారి పూల తోట దార్ల మాట! (64)
పెరుగు నేల బొజ్జ పెద్దవయసురాగ?
పుట్టిన పసిపాపకెట్టిదూది
పరుపుకన్న పొట్ట పదిలంబునుండురా
దారి పూల తోట దార్ల మాట! (65)
సంతసమున నన్ను సత్కరించె
గుండెనుందువయ్య! గురవయ్య! కవివర్య!
దారి పూల తోట దార్ల మాట! (64)
పెరుగు నేల బొజ్జ పెద్దవయసురాగ?
పుట్టిన పసిపాపకెట్టిదూది
పరుపుకన్న పొట్ట పదిలంబునుండురా
దారి పూల తోట దార్ల మాట! (65)
శిలనుచెక్కిశిల్పి శిల్పముగమలుచు
కఠినహృదయమైన కరుగునట్లు
సహృదయతనునింపు సాహిత్యపఠనంబు
దారి పూల తోట దార్ల మాట! (66)
కఠినహృదయమైన కరుగునట్లు
సహృదయతనునింపు సాహిత్యపఠనంబు
దారి పూల తోట దార్ల మాట! (66)
సర్వవేళలందుసాహితీ
పఠనంబు
మలినమవ్వువేళ మనసునంత
సంస్కరించిమనకు సమదర్శనమునిచ్చు
దారి పూల తోట దార్ల మాట! (67)
మలినమవ్వువేళ మనసునంత
సంస్కరించిమనకు సమదర్శనమునిచ్చు
దారి పూల తోట దార్ల మాట! (67)
ప్రాస, యతుల జతలు పట్టించుకున్ననూ
గణముకన్ననిలుచు గుణముమిన్న
రసహృదయునికదియెరమణీయపద్యంబు
దారి పూల తోట దార్ల మాట! (68)
గణముకన్ననిలుచు గుణముమిన్న
రసహృదయునికదియెరమణీయపద్యంబు
దారి పూల తోట దార్ల మాట! (68)
మనసుమెచ్చకున్నమనవారిదైననూ
పొగడమన్నమనము పొడగలేము
మంచిరచనయైన మరిచిపోలేమయా
దారి పూల తోట దార్ల మాట! (69)
పొగడమన్నమనము పొడగలేము
మంచిరచనయైన మరిచిపోలేమయా
దారి పూల తోట దార్ల మాట! (69)
కలిమిలేములన్నికావడికుండలు
ఒడిదుడుకులుతెలిపిఓర్పునిచ్చి
సత్వగుణమునేర్పు సాహిత్య పఠనంబు
దారి పూల తోట దార్ల మాట! (70)
ఒడిదుడుకులుతెలిపిఓర్పునిచ్చి
సత్వగుణమునేర్పు సాహిత్య పఠనంబు
దారి పూల తోట దార్ల మాట! (70)
విద్యనిచ్చునాత్మవిశ్వాసమొకనాడు
కార్పొరేటువిద్య కలలు త్రుంచి
విద్యపేరుచెప్పివిసుగెంతపెట్టురా
దారి పూల తోట దార్ల మాట! (71)
కార్పొరేటువిద్య కలలు త్రుంచి
విద్యపేరుచెప్పివిసుగెంతపెట్టురా
దారి పూల తోట దార్ల మాట! (71)
మనసుశాంతిగున్న మధురంబుభాషయు
కోపమున్నవేళ 'కొత్త' భాష
భావనెట్టిదైన భాషయటులెనుండు!
దారి పూల తోట దార్ల మాట! (72)
కోపమున్నవేళ 'కొత్త' భాష
భావనెట్టిదైన భాషయటులెనుండు!
దారి పూల తోట దార్ల మాట! (72)
సూటువేయునతడు చుట్టుకావలినుండు
ముందునడుచునంత ముఖ్యుడవడు
మెరుగుకన్నవిలువ మేధావి కుండురా
దారి పూల తోట దార్ల మాట! (73)
ముందునడుచునంత ముఖ్యుడవడు
మెరుగుకన్నవిలువ మేధావి కుండురా
దారి పూల తోట దార్ల మాట! (73)
వెతుకువెతుకువెతుకు బ్రతుకంతయువెతుకు
వెంటబడుచు వెతుకు వెలుగు కొరకు
వెతుకు యుగ యుగముల వెలుగుబాట వెతుకు
దారి పూల తోట దార్ల మాట! (74)
వెంటబడుచు వెతుకు వెలుగు కొరకు
వెతుకు యుగ యుగముల వెలుగుబాట వెతుకు
దారి పూల తోట దార్ల మాట! (74)
దళితుడెంతయున్నతపదవినుండినా
కులము కర్మవలన కూర్మిలేదు
భరతభూమినందు భాగ్యంబు చూడరా!
దారి పూల తోట దార్ల మాట! (75)
కులము కర్మవలన కూర్మిలేదు
భరతభూమినందు భాగ్యంబు చూడరా!
దారి పూల తోట దార్ల మాట! (75)
అమ్మనాన్నలనిన ఆదరింతుముగాని
అన్నిదక్కినంతనవతలుండు
విత్తుబట్టిమొలుచువిలువైనమొక్కలు
దారి పూల తోట దార్ల మాట! (76)
అన్నిదక్కినంతనవతలుండు
విత్తుబట్టిమొలుచువిలువైనమొక్కలు
దారి పూల తోట దార్ల మాట! (76)
పాండితీ
ప్రకర్ష ప్రకటించుకొనుటకు
అర్ధ మవ్వనివ్వకఱుచుచుండు
ఆధిపత్యభావజాలమటులెనుండు
దారి పూల తోట దార్ల మాట! (77)
అర్ధ మవ్వనివ్వకఱుచుచుండు
ఆధిపత్యభావజాలమటులెనుండు
దారి పూల తోట దార్ల మాట! (77)
' చారు' నెవ్వరయ్య మరి' చారు'? రుచిచూడ
విడివరెవరు 'చారు' విస్తరున్న
మనసు నున్న 'చారు' మతివోలె తలి' చారు' !
దారి పూల తోట దార్ల మాట! (78)
విడివరెవరు 'చారు' విస్తరున్న
మనసు నున్న 'చారు' మతివోలె తలి' చారు' !
దారి పూల తోట దార్ల మాట! (78)
గుండు
నిట్లు మిగిలె గుట్టునేతెలుపుచు
బోల్డుహెడ్డుకున్నభోగమేమి
దువ్వెనెన్నిమార్లు దువ్వుదురదతీర్చు
దారి పూల తోట దార్ల మాట! (79)
బోల్డుహెడ్డుకున్నభోగమేమి
దువ్వెనెన్నిమార్లు దువ్వుదురదతీర్చు
దారి పూల తోట దార్ల మాట! (79)
పిలవకున్న
వచ్చు ప్రియమైన
శత్రువు
పోనువెనుకకనుచు పోరుపెట్టు
చెప్పనేలబొజ్జ చెలిమైనశత్రువే!
దారి పూల తోట దార్ల మాట! (80)
పోనువెనుకకనుచు పోరుపెట్టు
చెప్పనేలబొజ్జ చెలిమైనశత్రువే!
దారి పూల తోట దార్ల మాట! (80)
వేసవి
సెలవులకు వెళ్ళితినూరికి
ఉక్కబోసిచంపె ఊరునందు
అన్నిమరచిపోతి అమ్మనుచూడగా
దారి పూల తోట దార్ల మాట! (81)
ఉక్కబోసిచంపె ఊరునందు
అన్నిమరచిపోతి అమ్మనుచూడగా
దారి పూల తోట దార్ల మాట! (81)
ప్రజలభాషలేమి పట్టించకోనట్టి
విద్యపేరవిర్రవీగువాడు
సూత్రమనినయేమిచూసుకొనేడ్వరా
దారి పూల తోట దార్ల మాట! (82)
విద్యపేరవిర్రవీగువాడు
సూత్రమనినయేమిచూసుకొనేడ్వరా
దారి పూల తోట దార్ల మాట! (82)
కలవకుండనెంతకాలముంచగలవు
మాలమాదిగలను మాయచేసి
వలదురెచ్చగొట్టువర్గీకరణ నేడు!
దారి పూల తోట దార్ల మాట! (83)
మాలమాదిగలను మాయచేసి
వలదురెచ్చగొట్టువర్గీకరణ నేడు!
దారి పూల తోట దార్ల మాట! (83)
గ్యాసువచ్చునేమొ కాఫీలువద్దులే
కొవ్వు పెరుగునేమొ కొన్నివద్దు
బతకలేడుమనిషి భయపడుచచ్చునే
దారి పూల తోట దార్ల మాట! (84)
కొవ్వు పెరుగునేమొ కొన్నివద్దు
బతకలేడుమనిషి భయపడుచచ్చునే
దారి పూల తోట దార్ల మాట! (84)
నమ్ముకున్ననేల నమ్మలాభావించు
పేదవాళ్ళయిళ్ళు 'పెద్ద' వాళ్ళు
మాటలాడకుండ మాయముచేయునే!
దారి పూల తోట దార్ల మాట! (85)
పేదవాళ్ళయిళ్ళు 'పెద్ద' వాళ్ళు
మాటలాడకుండ మాయముచేయునే!
దారి పూల తోట దార్ల మాట! (85)
తెల్లదొరలు
పోయి నల్లదొరలువచ్చె
మారవలయుముందుమనిషిమనసు
దేశమేదియైన దేవళంబౌనురా
దారి పూల తోట దార్ల మాట! (86)
మారవలయుముందుమనిషిమనసు
దేశమేదియైన దేవళంబౌనురా
దారి పూల తోట దార్ల మాట! (86)
మారుతున్నకాలపరిణామగతులన్ని
కనుటలేదుకవులువినుటలేదు
తుడిచివేసినట్టి 'తురక' లనుటయేల?
దారి పూల తోట దార్ల మాట! (87)
కనుటలేదుకవులువినుటలేదు
తుడిచివేసినట్టి 'తురక' లనుటయేల?
దారి పూల తోట దార్ల మాట! (87)
చలనశీలకవులు 'చండాల' మనుటేల
ఆధిపత్యమున్నయట్లెపిలుచు
మనసుపొడుచునట్లుమాటపలుకుటేల
దారి పూల తోట దార్ల మాట! (88)
ఆధిపత్యమున్నయట్లెపిలుచు
మనసుపొడుచునట్లుమాటపలుకుటేల
దారి పూల తోట దార్ల మాట! (88)
గాజులేసుకున్న ఆడంగివాడిలా
ఇంటినొదలలేకయుంటివనుచు
మలినపరుచుకొనెడిమానవతులునుండె!
దారి పూల తోట దార్ల మాట! (89)
ఇంటినొదలలేకయుంటివనుచు
మలినపరుచుకొనెడిమానవతులునుండె!
దారి పూల తోట దార్ల మాట! (89)
అందనంతయెత్తునాకాశముండెనా
ఉండియుండనట్లునుండగలదు
మనిషికీర్తియటులుమాయలుచేయునే
దారి పూల తోట దార్ల మాట! (90)
ఉండియుండనట్లునుండగలదు
మనిషికీర్తియటులుమాయలుచేయునే
దారి పూల తోట దార్ల మాట! (90)
ఎటులవచ్చివీచునెటులపోయినగాని
వాయువున్నమనకుహాయికలుగు
కనపడీకనపడకాప్రాణములునిల్పు
దారి పూల తోట దార్ల మాట! (91)
వాయువున్నమనకుహాయికలుగు
కనపడీకనపడకాప్రాణములునిల్పు
దారి పూల తోట దార్ల మాట! (91)
ఏరులన్నిపారియెచ్చటకలియును?
సాగరమునచేరిశాంతినొందు
మానవుండుమరల మట్టినటులెచేరు
దారి పూల తోట దార్ల మాట! (92)
సాగరమునచేరిశాంతినొందు
మానవుండుమరల మట్టినటులెచేరు
దారి పూల తోట దార్ల మాట! (92)
ఘర్షణమునపుట్టు ఘర్షణమునపోవు
అగ్నిగుణముకున్న అంతమదియె
ఘర్షణంబుజన్మ ఘర్షణే మరణంబు
దారి పూల తోట దార్ల మాట! (93)
అగ్నిగుణముకున్న అంతమదియె
ఘర్షణంబుజన్మ ఘర్షణే మరణంబు
దారి పూల తోట దార్ల మాట! (93)
స్ఫర్శ, రూప, రసము, శబ్ధగంధాలను
విషయములనిపిలుచువిశ్వమెల్ల
పదమటునిటుగానిపరమాత్మరూపమే!
దారి పూల తోట దార్ల మాట! (94)
విషయములనిపిలుచువిశ్వమెల్ల
పదమటునిటుగానిపరమాత్మరూపమే!
దారి పూల తోట దార్ల మాట! (94)
తప్పుచేయువాడుతప్పుకొనుచునుండు
కాంతిహీనమౌను కనులుకనుము
నీతికలిగెనేని నీవైపెచూడడా?
దారి పూల తోట దార్ల మాట! (95)
కాంతిహీనమౌను కనులుకనుము
నీతికలిగెనేని నీవైపెచూడడా?
దారి పూల తోట దార్ల మాట! (95)
లేవులేవనినవిలేచివచ్చినవేమి
నాలుగేళ్ళుకళ్ళు కానలేదు
ఇప్పుడెట్లునిజము ఉద్యోగములునిచ్చు?
దారి పూల తోట దార్ల మాట! (96)
నాలుగేళ్ళుకళ్ళు కానలేదు
ఇప్పుడెట్లునిజము ఉద్యోగములునిచ్చు?
దారి పూల తోట దార్ల మాట! (96)
అన్నిమార్చగలుగునధికారమున్నచో
ముందునున్నవన్ని మూలకేసి
తనదుముద్రవేయ తంతుజరుగునంతె!
దారి పూల తోట దార్ల మాట! (97)
ముందునున్నవన్ని మూలకేసి
తనదుముద్రవేయ తంతుజరుగునంతె!
దారి పూల తోట దార్ల మాట! (97)
ఉన్నవాటివిలువ ఉన్నప్పుడుతెలీదు
తిండిలేనినాడుతిండివిలువ
తరిగిపోవతెలియునారోగ్యమువిలువ
దారి పూల తోట దార్ల మాట! (98)
తిండిలేనినాడుతిండివిలువ
తరిగిపోవతెలియునారోగ్యమువిలువ
దారి పూల తోట దార్ల మాట! (98)
సీరియళ్ళుచూడు చిత్రవిచిత్రము
మూసపోసినట్లు మూల్గుచుండు
అతికివదలకుండుఅతివలకండ్లురా
దారి పూల తోట దార్ల మాట! (99)
మూసపోసినట్లు మూల్గుచుండు
అతికివదలకుండుఅతివలకండ్లురా
దారి పూల తోట దార్ల మాట! (99)
.విశ్వరూపుచూప వివరించుచుండెనే
ఆత్మగౌరవమని అరుచుచుండె
కవితనందుతప్పకాళ్ళుమొక్కేలరా
దారి పూల తోట దార్ల మాట! (100)
ఆత్మగౌరవమని అరుచుచుండె
కవితనందుతప్పకాళ్ళుమొక్కేలరా
దారి పూల తోట దార్ల మాట! (100)
. భావజాలమనుచు వాదులాడుటయేల
ఆచరించునపుడు అదియెవిలువ
మంచి రచన విలువమానవత్వంబురా
దారి పూల తోట దార్ల మాట! (101)
ఆచరించునపుడు అదియెవిలువ
మంచి రచన విలువమానవత్వంబురా
దారి పూల తోట దార్ల మాట! (101)
చదువుకైనగాని చంటిబిడ్డలనుచు
వసతిగృహమునందువదులువేళ
కరుణహృదయులంతకదలిపోకుందురా
దారి పూల తోట దార్ల మాట! (102)
వసతిగృహమునందువదులువేళ
కరుణహృదయులంతకదలిపోకుందురా
దారి పూల తోట దార్ల మాట! (102)
ఏదిశాశ్వతమగు? యేదశాశ్వతమగు?
నిన్ననేటికేది? మొన్న యేది?
తల్లిదండ్రులన్నదమ్ములంతాభ్రమ!
దారి పూల తోట దార్ల మాట! (103)
నిన్ననేటికేది? మొన్న యేది?
తల్లిదండ్రులన్నదమ్ములంతాభ్రమ!
దారి పూల తోట దార్ల మాట! (103)
ఏలవచ్చిచ్చినావు? ఎందుకుపోవలె?
మమతలేల? మరలమరణమేల?
నీటిబుడగవోలెనిత్యముమునకేల?
దారి పూల తోట దార్ల మాట! (104)
మమతలేల? మరలమరణమేల?
నీటిబుడగవోలెనిత్యముమునకేల?
దారి పూల తోట దార్ల మాట! (104)
ఉత్తములకు
కోపముండునోక్షణమది
మధ్యమాధములకు మాత్రముండు
ఘడియ, దినము పాపికదిమరణాంతంబు!
దారి పూల తోట దార్ల మాట! (105)
మధ్యమాధములకు మాత్రముండు
ఘడియ, దినము పాపికదిమరణాంతంబు!
దారి పూల తోట దార్ల మాట! (105)
వ్యాకరణములేని వాజ్ఞ్మయాధ్యనమును
పథ్యమేలననెడి ఔషధమును
పగిలినట్టి పడవ పట్టినపయనంబె!
దారి పూల తోట దార్ల మాట! (106)
పథ్యమేలననెడి ఔషధమును
పగిలినట్టి పడవ పట్టినపయనంబె!
దారి పూల తోట దార్ల మాట! (106)
వినెడివానియెదుట విన్నవీకన్నవీ
కలిపిచెప్పవచ్చు కథలు కథలు
నిజముతెలుసునెపుడు నిలకడమీదనే
దారి పూల తోట దార్ల మాట! (107)
కలిపిచెప్పవచ్చు కథలు కథలు
నిజముతెలుసునెపుడు నిలకడమీదనే
దారి పూల తోట దార్ల మాట! (107)
నీటమునిగినట్టినీటిగడ్డనుచూడు
తరచిచూడకుండతగినదనకు
మనసుమర్మమెపుడుమనకట్లునుండురా!
దారి పూల తోట దార్ల మాట! (108)
తరచిచూడకుండతగినదనకు
మనసుమర్మమెపుడుమనకట్లునుండురా!
దారి పూల తోట దార్ల మాట! (108)
(ఛందోబద్దంగా రాసే
పద్యాలన్నీ అభ్యాసం కోసం రాస్తున్నవే. దీన్ని బట్టి నా దృక్పథాన్ని, నా పాండిత్యాన్ని మూల్యాంకన
చేసే ప్రయత్నం చెయ్యొద్దని మనవి. ఇవి సరదాగా రాస్తున్న పద్యాలు. నా సీరియస్ భావాలన్నీ వ్యాసం, వచనకవిత్వంలోనే ఉంటాయని
గమనించవలసినదిగా కోరుతున్నాను... మీ దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి