సెంట్రల్
యూనివర్సిటీ సుకూన్ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో రేలారే లేలా
జానపద నృత్యగీతాలు, (శివనాగులు ప్రసాద్ బృందం),
రాక్ షో మే 8, 2018 వతేదీ సాయంత్రం జరింగింది. ఈకార్యక్రమాన్ని సుకూన్ సలహాసంఘం చైర్మన్ ఆచార్య
దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వీరితోపాటు
డా.రాణీరత్నప్రభ , స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీరాగ్, ప్రధానకార్యదర్శి
ఆరిఫ్ అహ్మద్ పాల్గొన్నారు.
విద్యార్థుల్లో
నిగూఢంగా దాగి ఉన్న నైపుణ్యాల్ని
వ్యక్తీకరించడానికి,
విశ్వవిద్యాలయం గౌరవమర్యాదల్ని మరింత ఇనుమడించేలా 'సుకూన్' ఉపయోగపడాలి. ప్రతి
యేడాది సుకూన్ నిర్వహించుకుంటారు. దీనికి ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
దీనిలో అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. సుకూన్ శాంతియుతంగా, ఆహ్లాదంగా నిర్వహించుకోవడానికి
ఒక నియమావళిని ఏర్పరుచుకుంటారు. ఆ నియమావళి ప్రకారం సుకూన్ నిర్వహించుకుంటారు.
ఈయేడాది డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య
దార్ల వేంకటేశ్వరరావు సుకూన్ -2018
కి చైర్మన్ గా ఉన్నారు. డా.పద్మజ ,
డా. తిరువక్కసు, డా.రాణీరత్నప్రభ,
విద్యార్ధి నాయకులు శ్రీరాగ్, అరీఫ్ తదితరులు ఈ సలహా సంఘంలో ఉన్నారు.
ఆంధ్రజ్యోతి, 10 ఏప్రిల్ 2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి