"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

కందం


హాస్య శతకం

 శ్రీకరమగు పని వదలియు

కాకమ్మల కబురు లాడి కాలా లన్నీ
జేకొను టెంతటి మౌఢ్యము
దీకొను టెంతటి జడతయు తెల్పుము దార్లా! (1)

క్షౌరము జేసెడి వేళను

నౌరన వదురును నగవున నమ్మని కబురుల్

కోరిన పద్ధతి మరుచును

చేరువ విప్పెడు నరయగ! చిత్రము దార్లా! (2)

 

రోగిని జూచిన చాలును

బాగుగ వ్రాయును నరయగ భయపడుటెస్టుల్

త్యాగము జేయగ సొమ్మును

వేగమె కోరును వడివడి! వింతర దార్లా! (3)

 

గీతలు గీయును బరబర

రాతలు తెలియవు రసమున రచ్చను జేయున్

కోతను కోయగ సిద్ధము

రీతిగ జెప్పును నిజముగ! రీతుల దార్లా! (4)

 

రోగిని జూచిన తోడన్

బాగుగ వ్రాయును నరయగ భయమేపెట్టున్

త్యాగము జేయగ సొమ్మును

వేగమె కోరును వడివడి! వింతర దార్లా! (5)

 

రోగము తగ్గిన తగ్గక

బాగగ ఫీజును మరువక భద్రము జేయున్

త్యాగము సున్నయె వానికి

వేగమె లాగును వశమున! వేదన దార్లా! (6)

 

అంతయు నాకే తెలియున

వింతగ పల్కును వశముగ వీగుచునుండన్

చింతను జెందని వాడెను

మంతన మాడెడు మరువగ! మన్నన దార్లా! (7)

 

 ఓటును కోరెడి వేళను

సాటిగ నిలచును వశముగ సాష్టాంగముగన్

కోటలు దాటెడు మాటల

తేటగ జెప్పును నెనరున! ధీరత దార్లా! (8)

 

పొద్దున లేవగ ఫోనును

ముద్దుగ నిమురుచు నలతగ మురిపెము తోడన్

హద్దులు మీరిన పిచ్చిది

దిద్దగ నెవరికి వశమగు? ధీరత దార్లా! (9)

 

విందుల మెక్కును గంపెడు

పొందుగ వడ్డన రుచిగను పొట్టను నింపున్

ముందుగ మాంసము మెక్కుచు

పొందెడు త్రేన్పులు వడివడి! పొంకము దార్లా! (10)

 

ఇల్లాలూరకనున్నను

మెల్లగ మూలను భయమున మెప్పుగ దాగున్

పిల్లిని జూచిన యెలుకగ

నల్లన తప్పును వడివడి! నమ్మిన దార్లా! (11)

 

నోరును విప్పిన తిట్లే

తీరుగ వచ్చును నరకము తియ్యని మాటల్

కోరడు ఎన్నడు నరుడును

జేరియు తిట్టెడు జడునిట! జెప్పెద దార్లా (12)

 

నోరును విప్పిన తిట్లే

తీరుగ వచ్చును నరకము తియ్యని మాటల్

కోరడు ఎన్నడు నరుడును

జేరియు తిట్టెడు జడునిట! జెప్పెద దార్లా! (13)

 

 

అప్పును కోరెడి వేళను

చెప్పగ వచ్చును నిజముగ చెప్పుడు మాటల్

తప్పును కప్పియు తిరుగును

తప్పక తీర్చని యధముడు! తప్పుర దార్లా (14)

 

ఓటును కోరెడి వేళను

సాటిగ నిలచును వశముగ సాష్టాంగముగన్

కోటలు దాటెడు మాటల

తేటగ జెప్పును జగతిని! ధీరత దార్లా! (15)

 

లేనిది యేమో చెప్పుచు

పానిని వదురును వడివడి బాగుగ చూడన్

వానిని నమ్మిన వాడెను

దీనిని మరువక జనమున! దిమ్మరి దార్లా! (16)

 

రంగుల పూతను బూయుచు

బంగరు మెరుపుల నరయగ భ్రమలను గొల్పున్

మంగల కత్తికి దొరకని

సింగార ములను మురిపెము! చిత్రము దార్లా! (17)

 

అప్పును ఇచ్చిన వాడెను

తప్పును చేసితిన చునిట తల్లడ మందున్

చెప్పగ రానివి బాధలు

తప్పక పడునుగ తరచుగ! తప్పుర దార్లా! (18)

 

విందుల మెక్కును గంపెడు

పొందుగ వడ్డన రుచిగను పొట్టను నింపున్

ముందుగ మాంసము మెక్కుచు

పొందెడు త్రేన్పులు వసమున! పొంకము దార్లా! (19)

 

లేనివి ఉన్నటు పల్కుచు

పానిని వదురును బహుగను బాగుగ చూడన్

వానిని నమ్మిన వాడెను

దీనిని మరువక దగునట! దిమ్మరి దార్లా! (20)

 

పెట్టడు తిండిని లోభియు

పెట్టెను కావలి నెనరున ప్రేమను మరుచున్

ముట్టును డబ్బుల నెప్పుడు

గుట్టుగ దాచెడి యధముడు! కోరరు దార్లా! (21)

 

పనులను చేయడు ఎన్నడు

తినియును తూగుచు నరయగ తిరుగును బడలిన్

మునిగియు నిద్దుర లోనను

కనులను మూయును తరచుగ! కష్టము దార్లా! (22)

 

కల్లలు పల్కును నిరతము

మెల్లగ నిచ్చును మెలకువ మేలగు రీతిన్

చల్లని మాటలు జెప్పుచు

నల్లన దెలుపును నవముగ నమ్మక దార్లా! (23)

 

బహుళ వితండ ప్రలాపియు

సహజత వదురును సమముగ శబ్దము గలుగన్

విహతము ఢక్కా రవముగ

నిహపర మెరుగడు నిరతము! నిర్మల దార్లా! (24)

 

వశమై గృహిణికి నప్పుడు

దశరథ సూతుడు తగవగ దారిని గాంచున్

శశకము సింహము జూడగ

వశమగు రీతిని వణకుచు! వర్తన దార్లా! (25)

 

సకలము మెక్కును నిరతము

వికృతపు చేష్టలు విమలము విందుల జేయున్

బకముగ మీనము జూడగ

చకచక మెక్కును జరజర! చతురత దార్లా! (26)

 

శ్రుతమును నేర్వని వాడెను

శతవిధ పోకడ సలుపుచు సభలను జేరున్

మృతమగు ఢక్కను జూడగ

కృతకపు మాటలు కుదురుగ! కృత్యము దార్లా! (27)

 

పరమ పిశునత్వ మతియును

సరభస మెప్పుడు చపలత సాటెడు రీతిన్

ఖరముగ గర్దభ రవముగ

నురవడి దెల్పును నరయగ! నున్నత దార్లా! (28)

 

జయమును గోరని వాడెను

భయదము నిద్రను భరితము బాగుగ జేయున్

నయమున కుంభక రణుడుగ

శయనిత భంగిమ సహజము! శాశ్వత దార్లా! (29)

 

కలుషిత లోభ ముగుణమున

నలుగక దాచును నయముగ నష్టము నొందున్

విలపిత సర్పము నిధినిట

బలవక కాచును బహుగను! భద్రము దార్లా! (30)

 

నోరును విప్పిన తిట్లే

తీరుగ వచ్చును నలవగ తియ్యని మాటల్

కోరడు ఎన్నడు నరుడును

జేరియు తిట్టెడు జగమున జెప్పెద దార్లా! (31)

 


కందపద్యములు
కందము వ్రాయగ నేర్పిన
కందర్పుని తల్లి! నిన్ను - కాంతును మదిలో
మందార గంధ రసమగు
చందము నీ కవన సుధలు - చాలును దార్లా!

కందిని శంకర గురునిన్
కందపు రీతులను నేర్పగనునా మదిలో
కందము పుట్టెను గాదా
కందువగా నడచు మింక - కవివై దార్లా!

గోవర్ధన మిత్రుండున్
గోవిందుడు తోడు నిలువ - గుణయుత కవనన్
గోవుల రీతిగ సాగెడు
గోవగు పద్యమును వ్రాయు - కొమరుగ దార్లా!

మిత్రుల ప్రేరణ తోడను
చిత్రముగా పద్య శిల్ప - చిత్రిత రీతిన్
పాత్రమె నీ కైతమ్మకు
స్తోత్రము జేయుము పృధివిని - శోభగ దార్లా!

నిత్యము పద్యము వ్రాయగ
సత్యముగా భావమొకటి సాధించవలెన్
కృత్యము నీకిది శుభమని
నిత్యము భావించు మయ్యనిజముగ దార్లా!

నడకలు గణాలు కాగా
నుడులన్ కైతల సుగంధ నునుపై సాగెన్
తడబడక సాగు కవనము
దడబిడ లేకుండ వ్రాయు ధన్యత దార్లా!

అక్షర రూపపు శిల్పము
దీక్షగ మలచినది కావ్య దీప్తిని గూర్చున్
పక్షము వహించి భారతి
రక్షగ నిలుచున్ కవీంద్ర రమ్మిక దార్లా!


చక్కని ఛందస్సు నడక
చక్కగ నేర్చినను కవన సమ్మతి దక్కున్
చక్కని భావన లబ్బిన
దక్కని కీర్తియును లేదు ధరణిని దార్లా!

సాటిని ప్రేమించని యెడ
నీటికి పోసినటులౌను నెమ్మది కైతల్
కోటిగ వెలుగులు చిమ్ముచు
మేటిగ సాగించు కవన మేలుర దార్లా!



మతమేదియైనమనిషిని
శతవిధకర్మలు శతవిధ శాస్త్ర నియమముల్
శ
తవిధ వంచనలన్నియు
జతయైతెలివినిబలిమిని చంపును దార్లా! (64)

పయనంబైతేఫ్లైటుకి
పయనంబవ్వవలెముందెపరుగుపరుగునన్ 
ని
యమముతప్పినతప్పదు
భయమికబోర్డింగుకొరకు భద్రముదార్లా! (63)

ఒడిలోతిరుగుచుయాడగ
గుడిలో దేవతయెవచ్చెకూతురువోలే 
బు
డిబుడి అడుగుల సుధయే
వడివడిగాయెదిగినిలిచెవదువుగదార్లా!  (62)

కారా యజ్ఞము కథకుడు 
బేరా పండితసహృదయపెన్నిధిమాకున్
రా
రా కఠినవిమర్శయు
చేరాభాషావిమర్శ చేర్పులె తెలుగౌ! (61)
ఎక్కడనైననుమొలుచును
చక్కనివాతావరణముసమకూరంగన్
మొ
క్కనుబోలును కవితయు 
చక్కని వేదిక దొరికినసరి సిరికోనా! (60)

నేలను పెరిగెడి మొక్కలు
వేలువిడిచి నడుచు బాలవేడుకవోలెన్
నే
లను విడిచె నిజము డా
బాలనెగబ్రాకుచునిలబడె సిరికోనా! (59)

హస్తమునకుభూషణమగు
పుస్తకమనునానుడిపుడుపూర్తిగమారెన్
హ
స్తమునకుచరవాణియె
మస్తకమయ్యెన్ననిటికిమరి సిరికోనా!  (58)


కన్నయ్యకు నేడు జరిగె
అన్నప్రాశనఘనముగనందరినడుమన్ 
స
న్ననిపొత్తముపట్టగ
చిన్నయ్యగునొకచదవరిసిరిగలదార్లా!  (57)

ఎప్పటికెయ్యదియగునో
చెప్పుట కష్టమగుజీవిచెంతకు చెలిమిన్
చె
ప్పకవరించుషుగరూ
తప్పదికభరించుదాన్నితరుముటదార్లా! (56)


క
న్నవివిన్నవిసరిగా
ఉన్నవియనుకొనననేల ఉన్నను చుట్టూ 
యె
న్నికనుంగొనగలిగితి
వెన్నిటినున్నావదిలితివెందుకు దార్లా! (55)


దూ
రము పెట్టిన వేదము
చేరగరమ్మని పిలిచియు చేయించెనురా 
భా
రముదింపుకొనగనొక
హారముగాయాగకృతమునందుము దార్లా! (54)


చక్కనివేషముకలిగీ
చక్కని భాషను పలుకుము చమతృతిగానూ
యె
క్కువ తక్కువ చేయకు
ఒక్కరెవరినైనసభను వరమౌ దార్లా! (53)


విడువకుమీసభలోపల
విడువడననుబంధములనువీనులకెపుడూ
జ
డులేకురిసినపరుచుము
యెడబాయనియెదముదమునయెపుడూదార్లా! (52)


త
డబడనీయకు మాటను
విడువకునైతికవిలువలువిజయముకొరకున్
స
డలకుధైర్యమునెపుడూ
కడలి కెరటములను చూసి కలగను దార్లా! (51)


తె
లిసినదానినిపలుకుము
తెలిసినదంతయుపలుకకుతెలివేలేకన్
త
లచుకొని కలుసుకొనవలె
తెలిసిన పెద్దలనువీడ్వకెన్నడు దార్లా! (50)


 మరువుముతిట్టినతిట్టులు
మరువుముకొట్టిననుగానిమరతుముయన్నీ
మ
రువకుకరుణాశీలిని
మరువకుపెట్టినమెతుకులుమాత్రముదార్లా! (49)


వీరులు తెచ్చిన దేశము
చోరులకిరవైనయట్లుచొచ్చుకువచ్చెన్
నోరులుచాచినపేదకు
చోరులుపిసరంతనైననొసగరుదార్లా! (48)


ప
లికెడిదిపద్యమైనను
పలికించెడివారుజనులు పలికెద వారే
ప
లుకులు పలికిననవియే
విలువలు కలిగిన రచనలువినుమోదార్లా! (47)


తనసెల్లుయెతన శత్రువు
తనవాట్సపెతనకుశిక్ష తననదివదలన్
తనకులభించునుశాంతియు
తనకగుమిత్రులుపలువురుతథ్యము దార్లా! (46)



కులకాంతతోడనెప్పుడుఁ
కలహిం పకపెట్టమనుముకావలనదియే
కలకంఠికంటకన్నీ
రొలికిన టి. వి. కంటినుండదొక్కతెదార్లా! (45)


 ఎప్పుడుసంతకమవసర
మప్పుడువిద్యార్థివచ్చుమరువకుయెపుడూ
సప్పునపెట్టుచుమరలా
నెప్పుడవసరంబరయుమునేర్పునదార్లా! (44)


ఒప్పుగ చెప్పితివి నిజము
సప్పని రుచులను తినియెడి సారపు హీనుల్
కొ
ప్పున పెట్టక పువ్వును
చెప్పనిచోటులనుపెట్టిచెప్పును దార్లా!   (43)


రాయలు పాలించిగ, నా
రాయణరావు చరితంబు వ్రాయగ పూనెన్
రా
యల సీమను జాగృతి 
చేయుచు శ్రీహరి కలంబు చేవగ దార్లా! (42) 


కమ్మని బిరియానీ రుచి
రమ్మనినా యితరములకు రాదనుచుందుర్ 
ర
మ్మిచట చూపెదమనుచు 
కమ్మని ధమ్ కన్న బన్ ది కనుమిదిదార్లా !  (41)


డ్యూటీఫుల్లేమదరు
క్యూటీ బేబీయెచెల్లి కూరిమినింపన్
బ్యూ
టీఫుల్లగువైఫే 
బేటీయేపెంకిపిల్ల బెదరకు దార్లా! (40) 


' 'పద్యమునకొచ్చెనవ్యత! 
విద్యవచనకవి తలవలె విస్మయమొందున్' '
గ
ద్యము నంటిన్ వారనె
' '
చోద్యముగా సాధనమున సొంతము దార్లా' ' !  (39) 


మునిజనమే రాక్షస బా
ధనుపొందుచునుండువేళ, ధర్మము నిలుపన్
ఘ
నముగ నీశుఁడువిరివిగ
అనలమ్మే సుమ్మియిలనుజల్లును దార్లా!  (38) 


చిలికిన వెన్నయు మధురము
ఒలికించువలపులరాణి ఒయ్యారంబున్ 
క
లిగించునుగోవిందుడు
పలికిన పలుకెల్లతీపి పంచును దార్లా !  (37) 


' చక్కని చిక్కని రంగుల
అక్కరములలోన పద్యమందముకులికెన్' '
చ
క్కని యువతుల పలుకులు
చిక్కని కొప్పులనటుయిటుచిక్కును దార్లా !  (36) 


గతులే మారిన మారఁడు
సుతుఁడుదశరధుని వరంబు శుభచరితుండున్
హి
తుడా నడువుమటులనే
చితిపైనుంచిన సడలకు చిత్తము దార్లా! (35) 



కాలముమాఱినకొలదిఁనిఁ
కాలమునకుఁదగిన రీతి గణ్యంబగుచున్ 
వా
లుజడవు, వయ్యారివి
చాలఁగ నరుమనముదోఁచుచక్కగ దార్లా! (34) 


వాడినపువ్వులు వోలే 
పాడుబడిన భావినీళ్ళు, పాతపదములూ 
వా
డరు వివేక శీలులు
వాడవలయునన్యభాష వలసినదార్లా! (33)


మాదిగ రథము కదలగను
మాదిగ కవులు, రచయితలు మాదిగకళలన్
మా
దిగచరితనుతవ్వుచు
మాదిగలంతయు కలిసిన మహిమనుదా ర్లా! (32)


నవ్యతెలంగాణచరిత
దివ్యమనుచు మనకు చూపె దిమ్మతిరగగన్ 
స
వ్యముగ సంగిశెట్టి యె
నవ్యుఁడతఁడు సత్యశోధనమునేదార్లా! (31)


రక్షణ కవచముచేయుచు
నక్షయపాత్రగను మార్చెనదిగో రబ్బర్
శి
క్షలువెయ్యకు వీళ్ళు వి
లక్షణమైనయధికారులగుదురుదార్లా! (30)


తల్లివినువ్వే మమతల 
చెల్లివినువ్వే మనసుకు చెలిమివి నువ్వే 
క
ళ్ళకు వెలుగువు నువ్వే
చెల్లము నువ్విలనులేక! చెప్పుముదార్లా! (29)

గ్రహణముపట్టునొకదినము
అహమనుగ్రహణమునుపట్టినధికారికియే
మొ
హమాటములేకనిలుచు
గ్రహణమునట్లేనటునిటుకదలదుదార్లా! (28)



తెలిసినవారికిఁజెప్పుము
తెలియని వారికినిఁజెప్పు తెలివినిమీరన్
తె
లిసీతెలియనివాడికి
తెలివినిబోధించుమూర్ఖతెలివియెదార్లా! (27)


ఎయ్యదిపథ్యంబవదో
యెయ్యదితినుటకుకుటుంబమెంతగనిష్టం
బ
య్యెదిసెలవుదినములకు
నెయ్యముగావండవలయునెప్పుడుదార్లా!(26)


ఎప్పుడుజీతమువచ్చిన
అప్పుడెకట్టుదురురుసుములదియెట్లన్నన్
గు
ప్పెటనుండటకుదరక
సప్పుడుచేయదెయిడెడ్డు సత్యముదార్లా!(25)



వాకింగుచేయుచూ నే
టాకింగునపద్యమొకటిటక్కునచెప్పన్
షాకింగగుచూ జనులే
ప్యాకింగునతెచ్చె దూది పరుగునదార్లా!  (24)

మొత్తానికిబాలికలే
సత్తాచూపించినిలిచె చదువులలోనూ
గుత్తాధన్యశ్రీయిక
చిత్తాలనుగెల్వవలెనుచివరికిదార్లా!(23)

గ్రహణముపట్టునొకదినము
అహమను గ్రహణమునుపట్టినధికారికియే
మొ
హమాటములేకనిలుచు
గ్రహణమునట్లేనటునిటుకదలదుదార్లా! (22)


తెలిసినవారికిఁజెప్పుము
తెలియని వారికినిఁజెప్పు తెలివినిమీరన్
తె
లిసీతెలియనివాడికి
తెలివినిబోధించుమూర్ఖతెలివియెదార్లా! (21)

చక్షుమతి విద్య నేర్పుము
భక్షకులమది తెలుసుకొని బాలిక లెవరూ
ర
క్షణలేదనియనుచూ
శిక్షలు వేయమనడగరు శిశువులు దార్లా!(20)

(చక్షుమతీ విద్య భారతీయ ప్రాచీన విద్య. అది అభ్యసిస్తే,
 మనగురించి మనయెదుటివాళ్ళ ఏమనుకుంటున్నారో ముందే గ్రహించవచ్చునట!)

ఆచార్యులవారేమో
ఆచార్యవిశేషణంబునటకెక్కించెన్
ఆ
చార్య కలముపేరట
ఆచారముగాబిరుదులనందకుదార్లా! (19)


స్త్రీలధ్యక్షులుగా పా
ర్టీలను పెట్టియధికారిణిలవుచునుండే
కా
లముగమనించమనే
స్త్రీలకు మ్రొక్కిన పదవులు శీఘ్రము దార్లా! (18)


యోగామానవకోటికి
రోగాలకువిరుగుడిచ్చి రోజులుపెంచున్
జా
గేలికమానవవా
బాగాయోచించిపొందుభాగ్యముదార్లా (17)



వాడుచదివిననుమూర్ఖుడు
వాడుపలికనదియెవేదవాక్కనివాగున్ 
పా
డుపడెననుచరిత్రను
వాడనుకొనునదియెచరితవాడికిదార్లా! (16)


వ
ల్లించుచువేదాలను
జల్లించుచుశబ్దములను జట్టులుకట్టున్
మ
ల్లించుదురటుదృష్టిని
మెల్లంగాపండితులనిమెరయునుదార్లా! (15)


స
రదాగాపద్యమునొక
పరివర్ణిద్దామనుకొని పలువిధములుగన్
స
రిపడుగణములుకూర్చితి
మరిమరియడిగెడినవారిమాటకుదార్లా (14)

సయ్యద్ భయ్యా రోజూ
నెయ్యినికలిపినహలీమునెంతగతింటిన్
వె
య్యకుచాలనినొప్పవు
నెయ్యమునెప్పుడుమరువనినేస్తముదార్లా!  (13)



వ్రాతల్లోధిక్కారము
చేతల్లోపాదసేవచేయగలకవీ! 
రో
తకలగడములేదా? 
పాతరవేయుచువిలువలుపంచుటదార్లా! (12)

అడిగినసొమ్మునుకాదన
కడిగిన తరుణమునయివ్వు కానీ మరలా
అ
డిగిన నిన్నేమిత్రుడు
కడిగేయగలడు వదులుము కర్మకు దార్లా! (11)


హోరునవర్షముకురిసిన
జోరుగపాటలువినుచును జోకులతోనూ
కా
రునినడుపుచునీ శని
వారమువెళ్ళితిని శివుని వద్దకుదార్లా! (10)


 ఎవ్వరడిగితేవేశా
రెవ్వరికితెలిపితిరెవ్వరెవ్వరిబొమ్మల్
ఎ
వ్వరడిగెనీబొమ్మకు
నివ్వెరపోవనొకవోటు నిజమా దార్లా! (9)

 
కాలముమాఱినకొలదిఁనిఁ
కాలమునకుఁదగిన రీతి గణ్యంబగుచున్ 
వా
లుజడవు, వయ్యారివి
చాలఁగ నరుమనముదోఁచుచక్కగ దార్లా! (8)


ఎ
వరెక్కడ పుట్టెదరో
యెవరెక్కడ తనువును వదిలెదరో యేదీ
యెవరికి తెలియదు జీవియు
చివరికి సాగరమునపడు చినుకే దార్లా ! (7)

 
20 జూలై 2018
(సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కుమారి హర్షిత ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ....)

పగలే చుక్కలు చూచితి
బగబగ మండుచునుయెండ భయమేపెట్టన్
జ
గడాలాడుచు భక్తులు
పగవారునువోలెకాశి పయనముదార్లా! (6)



పోవద్దుర 'దానా' పై
రావద్దురదానినుండు రాక్షస మూకల్
రా
వచ్చునురాసీటును
పోవచ్చునదేనుసీటు పోకుము దార్లా! (5)


రుచిగా కుదరిందనుచూ
కచుడేవచ్చిన వదలను కమ్మనియమృతమ్
రు
చులే చెప్ఫుచు మంజుకి
శుచిగాతింటిపులిహోర సుష్టుగ దార్లా! (4)



ఏసీగీసీచెల్లదు
టీసీ వచ్చిననుపోవుటిచ్చటి రీతే
మూ
సీ మూయగకనులను
తీసేయగలరు తలుపులు తిప్పుచు దార్లా!  (3)


చట్టము భారత కార్మిక
చుట్టమగుటకెట్టివియునుఁ జూపఁగవలెనో
య
ట్టివికోర్టులకివ్వగ
పట్టుదలనుచూపుచుండె బాపూ దార్లా!   (2)

  
చేరితినయ్యా కాశీ
 కోరి కొలువగ గణపతిని కోరితి మొదటన్
హారతినందితినది కను
లారగ దర్శించి నిన్ను అమ్మను దార్లా!   (1)


కామెంట్‌లు లేవు: