"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26 ఫిబ్రవరి, 2019

Trilingual Glossary of Political Science

he commissioner, Scientific & Technical Terminology, Department of Higher Education, Ministry of Human Resource Development, Government of India, has recently brought out a trilingual book – (English-Hindi-Telugu) titled Fundamental Glossary of Political Science under the editorial board which includes Prof. Avanish Kumar, the Chief Editor, Dr. Shahzad Ahmed Ansari, Assistant Scientific Officer (Political Science) and the Editor, and select faculty members from various universities in India. Prof. P. Eswariah, Former Head, Department of Political Science, Prof. Darla Venkateswara Rao, Department of Telugu & Dr. E. Venkatesu, Associate Professor, Department of Political Science, University of Hyderabad, who participated in various workshops contributed to the book.

The book being available in Telugu and Hindi is put in free circulation for the benefit of researchers, translators, graduates, under-graduates and intermediate students as well in their reference to the technical terms in Political Science.
This e-book is now available on the link:
http://csttpublication.mhrd.gov.in/ebook/FundamentalGlossaryofPoliticalScienceEnglish-Hindi-Telugu/html5forwebkit.html?page=0

13 జనవరి, 2016

‘నెమలికన్నులు’తో అస్తిత్వానంతర కవిత్వంలోకి డా. దార్ల -డా. కృష్ణ కదిరె

అస్తిత్వానంతర కవిత్వంలోకి డా. దార్ల
మిత్రుడు దార్ల వెంకటేశ్వరరావు‘నెమలికన్నులు’ పేరుతో తనఖాతాలోకి మరోకావ్యాన్ని చేర్చారు. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదులో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దార్ల అదే యూనివర్సిటీలో తన ఉన్నత విద్యనంతా పూర్తి చేశారు. విగతదేహి నాగప్పగారి సుందర్రాజు బృందంతో కలిసి విద్యార్థి దశ నుండీ సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో దార్ల పాల్గొన్నారు. దళిత తాత్త్వికుడిగా పేరుపొందిన దార్ల, పరిశోధన రంగంలోనూ విశేషంగా కృషిచేశారు. ఇటీవలే బహుజన సాహిత్య దృక్పథాన్ని ఒకపుస్తక రూపంలో గొప్పగా అందించారు. సహృదయుడు, సాత్వికుడు, సూక్ష్మపరిశీలనా దృష్టి గల దార్ల లోకాన్ని నెమలికన్నులతో ఎక్సరేతీస్తూ ఈ కవితా సంపుటి రూపంలో అనుభూతుల ఐక్యతా సమ్మేళనాల రిపోర్టుని అందిస్తున్నాడు. తన దర్జాకు, తన గౌరవానికీ కారకులైన తన తల్లిదండ్రులతో పాటు, తాను పుట్టి పెరిగిన సమాజాన్నీ అమితంగా ప్రేమించే మంచి స్నేహితుడు నాకు లభించడం నాకెంతగానో గర్వంగా ఉంది.
హృదయం కరిగిపోయే కవితాపంక్తులు దార్ల కవిత్వంలో అలవోకగా వచ్చిచేరిపోతాయి. ఆలోచన, భయం, విస్మయం కలగలిసిన ఈ కవితాపంక్తులు గమనించండి.
‘‘నాకు తెలీదు
అమ్మ గర్భంలోనైనా
అవమానానికి దూరంగా ఉన్నానో లేదో’’  ఈ మాటలు చదువుతున్నప్పుడు జీవితంలో అనుభవించిన అవమానాల తీవ్రత కళ్ళముందు కదలాడింది. కొద్దిసేపు స్తంభించిపోయాను. తల్లిగర్భంలో ఉండగానే అవమానాలు పురుడుపోసుకునే దేశంలో పుట్టానా అనిపించింది. లోకంమీద పుట్టిన తర్వాత మనిషి తెలుసుకోవాలనుకోవడంతోనే జీవితం ప్రారంభమవుతుంది.కడుపు నింపుకోవడానికి తల్లి స్తనాన్ని వెతుక్కోవడం, జన్మనిచ్చిన స్త్రీని ఏమని పిలవాలో తెలుసుకోవడం/నేర్చుకోవడం ఇలాంటివెన్నో.అలాగే విద్య నేర్చుకోవడం కూడా.కానీ, అది కొందరికి ఇక్కడ నిషిద్ధం! కొన్ని చోట్లకి ప్రవేశమే ఉండదు. అది గుడి, బడి కావడమే దుర్మార్గం. కొన్నివేల సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బిసి, ప్రజల్లో చదువుపట్ల తపన ఎలా గూడుకట్టుకుపోయిందో  ఈ కవి సరళాత్మక, కవితాత్మక పంక్తులు తెలియజేస్తున్నాయి.
‘‘ఏదైనా మాయో మంత్రమో,
యంత్రమోవుంటే బావుణ్ణు
తొందరగా గ్రంథాలయంలోని
పుస్తకాలన్నీ ఔపోసన పట్టేసేవాణ్ణి!’’ ఈ గాఢమైన తృష్ణ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా తీరింది. ఇప్పుడు దార్ల విద్యావేత్త, పండితుడు. అన్నింటికీ మించి ఒక బాధితుడు. అందుకే ఆకలి జయించి పండితుడైతే కన్నతలి, ఆ నేలా పులకించక మానతాయా? కనుకనే ‘‘మాడ్చుకుని తిన్న ఆకలి/మా అమ్మ పాదాలపై పడి ఏడుస్తుందిప్పుడు’’ అంటున్నాడు కవి. డా. అంబేడ్కర్, ఫూలే ఇదే కోరుకున్నారు. తన తండ్రి కష్టం, తన తాత ( అంబేడ్కర్) శ్రమ ఫలించింది.  తన కుటుంబంలో ఆనాడు తిష్టవేసి కూర్చొన్న వేదనను ‘‘ ఆ చీకట్లో అర్జునుడు /అన్నం ముద్ద సరిగ్గా తిన్నాడో లేదో గానీ/ కాళరాత్రుల్లోనూ మానాన్న వేసే గునపం పోట్లకి/పెరుగుగడ్డలా విరిగిపడే మట్టిబెడ్డల’’ బరువును దించేశాడు. కథ సుఖాంతం కాలేదు. తల్లి తండ్రుల తీరని తీరని  రుణం కొంత చిర్నవ్వు చిలకరించినా తాను పుట్టి పెరిగిన సమాజం కోసం ఆలోచించినప్పుడే బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి రుణం తీరుతుంది. ఆయనిచ్చిన చైతన్యంతో డా.దార్ల ‘‘ ఎన్నిసార్లు చంపుతావంటూ /దేవుణ్ణే కాలర్ పట్టుకొని’ అడుగుతున్నాడు. మతం ముసుగులో జాతులు విధ్వంసాన్ని చూపుడువేలుతో ప్రశ్నిస్తున్నాడు. ‘‘వంశపారంపర్యంగా దళిత కుటుంబాలవాళ్ళే /దేవుడి పెళ్ళాలుగా’’ మారాల్సిన దుస్థితి సమాజంలో నెలకొనడాన్ని దుర్మార్గమని గొంతువిప్పి, పిడికిలి బిగించి హెచ్చరిస్తున్నాడు. ధైర్యం కేవలం పిరికితనాన్నే కాదు; పీడనను కూడా పారద్రోలుతుంది. అది విద్యవల్ల అబ్బుతుంది. అది అంబేడ్కర్, ఫూలే, పెరియార్, కాన్సీరామ్ లకు పుష్కలంగా ఉంది. అదే ఆనవాలు దార్లలోను కనిపిస్తుంది సహజంగానే!
డా.దార్ల వెంకటేశ్వరరావు అస్తిత్వానంతర కవి. విప్లవం తర్వాత జరిగే పరిణామాలు మరో విప్లవాన్కి దారితీస్తాయి. విప్లవంలో ఎన్నో విప్లవాలు పుట్టాల్సి ఉంటుంది. సమాజం తుది రూపుదిద్దుకొనేవరకు ప్రారంభవిప్లవం నుండి విజయోత్సవ పలుకుల వరకు ఎన్నోదశలు ఉంటాయి. పరిపూర్త విప్లవం ఇంకా చరిత్ర అనుభవంలోని రాని విషయం. ఈ దరిమిలా పరిశీలిస్తే అస్తిత్వంలో పుట్టి, నిర్మాణంలో పాత్రధారిగా డా.దార్ల దర్శనమిస్తాడు. బహుజన సాహిత్య దృక్పథం దీనిలో భాగమే. కవితాసౌందర్యం కేవలం బ్రాహ్మణసాహిత్యంలో ఉంటుందన్న అబద్దపు ప్రచారాన్కి డా.దార్ల అడ్డుకట్టవేశాడీ కవిత్వంలో. చూడండి నావైపు ‘‘పొద్దున్నే భుజాన్నెక్కుతున్న సూర్యుడు /రైలు దిగినప్పుడు వెన్నెలవుతాడు’’ అంటాడు. సూర్యుడు చంద్రుడు కావడమేంటి? అదే ఈస్తటిక్స్. పొద్దస్తమానూ పోరాటాలు, ఆరాటాలతో గడిపినా సాయంత్రం కలిసిమెలిసి ఉన్నదాంతోనే సుఖసంతోషాలతో గడిపే ఎస్సీ,ఎస్టీ, బిసి కులాల జీవన సౌందర్యమంతా దీనిలోఒక చక్కని భావచిత్రంలా అందించాడు కవి. పొద్దస్తమానం పనిచేసిన శ్రామికురాలు సాయంత్రం ఆ ‘గాయాల చేతుల్తోనే కారం పచ్చడి నూరుతున్న తల్లి  వదనంలో ’’ నిజమైన ఈస్తటిక్స్ ని చూడమంటున్నాడు. ‘సింహదరహాసనమయ్యే కుక్కపిల్ల’, ‘సూర్యకిరణ స్నానం’ వంటి వాక్యాలు ఈ కవితాసంపుటిలో కోకొల్లలు. ‘‘నాపుట్టుమచ్చమాత్రం/నాకు రక్షణ కవచమేన’’నడంలో కవితాత్మకతను చూడండి. ‘పుస్తకమై పుట్టాలనే కోరిక’లో ఎంత సౌందర్యం ఉందో తరతరాలుగా అక్షరాలకు దూరమైన వారి వేదన తెలసినప్పుడు ‘ఆహా!’ అనకుండా ఉండగలమా? సామాజిక రుగ్మతలు, మూఢవిశ్వాసాలు, కులాధిపత్యాలను ఎదుర్కోవడానికి చారిత్రకంగా జరుగుతున్న యుద్ధంలో ఒరిగిపోయిన వీరుల సమాధులు అడిగే ప్రశ్నల భాషను పరిష్కరించడానికి ఈ కవి చేసే ప్రయత్నం కొత్తభాషనూ పుట్టించొచ్చేమో!  ఎంతైనా ఒక తెలివైన మాదిగోణ్ణుండి ఒక బహుజన శిల్పకారుడిగా మారిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వైయక్తికత నుండి వ్యవస్థీకృతంవైపు పయనించడంలోనే బహజన హితాయం, బహుజన సుఖాయ అనేది సార్థకం కానుంది. దార్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలతో... సబ్బమంగళం!!

-
డా. కృష్ణ కదిరె, మొబల్ : 09505251975 

10 జనవరి, 2016

నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది

ఈ వారంలో నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది.నా కవిత్వం గురించి చాలా మంది గతంలో రాసిన అభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించాను.  దీనికి ముఖచిత్రంగా  ప్రసిద్ధ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ గారు అర్ధవంతమైన కవర్ పెయింటింగ్ వేసిచ్చారు.  ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



. నెమలికన్నులు  ముఖచిత్రం పై ఉన్న పెయింటింగ్ అంతరార్థమేమై ఉంటుందనే దానికి  డా.మల్లెగోడ గంగా ప్రసాద్ తన ఫేస్ బుక్ లో ఇలా వ్యాఖ్యానించారు. దాన్నిక్కడ పునర్ముద్రిస్తున్నాను. 
డా. మల్లెగోడ గంగా ప్రసాద్ Facebook లో రాసిన వ్యాఖ్యలను కింద పునర్ముద్రిస్తున్నాను.


భారతీయ సామాజిక వ్యవస్థ ప్రధానంగా చాతుర్వర్ణమూలాల్ని కలిగి నిర్మితమైంది. దానికి అనుబంధంగా వచ్చిందే పంచమవర్ణం. వీటిని ప్రతీకాత్మకంగా చిత్రకారుడు జంతువుల్ని చిత్రించి ఉండొచ్చు.
  • చాతుర్వర్ణం నుండే రకరకాల ఉపకులాలు మళ్ళీమళ్ళీ పుట్టుకొచ్చినా, వాటిలో ‘ పంచమవర్ణం’ సమాజానికి దూరంగా నెట్టివేయబడింది. దీన్ని విడిగా దూరంగా ఉన్న జంతువు ప్రాతినిథ్యం వహిస్తుందనుకుంటున్నాను.
  • భారతదేశంలోని సాంఘికహోదానీ, ఆర్థిక, రాజకీయాధికారాలను అనుభవిస్తూ విలాసవంతంగా జీవించే లక్షణాలున్న వర్ణాలవారిని నాలుగు జంతువుల్లోను చిత్రకారుడు చిత్రించి ఉండొచ్చు. వీటిని వాటి కొమ్ములకున్న రకరకాల రంగుల ద్వారాను, వాటి శరీరఛాయ, వాటి హావభావాల ద్వారా గమనించేలా చేశాడనుకుంటున్నాను.
  • నాలుగు బలిసిన దున్నపోతులు అలంకరించుకొని సమాజాన్ని ఆక్రమించుకొన్నస్థితి చిత్రంలో కనిపిస్తుంది. ఒకటి మాత్రమే విడిగా ఉంది. దానికి ఎలాంటి అలంకరణా లేదు. దాని కళ్ళల్లో విషాదం తొణికిసలాడుతున్నట్లుంది.
  • ఒక బాలుడు కర్రపట్టుకొని మార్గానికి అడ్డంగా నిలబడిన ఆ పశువుల్ని విదిలిస్తున్నాడు.
  • ఆ బాలుడు నీలిరంగు నిక్కరు , ఎరుపురంగు చొక్కాలను ధరించాడు. నీలిరంగు అంబేద్కరిజానికీ, ఎరుపురంగు కమ్యూనిజానికీ ప్రతీకలుగా చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నవాళ్ళు కమ్యూనిస్టులైతే, ప్రజాస్వామిక పంథానే ప్రధానం చేసుకొని ఉద్యమాలు చేస్తున్నవాళ్ళు అంబేడ్కరిస్టులు.
  • అడ్డంగా నిలబడిన పశువుల్ని బాలుడు తన చేతిలో ఉన్న కర్రతో విదిలిస్తున్నాడు.
  • దూరంగా కనిపిస్తున్న ఊరు, ఇళ్ళు, పక్కన పచ్చనిపొలాలు... వాటివైపు ఈ నాలుగు పశువులు దృష్టిని కేంద్రీకరించాయి. వాటిని కర్రతో కొడుతూ బాలుడున్నాడు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు రాజకీయాల ద్వారా ఆ గ్రామాన్నీ, ఆ ఇళ్ళనీ, ఆ పచ్చదనాన్నీ తామెలా స్వాధీనం చేసుకోవాలో ఆలోచిస్తున్న నాలుగు వర్ణాల వారు ఆలోచిస్తున్నట్లుంది. దాన్ని నెరవేరనివ్వనన్నట్లు బాలుడి చేతిలోని కర్ర కనిపిస్తుంది.
  • తాగడానికి కొన్నినీళ్ళు, కట్టుకోవడానికి బట్ట ఉన్న ఆ బాలుడు తినడానికి భుజాన తువ్వాల్లో ఏదొక ఆహారపదార్థం మూటకట్టుకున్నాడు.
  • ఆ బాలుడు చదువుకున్న కవి, రోడ్డుకడ్డంగా నిలబడ్డ పశువులు ఊరుని నాశనం చేయాలనుకునే ఆధిపత్యవర్ణాలు, వర్గాలు గా చెప్పుకోవచ్చుననుకుంటున్నాను. నెమలికన్నులు కవిత్వంలో ఉన్న వస్తువు అంతా దీన్ని ప్రతీకాత్మకం చేసేలా చిత్రకారుడు చిత్రించాడనుకుంటున్నాను. 

09 ఫిబ్రవరి, 2015

‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ విశేషాలు




నమస్తేతెలంగాణ, హైదరాబాదు 9-2-2015

సాక్షి, హైదరాబాదు 9-2-2015

ఈనాడు హైదరాబాదు, 9-2-2015

డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖరచయిత ఆచార్య ఎన్.గొపిగారు. వేదికపై వరుసగా డా.వంశీరామరాజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, డా.ద్వానాశాస్త్రి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్.గోపి, శ్రీ బైసా దేవదాసు, ఆచార్య జి. అరుణకుమారి, డా. కళావేంకటదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి మొదలైన వారున్నారు.
సభాధ్యక్షత వహించిన శ్రీ బైసదేవదాసుగారు,సంపాదకుడు, నేటినిజం దినపత్రిక

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

సభలో ఆశీనులైన జనం

గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారికి డా.దార్ల వెంకటేశ్వరరావు తన పుస్తకాన్ని అంకితమిస్తున్న దృశ్యం
ముఖ్యఅతిథి, గ్రంథావిష్కర్త ఆచార్య ఎన్.గోపీ గారు ప్రసంగిస్తున్న దృశ్యం

శిష్యుడు.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారు

శిష్యుడు.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారు

శిష్యుడు.దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు గారి శిష్యులు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు గారి శిష్యులు
గ్రంథరచయిత డా.దార్ల వెంకటేశ్వరరావునీ, అతని శ్రీమతి డా. మంజుశ్రీని సత్కరిస్తున్న దార్ల శిష్యులు

గ్రంథరచయిత డా.దార్ల వెంకటేశ్వరరావునీ, అతని శ్రీమతి డా. మంజుశ్రీని సత్కరిస్తున్న దార్ల శిష్యులు

గ్రంథరచయిత డా.దార్ల వెంకటేశ్వరరావునీ, అతని శ్రీమతి డా. మంజుశ్రీని సత్కరిస్తున్న దార్ల శిష్యులు
డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రి, ఆచార్య ఎన్.గోపి, డా.దార్ల లతో విద్యార్థులు

గ్రంథాన్ని అంకితం తీసుకున్న అనంతరం మాట్లాడుతున్న డా.ద్వానాశాస్త్రిగారు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న విద్యార్థులు

డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న విద్యార్థులు
రాజా పాటలతో సభ ఉర్రూతలూగింది

ఆత్మీయ అతిథి ఆచార్య జి. అరుణకుమారిగారు ప్రసంగిస్తున్నదృశ్యం

పుస్తక సమీక్ష చేస్తున్న శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు

సభలో అతిథులను పరిచయం చేసి సభను నిర్వహిస్తున్న డా. తెన్నేటి సుధాదేవిగారు

సభావేదికపై ఆశీనులైన అతిథులు
ఆచార్య ఎన్.గోపిగారి ప్రసంగం
డా.ద్వానాశాస్త్రిగారు ప్రసంగిస్తున్న దృశ్యం

డా.దార్ల వెంకటేశ్వరరావు స్పందన









సభను విజయవంతం చేసిన మీకు నా ధన్యవాదాలు

నిన్న సాయంత్రం నా పుస్తకం ‘ సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ పుస్తకావిష్కరణ, అంకితోత్సవ సభ జరిగిన వార్తాంశాలను నమస్తేతెలంగాణ, ఈనాడు, సాక్షి పత్రికల్లో ఇలా రాశారు. పూర్తి నివేదికను త్వరలో అందిస్తాను. 
ఈ సభకు వచ్చి కార్వక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు...డా.దార్ల వెంకటేశ్వరరావు


ఈనాడు, 9-2-2015 హైదరాబాదు టాబ్లాయిడ్


05 ఫిబ్రవరి, 2015

సాహితీమూర్తులు-స్ఫూర్తులు ’’ గ్రంథావిష్కరణకు స్వాగతం

మిత్రులు, సాహితీ ప్రముఖులకు అందరికీ నమస్కారం
ఈ నెల 8 వతేదీన ( 8-2-2015)సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో నా పుస్తకావిష్కరణ సభ జరపాలని అనుకుంటున్నాను. ఈ సభలోనే మా గురువుగారు డా.ద్వానాశాస్త్రిగారికి  ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. సభ వివరాలు :
ఆహ్వానం
వంశీ విజ్ఞాన పీఠం
శ్రీ త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో
తేది: 8-2-2015, ఆదివారం
సాయంత్రం గం.6`30 ని॥లకు

శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాదు లో

డా॥దార్ల వెంకటేశ్వరరావు రచించిన
‘‘సాహితీమూర్తులు`స్ఫూర్తులు’’ గ్రంథం
ఆవిష్కరణ, అంకితోత్సవం


ముఖ్యఅతిథి:
 ఆచార్య ఎన్‌.గోపిగారు
పూర్వ ఉపకులపతి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

సభాధ్యక్షులు
శ్రీ బైస దేవదాసుగారు
సంపాదకుడు, నేటినిజం

కృతిస్వీకర్త
సాహిత్య సవ్యసాచి,
పన్నెండు గంటల నిర్విరామ ప్రసంగకర్త,
గురువుగారు డా॥ద్వా.నా.శాస్త్రిగారు

పుస్తకసమీక్షకులు
శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు
పోటీపరీక్షల నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు

ఆత్మీయ అతిథులు
ఆచార్య జి.అరుణకుమారిగారు
ప్రముఖపరిశోధకురాలు, తెలుగుశాఖ, సెంట్రల్‌ యూనివర్సిటి, హైదరాబాదు

డా॥ కళా వేంకటదీక్షితులు
ప్రపంచరికార్డుల గ్రహీత, అధ్యక్షులు,శ్రీత్యాగరాయగానసభ, హైదరాబాదు


అతిధి సత్కారం
సేవాధురీణ, శిరోమణి, డా॥ వంశీరామరాజు  గారు
స్థాపక అధ్యక్షులు, వంశీ విజ్ఞాన పీఠం, హైదరాబాదు

స్వాగతం
డా.తెన్నేటి సుధాదేవిగారు
అధ్యక్షురాలు, వంశీ
పూర్వ ఉప సంచాలకులు, తెలుగు అకాడమి, ఫిలింసెన్సార్ బోర్డు సభ్యురాలు

- సుంకరపల్లి శైలజ, ప్రధాన కార్యదర్శి


ఈ సభకు మీరందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
గమనిక: ఆవిష్కరణ సభలో పుస్తకాన్ని 50 శాతం డిస్కౌంటు ఇవ్వడానికి  ప్రచురణ కర్తలు  అంగీకరించారు. 
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలసిందిగా కోరుతున్నాను. 



17 జనవరి, 2015

‘‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’’ పుస్తకానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి ముందుమాట ‘‘ఫేస్ బుక్’’


దార్ల ఒక మంచి చదువరి, బ్లాగరి. తన మునివేళ్ళను ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ముంచి తెలుగు సాహిత్యానికి తిలకం దిద్దుతున్న నెటిజను. ఇవన్నీ మించి నాకు సహవ్రతుడూ, సహృదయుడూనూ. నిజాయితీ ఉన్న సాహితీకృషీవలుడు. ఈ మాట ఎందుకంటున్నానంటే- సెమినార్లు సెమినార్లంటూ అప్పటికప్పుడు ఒంటికాలిపై గాలిపేపర్లు పోగేసి డొల్ల సెషన్లలో తుస్సు తుస్సుమనిపించే వారి కంటే వెయ్యిరెట్లు నయం దార్ల. సివిల్సుకు ప్రిపేరయ్యే కుర్రాడిలా పుస్తకం పుస్తకం పోగేసి అక్షరం అక్షరం రాజేసి సంప్రదాయబద్ధంగా పత్రాన్ని వండుతాడు. ఈ మాటలు నిజమని సాహితీమూర్తులూ స్ఫూర్తులూ అనే పరిశోధన, విమర్శ వ్యాసాల పుస్తకంలో ఏ వ్యాసాన్ని పలకరించినా చెప్తాయి.
            దార్ల వెంకటేశ్వరరావు వర్తమాన సాహిత్యంతో కలిసి క్రమం తప్పక నడుస్తున్న విమర్శకుడు. ఆ కృషినీ ఈ మధ్య తెలుగు విశ్వవిద్యాలయం గుర్తించింది. ఉత్తమ విమర్శకుడి పురస్కారమూ సమర్పించింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఏదైనా ఒక స్పెషలైజేషను ఎంచుకో. అన్నింటిలోనూ (శక్తిలేకుండా) తగుదునమ్మా అని వేలు పెట్టకు. ఆ రంగంలో చేతికి అందని లోతుల్ని స్పృశించు. మూలాల్ని పట్టుకో. నీ శక్తి ఏదైనా ఎంత ఉన్నా సర్వమూ దానికే ఒడ్డు. నీ కృషి ఫలిస్తుంది. ఆ ఫలాన్ని లోకం ఎప్పటికో ఒకప్పుడు గుర్తిస్తుంది. గుర్తించి తీరుతుంది. సరిగ్గా ఇదే చేశాడు దార్ల. విమర్శరంగం  ఎంచుకున్నాడు అందులోనే కృషి చేస్తున్నాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతున్నాడు. శుభోజ్జయం.
            విషయసంకలనంబు విజ్ఞానమా! ఇటుక ఆమ వేరు ఇల్లు వేరుఅన్నారు. ఇది  సంకలన గ్రంథాల విషయంలో. ఇప్పటి విమర్శకులు తమ వ్యాసాలను కొంత సంకలన గ్రంథాల మాదిరిగానూ  తయారు చేయాలి. ఎందుకంటే సాహిత్యంలో బాగా విస్తృతమైన అంశాలను మనం పరిశోధనకు స్వీకరించినప్పుడు ఇది తప్పదు. కావలసిన ముడి పదార్థం మొత్తాన్నీ ఒకచోట సమీకరించి పెట్టడమూ ఒక పరిశోధనే. దానికీ టెక్నికాలిటీస్‌ ఉన్నాయి. ఒకేసారూప్యమూ, స్వాభావ్యమూ కల అంశాలను క్రోడీకరించాలి. అదే చేశాడు దార్ల ఈ వ్యాస సంపుటిలో. సాహిత్యంలో ఏదో ఒక ప్రక్రియలో విశిష్టంగా సేవలందించిన సాహితీమూర్తుల్ని స్వీకరించాడు వ్యాసవిషయాలుగా. అయితే కేవలం వారి గురించి చెప్పి విడిచి పెడితే నిజంగా....అది విజ్ఞాన సర్వస్వంలాగా బయోడేటావరకే పరిమితమయ్యేది. ఒక వైపు  ఈ సాహిత్యమూర్తుల జీవన రేఖను పరిచయం చేస్తూనే... మరోవైపు వారు చేసిన కృషినీ సాహిత్య స్ఫూర్తినీ విశ్లేషించటం ఈ వ్యాస సంపుటికి గుండెకాయ.
            విమర్శరంగంలోని వివిధపార్శ్వాలను ఈపుస్తకం తడిమిందనడానికి వ్యాసాలలోని వైవిధ్యమూ విమర్శలోని గాఢత నిదర్శనలు. అంతరార్థ రామాయణంపై రాసినపెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారిని లోకానికి పరిచయం చేశాడు. తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ రచనలలోని కవితా మాధుర్యాన్నీ, స్త్రీ చైతన్యాన్ని తూకం వేశాడు. గురజాడ కవిత్వంలోని సంస్కరణ దృక్పథం, గిడుగు భాషా, సామాజిక దృక్పథం... వంటి వ్యాసాలు మనల్ని పునరాలోచనలో పడవేస్తాయి. ఆధునిక కవిత్వం, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, కళాతత్త్వశాస్త్రం, అంతర్జాలం....ఇలా విషయ వైవిధ్యంతో కూడిన వ్యాసాలు సాహితీ విద్యార్థులకు చక్కగా పాఠం చెప్తున్నట్లుగా సరళమైన భాషలో అందించటం విశేషం. దార్లలోని విద్యార్థిమిత్ర విమర్శకుడిని అభినందిస్తున్నాను.
            అత్యాధునికమైన సాహిత్య విమర్శ సూత్రాలూ, సిద్ధాంతాలూ గమనించి ఆ దృష్టికోణంతో దార్ల ఈ వ్యాసాలను రచించినట్లు స్పష్టంగా చెప్పగలను. అస్తిత్వవాద భావజాలాన్ని బలమైన కంఠస్వరంగా విన్పిస్తున్న వారిలో దార్ల కూడా ఒకరు. సామాజిక భాషా సాహిత్యాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలూ, వాటి ఆచరణలూ మొదలైన వాటిపట్ల స్పష్టమైన చిత్రం ఉంది దార్ల దృష్టిలో. ఆ చిత్రాన్నే ఇక్కడ ఆవిష్కరించాడు. ఈ చిత్రం అందరి మన్ననల్నీ పొందాలనీ...ఒక విమర్శకుడిగా దార్ల వెంకటేశ్వరరావు పడుతున్న శ్రమనీ తపననీ చేస్తున్న కృషినీ లోకం మరోసారి గుర్తిస్తుందని నేను అభిలషిస్తున్నాను.ఈ వ్యాస సంపుటిలోని వ్యాసాలన్నీ సదస్సుల కోసం రాసినవే. సదస్సు ముగిసిన పిదప, ఆ వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి, విమర్శలను పున: సమీక్షించి పత్రాన్ని మళ్ళీ సిద్ధం చేయటం నిజాయితీకల పత్ర సమర్పకుడు చేయవలసిన పని. ఈ వ్యాసాలన్నీ ఇలా చేసినవేనని ఆ వ్యాసాలలో కన్పించే నిఖార్సయిన రిసెర్చి మెథడాలజీ చెప్పకనే చెప్తుంది. ఈ విషయంలో మాత్రం విద్యార్థులు- విద్యార్థులే కాదు కొందరైనా అధ్యాపకులూ దార్లని  చూసి నేర్చుకోవాలని నా అభిప్రాయం.  సీరియస్‌ గా సాహిత్యవిమర్శ, పరిశోధన రంగాలలో పని చేసే వారికీ, సాహిత్య విద్యార్థులకీ ఈ పుస్తకం ఒక ‘‘ఫేస్‌ బుక్‌’’ వంటిదని విన్నవించుకొంటూ-పాఠకులకు స్వాగతం పలుకుతున్నాను. దార్ల వారిని అభినందిస్తున్నాను.                                                                                                                                                          
                                                మీ
                                                               -ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
07-04-2014