"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

నాన్న



ధన్యశీలి దార్ల అబ్బాయి

సీ,:
శ్రీలుపొంగెడిసీమ శ్రీకారమునుచుట్టి
            భారతమిచ్చిన భవ్యసీమ 
నదులన్నిచల్లన హృదులన్నిచల్లన
            సశ్యరమతిరుగు శాంతిసీమ
తీయని కొబ్బరి, తినగల ఫలములు
            పాడిపంటలనిచ్చు భాగ్యసీమ
దేవాలయంబులు, దివ్యాలయంబులు
            జాతి, మతంబుల జనుల సీమ
తే.గీ:
అట్టి గోదావరిప్రాంతమందునుండు
కోటి సోయగంబులసీమ కోనసీమ
అందు చెయ్యేరు అగ్రహారంబు నందు
దార్ల అబ్బాయి జన్మించె ధార్మికుండు

సీ.:
ఆశ్రయించినవారినాదరించెనతడు
            కల్మషంబెరుగనికరుణమూర్తి
తగువులు పడకుండదారినుంచెనతడు
            ధర్మదేవతవంటి ధర్మ మూర్తి
ఆత్మ గౌరవమన్న నాతడే చూపించె 
            అంబేద్కరునికాతడానుయాయి 
ఊరినంతయుజాగృతముపరిచెనతడు
            తనకందరొకటను ధన్యశీలి


తే.గీ:
గ్రామ పెద్దగానున్న నిగర్వియతడు
సంఘసంస్కరణకు తొలి సమరశీలి
అగ్రహారప్రజలకయ్యెనాప్తుడతడు 
అతడె దార్లఅబ్బాయియే ధరణినందు!                       -

తే.గీ:
నమ్ముచుంటిమి నిత్యము మమ్మువీడి
నువ్వు నిన్నువిడిచి మేము నుండలేదు
విత్తు నుండియే మొలుచును కొత్త మొక్క
జన్మ జన్మల బంధమీజన్మ నిజము !

కం.:
నాన్ననిమరువరు తనయులు
చిన్నప్పటియాస్మృతులనుచెదరక మెదలన్
మిన్నగనే వర్ధంతులు
యెన్నడునూజరుపుచుందురేమనకుండన్

కం.:
నాన్నొక భయమూ ధైర్యము
నాన్నొక నిజమైనవరమునాడూనేడున్ 
నాన్నొక కరుణా హృదయుడు
నాన్నొక నిలువెత్తుసాక్షి నమ్మకమునకున్

కం.:
నిన్నుస్మరించుకొనియెడి
మిన్నున మెరియుచుమురిసిన మీనామమునే
సన్నుతిచేయుచునుండును 
యెన్నడు పసిడిపతకంబుయెందరిమదినో! 

కం.:
అందరిబంధువునాన్నా! 
అందరిమన్నలను పొందమనుచుందువుగా! 
పొందుగను పసిడి పతకము 
నందుకొనునునీదునామమంజలిగొనుమా!

కం.:
కరుణా హృదయుఁడు భక్తుఁడు
శరణాగతులను విడువఁడు సామాన్యుండా? 
సరితూగరెవ్వరు దయకు
సురతుఁడు లంకయ్యనునది సుజనుని నామమ్ !

తే.గీ:
దార్ల అబ్బాయి సుజనుండు, ధర్మపరుడు
సంఘసంస్కర్త, సరసుడు, సమరశీల
దేశభక్తిని స్మరియించె తెలుగు శాఖ
కేంద్ర విశ్వవిద్యాలయ కేంద్రమందు! 
-ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు
                      17 జూన్ 2018
(ఫాదర్స్ డే సందర్భంగా రాసిన పద్యాలు)


సీ.

పొలమును దున్నేటి, మొనగాడు మా నాన్న

            అరక సాగించును అలుపు లేక

లంకలు కొట్టును, లాఘవమ్మున వరి

            కోతను కోయును కోర్కె మీర

తాటి చెట్టును ఎక్కి తాటాకు గొట్టును

            కల్లు గీయును వల నల్లి వేయు

మొవ్వు పురుగు తీసి మొక్కను కాపాడు

            నైపుణ్యశాలి నాన్నమ్మ గన్న


తే.గీ.

చెమట చుక్కను చిందించి జేసె బాగు

కాయకష్టమె ననె మమ్ము గనియె నాన్న

అక్షరము రాకపోయిన నవని యందు

జ్ఞాన శిఖరాల జూపెను చదువు చెప్పి.


సీ.

లేత ముంజలు గొట్టి పై నుండి విసరగ

             చెక్కు చెదరకవి చేతి కందు

మధురమైనట్టి ఆ బొండాల నీళ్ళను

             త్రాగించు మా కిల తనివి తీర

తాత నేర్పిన విద్య తల దాల్చి భువి పైన

             కష్టాన్నె నమ్మిన కర్మయోగి

సొంత గృహము గట్టి చొప్పుగా పొలమమ్మి

            బిడ్డల చదివించె పెద్ద జేసి


తే.గీ.

సెంటు భూమియు లేకున్న చెమట ధార

పోసి మా కొసగెను కదా పూల బాట

నిత్యమతడుకష్టపడుచు నీతి తోడ

గౌరవము నిల్పె లోకాన ఘనము గాను.



సీ.

కండక్టరయ్యెనుకొడుకగు పెద్దన్న

                 నేను ప్రొఫెసరునై వెలుగుచుండ

తమ్ముడు పండితుడై డాక్టరేట్ పొంద

                చెల్లియు టీచరై చెలగుచుండ

అందరి పెళ్ళిళ్ళు అట్టహాసము జేసి

                మనవలు చూడగా మనసు నిండె

దళిత తాత్త్వికుడన్న కవితా సుగంధాన

                 నాన్న కీర్తిని యేమి చాటి చెప్పు?


తే.గీ.

మాకు వారసత్వమ్మది మంచి చదువు

అమ్మ నాన్నల కష్టమే ఆస్తి మాకు

వారి పాదాల చెంతనే వ్రాలి మొక్క

ధన్యమైతిమి మేము ఈ ధరణి యందు!


సీ.

తాతయు చదివెను కావమ్మ కథలన్ని

                బాలనాగమ్మను బహుగ చదువ

కమ్మనిభారతరామాయణాదులు

                చెప్పి మమ్ములను మెప్పించు తాత

నాన్నబడికిపోక కష్టమే దక్కెను

                విద్య రాకున్నను విలువ లిచ్చె

కొడుకులు కూతురు కొత్తవృత్తులుజేయ

                నేర్పుమీ రగగాను మార్పు తెచ్చె


తే.గీ.

తాత నేర్పిన విద్యను తలను దాల్చి

మొవ్వు పురుగును తీయుట మొదటనేర్చు

వృక్ష రాజును కాపాడు శిక్షణవలె

తనయులందరికిని మంచి దారి చూపె!


సీ.

ప్రొద్దునే పని కెళ్ళి ప్రొద్దు వాటము లోన

వేల ఆకుల గొట్టు వీరుడతడు

వందతా టాకులకొక్కరూకమినిచ్చు

కాలమ్ము లోనను కత్తిపట్టి

మూడువేలాకులు ముచ్చటగాకొట్టి

మధ్యాహ్న వేళకు మరలివచ్చె

కష్టాన్ని చూడగా కనులార మేమెన్నొ

మరపురానివి కదా బాల్య స్మృతులు


తే.గీ.

నేడు పదిమంది గొప్పగ చెప్పుకొనగ

వింటి నాన్నకీర్తికథల వెలుగు లెన్నొ

రెక్కలాడిననాడెమాడొక్కనిండు

రోజులందునే సువిశాలలోగిలిచ్చె.


సీ.

నలుగురు కొడుకులు నవ యువకులు నేడు

            `    ఉన్నత పదవుల ఉన్నవారె

ముగ్గురు కోడళ్ళు ముదముగా టీచర్లు

                చెల్లియు టీచరై జెంతనుండె

అల్లుడు టీచరై హాయిగా బ్రతికేను

                సంతృప్తి నిచ్చె సంసారమంత

సెంటు భూమియు లేని చెప్పుకొనగనైన

                సృష్టి జేసెను కదా కష్టపడుచు.


తే.గీ.

బిడ్డ లందరి పెళ్ళిళ్ళు పెద్ద జేసి

కళ్ల నిండుగ చూసెను కమ్మనైన

కష్ట జీవికి దక్కిన కానుకవగ

నాన్న కీర్తిని చాటెద కవనమందు






కామెంట్‌లు లేవు: