భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తదితరులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, న్యూఢిల్లీ వారు ఆదివారం, 18 మార్చి 2018 వతేదీన హైదరాబాదు లో గల స్వర్ణభారతి ట్రస్ట్ లో 'స్థానిక స్వపరిపాలన బలోపేతం' అనే అంశంపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు విచ్చేశారు. వీరితో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖామంత్రులు, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పి.జి. విద్యార్థులు సుమారు 41 మంది పాల్గొన్నారు. ఈ బృందానికి డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సమన్వయకర్త గావ్యహరించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రుల అధ్యక్షతన జరిగిన వివిధ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని స్థానికస్వపరిపాలన పటిష్టతకు వివిధ సూచనలు చేశారు. మూడంచెల స్థానిక స్వపరిపాలన సంస్థలు బలోపేతానికి ప్రజలు సక్రమంగా పెన్నులు చెల్లించడంలో పాటు, ఆ నిధులను మరలా ప్రజల సౌకర్యాలు పొందుతున్నారనే నమ్మకం ఏర్పడినప్పుడే స్థానిక స్వపరిపాలన సంస్థలు పటిష్టమవుతాయని హైదరాబాదు విశ్వవిద్యాలయం ప్రతినిధులు వివరించారు. ఈసమావేశంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, అధికారుల చర్చలు కొత్త ఆలోచనలకు తోడ్పడ్డాయని, విధానపరమైన నిర్ణయాల అమలులో గల సాధక బాధకాలు అవగాహనతో పరిశోధనలకు కొత్త ఆలోచనలు కలిగించాయన్నారు.
భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారితో, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటి బృందం
జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారితో, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటి బృందం
కేంద్రమంత్రి Union Ministers Shri Narendra Singh Tomar తో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తదితరులు
ఈ కార్యక్రమాన్ని 19 మార్చి 2018 వతేదీన రాజ్యసభ టీ.విలో ప్రసారం చేసిన స్నాప్ షాట్
సదస్సులో పాల్గొనడానికి వెళ్తూ...
విద్యార్థులు, పరిశోధకులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సదస్సుకి బయలు దేరేముందు ఉదయమే సరదాగా కొంతమందితో దిగిన ఫోటో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి