శిశువు శతకము
(దార్ల వెంకటేశ్వరరావు)
శ్రీనివాసుడితడు శిశువురూపమునొంది
సేవచేసుకొనగ చేరిరాగ
పాలుకలిపిపెడితిపద్యమొక్కొక్కటి!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (1)
పాలుకలిపిపెడితిపద్యమొక్కొక్కటి!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (1)
క్రొత్త వెలుగు తెచ్చి కోటికాంతులనివ్వ
చిమ్మచీకటంత చీలిపోవ
దివ్యముగనుఁజేసె దీపావళినిమాకు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (2)
అర్థరాత్రిలేదు అపరాత్రియనిలేదు
ఆటలాడుకొనుట అతడి హక్కు
కాచుకొనగవలయుకనుపాపవోలెరా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (3)
తనివి తీరదాయె తనయుల్నిముద్దాడ
ముద్దు తీరదాయె ముచ్చటించ
ముచ్చెటాగదాయె మురిపించుమాటలు
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (4)
మాటమాటకలిపి మరుమల్లెజల్లుల్ని
చిలకరించునయ్య చిన్నితండ్రి
మోడువారినయెద మొక్కమొలుచునయ్య!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (5)
కునుకుతీసిలేచి గుటకల్నివేయుచు
గొంతుతడుపమనియు గోచి తడిపి
కదలమెదలకుండు కపటకృష్ణుడతడు!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (6)
అమ్మనాన్నకన్న అమ్మమ్మ నాన్నమ్మ
ఎళ్ళవేళలందు యెంతచెలిమి
కంటిరెప్పవోలె కనిపెట్టమందురే
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (7)
అప్పుడప్పుడతడు ఆపడాయేడుపు
గుండెజల్లుమనగ గుబులుపెట్టి
అంతలోనె మరల ఆడుతూనవ్వించు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (8)
చిమ్మచీకటంత చీలిపోవ
దివ్యముగనుఁజేసె దీపావళినిమాకు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (2)
అర్థరాత్రిలేదు అపరాత్రియనిలేదు
ఆటలాడుకొనుట అతడి హక్కు
కాచుకొనగవలయుకనుపాపవోలెరా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (3)
తనివి తీరదాయె తనయుల్నిముద్దాడ
ముద్దు తీరదాయె ముచ్చటించ
ముచ్చెటాగదాయె మురిపించుమాటలు
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (4)
మాటమాటకలిపి మరుమల్లెజల్లుల్ని
చిలకరించునయ్య చిన్నితండ్రి
మోడువారినయెద మొక్కమొలుచునయ్య!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (5)
కునుకుతీసిలేచి గుటకల్నివేయుచు
గొంతుతడుపమనియు గోచి తడిపి
కదలమెదలకుండు కపటకృష్ణుడతడు!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (6)
అమ్మనాన్నకన్న అమ్మమ్మ నాన్నమ్మ
ఎళ్ళవేళలందు యెంతచెలిమి
కంటిరెప్పవోలె కనిపెట్టమందురే
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (7)
అప్పుడప్పుడతడు ఆపడాయేడుపు
గుండెజల్లుమనగ గుబులుపెట్టి
అంతలోనె మరల ఆడుతూనవ్వించు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (8)
ఉంగ ఉంగ యనుచు బుంగమూతినిపెట్ట
ఊగిఊగి ఒళ్ళు ఊయలౌను
ఒళ్ళుదింపెనేని కళ్ళువరదలౌను
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (9)
ఒళ్ళుదింపెనేని కళ్ళువరదలౌను
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (9)
చెప్పకున్నగాని సేవలునందెడి
ఆజ్ఞయివ్వనట్టి రాజుయతఁడు
బాలుఁడైననేమి బలవంతుఁడతఁడౌను!
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (10)
ఆజ్ఞయివ్వనట్టి రాజుయతఁడు
బాలుఁడైననేమి బలవంతుఁడతఁడౌను!
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (10)
గోలగోల యని పగోళ్ళుపలుకుచుండు
మంగళంబనుచునుమనముపలుకు
ఎవ్వరేమనినను యేడ్పు శిశువు హక్కు!
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (11)
మంగళంబనుచునుమనముపలుకు
ఎవ్వరేమనినను యేడ్పు శిశువు హక్కు!
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (11)
కాళ్ళు విరుచుకొనిన కనులు మూసుకొనినా
కదలికెక్కువైన కదలకున్న
గుబులుగుబులుయనుచుగుండెజల్లు మనదా
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (12)
కదలికెక్కువైన కదలకున్న
గుబులుగుబులుయనుచుగుండెజల్లు మనదా
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (12)
వన్నెచిన్నెలన్ని వయసుకుమించునే
మెచ్చుకున్నమురియునొచ్చుకున్న
మోముచూడవలయునామురిపెంబులన్
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (13)
మెచ్చుకున్నమురియునొచ్చుకున్న
మోముచూడవలయునామురిపెంబులన్
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (13)
మెడను వాల్చినపుడుమెల్లగా చేతిని
పెట్టి నడుము కలిపి పట్టు కొనిన
జారిపోవుచుండుజాగ్రత్తపడవలె! !
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (14)
పెట్టి నడుము కలిపి పట్టు కొనిన
జారిపోవుచుండుజాగ్రత్తపడవలె! !
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (14)
చేపపిల్ల వోలె చెలరేగియేడ్వగా
పాటరానిగొంతు పాటపాడి
జోలపాటతోనుజోకొట్టునిజమురా
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (15)
జోలపాటతోనుజోకొట్టునిజమురా
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (15)
అమ్మకొట్టుననుచు ఆటలాడకనేడు
చెప్పినట్టు గాను చేతులెట్లు
కట్టు కొనును దొంగ కన్నయ్య చూడరా
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (16)
చెప్పినట్టు గాను చేతులెట్లు
కట్టు కొనును దొంగ కన్నయ్య చూడరా
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (16)
క్రొత్తవెలుగురేఖకోరితెచ్చునటుల
ఉదయభానుడేల ఊసులాడె
మనసువెలుగునేని మహినట్లుచేయులే
శిశువుచేష్టలేమి చిత్రమౌర! (17)
ఉదయభానుడేల ఊసులాడె
మనసువెలుగునేని మహినట్లుచేయులే
శిశువుచేష్టలేమి చిత్రమౌర! (17)
అమ్మకాళ్ళమీదహాయిగా పడుకున్న
కన్నతండ్రి నవ్వు కనుటకన్న
జన్మకేది తండ్రి జయగీతి పలుకగాన్!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (18)
స్నానమాడువేళ సయ్యాటలాడుచూ
ఊరికేలనుండు ఊసులాడు
అంతలోనె మరల గంతులేగంతులు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (19)
పురిటివాసనేమొ పుష్పపరిమళంబు
ఒకటి రెండు కలిపి ఒంటినంటి
పసుపుపూతవోలె పరిమళించుగదరా!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (20)
ఊగినిద్రపోవు ఊయల నిద్రయూ
నేలమీద నిద్ర గోల గోల
బొజ్జ మీద నిద్రె భోగకరంబురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (21)
నేలమీదనిదురనేనుబోననువార్కి
పట్టెమంచమున్న పరుపులున్న
నేలమీదపడక పూలపాన్పాయెరా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (22)
వెలితితొలిగిపోవు వెచ్చని స్పర్శనూ
చీకటి తొలిగించు సిరులనవ్వు
మూటకట్టుకొచ్చె ముద్దులబిడ్డడు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (23)
స్క్రీ నుమీదనువ్వు చిరునవ్వు చిందినా
గుండెమీదనీదు కుమ్ముడేది?
మనిషినంపినావు మనసేమొ నీదాయె!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! ! (24)
మాటలాడునపుడు ఆటలాడునపుడు
స్వచ్ఛమైన నవ్వు స్వాగతించు
ఆటలాడుచుండు పాటపాడుచునుండు
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(25)
తెల్లవారగట్ల యెల్లరనువెతికి
బొజ్జమీదకెక్కుసజ్జనుండు
మననునిద్రలేపిమంచిగానిద్రించు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (26)
ప్రాకుచున్నవేళ పట్టతరముకాదు
అలలవోలెవచ్చుకలవరంబు
కదిలిమెదులువేళ కనిపెట్టవలయురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (27)
ఆటలాడుచుండు పాటపాడుచునుండు
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(25)
తెల్లవారగట్ల యెల్లరనువెతికి
బొజ్జమీదకెక్కుసజ్జనుండు
మననునిద్రలేపిమంచిగానిద్రించు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (26)
ప్రాకుచున్నవేళ పట్టతరముకాదు
అలలవోలెవచ్చుకలవరంబు
కదిలిమెదులువేళ కనిపెట్టవలయురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (27)
పట్టుతప్పి పడిన ప్రాణంబువిలవిల
అంతలోనెమరలవింతనవ్వు
తప్పుచేసినట్టు తలదించుకొందుమే
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (28)
బోర్లపడుచునుండ బోసినవ్వులురువ్వ
కదలబుద్ధికాదు, వదలబుద్ధి
కాదు కాలమట్లె కరిగిపోయేనురా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (29)
అంతలోనెమరలవింతనవ్వు
తప్పుచేసినట్టు తలదించుకొందుమే
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (28)
బోర్లపడుచునుండ బోసినవ్వులురువ్వ
కదలబుద్ధికాదు, వదలబుద్ధి
కాదు కాలమట్లె కరిగిపోయేనురా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (29)
కసురుకున్నగాని విసురుకున్ననుగాని
మలినరహితులగుచు మసులుచుండు
నిత్యసత్యశీల నిర్మలవదనంబు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (30)
చింతతెలియదేమి చిత్రవిచిత్రము
చిన్నినాన్నకురుయు సిరుల నవ్వు
బోసినవ్వులేక బోసిపోయెగృహంబు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (31)
చిన్నినాన్నకురుయు సిరుల నవ్వు
బోసినవ్వులేక బోసిపోయెగృహంబు
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (31)
నోటకరుచునన్ని మాటవినడువీడు
పాకివెళ్ళిపట్టు పామువోలె
కనులుగప్పినంత కనిపించకుండురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (32)
పాకివెళ్ళిపట్టు పామువోలె
కనులుగప్పినంత కనిపించకుండురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (32)
ఒంటికాలుమీద వరుసఫీట్లనుచేయు
ఓరచూపుచూచి కేరమనును
కొంటెపనులు చూచి కోతులే నవ్వవా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (33)
సీరియళ్ళనట్లె చిత్రంబుగాచూడ
గర్భమందువినిన కథలు మరల
కనులముందునేడుకదిలాడుచుండెనా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (34)
ఓరచూపుచూచి కేరమనును
కొంటెపనులు చూచి కోతులే నవ్వవా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (33)
సీరియళ్ళనట్లె చిత్రంబుగాచూడ
గర్భమందువినిన కథలు మరల
కనులముందునేడుకదిలాడుచుండెనా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (34)
అమ్మపాటకెంత ఆహ్లాదమొచ్చెనో
కూనిరాగమేమికూసినాడు
అంతకన్నమిన్న అమ్మయేమడుగురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (35)
కూనిరాగమేమికూసినాడు
అంతకన్నమిన్న అమ్మయేమడుగురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (35)
బాధ చెప్పలేక బావురుమనుచుండ
గుండెకోతకోసి గుబులు కలుగు
ఉంగ ఉంగ యనెడి బుంగమూతేదిరా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (36)
కిలకిలమనికులుకు కిట్టిగాడికనుల
జాలిచూపు గుండె జల్లుమనగ
ధీరులైనగాని వీరులైవెలుగునా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (37)
గుండెకోతకోసి గుబులు కలుగు
ఉంగ ఉంగ యనెడి బుంగమూతేదిరా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (36)
కిలకిలమనికులుకు కిట్టిగాడికనుల
జాలిచూపు గుండె జల్లుమనగ
ధీరులైనగాని వీరులైవెలుగునా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (37)
బొజ్జమీదవాలి బోలుడన్నికబుర్లు
చెప్పునపుడువినకనొప్పుకొనడు
ఆలకించవలయునర్థమేలవినరా!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (38)
చెప్పునపుడువినకనొప్పుకొనడు
ఆలకించవలయునర్థమేలవినరా!
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (38)
మంచమున్నగాని మసులుచునటుయిటు
కదులుచుండనతడుమెదులుచుండ
నాన్నబొజ్జయేను నానీకిహాయిరా !
శిశువు చేష్టలేమి చిత్రమౌర! ! (39)
కదులుచుండనతడుమెదులుచుండ
నాన్నబొజ్జయేను నానీకిహాయిరా !
శిశువు చేష్టలేమి చిత్రమౌర! ! (39)
బోర్లపడుచునుండ బోసినవ్వులురువ్వ
కదలబుద్ధికాదు, వదలబుద్ధి
కాదు కాలమట్లె కరిగిపోయేనురా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (40)
కదలబుద్ధికాదు, వదలబుద్ధి
కాదు కాలమట్లె కరిగిపోయేనురా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (40)
కదులుచున్నచూచి కాళ్ళకడ్డుపడగ
కదల లేవు నువ్వు మెదల లేవు
చిన్ని నాన్న కొక్క చిరునవ్వునివ్వరా!
కదల లేవు నువ్వు మెదల లేవు
చిన్ని నాన్న కొక్క చిరునవ్వునివ్వరా!
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (41)
రెప్పవాల్చినంతసప్పుడులేకుండ
మాయమౌనుమనని మాయచేసి
గుండె జల్లు మనగ కూర్చుండునెక్కడో
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (42)
చిన్ని తండ్రి వేయు చిట్టడుగులు చూచి
భూమితల్లిమేనె పులకరించ
తల్లిదండ్రులెంత తన్మయులగుదురో
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర! (43)
చిన్ని తండ్రి నవ్వు సిరులు కురియుచుండ
చిన్ని నాన్న నడక సిరులు పంచి
చిన్ని క్రిష్ణుడగుచు చిత్తమంతయునిండు
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (44)
రెప్పవాల్చినంతసప్పుడులేకుండ
మాయమౌనుమనని మాయచేసి
గుండె జల్లు మనగ కూర్చుండునెక్కడో
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (42)
చిన్ని తండ్రి వేయు చిట్టడుగులు చూచి
భూమితల్లిమేనె పులకరించ
తల్లిదండ్రులెంత తన్మయులగుదురో
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర! (43)
చిన్ని తండ్రి నవ్వు సిరులు కురియుచుండ
చిన్ని నాన్న నడక సిరులు పంచి
చిన్ని క్రిష్ణుడగుచు చిత్తమంతయునిండు
శిశువు చేష్ట లేమి చిత్రమౌర! (44)
ఫోజులిచ్చునితడు ఫోటోలుతీసిన
పిల్లవాడెగాని పిడుగు వీడు
కన్నవాళ్ళకింకకావలసిందేమి?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (45)
పిల్లవాడెగాని పిడుగు వీడు
కన్నవాళ్ళకింకకావలసిందేమి?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (45)
దేనినైననతడు తేలికగాపొందు
ఒక్కనవ్వురువ్వి ఒత్తిగిల్లు
ఎట్లు తెలిసెనయ్య ఏడ్చిసాధించుట?
శిశువు చేష్ట లేమి చిత్రమౌర ! (46)
ఒక్కనవ్వురువ్వి ఒత్తిగిల్లు
ఎట్లు తెలిసెనయ్య ఏడ్చిసాధించుట?
శిశువు చేష్ట లేమి చిత్రమౌర ! (46)
అందనంతదూరమద్భుతమేమాయె
వినగవచ్చు మనముకనగవచ్చు
ఏమియెరుగనట్లు యెక్కిరించగవచ్చు
శిశువు చేష్టలేమి చిత్రమౌర ! (47)
వినగవచ్చు మనముకనగవచ్చు
ఏమియెరుగనట్లు యెక్కిరించగవచ్చు
శిశువు చేష్టలేమి చిత్రమౌర ! (47)
శిశువు శతకం 2026
వాన విల్లు జూచి వాంచగా నెగయును
కన్నె నింగి బుజ్జి కళ్ళ తోడ
నవ్వు పువ్వు నందు నవ్యమై వెలుగురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (48)
పాలు ద్రావ ననుచు పరుగును దీయుచు
తల్లి పిలువ గంగ తరలి పోవు
ఆట లాడు నపుడు అలసట వచ్చునా?
శిశువు చేష్టలేమి చిత్రమౌర! (49)
కాలి గజ్జె మోత కలిగించు నుత్సాహ
మట్టి లోన బొర్లి మైమ ఱచును
దొంగ నిద్ర తోడ దొరలాగ శయనించు
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(50)
కంట నీరు బెట్టు కారణ మొకటేమి?
నవ్వు లోన మర్మ నవక మున్న
విశ్వ మంత నిండు వింతైన మాయరా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(51)
వాని చిన్ని నవ్వె వసుధకు వన్నెరా
కన్నె నింగి బుజ్జి కళ్ళ తోడ
విశ్వ మంత నిండు వింతైన విజ్ఞాని
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(52)
దొంగ నిద్ర తోడ దొరలాగ నటియించు
తల్లి కంట పడగ తప్పు కొనెడు
చిన్ని బువ్వ తినియు చిందులు వేయురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(53)
కాలి గజ్జె మ్రోత కలిగించు కౌతుక
మడుగు లేయు నపుడు అలరు చుండు
కన్న వారి కంట కైలాస మగునురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(54)
ముద్దు లొలుకు మోము ముదమును గూర్చురా
కన్నె నింగి బుజ్జి కళ్ళ తోడ
విశ్వ మంత నిండు వింతైన విజ్ఞాని
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(55)
మెరుపు తీగ లాగ మెరవగా జూచును
కారు మేఘ మందు కాంతి జూచి
వాన చినుకు లాగ వసుధపై రాలురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(56)
కంట నీరు బెట్టు కారణ మొకటేమి?
నవ్వు లోన మర్మ నవక మున్న
తల్లి ప్రేమ కెదురు తరలియే వచ్చురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(57)
చిన్ని దొంగ వాడు చిక్కడు ఎవరికీ
వెన్న ముద్ద తిన్న విభుడు లాగ
అల్ల రినిట సేయ అలసట నొందునా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(58)
కంట నీరు బెట్టు కారణ మొకటేమి?
నవ్వు లోన మర్మ నవక మున్న
విశ్వ మంత నిండు వింతైన మాయావి
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(59)
చిన్ని వెన్న ముద్ద చిక్కగా దొంగలా
చంక నెత్తు కొన్న సామి వాడు
తల్లి నవ్వ జూచి తానును నవ్వురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(60)
కాలి గజ్జె మ్రోత కాంక్షను బెంచగా
ముద్దు ముద్దు మాట ముదము బెంచు
అడుగు వేయు నపుడు అబ్బుర మొప్పురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(61)
ఏడు పందు నవ్వు ఏకము జేయుచూ
వింత మాయ లల్లి విభుడు లాగ
అమ్మ యొడిని జేర అమృతమై తోచురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(62)
పాకు లాడు నట్టి బంగారు రూపము
మురికి లోన బొర్లి ముదము జెందు
వసుధ పైన దిగిన వామను డతడురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(63)
మెరుపు తీగ జూచి మెల్లగ నవ్వుచూ
కారు మేఘ మందు కాంతి జూచి
మింటి చంద మామ మిగులగా బిలుచురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(64)
కాలి వేలు నోట కాచును నమలుచు
వింత మాయ లల్లి విభుడు లాగ
బోర్ల బడెడు నపుడు పుడమియే వంగురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(65)
గోడ పట్టు కొనియు గోముగ నిలుచుచూ
కొండ నెత్తినట్టి కోల లాగ
అడుగు వేయ జూచి అబ్బుర మొప్పురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(66)
పిలవ కుండ నతడు పిలుపును వినుచుండు
చిన్ని మాట లాడి చిందు వేయు
తండ్రి జేర వాడు తరలుచూ పోవురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(67)
బొమ్మ లన్ని జేర్చి బొమ్మలా టాడుచు
రాజ్య మేలు నట్టి రాజు లాగ
మట్టి తోడ బొమ్మ మలచుచు నుండురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(68)
కాలి గజ్జె మ్రోత కలిగించి నవ్వుచు
అడుగు వేయు నపుడు అలరు చుండు
కన్న వారి కంట కళలనే దేరురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(69)
పాచి పండ్లు జూపి పరవశ మందుచు
నవ్వు రువ్వ నపుడు నవ్య మగుచు
అద్ద మందు దన్ను అరయుచు నుండురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(70)
ముక్కు కొనను వేలు ముదముగా బూనుచు
పలుకు నేర్చు నపుడు పరుల జూచి
చిన్ని మువ్వ లాగ చిందులు వేయురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(71)
వెన్న ముద్ద కొరకు వెదకుచున్ జూచుచు
కన్నె నింగి బుజ్జి కళ్ళ తోడ
చిన్న కృష్ణ డతడు చేరగా వచ్చురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(72)
పలుకు లందు తేనె పలకగా నుండుచు
ముద్దు ముద్దు మాట ముచ్చటగును
వింత లయలు వేసి వేడుక జేయురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(73)
గుమ్మ మందు నిలిచి గువ్వను జూచుచు
మింటి వంక జూచి మెరపు నవ్వు
అమ్మ నొడిని జేర అమృతమై తోచురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(74)
మెతుకు విసిరి వేసి మెల్లగా నవ్వుచు
తల్లి తిట్ట జూచి తప్పు కొనెడు
వింత చేష్ట లల్లి వేడుక జేయురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(75)
కంట నీరు బెట్ట కారణ మేలరా
నవ్వు లోన మర్మ నవక మున్న
విశ్వ మంత నిండు వింతైన మాయలే
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(76)
పుస్త కమును బట్టి పుటలను చించుచు
చదువు చదువు నంచు సన్న జేయు
అక్ష రముల పైన అందము నిచ్చురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(77)
చక్క నైన గిన్నె చప్పుడు జేయుచు
తాళ మన్న రీతి తట్టు చుండు
అమ్మ కంట పడగ అబ్బుర మొప్పురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(78)
నీటి గుంట జూచి నిలకడ లేకయే
కాళ్ళ తోడ కొట్టి కథల చెప్పు
అడుగు వేయు నపుడు అలరించు చుండురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(79)
దీప మనుచు జూచి దేవుని ప్రేమగా
ముద్దు పెట్టి చేతు లెత్తు చుండు
అమ్మ జూడ నతడు అబ్బుర మౌనురా
శిశువు చేష్టలేమి చిత్రమౌర!(80)
గోడ పైన బొమ్మ గోముగా గీయుచు
రంగు లద్ది మురిసి రంజి లనగ
అమ్మ జూడ నపుడు అలరియే నవ్వురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(81)
చెప్పు లొదులు నయిన చెప్పక దొడిగియు
తండ్రి లాగ నడువ తంట లాడు
అడుగు వేయ జూచి అబ్బుర మొప్పురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(82)
బువ్వ గిన్నె లోన బుంగగా వ్రేళ్ళను
ముంచి తీసి తలను మురిసి నలుపు
అమ్మ తిట్ట నపుడు అలరియే నవ్వురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(83)
నీటి తొట్టి జూచి నిలకడ లేకయే
బట్ట లన్ని తడిపి బహుగ నవ్వు
అమ్మ చేర నతడు అలరియే వచ్చురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(84)
పిల్లి జూచి వాడు పిలిచిన టులనుచూ
మ్యావు మంచు నపుడు మ్యావు ననెడు
అమ్మ కంట పడగ అబ్బుర మౌనురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(85)
బువ్వ గిన్నె బట్టి బువ్వని వడ్డించు
తల్లి లాగ తలచి తానొ సంగు
అమ్మ కడుపు నిండ అలరియే వడ్డింప
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(86)
వంట శాల జొచ్చి వడ్డింప జూచుచు
గరిటె తిప్పి తాను గర్వ మందు
అమ్మ లాగ తాను అన్నమ్ము పెట్టురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(87)
తండ్రి లాగ తాను తలనూపు చుండుచూ
పేప రందు పైన పేరు వెదకు
అక్ష రముల పైన అబ్బుర మొప్పురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(88)
ఫోను బట్టి చెవిని ఫోనులో మాట్లాడు
తండ్రి లాగ మాట తరలి వచ్చు
అమ్మ జూడ నపుడు అబ్బుర మౌనురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(89)
చెప్పు లొదులు నయిన చెప్పక దొడిగియు
తండ్రి లాగ నడవ తంట లాడు
అడుగు వేయ జూచి అలరియే నవ్వురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(90)
అమ్మ పూజ సేయ అడుగులు వేయుచు
కనుల మూసి తాను కరుణ తోడ
దేవు డతడు దిగియె దేవత లేలరా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(91)
అన్న ముంచ జూచి అమ్మను దినమనె
తండ్రి చెంత కేగి తానొ సంగు
ముద్దు ముద్దు మాట ముదముగా జేయురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(92)
అమ్మ లాగ తాను అలిగియే తిట్టును
కనుల నెర్ర జేసి కసరి నట్లు
అల్ల రినిట సేయ అలరియే నవ్వురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(93)
తండ్రి తిట్ట జూచి తంటగా నలిగియు
అమ్మ చెంత కేగి అరయు చుండు
బువ్వ తినను పొమ్మ బుంగగా మౌనురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(94)
అద్ద మెదుట నిలిచి అమ్మలా దువ్వుచున్
కురుల చిక్కు తీయ కుదురు గాను
మురిసి పోవు నపుడు ముదముగా నవ్వురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(95)
తండ్రి కళ్ళ జోడు తంటగా దొడిగియు
చదువ జూచు తాను చదువు నపుడు
వింత లొలుకు చుండ వేడుక జేయురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(96)
అమ్మ వంట జేయ అలరియే వచ్చియు
చేయి గలిపి తాను చేయు నపుడు
పిండి ముద్ద తోడ పిలుపుగా నుండురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(97)
తండ్రి బండి నెక్క తంటగా జేయుచు
ముందు కూరు చుండి ముదము జెందు
దారి జూపు నతడు ధన్యము సేయురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(98)
అమ్మ తిట్ట జూచి అలిగియే కూర్చుని
బువ్వ తినను పొమ్మ బుంగ మూతి
నేల పైన బొర్లి నేడుగా నేడ్చురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(99)
తండ్రి రాక జూచి తంటగా నక్కుచున్
వాకి లందు నిలిచి వాడి గనెడు
నాన్న జేర నపుడు నవ్వుచున్ దూకురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(100)
అమ్మ నిద్ర బోవ అడుగులు వేయుచున్
మెల్ల మెల్ల నడువ మెలకు వగును
కనుల విప్పి జూడ కళలునే దేరురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(101)
పాలు ద్రావ ననుచు పరుగున బోవుచున్
తల్లి పిలువ నపుడు తప్పు కొనెడు
ఆట లాడు నపుడు అలసట బొందురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(102)
తండ్రి వోలె తాను తగుదుననియువచ్చి
కారు నడుపు నట్లు కదల జూచు
వింత లయలు వేసి వేడుక జేయురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(103)
అమ్మ పాడు నపుడు అలరియే నాడుచున్
మువ్వ సవ్వ డవగ ముదము జెందు
తాళ మనుచు జేతి తట్టుచు నుండురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(104)
పెద్ద నైతి నపుడు పెద్దగా కారును
కొనియు నిత్తు ననుచు కొమరు డనగ
తండ్రి జూచి నపుడు తరలియే నవ్వురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(105)
అన్ని కొనియు నిత్తు అమ్మకు నాన్నకు
విశ్వ మంత జూపు వినతి తోడ
కన్న వారి కంట కళలనే దేరురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(106)
సొమ్ము లన్ని తెచ్చి సొగసుగా నమ్మకు
పెట్టె నిండ నిత్తు పెద్ద నగుచు
అమ్మ జూడ నపుడు అబ్బుర మౌనురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!.(107)
ఇల్లు గట్టి నిత్తు ఇలనునే గెలుచుచు
రాజు లాగ తాను రాజ్య మేలు
ముద్దు మాట లాడ ముదముగా నుండురా
శిశువు చేష్ట లేమి చిత్ర మౌర!(108)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి