సాహితీ రంగంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్న విశిష్ట సేవలకుగాను విశాల సాహిత్య అకాడమీ 2019వ సంవత్సరం బి.ఎస్.రాములు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతున్న 'బి.ఎస్.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం' కార్యక్రమంలో గురువారం తెలంగాణ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, ఉత్సవసంఘం నిర్వాహకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా.పత్తిపాక మోహన్, సదస్సు సంచాలకులు డా.నిదానకవి నీరజ తదితరులంతా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటీ లో తెలుగు ప్రొఫెసర్ గాను, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుమారు 16 గ్రంథాలను రాశారు. ప్రముఖ పత్రికల్లో ఆయన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తున్నారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల నుండి అనేక పురస్కారాలను అందుకున్న వార్లకు ప్రతిభా పురస్కారం రావడం పట్ల సహ అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)
గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సాహిత్య రంగంలో చేస్తున్న విశిష్టసేవలకుగాను హెచ్‌సీయూ తెలుగు ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు ‘బి.ఎస్.రాములు ప్రతిభా పురస్కారం 2019’ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో గురువారం నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన బి.ఎస్.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం కార్యక్రమంలో బీసీ కమిషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా.పత్తిపాక మోహన్, డా.నిదానకవి నీరజ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హెచ్‌సీయూలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 16 గ్రంథాలను రాయడంతోపాటు ప్రముఖ పత్రికల్లో ఆయన రాసిన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి