"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

పత్రికలు దార్ల (విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పత్రికలు దార్ల (విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23 ఆగస్టు, 2019

ఆచార్య దార్లకు ప్రతిభా పురస్కారం



సాహితీ రంగంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్న విశిష్ట సేవలకుగాను విశాల సాహిత్య అకాడమీ 2019వ సంవత్సరం  బి.ఎస్.రాములు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతున్న 'బి.ఎస్.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం' కార్యక్రమంలో గురువారం తెలంగాణ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, ఉత్సవసంఘం నిర్వాహకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా.పత్తిపాక మోహన్, సదస్సు సంచాలకులు డా.నిదానకవి నీరజ తదితరులంతా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు.  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటీ లో తెలుగు ప్రొఫెసర్ గాను, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సుమారు 16 గ్రంథాలను రాశారు. ప్రముఖ పత్రికల్లో ఆయన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తున్నారు.  ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల నుండి అనేక పురస్కారాలను అందుకున్న వార్లకు ప్రతిభా పురస్కారం రావడం పట్ల సహ అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.



                                     (నమస్తే తెలంగాణ దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)


గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సాహిత్య రంగంలో చేస్తున్న విశిష్టసేవలకుగాను హెచ్‌సీయూ తెలుగు ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు ‘బి.ఎస్‌.రాములు ప్రతిభా పురస్కారం 2019’ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో గురువారం నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన బి.ఎస్‌.రాములు సాహిత్య సమాలోచన-సప్తాహ మహోత్సవం కార్యక్రమంలో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బి.ఎస్‌.రాములు, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సంపాదకులు డా.పత్తిపాక మోహన్‌, డా.నిదానకవి నీరజ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హెచ్‌సీయూలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డీన్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 16 గ్రంథాలను రాయడంతోపాటు ప్రముఖ పత్రికల్లో ఆయన రాసిన కవిత్వం, పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.
(ఈనాడు దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)

(సాక్షి దినపత్రిక, 23 ఆగస్టు 2018 సౌజన్యంతో...)

28 ఏప్రిల్, 2019

పరీక్షలు -లక్ష్యాలు

ఈనాడు సౌజన్యంతో...
పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలనుకోవడం ప్రతి విద్యార్ధికీ ఉండవలసిన ప్రధాన లక్ష్యం. కానీ కొన్ని సార్లు చిన్న చిన్న తేడాతో కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని బాధ పడుతుండటం సహజం. నేను  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ)లోనే ఎం.ఏ. చేశాను. ఒక్క మార్కుతో గోల్డ్ మెడల్ కోల్పోయాను. చాలా నిరుత్సాహానికి గురైయ్యాను. కానీ, ఎం.ఫిల్, పిహెచ్.డి. కూడా ఇదే యూనివర్సిటీలో చేశాను. ఇప్పుడు ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. పాఠాలు చెప్పిన ప్రొఫెసర్స్ తో కలిసి పనిచేస్తున్నాను.  ఆనాడు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్ధి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. అందువల్ల ఒక పరీక్ష తప్పాడు వల్లనో, ఒక లక్ష్యాన్ని సాధించలేకపోవడం వల్లనో ఇక దేనికీ పనికి రాననుకోకూడదు. ఇక దేన్నీ సాధించలేననుకోకూడదు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొంతమందికి తమ ఫలితాల్లో వ్యత్యాసాలు కనిపిస్తే, మరలా రీవెరిఫికేషన్ చేయించుకోవాలి.  ఇంకా అనుమానం ఉంటే మొత్తం పరీక్ష పత్రాల్నే నకలు చేసి తీసుకోవాలి. ఆ అవకాశాలన్నీ ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు కల్పిస్తుంది కదా! కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు తార్మారయ్యే లేదా కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సమస్యను నేను స్వయంగా ఎదుర్కొన్నాను. బి.ఏ. ఫలితాలు విడుదల చేస్తే, పత్రికల్లో నా నెంబరు లేదు. అందరూ ఫెయిల్ అయిపోయావన్నారు. ఆ ఫలితాలు విడుదల చేసినప్పుడు నేను ఆంధ్రా యూనివర్సిటీలోనే ఉన్నాను. సెంట్రల్ యూనివర్సిటీ ఎం.ఏ. ఎంట్రన్స్ రాయడానికి అక్కడకు వెళ్ళాను. పరీక్షలు నియంత్రణాధికారి కార్యాలయంలో వాకబు చేశాను. నేను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడునవ్వటమేకాదు, నా సబ్జెక్టులో విశ్వవిద్యాలయ సర్వప్రథముడు (యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్) వచ్చిందని తెలిసింది. పత్రికల్లో కనపడినప్పుడు నేనూ ఆందోళనకు గురైన మాట నిజమే. కానీ, ఆందోళనను ఆత్మహత్య వైపు మళ్ళించకుండా, ఆలోచన వైపు మళ్ళించాను. తర్వాత అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఫోటోతో సహా వార్తలు  ప్రచురించారు. ఫెయిల్ అయ్యావన్నవాళ్ళే మనస్ఫూర్తిగా అభినందించారు. అందుకే పరీక్షల ఫలితాలు సమయంలో
 ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

 - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు ఫ్రొఫెసర్ & డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.

17 ఏప్రిల్, 2019

“నవ్యత్వమే పరిశోధనలకు నిజమైన ప్రమాణం” -ఆచార్య పొదిలి అప్పారావుగారు

“నవ్యత్వమే పరిశోధనలకు నిజమైన ప్రమాణం”
ముఖ్య అతిథి గా మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు , వేదికపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి, ఆచార్య పులికొండ సుబ్బాచారి, పొట్లూరి హరికృష్ణ, డా॥ ఆవుల మంజులత తదితరులున్నారు.

పరిశోధనల్లో నవ్యత్వం క్షేత్ర పరిశీలన, ప్రయోగాలు, అన్వేషణలవల్లనే సాధ్యమవుతుందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు వ్యాఖ్యానించారు.  హెచ్.సి.యు. మానవీయశాస్త్రాల విభాగం, జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న “జానపద విజ్ఞానం – అధ్యయన ఆవశ్యకత” అనే అంశంపై మంగళవారం జరిగిన ఒక రోజు జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెచ్.సి.యు. దేశ వ్యాప్తంగా నాల్గవ ర్యాంకు రావడానికి విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు మరియు గత పరిశోధకుల సమిష్టి కృషి ఎంతో ఉందన్నారు.  దేశంలో ముందుచూపుతో పరిశోధనలు జరగాలనీ, అలాంటి ముందుచూపు కొత్త విజ్ఞానాన్ని ఇస్తుందని, దీనికి ఇలాంటి జాతీయ సదస్సులు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. 
ఈనాడు దిపత్రికసౌజన్యంతో.... క్లిప్లింగ్ 

ప్రారంభోత్సవ సభలో అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ డీన్ ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిగారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సమకాలీన జానపద విజ్ఞానానికి సంబంధించిన అనేక పరిశోధనల పట్ల అవగాహనకు ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. 


సాక్షి పత్రిక సౌజన్యంతో.... క్లిప్లింగ్ 

వేదికపై ముఖ్య అతిథి గా పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు , ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి, ఆచార్య పులికొండ సుబ్బాచారి, పొట్లూరి హరికృష్ణ, డా॥ ఆవుల మంజులత, డా.డి.విజయలక్ష్మి తదితరులున్నారు.
జానపద కళలు మరియు సాంస్కృతిక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ పొట్లూరి హరికృష్ణగారు ఈ జాతీయ సదస్సును ప్రారంభించారు. రాష్ట్రాలు వేరైనా, దేశంలో ఎక్కడున్న ఎటువంటి పరిశోధనలపైన కూడా తమ సంస్థ సహకారాన్ని అందిస్తుందని, దానిలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని శ్రీ పొట్లూరి హరికృష్ణ అన్నారు.  జానపద కళల పరిణామాన్ని తెలిపే మ్యూజియమును అమరావతిలో త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 


ఆచార్య అప్పారావు పొదిలె, వైస్ ఛాన్సలర్ గార్ని సత్కరిస్తున్న డా. ఆవుల మంజులత తదితరులు 

నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో క్లిప్పింగ్

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధక్ష్యులు డా॥ ఆవుల మంజులతగారు మాట్లాడుతూ జానపదానికీ, పేదరికానికీ, భాషకీ, పేదరికానికీ అవినాభావ సంబంధం ఉందన్నారు.  తెలుగు భాష వల్ల 87% మానవవనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని పరిశోధనలు తెలియజేశాయన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రక్రియను ప్రశంసించారు.  త్వరలో మరొక సదస్సుకి తాను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ఈ సదస్సులో ప్రకటించారు. 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని అభినందిస్తున్న ఆచార్య అప్పారావు, పొదిలె తదితరులు

సదస్సులో కీలకోపాన్యాసం చేసిన ఆచార్య పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ జానపద విజ్ఞానంలో జరుగుతున్న పరిశోధనల తీరుతెన్నుల్ని విశ్లేషించి, భారతీయులు, పాశ్చాత్యుల కృషిని విశ్లేషించారు. జానపద విజ్ఞానంలో పరిశోధనలు చేయడానికి గల అనేక పార్శ్వాలను వివరించారు. 
వార్త దిన పత్రిక సౌజన్యంతో క్లిప్పంగ్.

సదస్సుల లక్ష్యాలను కో-ఆర్డినేటర్ ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు వివరించగా, కో-కోఆర్డినేటర్ డా॥ డి. విజయలక్ష్మిగారు వందన సమర్పణ చేశారు.  సదస్సులో వివిధ విశ్వవిద్యాలయ పరిశోధకులు, తెలుగు శాఖ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిలో సుమారు 16 పరిశోధన పత్రాలు సమర్పించారు.


భూమిపుత్ర తెలుగు దిననపత్రిక, అనంతపురం వారి( E-mail: bhumiputra.net@gmail.com) సౌజన్యంతో

సదస్పులో పాల్గొన్న పరిశోధకులు, విద్యార్థులు

ఈ సదస్సులో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య గోనానాయక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్,  ఆచార్య అప్పల్నాయుడు, ఆచార్య వి.కష్ణ, ఆచార్య సర్రాజు, డా. భుజంగరెడ్డి, డా.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




01 అక్టోబర్, 2018

‘ముసిబాస’ ఆవిష్కరణ వార్తలు ( 1 అక్టోబరు 2018)

డా.జి.వి.రత్నాకర్ 'ముసిబాస' గురించి 30-10-2018 వ తేదీన శ్రీ త్యాగరాయ గాన సభ, హైదరాబాద్ లో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సభలో గోరేటి వెంకన్న, డా.కె.శివారెడ్డి, డా.జి.వి.రత్నాకర్ తదితరులు ఉన్నారు...

ఆంధ్రజ్యోతి, 1 అక్టోబరు 2018, హైదరాబాదు టాబ్లాయిడ్
ఆంధ్రప్రభ, 1 అక్టోబరు 2018, హైదరాబాదు టాబ్లాయిడ్



సాక్షి, 1 అక్టోబరు 2018, హైదరాబాదు టాబ్లాయిడ్

నమస్తేతెలంగాణ, 1 అక్టోబరు 2018, హైదరాబాదు టాబ్లాయిడ్

ప్రత్యేక అతిథిగా పాల్గొని, ముసిబాస గురించి మాట్లాడిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగార్ని సన్మానిస్తున్న డా.కె.శివారెడ్డి, గోరేటి వెంకన్న, డా.జి.వి.రత్నాకర్, వెలమకన్నిరమణ, విద్యాధరరావు, దాసువెంకటదాసు తదితరులు 

కవిసమ్మేళనంలో పాల్గొన్న సాధనాల వెంకటస్వామినాయుడిగార్ని సన్మానిస్తున్న డా.కె.శివారెడ్డి తదితరులు

ఈ సందర్భంగా జైభీమ్ పత్రిక ఆవిష్కరిస్తున్న సాహితీవేత్తలు


సాధనాల వెంకటస్వామినాయుడు గారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు




27 సెప్టెంబర్, 2018

హెచ్ సియులో సివిల్స్ శిక్షణా తరగతులు ప్రారంభం.

హెచ్ సియులో సివిల్స్ శిక్షణా తరగతులు ప్రారంభం.   (26.9.2018)

తమకు తెలిసిన భాషలో సివిల్ సర్వీసెస్ లో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందనీ, దీన్ని సద్వినియోగం చేసుకొని ఆసక్తి గల అన్ని వర్గాల వారూ విజయం సాధించవచ్చునని మాజీ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్. ఉమాపతి అన్నారు. బుధవారం సాయంత్రం హెచ్ సియులో యూజిసి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షల ప్రత్యేక శిక్షణా తరగతులను  ప్రారంభ సమావేశానికి ఉమాపతి ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. సివిల్స్ కు సిద్ధమయ్యే ఔత్సాహికులకు సిలబస్, పరీక్షలు రాసే విధానం, ఇంటర్వ్యూ కి సిద్ధమయ్యేటప్పుడు పాటించాల్సిన సూచనలను వివరించారు. తన ఉద్యోగానుభవాలతో అనేక సూచనలు చేశారు
 సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రొ. వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.ప్రకాశబాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం కల్పిస్తున్న అనేక అవకాశాల్లో పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఒకటనీ, ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోజువారీ తరగతులకు, పోటీ పరీక్షలకు వేర్వేరు బోధనా పద్ధతుల్లో పాఠ్యాంశాల్ని చెప్పాల్సి ఉంటుందని అందువలన పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తీసుకోవడం అత్యంత అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్ డాక్టర్ బి కృష్ణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం లక్ష్యాలను,  ఆశయాలను వివరించారు. అధికారికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ శిక్షణా తరగతులు ఉద్దేశించి నప్పటికీ, అనధికారికంగా ఆసక్తి కలిగిన అందరూ  హాజరుకావచ్చునని ఆయన వివరించారు. కార్యక్రమంలో దీక్ష ఐఏఎస్ స్టడీ సర్కిల్ కు చెందిన రామారావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.






21 ఏప్రిల్, 2018

ఉన్నత విద్యాశిఖరం...హెచ్ సీయూ ( ఆంధ్రజ్యోతి, 20 ఏప్రిల్ 2018)

నిన్న (20 ఏప్రిల్ 2018) ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పూర్తి పేజి, మెయిన్ ఎడిషన్ లో యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు గురించి విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని ప్రచురించారు. దానిలో నా అభిప్రాయాన్ని కూడా నా ఫోటోతో సహా ప్రచురించారు.థాంక్యూ ఆంధ్రజ్యోతి!