School of Humanities
Department of Telugu
M.A., Telugu (IV Semester)
New Course Syllabus: TL 529 INTRODUCTION TO TELUGU DIASPORA LITERATURE
(ప్రవాసాంధ్ర సాహిత్యం-పరిచయం)
Optional Course: 4 Credits
100 Marks (Internal 40 + Main 60)
కోర్సు లక్ష్యాలు:
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో అనేకయేళ్ళ పాటు గానీ, శాశ్వతంగా గాని నివసించేవాళ్లు, తాము పుట్టి పెరిగిన ప్రాంతం మారడం ద్వారా కలిగిన తమ జీవితానుభవాల్ని ఏదొక ప్రక్రియలో రాస్తే దాన్ని డయాస్పోరా సాహిత్యం అంటారు. ప్రాంతం అనేది గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విస్తృతమైన అవగాహనతో అవగాహన చేసుకోవాలి. కానీ, ప్రస్తుతం కేవలం ఒక దేశం నుండి మరొక దేశానికి రకరకాల కారణాల వల్ల వెళ్ళి అక్కడ నివసిస్తూ, తమ అనుభవాలను సృజనీకరించే సాహిత్యాన్ని డయాస్పోరా సాహిత్యంగా పిలుస్తున్నారు. ఈ రెండు కోణాల్నీ ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు.
ఈ కోర్సులో తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళినప్పుడు వారు ప్రత్యక్షంగా గమనించి రాసే సృజనాత్మక రచనను అధ్యయనం చేయడం ప్రధాన లక్ష్యం. దీనితో పాటు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల్లో వచ్చిన పరిణామాలను పరిశీలించడం. తెలుగు సాహిత్య వికాసంలో వస్తు, రూపవిశేషాలను శాస్త్రీయంగా సమీక్షించుకోవడం, తెలుగు ప్రజల చారిత్రక మూలాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు మొదలైన అంశాలను శాస్త్రీయంగా పరిశీలించడం ఈ పాఠ్యాంశ లక్ష్యాలు.
UNIT-I
డయాస్పోరా సాహిత్యం - వలసవాద సాహిత్యం –వలసాంధ్ర సాహిత్యం - ప్రాంతేతర ఆంధ్ర సాహిత్యం మొదలైన పర్యాయ పదాల సమీక్ష : డయాస్పోరా సాహిత్యం నిర్వచనం - లక్షణాలు
UNIT –II
పాశ్చాత్య నాగరికత-సంస్కృతి: భారతీయ విలువలు – తెలుగు వారి జీవన విధానం-ద్విపౌరుషత్వం- వైయక్తిక, వ్యవస్థీకృత సంఘర్షణలు- కుటుంబం-వివాహం- తెలుగు వారిగా తమ ఉనికి కోసం చేసే కార్యక్రమాలు - భాష, సాహిత్యం, కళలు - ప్రత్యేక సభలు, సమావేశాల నిర్వహణ-పండుగలు- మతాచారాలు- సాంస్కృతిక సమైక్యతా ప్రయత్నాలు- పుట్టి, పెరిగిన ప్రాంతాలపై మమకారం – సాస్టాల్జియా (Nostalgia)- వ్యాపారాభివృద్ధి-ఆర్థిక, రాజకీయ శక్తులుగా మారడం-విధాన నిర్ణయాలపై ప్రభావాన్ని వేయడం- స్వీయానుభవ సృజన సాహిత్య ప్రతిఫలనం.
భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో తెలుగు ప్రజల సాహిత్యం స్థితిగతుల ప్రతిఫలన డయాస్పోరా సాహిత్యం - ఇతర దేశాల్లో తెలుగు ప్రజల సాహిత్యం స్థితిగతుల ప్రతిఫలనం- విశ్వ సాహిత్యంలో తెలుగు స్థానం- మొదలైన అంశాల పరిచయం.
UNIT –III
పాఠ్య నిర్ణాయక గ్రంథాలు (Texts for Prescribed)
డయాస్పోరా నవలలు : 1. పడమటి కొండలు - రచయిత: డా. ఎస్. శంకరయ్య,
(శ్రీరామలక్ష్మి పబ్లికేషన్స్, హైదరాబాద్, ప్రథమ ప్రచురణ : జూన్ 2010)
డయాస్పోరా కవిత్వం: 1. వలసలు (సంగెవేని రవీంద్ర), 2. నాపేరు... (అఫ్సర్)
డయాస్పోరా కథలు :
పైచదువు (కేన్యా టు కేన్యా కథాసంపుటి) - ఆరి సీతారామయ్య,
అంటు-అత్తగారు – వేలూరి వెంకటేశ్వరరావు,
రంగు తోలు - నిడదవోలు మాలతి,
సంకట్ కాలమే బాహర్ జానే కా మార్గ్ -వంగూరి చిట్టెన్ రాజు,
పండగ- నోరి రాధిక,
ఛోటీ దునియా (కథ)– అఫ్సర్,
హోమ్ రన్ – కల్పనా రెంటాల,
శ్రీకారం - అంబల్ల జనార్ధన్,
UNIT –IV
తెలుగు డయాస్పోరాసంస్థలు, పత్రికలలో సాహిత్యాంశాల పరిచయం
సంస్థలు: TANA( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రత్యేక సంచికలు
ATA (అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రత్యేక సంచికలు
డయాస్పోరా రచయితలు: పరిచయం , అంతర్జాలంలో తెలుగుభాషా సాహిత్యాలు
చదువుకోవాల్సిన గ్రంథాలు/రచనలు:
1. నా భావనలో డయాస్పోరా (వ్యాసం), వేలూరి వేంకటేశ్వరరావు, ఈ మాట మాసపత్రిక, ( అంతర్జాల పత్రిక), నవంబరు, 2002.
2. వలస రచయితలు- సాహిత్యం చైతన్యం (వ్యాసం), కొలకలూరి ఇనాక్, ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై విమర్శనం, (సంపా) కొలకలూరి మధుజ్యోతి, జ్యోతి గ్రంథమాల, తిరుపతి: 2009, పుటలు: 182-189.
3. తెలుగు డయాస్పోరా సాహిత్యం - ఒక పరిచయం (వ్యాసం), దార్ల వెంకటేశ్వరరావు,ద్రావిడి (త్త్రైమాసిక తెలుగు పరిశోధన పత్రిక) ఆగస్టు, 2011, సంపుటి-1, సంచిక-1. పుటలు: 114 –123.
English Books:
Rainer Bauböck and Thomas Faist (ed.). Diaspora and Transnationalism: Concepts, Theories and Methods, IMISCOE Research, Amsterdam University Press, 2010.
Gijsbert Oonk (ed.). Global Indian Diasporas : Exploring Trajectories of Migration and Theory, IIAS Publications, Amsterdam University Press, 2007.
Laura Chrisman. Postcolonial contraventions Cultural readings of race, imperialism and transnationalism, Manchester University Press, 2003
UNIVERSITY OF HYDERABAD
School of Humanities
Department of Telugu
M.A., Telugu (III Semester)
Techniques of Writing a Dissertation-1 (Theory)
Optional: 4 Credits
100 Marks (Internal 40 + Main 60 marks for End semester)
Course Design by Dr.Darla Venkateswara Rao
Email: darlahcu@gmail.com
పాఠ్యాంశ లక్ష్యం:
ఎం.ఏ స్థాయిలోనే విద్యార్థులకు పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఎంతో అవసరం. కొంతమంది అనేక కారణాల వల్ల ఎం.ఏ., తర్వాత వెంటనే పరిశోధనలో చేరలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు కూడా పరిశోధన పట్ల అవగాహన ఉంటే పత్రికల్లో కొన్ని పరిశోధన వ్యాసాలను రాయవచ్చు. పత్రికల్లో వస్తున్న పరిశోధనాంశాలకు సంబంధించి అవసరమైతే తమకి తెలిసిన అంశాలపై చర్చలో పాల్గొనవచ్చు. అటువంటప్పుడు ఆ చర్చలు, ఆ వ్యాసాలు శాస్త్రీయంగా రాయగలిగే అవకాశం ఉండాలి. అలా ఉండాలంటే ఎం.ఏ.స్థాయిలోనే పరిశోధన పత్ర రచన పట్ల కనీస అవగాహన అవసరం. అందుకనే హైదరాబాదు విశ్వవిద్యాలయం బోధన, పరిశోధనలకు సమప్రాధాన్యాన్నిస్తుంది. దీనిలో భాగంగానే ఈ కోర్సుని చదివే వారికి పరిశోధన పట్ల అవగాహనను కలిగిస్తుంది.
గమనిక: జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం మారిన సిలబస్ లో Techniques of Writing a Dissertation-1 (Theory) అనే పేపర్ IIIrd Semester లోను, Techniques of Writing a Dissertation-II ( Practical) IV సెమిస్టర్ లోను ఉంటుంది. మూడవ సెమిస్టర్ 2022 ఆగస్టు నుండి ఈ మార్పు మొదలవుతుంది. టైటిల్ లో కూడా చిన్న మార్పు జరిగింది. దాన్ని గమనించండి.
UNIT-I
సాధారణ వ్యాసం (General Essay)-సమీక్ష వ్యాసం(Review Essay)-పరిశోధన పత్రం (Research Paper) : నిర్వచనాలు (Definitions), లక్షణాలు (Features), లక్ష్యాలు (Aims), ఆశయాలు (Objectives), పరిశోధన నివేదిక (Research Report), సిద్ధాంత వ్యాసం (Dissertation), సిద్ధాంత గ్రంథం (Thesis), పరిశోధన స్వరూపం, (Research Structure), పరిశోధన స్వభావాలు (Research Characteristics)
UNIT-II
పరిశోధన ప్రణాళిక (Research Plan) - పరిశోధన సంక్షిప్తి (Research Abstract)- పరిశోధనాంశం (Research Topic) –ఆధారాలు (Sources): ప్రాథమిక (Primary) , మాధ్యమిక ( Secondary), ప్రకటనలు (Statements )- ఉద్దరణలు (Quotations) – సూచికలు (Citations) - పాద సూచికలు, (Foot Notes), అంతర్గత సూచికలు, (Inner Notes), అంతర్జాల వాడుక (Usage of Internet), ఉపయుక్త గ్రంథ సూచిక (Bibliography) - భాష, శైలి (Language and Style) - విరామ చిహ్నాలు (Punctuation Marks), గ్రంథాలు, పత్రికల పేర్లు (Names of Books, Journals)
UNIT-III
గుణాత్మక, పరిమాణాత్మక పద్ధతులు (Qualitative and Quantitative Methods), భావన (Concept), సాధారణ సిద్ధాంతం (General Theory), ఊహ పరికల్పన (Hypothesis), సిద్ధాంత నిరూపణ పరికరాలు (Research Tools), ఫలితాంశాలు (Results), ప్రత్యక్ష లేదా నిగమన పద్ధతి (Deductive Method), పరోక్ష లేదా ఆగమన పద్ధతి (Inductive Method)
UNIT-IV
ఉపోద్ఘాతం (Writing the Introduction) – ముఖ్య ప్రతిపాదిత విషయం (Writing the Body)- ముగింపు (Writing the Conclusion)- తొలి చిత్తు ప్రతి (Write the first Draft)- ప్రాథమిక ప్రతి (Revised first Draft or Outline)- అసలు ప్రతి (Final Draft)
Reference Books of Further Reading
- · Joseph Gibaldi. MLA Handbook for Writers of Research Papers (7th Edition), The Modern Language Association of America. Printed in the United States of America, New York 10004-1789
- · Jonathan Anderson & Millicent Poole, Assignment and Thesis Writing, 2011
- · ఎస్. జయప్రకాష్. పరిశోధన విధానం, 1992
- · జి.వి., సుబ్రహ్మణ్యం. జీవియస్ వ్యాసాలు, 1993
- · ఆర్వీయస్. సుందరం. పరిశోధన పద్ధతులు 1990
- · రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, హెచ్.ఎస్.బ్రహ్మానంద, సాహిత్య పరిశోధన సూత్రాలు, 1997
- · నిత్యానందరావు, వెలుదండ. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన, 2014
- · సుబ్బాచారి,పులికొండ. పరిశోధన విధానం సిద్ధాంత గ్రంథ రచన, 2014
- · అప్పారావు గంధం, సూర్యనారాయణ, కాళిదాసు. పరిశోధన పద్ధతులు, 1985
- · తెలుగు అకాడమి, పరిశోధన సంహిత, 1975.
- · కుసుమాబాయి, కులశేఖరరావు, పరిశోధన సూత్రాలు,2000.
- లక్ష్మీనారాయణ, గంగిశెట్టి ‘సాహిత్య పరిశోధనా కళ: విధానం (2017)
- · లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. ఆధునికత -సమకాలికత(కొన్ని పార్శ్వాలు),2016
UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, ii Semester -
Optional Course
TL 477 COMPARATIVE
AESTHETICS
Optional Courses: 4
Credits. Course
Teacher: Dr.Darla Venkateswara Rao
Mobile: 09989628049
తులనాత్మక కళాతత్త్వ
శాస్త్రం
పాఠ్యాంశలక్ష్యం : కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలను
గుర్తించి,భారతీయ,పాశ్చాత్య కళాతత్త్వ శాస్త్రాలలో గల
ముఖ్యాంశాలను తులనాత్మకంగా వివరించడం,దీని ప్రధాన లక్ష్యం.
తెలుగు సాహిత్యాన్ని చిత్రం,శిల్పం,సంగీతం, కవిత్వం, నాట్యం అనే లలిత కళల సమన్వయ దృష్టితో
అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠ్యాంశాన్ని చదవడం వల్లవిద్యార్థులకు
సాహిత్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న లలితకళలతో గల భేద సాదృశ్యాల అవగాహన
కలుగుతుంది. కళల పట్ల గల విశ్వజనీన భావనలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ దిశగా అనేక
రచనలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం కళాతత్త్వ శాస్త్ర దృష్టితో పరిశోధనల
చేయాలనుకునేవారికి, సాహిత్యాన్ని లలితకళలతో గల అవినాభావ
సంబంధాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులకు కళాతత్త్వశాస్త్ర మౌలిక భావనల పట్ల
అవగాహన కలిగిస్తుంది.
యూనిట్- 1
ఈస్తటిక్స్ - శబ్దార్థ వివరణ- నేపథ్యం, నామౌచిత్యం- తులనాత్మక కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలు
: సౌందర్యం, ప్రతిభ,
అభివ్యక్తి., కవిత్వం - లలిత కళలు; కళాతత్త్వ శాస్త్రం- నిర్వచనం, లక్షణాలు; కళావిర్భావ సిద్ధాంతాల పరిచయం - కళ, కళోత్పత్తి, అనుకరణ- కళా హేతువులు - కళాకారుని పక్ష అధ్యయనం, ప్రేక్షక పక్ష అధ్యయనం, ఇతర కోణాలు. ప్రతిభ, అభివ్యక్తి తదితర అంశాలు.
యూనిట్- 2
కళాతత్త్వశాస్త్రం - విమర్శశాస్త్రం భేద సాదృశ్యాలు, కళా తాత్త్వికులు - దార్శినికులు – ఆలంకారికులు
యూనిట్- 3
పాశ్చాత్య కళాతాత్త్వికుల దృక్పథాల పరిచయం: ప్లాటో, అరిస్టాటిల్, బౌమ్‌గార్టెన్, కాంట్, హెగెల్, బొసాంకె, క్రోచీ, సుసన్నా కె.లాంగర్, సాంతాయన, ఎమర్శన్, కాలరిడ్జ్ మొదలైన దృక్పథాల పరిచయం.
భారతీయ కళాతాత్త్వికుల దృక్పథం: భరతుడు, భామహుడు, దండి, ఆనందవర్ధనుడు, వామనుడు, రాజశేఖరుడు, అభినవగుప్తుడు, మమ్ముటుడు, కుంతకుడు, భోజుడు, మహిమభట్టు, విశ్వనాథుడు, పండితరాజ జగన్నాథుడు, అరవిందుడు, రవీంద్రనాథ్ టాగోర్ మొదలైన వారి దృక్పథాలతో తులనాత్మక
అధ్యయనం.
యూనిట్- 4
సత్యం - శివం - సుందరం పట్ల పాశ్యాత్య, భారతీయుల దృక్పథాలు.
సుందరం - సౌందర్యం భావనలు.
సౌందర్యం వస్తుగతమా?, వ్యక్తిగతమా? ఉభయగతమా?
లలితకళలను ఆస్వాదించడమెలా?
తులనాత్మక కళాతత్త్వశాస్త్ర విమర్శ పద్ధతులు.
సంప్రదించదగిన గ్రంథాలు:
1. విమర్శకపారిజాతం - పురాణం సూరిశాస్త్రి
2. విమర్శ, కళాతత్త్వశాస్త్రాలు - ముదిగొండ వీరభద్రయ్య
3. ఆంధ్రసాహిత్య విమర్శ-ఆంగ్లప్రభావం –జి.వి.సుబ్రహ్మణ్యం
4.పాశ్చాత్య సాహిత్య విమర్శనారీతులు – అన్నంరాజు
సుబ్బారావు
4. సంజీవ్‌దేవ్ వ్యాసాలు - సంపాదకులు: వి. కొండలరావు, ముదిగొండ వీరభద్రయ్య
5. పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు - వడలి
మందేశ్వరరావు
6. కావ్యాలంకార సంగ్రహం. గ్రంథకర్త: రామరాజభూషణుడు – వివరణ కర్త: సన్నిధానము
సూర్యనారాయణశాస్ర్తి
7. Comparative Aesthetics Vol.II – K.C. Pandey.
8. Cultural Leaders of India: Aestheticians –
Publications Division, Ministry of Information and Broad Casting, Government of
India, New Delhi, 1983.
UNIVERSITY OF HYDERABAD
School of Humanities
Department of Telugu
M.A. Telugu., HT: Dalit Literature
Optional Course: HT: 572 4 Credits IV Semester
Course Designed: Prof.Darla Venkateswara Rao,
Mobile: 9989628049
UNIT- I
దళిత
– హరిజన, శూద్రులు, అనార్యులు,
దస్యులు, , చండాలురు, అస్పృశ్యులు,
పంచములు శబ్దాలు: అర్థ వివరణ – దళిత సాహిత్య చారిత్రక
నేపథ్యం - దళిత సాహిత్య తాత్త్విక దృక్పథం : వేదాలు – చార్వాకం – జైనం
– బౌద్ధం – అంబేద్కరిజం – మార్క్సిజం – తదితర సిద్ధాంతాల ప్రభావం.
Dalits, Harijans, Sudra, Anaryas, Dasya, Chandalas, Untouchables, Panchamas etc words
meaning and explanation – The Historical Background of Dalit Literature.
Ideology of Dalit Literature: Vedas – Charvakam – Jainam – Bouddham –
Ambedkarism – Marxism – and impact of other theories.
UNIT- III
దళిత సాహిత్యం మౌలిక భావనలు – అస్పృశ్యత – మత దృక్పథం –సౌందర్య
శాస్త్ర దృక్పథం - సత్యం, శివం,
సుందరం భావనలు – కర్మ, పునర్జన్మ,
భావనల పట్ల గల అభిప్రాయాలు – దళితుల భాష – దళిత సంస్కృతి. దళిత సాహిత్య ప్రక్రియలు – పద్య కవిత్వం –గేయం – కథ - నాటకం – వచన కవిత్వం – దళిత సాహిత్య విమర్శ- ప్రత్యేక కుల అస్తిత్త్వ ఉద్యమాలు- ఉప కుల చైతన్యం.
Principles of Dalit Literature – Untouchability –
Religious Approach – Aesthetic Approach – Concepts of Satyam, Sivam,
Sundaram – Different opinions
about concepts of Karma, Rebirth etc- Dalit Language – Dalit Culture. Dalit Literary Genres, Metrical Poetry- Songs-
Story – Drama – Free Verse Poetry- Dalit Literary Criticism- Caste Identity
Movements- Sub-Cast Consciousness.
UNIT – V
పాఠ్య నిర్ణాయక గ్రంథాలు: Texts for Prescribed:
కవిత్వం: దళిత కవిత్వం -భాగం 1&2.( డా. జి.లక్ష్మీనారాయణ ), నలుగురమవుదాం (రావినూతల ప్రేమకిశోర్), మాదిగ చైతన్యం ( సంపాదకుడు:
నాగప్పగారి సుందర్ రాజు), చిక్కనవుతున్న పాట
( సంపాదకులు: జి. లక్ష్మీనరసయ్య,
త్రిపురనేని శ్రీనివాస్, జీవనది పద్య కవితాఖండికలో దళిత దేవుడు, క్రిస్మస్ ఖండికలు
( మల్లవరపు రాజేశ్వరరావు),
1. Poetry: Dalitakavitwam-Part I&II(
Edited by Dr.G.Laksminarayana), Nalugurumavudam (Ravinutala Premkishore), Madiga Chaitanyam (Edited
by Nagappagari Sunder Raju),Chikkanavutunna pata (Edited by:
G.lakshminarasaiah,
Tripuraneni Srinivas),
2. నవల : జగడం ( బోయ జంగయ్య)
Novel : Jagadam (
Boya Jangaiah)
3. నాటకం : పాలేరు
( బోయి భీమన్న)
Drama:
Paleru ( Boyi Bheemanna)
4. కథలు : ఇలాంటి తవ్వాయి వస్తే ( శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి), పోలయ్య ( కరుణ కుమార), తాకట్టు ( కొలకలూరి ఇనాక్), వెంటాడిన అవమానం ,( కాసుల ప్రతాప రెడ్డి)
Short Stories: ilanti tavvayi vaste (Sreepada Subrahmanya Sastry), Polaiah
(karunakumara), takattu (Kolakaluri Enock), Ventadina Avamanam (kasula
Pratap Reddy),
6. దీర్ఘ కావ్యాలు : నిప్పుకణిక ( బన్న అయిలయ్య ), నిప్పుల్లో తడిచే
తప్పెట (ఎజ్రాశాస్త్రి)
Long Poems:
Nippukanika ( Banna Ilaiah), NippulloTadiche
Tappeta ( Ezra Sastry)
References:
1. Dr.Babasaheb Ambedkar rachanalu –
Prasangalu :
Govt.of A.P Publications
2. Dalita Sahitya Charitra : Pilli Samson
3. Dalita Vadavivadalu : Edited by S.V.Satyanarayana
4. Dalita Sahityam Moulika Bhavanalu
(Veechika, Essays on literary Criticism) : Venkateswara Rao, Darla
5. Bahujana Sahitya Drikpatham : Venkateswara Rao, Darla
6. Nallapoddu : Edited by Gogu Syamala
7. Towards an Aesthetic of Dalit
Literature:
Sarankumar Limbale
( This updated syllabus approved in the Board of Studies, Department
of Telugu, School of Humanities, University of Hyderabad meeting held on 02 January
2020)
-0-
UNIVERSITY OF HYDERABAD
School of Humanities
Department of Telugu
M.A., Telugu (III Semester)
Techniques of Writing a Dissertation-1 (Theory)
Optional: 4 Credits
100 Marks (Internal 40 + Main 60 marks for End semester)
Course Design by Dr.Darla Venkateswara Rao
Email: darlahcu@gmail.com
పాఠ్యాంశ లక్ష్యం:
ఎం.ఏ స్థాయిలోనే విద్యార్థులకు పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఎంతో అవసరం. కొంతమంది అనేక కారణాల వల్ల ఎం.ఏ., తర్వాత వెంటనే పరిశోధనలో చేరలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు కూడా పరిశోధన పట్ల అవగాహన ఉంటే పత్రికల్లో కొన్ని పరిశోధన వ్యాసాలను రాయవచ్చు. పత్రికల్లో వస్తున్న పరిశోధనాంశాలకు సంబంధించి అవసరమైతే తమకి తెలిసిన అంశాలపై చర్చలో పాల్గొనవచ్చు. అటువంటప్పుడు ఆ చర్చలు, ఆ వ్యాసాలు శాస్త్రీయంగా రాయగలిగే అవకాశం ఉండాలి. అలా ఉండాలంటే ఎం.ఏ.స్థాయిలోనే పరిశోధన పత్ర రచన పట్ల కనీస అవగాహన అవసరం. అందుకనే హైదరాబాదు విశ్వవిద్యాలయం బోధన, పరిశోధనలకు సమప్రాధాన్యాన్నిస్తుంది. దీనిలో భాగంగానే ఈ కోర్సుని చదివే వారికి పరిశోధన పట్ల అవగాహనను కలిగిస్తుంది.
గమనిక: జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం మారిన సిలబస్ లో Techniques of Writing a Dissertation-1 (Theory) అనే పేపర్ IIIrd Semester లోను, Techniques of Writing a Dissertation-II ( Practical) IV సెమిస్టర్ లోను ఉంటుంది. మూడవ సెమిస్టర్ 2022 ఆగస్టు నుండి ఈ మార్పు మొదలవుతుంది. టైటిల్ లో కూడా చిన్న మార్పు జరిగింది. దాన్ని గమనించండి.
UNIT-I
సాధారణ వ్యాసం (General Essay)-సమీక్ష వ్యాసం(Review Essay)-పరిశోధన పత్రం (Research Paper) : నిర్వచనాలు (Definitions), లక్షణాలు (Features), లక్ష్యాలు (Aims), ఆశయాలు (Objectives), పరిశోధన నివేదిక (Research Report), సిద్ధాంత వ్యాసం (Dissertation), సిద్ధాంత గ్రంథం (Thesis), పరిశోధన స్వరూపం, (Research Structure), పరిశోధన స్వభావాలు (Research Characteristics)
UNIT-II
పరిశోధన ప్రణాళిక (Research Plan) - పరిశోధన సంక్షిప్తి (Research Abstract)- పరిశోధనాంశం (Research Topic) –ఆధారాలు (Sources): ప్రాథమిక (Primary) , మాధ్యమిక ( Secondary), ప్రకటనలు (Statements )- ఉద్దరణలు (Quotations) – సూచికలు (Citations) - పాద సూచికలు, (Foot Notes), అంతర్గత సూచికలు, (Inner Notes), అంతర్జాల వాడుక (Usage of Internet), ఉపయుక్త గ్రంథ సూచిక (Bibliography) - భాష, శైలి (Language and Style) - విరామ చిహ్నాలు (Punctuation Marks), గ్రంథాలు, పత్రికల పేర్లు (Names of Books, Journals)
UNIT-III
గుణాత్మక, పరిమాణాత్మక పద్ధతులు (Qualitative and Quantitative Methods), భావన (Concept), సాధారణ సిద్ధాంతం (General Theory), ఊహ పరికల్పన (Hypothesis), సిద్ధాంత నిరూపణ పరికరాలు (Research Tools), ఫలితాంశాలు (Results), ప్రత్యక్ష లేదా నిగమన పద్ధతి (Deductive Method), పరోక్ష లేదా ఆగమన పద్ధతి (Inductive Method)
UNIT-IV
ఉపోద్ఘాతం (Writing the Introduction) – ముఖ్య ప్రతిపాదిత విషయం (Writing the Body)- ముగింపు (Writing the Conclusion)- తొలి చిత్తు ప్రతి (Write the first Draft)- ప్రాథమిక ప్రతి (Revised first Draft or Outline)- అసలు ప్రతి (Final Draft)
Reference Books of Further Reading
- · Joseph Gibaldi. MLA Handbook for Writers of Research Papers (7th Edition), The Modern Language Association of America. Printed in the United States of America, New York 10004-1789
- · Jonathan Anderson & Millicent Poole, Assignment and Thesis Writing, 2011
- · ఎస్. జయప్రకాష్. పరిశోధన విధానం, 1992
- · జి.వి., సుబ్రహ్మణ్యం. జీవియస్ వ్యాసాలు, 1993
- · ఆర్వీయస్. సుందరం. పరిశోధన పద్ధతులు 1990
- · రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, హెచ్.ఎస్.బ్రహ్మానంద, సాహిత్య పరిశోధన సూత్రాలు, 1997
- · నిత్యానందరావు, వెలుదండ. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన, 2014
- · సుబ్బాచారి,పులికొండ. పరిశోధన విధానం సిద్ధాంత గ్రంథ రచన, 2014
- · అప్పారావు గంధం, సూర్యనారాయణ, కాళిదాసు. పరిశోధన పద్ధతులు, 1985
- · తెలుగు అకాడమి, పరిశోధన సంహిత, 1975.
- · కుసుమాబాయి, కులశేఖరరావు, పరిశోధన సూత్రాలు,2000.
- · లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. ఆధునికత -సమకాలికత(కొన్ని పార్శ్వాలు),2016
......
UNIVERSITY OF HYDERABAD
School of Humanities
Department of Telugu
Ph.D., Telugu (I Semester)
HT 801 Research Methodology
Core Course: 4 Credits
100 Marks (Internal 40 + Main 60 marks for End semester)
Course Design by Dr. Darla Venkateswara Rao,
Email: darlash@uohyd.ac.in
UNIT-I
పరిశోధన, అర్ధ వివరణ (Research Meaning) : నిర్వచనాలు (Definitions), పరిశోధన స్వరూపం, స్వభావాలు, లక్షణాలు (Characteristics,) పరిశోధన ఆవశ్యకత (importance of Research, లక్ష్యాలు (Aims), ఆశయాలు (Objectives), పరిశోధనాంశం
ఎంపిక, పరిశోధన సమస్య నిర్ధారణ, పరిశోధన ప్రణాళిక.(Selection and formulation of Research Problem, Research Design), పరిశోధన పద్ధతులు (Types of Research Methods)- గుణాత్మక,
పరిమాణాత్మక పద్ధతులు (Qualitative
and Quantitative Methods), ప్రత్యక్ష
లేదా నిగమన పద్ధతి (Deductive Method), పరోక్ష లేదా ఆగమన పద్ధతి (Inductive
Method) etc.
UNIT-II
సమాచార సేకరణ పద్ధతులు (Methods of
Data Collection): Types of Field Work ( క్షేత్ర పర్యటన
పద్ధతులు), సర్వే పద్ధతి (Survey), ఇంటర్వ్యూ (Interviews), నిష్ణాతులతో
చర్చలు (Focus Group Discussion (FGD), క్షేత్ర పరిశీలన Field
Observation, రికార్డులు,(Records) , నమూనా పద్ధతులు (Sampling methods), etc. పరిశోధన సాహిత్య
సమీక్ష (Analysis of Literature Review), పరిశోధన ఆకరాలు (Research Sources)– ప్రాథమిక ఆకారాలు (Primary Sources), ద్వితీయ ఆకరాలు(
Secondary Sources,), తృతీయ ఆకారాలు(Tertiary Source ),
అంతర్జాల ఆకరాలు (Web sources)
– ఊహాపరికల్పన , వివిధ రకాలు(Hypothesis– Different Types. ప్రకటనలు
(Statements)- ఉద్దరణలు
(Quotations) – సూచికలు (Citations)
- పాద సూచికలు, (Foot Notes), అంతర్గత సూచికలు, (Inner Notes), అంతర్జాల వాడుక (Usage of Internet), ఉపయుక్త గ్రంథ సూచిక (Bibliography)
- భాష, శైలి (Language
and Style) - విరామ చిహ్నాలు (Punctuation
Marks), గ్రంథాలు, పత్రికల పేర్లు (Names of Books, Journals), గణాంక వివరాల రేఖాచిత్రాలు, ప్రాతినిథ్య
రేఖాచిత్రాలు, పట్టికల విశ్లేషణ పద్ధతులు మొదలైనవి.(Methods of Statistical Graphics, Graphical representation, Tables etc.
UNIT-III
సాహిత్య పరిశోధన రకాలు(Types of Literary
Research Methods). కవిజీవిత (Biographical), వాజ్మయ, (Bibliographic), పరిష్కరణ
(Textual), సైద్దాంతిక (Conceptional or Theoretical), వర్ణనాత్మక (Descriptive), చారిత్రక (Historical), తులనాత్మక (Comparative) etc.
పరిశోధన క్రమం (Research Process): భావన (Concept), సాధారణ సిద్ధాంతం (General Theory), ఊహ పరికల్పన (Hypothesis), సిద్ధాంత నిరూపణ పరికరాలు (Research
Tools), ఫలితాంశాలు (Results).
UNIT-IV
Report of the thesis
Presentation of a Report
I. Prefatory Part
Title Page, Signatory Page, Copy Rights, Acknowledgements,
Executive Summary, Table of Contents, List of Tables and Graphs, List of
Abbreviations. II. Main Body: Introduction, Review of Literature, Research
Methodology, Data Reduction, Presentation, and Analysis, Summary of Key
Findings, Recommendations and Conclusions. III. Supplementary Part: Bibliography
or References, Annextures, Appendixes
Reference Books of
Further Reading
Joseph Gibaldi. MLA
Handbook for Writers of Research Papers (7th Edition), The Modern Language
Association of America. Printed in the United States of America, New York
10004-1789
· Jonathan Anderson & Millicent Poole, Assignment and
Thesis Writing, 2011
· ఎస్. జయప్రకాష్.
పరిశోధన విధానం, 1992
· జి.వి., సుబ్రహ్మణ్యం. జీవియస్ వ్యాసాలు,
1993
· ఆర్వీయస్. సుందరం.
పరిశోధన పద్ధతులు 1990
· రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, హెచ్.ఎస్.బ్రహ్మానంద, సాహిత్య పరిశోధన సూత్రాలు, 1997
· నిత్యానందరావు, వెలుదండ. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన,
2014
· సుబ్బాచారి,పులికొండ. పరిశోధన విధానం సిద్ధాంత గ్రంథ రచన, 2014
· అప్పారావు గంధం, సూర్యనారాయణ, కాళిదాసు. పరిశోధన పద్ధతులు, 1985
· తెలుగు అకాడమి, పరిశోధన సంహిత, 1975.
· కుసుమాబాయి, కులశేఖరరావు, పరిశోధన
సూత్రాలు,2000.
. లక్ష్మీనారాయణ, గంగిశెట్టి
‘సాహిత్య పరిశోధనా కళ: విధానం (2017)
(Submitted for the
approval of BoS, Department of Telugu on 5.2.2024)
1 కామెంట్:
మీరు నిర్మించిన సిలబస్ చాలా బాగుంది సార్.
మాకెంతో జ్ఞానాన్ని ప్రసాదించింది. మీ దగ్గర వీటిని ముఖతా నేర్చుకోవడం మా అదృష్టం.
మీ విధేయులుడు
డా.బోలుగద్దె అనిల్ కుమార్
కామెంట్‌ను పోస్ట్ చేయండి