"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

17 ఏప్రిల్, 2019

“నవ్యత్వమే పరిశోధనలకు నిజమైన ప్రమాణం” -ఆచార్య పొదిలి అప్పారావుగారు

“నవ్యత్వమే పరిశోధనలకు నిజమైన ప్రమాణం”
ముఖ్య అతిథి గా మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు , వేదికపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి, ఆచార్య పులికొండ సుబ్బాచారి, పొట్లూరి హరికృష్ణ, డా॥ ఆవుల మంజులత తదితరులున్నారు.

పరిశోధనల్లో నవ్యత్వం క్షేత్ర పరిశీలన, ప్రయోగాలు, అన్వేషణలవల్లనే సాధ్యమవుతుందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు వ్యాఖ్యానించారు.  హెచ్.సి.యు. మానవీయశాస్త్రాల విభాగం, జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న “జానపద విజ్ఞానం – అధ్యయన ఆవశ్యకత” అనే అంశంపై మంగళవారం జరిగిన ఒక రోజు జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెచ్.సి.యు. దేశ వ్యాప్తంగా నాల్గవ ర్యాంకు రావడానికి విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు మరియు గత పరిశోధకుల సమిష్టి కృషి ఎంతో ఉందన్నారు.  దేశంలో ముందుచూపుతో పరిశోధనలు జరగాలనీ, అలాంటి ముందుచూపు కొత్త విజ్ఞానాన్ని ఇస్తుందని, దీనికి ఇలాంటి జాతీయ సదస్సులు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. 
ఈనాడు దిపత్రికసౌజన్యంతో.... క్లిప్లింగ్ 

ప్రారంభోత్సవ సభలో అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ డీన్ ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిగారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సమకాలీన జానపద విజ్ఞానానికి సంబంధించిన అనేక పరిశోధనల పట్ల అవగాహనకు ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. 


సాక్షి పత్రిక సౌజన్యంతో.... క్లిప్లింగ్ 

వేదికపై ముఖ్య అతిథి గా పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారు , ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి, ఆచార్య పులికొండ సుబ్బాచారి, పొట్లూరి హరికృష్ణ, డా॥ ఆవుల మంజులత, డా.డి.విజయలక్ష్మి తదితరులున్నారు.
జానపద కళలు మరియు సాంస్కృతిక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ పొట్లూరి హరికృష్ణగారు ఈ జాతీయ సదస్సును ప్రారంభించారు. రాష్ట్రాలు వేరైనా, దేశంలో ఎక్కడున్న ఎటువంటి పరిశోధనలపైన కూడా తమ సంస్థ సహకారాన్ని అందిస్తుందని, దానిలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని శ్రీ పొట్లూరి హరికృష్ణ అన్నారు.  జానపద కళల పరిణామాన్ని తెలిపే మ్యూజియమును అమరావతిలో త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 


ఆచార్య అప్పారావు పొదిలె, వైస్ ఛాన్సలర్ గార్ని సత్కరిస్తున్న డా. ఆవుల మంజులత తదితరులు 

నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో క్లిప్పింగ్

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధక్ష్యులు డా॥ ఆవుల మంజులతగారు మాట్లాడుతూ జానపదానికీ, పేదరికానికీ, భాషకీ, పేదరికానికీ అవినాభావ సంబంధం ఉందన్నారు.  తెలుగు భాష వల్ల 87% మానవవనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని పరిశోధనలు తెలియజేశాయన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రక్రియను ప్రశంసించారు.  త్వరలో మరొక సదస్సుకి తాను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ఈ సదస్సులో ప్రకటించారు. 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని అభినందిస్తున్న ఆచార్య అప్పారావు, పొదిలె తదితరులు

సదస్సులో కీలకోపాన్యాసం చేసిన ఆచార్య పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ జానపద విజ్ఞానంలో జరుగుతున్న పరిశోధనల తీరుతెన్నుల్ని విశ్లేషించి, భారతీయులు, పాశ్చాత్యుల కృషిని విశ్లేషించారు. జానపద విజ్ఞానంలో పరిశోధనలు చేయడానికి గల అనేక పార్శ్వాలను వివరించారు. 
వార్త దిన పత్రిక సౌజన్యంతో క్లిప్పంగ్.

సదస్సుల లక్ష్యాలను కో-ఆర్డినేటర్ ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు వివరించగా, కో-కోఆర్డినేటర్ డా॥ డి. విజయలక్ష్మిగారు వందన సమర్పణ చేశారు.  సదస్సులో వివిధ విశ్వవిద్యాలయ పరిశోధకులు, తెలుగు శాఖ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిలో సుమారు 16 పరిశోధన పత్రాలు సమర్పించారు.


భూమిపుత్ర తెలుగు దిననపత్రిక, అనంతపురం వారి( E-mail: bhumiputra.net@gmail.com) సౌజన్యంతో

సదస్పులో పాల్గొన్న పరిశోధకులు, విద్యార్థులు

ఈ సదస్సులో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య గోనానాయక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్,  ఆచార్య అప్పల్నాయుడు, ఆచార్య వి.కష్ణ, ఆచార్య సర్రాజు, డా. భుజంగరెడ్డి, డా.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు లేవు: