చక్కనివేషముకలిగీ
చక్కని భాషను పలుకుము చమతృతిగానూ
యెక్కువ తక్కువ చేయకు
ఒక్కరెవరినైనసభను వరమౌ దార్లా!
చక్కని భాషను పలుకుము చమతృతిగానూ
యెక్కువ తక్కువ చేయకు
ఒక్కరెవరినైనసభను వరమౌ దార్లా!
విడువకుమీసభలోపల
విడువడననుబంధములనువీనులకెపుడూ
జడులేకురిసినపరుచుము
యెడబాయనియెదముదమునయెపుడూదార్లా!
జడులేకురిసినపరుచుము
యెడబాయనియెదముదమునయెపుడూదార్లా!
తడబడనీయకు మాటను
విడువకునైతికవిలువలువిజయముకొరకున్
సడలకుధైర్యమునెపుడూ
కడలి కెరటములను చూసి కలగను దార్లా!
తెలిసినదానినిపలుకుము
తెలిసినదంతయుపలుకకుతెలివేలేకన్
తలచుకొని కలుసుకొనవలె
తెలిసిన పెద్దలనువీడ్వకెన్నడు దార్లా!
మరువుముతిట్టినతిట్టులు
మరువుముకొట్టిననుగానిమరతుముయన్నీ
మరువకుకరుణాశీలిని
మరువకుపెట్టినమెతుకులుమాత్రముదార్లా!
మరువకుకరుణాశీలిని
మరువకుపెట్టినమెతుకులుమాత్రముదార్లా!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి