"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

నెమలికన్నులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నెమలికన్నులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

05 ఏప్రిల్, 2026

కళాత్మక సత్యాల అక్షరం దృశ్య చిత్రం( నినాదం దినపత్రిక సౌజన్యంతో)

 కళాత్మక సత్యాల అక్షరం దృశ్య చిత్రం

ఆచార్య దార్ల ‘నెమలి కన్నులు' 



 సాధారణంగా ఆత్మకథలు వయో వృద్ధులైన తమ చివరి కాలంలో రాస్తుంటారు.  కానీ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఐదు పదుల వయసులోనే  ఆత్మకథను రాయడం అంటే సాహసమే. దార్ల గారి జీవితం, రచనలు ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా దానిలో ఉండే వస్తువు దళిత వ్యధకు సంబంధించినదై ఉంటుందని ఊహించగలరు. దళిత సమస్యలు  దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అలాంటప్పుడు మరలా ఆ సమస్యలను తెలుసుకోవడం కోసమే అయితే, చాలా మందికి అలాంటి మూస రచనలను చదవడం ఇష్టం ఉండదు. 

     ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆత్మకథ ప్రజల లోకి ఎలా వెళ్ళగలిగిందనేది ఒక ప్రశ్న!

‘నెమలి కన్నులు’ ఆత్మకథ ఒకవైపు వచనంలో రాస్తూనే, మరోవైపు కవిత్వమై ప్రవహించింది. నిజానికి వచనం చదువుతున్నామో, కవిత్వమే చదువుతున్నామో అనే దానికంటే  పాఠకుడు ఆ రచనాశైలికి ఆకర్శితుడై ఒక తన్మయత్వానికి గురువుతాడనేది   మాత్రం సత్యం. ఆత్మకథలోని పుస్తకం అంతా బాల్యానికి  సంబంధించిన వర్ణనలే కాబట్టి, అది తమ జీవితమే అన్నట్లుగా అనిపించటం ఒక చెప్పుకో తగిన విశిష్టమైన అంశం. కులాన్ని, దాని వల్ల కలిగే అవమానాల్ని చెప్తున్నట్లు అనిపించకుండగా జీవితాన్నే చూపించడం రచనా శైలిలో కనిపించే ఒక వ్యూహం. ఇలా ప్రారంభమవుతుంది ఆ ఆత్మకథ.

‘’మా ఊరిపేరు

చెయ్యేరు అగ్రహారం అని చెప్పాను కదా!

అదెక్కడుంది?

మీరు కోనసీమ పేరు వినే ఉంటారు.

దక్షిణ భారతదేశంలోనే 

ఒక అందమైన ప్రాంతం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

తూర్పుగోదావరి జిల్లాలో

కోనసీమ

ఎటు చూసినా కొబ్బరి చెట్లు. 

ఎటుచూసినా 

గలగల ప్రవహించే నదులు, కాల్వలు...

ఎటుచూసినా  

తినటానికి పిలిచే తియ్యని ఫలవృక్షాలు...  

మనసుని మత్తెక్కించే 

పరిమళాల్ని వెదజల్లుతూ 

రంగురంగుల పూలమొక్కలు...

ఆ కోనసీమలో అమలాపురం…

దాన్ని కేంద్రంగా అలంకరిస్తూ

చుట్టూ నిలిచే గ్రామాలు... 

దాని చుట్టూ స్వచ్ఛంగా 

నిత్యం వేదంలా ప్రవహించే నదులు...

ప్రకృతి సింగారించుకున్న 

పచ్చని చీరలా పరుచుకున్న పొలాలు... 

ప్రతి రోజూ 

ఏదో పండుగ చేసుకుంటుంటే మ్రోగే 

మంగళ ధ్వనుల్లా పలికే 

పక్షుల కిలకిలారావాలు…’’ ఇలా ఒక సౌందర్యభరితమైన ప్రాంతాన్ని వర్ణిస్తున్నట్టే ఉంది. ఆ తర్వాత ఇలా ఒక రెండు, మూడు వాక్యాల్లోనే తన గ్రామ వర్ణనను స్వభావాన్ని చెప్తారు.

‘’గ్రామ గ్రామాన 

ఆత్మగౌరవ చిహ్నమేదో

దారిచూపుతున్నట్లుగా కనిపించే 

నిలువెత్తు అంబేద్కర్ శిలా విగ్రహాలు ...

సాగర సంగమం కోసం 

వేగంగా ఉరికొస్తున్నట్లు ప్రవహించే 

గౌతమీ గోదావరినదిని

కుండలేశ్వరం మీదుగా 

చెలికత్తెలెవరో రహస్యంగా 

తీసుకెళ్తున్నట్లుండే ఆ మండలం...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

మంత్రిపదవితో మారుమ్రోగిన 

కాట్రేనికోన మండలం..

ఆ మండలంలోని పదహారు గ్రామాల్లో

చెయ్యేరు ఒక మేజర్ పంచాయితీ గ్రామం…

ఆ చెయ్యేరుని వీడకుండానే 

తన ప్రత్యేకతను 

నిలుకుంటున్నదే చెయ్యేరు అగ్రహారం.’’

గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాల గురించి ప్రస్తావించవలసిన అవసరమేమి వస్తుందో ఆలోచిస్తేనే… ఆ కళాత్మకత అర్థం అవుతుంది. అది మామూలుగా ఏదో ప్రబంధ వర్ణనల్లాగే కనిపిస్తున్నా, దాని వెనుకే ఒక సత్యం దాగుంది. అందం వెనుక దాగుండే అవమానాల మచ్చల్ని అలా చెప్పగలగడమే కళాత్మక వాస్తవికత!

       ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి 'నెమలికన్నులు' ఆత్మకథ వివిధ విభాగాల ఆధారంగా కోనసీమలోని దళితుల పరిస్థితి అత్యంత వైరుధ్యభరితంగా కనిపిస్తుంది. ప్రకృతి పరంగా ఆ ప్రాంతం పచ్చని కొబ్బరి తోటలు, ప్రవహించే గోదావరి పాయలతో ఎంతో సుందరంగా ఉన్నప్పటికీ, ఆ పచ్చదనం వెనుక దళితుల నిరంతర శ్రమ, ఆర్థిక వెనుకబాటుతనం దాగి ఉన్నాయి. అగ్రహారాల వంటి సామాజిక నిర్మాణాల మధ్య నివసిస్తూ, వారు ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా, కొబ్బరి దింపు కార్మికులుగా, పశువుల కాపరులుగా కఠినమైన శారీరక శ్రమపై ఆధారపడి జీవించేవారు. విద్యాపరంగా, సామాజిక గుర్తింపు పరంగా దళితుల పేర్లు, పుట్టిన తేదీలు కూడా వారి అభీష్టం మేరకు కాకుండా వ్యవస్థాగత ఆధిపత్య వర్గాలు, కులాల కింద నిర్ణయించబడేవని రచయిత అక్కడి వాస్తవికతను బహిర్గతపరిచారు. అయితే, ఇంతటి ఆర్థిక, సామాజిక వివక్షల మధ్య కూడా అంబేద్కర్ విగ్రహాలు ఆత్మగౌరవ చిహ్నాలుగా నిలవడం, చదువు ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే బలమైన ఆకాంక్ష ఆనాటి దళిత యువతలో మొలకెత్తిందని రచయిత చెప్తున్న  సంకేతాలుగా ఆ ఊరి వర్ణన చివరిలో అంబేద్కర్ విగ్రహాల చేతి చూపుల్ని అవగాహన చేసుకోవాలి.

'నెమలికన్నులు' ఆత్మకథ రచనాశైలి అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా సాగుతుంది. ఆయన శైలిలో ప్రధానంగా కోనసీమ మాండలికపు సొగసు, మట్టి వాసన ఉట్టిపడే పదజాలం కనిపిస్తాయి. క్లిష్టమైన సిద్ధాంతాల కంటే, అనుభవాల ద్వారానే సామాజిక వాస్తవికతను ఆవిష్కరించడం ఇందులో విశేషం. రచయిత ఎక్కడా కృత్రిమత్వానికి తావు లేకుండా, తన బాల్యంలోని పేదరికాన్ని, వివక్షను, కుటుంబ శ్రమను ఉన్నది ఉన్నట్లుగా స్వభావోక్తితో చిత్రించారు. వర్ణనల్లో దృశ్యరూపకత  ఆకర్షణీయంగా ఉంటుంది. తన తండ్రి, తల్లి చేసే పనులను వాస్తవికతను వ్యక్తీకరిస్తూనే ఒక దృశ్యాన్నేదో చూపిస్తున్నట్లుగా వర్ణించడం కనిపిస్తుంది.

‘’నాన్న రోజూ అనేక పనులు చేయడం చూసి 

నాకు ఆశ్చర్యం వేసేది. 

అవన్నీ ఎవరు నేర్పారనిపించేది. 

తెల్లవారితే ఒకరోజు పొలం పనికెళ్ళేవాడు. 

ఇంకో రోజు కొబ్బరికాయలు దింపుతీసేవాడు.

మరోరోజు తాటాకులు కొట్టడానికెళ్ళేవాడు. 

రోజు రోజుకీ కొత్తకొత్త పనుల్ని చేసేవాడు.

నాగలి దున్నేవాడు.

మూటలు మోసేవాడు.

చేపలు పట్టేవాడు.

చేపల వలను అల్లేవాడు. 

తాటాకులతో తానే అల్లేవాడు. 

ఒక తాటాకు చెట్టుమీద నుండే 

ఆ చుట్టూ ఉండే రెండుమూడు చెట్లకున్న 

ఆకులన్నీ కొట్టేవాడు.

కాసేపు భూమ్మీదే నిలబడలేకపోతున్నాం కదా.. 

నువ్వేంటి నాన్నా

తాటిచెట్టుకి కాళ్ళు తన్నిబెట్టి 

కత్తిన స్వారీ తిప్పినట్లు

అక్కడే మాక్కావాల్సిన ముంజికాయల్ని కోసి 

కిందికి 

చక్కని నైపుణ్యంతో వేస్తున్నావనిపించేది.’’

ఈ వర్ణనలో తన తండ్రి చేసే అనేక పనులను చెప్తున్నట్లు పైకి అనిపిస్తున్నా, నైపుణ్య వృత్తులు నైపుణ్యం కాని వృత్తుల పేరుతో రకరకాలు విభజనలు చేసి, కొన్ని వృత్తులకు గౌరవం ఇవ్వకుండా, సరైన ప్రతిఫలం కూడా అందకుండా చేసిన కుట్రలను త్రిప్పికొట్టే ఒక బలమైన ప్రాతిపదికలు దీనిలో ఉన్నాయి. జీవితాంతం ఒక వృత్తినే చేసి అదే పెద్ద నైపుణ్యంగా చెప్పుకునే వాళ్ళు, అనేక వృత్తులు చేసి అటన్నింటిలోనూ విజయవంతం అయ్యే వారిని ఏమనాలి అనేది స్ఫురింపజేయడం దీనిలో దాగి ఉన్న ఒక థియరీ. పైకి నిజమే కదా మా వాళ్లంతా బతకడం కోసం రకరకాల పనులు చేయవలసి వస్తుంది అని అనుకుంటారు. కానీ అన్ని వృత్తులు చేయాలంటే వాళ్ళలో ఎంత నైపుణ్యం కావాలి. వాళ్ల నైపుణ్యం గురించి ఏనాడైనా మాట్లాడుతున్నారా? ఇవన్నీ అడగకుండానే  సమాజాన్ని అడిగే ప్రశ్నలు. శ్రమ సౌందర్యాన్ని చెక్కిన శిల్పంలా అక్షరాల్లో ఎలా అందించారో చూడండి. 

‘’నాన్నా...

సాయంత్రం చేపల బుట్ట పట్టుకొని 

నీవెనకాలే నేనూ వచ్చేవాణ్ణి

నువ్వు గబగబా నడుస్తుంటే

నువ్వు గమనించేవాడివో లేదో గానీ

ఆ రంగరాజుకోడు కాల్వంతా 

నీ అడుగుల్తో పరవశించేది

ఆ కాల్వలో ప్రవహించే నీరు కూడా

నీ స్పర్శతో పవిత్రమయ్యేది…

నింగీ, నేలా, నీళ్ళూ, గాలీ, నిప్పూ ఏవైనా  ఈ పంచభూతాలన్నీ  శ్రమ సౌందర్యానికి మురిసిపోతుంటాయట! 

శ్రమ అనేది కేవలం బ్రతుకుదెరువు కోసం చేసే పని మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన యజ్ఞం, సౌందర్యారాధన అని ఈ కవితా పంక్తులు చాటిచెబుతున్నాయి. ప్రకృతిలోని పంచభూతాలు కూడా శ్రామికుడి స్పర్శకు పరవశించిపోతాయన్న భావనలో 'శ్రమ సౌందర్యం' ఉట్టిపడుతోంది. కాల్వ గట్టున నడుస్తున్న తండ్రి అడుగులు, ఆయన స్పర్శతో పునీతమయ్యే నీరు.. ఇవన్నీ కాయకష్టం చేసే మనిషికి ప్రకృతి ఇచ్చే అపురూపమైన గౌరవానికి చిహ్నాలు. శ్రమించే మనిషి చెమట చుక్కలోనూ, అలసట లేని అడుగులోనూ ఒకానొక దివ్యత్వం ఉంటుందని, ఆ నిష్కల్మషమైన కష్టమే లోకానికి నిజమైన అందాన్నిస్తుందని ఈ వర్ణన మనకు గుర్తుచేస్తుంది.

‘’ఆ గట్టునుండే ముళ్లన్నీ 

నీ అడుగుల కింద మెత్తని పువ్వుల్లా మారిపోయేవి

నువ్వేమీ వాటిని గమనించేవాడివి కాదు

ఆ తెల్లని పువ్వుల బుగ్గలప్పుడప్పుడూ 

సిగ్గుతో ఎర్రబడేవి

చేదిపరిగలు, కొర్రమేనులు, కట్టిచేపలు, 

మీసం మెలేసే పెద్దరొయ్యలు...

విషం ముళ్ళతో గుచ్చాలనుకునే ఇంగిలాలు

నీ చేతుల్లోపడేసరికే దొందుల్లాగో, 

బొమ్మిడాల్లోగో మారిపోయేవి.’’

ఈ కవితా పంక్తులు శ్రామికుడి అకుంఠిత దీక్షను, ప్రకృతి అతని పట్ల చూపే అనురాగాన్ని అత్యంత సుందరంగా చిత్రించాయి. తండ్రి పడే శ్రమలో ఉండే గాఢత వల్ల మార్గంలోని ముళ్లు కూడా పువ్వుల్లా మారిపోవడం, అంకితభావంతో చేసే పనిలో శారీరక కష్టాలు కూడా సుఖాలుగా తోస్తాయనే సత్యాన్ని చెప్తోంది. నదీ గర్భంలోని జలచరాలు, విషం ఉన్న చేపలు సైతం ఆ శ్రామికుడి చేతి స్పర్శ తగలగానే తమ ఉగ్రరూపాన్ని వీడి లొంగిపోవడం.. శ్రమకు ఉన్న అజరామరమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. ప్రకృతిలోని కఠినత్వం కూడా కష్టపడే మనిషి ముందు తలవంచుతుందని, ఆ శ్రమలో ఒక అలౌకికమైన సౌందర్యం, పవిత్రత ఉన్నాయని ఈ వర్ణన మనకు చాటిచెబుతోంది.

‘’నాన్నా…

ఆ గుర్రపుడెక్కవెనకాలే 

కట్లపాములు, జెర్రికట్లు కాసుక్కుర్చున్నా

నీ ముందవన్నీ బురదపాములయ్యేవి కదా...

నీ వల్లో పడీ 

బయటకిరాలేక 

చేతిని కాటేయాలని చూసే గొరకలు, జెల్లలూ

ఇన్నిరకాలు... ఎన్నెన్ని రకాలు...

ఇవన్నీ ఒక్కటీ కనిపించడం లేదు నాన్నా

చేలల్లో మందులు కొట్టడం వల్లనేమో 

అన్నీ హరించిపోయాయి!’’

ఈ కవితా పంక్తులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు పారిశ్రామికీకరణ వల్ల ప్రకృతిలో సంభవిస్తున్న వినాశనాన్ని అత్యంత వేదనాభరితంగా చిత్రించాయి. ఒకప్పుడు కోనసీమ కాలువల్లో, చేలల్లో సహజంగా లభించే రకరకాల చేపలు, జలచరాలు నేడు రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల అంతరించిపోయాయని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రసాయనాలే కాకుండా, కోనసీమ గర్భంలో జరుగుతున్న ప్రకృతి సహజవాయువుల (Natural Gas) త్రవ్వకాలు, పైప్‌లైన్ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు కలుషితమై, జీవవైవిధ్యం దెబ్బతింటోంది. తండ్రి కాలంలో ప్రకృతితో పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధం, శ్రమ సౌందర్యం నేడు యంత్రాల హోరులో, విషపూరిత వాతావరణంలో హరించిపోవడం.. అభివృద్ధి పేరిట మనం కోల్పోతున్న సహజ సిద్ధమైన సంపదకు, పర్యావరణ విధ్వంసానికి ఒక నిశితమైన హెచ్చరికగా నిలుస్తుంది.

‘’ఆ రంగరాజు వంతెన కాల్వ దగ్గర 

ఎగిసిపడే ఆ కెరటాల్లోకి

ఒక సవాలు విసిరినట్లు 

నువ్వు వలవిసిరేవాడివి కదా

నాన్నా 

నువ్వు వలేసి పట్టిన 

ఆ తాజా చేపల్ని

అమ్మ ఆ వర్షంలోనే అమ్మేది కదా

దాన్నిప్పుడు వండి 

నీకు తృప్తిగా తినిపించాలనుంది నాన్నా’’

తండ్రి శ్రమకు, తల్లి సహనానికి అద్దం పట్టే ఈ కవితా పంక్తులు అత్యంత హృద్యంగా ఉన్నాయి. రంగరాజు వంతెన కాల్వ దగ్గర ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలకు ఎదురొడ్డి తండ్రి వల విసరడం అనేది కేవలం చేపలు పట్టడం మాత్రమే కాదు, అది జీవితం విసిరే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సంకేతం. తండ్రి పట్టిన ఆ తాజా చేపలను, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తల్లి అమ్మడం వెనుక ఉన్న ఆవేదన, ఆ కుటుంబ పోషణలోని త్యాగం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.

అనాడు ఆకలి తీర్చడం కోసం తండ్రి పడ్డ కష్టానికి, నేడు ఎదిగిన కొడుకుగా కృతజ్ఞతతో ఆ రుచికరమైన భోజనాన్ని వండి తృప్తిగా తినిపించాలనుకోవడం.. పితృప్రేమ పట్ల ఉన్న గాఢమైన అనురాగాన్ని మరియు శ్రమకు ఇచ్చే అసలైన గౌరవాన్ని చాటిచెబుతోంది. నాడు ఆకలితో గడిపిన కాలం నుండి నేడు తృప్తిగా తినిపించగలిగే స్థాయికి చేరిన ప్రయాణంలోని ఆర్ద్రత ఈ కవితలో ప్రతిబింబిస్తుంది.

శ్రామిక జీవులైన రైతులు, వృత్తిపనివారు తాము సృష్టించిన అత్యుత్తమమైన 'మేలిమి' వస్తువులను తాము అనుభవించకుండా ఇతరులకు అమ్ముకోవడం వెనుక ఒక గాఢమైన సామాజిక విషాదం మరియు త్యాగపూరిత మానసిక కోణం దాగి ఉంది. తన కష్టార్జితాన్ని అనుభవించడం కంటే, దాన్ని అమ్మగా వచ్చే నాలుగు డబ్బులతో కుటుంబ అవసరాలు తీర్చడమే పరమావధిగా భావించే నిస్వార్థ బాధ్యత ఇందులో కనిపిస్తుంది. తరతరాలుగా పేదరికం, సామాజిక అణచివేత వల్ల "మంచి వస్తువులు ఇతరులకే చెందుతాయి" అనే ఒక రకమైన సరిపెట్టుకునే తత్వం (Adjustment) వారిలో స్థిరపడిపోయింది. లోకానికి అన్నం పెట్టే రైతు నూకలు తినడం, నాణ్యమైన పాలు పితికే పేదవాడు నీళ్ల మజ్జిగతో కడుపు నింపుకోవడం.. సమాజంలోని ఆర్థిక అసమానతలకు, శ్రమకు దక్కని సరైన విలువకు నిలువెత్తు సాక్ష్యాలు. తమ ఆకలిని చంపుకుని లోకపు ఆకలి తీర్చే ఈ శ్రామిక వర్గాల జీవితం, శ్రమ సౌందర్యానికి ప్రతీక అయినప్పటికీ, అది వారి అణచివేతకు దారితీసే ఒక వేదనాభరిత వాస్తవం.

శ్రామిక వృత్తులతో వాళ్ళు నిత్యం ప్రాణాలతో చెలగాటం చేయాల్సి వస్తుంది. వాటన్నింటినీ ఎదిరించాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఆ వృత్తులలోని నైపుణ్యాన్ని, ఆ వృత్తుల్లోని సాధక బాధల్నీ కళ్ళకు కట్టినట్లు వర్ణించటం ఈ వర్ణంలో కనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు ఆయా వృత్తులు చేసేవాళ్లు అవి తమ వృత్తులే అని అనుభూతి చెందుతారు. 

అందుకే ఈ ఆత్మకథ కేవలం కుల అవమానాలను మాత్రమే వర్ణించలేదు, శ్రామిక సౌందర్యంలోని ఔన్నత్యాన్నీ మన కళ్ళ ముందు నిలబెట్టి చూపిస్తుంది. భారతదేశవ్యాప్తంగా ఈ వృత్తులు చేసే వాళ్లంతా దీన్ని తమ పని గానూ, తమ జీవితంగానే భావిస్తారు.  పైకి తన నాన్న గురించి చెబుతున్నట్లే అనిపిస్తున్నా, భారతదేశంలోని కులవృత్తుల గురించి సాధారణీకరించిన తీరును ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. 

ఇంకా ఈ శ్రామిక సౌంర్యాన్ని దృశ్యాత్మకంగా వర్ణించిన తీరు అనేక వృత్తుల వారిని ఇదంతా తమ జీవితమేనని భావించేలా చేస్తుంది.

‘’నాన్నా... నువ్వు 

నా బాల్యాన్నంతా తీపిగుర్తులతో నింపావు

నన్నూ నీతో పాటే పొలాలకు తీసుకెళ్ళేవాడివి

నువ్వు పొలంలో వరికోత కోస్తుంటే

నీచేతిలో కొడవలి వణికిపోయేది

పోటీపడి మరీ 

వరికంకులన్నీ నీచేతిలో ఒదిగిపోయేవి

నాకూ చాలా సరదా అనిపించేది

నేనూ అలా కోయాలనుకునేవాణ్ణి

ప్రయత్నించి వరితో పాటు చేయినీ కోసుకున్నప్పుడు

నువ్వు పడిన హడావిడిలో 

నాకా బాధే తెలిసేదికాదు’’

తల్లిదండ్రులు చేసే వృత్తులు పిల్లలకు అబ్బడం అనేది కేవలం వారసత్వం మాత్రమే కాదు, అది అనుకరణ మరియు అనురాగంతో కూడిన ఒక 'నిశ్శబ్ద విద్యాభ్యాసం'.ఇలా ఒక తరం నుండి మరో తరానికి వృత్తి నైపుణ్యాలు బదిలీ అవ్వడం వెనుక కేవలం ఆర్థిక అవసరమే కాకుండా, కన్నవారి పట్ల ఉండే గౌరవం, వారు చేసే పని పట్ల కలిగే పరవశం ప్రధాన భూమిక పోషిస్తాయి.

వృత్తులు సహజంగా అబ్బడం ఎంత ఆత్మీయంగా ఉంటుందో, అది ఒక దశలో ఇతర రంగాల్లో రాణించడానికి ఒక అదృశ్య సంకెళ్ళా కూడా మారి అభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తుంది. బాహ్య ప్రపంచంలోని ఇతర వృత్తుల పట్ల అవగాహన పెంచుకునే అవకాశం కోల్పోతారు. పేదరికం, కులవృత్తుల నేపథ్యం ఉన్న కుటుంబాల్లో "ఈ పని వస్తే చాలు బ్రతికేయవచ్చు" అనే సరిపెట్టుకునే తత్వం ప్రబలి, ఉన్నత చదువుల పట్ల లేదా ఇతర నైపుణ్యాల పట్ల ఆసక్తిని చంపేస్తుంది. ఒక రకంగా ఇది ఒక 'దుష్టవలయం' లా మారి, ఆ తరాన్ని మళ్ళీ అదే శ్రమకు, అదే సామాజిక స్థితికి పరిమితం చేస్తుంది. ఫలితంగా, వ్యక్తిలోని సహజ సామర్థ్యం లేదా ఇతర రంగాల్లో రాణించాలనే కలలు ఆ వంశపారంపర్య వృత్తి నీడలో మరుగున పడిపోయి, సామాజిక ఎదుగుదలకు అది ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది.పైకి తన తండ్రితో ఉన్న అనుభవాలనే చెప్తున్నట్లు అనిపిస్తున్నా, వంశపారంపర్య వృత్తుల పట్ల భిన్న దృక్పథాలను చర్చకు తెచ్చినట్లయ్యింది. 

‘నాన్నా... నువ్వు 

పొలం దున్నుతుంటే

అలుపూ సొలుపూ లేకుండా 

నీతో పోటీపడి మరీ

ఆ ఎద్దులు పరిగెట్టాలనుకునేవి

నీ వెనకాలో నీ ముందో

ఎవరొకరు  నాగళ్ళు దున్నతుంటే

నిన్ను చూసి వాళ్ళు

వాళ్ళని చూసి నువ్వూ పోటీ పడుతుంటే

పనిలోనే భలే పసందుంటుందనిపించేది’’ 

అని ఒక రైతుని, ఒక రైతు కార్మికుడ్ని ఆ పనిలోని శ్రామిక సౌందర్యాన్ని కళ్ళ ముందు ఉంచినప్పుడు, అది చదివే పాఠకుడు ఈ జీవితం కేవలం దార్ల వెంకటేశ్వరరావు గారు,  వాళ్ళ తండ్రి కి సంబంధించినది మాత్రమే అని అనుకోగలుగుతారా? ఇలాంటి శైలినే తన జీవితాన్ని చెప్తూనే సత్యాన్ని కళాత్మకంగా ఆవిష్కరించడమంటారు.

పొద్దున్నుండి కొబ్బరి చెట్లో, తాడిచెట్లో ఎక్కి కష్టపడి కూడా తమ కోసం వాళ్ళ నాన్నగారు అంత కష్టపడడాన్ని గమనించే తనకు తననాన్నంటే ఎక్కడలేని ప్రేమనిపించేదంటారు రచయిత. తల్లీ,తండ్రి చేసే పని పిల్లలు దగ్గరుండి గమనిస్తే, వాళ్ల పట్ల గౌరవ మర్యాదలు అనుబంధాలు ఎలా పెనవేసుకుంటాయో ఈ ఆత్మకథ మనకి తెలియజేస్తుంది. 

కోనసీమ ప్రాంతంలోని 'పాలేరుతనం' అనేది  వెట్టిచాకిరీ వ్యవస్థను పోలి ఉంటుంది. దాని వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక అణచివేతను కళ్ళకు కట్టినట్లు స్వీయానుభవంతో వివరించారు. భూస్వాములకు, పేదలకు మధ్య జరిగే ఒక కఠినమైన ఒప్పందంగా మొదలయ్యే ఈ విధానం, క్రమంగా ఒక వ్యక్తిని బానిసగా మార్చి, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సామాజిక బహిష్కరణకు గురిచేసేంత క్రూరంగా ఉండేదని రచయిత వివరించారు. పేదరికం వల్ల తన అన్నను పాలేరుగా పంపాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో రచయిత ఒకరోజు ఆ పనికి వెళ్ళినప్పుడు ఎదురైన అవమానకర అనుభవాలు ఇందులో అనేకమంది పాలేరుతనం వల్ల అనుభవించిన కష్ట, నష్టాలను, యజమానుల అమానుష ప్రవర్తనను, పెట్టిన పాచి అన్నాన్ని నిరసిస్తూ, ఆత్మగౌరవంతో ఆ బానిస సంకెళ్ళను తెంచుకుని బయటకు రావడాన్ని ఈ వృత్తాంతం శక్తివంతంగా చిత్రించింది. కుల ఆధిక్యతతోపాటు, శ్రమ దోపిడి ఎలా జరిగేదో కోస్తా ప్రాంతాల్లోని పాలేరు వ్యవస్థ గురించి అధ్యయనం చేసే వారికి ఇది గొప్ప చారిత్రక పత్రంలా ఉపయోగపడుతుంది.

కోస్తా ప్రాంతాల్లోని ప్రజల జీవన విధానం కొబ్బరి చెట్లు, తాడి చెట్లతో ఎలా ముడిపడి ఉందో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన నెమలి కన్నులు ఆత్మకథ ద్వారా ఎంతో సహజంగా ప్రాదేశిక అనుభూతిని కలిగిస్తూ తన ఆత్మకథలో వివరించారు. కోస్తా తీరప్రాంత (కోనసీమ) పేద ప్రజల జీవితం తాటి, కొబ్బరి చెట్లతో ఎంతగా పెనవేసుకుపోయిందో అత్యంత సహజంగా చిత్రించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఆకలిని తీర్చుకోవడానికి తాటి చెట్టు ఒక 'కల్పవృక్షం'లా ఎలా ఉపయోగపడేదో వివరిస్తూ.. తాటి ముంజులు, తాటి పండ్లు, వాటితో చేసే కుడుములు, రొట్టెలు, మరియు భూమిలో పాతర వేసి పండించే తేగలు వంటి ఆహారపు అలవాట్లను ఆయన గుర్తుచేసుకున్నారు. కేవలం ఆహారంగానే కాక, తాటాకులతో ఇళ్లు కప్పుకోవడం, గొడుగులు, బుట్టలు అల్లుకోవడం వంటి జీవనోపాధి అంశాలను ప్రస్తావిస్తూనే, ఆనాటి సామాజిక స్థితిగతుల్లో కులం, పేదరికం తెచ్చే సవాళ్లను తన తల్లిదండ్రుల నిరంతర శ్రమ, క్రమశిక్షణ ద్వారా ఎలా అధిగమించారో వివరించారు.

తన అనుభవాల ద్వారా నాటి సమాజంలో దళితులు, పేదవారి పట్ల అగ్రవర్ణాలు ప్రదర్శించిన వివక్షా పూరిత వైఖరిని స్పష్టంగా వివరించారు. పేదవారు తమ అవసరాల కోసం పాలు కొనాలంటే అగ్రవర్ణాల ఇళ్ల వద్ద ఎదురుచూడాల్సి వచ్చేదని, వారు నీళ్లు కలిపిన పాలు ఇచ్చినా భరించక తప్పని పరిస్థితి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, దళితులు తమ గేదెల పాలను అమ్ముదామంటే అగ్రవర్ణాల వారు అనేక వంకలు పెడుతూ, పాలల్లో నీళ్లు ఉన్నాయని నెపంతో తక్కువ ధర ఇచ్చేవారని లేదా డబ్బుల కోసం పదేపదే తిప్పించుకునేవారని ఆవేదన వ్యక్తం చేశారు. "కొందామంటే కొరివి (ఖరీదు), అమ్ముదామంటే అడవి (అడిగేవాడు లేడు)" అన్న చందంగా సాగిన ఈ ఆర్థిక, సామాజిక దోపిడీ.. పేదవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాక, వారి కష్టార్జితానికి సరైన విలువ దక్కకుండా చేసే ఆధిపత్య పోకడలను ప్రతిబింబిస్తుంది.

అక్షరజ్ఞానం లేని ఒక సామాన్య తల్లి తన బిడ్డలకు పౌరాణిక గాథలను వినిపించడం ద్వారా, కేవలం కథలను మాత్రమే కాక గొప్ప ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసింది. అరుంధతీదేవి, వశిష్ఠుడు, వ్యాసుడు వంటి మహర్షుల జన్మవృత్తాంతాలను వివరిస్తూ, భారతీయ అగ్రశ్రేణి మేధావుల మూలాలు అణగారిన వర్గాల్లోనే ఉన్నాయనే చారిత్రక సత్యాన్ని బిడ్డల మనసుల్లో నాటింది. "మనం కూడా ఆ మహనీయుల వంశానికి చెందిన వారమే" అని చెప్పడం ద్వారా వారిలో సాంస్కృతిక ఔన్నత్యాన్ని, తమ అస్తిత్వం పట్ల గర్వాన్ని నింపింది. ఈ మౌఖిక కథా సంప్రదాయం పేదరికం, వివక్ష వంటి సామాజిక అవరోధాలను అధిగమించి, ఉన్నత లక్ష్యాల వైపు సాగడానికి అవసరమైన నైతిక బలాన్ని, స్ఫూర్తిని ఇచ్చే ఒక గొప్ప విద్యా సాధనంగా ఆత్మకథ స్ఫూర్తినిస్తుంది.

గ్రామీణ ప్రాంతాలలో పేదవాళ్ళు చదువుకోవాలంటే పడే కష్టాలు సామాన్యం కాదు.  దానికి తోడు కులం కూడా తోడైతే ఇంకెలా ఉంటుంది?

గ్రామీణ ప్రాంతాల్లో దళిత, పేద విద్యార్థులు జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి పడే కష్టాలు వర్ణనాతీతమని ఈ వృత్తాంతం నిరూపిస్తుంది. కనీసం ఒక దినపత్రిక చదువుకోవాలన్నా ఆధిపత్య వర్గాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి రావడం, దానికి ప్రతిఫలంగా రైస్ మిల్లుల్లో ప్రాణాలకు తెగించి ధాన్యం బస్తాలు మోయడం, ఊక గొట్టాలను శుభ్రం చేయడం వంటి కఠినమైన పనులు చేయాల్సి రావడం నాటి సామాజిక వివక్షకు నిదర్శనం. ఆకలిని తట్టుకోలేక మిల్లులోని తౌడును తింటూనే, పత్రికలోని అక్షరాల కోసం శ్రమించడం చదువు పట్ల ఉన్న తపనను చాటిచెబుతుంది. పేదరికానికి కులం తోడైనప్పుడు, ఒక సామాన్యమైన హక్కును పొందడానికి కూడా శారీరక శ్రమను మించిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ఈ అనుభవం స్పష్టం చేస్తోంది. 

పుట్టడం వరకు పిల్లలకు ఏమీ తెలియకపోయినా, పుట్టిన తర్వాత ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. తమ కులం ఏమిటో తెలుస్తుంది. తమ ఆర్థిక పరిస్థితులు, తమ కులాలే తమకొక అస్తిత్వాన్ని ఇస్తాయి. వీటిని కేంద్రీకరించి, తన జీవిత కేంద్రంగా సాధారణీకరించడమే ఈ ఆత్మకథలో కనిపించే ప్రధానమైన వస్తువు. ఈ ఆత్మకథ బాల్యాన్ని కేంద్రంగా చేసుకుంది. కాబట్టి అందరి బాల్యం ప్రత్యక్షంగానో,  పరోక్షంగానో ఈ ఆత్మకథలో కనిపిస్తుంది. అందుకేనేమో ఈ వాక్యాలతో తన ఆత్మ కథను ముగించారు.

‘’బాల్యం ఒక చెలమ లాంటిది

నీళ్లు ఎన్నో లేవనిపిస్తుంది.

ఆ నీళ్లు తోడేయగానే 

మరలా నీళ్లు ఊరిపోతాయి.

జ్ఞాపకాలూ, ఆ బాల్య జీవితమూ అంతే.

ఇంకేముందిని అనిపిస్తుంది.

గతంలోకి వెళ్ళగానే మళ్ళీ

దొంతరదొంతరలుగా,

 అలలు అలలుగా,

పొరలు పొరలుగా 

కనిపించే జీవితంలా బయటకొస్తుంది.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన 'నెమలికన్నులు' ఆత్మకథలో బాల్యాన్ని ఏ ఒక్క వర్గానికో పరిమితం చేయకుండా, అది కుల, మత, ప్రాంతీయతలకు అతీతమైన ఒక సార్వత్రిక అనుభవంగా సాధారణీకరించారు. బాల్యంలో పడే కష్టాలు, చేసే ఆటపాటలు, ప్రకృతితో పంచుకునే అనుబంధం ఏ బిడ్డకైనా దాదాపు ఒక్కటేనని, అయితే సామాజిక స్థితిగతుల వల్ల ఆ అనుభవాల తీవ్రతలో మాత్రమే తేడాలు ఉంటాయని ఆయన ప్రతిపాదించారు. కాలువ గట్టున పశువులను కాయడం, జీలుగు చేలల్లో దాగుడుమూతలు ఆడటం, తండ్రి వెనుక పొలాలకు వెళ్లడం వంటి దృశ్యాలను వర్ణించడంలో ఆయన ఒక కళాత్మకమైన సామాన్యీకరణను పాటించారు. జ్ఞాపకాలు అనేవి 'చెలమ' లాంటివని, వాటిని తోడేకొద్దీ కొత్త అనుభూతులు పుట్టుకొస్తాయని చెప్పడం ద్వారా, ప్రతి మనిషి తన గతంలోకి వెళ్ళినప్పుడు పొందే ఆత్మీయత ఒక్కటేనని ఆయన నిరూపించారు. ఆత్మకథలోని సామాజిక వివక్షను సైతం ఒక పసివాడి అమాయకత్వంతో, ప్రకృతి ఒడిలో సాగే జీవితంతో ముడిపెట్టి చెప్పడం వల్ల, ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్రగా కాకుండా ఒక తరపు సామాజిక దృశ్యకావ్యంగా ఆవిష్కృతమైంది.

‘’బాల్యం ఒక సముద్రం లాంటిది

దాని లోతు , దాని తీరం కనుక్కోలేం .

బాల్యం నాటి చిలిపి చేష్టలు 

కష్ట సుఖాలు  అలాంటివే.

తుది మొదలు అదేనని చెప్పలేం.’’

బాల్యాన్ని ఒక 'అనంతమైన సముద్రం'తో పోల్చడం వెనుక ఉన్న సామాన్యీకరణ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సముద్రానికి లోతు, తీరం ఎలాగైతే కొలవలేమో, బాల్యంలోని చిలిపి చేష్టలు, కష్టసుఖాల తాలూకు జ్ఞాపకాలు కూడా అంతే అపరిమితమైనవని ఆయన అభివర్ణించారు. ఏ అనుభవం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగిసిందో చెప్పలేనంతగా అవి జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయని ఈ పోలిక స్పష్టం చేస్తోంది. ఒక వ్యక్తిగత అనుభవాన్ని సార్వజనీన సత్యంగా మలచడంలోనే ఈ అభివ్యక్తి సౌందర్యం దాగి ఉంది. ప్రతి మనిషి తన గతంలోకి తొంగి చూసుకున్నప్పుడు, ఆ బాల్యపు సముద్రపు అలలు తనను తాకుతున్నట్లుగానే అనుభూతి చెందుతాడు. ఈ రకమైన సామాన్యీకరణ వల్ల 'నెమలికన్నులు' ఆత్మకథ కేవలం ఒక వ్యక్తి చరిత్రగా మిగిలిపోకుండా, ప్రతి పాఠకుడిని తన సొంత బాల్యపు తీరానికి తీసుకెళ్లే ఒక విశ్వజనీన రచనగా రూపుదిద్దుకుంది.

‘’బాల్యం ఒక ఆకాశంలాంటిది.

దాని ఎత్తూ, దాని వెడల్పూ ఇదేనని చెప్పలేం.

బాల్యం నాటి అనుభూతుల తీవ్రతనూ,

పెనవేసుకున్న అనుబంధాల్నీ ఇవేనని చెప్పలేం.’’

ఆకాశానికి హద్దులు లేనట్లే, బాల్యపు అనుభూతులకు, ఆనాడు పెనవేసుకున్న అనుబంధాలకు కూడా కొలమానాలు ఉండవని ఈ కవితా పంక్తులు చాటిచెబుతున్నాయి. చిన్ననాటి జ్ఞాపకాలు కేవలం గతానికి సంబంధించినవి కావు; అవి ఆకాశమంత ఎత్తున, వెడల్పున మన జీవితాంతం విస్తరించి ఉండి, మన అస్తిత్వాన్ని నడిపిస్తుంటాయి. ఏ ఒక్క అనుభవం లేదా అనుబంధం ఇదేనని విడదీసి చెప్పలేనంతగా, అవన్నీ ఒక నిరంతర ప్రవాహంలా మనిషిని అంటిపెట్టుకుని ఉంటాయని ఈ సామాన్యీకరణ మనకు గుర్తుచేస్తుంది.

‘’బాల్యం ఏముందనిపిస్తూనే,

ఎంతమహోన్నతమైనదో కనిపించీ కనిపించని 

ఒక దోబూచులాట లాంటిది. 

బాల్యాన్ని ఎన్నింటితోనైనా పోల్చగలం.

బాల్యాన్ని ఎన్నిరకాలుగానైనా ఉత్ప్రేక్షించగలం.

ప్రతి ఒక్కరి బాల్యం  కొత్త మెరుపులు కురిపిస్తూ

నిత్యం నవ్యంగా కనిపించే పాతవే అయినా

కొత్తగా కనపడే నక్షత్రాల లెక్కింపు లాంటిది.’’

బాల్యాన్ని నిత్యం మెరిసే నక్షత్రాల లెక్కింపుతో పోల్చడం ఈ కవితలోని అత్యున్నతమైన అభివ్యక్తి. ఆకాశంలో నక్షత్రాలు పాతవే అయినా ప్రతిరోజూ మనకు కొత్త మెరుపులతో ఎలా కనిపిస్తాయో, బాల్యపు జ్ఞాపకాలు కూడా ఎన్నిసార్లు తలుచుకున్నా ప్రతిసారీ ఒక నవ్యమైన అనుభూతిని కలిగిస్తాయని రచయిత వివరించారు. అది ఒక 'దోబూచులాట' లాంటిదని చెప్పడం ద్వారా, బాల్యంలో కనిపించే చిన్న చిన్న విషయాల వెనుక ఎంతటి మహోన్నతమైన జీవన సత్యాలు దాగి ఉన్నాయో స్పష్టమవుతుంది. ఈ ఉత్ప్రేక్షల ద్వారా బాల్యం అనేది కేవలం గతం కాదని, అది ప్రతి ఒక్కరి హృదయంలో నిరంతరం కొత్త వెలుగులు విరజిమ్మే ఒక అక్షయమైన చైతన్యమని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఎంతో ఆకర్షణీయంగా సామాన్యీకరించారు.

మొత్తం మీద నెమలి కన్నులు ఆత్మ కథలో కులం వల్ల కలిగే అవమానాలు, ఆర్థిక కష్టాలు చెప్తున్నా వాటిని చెప్తున్నట్టుగా కాకుండా, బాల్యాన్ని బాల్యంలో వచ్చే కష్ట సుఖాలను వివరిస్తున్నట్లు చెప్తూనే, ఒక కళాత్మక సత్యంగా దృశ్య వర్ణనలతో కళ్ళకు కట్టినట్లు చూపించడం ఈ ఆత్మకథ ప్రత్యేకత. బాల్యంలోని సహజమైన అనుభవాల గుండా ఒక కళాత్మక సత్యంగా ఆవిష్కృతమయ్యాయి. పసిమనసులోని కుతూహలం, ఆటపాటలు, ప్రకృతితో మమేకమవ్వడం వంటి అంశాలను వివరిస్తూనే, వాటి వెనుక అంతర్లీనంగా ఉన్న సామాజిక అణచివేతను రచయిత ఎంతో నిశితంగా చిత్రించారు. ఎక్కడా ఉపన్యాస ధోరణి లేకుండా, ఒక కళాత్మక సంవేదనతో నాటి సామాజిక వాస్తవికతను ప్రతిబింబించడం ఈ ఆత్మకథను ఒక విశిష్ట సాహిత్య ఖండంగా నిలబెట్టింది. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి 'నెమలికన్నులు' ఆత్మకథలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో కులం వల్ల కలిగిన అవమానాలను, ఆర్థిక కష్టాలను కేవలం ఒక నిరసనగా కాకుండా, అత్యంత కళాత్మకమైన దృశ్య వర్ణనలతో కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. పక్షపాతపూరితమైన 'పాలేరుతనం', పాలు అమ్మడంలో ఎదురైన వివక్ష వంటి చేదు అనుభవాలను స్వీయానుభవంతో వివరిస్తూనే, వాటిని బాల్యపు అమాయకత్వంతోనూ, ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధంతోనూ ముడిపెట్టి ఒక కళాత్మక సత్యంగా ఆవిష్కరించారు. సామాజికంగా ఎదురైన ఒకటి రెండు వివక్షాపూరిత సంఘటనలను పక్కన పెడితే, శ్రమ సౌందర్యం, ఆటపాటలు, తల్లిదండ్రుల అనురాగం వంటి విషయాల్లో సగటు మానవ జీవితమంతా ఒకేలా ఉంటుందనే సాధారణీకరణ ఈ రచనలో కనిపిస్తుంది. వ్యక్తిగత వేదనను విశ్వజనీనమైన బాల్యపు జ్ఞాపకాలతో మేళవించి, సామాజిక వాస్తవికతను గుండెలకు హత్తుకునేలా చెప్పడం ఈ ఆత్మకథను ఒక విశిష్ట సాహిత్యఖండంగా నిలబెట్టింది.

డి.సాయినాథ్ రెడ్డి, 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

(నినాదం దినపత్రిక, 5.4.2026 సౌజన్యంతో )

22 మార్చి, 2026

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'నెమలి కన్నులు(ఆత్మకథ)' పై డాక్టర్ కొత్వాలు అమరేంద్ర వ్యాసం

 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'నెమలి కన్నులు(ఆత్మకథ)' మీద సృజన క్రాంతి దినపత్రిక(17-5-26)లో  ప్రత్యేక వ్యాసం..... డాక్టర్ కొత్వాలు అమరేంద్ర 

#############₹###₹#



 సంక్షుభిత జీవన పార్శ్వాల ఆత్మకథ



గతాన్ని తలచుకుంటూ ఆ గతం కల్పించిన వెన్నెల దారుల్లోనూ, ముళ్ల దారుల్లోనూ సాగించిన నడకల్లోని ఒడిదుడుకుల్ని చర్వితచరణం చేసుకోవడమే కాక తనలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించే తనకు ఎదురైన ఎన్నో సంఘటనల్నీ, మరెన్నో సందర్భాల్నీ తన భావోద్వేగాలతో సంలీనం చేయడమే అసలైన ఆత్మకథ అవుతుంది. బాల్యపు నోస్టాల్జియా జ్ఞాపకాల్లో భాగంగా అలాంటి జీవనసంఘర్షణ తాలూకు విభిన్న పార్శ్వాలు కల్పించిన ఎన్నో ఒడిదుడుకులకు అక్షరరూపం కల్పిస్తూ, సామాజిక సంక్షోభంలో ఎదురైన ఎన్నెన్నో ఆటపోట్లను ఎదుర్కొంటూ తాను ఎదిగిన క్రమాన్ని వివరిస్తూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వెలువరించిన ఆత్మకథే ‘నెమలి కన్నులు’ 

తెలుగులో తొలి ఆత్మకథ 1911లో కందుకూరి వీరేశలింగం ‘స్వీయచరిత్రము’తో పారంభమైనా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సామాజిక ప్రయోజనాన్ని కలిగించే స్ఫూర్తిదాయక స్వీయచరిత్రలు 1934లో ఏడిదము సత్యవతి వెలువరించిన ‘ఆత్మచరితము’(భర్త చనిపోయాక ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తీరును వివరించడం) గ్రంథంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. 20వ శతాబ్దంలోనే తెలుగులో స్వీయచరిత్ర ప్రక్రియ విభిన్న సామాజిక పార్శ్వాలతో, సామాజిక సందేశాలతో పుజుకోవడం ప్రారంభమైంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం ‘మాబడి’(తాను అంధుడైనప్పటికీ సాహిత్యంలో తాను ఒక్కోమెట్టు అధిగమించిన విధాన్ని చెప్పడం), ఆదిభట్ల నారాయణదాసు ‘ఎరుక’(ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ హరికథాపితామహునిగా తాను ఎదిగిన క్రమాన్ని వివరించడం), కొండపల్లి కోటేశ్వరమ్మ ‘నిర్జనవారథి’( తాను నమ్ముకున్నఉద్యమంలో ఆత్మస్థైర్యంతో తాను ఎదుర్కొన్న అడ్డంకుల్ని వివరించడం), గుర్రం జాషువా ‘నాకథ’(తన సాహిత్యప్రస్థానంలో తాను ఎదుర్కొన్న అనేక వివక్షలను పద్యరూపంలో వివరించడం), ఎన్నో సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ చలం రాసుకున్న ‘స్వీయచరిత్ర’, భోయి హైమవతి ‘పాలేరు నుంచి పద్మశ్రీ వరకు’(తన భర్త భోయి భీమన్న ఎగుడుదిగుడుల జీవనపోరాటాన్ని ఆయన సతీమణి తన ఆత్మకథలో నిక్షిప్తం చేయడం)..వంటి ఆత్మకథలు ఎంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నింటి స్ఫూర్తితో దార్ల  ఒక సామాజిక లక్ష్యంతో తన ఆత్మకథను తీర్చిదిద్దారు. 

బాల్యంలోని నోస్టాల్జియా జ్ఞాపకాలు కొందరికి ఎంతో అపురూపంగా కనిపిస్తే మరికొందరికి జీవన సంఘర్శణతో మిళితమైన ఎన్నో ఒడిదుడుకులుగా కనిపిస్తాయి. అలాంటి జీవనసంఘర్షణలతోనే ఈ రచయిత ఆత్మకథ సాగుతూ సామాజిక సంవేదనను వినిపిస్తుంది. ఎన్నెన్నో ప్రశ్నలను సంధిస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ ముందుకు సాగింది ఈ రచయిత జీవితపయనం. తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూనే తన కుటుంబనేపథ్యంలో చోటుచేసుకున్న సామాజిక సంక్షోభాన్ని వివరించడమే ఈ రచయిత ప్రధాన ఉద్దేశం. ఆధిపత్యం, వివక్షల మధ్య విలవిలలాడిన తన కుటుంబం తనలో కలిగించిన సంఘర్షణలను తన బాల్యంలోని వివిధ దశల్లో అంటే చిన్నతనం నుంచి పదవ తరగతి దశవరకు 39 అధ్యాయాల్లో వివరించుకుంటూ వేళతాడు. తన కుటుంబాన్ని నెట్టుకురావడంలో తల్లిదండ్రులు పడిన కష్టాలను వివరిస్తూ వారి ప్రేమాభిమానాలకు అక్షరాభిషేకం చేశాడు. ఈ ఆత్మకథ 25 వారాలపాటు భూమిపుత్ర దినపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. 

ఈ ఆత్మకథలో రచయిత చెప్పుకున్న బాల్యజ్ఞపకాలు విని మురిసిపోయేంత అపురూపమైన ముచ్చట్లు కావు. తన పసిమనసును గాయపరచిన విభిన్న సామాజిక సంఘర్షణల తాలూకు ఆటుపోట్లుగానూ, సామాజిక చైతన్యానికి దోహదపడే సామాజిక గాట్లుగానూ అవి కనిపిస్తాయి. తన తండ్రితోబాటు పొలం పనులకెళ్లినా, బోర్లు వేసే పనులకెళ్లినా తాను విద్యార్థిగా ఎదిగిన క్రమాన్ని వివరించిన విదానం స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. ఈ ఆత్మకథలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రచయిత కథనాత్మక శైలి. ‘పొద్దున్నే ఆ నల్లని మేఘాలెంత వేగంగా నడిచేవో, అంతకంటే వేగంగా అనేకసార్లు దూరపు ఊళ్లలో పనికోసం మా వాళ్లతోపాటునేనూ నడిచేవాణ్ణి కదా అనిపించేది..’. ఇలాంటి శైలే ఈ రచనను చివరివరకూ సుసంపన్నం చేసింది. ఎప్పుడూ పచ్చని పోలాలతో కళకళలాడే కోనసీమ మారుమూల నున్న తమ ఊరిలోని దళిత సౌందర్యాన్ని వివరిస్తూనే తమ వూరిలోని విభిన్న కులాల మధ్య చోటుచేసుకున్న వివక్షలనూ ప్రస్తావిస్తాడు. అది వివరించే క్రమంలో ‘స్మశానం కాని స్మశానంలో కూడా కులం వదలిపెట్టని స్థితిని నేను మా వూరిలో చూశాను’ అంటాడొకచోట. తాను చదువుకునే పాఠశాల గురించి చెప్పే సందర్భంలో స్కూలు రిజిస్టర్ లో తమ పేర్లను తమ అభీష్టానికి అతీతంగా ఉపాధ్యాయులే నిర్ణయిస్తారని చెప్పడం వివక్షలోని ఒక కోణాన్ని చూపిస్తుంది. అందుకే ‘మా పేర్లు మా ఊహల్లోనుంచి వచ్చినవి కాదు. మా అభిరుచులనుంచి ఏర్పడినవి కాదు. వాళ్లకు నచ్చితే మంచి పేరు. వాళ్లకు నచ్చకపోతే వాళ్లిష్టమొచ్చిన పేరే మా పేరుగా మారిపోయేది’..అంటాడింకొక చోట. స్కూలులో ఎప్పుడూ పిల్లల ముందుభాగంలో నిలుచుకునే తనను జెండా పండుగ వందనం రోజున వెనుకవైపున నిలబెట్టడం ఈ రచయితలో తీవ్ర అంతర్మథనాన్ని రేకెత్తించి ఎన్నో ప్రశ్నలను లేవదీస్తుంది. ఈ అతర్మథనమూ స్ఫూర్తిదాయకమే. 

 రచయితకు ఎదురైన పలుసంఘటనల్లోనూ, పలు సందర్భాల్లోనూ వివక్ష అనేక రకాలుగా కనిపిస్తుంది. ఉదాహరణకు జుట్టు కటింగ్, బట్టల ఇస్త్రీ విషయాల్లోనూ చోటుచేసుకునే వివక్షను ఒక అధ్యాయంలో విడమరచి చెబుతాడు. ‘మనకి మంగలాయన కటింగ్ వెయ్యడానికి రారు. అందుకనే నేను మీకు చేస్తున్నా’ అంటూ తనకు జుట్టు కత్తిరించే తండ్రి ‘అదంతే మనకి చెయ్యరు. ఎవరైనా మనకి కటింగ్ చేసినట్టు తెలిస్తే ఊరంతా ఆ మంగలిని వెలివేస్తారు. అందుకే చెయ్యరు’ అని చెప్పడం ఈ రచయితలోని ఆత్మగౌరవాన్ని ప్రశ్నింపజేస్తుంది. అలాగే తమ గేదెపాల విక్రయంలోనూ అగ్రకులాల వారినుంచి ఎదురయ్యే ఇక్కట్లనూ వివరిస్తాడు. ఈ ఆత్మకథలో రచయిత ముఖ్యంగా పాలేరుతనం గురించి వివరించేటప్పుడు ఆ పాలేరుతనం తమ కుటుంబం లాంటి ఎన్నో కుటుంబాలకు ఎంత సంక్షోభాన్ని మిగిల్చిందో విశదీకరిస్తాడు. తాను కూడా ఒకరోజు పాలేరుగా వెళ్లినప్పుడు తనకు పాచిపోయిన అన్నం పెట్టిన యజమానురాలి వివక్షకు గురై తాను అనుభవించిన మానసికక్షోభను వర్ణిస్తాడు. పాలేరుతనంలో మగ్గిపోయే కుటుంబాల దుర్భరస్థితిని తనకు కలగా వచ్చిన తుఫానుతో ఇలా పోలుస్తాడు... ‘ఒక పెద్ద తుపాన్...వేగంగా వస్తున్న గాలులు... పెద్దపెద్ద చెట్లు కూలుతున్నాయి.. మేమంతా వాటినుంచి తప్పించుకోవాలని పరుగు పెడుతున్నాం.. అంతలోనే పెద్ద వరద. ముచుకొచ్చేస్తున్ననీట చేలన్నీ మునిగిపోయాయి. మా రోడ్లన్నీ మునిగిపోయి దారులన్నీ తెగిపోయాయి. ఎటుచూసినా చీకటి. నీళ్లు మా ఇంటి ముంగిటకొచ్చేశాయి’.... పాలేరుతనం రూపంలో వికటాట్టహాసం చేసే కులవివక్ష అనే ఒక సామాజిక సంక్షోభాన్ని సూచిస్తుంది ఈ సన్నివేశం... ఈ ఆత్మకథలోని ఆత్మ అంతా ఈ సన్నివేశంలోనే కనిపిస్తుంది.

ఈ ఆత్మకథలోని మరో ప్రత్యేకత ఈ రచయిత ప్రతి అధ్యాయంలోనూ కవిగా కూడా కనిపించడమే. ఆయా సందర్బాలకూ, సంఘటనలకూ తగినట్టు తాను తన నోస్టాల్జియా జ్ఞాపకాలతో కలబోసి వెలువరించిన కవితాపంక్తుల్నీ ఉదహరించడం ఈ అధ్యాయాలకు నిండుదనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ‘బాల్యం కొంతమందికీ ఆటల పల్లకీ/బాల్యం కొంతమందికి పూలపరిమళం/కానీ నా బాల్యం అలా సాగలేదు/ఒక్కోసారి నిప్పుల కుంపటి/ ఒక్కోసారి ముళ్లకిరీటం’.. అని తన బాల్యాన్ని కవిత్వీకరిస్తాడు. తన కవితాపంక్తుల్నే ఆత్మకథగా మార్చాడు. చివరి అధ్యాయంలో యుద్ధం ప్రారంభమైందని ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ఇది ప్రత్యక్షంగా జరిగే యుద్ధం/రక్తం కారని యుద్ధం/ఆయుధాలు లేని యుద్ధం/ఆధిపత్యాన్ని చెలాయించే యుద్ధం’... అంటూ ఈ రచయిత తన ఆత్మకథ ద్వారా మనసారా ఆకాంక్షిస్తున్నాడు. 

(‘నెమలికన్నులు’ పుస్తకానికి సబ్బని నాగమ్మ- మల్లేశం స్మారక పురస్కారం లభించిన సందర్భంగా...)

                   - డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, 

                      9177732414

04 జనవరి, 2026

తెలుగు సాహిత్యంలో రెండు ‘నెమలి కన్నులు’ : ఒక ప్రయోగం (పరిశోధన వ్యాసం:డా.జె.వి.చలపతిరావు)

తెలుగు సాహిత్యంలో రెండు ‘నెమలి కన్నులు’ : ఒక ప్రయోగం (ఆచార్య దార్ల ఆత్మకథ, కవిత్వంలో వస్తువు – శిల్ప ప్రయోగాలు)

 

-      డా.జె.వి.చలపతిరావు,

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం,

కాకరపర్తి భావనారాయణ కళాశాల (స్వయంప్రతిపత్తి),

విజయవాడ. ఎన్.టి.ఆర్.జిల్లా, ఆంధ్రప్రదేశ్.

 

పత్రసారాంశం

తెలుగు సాహిత్యంలో అనేక ప్రయోగాలు జరిగాయి. పద్యకవిత్వంలో జరిగిన ప్రయోగాలను చిత్రకవిత్వంగా విమర్శకులు చెప్తారు. అక్కడ వస్తువు పారమార్ధికం.ఆధునిక కవిత్వంలో కూడా ప్రయోగాలు జరిగాయి. కానీ, ఇక్కడ వస్తువు సామాజికం. ఇదొక రకమైన ప్రయోగమైతే, ఒక రచయిత తన రెండు వేర్వేరు ప్రక్రియల్లో రాసిన రెండు పుస్తకాలకు ఒకే పేరు పెట్టడం చెప్పుకోదగిన ఒక ప్రయోగం. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి కవిత్వం, ఆత్మకథలకు ఒకే పేరు ‘నెమలి కన్నులు’ అని పెట్టారు. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రెండింటిలోను వస్తువులో కొన్ని పోలికలు కనబడతాయి. కొన్ని ప్రయోగాలు కనిపిస్తాయి. సాధారణంగా ఆత్మకథ వచనంలో లేదా పద్యం (కవిత్వం)లో ఉంటుంది. కానీ, దార్ల వారి ఆత్మకథ వచనంలోనే ఉన్నట్లు అనిపించినా, కవితాత్మకమైన శైలిలో ఉంటుంది. ప్రతి భాగంలోను కనీసం ఒక వచన కవితను అంతర్భాగం చేయడం కనిపిస్తుంది. మరొకవైపు తన జీవితానికి సంబంధించిన సంభాషణలు, సన్నివేశాలు వివరించేటప్పుడు వాటిని సంభాషణలుగా వర్ణించేటప్పుడు కాల్పనికతను ప్రదర్శించారు. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క కథలా అనిపిస్తూనే, ఒకదానితో మరొకదానికి విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటుంది.ఇలాంటి ప్రయోగాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి. అలాగే, ఈయన ప్రచురించిన ‘నెమలికన్నులు’ కవిత్వం కూడా ప్రయోగాలతో ఉంది. అది వచన కవిత్వమే అయినా, దానికి రాసిన తన నేపథ్యం కవితాత్మకంగా ఉంటుంది. వచన కవితలతో పాటు, మినీ కవితలు కూడా కలిపివేశారు. ప్రతి ఒక్కరికీ బాల్యం ఉంటుంది. మనిషి ఎదిగిన తర్వాత  బాల్యాన్ని తలచుకోవడమూ కనిపిస్తుంది. ఇది ఒక అనుభూతుల దొంతర. ఆ అనుభూతులను రమణీయంగా వర్ణించగలిగి, జీవితాలకు ఆదర్శంగా నిలవగలిగితే ఆ సాహిత్యానికి పరమప్రయోజనం ఉన్నట్లవవుతుంది. అటువంటి జీవితం, రమణీయమైన శైలి, ఆధునిక సమాజానికి కావలసిన వస్తువు ఆచార్య దార్లవారి కవిత్వం, ఆత్మకథలలో ఉన్నాయి. ఆధునిక సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులం వల్ల పొందే అవమానాలు కనిపిస్తాయి. కొంతమంది అగ్రకులాల్లో వారు కూడా తనని ఎలా ప్రోత్సహించేవారో కూడా చెప్పుకున్నారు. వాటిని ఆచార్య దార్ల ఎదుర్కొన్నతీరు సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుపుతుంది. ఒక కులనిర్మూలన సిద్ధాంతం కనిపిస్తుంది. ముఖ్యంగా దీనిలోని బాల్యం అందరి బాల్యంగా సాధారణీకరిస్తుంది. వీటిని తులనాత్మక సాహిత్య పరిశోధన పద్ధతిలో ఈ వ్యాసంలో వివరించాలనుకుంటున్నాను.

(కీలకపదాలు: నెమలికన్నులు, దార్ల వెంకటేశ్వరరావు, కులనిర్మూలన, దళిత ఆత్మకథ, ఆధునిక సామాజిక ఉద్యమం)

నెమలికన్నులు పేరు ఒక ప్రయోగం:

        డా.దార్ల వెంకటేశ్వరరావుగారు తన కవిత్వ సంపుటికీ, ఆత్మకథకు ఒకే పేరు పెట్టడం ఒక ప్రయోగం. కవిత్వ సంపుటిని 2016లోను, ఆత్మకథను కస్తూరి విజయం వారు 2023లోను ప్రచురించారు.  నాకు తెలిసినంతవరకు రెండు ప్రక్రియలకు చెందిన వేర్వేరు రచనలకు ఒకేపేరుని ఎవరూ పెట్టలేదు. కానీ కొద్ది తేడాతో  కాళోజీ మాత్రం తన కవితలకు ‘‘నాగొడవ’’ అనీ, తన ఆత్మకథకు ‘‘ఇదీ నాగొడవ’’ అనీ పేరు పెట్టాడు. కవితలను కాళోజీ ఫౌండేషన్ వారు 2001లో ప్రచురిస్తే,  ఆత్మకథను స్వేచ్ఛాసాహితీ వారు 1995లో ప్రచురించారు.

  డా.దార్ల వెంకటేశ్వరరావు తాను ఇలా పేరు పెట్టడానికి గల కారణాలను తన బ్లాగు (https://vrdarla.blogspot.com)లో వివరిస్తూ ‘‘నెమలి కన్నీరు  దుఃఖానికి, కలవరానికి ప్రతీకగా వాడబడుతుంది. నెమలి కన్నీరు అనేది భావనాప్రపంచంలో ఒక ఉదాత్తమైన భావోద్వేగానికి సూచికగా భావస్తారు.దార్ల వెంకటేశ్వరరావు గారు తన కవిత్వాన్ని సామాజిక చైతన్యానికి ఉపయోగపడేలా రాశారు. ఆయన కవిత్వంలో వ్యక్తిగత కష్టాలే కాక, సమాజంలో అణచివేయబడ్డ వారి బాధలు, ఆకాంక్షలు, పోరాటాలు ప్రతిఫలిస్తాయి.వాటిని సాధారణీకరించడం కవిత్వం ప్రత్యేకత."నెమలి కన్నులు" అనే పేరు ఆయన కవితాసంపుటికి పేర పెట్టడం ద్వారా తన లోతైన  భావోద్వేగాలను, అతని రచనల వెనుక ఉన్న బాధను, సమాజం పట్ల ఉన్న హృదయస్పందనను తెలియజేశారు. ఆయన జీవితమూ కష్టనష్టాలతో కూడుకున్నదని, వ్యక్తిగతంగా అనుభవించిన బాధలు, వివక్ష, పోరాటాలు కూడా ‘నెమలి కన్నీటి’లా మౌనంగా, లోతైన బాధలతో నిలిచిపోయినా, వాటిని అధిగమించి, నెమలిని చూడగానే కనిపించే ఆ నెమలిఈకలలోని రకరకాల రంగుల్లా, గొప్ప దశకు చేరుకున్న స్థితిని సూచించేందుకు ఈ పేరును కొనసాగించారు. ఈ పేరు ద్వారా తన జీవిత అనుభవాలను కేవలం వ్యక్తిగత స్థాయిలో కాక, సామాజిక స్థాయిలోనూ ప్రతిబింబించాలనుకున్నారు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రయోగంగా కూడా చెప్పుకోవచ్చు.’’ అని రాసుకున్నారు.  దీన్ని బట్టి తెలుగు సాహిత్యంలో ఇదొక ప్రయోగంగా తెలుస్తుంది.

దళిత (కులం) వస్తువులో గల పోలికలు

 కవితాసంపుటిలోను, ఆత్మకథలోను ప్రతిఫలించిన ప్రధాన వస్తువు భారతీయ సమాజంలో దళిత జీవితం. సమాజంలో భిన్న కులాలు, మతాలు సామాజిక హోదాలకు కారణమవుతున్న స్థితిని ఈ రచనల్లో వివరించారు. అయితే రెండు పుస్తకాలు ఇది  ప్రత్యేకించి కుల నిర్మూలన గురించి మాత్రమే చర్చించవు, కానీ, ఆయన జీవితంలోని అనుభవాలు, పాఠశాలల్లో కుల వివక్ష గురించి వివరిస్తాయి. భారతీయ సమాజంలో కులం ప్రభావాన్ని చర్చిస్తూనే దళితులు ప్రధాన జీవన స్రవంతిలోకి రావాల్సిన పరిస్థితుల్నీ వివరించారు. కేవలం కొన్ని కులాలు మాత్రమే కలిసిమెలిసి జీవించడం కష్టం. అన్ని కులాలు కలిసిమెలిసినప్పుడు మాత్రమే అందరిజీవితం సుఖవంతమవుతుందనీ, అది అందరూ గుర్తించాలనే సందేశం రెండు పుస్తకాల్లోను కనిపిస్తుంది.

“ఈ కులంలో పుట్టకపోతే 

నేనూ ఇంకొకలా ఆలోచించేవాణ్ణిమో

ఈ కులంలో పుట్టటమే మంచిదయ్యింది

అవమానమంటే అర్థమైంది 

అందర్నీ ప్రేమించడమూ తెలిసింది” ( నెమలికన్నులు–2016: 1) అనడం ద్వారా భారతీయ సమాజంలో ‘కులం’ వల్ల కలిగే వివక్ష తెలుస్తుంది. అయినప్పటికీ తన కులంలో పుట్టడం వల్ల ప్రేమించే మనస్తత్వం అలవడిందని ఒక సకారాత్మక దృక్పథాన్ని కవి వ్వక్తీకరించడం విశేషం.  కొన్ని కులాల వాళ్ళు ఇతర కులాల వారిని చిన్నవిషయానికి కూడా చంపేస్తున్న సంఘటనలను స్ఫురింపజేస్తూ ఈ కవిత చివరిలో ఇలా అంటాడు కవి. 

 ‘‘ఈ కులంలో పుట్టడమే మంచిదయ్యింది

 ఈ కులంలో పుట్టకపోతే 

మనుషుల్ని ప్రేమించలేకపోయేవాళ్లేమో!

అవమానాలకు తట్టుకోలేక 

దురాగ్రహం పట్టలేక హత్యలెన్నింటినో చేసేవాణ్ణిమో!!’’  ( నెమలికన్నులు–2016: 3)

ఇటువంటి విషయాలే తన ఆత్మకథలో కూడా పేర్కొన్నారు.

ఊరికి చివరి గుడిసెలో బతికే వాళ్ళం. కులం అంట గట్టిన అవమానాల్ని ఇంకా మోయక తప్పని వాళ్ళం. చూపుల్తో, మాటల్తో నిత్యం నలిగిపోతున్నవాళ్ళం.

మనిషిని చూసినా, మాటవిన్నా  ఏ మాత్రం స్పందన కలగని హీనత్వం, మా కులం పేరు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న వాళ్ళం.

మా కులం తెలియనంత వరకు ఎంతో గౌరవించేవాళ్లు, మా కులం తెలిసిన వెంటనే వేరే విధంగా వాళ్ళ ముఖ కవళికలన్నీ మారిపోతుంటాయి. నా జీవితంలో ఇలాంటి సందర్భాలెన్నో...! మా జీవితాల్లో ఇలాంటి సంఘర్షణలెన్నెన్నో!! (నెమలి కన్నులు, 2023:3)

చిత్రమేమిటంటే, ఆ కాల్వ గట్టు మీద కూడా హిందువులైనా ఆయా కులాల్ని బట్టి వాళ్ళకు కేటాయించిన స్థలంలోనే అంత్యక్రియలు చేసుకోవాలి.

ఆ స్మశానంలో కూడా కులం వదిలిపెట్టని స్థితిని నేను మా ఊరిలో చూశాను. కాల్వగట్టు ప్రభుత్వ స్థలాలను కూడా కొంతమంది వాళ్ళవాళ్ళ పొలాల దగ్గర ఆక్రమించుకొని, కొబ్బరితోటలు పెంచేసుకున్నారు. (నెమలి కన్నులు, 2023:14)

నాకు తెలిసినంతవరకూ గ్రామమంతా కులాల దొంతరగానే ఉంటుంది. ఫలానా వాళ్ళని గుర్తించాలన్నా ఆ కులంతోనే సూచిస్తారు. ఆ పూజారి గారబ్బాయనో, ఆ పంతులుగారనో పిలుస్తారు. ఆ రాజుగారనో, ఆ కోమటాయననో, ఆ కాపు గారనో, ఆ కంసాలోడో, ఆ మంగలోడో, ఆ మాలోడో, ఆ మాదిగోడో ... ఇంకా కాస్త స్పష్టంగా తెలియడానికి పేర్లని కూడా జత చేస్తుంటారు.

అందుకే బడిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులది  ముందుగానే వాళ్ళదే కులమో చిన్న పిల్లలకి కూడా తెలుస్తుంది.

ఆ పంతుళ్లు కూడా తాము పాఠాలు చెప్పే పిల్లలు ఎవరెవరు ఏ కులం వాళ్ళో, వాళ్ళ తల్లిదండ్రులు ఏయే వృత్తులు చేస్తారో ముందే తెలుసుకుంటారు. ఆ పిల్లల్ని తిట్టాలన్నా, ఒకవేళ మెచ్చుకోవాలన్నా ఆ కులాలు, ఆ కులవృత్తులకు అవేవీ దూరంగా ఉండవు.

నేను చదువుకున్న ప్రాథమిక పాఠశాలలోనే నేను వాటిని గమనించాను. (నెమలి కన్నులు, 2023:37)

నన్ను మాస్టారు కొట్టినందుకు బాధనిపించలేదు. నన్ను తిడుతూ నా కులం పేరు పెట్టి మా వాళ్ళందరినీ కూడా తిట్టారు. ఆ మాట నన్నెవరో నిలబెట్టి, నిలువునా రంపంతో కోస్తున్నట్లనిపించింది.

హెడ్మాస్టర్ త్రినాథరావుగారుగానీ, వెంకటరెడ్డిగారు గానీ, రామలక్ష్మి మేడమ్ గారు గానీ అయితే, నన్నే కాదు, ఎవ్వరినైనా కొట్టినా, తిట్టినా కులాన్నంతటినీ తిట్టినట్లు నాకు గుర్తులేదు. ఇలాంటి వాళ్ల ఆప్యాయతతోనే నా కులం వల్ల కలిగే అవమానాల్ని అధిగమించాను.

మా పెద్దన్నయ్యకు మాత్రం సీటివ్వలేదు. మా ఉపకులంలో మొట్టమొదటసారిగా చదువుకుంటున్నది మా కుటుంబంలోనే.

 మా పెద్దన్నయ్యతో పాటు చదువుకున్న మా దళితుల్లోని ఒక ఉపకులానికి చెందిన వాళ్ళందరికీ మాత్రం సీటిచ్చారు. కానీ, మా అన్నయ్యకు సీటులేదన్నారు.

దళితుల్లోని ఒక ఉపకులంపై మరొక ఉపకులం ఒక పథకం ప్రకారం అప్రకటిత నిషేధాలు విధిస్తున్న సంగతి మా పెద్దన్నయ్యకు, నాకూ ఆరో తరగతిలో సీటు దొరక్కపోవడమే నిదరర్శనమనిపించింది.మా దళితుల్లోని ఒక ఉపకులం అప్పటికే తొలితరం వాళ్ళు చదువుకొని, రెండవతరం వాళ్ళు చదువుకోవడం ప్రారంభించారు.

పేదరికానికి కులం తోడైతే అది కొంతమందికి సమాజంలో ఆత్మగౌరవ సమస్యగా మారుతుంది. ఇంకొంతమందికి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే, ఆ కుటుంబాన్ని ముందుకి లాక్కెళ్ళాలంటే, వాళ్ళంతా ఏదొక పని చేయక తప్పని పరిస్థితి. ఇది మా కుటుంబానికి కూడా అనుభవం నేర్పిన పాఠం లాంటిది. ఇలా అనేక సందర్భాల్లో తన ఆత్మకథలో కులం వల్ల కలిగిన అవమానాలు, తన అస్తిత్వ సమస్యల్నీ వివరించాడు రచయిత. విచిత్రమేమిటంటే కులం అదే కులంలోని ఉపకులాలపై కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తుందనే విషయాన్ని ఎంతో స్పష్టంగా వివరించాడు రచయిత. ఇలాంటి సందర్భాలెన్నో తన ఆత్మకథలో సందర్భానుసారంగా వివరించాడు రచయిత. ఒక గ్రామాన్ని ఆధారంగా తీసుకున్నా భారతీయ సమాజం, దాని అంతరాలు తెలియడానికి ఈ కవితాసంపుటి, ఈ ఆత్మకథ సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి.

కొన్ని కులాల వారి ఆదరణ:

భారతీయ సమాజంలో ఒక కులంలో పుట్టడం వల్ల అందరూ అలాగే ఉంటారని సాధారణీకరించలేం. ఈ విషయాన్ని కూడా తన కవిత్వం, తన ఆత్మకథలో ఆధారాలున్నాయి.

‘‘నేను ఛీత్కారాల గొంగళి పురుగునై

విసిరేయబడ్డప్పుడు

నా చుట్టూ నేనే సాలిగూళ్ళు అల్లుకుంటున్నప్పుడు

నాలోకి నేనే

కుంచించుకు పోతున్నప్పుడు

అభయ హస్తమిచ్చి ఆత్మ విశ్వాసాన్నిచ్చిన వాళ్ళను

వాళ్ళెవ్వరైనా నేను మర్చిపోలేను

నా శరీరంలో శరీరమై

నా మనసులో మనసై

నా మనిషిలో మనిషై

నా ప్రాణంలో ప్రాణమైన వాళ్ళను

వాళ్ళెవరైనా చిన్ని రంద్రం నుండే చూడలేను’’ (నెమలికన్నులు,2016:45-46) అని అనడం ద్వారా భారతీయ సమాజంలో కేవలం తన కులస్తులతోనే ఉండడం, తమ కులస్తులతోనే కలిసిమెలిసి ఉండడం సరిపోదనీ, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి మనిషిని మనిషిగా ప్రేమించగలిగిన వాళ్ళు ఏ కులస్తులైనా కలిసిమెలిసి ఉండాలనే భావన ఈ కవితలో కనిపిస్తుంది.

తన ఆత్మకథలో కూడా బ్రాహ్మణులు తనను ఆదరించిన తీరుని, తన స్నేహితుల్లో అన్ని కులస్తులు ఉన్నారనీ చెప్పడం మాత్రమే కాకుండా, విద్యాలయాలకు దాన ధర్మాలు చేయడం, విద్యాలయాలు కట్టడం వంటివి చేశారనే కోణాలను కూడా చూడ్డం కనిపిస్తుంది.

 ‘‘మా ఊరిలో ‘‘హోతా’’ వారని ఓ బ్రాహ్మణ కుటుంబం ఉండేది.ఊళ్ళో ఎవ్వరు పనిలో పెట్టుకున్నా ... పెట్టుకోక పోయినా ...‘‘హోతా’’ వారి పొలంలో మాత్రం అందరికీ పనిదొరికేది. అందుకని సెలవు వచ్చినా, డబ్బులు అవసరం పడినా పిల్లలం కూడా వాళ్ళ పొలంలో పని చేయడానికి వెళ్ళేవాళ్ళం.

పంచాయితీ రోడ్డు పక్కనే, మా బ్రాహ్మణ చెరువుకి దగ్గర్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

ఆ స్థలాన్ని ఆకాశం సన్యాసి చిట్టిబాబుగారని ఒక వేదోత్తముల వంశానికి చెందినవారు    ఆ స్థలాన్ని పాఠశాల కోసం దానం చేశారు. దాన్ని ఆనుకొనే సుమారు రెండు ఎకరాలు అటో ఇటో  పొలం ఉంటుంది. ఆ పొలాన్ని మాకే కౌలుకిచ్చేవారు. మా ఇంటిల్లిపాదీ ఆ పొలంలో పనిచేసుకునేవాళ్ళం.

నేను చదువుకునే స్కూలే చాలా పెద్దది. శ్రీవరహాభొట్ల నారాయణమూర్తిగారని ఒక బ్రాహ్మణ పండితుడు ఆ స్థలాన్ని దానం చేశారు. ఆ స్కూలు మీద ‘’శ్రీవరహాభొట్ల నారాయణమూర్తి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, కాట్రేనికోన’’ అని ఆయన పేరే రాసి ఉంటుంది.’’  (నెమలి కన్నులు, 2023:111)

నాస్తాల్జియా:

గతంలో గడిపిన మధురమైన అనుభవాలను గుర్తు చేసుకొని మనసు లో కలిగే మృదువైన బాధ, తీపి జ్ఞాపకాల పట్ల తపన  దీనినే నాస్తాల్జియా అంటారు.  అంటే, గతంలో జరిగిన సంతోషకరమైన సంఘటనలు, ప్రదేశాలు లేదా అనుభవాల గురించి ఆలోచిస్తూ, ఆనందం, విచారం రెండూ కలిగిన ఒక భావోద్వేగం. ఇది గతానికి తిరిగి వెళ్లాలనే కోరికతో కూడిన ఒక ప్రత్యేకమైన అనుభూతి, దీనిని "గతం పట్ల ఆప్యాయమైన కోరిక" అని కూడా అంటారు.  నాస్తాల్జియాలో జ్ఞాపకాల వేదన, గతస్మృతి తపన, గతానుభూతులపై ప్రేమతో కూడిన బాధ వంటివన్నీ వ్యక్తమవుతుంటాయి. ప్రధాన లక్షణాలు:గతంలోని సంతోషకరమైన జ్ఞాపకాలు, ముఖ్యంగా వ్యక్తిగత అనుబంధాలు కలిగిన వాటిని గుర్తుచేసుకోవడం.  ఇది గతంలో జరిగిన సంతోషకరమైన సంఘటనల గురించి ఆలోచిస్తే కలిగే ఆనందంతో పాటు, ఆ సమయానికి తిరిగి వెళ్లలేమనే విచారాన్ని కూడా కలిగిస్తుంది.  విచారంగా లేదా కష్టంగా ఉన్న సమయాల్లో ఇది ఓదార్పునిస్తుంది. కొన్నిసార్లు పాత పాటలు లేదా వస్తువులు కూడా నాస్టాల్జియాను రేకెత్తించగలవు, గతంలోకి తీసుకువెళ్ళి బలమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి. ఒక ఉత్పత్తి, సేవ లేదా అనుభవం గత జ్ఞాపకాలను రేకెత్తించినప్పుడు "నాస్టాల్జియా ఎఫెక్ట్" కలుగుతుంది, ఇది వెచ్చదనం మరియు ఆప్యాయత వంటి భావనలను కలిగిస్తుంది.  ఉదాహరణకు: ఒక వ్యక్తి తన బాల్యంలోని పాఠశాల రోజులను, స్నేహితులను, ఆడిన ఆటలను గుర్తు చేసుకుని హృదయంలో తీపి తపనను అనుభవిస్తే — అది నాస్తాల్జియా. సాహిత్యపరంగా, నాస్తాల్జియా ఒక ముఖ్యమైన భావవ్యాఖ్య. కవులు, రచయితలు తమ రచనల్లో గతకాలపు జ్ఞాపకాలపై తపన, వేదన, ఆత్మీయతను వ్యక్తపరుస్తారు.  ఈ లక్షణాలు దార్ల వెంకటేశ్వరరావుగారి కవిత్వం, ఆత్మకథల్లో కనిపిస్తాయి.

తాను పుట్టిన కులం, ఆ సందర్భంగా తల్లిదండ్రుల కష్టనష్టాలు ఇవన్నీ తన కవిత్వంలో నాస్తాల్జియాగా వ్యక్తమవుతాయి. అనేక కవితల్లో ఈ నాస్తాల్జియా కనిపిస్తున్నా, గ్రామీణ ప్రాంతం గురించి రాసిన ‘‘మా వూరు నవ్వింది’’ అనే ఒక కవిత చూస్తే ఈ కవితాసంపుటిలో ఉన్న నాస్తాల్జియా తెలుస్తుంది.

కథల్లోనో, టీవీల్లోనో, సినిమాల్లోనో

పచ్చని పొలాల్ని చూసినప్పుడల్లా

 మాయమ్మ, మా అయ్యలతో కలిసి

పురుగుల్నీ, పాముల్నీ లెక్కచేయకుండా

రాత్రుల్ని ఎన్నింటినో లాంతరు బుడ్గుల్తో

పగటిగా మార్చుకుని

గుల్లల్తోనూ, గూడల్తోనూ, నీటి చుక్కల్నే తడుపుకున్న నా కళ్ళల్లో

ఆ పాత దృశ్యాలేవో పలకరించి పోతుంటాయి.’’ అంటూ బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు కవి. అంతే కాదు తన తల్లి తండ్రుల త్యాగం, ప్రేమ వంటివి కూడా తన కవితలో ప్రతిఫలిస్తుంటాయి.

‘‘ఆ గాయాల చేతుల్లోనే కారం పచ్చడి నూరుతూ

మా కళ్ళకు కనిపించకుండా

మా అమ్మ పడిన బాధంతా గుర్తొచ్చి

అన్నం తినడం అమాంతంగా ఆపేస్తుంటాను

నిస్సహాయతతో నాలోకి నేనే ఉండగట్టికిపోతుంటాను

హుస్సేన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్...

ఏ నీటి గలగలల్ని చూసినా

మా వూరిలో ప్రవహించే కాల్వలే నా కళ్ళల్లో...!

గోచి పెట్టుకునో చిరిగిపోయిన లాగు కట్టుకునో

తుప్పల్ని నరికి సరికీ పూడికల్ని తీసి తీసీ

 వంపు సొంపుల్తో వయ్యారాల్ని నేర్పి నేర్పీ

కిల కిల నవ్విస్తూ, పంట చేలల్లోకి ప్రవహింపజేసిన

 ఆ కాల్వలే నా కళ్ళల్లో...!’’ ఇలా కొనసాగుతుందా కవిత. ఇవన్నీ తన బాల్యం, తనలాంటిబాల్యమంతా కవిత్వంగా వచ్చింది. ఇదంతా నాస్తాల్జియాలో భాగమే అవుతుంది.

ఇటువంటి నాస్తాల్జియానే తన ఆత్మకథలో కూడా కనిపిస్తుంది.

1. మాకు మా తాతగారింటి ముందు ఒక నారింజ చెట్టు ఉండేది. దాని ఒళ్ళంతా కళ్ళన్నట్లు గుత్తులు గుత్తులుగా కాయలు కాసేవి. దాని కాయలు నేను కోసుకొని బడికి పట్టుకొని వెళ్ళేవాడిని. మా మిత్రులకు వాటినిస్తుండేవాణ్ణి. వీళ్ళతోపాటు ఇంకా కొంతమంది ఉండేవారు.

ఇంటర్వెల్ సమయంలోను, స్కూలు అయిపోయిన తర్వాత మా ఇంటికొచ్చి వాటిని కోసుకొని వెళ్ళేవారు. చాలా తియ్యగా ఉండేవి ఆ నారింజపండ్లు. ఒక్కొక్కరూ ఒక్కో రకం పండ్లు అప్పుడప్పుడూ తెచ్చేవారు. వాటిని పంచుకొని మేమంతా తినేవాళ్ళం.

2.నాకు చిన్నప్పటి నుండీ స్వీటంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుండీ పాలతో చేసిన పిండివంటలన్నా ఇష్టం. కొబ్బరి లవుజు ఉండలంటే మహా ఇష్టపడేవాణ్ణి.

కిరాణా కొట్టు దగ్గరకెళ్ళినప్పుడల్లా బెల్లం ముక్క అడిగి తినేవాణ్ణి. ముందు అలా సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళిన వారికి బెల్లం ముక్క పెడతారని తెలియదు. వాళ్ళే ఒకసారి సరుకులన్నీ కొన్నతర్వాత వాటికి డబ్బులిచ్చేసాక, నా చేతిలో ఒక బెల్లం ముక్క పెట్టారు.

3.మా బడి ఎదురుగా ఒక ఇంట్లో మిఠాయి తయారు చేసేవారు. మేము పాఠాలు వింటున్నా, అక్కడ తయారు చేసే రకరకాల మిఠాయిల నుండి మాకు తీయని వాసనలు వస్తుండేవి. రోజూ డబ్బులివ్వడమంటే మా అమ్మా నాన్నలకు కష్టం. నాకేమో జీళ్ళంటే ప్రాణం. నాకు చిన్నప్పుడు, ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటప్పుడు ఇంచుమించు ప్రతీరోజూ జీళ్ళే కలలోకి వచ్చేవి.

ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు, కేవలం దార్ల వెంకటేశ్వరరావుగారివి మాత్రమే కాదు, ఆ వయసులో ఉన్నవాళ్ళందరివీ అనిపిస్తాయి.

అభివ్యక్తి వైవిధ్యం:

      దార్ల వెంకటేశ్వరరావుగారు తన కవితా సంపుటిలో గల కవితల్లో ఎంతో వైవిధ్యభరితమైన అభివ్యక్తి ఉంది. ఈ కవితాసంపుటిపై దారిశెట్టి పుష్పిణి చెన్నైలని ప్రెసిడెన్సీ కళాశాలలోడా. ఎన్. ఎలిజబెత్ మేరీ జయకుమారి గారి పర్యవేక్షణలో 2017లో ‘‘నెమలికన్నులు కవిత్వం- అభివ్యక్తి వైవిధ్యం’’ అనే పేరుతో ఒక ఎం.ఫిల్ చేశారు.  ఈ సిద్ధాంత గ్రంథంలో నెమలికన్నులు కవిత్వంలో కనిపించే అభివ్యక్తి వైవిధ్యాన్ని పరిశోధకురాలు ఎంతో విస్తృతంగా విశ్లేషించారు.

మనిషి మానవ సంబంధాలు, సామాజిక జీవితం, దానిలోని సమస్త వైరుధ్యాలు  వీటన్నింటి యొక్క కళాత్మక ప్రతిఫలనం సాహిత్యంలో వస్తువు అవుతుందని పాపినేని శివశంకర్ అభిప్రాయం.( శివశంకర్, పాపినేని: సాహిత్య మౌలిక భావనలు:1996 :78.) ‘సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ’ లో అభివ్యక్తిని ఇలా వివరించారు. ‘‘విషయాన్ని వ్యక్తీకరించే పద్ధతి ఇందులో వాక్య నిర్మాణమూ భాష వాడిన ప్రతీకలు మొదలైనవన్నీ  వస్తాయి ’’ (నళిని, సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ’ పుట: 21)

కవిత్వంలో ఒక విషయం మరో విషయానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతీకలుగా చెప్పబడతాయి.  ప్రాతినిధ్యం వహించే వస్తువులని కవి సమాజం నుంచి గ్రహించి చెప్తాడు. జీవితంలోని సుఖదుఃఖాలు మొదటిసారిగా శక్తివంతంగా, కళాత్మకంగా కవిత్వంలోనే వ్యక్తీకరించబడతాయి. కాబట్టి కవి స్వీయ అనుభవాలనుంచే పదాలు, ప్రతీకలు స్వీకరించి కవితా నిర్మాణం చేస్తాడు.  సహజంగా కవులు సముద్రాన్నో, నదినో, పర్వతాన్నో జీవితానికి ప్రతీకలుగా గ్రహించి జీవితంలో జరిగిన సంఘటనలకు వీటన్నింటిని ప్రాతినిధ్యం వహించేలా చేస్తాడు. ఈ కవి కూడా ‘‘చౌరస్తా’’ని ఒక జీవితానికి ప్రతీకగా గ్రహించి వసంతం, శిశిరాలను ప్రాతినిధ్య వస్తువులుగా చేసి నభూతోనభవిష్యత్తి అనే కవితలో ఇలా రాశాడు.

                    ‘‘జీవన చౌరస్తాలో కొచ్చిన కొత్తలో

                    వెలుగులు విరజిమ్మిన వసంతం

                    ఇంత తొందరగా

                    భవిష్యత్తు మొగ్గల్ని చిదిమేసిన

                    శిశిరమైన చీకటి అవతారం

                    రంగుల ప్రపంచం

                    అద్భుతమైన రూపం

                    వికృతమై వెక్కిరిస్తూ

                    రక్తసిక్తమైన కాన్వాస్’’             

(నభూతోనభవిష్యత్తి , పుట:9)

    ‘చౌరాస్తా’ అనేది అన్యదేశ్య పదం. నాలుగు రోడ్ల కూడలి అని వాచ్యార్థం. ‘జీవన చౌరస్తా’ అని దీన్ని కవి ప్రయోగించాడు. కవితలో అక్షరదోషమో, కవి ప్రయోగమో పదాన్ని మార్పు చేసినట్లు మాత్రం కనిపిస్తుంది. ‘తన నిర్ణయాలు తాను తీసుకునే సమయం’ అనేది ఇక్కడ ఒక అర్థంలో స్ఫురిస్తుంది. ‘నలుగురూ తమకిష్టమైన నాలుగు వైపులకు వెళ్ళే మార్గాల్లోకి వచ్చినప్పుడు’ అని మరొక అర్థం వ్యంగ్యార్థంగా కనిపిస్తుంది. తానొక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన తొలిదశలోనో, లేక అంతా సంతోషంగా తమ తమ ఉన్నత లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలోనే తన జీవితంలో ఎదురైన విషాదాన్నిక్కడ కవి వ్యక్తీకరిస్తున్నాడు. ‘భవిష్యమొగ్గల్ని’; ‘వెలుగులు విరజిమ్మిన వసంతం’ వంటివన్నీ కవి రాబోయే జీవితం గురించి గొప్ప కలలు కన్నాడని చెప్పే కీలకాంశాలు. కానీ, తన జీవితంలో ప్రవేశించిన ‘విషాదం’ తన కలల్ని కల్లలు చేసేసిందనే వేదన తర్వాత కవిత అంతా వర్ణితమైంది. అందుకనే కవి ‘శిశిరమైన చీకటి అవతారం’ అని జీవితమంతా అప్పుడే శిశిర ఋతువులోని ఆకులు రాలినట్లే, ఆశలు రాలిపోయి మోడువారిపోబోతున్న జీవితాన్నిక్కడ దృశ్యీకరిస్తున్నాడు. అందుకనే ‘చీకటిఅవతారం’ గురించి వర్ణించాడు. చీకటి అనే అవతారం తన జీవితంలో వసంత పూయాల్సిన జీవితాన్ని శిశిరఋతువుగా మార్చేసిందనే ఆవేదనను వ్యక్తీకరిస్తున్నాడు. ఇక్కడ – భవిష్యత్తు ఎంతో అందంగా ఉండాల్సిన జీవితం తొందరగా ముగిసిపోతున్న భయాందోళన గల మనస్తత్వం అభివ్యక్తమైంది. దీనికి జీవితమనే మార్గాన్ని, దాని చుట్టూ ఉన్న ప్రకృతినీ వర్ణిస్తూ, ఆ ప్రకృతిని ఆరు ఋతువుల్లోని రెండింటితో సామ్యం చెప్పాడు. సంతోషానికి వసంతఋతువునీ, విషాదానికి లేదా ముగిసిపోతున్న జీవితానికి శిశిరాన్ని ప్రతీకాత్మకం చేశాడు. దాన్ని చివరిలో ‘రక్తసిక్తమైన కాన్వాస్’ అని ముగించాడు. జీవితమనే రహదారిలో అనేకమంది నడుస్తుంటారు. రకరకాలైన సన్నివేశాల్ని, సంఘటనల్ని, కొన్నిసార్లు వివిధ చిత్రకారులు వేసే చిత్రాల్ని చూస్తుంటారు. కవి ఒక జీవితమేదో అర్థంతరంగా ముగిసిపోయిన తర్వాత కనిపించబోయే చిత్రాన్ని మనసులో రూపుకట్టిస్తున్నాడు. అందుకే దీని శీర్షికను ‘నభోతో నభవిష్యతి’ అని పెట్టడం ద్వారా ‘ఇలాంటి అర్థంతరంగా ముగిసిపోయే జీవితం ఇంతకు ముందలేదు, ఇకపై ఉండకూడద’నే ఆకాంక్షతో పెట్టినట్లుంది. విషాదాన్ని వర్ణిస్తూనే, ఆశను చిగురింపజేయడం ఈ కవితాఖండికలో కనిపించే గొప్ప అభివ్యక్తి వైవిధ్యం.

 దీని ద్వారా కవి – మానవజీవితం మన చేతుల్లో ఉన్నట్లే ఉన్నా, ఏదీ మన చేతిలో లేకుండా పోయే ప్రమాదం కూడా పొంచే ఉంటుందని గమనించాలి. అప్పుడు మానవుని మానసిక, భౌతిక స్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అలాంటి స్థితిని ఈ కవితలో ప్రతీకాత్మకంగా వర్ణించాడు కవి అని దారిశెట్టి పుష్పిణి తన సిద్ధాంత గ్రంథంలో వివరించారు.

తన ఆత్మకథ వచనంలోనే ఉన్నప్పటికీ, దీనిలో ఆలంకారిక శైలి ఆ రచనను సాహిత్యీకరించడంలో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించింది. అంతేకాదు, అక్కడక్కడా పెట్టిన కవితలు ఆత్మకథా రచనలో శైలిపరంగా గొప్పప్రయోగంగా కూడా కనిపిస్తుంది. ఆచార్య పి.చంద్రశేఖర్ ఈ ఆలంకారిక శైలి గురించి వివరిస్తూ ఇలా అన్నారు.

 ‘‘సమాజం స్వార్థపూరితం, తాను మాత్రమే బాగుండాలనే చింతన ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అంతేకాక ఆత్మ ప్రశంస, పరనింద సాగుతోంది. అయితే దేవుణ్ణి కోరుకున్నప్పుడు కూడా దార్ల అందరు బాగుండాలని ఆశిస్తున్నారు.

“దేవుణ్ణి మనం కోరుకునేటప్పుడు మనకోసమే మనం దేవుణ్ణి అడక్కూడదు. మన చుట్టుప్రక్కల వాళ్ళంతా బాగుండాలి,అందరితో మనం బాగా ఉండేమనస్తత్వాన్ని మనకివ్వాలి." అని సమభావాన్ని ప్రబోధించారు.

ఈ విధంగా నెమలి కన్నులు ఉపదేశాత్మకంగా సాగుతుంది.

ప్రతి మనిషి పుట్టుక, తల్లిదండ్రులు కాకతాళీయే. అయితే పూర్వజన్మ సుకృతమని భావిస్తారు కొందరు. ఏది ఏమైనా తన పుట్టుక స్థితిగతులను ప్రతిఒక్కరు గర్వపడాలి, ఔన్యత్యాన్ని ప్రశంసించాలి. ఈ నేపథ్యంలో దార్ల తన జాతి ఔన్నత్యాన్ని ఇలా వర్ణంచారు. వాటికి దగ్గర్లో ఒక నక్షత్రం ఉంటుంది. దాని పేరు ఆరంజ్యోతి (అరుంధతి) అని మా అమ్మ చెప్పేది. "ఆ ఆరంజోతి మనింటి పిల్లే ... అలా నక్షత్రంగా మారిపోయింది." అని మా అమ్మ అనగానే మాకు ఆశ్చర్యమనిపించేది. అని తన మూలాల ఔన్నత్యాన్ని వెల్లడించారు.

'నువ్వక్కడి నుండి వెనెక్కి వెళ్ళు...!

ఆ మాట

నాలేత ఆకులాంటి గుండెల్నెవరో

చీల్చేస్తున్నట్లనిపించింది." (నువ్వక్కడి నుండి వెనెక్కి వెళ్ళు...!) గుండెను లేత ఆకుతో ఉపమించారు.

మాకు ఇంటర్వెల్ బెల్ కొట్టినప్పుడు, కిలకిలమంటూ మా పిల్లలంతా పంజరంలోని చిలుకల్లా ఉరుక్కొంటూ బయటకొచ్చే వాళ్ళం." (మూగవేదనల పేగు బంధం). పిల్లలను పంజరంలోని చిలుకలతో ఉపమించారు. మా పెద్దన్నయ్య ఓ హిట్లర్! పెద్దన్నను హిట్లరుతో పోలిక.

"నిజమే.. బాల్యం ఓ చలమ లాంటిదే!

బాల్యం ఓ సముద్రం లాంటిదే!

అంటాం. బాల్యం ఓ ఆకాశం లాంటిది..” అని బాల్యాన్ని పరిపరి విధాలుగా ఊహించారు. ఇలా చెప్పడం ఉల్లేఖాలంకారం

దార్ల తెలుగు సాహిత్యాన్ని ఔపోశన పట్టారు. ప్రాచీన సాహిత్య ప్రభావానికి గురికాని రచయితలుండరంటే అతిశయోక్తి కాదు. దీనికి దార్ల అతీతుడు కాదనుకుంటాను.

"ఇంకాస్త సేపు అలాగే ఆ సూర్యోదయాన్ని చూస్తుంటే, ఆ చెట్ల మధ్యలోనుండి సన్నని వెలుగు ... అది కోత కోసిన పంట పొలాల దగ్గర కాపలా కాస్తూ, చేసుకి పెట్రోమాక్స్ లైట్ వేసి, చూస్తున్నట్లు అటూ ఇటూ నాలుగు వైపుల్లో ఏదొక వైపు ఆ కాంతి కిరణాలు కదులుతున్నట్లు అనిపించేవి.' స్వభావోక్తి అలంకారం. ఇది ఆముక్తమాల్యదలోని "తల పక్షచ్చట గుచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగ చూచి..." పద్యంలోని రైతుల వర్ణన గుర్తుకు తెస్తుంది.’’ అని నెమలికన్నులు ఆత్మకథలో కనిపించే అభివ్యక్తివైవిధ్యాన్ని డా. పగడాల చంద్రశేఖర్ విశ్లేషించారు.

ముగింపు:

      ఈ విధంగా దార్ల వెంకటేశ్వరరావు రచించిన నెమలి కన్నులు కవితాసంపుటి, ఆత్మకథ తెలుగు సాహిత్యంలో ఒక వినూత్నమైన ప్రయోగాలు మాత్రమే కాకుండా, వస్తు, శిల్ప, అభివ్యక్తుల్లో విశిష్టమైన రచనగా సాహితీవేత్తలు అభిప్రాయ పడ్డారు. ఆయన భారతీయ సమాజంలో కులం ఉన్నా, అన్ని కులాలను సమైక్యతతో పయనించాలనే స్ఫూర్తిదాయకమైన దృక్పథంతో ఈ రెండు రచనలను కొనసాగించి, భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం మనే భావనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఆధార గ్రంథాలు:

వెంకటేశ్వరరావు, దార్ల. (2016). నెమలికన్నులు (వచన కవితాసంపుటి). హైదరాబాదు: మంజుశ్రీ ప్రచురణలు.

వెంకటేశ్వరరావు, దార్ల. (2023) నెమలి కన్నులు (ఆత్మకథ, తొలిభాగం), హైదరాబాదు:కస్తూరి విజయం ప్రచురణలు.

నళిని, ఎస్.ఎస్. (2009) సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ.  హైదరాబాదు: నవోదయాబుక్ హౌస్. 

నారాయణ రెడ్డి, సింగిరెడ్డి. (2001). ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు: ప్రయోగములు.

హైదరాబాదు:  విశ్వంభరా విజన్ పబ్లికేషన్స్. 

వీరభద్రయ్య, ముదిగొండ. (2012). విమర్శ,  కళాతత్త్వ శాస్త్రాలు. హైదరాబాదు: తెలుగు కాడమీ. 

శరత్ జ్యోత్స్నారాణి, ఎస్. (2003).  స్వాతంత్ర్యానంతర తెలుగు కవిత – వస్తువు,  రూపం, శిల్పం.

హైదరాబాదు: జ్యోత్స్నా కళాపీఠం. 

 

 (సాహిత్య తరంగిణి , తెలుగు పరిశోధన మాసపత్రిక సౌజన్యంతో)

 

 

 

 

 

 

 

 

 


16 జూన్, 2025

ఆత్మ‌గౌర‌వపు ఆత్మక‌థ‌ 'నెమలికన్నులు, ( డా.తిరునగరి శ్రీనివాస్ గారి వ్యాసం)

 ఆత్మ‌గౌర‌వపు ఆత్మక‌థ‌ 'నెమలికన్నులు'

 విమలసాహితీ సాహిత్య e- వారపత్రిక, 15.6.2025 సౌజన్యంతో 



అత్యంత ప‌రిణ‌తి, ఎంతో ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డిన త‌రువాత అక్ష‌రీక‌రించాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త‌నే ఆత్మ‌క‌థ‌. స్ప‌ష్ట‌మైన  అవ‌గాహ‌న‌, గురుత‌ర బాధ్య‌త‌తో స‌మాజానికి త‌న జీవితం నుంచి అందించ‌వ‌ల‌సిన విష‌యాల‌తో రాసే ఆత్మ‌క‌థ భ‌విష్య‌త్తు త‌రాల వారికి త‌ప్ప‌నిస‌రిగా స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాలి. ఆత్మ‌క‌థ‌లో అస‌మగ్ర‌త‌కు చోటుండ‌దు. జీవితంలోని ప్ర‌తి అంశాన్ని నిజాయితీగా వ్య‌క్తీక‌రించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మ‌క‌థ స‌మాజానికి ఆద‌ర్శ‌ప్రాయ‌మైన మార్గాన్ని చూపాలి. ఎంతో మంది ఆత్మ‌క‌థ‌లు రాయ‌డానికి వెన‌క‌డుగు వేస్తుంటారు. అన్ని అంశాల‌ను ప‌రిణ‌తితో త‌మ ఆత్మ‌క‌థ‌గా రాసేవాళ్ళు స‌మాజానికి దిశానిర్దేశం త‌ప్ప‌క అందించ‌డ‌మే కాదు ఆద‌ర్శ‌ప్రాయంగా కూడా నిలుస్తారు. ప‌రిణ‌తి, ఆత్మ‌విశ్వాసాల మార్గంలో అనేక  అంశాల‌ను విస్ప‌ష్టంగా వెల్ల‌డిస్తూ నెమ‌లి క‌న్నులు పేరుతో ఆచార్య దార్ల వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న ఆత్మ‌క‌థ‌ను  రాశారు. చ‌దివే వారిని నిశితంగా ఆలోచింప‌జేసే  ఎన్నో సామాజిక సంద‌ర్భాలు, సంఘ‌ట‌న‌లు ఈ ఆత్మ‌క‌థ‌లో నిక్షిప్త‌మై ఉన్నాయి.

         దాదాపు ఆరు త‌రాల చ‌రిత్ర‌ను, ప‌రిణామాల‌ను అక్ష‌రీక‌రించిన తీరు దార్ల వెంకటేశ్వరరావు గారి 'నెమలికన్నులు' ఆత్మ‌క‌థ‌లో క‌న‌బ‌డుతుంది. జీవితంలో జ‌రిగిన అనేక మ‌లుపుల‌ను మాట‌ల్లో రాయాలంటే ఎంత మ‌ధ‌నం జ‌రుగుతుందోన‌ని ఊహించ‌డానికి ఇందులోని ప్ర‌తివాక్యం సాక్షీభూత‌మ‌వుతుంది.

 '' ముత్తాత చెప్పులు

 కుట్టేవాడు

  మా తాత‌

  కూలికెళ్ళేవాడు

మా అయ్యేమో

  అక్ష‌రం కోసం

 ఆశ‌గా ఎదురు చూసేవాడు

  నేనిప్పుడు క‌విత్వం రాస్తున్నాను

  రేపు

 నా కొడుకు

  ప్రొఫెస‌ర‌వుతాడు'' అన్న కవితాతాత్మక వాక్యాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే తరాల చ‌రిత్ర‌గా సాగిన జీవ‌న‌పు నడ‌క అవ‌గ‌త‌మ‌వుతుంది. మొత్తం 37 అంశాల‌తో సాగిన ఈ ఆత్మ‌క‌థ దార్ల వారి బాల్యంతో ఆరంభ‌మై, ప్ర‌దేశాలు, ప‌ల్లెలు, త‌నింటి వాళ్ల‌తో, త‌న చుట్టూరా జీవించే మ‌నుషుల‌తో అల్లుకున్న అవ్యాజానుబంధాల బ‌లిమిని ఆవిష్క‌రించింది. ప్ర‌తివాక్యం ఏదో ఒక అపురూప అనుబంధాన్ని మోసుకొచ్చే ప్ర‌తిబింబంగా క‌న్పిస్తుంది. శాశ్వ‌తానుబంధాల పందిళ్ల‌కు ఇందులోని ఎన్నో వాక్యాలు ప్ర‌తీక‌లుగా మెరిశాయి. ద‌ళితులలోని అపార‌మైన మ‌నో విజ్ఞానాన్ని, అప్ప‌టి స‌మాజ‌పు స్థితిగ‌తుల దొంత‌రల‌ను, వెలివాడ‌ల జీవితాల‌లోకి వ్య‌ధాభ‌రిత దృక్కోణాల‌ను, దీన‌త్వంతో సాగిన జీవ‌న యానాల్ని ఈ ఆత్మ‌క‌థ ఎంతో సుస్ప‌ష్టంగా ఆవిష్క‌రించింది. ఆత్మ‌క‌థ రాస్తున్నానంటే న‌వ్విన వాళ్ళు ఉన్నారు అన్న ఇందులోని దార్ల వారి ఇంట‌ర్వ్యూ 37 అంశాలుగా రాసిన లోతైన‌ జీవితానుభ‌వాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచింది.

       త‌న బాల్యాన్ని చ‌ల్ల‌ని ఓ చ‌ల‌మ‌, స‌ముద్రం విశాల‌మైన ఆకాశంతో పోల్చారు. అమ్మా, నాన్న‌, అన్న‌య్య‌ల మ‌ధ్య పెరిగి ఇంటి నుండి నేర్చుకున్న క్ర‌మ‌శిక్ష‌ణ‌, అప్పుడ‌ప్పుడు పెద్ద‌లు చేసే మంద‌లింపులే జీవితానికి గొప్ప మార్గ‌ద‌ర్శ‌న‌మైన ప‌రిస్థితుల‌ను విశ్లేషించి చ‌దివే వారిలో ఎంతో ఆస‌క్తిని ర‌గిలించేలా విశ‌దీక‌రించారు. త‌న బాల్యం నాటి ద‌ళిత జీవితాన్ని ఈ ఆత్మ‌క‌థ‌లో ఎంతో స్ప‌ష్టంగా, తేట‌తెల్లంగా వివ‌రించారు. ద‌ళిత ఉప‌కులంలో వాళ్ళు పొందే అవ‌మానాల్ని దాటుకుని ఎంతో కృషితో  కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలో ప్రొఫెస‌ర్ వంటి ఒక ఉన్న‌త స్థాయికి తాను ఎదిగిన క్ర‌మాన్ని తెలిపారు. ద‌ళితుల జీవితాల‌ను లోతుగా అధ్య‌య‌నం చేస్తున్న అనుభూతిని ఈ ఆత్మ‌క‌థ క‌లిగిస్తుంది. బాల్యం నాటి విష‌యాల‌ను రాస్తూ ద‌ళితుల‌కు ఆనాడు గ్రామాల‌లో క్ష‌వ‌రం చేయ‌ని, బ‌ట్ట‌లు ఉత‌క‌ని సామాజిక అస‌మాన‌త‌లు పేరుకున్నఅవ‌స్థ‌ల‌ వ్య‌వ‌స్థ‌ను గురించి ఎంతో వేద‌న‌తో చెప్పారు. ప‌రిస్థితులెలా ఉన్నా ఆత్మ‌ధైర్యంతో అడుగేస్తూ స్వీయ అస్తిత్వ గౌర‌వాన్ని స‌గ‌ర్వంగా నిలుపుకున్న ప‌రిస్థితికి ఈ ర‌చ‌యిత ఆత్మ‌క‌థ అద్దం ప‌ట్టింది. పాలేరుల వెట్టి వెత‌ల్ని భిన్న సంఘ‌ట‌న‌ల‌ను క్రోడీక‌రిస్తూ దృశ్యాలుగా క‌ళ్ళ‌ముందుంచారు. ఊరిలో త‌ల‌లో నాలుక‌లా ఉండే తండ్రి త‌మ‌కు  జ‌రిగిన అవ‌మానానికి త‌గిన బుద్ధి చెప్పించి పాలేరు త‌నానికి శాశ్వ‌తంగా ముగింపు ప‌లికిన విధాన్ని గొప్ప సంఘ‌ట‌న‌గా చెప్పొచ్చు. స‌మ‌స్య‌ల‌పై స్పందించే స్పంద‌నాశీల‌త్వం ర‌చ‌యిత‌కు బాల్యం నుండే అల‌వ‌డి ఉంద‌న్న విష‌యాన్ని ఈ ఆత్మ‌క‌థ చెప్పింది. గ్రామంలోని రోడ్లు, విద్యుత్, త‌పాలా, పెన్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం, పత్రిక‌ల‌ను చ‌ద‌వ‌డం వంటి అంశాలు ఎదిగే క్ర‌మంలో ర‌చ‌యిత‌లోని స‌మాజ అవ‌గాహ‌నా దృక్ప‌థాన్ని తెలిపాయి. ప‌ద‌వ త‌ర‌గ‌తిలో లెక్క‌ల్లో రెండు మార్కుల‌తో త‌ప్పాన‌ని చెప్పుకున్న ర‌చ‌యిత నిజాయితీకి నిగ్గుట‌ద్ద‌మే కాకుండా ఆత్మ‌క‌థా సూత్రాల‌కు  నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఆత్మ‌క‌థ‌లో భాగంగా తీవ్ర‌త‌ను క‌లిగించే విష‌యాల‌ను, సంఘ‌ర్ష‌ణ‌ను చెప్పే క్ర‌మంలో రాసిన వాక్యాలు క‌వితాత్మ‌కంగా ఉండి ఆ  స్థితి ప్ర‌బ‌ల‌త‌ను చాటాయి. ఆత్మ‌క‌థ ఒక వ్య‌క్తికి సంబంధించిందే అనిపించినా ఆనాటి సామాజిక‌, కాల‌మాన స్థితిగతుల‌కు ప్ర‌తిరూప‌మ‌న్న‌ది ఈ ర‌చ‌యిత ఆత్మ‌క‌థ చెప్పింది.

         ''కొన్ని వృత్తుల‌కే ద‌ళితులు ప‌రిమిత‌మ‌వుతార‌న్న ఒక భావ‌జాలాన్ని నిష్క‌ర్ష‌గా ఖండించి సామాజిక వాస్త‌విక‌త‌ను ర‌చ‌యిత‌ దృశ్య‌మానం చేశారు. కోన‌సీమ సౌంద‌ర్యం మాటున దాగిన ద‌ళిత ఉప‌కులాల వారు భ‌రించిన అవ‌మానాలు, తెగించి జ‌రిపిన ఆత్మ‌గౌర‌వ పోరాటాల‌ను ఈ ఆత్మ‌క‌థ  ప్ర‌తిబింబించింది. నిజాయితీ అన్నదే అంత‌సూత్రంగా ఈ  ర‌చ‌యిత ఆత్మ‌క‌థ స్ప‌ష్ట‌త‌తో అనేక సంఘ‌ట‌న‌ల‌ను పూస‌గుచ్చిన‌ట్టు విడ‌మ‌ర్చి చెప్పింది.''

 స్వచ్ఛమైన అమాయ‌క‌త్వం ఒక వైపు, పోరాట శీల‌త క‌లిగిన ఆత్మ‌గౌర‌వం మ‌రోవైపు రెండు కోణాలై నడచిన ఆలోచ‌నాత్మ‌క‌మైన ఆత్మ‌క‌థ ఇది. అస‌మాన‌త‌ల వ‌ల్ల గుండెకు త‌గిలిన గాయాల్ని, అవ‌మాన‌పు కంట‌కాల్ని పేద‌రికంతో కుటుంబం గ‌డ‌వ‌క ప‌స్తులుండే ప‌రిస్థితుల నుండి నిరంత‌ర శ్ర‌మ‌తో పూల దారులుగా మార్చుకుని బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అందించిన ధైర్యంతో తానాశించిన గ‌మ్యాన్ని చేరుకున్న ల‌క్ష్య సాధ‌కునిగా, ద‌ళితుల ధైర్య‌సాహ‌సాల‌కు ప్ర‌తినిధిగా, విజేత‌గా  ఈ ఆత్మ‌క‌థను  చ‌దివే పాఠ‌కుల‌కు  ర‌చ‌యిత ఆవిష్కృత‌మ‌వుతారు. పేరాశ‌ల‌కు పోకుండా ఉన్న‌దాంట్లోనే తృప్తి చెందాల‌న్న‌ది కుటుంబం నుండి అల‌వ‌ర్చుకున్న త‌త్వం కాగా, ఆరుగాలం క‌ష్ట‌ప‌డే రైత‌న్న నోటికి అన్నం ముద్ద అంది ఆక‌లి లేని రైతు శ్రేయోరాజ్యం విక‌సించాల‌న్న త‌ప‌న‌తో శ్ర‌మ జీవుల ప‌ట్ల ఉన్న‌ గౌర‌వ భావ‌న ర‌చ‌యిత ప్ర‌త్యేక‌త‌ను నిలిపింది. అంట‌రానితం, అనాలోచితం, అమానవీయత ప‌ట్ల ఆంత‌రిక ఆగ్ర‌హ జ్వ‌ల‌నం, సామాజిక మార్పు కోసం ఆలోచ‌నాశీల‌త‌తో, సంయ‌మ‌నంతో, ప‌రిణతతో సాగే ర‌చ‌యిత దృక్ప‌థాన్ని ఈ ఆత్మ‌క‌థ సూటిగా వెల్ల‌డించింది.

         ర‌చ‌యిత త‌మ ఊరు చెయ్యేరు అగ్ర‌హారంలో బాల్య‌పు రోజుల్లో రేడియో వంటి ప్ర‌సార సాధ‌నాలలో ప్ర‌సార‌మ‌య్యే నాట‌కాలు, ధారావాహిక‌లు విన‌డం, ఎంతో క‌ష్టంతో ప‌త్రిక‌ల‌ను స‌మ‌కూర్చుకుని చ‌ద‌వ‌డం వ‌ల్ల క్ర‌మంగా స‌మాజంపై అవ‌గాహ‌న పెరిగిన తీరును ప్ర‌స్తావించారు. బాల్యంలోని స్వ‌చ్ఛ‌మైన అమాయ‌క‌త్వాన్ని ఎంతో స‌హజంగా అభివ‌ర్ణించారు. కుల వివ‌క్ష, ఆధిప‌త్య‌పు అభిజాత్యాన్ని, వేధింపులు, అవ‌మానాల‌ను త‌ట్టుకోలేని వ‌ర్గాల ఆక్రోశాన్ని ర‌చ‌యిత త‌న మేధో మ‌ధ‌నంతో అక్ష‌ర‌బ‌ద్ధం చేసి ఘాటుగా చుర‌క‌లంటించారు. ఇంట్లో తిన్న అరిసెలు, పోకుండ‌లు, బూరెల గురించి, తాత, మామ్మ (నాయ‌న‌మ్మ‌), ర‌జ‌కులు, నాయీబ్రాహ్మ‌ణులు, నాట‌కాలు, బుర్ర క‌థ‌లు,  పెద్ద‌న్న‌య్య‌, స్నేహితులు, తోబుట్టువులు, కేస్ట్ స‌ర్టిఫికెట్ పొందేందుకు ప‌డ్డ బాధ‌ల గురించి వివ‌రిస్తూ జీవితంలోని ఎగుడు దిగుళ్ల‌ను, కుటుంబాలు, స‌మాజం చుట్టూ అల్లుకున్న విడ‌దీయ‌లేని అనుబంధాలను వివ‌రించారు.

  ''నన్ను నీటిలోకి తోసేసామ‌నుకున్నారు, 

నాకు ముత్యాలు దొరుకుతాయ‌ని వాళ్ళ‌కు తెలియ‌దు

న‌న్ను పాతాళం  లోకితొక్కేద్దామ‌నుకున్నారు

 నేనొక మ‌హావృక్షాన్నై మొలుచుకొస్తాన‌ని వాళ్ళ‌కు తెలియ‌దు

 నన్ను ఆకాశంలోకి విసిరేద్దామ‌నుకున్నారు, 

ఆ శూన్యం నుండే నేనంద‌రి దాహాన్ని తీర్చే ఓ నీటి చుక్క‌నై కురుస్తాన‌ని వాళ్ళ‌కు తెలియ‌దు'' 

అని ర‌చ‌యిత రాసిన ఈ వాక్యాలు అత‌నిలోని అప్ర‌తిహ‌త‌మైన ఆత్మ‌విశ్వాసం, ధృడ‌మైన ప‌ట్టుద‌ల‌, అంత‌కుమించిన కృషి, న‌మ్మ‌కాన్ని బ‌ల‌ప‌రిచాయి. ఉన్న‌తీక‌రించిన మ‌హామ‌నిషిగా రూపొంద‌డానికి, గొప్ప సంఘ‌ట‌న‌లు పురుడు పోసుకోవ‌డానికి  ప్ర‌కృతి ఎంత‌గా స‌హ‌క‌రిస్తుందో తెలుసుకోవ‌డానికి ఈ ర‌చ‌యిత జీవిత‌మే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. వ‌సంతాలు, శ‌ర‌త్తులు    స‌మంగా వెలిగేదే మ‌నిషి జీవిత‌మ‌ని ఈ ఆత్మ‌క‌థ సందేశించింది. అక్ష‌రం ప‌ట్ల ర‌చ‌యిత‌కు ఉన్న అవ్యాజ‌మైన అనుర‌క్తి ఆత్మక‌థా ర‌చ‌న‌ను ప‌రిపుష్టంగా న‌డిపించి ప‌రిపూర్ణ‌త‌ను చేకూర్చింది. సౌహార్ద్రం, సౌభ్యాతృత్వం, ప్ర‌కృతి ప్రేమ‌తో పాటు త‌దేక దీక్ష‌తో అఖండ‌ విజ‌యాన్ని సాధించి తిరుగులేని శ‌క్తిగా స‌మాజంలో నిలిచిన వ్య‌క్తి శ్ర‌మ‌ విరాట్ స్వ‌రూపాన్ని ఆవిష్కరించిన విశిష్ట ర‌చ‌న‌ ఇది.

  - డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్

                        Phone :  9441464764

01 జూన్, 2025

తెలుగు చరిత్ర, సంస్కృతుల వారధి కస్తూరి విజయం

 

శింగలూరు హరనాథ్ గారి ' తెలుగు -వెలుగు' దాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు













తెలుగు వారు భిన్న రాష్ట్రాలలో, భిన్న దేశాల్లో ఉన్నప్పటికీ ఆ సాహిత్యాన్ని పుస్తకాలుగా ప్రచురించడం ద్వారా తెలుగు చరిత్ర, సంస్కృతుల వారధిగా కస్తూరి విజయం ప్రచురణలవారు కృషి చేస్తున్నారని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శనివారం (1.6.2025) నాడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ ఎన్.టి. రామారావు కళా వేదికపై ‘ఇంటర్నేషనల్ ఇంక బౌండ్’ పేరుతో కస్తూరి విజయం (మలేషియా) వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పామిరెడ్డి సుధీర్ రెడ్డి, శ్రీమతి పద్మజా రెడ్డిగార్ల ఆధ్వర్యంలో వందలాది మంది రచయితల కథలు, కవితా సంకలనాలు, వ్యాసాలు అనువాద గ్రంథాలను ఈ వేదికపై ఆవిష్కరించారు. కవులందరినీ ఒకే వేదికపై వివిధ సెషన్స్ వారీగా సత్కరించాలనుకోవడం వినూత్నంగా అనిపించింది. శనివారం (31.5.2025) మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో డా. సబ్బని లక్ష్మీనారాయణ గారి ‘అక్షరధామ్’ గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానంద రావుగారు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం రచయిత పుస్తకం ప్రచురించడమంటే చేతులు కాల్చుకోవడమేనని, తన సాహిత్యాన్ని పాఠకులకు అందించాలనే తపనతో స్వంత డబ్బుతో పుస్తకం వేస్తున్నా, వాటిని కొని చదవేవారు కరువయ్యారని చెప్పారు. కవులు కళాకారులు రచయితలు ఉన్న ఆ సభలో ఆ కామెంట్ చేయడం వెనుక కేవలం రాయడమే కాదనీ పుస్తకాలు కూడా కొనాలనే ఒక సందేశాన్ని పంపించినట్లు అయింది. కవి నూతలపాటి నాగేశ్వరరావుగారి సంపాదకత్వంలో వెలువడిన ‘కథల పరిమళాలు’, ‘వెన్నెల పరిమళాలు’ పుస్తకాలను నూతలపాటి వారే ఆవిష్కరించారు. ఐ. ఆర్. ఎస్ అధికారి శ్రీ శింగలూరు హరనాథ్ గారు రచించిన ‘తెలుగు-వెలుగు’ కావ్యాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కావ్యం లో ఉభయ రాష్ట్రాలలోని కవులు కళాకారులు, విశేషమైన రచనలను తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని కవి మాత్రాచందస్లో షిప్తంగా సౌందర్య భర్తగా వర్ణించారని ప్రశంసించారు. కలర్ లో అందంగా ఆకర్షణీయంగా ప్రచురించిన ఈ పుస్తకం ప్రస్తుత తరుణంలో ప్రచురించవలసిన ఒక పుస్తకంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారు మరలా కలిసి తమ సాంస్కృతిక అంతా సమైక్యతను చాటడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలోని పద్యాలు సరళంగా సుందరంగా కంఠస్థంపట్టే విధంగా, చరిత్ర సంస్కృతిని ప్రబోధించే విధంగా ఉండటం వలన పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా పెట్టడానికి కూడా అవకాశం ఉందని ఆయన సూచించారు. తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు తెలుగు సాహిత్యాన్ని ఒక ఆప్షనల్ గా తీసుకున్నారని ఆ ప్రేమతో సాహిత్యం పట్ల తనకు అభిరుచి ఏర్పడి కొన్ని పుస్తకాలను కూడా రచించినట్లుగా కవి శ్రీ సింగలూరి హరినాథ్ గారు వివరించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి కొన్ని పద్యాలను ఆయన రాగయుక్తంగా వినిపించారు. ‘తెలుగు-వెలుగు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సత్యనారాయణ గారు ఆ పుస్తకాన్ని చక్కగా సమీక్షించారు. కస్తూరి విజయం సంస్థ నుండి పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారి సంపాదకత్వంలో ‘మనీ మైండ్ సిగ్నేచర్స్’ , ‘ఆనందోబ్రహ్మ’ ఆవిష్కరించారు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ అన్నపూర్ణ గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మాణిక్యంబ గారు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్య మధ్యలో తెలుగు సాంస్కృతిక వైభవాన్ని తెలిపే భరతనాట్యం, సంగీత కార్యక్రమాలు జరిగాయి. చిన్న పిల్లల నృత్యాలు, వారు ఆలపించిన శ్లోకాలు, గేయాలు ఎంతో బాగున్నాయి. విడతలవారీగా జరిగిన ఈ సాహిత్య కార్యక్రమంలో వందలాది మంది రచయితలు, కవుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు ఒక నిబంధన పెట్టారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ నెంబర్లు కేటాయించారు. ఆ నెంబర్లను కొన్నింటిని లక్కీ డ్రా తీశారు. వాళ్లకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇవ్వడం ఒక ప్రత్యేకత. దేశదేశాల్లో తెలుగు పుస్తకాలను ప్రచురిస్తున్న కొంత మంది ప్రచురణకర్తలకు, సామాజిక సాంస్కృతిక సేవ చేస్తున్న వారికి విశిష్ట పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. తెలుగు కవులు, రచయితలతో రచయిత్రులు కళాకారులతో యూనివర్సిటీ ప్రాంగణం తెలుగు సంస్కృతీ చరిత్రలను ప్రతిబింబించేలా కార్యక్రమం కొనసాగింది. 



 





 

02 మే, 2025

Nemali Kannulu Autobiography: A Distinctive Discourse in Caste Eradication Theory

Nemali Kannulu Autobiography: A Distinctive Discourse in Caste Eradication Theory


Darla Venkateswara Rao’s Nemali Kannulu stands as a milestone in Telugu Dalit literature, not merely as a personal narrative but as a profound critique of the structural injustices of the caste system, engaging theoretically with the complexities of caste eradication. The autobiography narrates the generational occupational shifts within Darla’s family—his grandfather, father, and himself—who, born into the Madiga caste, abandoned the traditional leatherwork occupation for alternative livelihoods, such as toddy tapping and selling in the Konaseema region of East Godavari district, and later pursued education and professional careers. Despite these changes, the social stigma attached to their caste persisted, underscoring that caste and occupation are distinct entities and that specific strategies are required for caste eradication. The narrative is marked by a natural flow, with a poetic style that captivates the reader and vivid, evocative descriptions that stir a range of emotions. Through this lens, Nemali Kannulu emerges as a distinctive Dalit autobiography, using the Madiga caste and Darla’s life as a case study to explore the intricacies of caste eradication theory. The following points analyze its significance:


1.Transition from Hereditary Occupation to Alternative Livelihoods

Nemali Kannulu effectively portrays the generational occupational shifts within Darla’s family. His grandfather and great-grandparents engaged in the traditional Madiga occupation of leatherwork (stitching footwear and working with animal hides). However, Darla’s father broke away from this hereditary vocation, adopting the alternative occupation of toddy tapping and selling in the Konaseema region. Although traditionally associated with the Gowda caste, this occupation became accessible to others in Konaseema due to the abundance of palm trees and the insufficient Gowda population to meet the demand. This shift brought economic stability and social respectability to Darla’s family. Subsequently, Darla pursued education and rose to the position of a university professor, exemplifying significant occupational mobility. Yet, the autobiography clarifies that these occupational changes did not fully eradicate the stigma attached to their Madiga caste identity, exposing the complexities of caste eradication theory.


2.Distinction Between Caste and Occupation

Nemali Kannulu highlights a critical distinction between caste and occupation, challenging the common conflation of the two in Indian society. The occupational transitions of Darla’s family—from leatherwork to toddy tapping and later to academia—demonstrate that changing vocations does not automatically dismantle caste-based social stigma. The narrative illustrates how caste identity determines an individual’s social status and respectability, regardless of their occupation. While individuals from dominant castes often receive respect and privileges irrespective of their professions, Dalit communities, like the Madigas, remain tethered to caste stigma despite occupational mobility. This disparity underscores the robust “concrete walls” of the caste system in Indian society, a key aspect that distinguishes Nemali Kannulu as a text that interrogates the structural foundations of caste.


3. Persistence of Social Stigma

A central theoretical insight in Nemali Kannulu is the persistence of caste stigma despite occupational changes. Although Darla’s father achieved economic stability and social respectability through toddy tapping, the humiliations and discrimination tied to their Madiga caste identity persisted. Similarly, despite Darla’s ascent to the prestigious role of a university professor, caste-based social stigma continued to haunt him. This narrative exposes the structural nature of the caste system, revealing that economic upliftment or occupational mobility cannot fully dismantle caste-based social inequalities. This theoretical analysis sets Nemali Kannulu apart from other Dalit autobiographies, as it moves beyond documenting experiences of discrimination to critically examining the enduring nature of the caste system.


4. Critiquing Societal Perception Without Condemning Leatherwork

In Nemali Kannulu, Darla does not denigrate the leatherwork occupation; instead, he critiques the societal mindset that stigmatizes the Madiga community for engaging in it, deeming them inferior. Despite the essential role of leatherwork in society, those who perform it are marginalized due to their caste. The autobiography exposes this injustice, emphasizing that the issue lies not in the occupation but in the caste-based societal perception that devalues it. The transition of Darla’s father to toddy tapping and Darla’s own pursuit of an academic career reinforce this critique, as caste stigma persists despite these occupational shifts. This perspective underscores the structural hegemony of the caste system and its resistance to change.


5.Economic Upliftment vs. Caste Eradication

Nemali Kannulu clarifies that while occupational changes can lead to economic upliftment, they are insufficient for eradicating caste. The economic stability gained through toddy tapping enabled Darla’s family to access educational opportunities, culminating in Darla’s professorship. However, the persistence of caste stigma highlights that economic mobility alone cannot dismantle the caste system. The autobiography suggests that caste eradication requires specific strategies—such as challenging the ideological and structural foundations of caste through social awareness, legal reforms, and ideological critique. This nuanced perspective transforms Nemali Kannulu into a powerful social critique, sparking new discussions in caste eradication theory.


 6. Challenging Caste Hegemony

Nemali Kannulu effectively challenges caste hegemony by juxtaposing the Darla family’s economic and social upliftment through toddy tapping and academia with the persistent discrimination they face due to their caste. This dual narrative—achieving respectability through occupational mobility while confronting caste stigma—exposes the structural injustices of the caste system. Darla questions how caste determines an individual’s identity and opportunities, critiquing the societal mechanisms that perpetuate inequality. This ideological critique transforms the autobiography into a compelling social commentary, advocating for the dismantling of caste hierarchies.


7.Synthesis of Marxism and Dalit Ideology

Darla employs a synthesis of Marxist and Dalit ideological frameworks to analyze the caste system in Nemali Kannulu. He argues that caste-based occupations and their associated stigma are not merely social issues but are deeply intertwined with economic inequalities. While the economic stability gained through toddy tapping facilitated educational and professional opportunities, the persistence of caste stigma underscores the structural nature of caste oppression. By integrating Marxist class analysis with Dalit ideology, Nemali Kannulu offers a robust theoretical framework for understanding the complexities of caste dynamics, distinguishing it from other Dalit autobiographies that may focus more on personal experiences than systemic critique.


8.Comparison with Other Dalit Autobiographies

- Autobiographies by writers like Boi Bhimanna and Gurram Jashuva focus on caste discrimination and humiliation but do not engage as deeply with the narrative of occupational mobility, the persistence of caste stigma, or the theoretical complexities of caste eradication.

Nemali Kannulu stands out by combining a narrative of generational occupational mobility with a theoretical analysis of caste stigma’s persistence and the complexities of caste eradication, securing a unique place in Dalit literature.


9. Need for Specific Strategies in Caste Eradication

Nemali Kannulu underscores that occupational mobility or economic upliftment alone is insufficient for caste eradication. The Darla family’s occupational shifts brought economic stability and educational opportunities, but the persistence of caste stigma highlights the “unbreakable concrete walls” of the caste system. The autobiography suggests that caste eradication requires specific strategies—such as fostering social consciousness, implementing legal reforms, and engaging in ideological critique—to challenge the caste system’s foundational structures. This theoretical perspective establishes *Nemali Kannulu* as a distinctive text, igniting new discussions in caste eradication theory.


 Conclusion

Nemali Kannulu by Darla Venkateswara Rao masterfully narrates the generational occupational transitions of a Madiga family—from leatherwork to toddy tapping and ultimately to academia. While these shifts brought economic stability and social respectability, the persistent social stigma attached to their caste underscores that caste and occupation are not synonymous and that caste eradication demands specific strategies. By critiquing the societal mindset that stigmatizes certain occupations without condemning them, the autobiography exposes the structural injustices of the caste system. Through a synthesis of Marxist and Dalit ideologies, it challenges caste hegemony and analyzes the unbreakable foundations of caste in Indian society. Engaging with the complexities of caste eradication theory, Nemali Kannulu stands as a landmark in Telugu Dalit literature, fostering social consciousness and suggesting new pathways to dismantle the caste system.