"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

12 ఫిబ్రవరి, 2009

తెలుగులో తొలి కథానిక ఏది? ఎందుకు?

Date: 20th January 2009.

Criticism on the first short story in Telugu

Seminar Abstract

-Dr.Darla Venkateswara Rao

Sr.Lecturer, Dept.of Telugu,

School of Humanities,

University of Hyderabad.

Different views have been expressed about the origin of a Telugu Short Story. Stories are visible even in oral literature. Stories appear in one form or the other from the Vedas, Puranas and the legends a though descriptions are significant in the classical poetry, we cannot imagine them with out a story. How ever, critics are recognized the origin of the telugu short story in the evolution of modernity. Short Story is considered a modern genre in Telugu Literature. Many writers opined that Gurajada Apparao’s diddubaaTu( 1910) (a kind of realization or self reformation ) was the first in telugu short story.

Some other writers regard Achanta Sankyayana Sarma’s lalita(1902) or Visakha (1904) as the first telugu short story. As a result of different trends in literature. Feminists argue that Bandaru Acchamamba’s strividya (1902), and dhanatrayOdasi (1902) are the first telugu short stories. There are some critics who want to analyses the modern short story by its special characteristics and ideology. Historically dhanatrayOdasi (1902), ideologically diddubaaTu (1910) are considered the first short stories in Telugu.

It is clear that literature would be evaluated and new perspective would be discovered through the new sources like time, genre, style and ideology. And it can also by studied from the comparative perspective.

తెలుగులో తొలి కథానికపై వచ్చిన విమర్శ

-డా//దార్ల వెంకటేశ్వరరావు

పత్ర సారాంశం

కథ పుట్టుకకు సంబంధించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. మౌఖిక సాహిత్యంలోనూ కథలు ఉన్నాయి. వేద, పురాణ, ఇతిహాసాల నుండీ కథలు ఏదొక రూపంలో కనిపిస్తున్నాయి. అలాగే ప్రాచీన కావ్యాల్లో వర్ణనలు ప్రధానమైనా, కథ లేకుండా వాటిని ఊహించలేం. అయినా గానీ, విమర్శకులు ఆధునికతా పరిణామంలో భాగంగా కథాపుట్టుకను గుర్తిస్తున్నారు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా కథ పుట్టిందన్నారు. తెలుగు సాహిత్యంలో కథను ఆధునిక ప్రక్రియగానే భావిస్తున్నారు. 1910లో గురజాడ అప్పారావు రాసిన 'దిద్దుబాటు' ని తొలి తెలుగు కథగా అత్యధికులు భావించారు.

'దిద్దుబాటు' కంటే, మరికొంతమంది ఆచంట సాంఖ్యాయన శర్మ రాసిన 'లలిత' (1902), 'విశాఖ' (1904)లలో ఒకదాన్ని తొలి తెలుగు కథగా సమర్ధించారు. సాహిత్యంలో వస్తున్న వివిధ ధోరణుల ఫలితంగా స్త్రీవాదులు బండారు అచ్చమాంబ రాసిన 'స్త్రీ విద్య', 'ధన త్రయోదశి' (1902) కథలను తొలి తెలుగు కథలని వాదిస్తున్నారు. ఈ కథలన్నింటినీ పరిశీలించిన తర్వాత చారిత్రకంగా ధనత్రయోదశి(1902) ఆధునిక భావజాలం దగ్గరగా ఉన్న కథగా దిద్దుబాటు (1910) లు గా గుర్తించే అవకాశం ఉంది.

ఆధునిక కథకు గల ప్రత్యేక లక్షణాలను బట్టి పరిశీలించాలనే వాళ్ళూ కనిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తొలి తెలుగు తొలి కథలని భావిస్తున్న వాటిని తులనాత్మకంగా పరిశీలించడం ద్వారా కాలం, ప్రక్రియ, వస్తువు, శిల్పం, భావజాలం, కొత్త ఆధారాలు వంటి వాటి వల్ల సాహిత్యం పునర్ముల్యాంకనం జరుగుతుందని కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయని స్పష్టమవుతుంది.

(Seminar Abstract submitted in the connection with Refresher Course in Comparative Literature

from 2nd Jan 2009 to 22nd Jan 2009., UGC-Academic Staff College, University of Hyderabad)


( ఈ పూర్తి వ్యాసం విశాలాంధ్రసాహిత్యానుబంధం (9-2-2009)లో ప్రచురితమైంది. దీన్ని పి.డి.ఎఫ్ రూపంలో ఇక్కడ అందిస్తున్నాను)



Toli Tleug Katha

2 కామెంట్‌లు:

రావు వేమూరి చెప్పారు...

తెలిసీతెలియని జ్ఞానంతో నా అభిప్రాయం ప్రకటించటం సాహసమే కాని, 1902 లో రాసిన కథ ఉండగా 1910 లో రాసిన (ప్రచురణ జరిగిన) దిద్దుబాటు కే ఎక్కవ ఓట్లు ఎందుకు వస్తున్నాయో? 1910 కి పూర్వం అచ్చయిన కథలు విమర్శకుల దృష్టిలో "కథ" లేక "కథానిక" ల నిర్వచనాలలో ఇమడవా? ఎక్కడ చూసినా ప్రతివారూ ఈ కథలన్నిటి గురించీ చెప్పి, మరే విశ్లేషణా చూపింవకుండా "మా దృష్టిలో దిద్దుబాటే మొదటి కథ" అంటూ ఉంటే ఇక్కడ ఏదో hidden agenda ఉందేమో అనిపిస్తున్నాది.

vrdarla చెప్పారు...

వేమూరి గారూ నమస్తే,
మీరన్నది నిజం.. సాహత్యం కూడా రాజకీయంలో భాగమే! అయినా ఆధునికత అనేది ఆధునిక కథకు ప్రాణం. ఆధునికత గురించి, ఆ కథలన్నింటి గురించి నా వ్యాసంలో విశ్లేషించానని అనుకుంటున్నాను. మీరన్నట్లు చాలా మంది దిద్దుబాటునే తొలి తెలుగు కథానక గా గుర్తించడానికి గల కారణాలను విశ్లేషించడం లేదు. మీ పరిశీలన లోతైనదేనని నమ్ముతున్నాను.
అభిప్రాయానికి ధన్యవాదాలు
మీ
దార్ల