"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

Biogrphy


Bio note 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖలో  ప్రొఫెసర్ & హెడ్ గా పనిచేస్తున్నారు. ‌
1.5.2023
1.5.2023

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు (సెంట్రల్‌ యూనివర్సిటి)లో ఎం.ఏ., తెలుగు (1997);ఎం.ఫిల్‌.,( 1998); పి హెచ్‌.డి., (2003) చేశారు. ఆచార్య ఎస్‌.శరత్‌ జ్యోత్స్నారాణి గారి పర్యవేక్షణలో జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన పేరు చేసిన పరిశోధనకు ఎం.ఫిల్‌.; ''పరిశోధకుడుగా ఆరుద్ర ' పేరుతో చేసిన పరిశోధనకు పిహెచ్‌.డి., పట్టాలను అందుకున్నారు. నిజాం కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో సంస్కృతంలో డిప్లొమా (1997), తెలుగు లింగ్విస్టిక్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ లో పి.జి.డిప్లొమాని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2000) లో చేశారు. వీటితో పాటు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (2005) లో ఎం.ఏ., (సోషియాలజీ) చేశారు.
విద్యార్ధిగా మెరిట్‌ స్కాలర్‌ షిప్ఫుతో పాటు, యు.జి.సి., రీసెర్చ్‌ ఫెలోషిప్‌ని సాధించారు. పరిశోధన చేస్తుండగానే ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల్లో పోటీ పరీక్ష ద్వారా ఏకకాలంలో (2001) అధ్యాపకుడుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2004లో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా చేరారు. ప్రస్తుతం అదే శాఖలో 2016 నుండి ప్రొఫెసరుగా పనిచేస్తూ, శఆఖఆధఇపతఇగఆ ఉన్నారు.
ఈయనకు సుమారు 23 సంవత్సరాల బోధనానుభవం ఉంది.సుమారు 24  పుస్తకాలను ప్రచురించారు. సుమారు 56 పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఇంటర్నెట్ లో ఆయన పేరు సెర్చ్  చేస్తే  అవన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. బహజన సాహిత్య దృక్పథం, దళిత సాహిత్యం-మాదిగదృక్పథం, వీచిక, పునర్మూల్యాంకనం, సృజనాత్మక నైపుణ్యాలు, సాహితీ సౌగంధి మొదలైనవి పరిశోధన, విమర్శ గ్రంథాల్లో ప్రసిద్దమైనవి. నెమలి కన్నులు, దార్ల మాటశతకం కవిత్వానికి సంబంధించినవి.  ఈ కవిత్వం ఆంగ్లం, హిందీ భాషల్లో అనువాదం పొందింది. నెమలికన్నులు పేరుతోనే తన ఆటో బయోగ్రఫీ మొదటి భాగాన్ని కూడా వెలువరించారు.  
ఈయన పర్యవేక్షణలో 16 మంది డాక్టరేట్, 22 మంది ఎం.ఫిల్ డిగ్రీలు పొందారు.ప్రస్తుతం పదిమంది ఈయన పర్యవేక్షణలో డాక్టరేట్ చేస్తున్నారు. ఈయన రచనలు ఎంతో మంది పరిశోధకులు ఆకారాలుగా  ఉపయోగించుకుంటున్నారు. ఈయన డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి వారికి బి.ఏ. ఎం.ఏ పాఠాలు రాశారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు వారు దూరవిద్య ద్వారా బోధించే జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ కోర్సు పి.జి. డిప్లొమా విద్యార్థులకు రెండు పాఠాలను రాశారు. 
ఈయన రచనలు వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలు గాను, ఆధార గ్రంథాలుగానూ ఉన్నాయి. ఈయన రాసిన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. మరికొన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు బోధన, పరిశోధన, పాఠ్యాంశాల రూపకల్పనలో కనబర్చిన ప్రతిభకు గాను  నలభై సంవత్సరాల లోపు  అధ్యాపకులకు ప్రతియేడాదీ  ఐదుగురికి  ఛాన్సలర్      అవార్డుని సాధించారు. దీనికి గాను ఒక లక్షరూపాయలు పరిశోధన స్పెషల్ గ్రాంట్ పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖలో పరిశోధన గ్రంథ రచన-నైపుణ్యాలు,  ళిత సాహిత్యం, డయాస్పోరా సాహిత్యం, సృజనాత్మక నైపుణ్యాలు మొదలైన కొత్త పాఠ్యాంశాల రూపకల్పన చేశారు. మాదిగల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం పై యు.జి.సి. మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం పొందారు. డా.బి.ఆర్.అంబేద్కర్, మహాకవి గుర్రం జాషువా జాతీయ పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా ఇచ్చే పురస్కారాల ఎంపిక కమిటీ (2023) కి జ్యూరీ మెంబర్ గా ఉన్నారు. యూజీసీ కేర్ జర్నల్ 'ఔచిత్యమ్' అంతర్జాతీయ అంతర్జాల పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా ఉన్నారు. అమెరికా నుండి వెలువడుతున్న ప్రకాశిక త్రైమాసిక పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. మద్రాసు, పాండిచ్చేరి (యానాం), కృష్ణా, ఉస్మానియా, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల తెలుగు శాఖ బోర్డు ఆఫ్ స్టడీస్ మెంబరుగా ఉన్నారు. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పరిచయం

 శ్రీమతి పెదనాగమ్మ, లంకయ్య (అబ్బాయి) దంపతులకు తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో 5 సెప్టెంబరు 1973లో జన్మించిన వెంకటేశ్వరరావు, కోనసీమలోనే  ప్రాథమిక విద్యను అభ్యసించారు. కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన  శ్రీబానోజీరామర్స్‌ కళాశాల, అమలాపురం (1995)లో ఇంటర్మీడియట్‌ నుండి బి.ఏ., (స్పెషల్‌ తెలుగు) వరకు చదువుకున్నారు.
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు (సెంట్రల్‌ యూనివర్సిటి)లో ఎం.ఏ., తెలుగు (1997);ఎం.ఫిల్‌.,( 1998);   పి హెచ్‌.డి., (2003) చేశారు. ఆచార్య ఎస్‌.శరత్‌ జ్యోత్స్నారాణి గారి పర్యవేక్షణలో  జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన పేరు చేసిన పరిశోధనకు ఎం.ఫిల్‌.; ''పరిశోధకుడుగా ఆరుద్ర ' పేరుతో చేసిన పరిశోధనకు పిహెచ్‌.డి., పట్టాలను అందుకున్నారు. నిజాం కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో సంస్కృతంలో డిప్లొమా (1997),  తెలుగు లింగ్విస్టిక్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ లో పి.జి.డిప్లొమాని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2000) లో చేశారు. వీటితో పాటు  డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (2005) లో ఎం.ఏ., (సోషియాలజీ) చేశారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో బి.ఏ., స్పెషల్‌ తెలుగు ఫస్ట్‌ ర్యాంకు సాధించిన వారికిచ్చే కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని, కందుకూరి వీరేశలింగం, శ్రీమతి రాజ్యలక్ష్మి స్మారక బహుమతుల్ని అందుకున్నారు. వీటితో పాటు శ్రీ కోనసీమ భానోజీ రామర్స్‌ కళాశాల వారు కాలేజీ ఫస్ట్‌ వారికిచ్చే నండూరి వెంకటరామయ్య, కుటుంబలక్ష్మి స్మారక బహుమతుల్ని సాధించారు.
విద్యార్ధిగా మెరిట్‌ స్కాలర్‌ షిప్ఫుతో పాటు, యు.జి.సి., రీసెర్చ్‌ ఫెలోషిప్‌ని సాధించారు. పరిశోధన చేస్తుండగానే ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల్లో పోటీ పరీక్ష ద్వారా ఏకకాలంలో (2001) అధ్యాపకుడుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2004లో  హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా చేరారు. ప్రస్తుతం అదే శాఖలో 2016 నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు.
 విద్యార్ధి దశ నుండే వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు రాసే అలవాటున్న వెంకటేశ్వరరావు, హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరిన తర్వాత ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, యువవాణి విభాగంలో కొంతకాలం పాటు క్యాజువల్‌ (క్యాంపియర్‌) ఎనౌన్సర్‌గా పనిచేశారు. ఆ నాటి నుండి నేటి వరకు ఆకాశవాణిలో అనేక కవితలు, సాహితీ ప్రసంగాలు చేస్తున్నారు. పరిశోధన విద్యార్థిగా ఉన్నప్పుడే సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు తెలుగు సాహిత్యంలో శిక్షణనిస్తూ, దూరదర్శన్‌లో కూడా ప్రసంగాలిచ్చారు.
వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో  సుమారు 126 పరిశోధన పత్రాలను సమర్పించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘‘వాఙ్మయి’’, తెలుగు అకాడమీ వారి ‘‘తెలుగు వైఙ్ఞానిక మాసపత్రిక’’,  ద్రావిడ విశ్వవిద్యాలయం వారి ‘‘ద్రావిడి’’ వంటి పరిశోధన పత్రికలు, ప్రత్యేక సంచికలు, దినపత్రికల్లో సుమారు 96 పరిశోధన, విమర్శ పత్రాలు ప్రచురితమైయ్యాయి.
ఇవ్పటివరకు కవిత్వం, విమర్శ, పరిశోధనలకు సంబంధించి ఇరవై నాలుగు (24) పుస్తకాలను ప్రచురించారు. మాదిగచైతన్యం (1997) సంపాదకత్వం, సాహితీ మూర్తుల ప్రశస్తి (1998) సహ సంపాదకత్వం, జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన (1999) పరిశోధన, దళితతాత్త్వికుడు (2004) కవిత్వం, సృజనాత్మక రచనలు చేయడం ఎలా?   ( 2005) విమర్శ, సాహితీసులోచనం (2006) విమర్శ, ఒక మాదిగస్మృతి -నాగప్పగారి సుందర్రాజు (2007) మోనోగ్రాఫ్‌, విమర్శ, వీచిక (2009) విమర్శ, పునర్మూల్యాంకనం (2010) బహుజన సాహిత్య దృక్పథం(2012)సాహితీమూర్తులు-స్ఫూర్తులు(2015), నెమలికన్నులు2016 (కవిత్వం),  సాహితీ సౌగంధి (2016), ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన ‘సాహిత్య పరిశోధన-కళ:విధానం (2017) గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు. తన ఆత్మకథను నెమలికన్నులు పేరుతో 2023లో ప్రచురించారు. విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా కందుకూరి వీరేశలింగంగారి శ్రీరాజశేఖరచరిత్రము నవలపై ప్రత్యేకించి ఒక రోజంతా విద్యార్థి సదస్సు నిర్వహించారు. ఆ పత్రాలను తాను ప్రధాన సంపాదకుడిగా ఉండి ‘‘రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు’’ పేరుతో 2017లో ప్రచురించారు.  మరో రెండు గ్రంథాలు ప్రచురణలో ఉన్నాయి. ఈయన కవిత్వం ఆంగ్లంలో డా.జె.భీమయ్యగారు అనువదించగా ప్రెస్టేజ్ పుస్తక ప్రచురణల సంస్థ, న్యూఢిల్లీవారు Voice of Dalit: The Poetry of Darla Venkateswara Rao పేరుతో 2018లో ప్రచురించారు. ఆక్స్ ఫర్డ్ ప్రెస్ వారి The Oxford India Anthology of Telugu Dalit Writing లో ఈయన కవితను తీసుకున్నారు. ఈయన కవిత్వంపై ప్రెసిడెన్సి కళాశాల (యూనివర్సిటి ఆఫ్ మద్రాస్) లో పరిశోధన చేశారు.
ఆచార్య వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది (22) ఎం.ఫిల్‌.,పరిశోధనలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈయన పర్యవేక్షణలో పదహారు మంది (16) పిహెచ్‌.డి., పట్టాలు పొందారు. మరో పది మంది  పిహెచ్‌.డి.,పరిశోధనలు చేస్తున్నారు.
  చిన్ననాటి నుండే సాహిత్యాభిలాష గల వెంకటేశ్వరరావు వ్యాసరచన సోటీలో భారతీయ సాహిత్య పరిషత్‌ రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో  రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి (1996) ని అందుకున్నారు. సాహిత్యానికి ఈయన చేస్తున్న కృషికి గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారు 2007లో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ పురస్కారంతో సత్కరించారు. 2012 వ సంవత్సరానికి గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈయనకు ఉత్తమ విమర్శ విభాగంలో కీర్తి పురస్కారాన్ని అందించారు. బహుజన రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ వారిచ్చే  మధురకవి మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధన పురస్కారాన్ని 2016లో పొందారు. ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషి చేసినందుకుగాను  హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను 2016 అక్టోబరు 1 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేశారు. యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సాహితీవిభాగం, వరంగల్లు వారు జాషువా జాతీయ పురస్కారం (2016) తో 2016 నవంబరు 6 వతేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావుగారి చేతుల మీదుగా సత్కరించారు. డా.ఆనంద్ గారి చేతుల మీదుగా  శ్రీమతి జెన్నె మాణిక్యమ్మ విశిష్ట సాహిత్య పురస్కారం (2017) అందుకున్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాదు స్వచ్చంద సంస్థ వారు మదర్ తెరీసా పురస్కారంతో 26 ఆగస్టు 2018 వ తేదీన  సంస్థ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి, పురస్కారాన్ని ప్రదానం చేశారు.
 అంతర్జాల మాసపత్రిక‘విహంగ’ 2017 వ సంవత్సరం నుండి విహంగ సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. 2017వ సంవత్సరానికి గాను విహంగ అంతర్జాల పత్రిక పురస్కారాన్ని డా.దార్ల వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, బొమ్మూరు (రాజమహేంద్రవరం)లో 2017 జనవరి 11 వతేదీన జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభలో యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య ఎస్వీసత్యనారాయణ, సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు, విహంగ మాసపత్రిక సంపాదకురాలు డా. పుట్ల హేమలతల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని దళిత ఓపెన్ యూనివర్సిటి ఆఫ్ ఇండియా, గుంటూరు వారు డా.బి.ఆర్.అంబేద్క జాతీయ పురస్కారాన్ని  13 జూలై 2019 వ తేదీన గుంటూరులో నిర్వహించిన  విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి,  ఐదువేలరూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. 19 అక్టోబరు 2019 వ తేదీన రవీంద్రభారతిలో    తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, ఉత్సవసంఘం నిర్వాహకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా.పత్తిపాక మోహన్ చేతుల మీదుగా  బహుజన తత్త్వవేత్త బి.యస్.రాములు ప్రతిభా పురస్కారాన్ని విశాల సాహిత్య అకాడమీవారు  ప్రదానం చేశారు. 2023వ సంవత్సరంలో యోగివేమన విశ్వవిద్యాలయం, కడపలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య , ప్రముఖ తమిళ కవి, న్యాయవాది వానవిల్ కె.రవి చేతులు మీదుగా పరిశోధన పురస్కారం అందుకున్నారు. 
పత్రికలు-సంపాదకత్వం: 
 బహుజన కెరటాలు మాసపత్రిక, విద్య మాసపత్రికలకు సంపాదక వర్గ సభ్యులుగా, మాదిగసమాచారలేఖ మాసపత్రిక గౌరవ సంపాదకులుగా, ప్రజామణిపూస మాసపత్రిక గౌరవ సలహామండలి సభ్యునిగా, రాయలసీమ జాగృతి గౌరవ సంపాదకుడు, భావవీణ మాసపత్రిక గౌరవ సలహాదారు, జౌచిత్యమ్ అంతర్జాల పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా సొసైటీ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు సలహాదారుగా ఉన్నారు. జ్యోత్స్నాకళాపీఠం, తెలుగు సాహిత్య వేదిక, మాదిగ సాహిత్య వేదిక వంటి సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో కార్యవర్గసభ్యుడుగా పనిచేశారు.
బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబరు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివిధ విశ్వవిద్యాలయాల్లోని   తెలుగు శాఖ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ (పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యులు) గా  ఉన్నారు.మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై (2020 -2023), కృష్ణ విశ్వవిద్యాలయం, మచిలీపట్నం (2020 -2022), బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి), పాండిచ్చేరి విశ్వవిద్యాలయం (డా.ఎస్.ఆర్.కె. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, యానాం), పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, (విజయవాడ), ఆంధ్ర లయోలా కళాశాల, (విజయవాడ), తారా ప్రభుత్వ కళాశాల, (సంగారెడ్డి). వీటితో పాటు తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, దళిత మరియు ఆదివాసి పరిశోధన కేంద్రంలలో సభ్యునిగా ఉన్నారు. సిలబస్ రూపకల్పన చేయడం సభ్యుల విధి. దీనిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు భాగస్వాములుగా ఉన్నారు.  

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదులో ఎం.ఏ., తెలుగు విద్యార్థులకు ‘‘దళితసాహిత్యం’’, ప్రవాసాంధ్ర సాహిత్యం –పరిచయం’’ పరిశోథన గ్రంథ రచనా నైపుణ్యాలు‘(Techniques of Writing a Thesis/Dissertation) అనే  కోర్సులను పాఠ్య ప్రణాళికలుగా రూపొందించారు. వీటితో పాటు తెలుగు సాహిత్య విమర్శ, సౌందర్యశాస్త్రం,  తులనాత్మక  కళాతత్త్వశాస్త్రం కోర్సులను బోధిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు వారు దూరవిద్య ద్వారా బోధించే జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ కోర్సు పి.జి. డిప్లొమా విద్యార్థులకు రెండు పాఠాలను రాశారు.    యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదులో ఐదు సంవత్సరాల ఎం.ఏ. కోర్సు (ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ) తెలుగు విభాగం కోర్డినేటర్‌గా సేవలందించారు. భారతీయ సాహిత్య అకాడమి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదలైన వారిచ్చే పురస్కార కమిటీల్లోను, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, సిద్ధార్థ (స్వయంప్రతిపత్తి) కళాశాల, విజయవాడ, తెలుగుశాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్  మెంబరుగాను పనిచేశారు.
 ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు, తెలుగు శాఖల శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘‘తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక  అధ్యయనం’’ అనే అంశంపై యు.జి.సి వారి మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈయన రచనలను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ (https://archive.org,  http://vrdarla.blogspot.com/) లో అందుబాటులో ఉంచడంతో పాటు, దానిపై చర్చలు చేస్తుంటారు. విద్యార్ధులకు బోధించే కోర్సు వివరాలు, మెటీరియల్‌ కూడా  ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొనే వీలుకల్పిస్తుంటారు.



         .

 


     

డా// పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు(2009 మార్చి   తేదీన) గ్రంథావిష్కరణ దృశ్యం. చిత్రంలో వరుసగా కలేకూరి ప్రసాద్, డా//దార్ల వెంకటేశ్వరరావు,విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., జూలూరి గౌరీశంకర్, బొజ్జా తారకం, డా// సత్యనారాయణ తదితరులు ఉన్నారు.



    బహుజన కెరటాలు, విద్య మాసపత్రికలకు సంపాదక వర్గ సభ్యులుగా, మాదిగసమాచారలేఖ మాసపత్రిక గౌరవ సంపాదకులుగా, సొసైటీ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు సలహాదారుగా ఉన్నారు. జ్యోత్స్నాకళాపీఠం, తెలుగు సాహిత్య వేదిక, మాదిగ సాహిత్య వేదిక వంటి సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో కార్యవర్గసభ్యుడుగా పనిచేశారు.
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదులో ఎం.ఏ., తెలుగు విద్యార్థులకు పరిశోధన గ్రంథ రచనా నైపుణ్యాలు, ‘‘దళితసాహిత్యం’’, ప్రవాసాంధ్ర సాహిత్యం –పరిచయం’’ అనే  కోర్సులను పాఠ్య ప్రణాళికలుగా రూపొందించారు. వీటితో పాటు తెలుగు సాహిత్య విమర్శ, సౌందర్యశాస్త్రం,  తులనాత్మక  కళాతత్త్వశాస్త్రం కోర్సులను బోధిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు వారు దూరవిద్య ద్వారా బోధించే జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ కోర్సు పి.జి. డిప్లొమా విద్యార్థులకు రెండు పాఠాలను రాశారు.    యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదులో ఐదు సంవత్సరాల ఎం.ఏ. కోర్సు (ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ) తెలుగు విభాగం కోర్డినేటర్‌గా సేవలందించారు. భారతీయ సాహిత్య అకాడమి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదలైన వారిచ్చే పురస్కార కమిటీల్లో మెంబరుగా పనిచేశారు.
       ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు, తెలుగు శాఖలో అసోసియేటు ప్రొఫెసరుగా పనిచేస్తూ,  ‘‘తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక  అధ్యయనం’’ అనే అంశంపై యు.జి.సి వారి మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు పూర్తి చేశారు. ప్రస్తుతం ‘‘గుర్రం జాషువ పదప్రయోగకోశ నిర్మాణం’’ ప్రాజెక్టు  చేస్తున్నారు. ఈయన రచనలను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ (https://archive.orghttp://vrdarla.blogspot.com/) లో అందుబాటులో ఉంచడంతో పాటు, దానిపై చర్చలు చేస్తుంటారు. విద్యార్ధులకు బోధించే కోర్సు వివరాలు, మెటీరియల్‌ కూడా  ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొనే వీలుకల్పిస్తుంటారు.
Prof. Darla Venkateswara Rao
Bio-note
Prof.Darla Venkateswara Rao born to Smt. Pedanagamma and Sri Lankayya (Abbai) couple in Cheyyeru Agraharaham village in East Godavari district, Andhra Pradesh. He went to school Konaseema in East Godavari District. He completed his Intermediate and B. A. Special Telugu in Sri Banoji Ramars College (SKBRC), Amalapuram in 1995.
Prof.Venkateswara Rao, in continuation of his journey to higher studies, came to University of Hyderabad in 1995, where he completed his M.A., M.Phil. and Ph.D. in the Department of Telugu. He had been awarded M.Phil. for his research topic – Gnanandasavi Amrapaali Parisheelana - in 1998, and Ph.D. degree on the research topic – Parishodakudiga Aarudra – in 2003 under the supervision of Prof. S. Sarat Jyothsna Rani. He had also completed Diploma in Sanskrit Language in 1997 from Nizam College (Osmania University), P.G. Diploma in Telugu Linguistic and Language Teaching from Potti Sriramulu Telugu University in 2000. His desire to acquire new stream of knowledge continued until he received M.A. Sociology from Dr. B. R. Ambedkar Open University in 2005.
He received Kalaprapurna Jayanthi Ramaiah Panthulu Memorial Award and Kandukoori Veereshalingam - Smt. Rajyalaxmi Memorial Award from Andhra University for being first ranker in B.A. Special Telugu in 1995. He also achieved Nanduri Venkata Ramaiah, Kutumba Laxmi Memorial Award for being the first ranker in B.A. Special Telugu from Sri Konaseema Banojiramars College.
As a research scholar in the Dept. of Telugu in University of Hyderabad, he had also received Merit Scholarship and U.G.C. Research Fellowship. While he had been pursuing his research he got selected as Junior Lecturer through APPSC Competitive Examinations and Selected as a Lecturer in the Govt-Aided College to teach in Vikarakabad, SAP College. He thereafter had joined in the University of Hyderabad as Assistant Professor in the Dept. of Telugu in 2004, where he has been now he has a Professor in the same Department.
Since student days Dr. Venkateswara Rao has a habit of writing poems and essays to different Telugu daily newspapers. After he joined in the University of Hyderabad he contributed as a Comparer (Know as Casual Announcer) in Akashavani (All India Radia) in Hyderabad. Since he has been contributing poems and literary lectures, plays, in Akashavani. While he was pursuing his research as Ph.D. scholar, he had given coaching to the Civil Service aspirants in Telugu subject and delivered many lectures in Akashavani and Doordarshan (Saptagiri)
Prof.Darla Venkateswara Rao presented approximately 102 research papers in various national seminars held at different Universities. He also published approximately 56 research critics and papers in reputed national research journals, special editions and newspapers such as ‘Vangmai’ of Pottisriramulu Telugu University, ‘Telugu Vaignanika Maasapathrika’ of Telugu Academy and ‘Dravidi’ of Dravida University and others.
He also published 24 research books on poetry, criticism and research as of now. Mādiga caitan'yaṁ (1997), Sāhitī mūrtula praśasti (Ed. 1998), Jñānānandakavi āmrapāli pariśīlana (1999), Daḷita tāttvikuḍu (2004), Sr̥janātmaka racanalu cēyaḍaṁ elā? (2005), Sāhitī sulōcanaṁ (2006), Oka mādiga smr̥ti-nāgappagāri sundar rāju (2007),  Vīcika- sāhitya vimarśa (2009), Punarmūlyāṅkanaṁ (2010), Bahujana sāhitya dr̥kpathaṁ (2012), Sāhitī mūrtulu-sphūrtalu (2015), Nemali kannulu (2016), Sāhitī sauganthi , Nemalikannulu (Auto biography (2023), and so on are some of the important books that has come up from his brilliant brain. There are three more books on the print yet to be released. His poetry would be translated into English and Kannada languages soon.
Prof.Venkateswara Rao has supervised 22 research scholars in M.Phil.s 16 Ph.Ds and all of them have been awarded their degrees. There are at present ten Ph.D. scholars have been pursuing under his supervision.
Prof.Venkateswara Rao, who has been exhibiting poetic knowledge since his childhood days, achieved state first in essay writing competitions organized by Bharathiya Sahithya Parishath held in Rajahmundry in 1996. Bharathiya Dalita Sahithya Academy, New Delhi, has honoured him with Dr. B. R. Ambedkar purashkar for his contribution to literature.
He has been contributing to the literature in different capacities as Member of Editorial Board for Bhahujana Kerataalu and Vidya Masapathrika, Honorary Editor for Madiga Samachara Lekha and Advisor for Society and Education Trust, Hyderabad. He had also worked as Executive Member in most of the Cultural and Literary Organization such as Jothsana Kalapitam, Telugu Sahithya Vedika and Madiga Sahithya Vedika.
Prof.Venkateswara Rao has been teaching “Dalita Sahithyam” since 2005 as an optional paper along with other compulsory courses such as Writing Techniques of thesis, Telugu Sahithya Vimarsha, Soundarya Sastram, Tulanatmaka Kalatathwa Sastram as compulsory papers to the M.A. Telugu students in the University of Hyderabad. He has written two chapters for the students in Journalism and Mass Communication course organized by the University of Hyderabad Distance Education. He has coordinated five years M.A. Integrated Course in the University up to 2013.
Prof.Venkateswara Rao has been working as Professor in the Dept. of Telugu in University of Hyderabad, and had Completed  major research project, sponsored by the UGC, New Delhi, such as Telugu Sahithyamlo Maadigala Samajika, Samskruthika Addyayanam  and currently handling Gurram Jashuva Padaprayogakosha Nirmanam for special interest.

His writings and the courses that he has been teaching to the scholars in the University of Hyderabad are available in internet. He continues his passion to invite debates on his writings and speeches. His writings and other information relating to his academic research could be downloaded from his blog http://vrdarla.blogspot.com/



Dr. Venkateswara Rao, who has been exhibiting poetic knowledge since his childhood days, achieved state first in essay writing competitions organized by Bharathiya Sahithya Parishath held in Rajahmundry in 1996. Bharathiya Dalita Sahithya Academy, New Delhi, has honoured him with Dr. B. R. Ambedkar Puraskharam-2007, for his contribution to literature. He has hornored with Madhurakavi Mallavarapu John Kavi Sahiti Puraskharam-2016 and he honoured Chancellor’s award for the year 2016 from University of Hyderabad.
He has been contributing to the literature in different capacities as Member of Editorial Board for Bhahujana Kerataalu and Vidya Masapathrika, Honorary Editor for Madiga Samachara Lekha and Advisor for Society and Education Trust. He had also worked as Executive Member in most of the Cultural and Literature Institutions such as Jothsana Kalapitam, Telugu Sahithya Vedika and Madiga Sahithya Vedika.
Dr. Venkateswara Rao has been teaching “Dalita Sahithyam” since 2005 as an optional paper along with other compulsory courses such as Telugu Sahithya Vimarsha, Soundarya Sastram, Tulanatmaka Kalatathwa Sastram as compulsory papers to the M.A. Telugu students in the University of Hyderabad as advised by Prof. Parimirama Narasimha. He has written two chapters for the students in Journalism and Mass Communication course organized by the University of Hyderabad Distance Education. He has coordinated five years M.A. Integrated Course in the University.
Dr. Venkateswara Rao has been working as Professor in the Dept. of Telugu in University of Hyderabad, and has currently handling major research projects such Gurram Jashuva Padaprayogakosha Nirmanam sponsored by the UGC, New Delhi.
His writings and the courses that he has been teaching to the scholars in the University of Hyderabad are available in internet. He continues his passion to invite debates on his writings and speeches. His writings and other information relating to his academic research could be downloaded from his blog http://vrdarla.blogspot.com/



Dr.Darla Venkateswara Rao
Dr.Darla Venkateswara Rao


Dr.Darla Venkateswara Rao
Father and Mother


Dr,Darla Venkateswara Rao receiving award from President Dr. Sumanakshar, Dalit Sahitya Akademy, Delhi
Dr.Darla Venkateswara Rao
Father and Mother
Dr.Darla Venkateswara Rao

డా.దార్ల వెంకటేశ్వరరావు కవిత్వం నెమలికన్నులు’ సంపుటిని ఈ 12 మార్చి 2016వతేదీనహైదరాబాదు విశ్వవిద్యాలయంస్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ సెమినార్ హాల్ లో ఆవిష్కరించారు. కవితా సంపుటిని తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య తుమ్మల రామకృష్ణ ఆవిష్కరించిన ఈ కార్య క్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిత్రంలో వరుసగా ఆచార్య బేతవోలు రామబ్రహ్మంఆచార్య ఎన్.ఎస్.రాజుఆచార్య తుమ్మల రామకృష్ణకవి డా.దార్ల వెంకటేశ్వరరావుద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ సెంటర్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్,తెలుగు హెడ్ ఆచార్య జి. అరుణకుమారిఆచార్య చంద్రశేఖరరెడ్డిడా. పిల్లలమర్రి రాములుడా. మల్లెగోడ గంగాప్రసాద్ లు ఉన్నారు

Book Releasing of Punarmulyankanam at University of Hyderabad, 
డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘ పునర్మూల్యాంకనం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హైదరాబాదు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య హస్నైన్ప్రో వైస్ చాన్సలర్ సారంగిడీన్స్కూల్ ఆఫ్ హుమానిటీస్ ఆచార్య వెంకట రమణన్  రచయిత దార్ల చిత్రంలో ఉన్నారు.

డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన బహుజన సాహిత్య దృక్పథం గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య హరిబాబుశ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.కొలకలూరి ఇనాక్యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ష్ ప్రొ.వి.కృష్ణప్రముఖ పరిశోధకుడుసిడాస్ట్ విజిటింగ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావుదళిత-ఆదివాసీ అధ్యయన-అనువాద కేంద్రంహైదరాబాద్విశ్వవిద్యాలయం హెడ్ (ఐ/సి),  ప్రొ. ఆర్.ఎస్. సర్రాజుగారు చిత్రంలో ఉన్నారు



డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖరచయిత ఆచార్య ఎన్.గొపిగారు. వేదికపై వరుసగా డా.వంశీరామరాజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, డా.ద్వానాశాస్త్రి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్.గోపి, శ్రీ బైసా దేవదాసు, ఆచార్య జి. అరుణకుమారి, డా. కళావేంకటదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి మొదలైన వారున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5 ఏప్రిల్ 2015 వతేదీన డా.బాబూ జగజ్జీవన్ రామ్ జయంతోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రసంగం చేసిన నాకునా శ్రీమతి డా. మంజుశ్రీకి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వియ్యన్నారావుగారురెక్టార్ ఆచార్య సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్ ,విద్యార్థినీ విద్యార్థులు  సన్మానం చేశారు.
వ్యాఖ్యానించారు. 
2016లో పద్మశ్రీ వచ్చిన సందర్భంగా డా.టి.వి.నారాయణ గారికి సత్కారాన్ని చేస్తున్న తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా.దార్ల వెంకటేశ్వరరావు, చిత్రంలో గోగుశ్యామల తదితరులున్నారు. 

Felicitation for Prof.Simon Charsley
Darla Venkateswara Rao as a Cadet NCC Officer at Degree College Level

ఎడమవైపు నుండి వరుసగా కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, రాళ్ళబండి కవితాప్రసాద్, కొలకలూరి ఇనాక్, తుమ్మల రామకృష్ణ,  శిఖామణి
ఎడమవైపు నుండి వరుసగా కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, రాళ్ళబండి కవితాప్రసాద్, కొలకలూరి ఇనాక్, తుమ్మల రామకృష్ణ, జూపాక సుభద్ర, శిఖామణి

Dr.Darla VenkateswaraRao
ఒక మరిచిపోలేని అనుభూతి... ఎంతో ఆత్మీయంగా నాపుస్తకాన్ని తీసుకొంటూ సంతకం చేసిమ్మన్నారు కళ్యాణరావుగారు (అంటరానివసంతం నవలారచయిత)



దళిత-ఆదివాసీ అధ్యయన మరియు అనువాద కేంద్రం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ‘‘దళిత-బహుజన సాహిత్యం : చింతన – సమాలోచన’’(నాగప్పగారి సుందరరాజుకేసరాజు కొమరన్నకలేకూరి ప్రసాదుపైడి తెరేష్ బాబుల దృక్కోణాలు-చర్చా గోష్టి) పేరుతో ఒక సాహితీ చర్చాగోష్టిని 26/02/2015 వ తేదీన హైదరాబాద్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, ఆడిటోరియంలో నిర్వహించారు.     

మీటింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. 

నా పుస్తకాన్ని ఈ సమావేశంలో ఆవిష్కరించడం చాలా గౌరవంగా భావించాను.

పుస్తకాన్ని మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఫ్రొ.హరిబాబుగారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.కొలకలూరి ఇనాక్, మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ష్ ప్రొ. వి. కృష్ణ, ప్రముఖపరిశోధకుడు, సిడాస్ట్విజిటింగ్ప్రొఫెసర్,  ప్రొ. జయధీర్ తిరుమల రావు, దళిత-ఆదివాసీ అధ్యయన-అనువాద      కేంద్రం, హైదరాబాద్విశ్వవిద్యాలయం హెడ్ (/సి),  ప్రొ. ఆర్.ఎస్. సర్రాజుగారు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాక్షి, 27 ఫిబ్రవరి 2015

సమావేశంలో నా పుస్తకంతో పాటు కేసరాజు కొమరన్న రాసిన వ్యాస సంపుటి గుళ్ళ, డా.జి.వి.రత్నాకర్ తెలుగు నుండి హిందీలోకి అనువదించిన కథల సంపుటి ‘‘ శ్రేష్ట్ దళిత్ కహానియా’’, జాజుల గౌరి రాసిన ‘‘ఒయినం’’ పుస్తకాలను ఆవిష్కరించారు.


ప్రారంభసమావేశంలో గోష్టి ప్రాధాన్యాన్ని ప్రొ.ఆర్.ఎస్. సర్రాజుగారు వివరించారు.నాగప్పగారి సుందరరాజుకేసరాజు కొమరన్నకలేకూరి ప్రసాదుపైడి తెరేష్ బాబు మొదలైన వారు చేసిన సాహిత్య, సామాజిక ఉద్యమ దృక్కోణాలను సమావేశంలో పాల్గొన్నవారు సంక్షిప్తంగా వివరించారు.

నేటినిజం 4-3-2015


దార్ల వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
విద్యార్థులతో దార్ల 
వేదికపై ఫ్రొ. ఎండ్లూరి గారితో డా.దార్ల 

సభలో పాల్గొన్న కొంతమంది 

దార్ల రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

సుందరరాజు గురించి మాట్లాడుతున్న డా.దార్ల 

నాగప్పగారి సుందరరాజు గురించి మాట్లాడుతున్న డా.దార్ల 


 సభావేదికపై  తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య మల్లేష్ సంకశాల, ఆచార్య ఎం.గోనానాయక్, డా.దార్ల వెంకటేశ్వరరావు ఉన్న దృశ్యం



భారతదేశ పునర్మిర్మాణంలో విధాన నిర్ణాయక కర్తగాఆ విధానాలను అమలు పర్చిన వాళ్ళలో ఒకరుగా పనిచేసిన డా. బాబూ   జగజ్జీవన్ రామ్ గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో  ఏప్రిల్ 2015 వతేదీన అధికారికంగా నిర్వహించిన సభావిశేషాలను కొన్నింటిని మీతో పెంచుకోవాలనుకుంటున్నాను.  ఈ సభకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. వియన్నారావుగారు అధ్యక్షత వహించి డా. బాబూ జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్యానికి ముందూ తర్వాత అనేక పదవుల్లో పని చేసి దేశ పునర్మిర్మాణానికి కృషిచేశారని కొనియాడారు. సభలో యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు మాట్లాడుతూ చిన్ననాటి నుండే డా.బాబూ జగజ్జీవన్ రామ్ క్రమశిక్షణకు మారుపేరనీ దళితుల ఆత్మగౌరవాన్ని భంగపరిచే పనుల్ని సహించలేకపోయేవారని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్ పట్టేటి మాట్లాడుతూ అనేక బాబూ జగజ్జీవన్ రామ్ శాఖల్లో మంత్రి పదవి నిర్వహించారనీతాను చేపట్టిన ప్రతి శాఖను అంకితభావంలో పటిష్టపరిచారని అన్నారు. ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డా.కె.మధుబాబు మాట్గాలాడుతూ  డా. అంబేద్కర్ కి అనేక సందర్భాల్లోబాబూ జగజ్జీవన్ రామ్ సహకరించారని గుర్తుచేశారు.   సభలో పాల్గొన్న డా. ఉదయ్ కుమార్ డా.జగజ్జీవన్ రామ్ పనులను వివరించి వాటి వల్ల దేశానికీదళితులకీ ఎంతో ప్రయోజనం చేకూరిందని అన్నారు. 

సభలో ప్రధాన వక్తగా నన్ను ఆహ్వానించారు.  వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటూ,వ్యవస్థీకృతంగా పోరాడుతూ దేశానికీఅందులో భాగమైన పీడితదళిత వర్గం,కులాల వారి రక్షణకుశ్రేయస్సుకి డా. బాబూ జగజ్జీవన్ రామ్ పాటుపడిన సంఘటనలకు సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశాను.


డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు’ గ్రంథావిష్కరణ సభ దృశ్యం. గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖరచయిత ఆచార్య ఎన్.గొపిగారు. వేదికపై వరుసగా డా.వంశీరామరాజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, డా.ద్వానాశాస్త్రి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్.గోపి, శ్రీ బైసా దేవదాసు, ఆచార్య జి. అరుణకుమారి, డా. కళావేంకటదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి మొదలైన వారున్నారు.


డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి విజయవాడలో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రధమ మహాసభల్లో ది 10 ఏప్రిల్ 2016న మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధన పురస్కారాన్ని(2016) ప్రదానం చేస్తున్న దృశ్యం

బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ మహాసభల్లో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
30 మార్చి 2016 న తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయంలో ‘తెలుగు నాటక సాహిత్యం-సామాజిక ప్రయోజనం’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ‘మునివాహనుడు నాటక శిల్పం-సామాజికాంశాలు’ అనే పరిశోధన పత్రాన్ని సమర్పించాను. సభకు ఆచార్య ఎల్.బి.శంకరరావు అధ్యక్షత వహించారు. నాతో పాటు డా. మందలపు నటరాజ్, డా.టి.మోహనశ్రీ, డా.శామనపూడి వెంకటేశ్వరరావుగార్లు తమ పత్రాలను సమర్పించారు. 
కీలకోపన్యాసం చేసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గార్ని సత్కరిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పెరియా సామి. చిత్రంలో వరుసగా ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య జి. అరుణకుమారి, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య పెరియాస్వామి,  ఆచార్య పంచాన మొహంతి, (డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు ఉన్నారు

ప్రపంచీకరణ-తెలుగు భాష (డా.దార్ల వెంకటేశ్వరరావుతో ఈటివి ఇంటర్వ్యూ)

(తెలుగు వెలుగు కార్యక్రమంలో నా తో జరిపిన సంభాషణను ది15 నవంబరు 2015 తేది నాడు ఆంధ్రప్రదేశ్ ఈటివి ఛానల్ లో 11. 30 గంటలకు ప్రసారం చేశారు.  ఆ విశేషాలను మా విద్యార్థి బడిగె ఉమేశ్ కొంతవరకు లిఖితరూపంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. దాన్ని పాఠకుల సౌకర్యార్థం అందిస్తున్నాను. దార్ల )

ప్రజల భాషకు పట్టం కట్టినప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. ఈ దృష్టితోనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లోను తెలుగుకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. సరైన భాషా విధానాన్ని రూపకల్పన చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని ఆలోచిస్తోంది. కొత్త రాష్ర్టంలో మాతృభాషకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వాలో ఓ సాహిత్య వేత్త మాటల్లో విందాం.  


1.ఈటీవీ  
మీరు కవి, విమర్శకులు, ఎన్నో విలువైన పుస్తకాలు ప్రచురించారు. మీ సాహిత్య ప్రస్థానాన్ని  మా ప్రేక్షకులకు వివరిస్తారా?
దార్ల వెంకటేశ్వరరావు :  తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మారుమూల ఒక గ్రామం చేయ్యేరు అగ్రహారంలో నేను జన్మించాను. మా కుటుంబంలో తొలి తరం విద్యావంతుడిని నేను. అలా గురువుల ప్రోత్సాహంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం. ఏ, చదివి, ఇక్కడే ఎం. ఫిల్, చేసి, ఇక్కడే పిహెచ్.డి. చేసి, ఇక్కడే అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. నా జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను నేను కవిత్వంగా రాశాను. దాన్ని సాధారణీకరించి కవిత్వంగా రాశాను. మా జీవితానికి సంబంధించినటువంటి వస్తువునే కవిత్వ వస్తువుగా మార్చుకున్నాను. నా సాహిత్య వస్తువులో సమకాలీన సమాజం అనిపిస్తుంది. తర్వాత ‘వీచిక’ అనే విమర్శ ఒక విమర్శ గ్రంథాన్ని రాశాను. ‘బహుజన సాహిత్య దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’, ‘సాహితీ మూర్తులు స్ఫూర్తులు’ మొదలైన పదమూడు విమర్శ పుస్తకాలను రాశాను.
            ముఖ్యంగా ఆరుద్ర మీదా  పిహెచ్. డి. పరిశోధన చేశాను. యస్. టి జ్ఞానా నంద కవి గారి ‘‘ఆమ్రపాలి’’  మీదా పరిశోధన చేశాను. ఈ ‘‘ఆమ్రపాలి’’ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. అందుచేత నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడడానికి  గురువులు ఎంతో కారణం.
2. ఈటీవీ : మీరు దళిత కవిత్వంలోని సౌందర్యం గురించి పుస్తకం రాశారు. మరి దళిత కవిత్వం  భాష విషయంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏమిటి ?
దార్ల వెంకటేశ్వరరావు :  మన తెలుగు సాహిత్యాన్ని  పరిశీలించినట్లైతే, మనం ఒక ప్రధానమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి భాషని పాఠ్య గ్రంథాల్లో చూశాం. కవిత్వంలో చూశాం. పరిశోధనలో చూశాం. విమర్శలో చూశాం. అటువంటి భాషలో దళిత సాహిత్యం ఒక మౌలికమైనటువంటి మార్పుని తీసుకొచ్చింది. అది భాషాభివృద్ధికి తోడ్పడింది. దళిత కవులు మూడు తరాలుగా భాషని మనకు అభివృద్ధి పథంలో నడిపించారు. తొలితరం దళితులు పద్య కవిత్వాన్ని రాసి, దాన్లో విజ్ఞాపన పద్ధతిలో రాశారు. కాబట్టి అక్కడ పెద్దగా మార్పేమి కనిపించదు. రెండో తరం వచ్చేసరికి దళిత కవుల్లో ఒక ఆవేశం కట్టలు తెంచుకొని ప్రవహించింది. ఆ ఆవేశంలో వచ్చినటువంటి మార్పు ఆ దశలో మనం గుర్తించ గలుగుతాం. మూడో తరంలో దళిత కవిత్వం వ్యవస్థీకృతమైంది. నిజమైనటువంటి సౌందర్యం ప్రతీకల్తోటి, భావచిత్రాలతోటి తమ పలుకుబడులతో ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి భాషకి ఏమాత్రం తీసుకోకుండా కొత్త కొత్త పదజాలాన్నీ దళిత సాహిత్యంలో తీసుకొచ్చి భాషాభివృద్ధికి దళిత కవులు ఎంతగానో తోడ్పడ్డారు.


 3. ఈటీవీ :  మీరు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధిలో విశ్వవిద్యాలయాల పాత్ర నేడు ఎలా ఉందంటారు?
 దార్ల వెంకటేశ్వరరావు నేను హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత చూసినట్లైతే కనుక, ఇక్కడ పాఠ్య ప్రణాళికల్లో కొంత స్వేచ్ఛ ఉంటుంది- ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చినప్పుడు.  ఆ విధంగా ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో చాలా వరకు భాషాభివృద్ధికి కావాల్సినటువంటి కేవలం పద్య కవిత్వమే కాకుండా, వచన కవిత్వాన్ని, వచన రచనల్ని పాఠ్యాంశాల్లో పెట్టడం వలన మనం భాషాభివృద్ధికి దోహద పడే అంశాల్ని పాఠ్యాంశాలుగా చేరుస్తున్నాం. ఒకప్పుడు కేవలం పద్య కవిత్వంలో మాత్రమే, పద్యాన్నీ మాత్రమే ప్రధానంగా చేసి పాఠ్యాంశాలుండే ఈ క్రమాన్ని సార్వత్రిక విశ్వవిద్యాలయం పాఠ్య ప్రణాలికల్లో వచన రచనలతో పరిపుష్టం చేసింది. తర్వాత జానపద సాహిత్యాన్ని మిగతా విశ్వవిద్యాలయాలు పెట్టినప్పటికీ కూడా, మనకు వచన రచనల్ని పాఠ్యాంశాల్ని చేర్చడం ద్వారా భాషాభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయంలో మనం కాకతీయ విశ్వవిద్యాలయంలో, యోగి వేమన విశ్వవిద్యాలయం వారి పాఠ్యప్రణాలికలు చాలా బాగున్నాయి. వారు కథలకీ, నవలకీ, ప్రాంతీయ సాహిత్యానికీ చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ప్రాంతీయ సాహిత్యం నుండి జీవనాన్ని ఎప్పుడైతే చూశామో అప్పుడు భాషాభివృద్ధి చాలా విస్త్రృతంగా జరుగుతుంది. ఆ విధంగా విశ్వవిద్యాలయాల పాత్ర నిత్య నూతను కోణంలో పాఠ్యప్రణాలికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
4. ఈటీవీ మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం ఉండాలని భాషాశాస్త్రవేత్తలు మేధావులు చెప్తున్నారు. కానీ ప్రాథమిక స్థాయినుంచే ఆంగ్ల విద్యావిధానం విస్తరిస్తున్న నేటి రోజుల్లో తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలంటారు?
   దార్ల వెంకటేశ్వరరావు మనకున్నటువంటిది త్రిభాషాసూత్రం. ఈ త్రిభాషావిధానంలో మాతృభాష, దాంతో పాటు హిందీ, ఆంగ్లం అనేవి కొన్ని తరగతులు వచ్చిన తర్వాత మొదలవుతాయి. కానీ... ప్రస్తుత తరుణంలో ప్రాథమిక స్థాయినుండే ఆంగ్లాన్నీ బలవంతంగా మన మీద రుద్దుతున్నటువంటి విద్యావ్యవస్థ ఇప్పుడిప్పుడే బలంగా మన విద్యాలయాల్లో ప్రవేశిస్తుంది. ప్రతి పౌరుడూ  స్థానిక సమస్యలకంటే కూడా ప్రపంచ పౌరుడిగా మారాలని అని ఆలోచిస్తున్నట్టుగా బయటికి కనిపిస్తుంది. కానీ అది స్థానికమైనటువంటి అంశాల్ని, స్థానిక సంస్కృతిని, స్థానిక ప్రజల యొక్క సమస్యల్నీ అవగాహన చేసుకోకుండా  అది నిర్వీర్యం చేస్తుంది. అందుచేత  మనం చిన్ననాటి నుండే చిన్నచిన్న పద్యాలు,  చిన్న చిన్న శతకపద్యాలు, చిన్న చిన్న పొడుపు కథలు, సామెతలు, కథలు ఇటువంటివన్నీ కూడా పిల్లలకు నేర్పడం ద్వారా మనం భాషని కాపాడుకోవచ్చు. దాంతో  మాతృభాషను  ప్రాథమిక స్థాయిలో అక్కడ ఉన్నా, లేకపోయినా తెలుగు భాషను నేర్పవచ్చు; దాని ద్వారా తెలుగు సాహిత్యాన్నీ కాపాడుకోవచ్చు.  
    ఈటీవీ : యువతలో ‘ఆంగ్లాన్ని చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి’ అన్న భావన ఉంది. మరి తెలుగు భాషపై యువతలో అభిమానం కలిగించడానికి ఏమి చేయాలంటారు? 
   దార్ల వెంకటేశ్వరరావు: యువతీ యువకులకు భాష పట్ల అభిమానం పెరగాలంటే ఆర్ధిక ప్రయోజనాలు కూడా భాషతో ముడిపడి ఉండాలి. ‘మనం చదువుకున్నటువంటి భాషవలన మనకి ఉపాధి లభిస్తుంది’ అనే భరోసా యువతలో కలగాలి. అది కలిగించడానికి  ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఒక రాష్ర్టంలో  ప్రధానమైనటువంటి భాష తెలుగైనప్పుడు, ఆ రాష్ట్రంలో, ఆ జిల్లాలో, ఆ మండలాల్లో వివిధ విషయాల గురించి తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేని వ్యవస్థని మనం కలిగి ఉన్నప్పుడు, మనం తెలుగు చదువుకుంటే ఏమోస్తుందనే భయం సహజంగానే కలుగుతుంది. అందుకే ఈ భయాన్ని పోగొట్టాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. (ఎడిటింగ్ అయిన విషయాలు... సామాన్య ప్రజలకు కూడా జీవోలను, న్యాయస్థానాల్లో తీర్పులను, పోలీసు స్టేషనులో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్)లను తెలుగులోనే అందించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సచివాలయంలో తెలుగులోనే ప్రజల సమస్యల గురించి చర్చించాలి. వాటికి తెలుగులోనే ఉత్తర్వ్యులివ్వాలి. తెలుగు భాష పేరుతో కృత్రికమమైన అనువాదాల్ని ఇవ్వకుండా, ప్రజల భాషలో ఉత్తర్వులు వచ్చేలా చూడాలి. అన్యభాషా పదాలను తొలిదశలో అవసరమైనంత మేరకు స్వీకరించినా తప్పులేదు.) శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం తెలుగును బోధించే ఒక విషయాన్ని కంపల్సరీ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరిగాయో అప్పుడు విద్యార్థులు తెలుగు చదువుకోవడాకి ముందుకు వస్తారు.         
    ఈటీవీ  ప్రపంచీకరణ విస్తరిస్తున్న నేటి తరుణంలో స్థానిక భాషలు, సంస్కృతులు పరిరక్షణలో ప్రజలు, ప్రభుత్వాలు బాధ్యత ఎంతవరకు ఉందంటారు. ?
   దార్ల వెంకటేశ్వరరావు: తెలుగు భాష బ్రతకడం అనేది తెలుగు జీవన విధానం బతకడం. తెలుగు జీవన విధానం బ్రతకడం అంటే తెలుగు సంస్కృతిని మనం పరిరక్షించుకోవటం. ఒకప్పుడు కేవలం కొన్నివర్గాల వారి భాష నిఘంటువుల ఎక్కింది. ఇప్పుడు అన్ని వృత్తుల వారి భాష కూడా నిఘంటువులోనికి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అన్ని వృత్తులు యొక్క భాషా పదజాలాన్నీ మనం సేకరించామో అప్పుడు భాష సంపద్వంతమైతుంది. ‘మన తెలుగు భాష ఇంత గొప్పదా’ అనేది మనకు తెలుస్తుంది. తర్వాత వ్యవహారకోశాలను తయారు చేయాలి. ఇప్పుడు పలుకుబడులు, జాతీయాలు ఉన్నాయి. ఏ పలుకుబడులు ఏ సందర్భంలో వాడతారు. ఏ సందర్భంతో మన కావ్యాల్లో ప్రయోగించారు. ఏ సందర్భాల్లో కథల్లో ప్రయోగించారు. ఏ సందర్భంలో కవితల్లో ప్రయోగించారు.... నవలల్లో ప్రయోగించారు.. అనే  వాటికి సోదాహరణంగా మనం వ్యవహారకోశాల్ని తయారు చేయాలి. అప్పుడు స్థానిక భాష యొక్క సంస్కృతి ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచీకరణలో ఉన్న ఒక లక్షణం  ఏమిటంటే స్థానికంగా జరిగిన ఒక చిన్న విషయాన్ని  ప్రపంచానికి వెంటనే, వేగవంతంగా ప్రపంచానికి తెలిసిపోతుంది. ఉదాహరణకి మనకు కంప్యూటర్ వాడుకలోకి వచ్చింది. దానిలో తెలుగు భాషను వాడుకోగలుగుతున్నాం. అలాగే  అంతర్జాలం వాడుకలోకి వచ్చింది. సోషల్ మీడియాకి దాన్ని విస్తృతంగా ఉపయోగించుకోగలగాలి. వీటి ద్వారా  సెకెన్స్ లో, నిమిషాల్లో ప్రపంచానికి మనం మన భాషనీ, మన కళల్నీ మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. వీటి ద్వారా కూడా మనం భాషనీ, సంస్కృతినీ, మన జీవన విధానాన్ని అంతటినీ వేగవంతంగా మన తెలుగు భాషలోనే తెలియజేయవచ్చు. ఆ విధంగా స్థానికతను విశ్వజనీనత వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. అలా చేసినప్పుడు ప్రపంచీకరణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మన స్థానిక భాషలకేమీ నష్టం పెద్దగా వాటిల్లదు.