"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

(విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
(విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18 ఫిబ్రవరి, 2024

తొలి తెలుగు లిటరరీ కాంగ్రెస్ మహాసభల్లో ఆచార్య దార్ల ప్రసంగం (17.2.2024)

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో 






 తెలుగు న్యూస్ టైమ్స్ చెన్నై సౌజన్యంతో 


దిశ దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో 







తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

నవతెలంగాణ దినపత్రిక, 18.2.2024 సౌజన్యంతో 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తో డా . గిన్నారపు ఆదినారాయణ 
తెలుగు లిటరరీ కాంగ్రెస్ లో పాల్గొన్న రెండు రాష్ట్రాల తెలుగు శాఖ అధ్యక్షులు, అధ్యాపకులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
సమావేశంలో పాల్గొన్న తెలుగు శాఖ అధ్యక్షులతో ఆచార్య సి.కాశీం, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు 
తెలుగు లిటరరీ కాంగ్రెస్, తెలుగు శాఖ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 




తెలుగు భాష అమలు 
ఆచరణాత్మక విధానంతోనే‌ సాధ్యం 

తెలుగు భాష అభివృద్ధి, అది చదువుకునే వారికి ఉపాథి అవకాశాలు రావాలంటే ఆచరణాత్మక భాషా విధానం కావాలని, సమాజంలో వాస్తవాన్ని పాఠ్యాంశాల బోధనలన్నీ ఆచరణాత్మకంగా ప్రభుత్వాలు అమలు చేయాలని హెచ్ సి యు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు మహాసభ ( లిటరరీ కాంగ్రెస్) సభలలో తెలుగు శాఖల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని 'వర్తమాన తెలుగు భాషా సాహిత్యాల గమనం, గమ్యం' అనే అంశంపై మాట్లాడారు. ఈ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య చింతకింద కాశీం అధ్యక్షత వహించారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన విద్యా విధానం (2020) ప్రకారం మాతృభాషలకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం సంస్కృతాన్ని ఇంటర్మీడియట్ తో పాటు డిగ్రీలో కూడా కంపల్సరీ అవుతున్న స్థితి కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సిలబస్ రూపకల్పనలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించు కోవాలని, అలా చేయడా నికి విశ్వవిద్యాలయాల కేంద్రంగా స్వయం ప్రతిపత్తిని సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని ఆచార్య దార్ల సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రలను దృష్టిలో పెట్టుకొని 'తెలుగు డయాస్పోరా సాహిత్యం'అనే పాఠ్యాంశాన్ని హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ వారు రూపొందించి, అమలుచేస్తున్నారని ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో మాతృభాషల అమలుకోసం కొన్ని అధికారిక సంఘాలు ఉన్నప్పటికీ,వాటికి కొన్ని పరిమితుల నేపథ్యంలో తెలుగు కాంగ్రెస్ మహాసభలు జరగాలనీ, దాన్ని ప్రతి ఏడాదీ నిర్వహించుకోవడానికి ఒక కమిటీనిఏర్పాటు చేసుకోవాలని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సూచించారు. తెలుగుభాషపూర్తిస్థాయిలో అమలు కావడానికి, పరిశోధనలు జరగడానికి పారిభాషిక నిఘంటువులు, నిఘంటువులు, మిశ్రమ భాషా నిఘంటువులు రూపొందించుకున్నప్పుడే ఆలోచనకు ఆచరణతోడవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య గంపావెంకట రామయ్య, ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పఠాన్ కాశీమ్ ఖాన్, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఆచార్య రెడ్డి శ్యామల, తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పి.కనకయ్య, ఆచార్య లావణ్య, యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పార్వతి, శ్రీపద్మా వతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య సుభాషిణి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ఆచార్య ఎన్.రజని, పాలమూరు విశ్వ విద్యాలయం నుండి ఆచార్యసుధారాణి, ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంనుండి డా. గరికిపాటి గురజాడ తదితరులు పాల్గొన్నారు.

02 ఫిబ్రవరి, 2024

తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024 ( ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 15-17, 2024

 గౌరవనీయులైన

అధ్యక్షులు, తెలుగు శాఖ

స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.


తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం 15,16,17 ఫిబ్రవరి, 2024 తేదీల్లో TELUGU LITERARY CONGRESS (TLC) 2024ను నిర్వహించబోతుంది. రూమ్ నెం. 133, ఆర్ట్స్ కాలేజ్, హైదరాబాద్, తెలంగాణలో జరుగబోతున్న ఈ మహాసభలో మిమ్మల్ని విషయ నిపుణులు (Resource person)గా పాల్గొనవల్సిందిగా అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. మూడు రోజులపాటు జరిగే ఈ లిటరరీ కాంగ్రెస్ లో 17 ఫిబ్రవరి, 2024రోజు మధ్యాహ్నం 2:00 నుంచి 4:00వరకు "తెలుగు శాఖాధ్యక్షుల చర్చాగోష్ఠి"ని ఏర్పాటుచేస్తున్నాం. ఈ గోష్ఠిలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న తెలుగు శాఖాధ్యక్షులందరినీ ఒకే వేదికమీదకి పిలిపించి, "తెలుగు భాషా సాహిత్యాల గమనం, గమ్యం"అనే అంశంపై కీలకంగా చర్చించాలని భావిస్తున్నాం.

మీ భాగస్వామ్యం మాకు ఎంతో గౌరవం. మీ విలువైన ఆలోచనలు, అభిప్రాయాలు చర్చలను మరింత మెరుగుపరుస్తాయనీ, ఈ మహాసభ లక్ష్నాన్ని చేరుకోవడానికి దోహదపడతాయని మేం భావిస్తున్నాం.  

ధన్యవాదాలు.  

గమనిక: మెయిల్ కు ఆహ్వాన లెటర్ జతపరిచాం. మరిన్ని వివరాలకోసం మహాసభ ప్రోగ్రాం షీట్, బ్రోచర్ కూడా జతపరుస్తున్నాం. గమనించగలరు.

శుభాకాంక్షలతో

ప్రొఫెసర్ సి. కాశీం

కన్వీనర్

TELUGU LITERARY CONGRESS (TLC) 2024

అధ్యక్షులు, తెలుగు శాఖ

ఉస్మానియా యూనివర్సిటీ

హైదరాబాద్ 







15,16, 17 ఫిబ్రవరి, 2024 మూడు రోజులపాటు తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోన్న తెలుగు హిస్టరీ కాంగ్రెస్ 2014 పోస్టర్ ఆవిష్కరిస్తోన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు. ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ భూక్య తిరుపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




19 డిసెంబర్, 2023

డా.బద్దిపూడి జయరావు గారి డాక్టరేట్ గ్రంథం ప్రజాశక్తి దినపత్రికలో ఆచార్య దార్ల వ్యాసం (18.12.2023)

 డా.బద్దిపూడి జయరావు గారి డాక్టరేట్ గ్రంథం ప్రజాశక్తి దినపత్రికలో   ఆచార్య దార్ల వ్యాసం (18.12.2023)

 ప్రముఖ కవి, పరిశోధకుడు, ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్‌ బద్దిపూడి జయరావు దళిత సాహిత్యంపై పరిశోధన చేసి, ఆ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించినందుకు ఆయనకు ముందుగా నా అభినందనలు. ‘తెలుగులో దళిత సంఘటన కవిత్వం-అనుశీలన’ పేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి సాహిత్య పీఠంలో డాక్టర్‌ జి.ఎస్‌. భాస్కరరావు గారి పర్యవేక్షణలో ఈ పరిశోధనను పూర్తి చేశారు. ఈయన కవిత్వం హదయాన్ని కదిలిస్తుంది. అలాగే, ఈ పరిశోధన గ్రంథంలోని ప్రతి వాక్యం కూడా అంత శక్తివంతంగా కదిలించేలా ఉంది. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. అవన్నీ సాహిత్యాన్ని సష్టించలేకపోవచ్చు. కొన్ని సంఘటనలు మాత్రం ఎంతో సాహిత్యాన్ని సష్టిస్తాయి. ముఖ్యంగా దళితులపైన, పీడితులపైన, స్త్రీలపైన, దేశభక్తికి సంబంధించిన అంశాలపైన, మరికొన్ని ప్రకతి పరంగా జరిగిన హఠాత్పరిణామాలపైనా ఎంతో సాహిత్యం వచ్చింది. ఆ సంఘటనలపై ఎన్నో సిద్ధాంత గ్రంథాలు కూడా వచ్చాయి. కానీ, దళితులపై జరిగిన దాడులు, ఆ సంఘటనలనే నేపథ్యంగా చేసుకొని సిద్ధాంత గ్రంథాలు రాలేదు. కానీ, ఒక్కొక్క సంఘటన, ఆ సంఘటన ఆధారంగా వచ్చిన సాహిత్యంపై సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. కానీ, ఆ సంఘటనల క్రమ పరిణామాన్ని, ఆ పరిణామంలో కనిపించే సైద్ధాంతిక సమన్వయాన్ని తన సిద్ధాంత గ్రంథంలో పరిశోధకుడు చక్కగా విశ్లేషించారు.

డా. బద్దిపూడి జయరావు చేసిన ఈ పరిశోధన ద్వారా సమాజ స్వరూపం మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. సామాజిక అంతరాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని ఏండ్లుగా కొన్ని వర్గాలు, కొన్ని కులాలు- మరి కొన్ని వర్గాలు, మరికొన్ని కులాలను ఏవిధంగా పీడిస్తున్నాయో తెలుసుకోవటానికి, చరిత్రలోను, సాహిత్యంలోను అది ఎలా రికార్డు అయిందో తెలుసుకోవటానికి ఈ పరిశోధన చదవాలి. ఈ పరిశోధనంతా చదువుతుంటే ఇన్ని కష్టాలను, బాధలను ఓర్చుకుని దళితులు ఇన్నాళ్లుగా ఎలా జీవించగలుగుతున్నారో ఆశ్చర్యమేస్తుంది. కంచికచర్ల కోటేశు సజీవ దహనం తర్వాత జరిగిన అనేక సంఘటనలను, దానికి ముందు ఉన్న దళిత ఉద్యమ స్వరూప స్వభావాలను గుర్తించడానికి కూడా ఈ పరిశోధన గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిందే! ఈ విషయాన్ని వివరించే ముందు పరిశోధకుడు పాటించిన ఒక నవ్య పరిశోధనా పద్ధతి గురించి మనం చెప్పుకోవాలి. ఇది నాలుగు అంచెలుగా జరిగిందని సూత్రీకరించే అవకాశం ఉంది.

1. చరిత్రలో జరిగిన సంఘటన, అంటే ప్రజలకు తెలిసిన సంఘటనను తెలియజేస్తూ మొదటి దశలో దాన్ని పరిచయం చేస్తాడు పరిశోధకుడు.

2. రెండవ దశలో ఆ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలను అన్వేషిస్తాడు. ఆ అన్వేషణ కేవలం గ్రంథాల్లో దొరికేది, తీర్పుల్లో దొరికేది కూడా కాదు; ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి వాస్తవాన్ని అన్వేషించేది. ఆ అన్వేషణ ఆ సంఘటన జరిగిన వ్యక్తుల సజీవ అనుభవాలను రికార్డు చేసేది. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ అనుభవాలను రికార్డు చేసేది. పుస్తకాలు, పత్రికలు, డాక్యుమెంటరీలు, వీడియోల నుంచి; మనుషుల నుంచి, స్థలాల నుంచి, ప్రభుత్వం నుంచి, చట్టాల నుంచి, న్యాయస్థానాల నుంచీ సమాచారం సేకరించారు.3. అలా సేకరించిన సమాచారాన్ని మరలా తాను ఆ సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా చెప్పడం పరిశోధకుడిలోని గొప్ప సజనాత్మక నైపుణ్యానికి నిదర్శనం. ఇది మూడవ దశ.4. నాలుగవ దశలో శాస్త్రీయంగా దాన్ని సిద్ధాంతం చేయడం లేదా ఒక సిద్ధాంతానికి సమన్వయం చేయడం. అది కూడా పరిశోధకుని ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. సామాజిక బాధ్యతతో చేసిన పరిశోధనను మళ్లీ సమాజం వైపు తీసుకువెళ్లడానికి రూపొందించుకున్న ఒక ప్రత్యేక పరిశోధన విధానం ఈ సిద్ధాంత గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. ఈ ప్రత్యేక పరిశోధన విధానాన్ని గమనించని వారికి ఈ సిద్ధాంత గ్రంథం మళ్లీ ఒక కథ చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఏ పరిశోధన విధానాన్నీ పాటించకుండా చెప్తున్నట్లనిపిస్తుంది. సంఘటనల్ని ప్రధానంగా చేసుకొని ఈ పరిశోధకుడు తన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించాడు. భారతీయ సమాజాన్ని ప్రశ్నించిన అనేక సంఘటనల్లో ఈ దళితుల మీద జరిగిన దాడుల సంఘటనలను తన పరిశోధనకు తీసుకున్నారు. కొన్ని సంఘటనలు, దానిపై వచ్చిన కవిత్వం, దాని ఆధారంగా తన సైద్ధాంతిక విశ్లేషణ ఎలా కొనసాగిందో ప్రస్తావిస్తాను.

కంచికచర్ల కోటేశు సంఘటన (1969). మీద ఎంతో మంది కవిత్వం రాశారు. ఈ సందర్భంగా ఆ సంఘటనలన్నింటినీ కూడా పరిశోధకుడు ఒక క్రమపద్ధతిలో వివరిస్తాడు. అంతర్జాతీయంగా కలిగించిన ప్రభావాన్ని కూడా విశ్లేషిస్తాడు. ఒక దళితుడి ప్రేమను, ఒక దళితుడి నిస్సహాయతను, దళితేతర స్త్రీ దళితుణ్ణి ప్రేమించినా, కామించినా దాన్ని వాళ్ళు వక్రీకరించి దళితులపై సామూహిక దాడులెలా చేస్తారో ఆ సంఘటన తెలియజేసిందనే స్పహను కలిగిస్తాడు. దళితేతరులు తమ తప్పు బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో ఈ సంఘటన తెలియజేసిందని వ్యాఖ్యానిస్తాడు. కంచికచర్ల కోటేశు ప్రేమ ఒక అంటరాని ప్రేమగా అభివర్ణించిన కలేకూరి ప్రసాద్‌ కవిత తెలుగు సాహిత్యంలో దళితులు ప్రేమిస్తూ సజీవంగా దహనమైపోవడానికైనా ఎలా సిద్ధపడిపోతారో ఈ సంఘటన ద్వారా చాటి చెప్తుందని సిద్ధాంతీకరిస్తాడు. తన తప్పు లేకపోయినా నవ్వుతూ చితి మంట మీద కాలిపోయిన దళితుడి పవిత్రమైన ప్రేమకు కంచికచర్ల కోటేశు సంఘటన ఒక సజీవ ఉదాహరణ నిలిచిపోయిందంటాడు.

కారంచేడు సంఘటన (1985) : అంబేద్కర్‌ తెచ్చిన చైతన్యం దళితుడిని చదువుకోడానికి ప్రేరేపించింది. అంబేద్కర్‌ తెచ్చిన చట్టాలు బహుజనుల అందరిలోనూ ఒక చైతన్యాన్ని నింపాయి. ఒకవైపు తమ శ్రమతో భూమిని బంగారు పంటలు పండించడం, మరొకవైపు అంబేద్కర్‌ ఇచ్చిన చైతన్యంతో అవమానాల్ని పోగొట్టుకోవడానికి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చైతన్యం నేడు బహుజనుల అందరిలోనూ వస్తోంది. కానీ, ఆ చదువులకు తగిన ఫలితం పొందుతున్నారా? లేదా? అనేది మరో కోణం. తమకు శ్రమ చేసిన వాళ్లు, తమకు జీవాతాంతం ఊడిగం చేస్తూ బానిసలుగా బతికినవాళ్ళు, నేడు తలెత్తుకొని నిలబడటం, ఆత్మగౌరవంతో మాట్లాడడం ఆధిపత్య వర్గాలకు నచ్చలేదు. దాడి చేయడానికి ఎదురుచూశారు. దాని ఫలితమే కారంచేడులో దళితుల ఊచకోత సంఘటన. ఈ సంఘటన ద్వారా ప్రజా గాయకుడు గద్దర్‌ కేవలం వర్గ స్పహ మాత్రమే కాకుండా కుల చైతన్యం కూడా తోడై ‘దళిత పులులమ్మా… కారంచేడు భూస్వాములతో కలబడి, నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ’ అనే పాట ఆవిర్భావానికి కారణమైందని వ్యాఖ్యానిస్తారు.

నీరుకొండ సంఘటన (1987) : రాజకీయంగా తమ ఓటమి లేదా తమ వైఫల్యాలను సమీక్షించుకోలేని కొన్ని ఆధిపత్య కులాలు, వర్గాలు ఆ అసహనాన్ని కూడా దళితుల మీద చూపించి దాడులు చేసే ఒక వికృతమైన స్వభావానికి నిదర్శనంగా నిలుస్తుందీ ఈ సంఘటన. కొన్ని ఆధిపత్య కులాల వాళ్ళు తమ పదవి పోయినందుకే దళితులు సంతోషంతో కొబ్బరికాయలు కొట్టారని భావించి, నీరుకొండ దళితుల మీద దాడి చేయడం అనేది ఎంత వికతమైన చర్యో గమనిస్తే తెలుస్తుంది.

ఇలా ఒక్కొక్క సంఘటన దళితుల్లోని ఒక్కొక్క పార్శ్వాన్ని, ఒక్కొక్క పోరాట పటిమనీ బయటకు తీసుకురావడానికి కారణమయింది. అది ఈ సిద్ధాంత గ్రంథంలో ఉన్న ప్రధానమైన ప్రతిపాదన. దీన్ని ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా వివరించడం ఈ పరిశోధనలో కనిపించే శైలీ రమ్యత.

కొన్ని కులాలకు లేదా కొన్ని వర్గాలకు అధికారం వచ్చినంత మాత్రాన వారికి అన్నీ లభించినట్లు కాదు. అధికారం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి సామాజికంగా బలం కావాలి. అది సామాజిక చైతన్యంతో కూడిన ఆర్థికశక్తుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ చైతన్యం వల్ల తమ సంస్కతి గొప్పదనే భావన కలిగిన వాళ్ళు దాన్ని ఉన్నతమైనదానిగా కూడా ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం వల్ల సంస్కతిలో విలువల వ్యాఖ్యానం మొదలవుతుంది. అలాంటి విలువల వ్యాఖ్యానం చేసేటప్పుడు వీరి చరిత్ర ఆ విలువల వ్యాఖ్యానానికి ఆటంకంగా నిలుస్తుంది. వారి చరిత్ర, సంస్కతి ఇంత ఉన్నతమైంది కాకపోయినా అధమ స్థాయిలో ఉందని నిరూపించడానికి కూడా ఇలాంటి సంఘటనాత్మక కవిత్వం ద్వారా వచ్చిన సైద్ధాంతిక గ్రంథాలు ఎంతగానో తోడ్పడతాయి. అప్పుడు సాంస్కతిక విలువల పునర్వ్యాఖ్యానం మొదలవుతుంది. ఇవన్నీ ఊహించిన వాళ్ళు చరిత్రని నిషేధించాలన్నారు. చరిత్ర నిషేధించినా, జరిగిన ఆ సంఘటనల ఆధారంగా వచ్చిన సాహిత్యం ఏమైపోతుంది? ఆ సాహిత్యాన్ని సిద్ధాంతీకరించిన భావాలేమైపోతాయి? ప్రజల మెదళ్ళలో కొలువై కూర్చుంటాయి. అవన్నీ ప్రశ్నలై తలెత్తుకుని నిలబడేలా చేస్తాయి. కొన్ని సంఘర్షణలు ముందుకు వస్తాయి. కార్ల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలు, మహాత్మాజ్యోతీ బా ఫూలే, అంబేద్కర్‌ సిద్ధాంతాలు… ప్రజల్ని ఎలా ఆలోచనలో పడేసాయో, ఈ సిద్ధాంతాలు కూడా అలాంటి ఆలోచనలకు మరింత పదును పెడుతూ కుసంస్కతిని ప్రశ్నిస్తాయి. అలాంటి గురుతర బాధ్యతను ఈ సిద్ధాంత గ్రంథం కూడా నిర్వహించబోతోంది.

తనకు డాక్టరేట్‌ డిగ్రీ కావాలనుకుని మాత్రమే చేసిన పరిశోధన కాదిది. ఒక సామాజిక పరివర్తనను ఆశించిన పరిశోధన. తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్య ప్రత్యేకతను తెలిపిన పరిశోధన, దళిత ఉద్యమాన్నీ, దళిత సాహిత్య ఉద్యమాన్నీ ఒక సైద్ధాంతిక దక్పథంతో సమన్వయించిన పరిశోధన. ఇంత గొప్ప పరిశోధన చేసిన డా.బద్దిపూడి జయరావు గారిని సమాజంలో జరుగుతున్న వివిధ సామాజిక ఉద్యమాల్ని, వారి సమస్యల్ని అర్థం చేసుకోవాలను కొనేవారందర్నీ ఈ సిద్ధాంత గ్రంథాన్ని చదవాలని కోరుతున్నాను.

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధ్యక్షుడు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌




30 అక్టోబర్, 2023

ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పుస్తకాల ఆవిష్కరణ (30.10.2023)

 



















ఆచార్య ముదిగొండ రచనల ఆవిష్కరణ


ఆచార్య ముదిగొండ వీరభధ్రయ్యగారు తన జీవితంలో ఆచరించినట్లే తన రచనల్లో కూడా రాస్తారని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలిచాల కొండలరావు వ్యాఖ్యానించారు. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, శాఖాధ్యక్షులుగా పనిచేసి, తర్వాత శ్రీ సత్య సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (ఎస్.ఎస్.ఎస్.ఐ.హెచ్.ఎల్)లో గౌరవ ఆచార్యులుగా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలు 'కెమోమిల్లా' (కథానికల సంపుటి), మానససరోవరంలో స్వర్ణహంస (దీర్ఘ కవిత)లను ఆవిష్కరించి వెలిచాల కొండలరావు మాట్లాడారు. ఈ ఆవిష్కరణోత్సవంసోమవారం (30.10.2023) నాడు హైదరాబాద్, ఖైరతాబాద్ లో క్షేత్ర హోటల్ లో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన మాజీ ఐఎఎస్ అధికారి కె.సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఆచార్య ముదిగొండ వీరభద్ర గారికి నా అనుబంధాన్ని వివరిస్తూ ఆయన నిరంతర అధ్యయనశీలి అనీ, ఆయన రచనలు సాహిత్యానికి నూతన చైతన్యాన్ని తీసుకొస్తాయని, జాతిని జాగృతం చేస్తాయని పేర్కొన్నారు.  సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆచార్య ముదిగొండ వారు నిలువెత్తు ప్రేమకు ప్రతిరూపంగా వ్యాఖ్యానించారు. కవిత్వం రాయడానికి దాన్ని ఆస్వాదించడానికి అత్యంత ముఖ్యమైనది మనుషుల పట్ల ప్రేమ అని దాన్ని సిద్ధాంతికరిస్తూ 'మానస సరోవరంలో స్వర్ణ హంస' కావ్యాన్ని రాశారని ఆచార్య దార్ల పేర్కొన్నారు. కవిత్వం మానవునికి తన జీవన పరమార్ధాన్ని తెలియజేసేలా ఉండాలనీ, అప్పుడే నిజమైన కవిత్వమనీ వెలువడుతుందనీ వీరభద్రయ్యగారు తన కావ్యంలో వివరించారని ఆచార్య దార్ల సోదాహరణంగా పేర్కొన్నారు. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు గారిని సనాతన సంప్రదాయవాదిగా చాలామంది భావిస్తారని కానీ ఆయనలో గల ఆధునిక భావాలు తెలియాలంటే ఆయన కథానికలు చదివి తీరాలని దార్ల చెప్పారు. ఇంతమంది పెద్దవాళ్ళమధ్య తనను ఈ సభకు ముఖ్యఅతిథిగా పెట్టడం గురువుగారికి శిష్యుడిపట్ల ఉండే అనురాగానికి పతాకస్థాయిగా భావిస్తున్నాని తన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎం.ఏ నుండి రచనలు ప్రారంభించానని, ఆ రచనలు వ్యావహారిక భాషలో ఉంటే ఆనాటికి ఆ భాష అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆచార్య ముదిగొండ వీరభధ్రయ్య తన సాహితీ నేపథ్యాన్ని వివరించారు. తాను 64 పుస్తకాలు రాశారని అందులో తనకు అత్యంత ఇష్టమైన కావ్యం 'మానస సరోవరంలో స్వర్ణ హంస'అని పేర్కొన్నారు. 1968 లో రాసిన ఆ కథలలో ఆనాటి భావాలే నేటికీ ఉన్నాయని,  సంస్కరణకు ఒప్పుకొని మతం సామాజిక విధ్వంసాలకు, యుద్ధాలకు కారణమవుతాయని నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులే  నిరూపిస్తున్నాయని వివరించారు. తనకెంతో ఇష్టమైన ఈ రచనలను తనకు అత్యంత ఇష్టమైన గొప్ప సాహితీవేత్తలైన ఆచార్య కె యాదగిరి, దోమలపల్లి అమరేందర్  రావులకు అంకితమిస్తున్నానని వెల్లడించారు. పుస్తకాల అంకితోత్సవం, ఆవిష్కరణ ఎంతో నిరాడంబరంగా జరిగాయి. తన శిష్యులు, తన మిత్రుల మధ్య ముదిగొండ వారి పుస్తకాలను ఆవిష్కరించుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగించిన ఆత్మీయ సమ్మేళనంగా సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారిని శిష్యులు, మిత్రులు, సాహితీవేత్తలు  ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సమావేశంలో తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ఆచార్య వారిజారాణి, ప్రసిద్ధ సాహితీవేత్తలు, అధ్యాపకులు డా. వాణీకుమారి, డా.ధూర్జటి లక్ష్మి, డా. జె భారతి డా. చెన్నమనేని పద్మజ, డా.కృష్ణారావు, డా. పాండయ్య తదితరులు పాల్గొన్నారు.