1973
సెప్టెంబర్ 5 న ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో జన్మించాను.అమలాపురంలో ఇంటర్మీడియట్, డిగ్రీ ( బి.ఏ.స్పెషల్ తెలుగు) చదివాను.
ఎం.ఏ., ఎం.ఫిల్, పిహెచ్.డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, డాక్టరేట్ చేస్తుండగానే డిగ్రీ కళాశాలలో ఉద్యోగం వచ్చింది.మూడేండ్లు అక్కడ పనిచేసి సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాను.
ఆరుద్ర రచనలపై డాక్టరేట్ చేశాను.
సుమారు 16 పుస్తకాలు ప్రచురించాను.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో సుమారు 89 పత్రాలు సమర్పించాను.
పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారం ఇచ్చారు.
నా కవితలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కొన్ని అనువాదమయ్యాయి
వీచిక, బహిజన సాహిత్య దృక్పథం, సాహిత్య మూర్తులు-స్ఫూర్తులు, సాహితీ సౌగంధి, సృజనాత్మక రచనలు చేయడం ఎలా? మొదలైనవి పార్టీలు.
నెమలికన్నులు నాకవితా సంపుటి. ఇది ఇంగ్లీష్ లో కి అనువాదం అయ్యింది.
నా పర్యవేక్షణలో 19 మంది ఎం.ఫిల్, 10 మంది డాక్టరేట్ పట్టాలు తీసుకున్నారు.
బెంగుళూరు, బెనారస్ విశ్వవిద్యాలయాలు, మరికొన్ని అటానమస్ విద్యాసంస్థలకు తెలుగు శాఖ లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా ఉన్నాను.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత సాహిత్యం, తెలుగు డయాస్పోరా సాహిత్యం అనే కొత్త కోర్సులను ఎం.ఏ.స్థాయివారికి రూపొందించాను.
వివిధ విశ్వవిద్యాలయాల డాక్టరేట్ డిగ్రీలకు ఎడ్యుడికేటర్ గా ఉన్నాను.
ప్రస్తుతం హైదరాబాద్ తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి