"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

మాదిగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మాదిగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11 డిసెంబర్, 2020

రావినూతల ప్రేమ కిషోర్ రాసిన వ్యాసం (జానుడి సౌజన్యంతో)

 ఒక ఒంటరి నిశ్శబ్ద ప్రస్థానం

అతనెప్పుడూ అంతే –

ఒంటరి నిశ్శబ్దంలా అనిపిస్తాడు

తీరాజూస్తే మహా సమూహమై కనిపిస్తాడు

జాలరి వల విసిరినట్టు

జనం మీదికి పాత్రల్ని విసిరి

మన గుండెల్ని రంగస్థలం చేసి రవళిస్తాడు

నాటక నిర్మాణం తెలిసినవాడు

రంగస్థల రహస్యాల్ని ఎరిగినవాడు

నిద్రలోనూ… మెలకువలోనూ…

నాటకాన్నే జీవితంగా బ్రతికినవాడు

అందరూ పొద్దున్నే లోకాన్ని పలకరిస్తే

అతను మాత్రం

నిద్రలేచి నాటకాన్నే పలకరిస్తాడు

ఆయనే- భజరప్ప గారు.


నేను విన్న వార్త అబద్దం అని ఎవరైనా చెబితే బాగుండు. ఆయన ఎవ్వరికీ చెప్పకుండా ఏమంత తొందరొచ్చిందని ఇంత హడావుడిగా వెళ్ళిపోతారు? తన శిష్య బృందాన్ని ఇంతమందిని వదిలి ఆకస్మాత్తుగా అలా ఎలా వెళ్లాలనిపించింది? చాలా బాధగా ఉంది. చాలా శూన్యంగా వుంది. ఎందుకో పాడుదుఃఖం… గుండెలు దాటి బయటకు రాకుండా ఉంది. లోపలే వుండి మెలిపెడతా ఉంది.


నా తల్లిదండ్రులు జీవాన్ని, జీవితాన్ని ఇస్తే

భజరప్పగారు ఆ జీవితానికి అర్ధం, పరమార్ధం తెలిపిన వ్యక్తి. నన్ను తెలుగు నాటకరంగంలో రచయితగా నిలబెట్టిన మహనీయులు. ఎంతోమంది చేయి తిరిగిన రచయితల సరసన కూర్చోబెట్టిన మహానుభావుడు. నటులను తయారుచేయడమే కాదు. రైటర్స్ నీ తయారుచేయగలనని నిరూపించిన సాహసి భజరప్పగారు. ఒక్క స్ర్కిప్టు ని నాచేత ఎన్నిసార్లు రీ రైట్ చేయించేవారో…నాకు, ఆయనకే తెలుసు. ఎంతమంచి డైలాగ్ అయినా రన్ కి అడ్డొస్తుందని అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా కత్తెర వేసేవారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలిసేది. ఫైనల్ గా ప్రదర్శన అద్భుతంగా వచ్చినప్పుడు ఆ బాధనంత మర్చిపోయేవాడిని. రచయిత కి డైలాగుల మీద వ్యామోహం ఉండకూడదని చెప్పేవారు. నాటకం పట్ల అంతటి నిగ్రహం, సమగ్రహం ఆయనకు వుండేవి. అందుకే అంతగొప్ప దర్శకులు కాగలిగారు.


భజరప్పగారితో పరిచయం ఇప్పటిదా…!? కనీసం 27 సంవత్సరాల అనుబంధం. భజరప్పగారు దర్శకత్వం వహించింది ఒకటా… రెండా… కనీసం 24 నాటిక, నాటకాలు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్నవి ఎన్నో నాటకాలు… నాటికలు. నా రచనల్లో ఆయన చేతుల మీదుగా ముస్తాబై ప్రేక్షకులను అలరించిన ఆణిముత్యాలు ఎన్నో. జడ్జీలను మురిపించిన మెరుపు ముక్కలు ఎన్నెన్నో…

వాటిల్లో-

1) నిశ్శబ్దగాయం

2) టామి

3) శ్రమవద్గీత

4) అజమాయి’she’…

5) నిశి

6) శైథిల్యం

7) రెక్కల పుడమి

8) ఇంకుచుక్క

9) రేలపూలు నాటకాలు…


10) నీతిగీత దాటితే…!?

11) పాదు

12) గమ్యం

13) ముసురు

14) కొత్త చిగురు

15) వలయం

16) కాడి

17) మట్టివేళ్ళు

18) ట్రోఫీ

19) హననం

20) లైఫ్ లైన్

21) కాస్త సిగ్గుపడదాం

22) నిర్మాణం

23) మాతృక

24) కల్లందిబ్బ లాంటి నాటికలు ఎన్నెన్నో

రంగస్థలం మీద రవళించాయి.


నా నాటకాలకు దాదాపు 9 నంది అవార్డులు వచ్చాయంటే అది భజరప్పగారి నిరంతర కృషే కదా. పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలలో దాదాపు 30 అవార్డులు వచ్చాయంటే ఆ పుణ్యమూర్తి కఠోర నడవడికే కదా. ఏ రాజకీయాలకూ చలించకుండా దాదాపు 300 అవార్డులను నా నాటకాలు ఇతర పరిషత్తులలో కొల్లగొట్టాయంటే ఆ దయామూర్తి భిక్షే కదా.


నాటకాన్ని లాలించి ప్రేమించిన మనిషి…

నాటకాన్ని నడిపించి పరుగులు పెట్టించిన

మనిషి… శ్రీ భజరప్పగారు.


ఎంతోమంది నటులను తీర్చిదిద్దినవారు…

ఎంతోమంది నటులకు జీవితాన్ని ఇచ్చిన

వారు శ్రీ భజరప్పగారు. ఆయన ఆత్మమొత్తం నాటకమే అయినప్పుడు అవార్డులైనా… రివార్డులైనా…నాటకానికి కాక మరి దేనికొస్తాయి?


ఆయన నాటకాల్లో

జీవం ఉంటుంది… జీవితం ఉంటుంది.

కష్టం ఉంటుంది… కన్నీళ్ళు ఉంటాయి.

సమస్య ఉంటుంది.పరిష్కారం వుంటుంది.


అందుకనే ఆయన

నాటకంతో ఉద్యమించారు…

నాటకంతో పోరాడారు…

నాటకంతో యుద్ధం చేశారు… చివరకు

నాటకంతో అందరి హృదయాల్ని గెల్చుకున్నారు.


సమస్త జీవన సంవేదనల్ని తన నాటకంలో

లీనం చేసుకుంటూ అలా ముందుకు సాగి

పోయిన అద్భుత మూర్తి శ్రీ భజరప్ప గారు.


అన్ని ఋతువుల్ని చంకలో పెట్టుకుని,

ఎప్పుడూ వెలుగుతూ వుండే దివ్వెలాంటి

నాటక ప్రతిని చేతిలో పెట్టుకుని అలుపెరు

గక నిరంతరం సంచరించే వ్యక్తి ఆకస్మాత్తుగా ఇలా నిష్క్రమించడమా!?… ఎంత అన్యాయం!?


బహుశా ముందుగా వెళ్లిన తన మిత్రులందరూ ‘ఒరేయ్ బజ్జూ! తొందరగా వచ్చేయ్. ఇక్కడ బోర్ కొట్టి ఛస్తున్నాం. నువ్వొస్తే రన్ స్టార్ట్ చేద్దాం’ అని చెప్పుంటారు. అందుకనే అంత హడావుడిగా వెళ్ళుంటారు. భజరప్పసార్! మాకింత అన్యాయం చేస్తారనుకోలేదు. సారీ… మిమ్మల్ని క్షమించలేం…


(ఆకస్మాత్తుగా మనల్ని అందరినీ విడిచి వెళ్లిన శ్రీ భజరప్ప గారికి రంగస్థల నివాళులు అర్పిస్తూ రావినూతల ప్రేమకిషోర్ రాసిన వ్యాసం ‘జానుడి’ సౌజన్యంతో)…)

10 అక్టోబర్, 2019

రావినూతల ప్రేమకిషోర్ జీవితం-పరిచయం

 రావినూతల ప్రేమకిషోర్ తల్లిదండ్రులు - విద్యాభ్యాసం: 

ప్రముఖకవి, చిత్రకారుడు, కథారచయిత, నాటక రచయిత కీ.శే. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లా, కొండపిలో శ్రీమతి మరియమ్మ, శ్రీ అంకయ్యలకు 1 ఆగస్టు 1965 (1.8.1965) వ తేదీన  జన్మించారు. ఏడవ తరగతివరకు  కొండపిలోను, పదవతరగతి వరకు కందుకూరులోను తన  ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉలవపాడులో ఇంటర్మీడియెట్, ఒంగోలులో బి.ఏ. చదువు చదువుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. (చరిత్ర) పట్టాను పొందారు. ఈయన భార్య పేరు శ్రీమతి అపరంజి. ఈయనకు ఇద్దరు పిల్లలు ప్రేమ్ సాత్విక, ప్రేమ్ సదృశ్య. 

రావినూతల ప్రేమకిషోర్ ( జననం:1 ఆగస్టు 1965 , మరణం: 07 అక్టోబర్ 2019)

 

  వృత్తి-ప్రవృత్తి:

ఈయన హైదరాబాదు, విశాఖపట్టణం, నెల్లూరు ప్రాంతాలలో చిరకాలం పాటు విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ప్రవృత్తిగా కవిత్వం, నాటకాలు రాసేవారు. ఈయన రాసిన నాటకాలు సామాజిక స్పృహకలిగి, సమాజానికి గొప్ప సందేశాన్నిస్తాయి. 

నాటకాలు:

ఎయిడ్స్ బాధితుల కష్టాలను చూసి ‘నిశ్శబ్దగాయం’ సాంఘిక నాటకం రాశారు.  వీధి బాలల జీవితాలను చిత్రిస్తూ ‘టామి’ అనేనాటకాన్ని రాశారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని తెలియజేస్తూ ‘శ్రమవద్గీత’ నాటకం,  రైతు సమస్యలను చిత్రిస్తూ ‘కళ్ళం దిబ్బ’, రెక్కల పుడమి నాటకాలు,  ,పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నలిగిపోతున్న జనజీవన సంఘర్షణను ‘నిశి’ పేరుతోను, గమ్యలేని యువకులు తమ జీవితాల్ని ఎలా  నాశనం చేసుకుంటున్నారో ‘శైధిల్యం’ పేరుతోను, ఓటు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ‘ఇంకుచుక్క’ అనే పేర్లతో  నాటకాలుగా రాశారు. ఈ నాటకాలన్నీ సమకాలీన సమాజ సమస్యల్ని ప్రతిఫలిస్తూ, వాటి పరిష్కారాల్ని సూచించేవే. 

నాటికలు:

వీటితో పాటు దళిత మహిళ అగ్రవర్ణ మహిళల మధ్య కొనసాగే సంబంధాలెలా ఉంటాయో ‘వర్ణచిత్రం’, సాంఘికసంక్షేమ శాఖలో జరుగుతున్న అన్యాయాల్ని ‘నీతి గీతదాటితే...’’, పాఠశాలలకు వెళ్ళకుండా జీవితాల్ని నాశనం చేసుకుంటున్న బాల్యాన్ని ‘పాడు’ , ముసురు, పేర్లతోను, యువత జీవితాల్ని చిత్రిస్తూ ‘గమ్యం’, రైతుజీవితాల్ని చిత్రిస్తూ ‘కాడి’, ప్రత్యేక ఆర్థిక మండలి పేరుతో  భూమి కొంతమందికి కట్టబెడుతున్నారంటూ ‘మట్టివేళ్ళు’, స్త్రీల పై జరుగుతున్న హింసను వివరిస్తూ ‘ట్రోఫీ’, యువతులు, స్త్రీలపై జరుగుతున్న యాసిడ్ దాడుల్ని నిరసిస్తూ ‘హననం’, ‘కాస్త సిగ్గుపడదాం’,  తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం సందర్భంగా జరిగిన ఆత్మహత్యల నేపథ్యాన్ని వివరిస్తూ ‘అనలం’, సాఫ్ట్ వేర్ జీవితాల్లో వచ్చిన మార్పువల్ల, తొలి దశలో వాళ్ళ జీవితాల్లోని వివిధ కోణాల్ని విరిస్తూ ‘లైఫ్ లైన్’ మొదలైనా నాటికలు రాశారు. వీటితో పాటు నైతిక విలువల్ని పెంపొందించడమెలాగో వివరిస్తూ ‘నిర్మాణం’ అనే పేరుతో ఒక చక్కని నాటికను ప్రదర్శించారు. 

 కవిత్వం: 

నలుగురుమవుదాం‘ పేరుతో 2011లో  ఒక వచన కవితాసంపుటినీ, ‘ప్రతీక పేరుతో మరొక కవితా సంపుటిని ప్రచురించారు. దీనికి నేను (డా.దార్ల వెంకటేశ్వరరావు) రాసిన ముందుమాట ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చిందని ఆయన పదేపదే చెప్తుండేవారు. హైకూలకు కూడా ముందుమాట రాయమని స్క్రిప్టుని పంపించారు.   ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని ఆశిస్తూ ‘ గుండెదరువు’  పేరుతో 2005లో ఒక  వచన దీర్ఘ కావ్యాన్ని ప్రచురించారు.  వీటితో పాటు హైకూలపేరుతో  మినీ కవిత్వాన్ని విస్తృతంగా రాశారు. ఈయన కవిత్వం హృదయాన్ని తాకుతుంది. మృదువుగా తాకుతూ, సంఘర్షణ రేపుతుంది. మానవత్వాన్నిమేల్కొలుపుతుంది. రచనాశైలి మృధుమధురంగా సాగుతుంది.  ఆయన రాసిన కొన్ని ‘హైకూలు’ చూద్దాం.

అమ్మ కళ్ళకేసి చూసా
బొట్ల బోట్లగా
సముద్రం

తల్లి ఒడిలో
చంద్రబింబం
పసిపాప పరిమళం

నిద్రలో
పిల్లాడి కలవరింత
నా పక్కలో వాళ్ళమ్మ లేదు

నాకు ఇష్టమైన
మా అమ్మ ఫోటో ...
మా వాడికి నచ్చలేదు

అమ్మ
కంటినీటి ప్రవాహంలో
నేనో పడవనౌతున్నా

ఆశ  గొప్పది
జీవితాన్ని
చిగురింప జేస్తుంది

నా డైరీకి ప్రే మెక్కువ
నన్ను భద్రంగా
గుండెల్ని దాచుకుంటుంది

చున్నీ కప్పాల్సింది   గుండెల్ని కదా!
ముఖానికి  చుట్టుకుని ....
ఇదేంటి వికృత పరువం !?

ఈ రోజుని
అందంగా పూయించడం
కొత్తగా చూపించడం నీ బాధ్యతే

 వర్షపు చినుకు
ఆకుని తాకింది
ముక్క పులకించింది

ఆకులు
రాత్రిని తింటున్నాయి
చెట్టు కాపలా కాస్తోంది

ముసలి చెట్టు
ఆకుల్ని రాలుస్తోంది
ఎండాకాలాన్ని తిట్టుకుంటూ

కథలు

ప్రేమకిషోర్ కవిత్వం మాత్రమే కాదు, కథలు కూడా రాశారు. ఈయన రాసిన‘వర్ణచిత్రం’ అనే దళిత కథ బహుజన కెరటాలు మాసపత్రికలో ప్రచురితమైంది. 

నవల: 

నావలోని నేను పేరుతో ఒక నవలను కూడా రాశారు. 

బహుమతులు

ఈయన రాసిన నాటకాలు అనేకం ప్రదర్శితమయ్యాయి. అనేక నాటకాలు, నాటికలకు బహుమతులు వచ్చాయి. ఆయన మంచి స్క్రిప్టు రైటర్. ఆయన నాటకాలను హైదరాబాద్ లో ప్రదర్శించినప్పుడు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. అలా నేను ఒకటి రెండు నాటకాలను ప్రత్యక్షంగా చూశాను. ఆ నాటకాలు ఆధ్యంతం ఆసక్తిగా కొనసాగడమేకాకుండా, ఆలోచింపజేసేవి. నాటకాలు, నాటికలు ప్రదర్శించిన తర్వాత రావినూతల ప్రేమకిషోర్ చుట్టూ జనం మూగి, ఆటో గ్రాఫ్ , ఫోటోలు తీసుకోవడం, నాటకప్రదర్శన అయిన తర్వాత ప్రేక్షకులంతా ధియేటర్ లోనిలబడి గౌవరంగా తప్పట్లతో ప్రశంసించడం నేను చూశాను. కేవలం రాయడమేకాదు, అనేక పాత్రల్లో ఆయన నటించి, ఉత్తమ నటుడుగా బహుమతులు పొందారు. 

నిశ్శబ్దగాయం’ నాటకానికి నంది నాటకోత్సవాల్లో  ఉత్తమ బాల నటుడు బహుమతి (2002)లో వచ్చింది. 2003లో జరిగిన పరుచూరి రఘుబాబు సృత్యర్థం జరిగిన నాటకోత్సవాల్లో ప్రేమకిషోర్ ఈ నాటకానికే ( నిశ్శబ్దగాయం) కే అనేక బహుమతులు వచ్చాయి. ఉత్తమ నిర్మాత, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ స్క్రిప్టు రైటర్, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ స్త్రీ నటన లతో పాటు జ్యూరీ ప్రత్యేక బహుమతిని కూడా అందుకున్నారు. కాకినాడలో  2003లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ నాటకంలో నటించిన వారికి ఉత్తమ ప్రతినాయకుడు పాత్రకు బహుమతి వచ్చింది. 

ఇలా సమకాలీన సమస్యల్ని తన రచనల్లో ప్రతిఫలించిన రావినూతల ప్రేమకిషోర్ ఆనారోగ్యంతో 07 అక్టోబర్ 2019 ( 7.10.2019)లో మరణించారు. 





22 నవంబర్, 2016

ధర్మయుద్ధం మహాసభ (27 నవంబర్ 2016) వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ధర్మయుద్ధం మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
గచ్చిబౌలి : నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 27న జరగనున్న ధర్మ యుద్ధం మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం సా యంత్రం హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వర్సిటీ దళిత్ సూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ వాల్పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, దళిత్సూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ సూడెంట్స్ యూని యన్ ప్రధాన కార్యదర్శి సుమన్ పలువురు విద్యార్డులు పాల్గొన్నారు.


ధర్మయుద్ధం' పోస్టర్ ఆవిష్కరణ G 620
చ్చిబౌలి: ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన ధర్మయుద్ధం మహాసహభకు సంబంధించిన పోస్టర్ ను సోమవారం రాత్రి గచ్చిబౌలి లోని హెచ్.సి.యూ వద్ద విడుదల చేశారు. హెచ్.సి.యూ దళిత్ సూడెంట్స్ యూనియన్(డీఎస్.యు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ ముఖ్యఅతిధిగా విచ్చేసి పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభను విజయవంతం చేసేందుకు అందరు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. హెచ్.సీ.యూ తెలుగు విభాగం ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు, డీఎస్ యు అధ్యక్షులు ఈశ్వర్, సూడెంట్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి సుమన్ దామెర, నాయకులు పద్మా రావు, వేణు, రమేష్ తదితరులున్నారు.











ధర్మయుద్ధమహాసభలో దార్ల 

ధర్మయుద్ధమహాసభలో దార్ల 




06 మార్చి, 2015

‘దండోరా(ఎం.ఆర్.పి.ఎస్) ప్రారంభించిన సామాజిక ఉద్యమాలు’ జాతీయ సదస్సు వివరాలు (కొన్ని)

ఫిబ్రవరి, 2015న ఉస్మానియా యూనివర్సిటి గ్రంథాలయం దగ్గర ఐ.సి.ఎస్.ఆర్ మినీ కాన్ఫరెన్సు హాలులో ఉదయం 9గంటలనుండి రాత్రి పదిగంటల వరకు డా. జి.చంద్రయ్య కోర్టినేటర్ గా వ్యవహరించి నిర్వహించిన ‘దండోరా(ఎం.ఆర్.పి.ఎస్) ప్రారంభించిన సామాజిక ఉద్యమాలు’ అనే జాతీయ సదస్సు బాగా జరిగింది. పిలిచిన వస్తానని చెప్పిన కొంతమంది వక్తలు రాలేకపోయినా వచ్చినవారు చాలా శ్రద్ధగా తమ పత్రాలను సమర్పించారు. పెద్దసంఖ్యలోనే విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యమకారులు, మేధావులు, అధ్యాపకులు హాజరైయ్యారు. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక పత్రాన్ని సమర్పించాను.

సదస్సు కో ఆర్డినేటర్ డా. చంద్రయ్య సదస్సు లక్ష్యాలను వివరించారు.

సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్ధులు, పరిశోధకులు

సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్ధులు, పరిశోధకులు
సంపంగి శంకర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో వికలాంగుల ఉద్యమం- ఎమ్మార్పీఎస్ పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సు

సదస్సులో మాట్లాడుతున్న గోపాల్ 


చిన్నపిల్లల గుండె ఆఫరేషన్ల ఉద్యమం:దండోరా ఉద్యమస్ఫూర్తి అనే అంశంపై మాట్లాడుతున్న  లగాన్ (రిసెర్చ్ అసిస్టెంట్)
సభాధ్యక్షుడు వేముల ఎల్లయ్య ప్రసంగం

వక్తలను పరిచయం చేస్తున్న డా. చంద్రయ్య

ఇరవయ్యేళ్ల దండోరా ఉద్యమం-దశ, దిశ అనే అంశంపై జరిగిన సమావేశంలో వేదికపై . డాక్టర్ పంతుకాల శ్రీనివాస్, 
  చింతాడ గౌరివరప్రసాద్, డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, వేముల ఎల్లయ్య, చిట్టిబాబు పడవల,డాక్టర్. సి.కాశీం,కొంగర మహేష్ తదితరులు

ఇరవయ్యేళ్ల దండోరా ఉద్యమం-దశ, దిశ అనే అంశంపై జరిగిన సమావేశంలో వేదికపై .  చింతాడ గౌరివరప్రసాద్, డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, చిట్టిబాబు పడవల,డాక్టర్. సి.కాశీం,కొంగర మహేష్ తదితరులు

 సభలో జనం
సభలో జనం



ఇరవయ్యేళ్ల దండోరా ఉద్యమం-దశ, దిశ అనే అంశంపై జరిగిన సమావేశంలో వేదికపై .  చింతాడ గౌరివరప్రసాద్, డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, వేముల ఎల్లయ్య, చిట్టిబాబు పడవల,డాక్టర్. సి.కాశీం,కొంగర మహేష్ తదితరులు

 

 వృద్ధులు, వితంతువుల పోరాటం-ఎమ్మార్పీఎస్  పాత్ర’ అనే అంశంపై జరిగిన సమావేశంలో తిరుపతిరెడ్డి తదితరులు



 మాట్లాడుతున్న గుడిపల్లి అనిత, వేదికపై సభాధ్యక్షురాలు డా. సూరేపల్లి సుజాత, మరో వక్త డా. మల్లికార్జున్ 

వేదికపై మందకృష్ణమాదిగ, డా.సూరేపల్లి, డా. చంద్రయ్య, శ్రీ వేమలు ఎల్లయ్య, మాట్లాడుతున్న డా.కాశీం

(ఫోటోలు తీసిన వారు ఎం. చంద్రమౌళి, రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు వారి సౌజన్యంతో)

13 జనవరి, 2015

‘‘దళితసాహిత్య మాదిగ దృక్పథం’’ పుస్తకానికి డా. జె.భీమయ్య గారి ముందుమాట ‘‘మాదిగ చైతన్యం’’


మాదిగ చైతన్యం

            సాధారణంగా రచయితలు తాము ప్రచురించే పుస్తకాల్లో ముందుమాటలను ఆయా రంగాలలో ముఖ్యంగా సాహితీ రంగంలో అనుభవం, కీర్తి ప్రతిష్టలు మరియు నిష్ణాతులైన వ్యక్తుల చేత రాయించుకోవటం పరిపాటి. ఇది ఒక బలమైన సాంప్రదాయంగా సాహితీ జగత్తులో కొనసాగుతున్నది. ప్రసిద్ధ భారతీయ ఆంగ్ల నవలా రచయిత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ రచించిన మొట్టమొదటి నవల "అంట్‌చబుల్‌' (1935)కి ఇ.యం.ఫోర్‌స్టర్‌ ముందుమాట రాయటంతో ఇంగ్లాడులోని "పెంగ్విన్‌ పబ్లికేషన్స్‌' ప్రచురించింది. అంతకు ముందు ఆ నవలను ప్రచురించటానికి ప్రచురణ కర్తలు నిరాకరించారు. ఆనాటి ప్రచురణ కర్తల స్వభావాన్ని ఆర్థిక పరిభాషలో గుత్తాధి పత్యంగాను, సామాజిక రీతిలో బ్రాహ్మణత్వంగా పోల్చవచ్చు. డబ్బే ప్రధానాంశంగా మారిన ఈ రోజుల్లో అటువంటి పరిస్థితికి తెరపడింది.
            నా దృష్టిలో పుస్తకానికి ముందుమాట అనేది ఒక టార్చ్‌లాంటిది. వార్తా పత్రికల్లోని సంపాదకీయం లాంటిది. శరీరంలోని అన్ని అవయవాలతో అనుసంధానంగా విధి నిర్వహించే గుండెకాయలాంటిది. పుస్తకంలో జాలువారిన రచయిత మనోభావాలను ప్రతిబింబిస్తూ ముందుమాట రాయటం అంత సులువైన పనేమీకాదు. విప్లవ రచయితలు సైతం విప్లవోద్యమాలతో సంబంధమున్న వ్యక్తుల చేతనే ముందుమాటలు రాయించటం జరుగుతుందే. ఒక పుస్తకంపై రకరకాల అభిప్రాయాలు  వెలువడవచ్చు. ముందుమాటలోని అభిప్రాయాలే సర్వస్వం కాజాలవు. అలాంటపుడు ఫలానా వ్యక్తే తన పుస్తకానికి ముందుమాట రాయాలని రచయిత పట్టుబట్టటం మొండితనమే అవుతుంది. రచయిత అభిప్రాయాలు ఎలా ప్రతిబింబించినా, పాఠకుడే అంతిమ న్యాయ నిర్ణేత.
            పుస్తకానికి ముందుమాట రాసే వ్యక్తి అనుభవ్యజ్ఞుడై, విషమ నిష్ణాతుడై ఉండాలని లేదా కనీసం వయస్సులోనైన తనకంటే కొంత పెద్దవాడై ఉండాలని ఒక నిబంధనగా రచయితలు ఏర్పరచుకున్న "సాంప్రదాయాన్ని' "బ్రేక్‌' చేస్తూ ఏ అనుభవం లేని, విషయ నిపుణత ఆశించినంతగా లేని నాతో తన పుస్తకానికి "ముందుమాట' రాయించిన డా.      దార్ల వెంకటేశ్వర రావు అభినందనీయుడు.
            మనిషిని మనిషిగా గుర్తించని సమాజం ఇంకా బతికే ఉందనటం అతిశయోక్తి కాదు. వర్ణ ధర్మంపై మొలిచిన "కులం' మొక్క ఏపుగా పెరిగి మర్రి ఊడల్లా సమాజమంతటా ప్రాకింది. కృత్రిమ సంస్కృతిలో రూపుదిద్దుకున్న నగరవాసి యొక్క యాంత్రిక జీవితం సామాజిక కులజాడ్య సమస్యను అంతగా పట్టించుకోదు. గ్రామ పెత్తందార్ల అదు పాజ్ఞల్లో ఉంటూ, కుల వివక్షకు గురవుతూ ఆర్థిక దుస్థితికి లోనైన సామాన్య దళిత జీవి వ్యధ వర్ణనాతీతం.
            ఇలాంటి బడుగు జీవుల దుస్థితి సాహీతీకరించబడినా తమ జీవితానుభవాలను అక్షరాలలో చూసుకోలేని అభాగ్యులు ఎందరో ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. సంస్కరణ వాదంతో మొదలైన దళిత జీవిత చిత్రీకరణ అభ్యుదయ రచనగా ఎదుగుతూ తిరుగుబాటు సాహిత్యంగా రూపుదిద్దుకుంది. నేడు దళిత వాదానికి ఎవరి సానుభూతి అక్కరలేదు. తమదైన శైలిలో గుర్తింపుకు, సమాన హక్కులకై నిరంతర పోరాటం చేస్తున్న దళితులు ఒక సామాజిక శక్తిగా ఎదుగుతున్నారు.
            కులమతాలు మనం ఏర్పరచుకున్న అడ్డుగోడలని నిజమైన ప్రేమకు ఇవేవి అడ్డం రావని "ప్రేమ' కంటే బలమైన శక్తి ఏదీ లేదని తెలియజెప్పే అరుంధతీదేవి వసిష్ఠుల ఆదర్శ వివాహం కులాంతరాలు పెంచుతున్న సవర్ణ హిందువులకు కనువిప్పు అవుతుంది. బోయి భీమన్న గారి "రాగా వాసిష్ఠం' నాటకాన్ని ఈ సందర్భంగా దార్ల తన పుస్తకం ప్రారంభంలోనే ప్రస్తావించటం దళిత సాహితీ చరిత్ర క్రమాన్ని పాటించడమే అవుతుంది.
            మాదిగ దండోరా ఉద్యమం, దాని దృక్పథం, ఆశయాలు దార్ల పుస్తకం నిండా పరుచుకొని ఉన్నాయి. అంబేద్కర్‌ ఆశించిన సామాజిక న్యాయం, సమానత్వం ప్రతిఫలించే దిశగా దండోరా ఉద్యమం కొనసాగుతున్న వైనాన్ని దార్ల తన పుస్తకంలో ప్రస్తావించటం మాదిగ చైతన్యాన్ని దాని పోరాట పఠిమను తెలియ జెప్పే బాధ్యతను నిర్వహించటమే అవుతుంది. మాదిగ చైతన్యం రివ్వున ఎగసిపడే విధంగా ఉద్యమ కాంతులు మన రాష్ట్ర నలు మూలల ప్రసరించాయి. సామాజిక న్యాయంలో భాగంగానే రిజర్వేషన్‌ ఫలాలు ప్రజాస్వామ్య బద్దంగా పంపీణి జరగాలనే
డిమాండ్‌తో దండోరా ఉద్యమం ముందుకెళ్ళుతుంది.   

            దళితుల సమస్య పరిష్కారానికి దళితేతర ప్రజాతంత్ర శక్తుల తోడ్పాటు ఎంతైన అవసరమేనని గుర్తించాల్సి ఉంది. అలా కానప్పుడు దళిత ఉద్యమాలు పరిమితుల్లోనే ఉండిపోతాయి. మాదిగ దండోర ఉద్యమాన్ని పరిమిత అర్థం నుండి విసృత అర్థంలోకి తెచ్చే క్రమంలో దాని స్వరూప స్వభావాన్ని మార్చే ప్రక్రియ ఎంతైనా అవసరమనే భావన చాలామందికి ఉంది. రిజర్వేషన్‌ వర్గీకరణ నేపథ్యంగానే ఈ ఉద్యమం పుట్టిందనే అపవాదు. నిజానికి వర్గీకరణ సమస్య దళిత సమస్యల్లో ప్రధానాంశమే. దళితుల సమస్య పరిష్కారానికి, సమైఖ్యతకు దోహదపడే విధంగా వర్గీకరణ సమస్యను పరిష్కరించాలి. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా దళిత సమైఖ్యతను కోరటం గురువింద చందమే అవుతుంది. దళితుల్లో 62 ఉపకులాలు ఉన్నాయన్న నిజం దండోరా ఉద్యమం మూలంగానే బైటికి వచ్చింది. ఇన్ని ఉపకులాలు అట్టడుగున పడి ఉన్నాయి కాబట్టే, ఇది మాల మాదిగల సమస్యగానే ఉపరితలంపై కనిపిస్తున్నది. మాదిగ చైతన్యాన్ని మాదిగ ఉపకులాల ప్రాతినిథ్య చైతన్యంగానే అర్థం చేసుకోవాలి. జస్టిస్‌ రామచంద్ర రాజు కమీషన్‌తో ప్రారంభమైన దండోర సమస్య అధ్యయన ప్రస్థానం ఎన్నో ఒడిదొడుకులను అధిగమిస్తూ ఉషా మెహ్ర కమీషన్‌ దాక కొనసాగింది. పార్లమెంటులో ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకవస్తే గాని దండోరాకు విముక్తి కలుగదేమో!
            అంబేద్కర్‌ చేసిన సామాజిక కృషిని స్పృశించకుండా, దళిత సాహిత్యాన్ని చర్చించలేం. కుల రహిత సమాజ ఆవిర్భావానికై అంబేద్కర్‌ చేసిన సామాజిక పోరాటం ఒక చారిత్రాత్మక ఘట్టం. కులమత విశ్వాశాలను ప్రేరేపించే హిందూ ధర్మశాస్త్రాలను  నిర్వందంగా వ్యతిరేకించాడు. కులాంతర వివాహాలు జరుగుతున్నప్పటికి కులం పోవటం లేదు. కులం పునాదులపై నిర్మింపబడిన హిందూ మతం వర్దిల్లినంత కాలం కులం నిర్మూలన జరుగదనేది అంబేద్కర్‌ అభిప్రాయం. ఆయన హిందువుగా జన్మించినా, తాను హిందువుగానే చనిపోరాదన్న ఆలోచన బౌద్ధ మత స్వీకరణకు గట్టి పునాది వేసింది. మానవత్వం, సమానత్వ భావన, ప్రేమ లాంటి సుగుణాలు హిందూ మతంలో కొరవడిన కారణంగ?ానే దళితులకు ఆ మతంలో విముక్తి లేదని తేల్చిచెప్పాడు అంబేద్కర్‌. తన తండ్రి బ్రిటీషు సైన్యంలో పనిచేయటం, తాను ఆర్థికంగా కొంత నిలదొక్కుకొని ఉన్నందు వల్ల విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించటానికి అవకాశమేర్పడింది. తన స్థాయిలోనూ తనకు కులపరంగా అవమానం కలగటం తన జాతి మొత్తాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడింది. విదేశాల్లో తాను నేర్చుకున్న విద్యను తన జాతి విముక్తికై దారపోశాడు. సామాజిక పోరాటాలు నిరంతరంగా నిర్వహించాడు. ఇది అంబేద్కర్‌ గొప్పతనం.  
            నాటి నుండి నేటి వరకూ హీనంగానే చూడబడుతున్న దళితులకు రిజర్వేషన్‌ అనే రాజ్యాంగ ఉపశమనం అంబేద్కర్‌ సాధించి పెట్టక పోయినట్లయితే అంబేద్కర్‌ను శత్రువుగా పరిగణించే అగ్ర వర్ణాల ఇళ్ళల్లో, పోలాల్లో దళితులు ముఖ్యంగా మాదిగలు పని మనుషులుగా, పాలేర్లుగా ఉండేవారు. అంటే అందరికీ ఈ రిజర్వేషన్‌ వల్ల విముక్తి లభించిందని కాదు. పని మనుషులుగా, పాలేరులుగా ఉండటం లేదని కాదు. కొంతమంది దళితులైనా పైకొచ్చారనే వాస్తవాన్ని కాదనలేం. కానీ, అధిక సంఖ్యాకులైన దళిత పేదలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు చేరటం లేదనేదే బాధ. ఇలాంటి పరిస్థితిల్లో రిజర్వేషన్‌ ఫలాలను ప్రజాస్వామ్య బద్దంగా అనుభవించాలనే డిమాండ్‌ సరియైనదే. రాజ్యాంగ ప్రయోజనాలను జనాభా నిష్పత్తిపై దళిత ఉపకులాల మధ్య పంపిణీ చేయమని అడగటం దళితులను విడగొట్టటమేననే అపోహకు దారితీసింది. రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించిన వారే మళ్ళీ మళ్ళీ అనుభవించటం ద్వారా "క్రిమిలేయర్‌' పుట్టుకొచ్చింది. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌ క్రిమిలేయర్‌ వర్గానిదే. ఈ డిమాండ్‌ సరైందా? కాదా? అని తేల్చేముందు ప్రభుత్వ సంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్‌ ప్రయోజనాలు ప్రజాస్వామ్య బద్దంగా పంపిణీ అవుతున్నాయా? లేదా? అనేది ముందు చూడాలి. అగ్ర వర్ణాల ఇండ్ల ముందు పని మనుషులుగాను, వారి పోలాల్లో పాలేరులు గాను కొనసాగే పరిస్థితి నుండి "రిజర్వేషన్‌ తంతు' కొంత మేరకు ఒక పార్శ్వంలో దళితులను కాపాడినా, మరో పార్శ్వంలో అది ఒక దళితుని ఇంట్లో సాటి దళితుడు పనిమనిషిగా ఉంటున్న వైనాన్ని కల్గించింది. ఒక దళిత ఉన్నతుని ఇంటి గేటు బైట చేతులు కట్టుకొని నిలుచుండే దళిత పేదలు ఉన్నారంటే ఆశ్చర్యం కలగదు. ఇలాంటి ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు దళితుల మధ్యే ఉన్నాయంటే వింతగా తోచదు. అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటు ఉంటూ, అగ్ర వర్ణ భూస్వాముల ఇళ్ళల్లో పెంచుతున్న కుక్కలను తమ ఇళ్ళల్లో పెంచే సంస్కృతి కల్గి ఉంటూనే, దళితులం కాబట్టే వివక్షకు గురవుతున్నాం, అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టే దళిత బ్రాహ్మణులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. వీరికే దళిత సమైఖ్య వాదమనే పాట అవసరం. ఈ భావాల్ని ఈ పుస్తకంలో దార్ల సమన్వయించిన తీరు ప్రశంసనీయం.
            ప్రజాసాహితీ, జన సాహితీ లాంటి విప్లవ సాహితీ పత్రికల, సంస్థల దృక్పథాన్ని కూడా దార్ల ఈ పుస్తకంలో విశ్లేషించటం సందర్భోచితమే. సంస్కరణోద్యమాలు ఉపరితల మార్పునే తెస్తాయి కానీ, మౌలికమైన మార్పుని సాధించలేవు. దోపిడి సమాజంలో సమస్త పీడిత ప్రజల విముక్తి వర్గ పోరాటం పైనే ఆధార పడి ఉంటుందన్న "ప్రజా పత్రిక'ల వాదన సరైనదే. వర్గ పోరాటాన్ని కులం అడ్డుకుంటున్నదన్న వాదాన్ని కూడా కొట్టి పారేయలేం. కులాధిపత్యం కారణంగానే విప్లవ పార్టీలలో సైతం నాయకత్వం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండి పోయిందన్న విమర్శను కూడా వాస్తవిక దృష్టితో చూడాలి. కులాధి పత్యానికి, వివక్షకు బలమైన కారణంగా నిలిచే భూస్వామ్య, సామ్రాజ్య సంస్కృతిని నిర్మూలించే దిశగా పోరాటాన్ని సాగించాలనే విప్లవ సాహీతీ పత్రికల సంస్థల పిలుపు ఆహ్వానించదగినదే. అవినీతిని, దోపిడిని, దౌర్జన్యాలను ప్రశ్నించకుండా కులంపైనే చేసే ఉద్యమాలు అశేష పీడిత ప్రజానికానికి విముక్తిని ఇవ్వలేవు. ఉద్యమ నాయకత్వం పీడిత వర్గాల చేతుల్లో ఉండాలి. కుల సమస్యపై ఏకమైనంతగా ఆర్థిక సమస్య, భూ సమస్యలపై సామాజిక వర్గాలు ఏకం కావటం లేదు. ఈ దిశగా ప్రజల్లో చైతన్యం రావలసి ఉంది.

            కుల-వర్గ సమస్య, వర్తమాన దండోరా ఉద్యమ సమస్యలాంటి సామాజిక ప్రధానాంశాలపై సమగ్రమైన చర్చను లేవదీస్తూ అది సాహిత్యంలో ప్రతి ఫలిస్తున్న తీరును శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ప్రచురించిన ఈ పుస్తకం దార్ల సామాజిక అవగాహనకు, సాహిత్య కృషికి, అంకిత భావానికి తార్కాణంగా నిలుస్తుంది. చైతన్యాన్ని మహా చైతన్యంగా మలిచి అశేష పీడిత ప్రజల ఆర్థిక సామాజిక విముక్తి దిశగా ప్రయనించాలని కోరుకుంటూ.............

                                                            -డా.      జె. భీమయ్య,
25/12/2008
హైదరాబాదు విశ్వవిద్యాలయం  


23 ఫిబ్రవరి, 2012

తొలి ద ళిత కవి ‘మాదిగ మహా యోగి’ దున్న ఇద్దాసు

తొలి ద ళిత కవి దున్న ఇద్దాసు
వర్ణవ్యవస్థను ప్రశ్నించిన తొలి ప్రముఖుడు బుద్ధుడు. ఆ మార్గం శతాబ్దాల పాటు మూసుకపోయింది. మళ్లీ
ఆ మార్గాన్ని తెరిచింది బసవేశ్వరుడు. తెలంగాణలో దాని వారసుడు పాల్కురికి సోమనాథుడు. శిష్టవర్ణ కథనాల్ని తిరస్కరించి మడేలు మాచయ్య, కమ్మరి గుండయ్యలకు పట్టం కట్టిన మార్గదర్శి పాల్కుర్కి. ఆ మార్గంలో శిష్టవర్గ పురాణాల్ని కాదని విస్మృత కులాలు తమ కుల పురాణాల్ని సృష్టించుకున్నరు. ఈ కుల పురాణాల సృష్టి వర్ణ వ్యవస్థ మీద, వర్ణాధిక్యత మీద వేసిన పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న
తదనంతరం ‘ప్రధాన స్రవంతి’లోకి రాకపోయినా ఒక పాయగా సాగుతూ వస్తూనే ఉంది. ప్రచారం దృష్ట్యా
అది పాయ కావచ్చు. కాని జనాభా దృష్ట్యా అది పాయ కాదు. అదే ప్రధాన స్రవంతి. సరే పాయ అనుకున్నా అది ఆగలేదు. చెవుల్లో సీసం పోసినా, నాలుక ఖండించినా అది ఆగలేదు.

ఉపమ గలిగి శయ్యల నొప్పిఉన్న
అంఘ్రిభవుని కావ్యంబు
గ్రాహ్యంబు కాదు
పాయసంబైన సంస్కార పక్వమైన
కాకజుష్టంబు హవ్వంబు కాని యట్లు


అని నిషేధం విధించినా ఆగలేదు.తొలుత ఆ పాయ నుంచి గొప్ప శూద్ర కవులొచ్చినారు. కందుకూరి రుద్రకవి, తెనాలి రామలింగకవి, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, పోశెట్టి అంగకవి, గావండ్ల రాజలింగకవి, సుంకరనేని ఫణికుండలుడు, గడ్డం రామదాసు, గౌడపురాణం రచించిన మల్లికార్జున సిద్దయోగి మొదలగువారు అట్లాం టి గొప్ప కవులు.
ఆ పాయలోని రెండవ పొర అయిన దళితుల నుంచి కవులొచ్చినారు. అట్లా వచ్చిన కవి చింతపల్లి దున్న ఇద్దాసు (1811-1919). లభిస్తున్న సమాచారం మేరకు ఇద్దాసు తొలి దళితకవి. బిరుదు రామరాజు గారు ఈయనను ‘మాదిగ మహా యోగి’ గా సంబోధించినాడు. ఇద్దాసు యోగిగానే ప్రసిద్ధి చెందినాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా అయ్యవారిపల్లి గ్రామం లో ఇప్పటికీ ఉన్న ఇద్దాసు ఆశ్రమం ఆ ప్రసిద్ధికి నిదర్శనం.

కరణాలు, రెడ్లు మొదలుకొని అనేక కులాల వారు ఆయన శిష్యులు గా ఉండడం ఆ గొప్ప తనానికి మరో నిదర్శనం. ఇద్దాసు యోగి గా ఉంటూనే అనేక కీర్తనలు, తత్త్వాలు, మేలుకొలుపులు రాసినందువల్ల ఆయనను నేను కవిగా ‘ముంగిలి’లో చేర్చిన. ఇద్దాసు అసలు పేరు ఇద్దయ్య. మాదిగ కులానికి చెందిన దున్న రామ య్య, ఎల్లమ్మలకు క్రీ.శ.1911 ప్రాంతంలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో జన్మించాడు. రైతుల దగ్గర జీతగాడిగా ఉన్న ఇద్దయ్య తత్త్వకవిగా పరిణితి చెందడం ఆశ్చర్యకరం. పశువుల కాపరిగా ఉన్నప్పుడు సాధువుల సాంగత్యం ఏర్పడి వారి నుంచి తత్త్వగీతాలు నేర్చుకున్నాడు. మోటకొడుతూ ఆశువుగా తత్త్వగీతాలు అల్లిపాడేవాడు.

ఆ గీతాలు విన్న పరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య ఇద్దయ్యకు లింగధారణ చేయించి, పంచాక్షరీ మంత్రం ఉపదేశించినాడు. తర్వాత ఇద్ద య్య పోతులూరి వీరవూబహ్మం, ఈశ్వరమ్మలు ప్రచారం చేసిన రాజయోగం సాధన చేసినాడు. ఆరునెలలు అడవుల్లో సంచరించి ఏకాంతంగా యోగసాధన చేసినాడు. పూర్ణయోగి అయిన తర్వాత అష్టసిద్ధులతని వశమై అనేక మహిమల్ని ప్రదర్శించినాడని జనశృతి. అట్లా ఇద్దయ్య-ఇద్దన్న, ఇద్దాసు అయినాడు. ఊరూరు తిరుగుతూ భక్తి, జ్ఞాన వైరాగ్యాల్ని ప్రబోధిస్తూ వందలాది మంది శిష్యుల్ని, భక్తుల్ని, అనుయాయుల్ని చేసుకుంటూ అచ్చంపేట తాలూకా అయ్యవారిపల్లి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దాసు అనేక తత్త్వాల్ని, కీర్తనల్ని, మేలుకొలుపుల్ని ఆశువుగా వచించినాడు. ఇందులోంచి 32 తత్త్వాల్ని మాజీ మంత్రి పి. మహేంవూదనాథ్ సంపాదకత్వం లో మల్లేపల్లి శేఖర్‌డ్డి ‘శ్రీదున్న ఇద్దాసు గారి తత్త్వాలు’ పేరుతో ముద్రించినాడు.


పల్లవి: మీరయ్యవారా?
బ్రహ్మముగన్న వారయ్యగారూ
॥ మీర ॥
అనుపల్లవి: మీరయ్య వారైతే
మిగుల చెన్నంపురి
కంటిగురుని సేవ కనబరిచి తిరుగక ॥ మీర ॥
చరణం: గజరాజుకు మారు గ్రామ సూకరి బుట్టి
గ్రామశుద్ధి చేసి గజము నేననిమేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥
సింహమునకు మారు శునకనాథుడు బుట్టి
రేయి పగపూల్ల భౌభౌ మనియేటి
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ ॥ మీర ॥
తేజిగానికి మారు గార్ధభంబు బుట్టి
బంధమేసుకొని గరిక భక్షించేటి
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥
వ్యాఘ్రమునకు మారు మార్జాలము బుట్టి
కండ్లు మూసుకొని పాలువూదాగేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ ॥ మీర ॥

కామధేనువు మారు కడగోవు జన్మించి
మూతి వంచుకొని పూరి భక్షించేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥

వాసిగ తుంగతుర్తి వాసుని మరుగు జేరి
ఆత్మను గన్న ఇద్దాసయ్యగారు
మీరయ్య గారా?
ఆత్మను గన్న వారయ్య గారూ ॥ మీర ॥
ఇద్దాసు గారి ఈ తత్త్వం ఆయన కవితా తత్త్వాన్ని చిత్రిక పడుతుంది.
‘అ కులస్థుడై యున్న యభవుని భక్తికి
ఏ కులంబని నిర్ణయించెదవు’
‘ఎట్టి దుర్జాతి బుట్టిన నేమి
యెట్టును శివభక్తుడిల పవివూతుండు’

‘మలిన దేహుల మాలలనుచును
మలిన చిత్తుల కధిక కులముల
నెలవొసంగిన వర్ణధర్మమధర్మ
ధర్మంబే’
అని గురజాడ చెప్పడానికి
భూమిక నేర్పరచింది.
‘మాలల నంటగ రాదని
గోల నొన్చదరేలా గొప్పర నీకున్
మాలల గోసిన రక్తము
మీలోనను పాలుగలవే నిజముగ
నరుడా (1934)


అన్న పాల్కుర్కి భగవంతుని ముందు కులం ప్రసక్తి లేదని కులాలన్నీ ఒక్క ప్రబోధించినాడు. అది శూద్ర కులాల్లో సూతనోత్తేజాన్ని నింపింది. ఆ భావన కొనసాగింపు ఇద్దాసు ఈ కీర్తన. ఆ భావన కులపురాణాలు, అన్నమాచార్య, వీరవూబహ్మం, వేమనల మీదుగా ఇద్దాసు దాకా ప్రవహించింది. ఆత్మన్యూనత నుంచి బయటపడడం మొదలుకొని ఆధిక్యతను ప్రశ్నించేదాకా ఆ భావన దోహదం చేసింది. అది ఈ కీర్తనలో ప్రతిబింబించింది.

ఇద్దాసు మహిమల్ని ప్రదర్శించినప్పుడు ఆపహాస్యం చేసిన బ్రహ్మణులనుద్దేశించి ఆశువుగా చెప్పిన గొప్ప కవితాత్మకమైన కీర్తన ఇది. బాహ్యశుద్ధి కాదు అంతశ్శుద్ధి ముఖ్యమన్నది ఈ కీర్తన ఉద్దేశం. అంటే కులం ముఖ్యం కాదన్నది తాత్పర్యం.

ఈ భావనే తర్వాతి కాలంలో...
అని జగన్నాథం ఆవేదన చెందడానికి, దైద దేవేందర్ ‘తొండం’(1975) అనే కావ్యం రాయడానికి ఇటీవల అంద్శై గ్యారయాదయ్య, వేముల యెల్లయ్య, చిత్రం ప్రసాద్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, జాజులగౌరి, పసునూరి రవీందర్, జిలుకర శ్రీనివాస్, కదికృష్ణ, చైతన్య ప్రకాష్ మొదలయిన వారు కులాధిక్యతను ప్రశ్నించడానికి కొత్త భావజాలంతో పాటు ఇద్దాసు మీదుగా నిరంతర ధారగా కొనసాగిన సబావూల్టన్ పాయ పూర్వ రంగ మేర్పరిచింది.
అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ఇద్దాసు జన్మించి రెండు వందల సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆయన రచనలన్నింటినీ సేకరించి ముద్రించడం, ఆయన కృతుల మీద విశ్లేషణ చేయించడం ఆయనకొనసాగింపుకు సార్థకత  చేకూరుతుంది.
-డా. సుంకిడ్డి నారాయణడ్డి
( నమస్తే తెలంగాణ సౌజన్యంతో...)

18 జనవరి, 2010

నిప్పుల్లో తడిచే తప్పెట ( మాదిగ దీర్ఘ కావ్యం)


-->
ఒంగోలు గిత్త - ఎజ్రాశాస్త్రి - పౌరుష కవిత్వం
ఒక రచనని గుర్తించటం సాహిత్య ప్రస్తావనలో తక్షణ కర్తవ్యంగా భావించాలి. విమర్శలో సాహి త్య ప్రస్తావన అనే భావనని గురించి వివరించటం కన్నా అందుకు తగ్గ కృషి చేయటవేు విమర్శకుల కర్తవ్యంగా నేను భావిస్తాను. విమర్శకి మరో కర్తవ్య పార్శం సాహి త్య ప్రస్తావనే. ఇటీవల వచ్చిన కొత్త ధోరణులని కొంతమంది విమర్శకులు యింకా జీర్ణంచేసికోలేదు. మన విమర్శకులు వాళ ధోరణిలోనుంచి రచయిత కృషిని పట్టించుకుంటున్నారుగాని రచన తరఫున వకల్తా పుచ్చుకొనే ధోరణికి అలవాటు పడలేదు. రచయిత రచన చేసిన తర్వాత రచయితనుంచి రచన విడిపోతుంది. యింక రచయితకి ఆరచనకి సంబంధం వుండదు. రచన పాఠకుడి వశం అవుతుంది. రచనని పాఠకుడి కంటే కూడా ముందుగా విమర్శకుడి గుర్తింపుద్వారా విమర్శకుడి మొదటి కర్తవ్యం ప్రారంభం అవుతుంది. ఆగుర్తింపు ద్వారా ఆరచనని, ఆరచయిత యితర రచనలని విమర్శకుడు గుర్తించి దానిని వీలున్న చోట ప్రస్తావన ద్వారా ఆరచనని పాఠకుడి దగ్గరికి తీసికెళాలి. అంచేత విమర్శలో సాహి త్య ప్రస్తావన ఒక గతి శీలక పాత్రనే కాక చైతన్య వంతమైన పాత్ర కూడా నిర్వహించి రచయితని బేరీజు వేసేందుకు కృషి చేస్తుంది. రచనా ప్రవాహాంలో ముందుకు నడుస్తున్న రచయిత రచనలని అతని కృషి, అతని బలాన్ని, బలహీ నతనీ ఎత్తి చూపటం సాహి త్య ప్రస్తావనలో జరగాల్సిన మొదటి తంతుగా భావించాలి.
నా సాహి త్య ప్రస్తావనలో భాగంగా గత పదేళనుంచి సాహి త్య కృషి చేస్తున్న దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి ఎదుగుదలని గుర్తించే ప్రయత్నవేు ఈ వ్యాసం నిర్వహి ంచే పాత్ర. నిజానికి రచనని గుర్తించే ముందు విమర్శకుడికి ఆరచయితకి సాన్నిహి త్య సంబంధం కూడా చాలా అవసరం. ఒక విమర్శకుడు తారసపడ్డ ప్రతి రచయితని, ప్రతి కవిని కప్పదాటుగా విమర్శంచే కర్తవ్యం నించి బైటపడి, తనకు దగ్గరగా వున్న,తనకు బాగా తెల్సిన, తన ప్రాంతీయ రచయిత కృషిని గుర్తించి ఆ విమర్శని ముందుకు తీసికెళటం చాలా సరైన చర్య. నిజానికి ఒక విమర్శకుడు ఒక రచయితని లేదా ఒక ధోరణి రచయితలని అంటిపెట్టుకొని వాళ కృషిని కాపాడటం కూడా సాహి త్య ప్రస్తావనలో సరైన చర్యగా భావించాలి.
దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి నాకుగత పదిఏళనుంచి బాగా తెలుసు. అతడి కవితా ప్రయాణాన్ని దగ్గర నుంచే గమనించటవేుకాక ప్రోత్సాహి ంచి అతనికి నా తోడ్పాటును ఈరోజు దాకా అందిస్తున్నాను. అందుకే ఈ పరిచయం.
చెప్పులుకుట్టే చేతుల వంశంనించి ఎదిగిన ఎజ్రాశాస్త్రి ఆ మాదిగ జాతి నిర్వహి స్తున్న యం.ఆర్‌.పి.యస్‌. ఉద్యమానికి బాసటగా నిలుస్తూనే కేవలం దళిత కవిత్వ నిర్వహాణా స్పృహా చాలదని గుర్తించటంలోనే అతని వ్యూహాంవుంది. దళిత ఉద్యమాన్ని బహుజనుల చేతికి అందించటం ద్వారా మాత్రవేు తమ జాతి ఆత్మగౌరవం మరింత పదును ఎక్కుతుందనే జాతీయ స్పృహా ఎజ్రాశాస్త్రిలో వుంది. అందుకే రచలని దళిత కవిత్వంలో భాగంగా కాక బహుజన కవిత్వ నిర్మాణంలో భాగంగా అతను కృషి చేస్తున్నాడు.
ఎజ్రాశాస్త్రి తన సాహి త్య ప్రస్థానంలో యిప్పటి వరకు వెలువరించిన రచనలు :
1) కర్రముక్క - దీర్ఘకవిత - ఆగస్ట్‌ 2005 ప్రచురణ
2) ఏరువాకై తిరిగి లేస్తా - కవితా సంకలనం - డిసెంబర్‌ 2006 ప్రచురణ
3) నిప్పుల్లో నడిచే తప్పెట - దీర్ఘకవిత - డిసెంబర్‌ 2008
పై రచనలేకాక నిరంతరంగా పత్రికల్లో అతని కవితలు వస్తున్నాయి. ఆ కవితల్లో ''బియ్యమూ - బంగారమాÑÑ అంటా వడ్లగింజ గురించి రాసిన అతని కవిత యిటీవల గొప్ప సంచలనం చేసింది.
కవిత్వం అంటే కేవలం ఓ అనుభవవేు కాదు, చరిత్రలో భాగం కూడా. రచన చేయటం చారిత్రక కర్తవ్యంగా భావించే క్రమలో నుంచే వెలువడింది కర్రముక్క దీర్ఘకవిత! ఏజాతి నైతే దూరంగా యింతకాలంగా తోసి వేశారో. ఆజాతే మరుభూమి దగ్గర్నించి, కళ్యాణ వేదికల దాకా దుడ్డుకర్రని చేత పట్టుకొని సమాజాన్ని ముందుకు నడిపించటవేుకాక - అన్నింట్లోను వారే ముందువుండి ఆ తర్వాత మరే జాతి అయినా, అనే సామాజిక ఆత్మగౌరవం దట్టించిన ఉద్యమ స్పృహాని ఈ కర్రముక్క దీర్ఘ కవిత నిరూపించింది. పాలక వర్గాల్ని ఎదురించే క్రమంలో భాగంగా ఈ కర్రముక్క ఓ ఆయుధంగా అవుతుందని ఎజ్రాశాస్త్రి ఎలుగెత్తి చాటాడు.
''కర్రముక్కకదా అనుకుంటే పొరపాటే / ఆకులు వలువలు ధరిస్తే, మహారణ్యం!, ఆకులు విదిల్చిచేతే ఒక మహా సింహాసనంÑÑ అనే ఎత్తుకొలుతో ప్రారంభమైన ఈ మహా ప్రవాహాం కవిత ఆ..... ''శత్రు సమూహాలపై ఈటేలు విసిరి / భూ భకాసురులపై ఒరిసెలు ఎత్తి / ఆ నాగరిక / అడవితల్లిబిడ్డలకు వనమూలికలై / వేర్లనుండి వైద్యాన్ని మొలిపించి / ఆకు పచ్చగా చిగిర్చింది నువ్వేకదా?ÑÑ అని ముక్తా యించటవేు కాక కర్రముక్కని విముక్తి దాతగా ప్రకటించడం ద్వారా ఆత్మ ప్రభోదాన్ని చాటి చెప్పటం జరిగింది!
కర్రముక్క దీర్ఘ కవితతో పాటు ఈ సంకలనం అతని మరిన్ని తొలినాటి కవితలు 16 దాకావున్నాయి.
''రెండు క్షణాల కౌగిలి / మూడో క్షణం చీదరింపు గతం అంటుకోలేదు / వర్తమానం వెంటరాదుÑÑ అంటూ క్షణికం మీద అతను విసిరిన వైరాగ్యంఅతని కవిత్వ సూటిదనాన్ని తాత్వికంగా విన్న విస్తుంది. ఈపోకడే అతని చాలా కవితల్లో కన్పిస్తాయి. కారణం ఎజ్రాశాస్త్రి ఒక ఆసుకవి. పైగా జానపదకవి. అనేకమంది జానపద కవుల మాదిరే అవలీలగా కవితలు అల్లుతాడు. ఈ అల్లిక అతని నోటి వెంట అనర్గళంగా ప్రవహి స్తుంది. అందుకే అతని రచనలు ధారగా ప్రవాహాంగా సాగుతాయి. చెప్పేవిధానంతో కవిత రాయట ద్వారా అతను రెండు ప్రయోజనాలు సాధిస్తున్నాడు. ఒకటి అతని రచన సూటిగా వుంటుంది. రెండు అస్పష్టత ధరి దాపులకు వెలకుండా సూటిగా పాఠకుడికి అనుభూతిని ప్రసాదిస్తుంది. అక్కడే అతని విజయం అతని బలహీ నతలు కూడా బైటపడ్తుంటాయి. ప్రవాహాంగా వచ్చేఅతని కవిత్వంలో అక్కడక్కడ కొన్ని నట్లు కన్పిస్తుంటాయి. ఇటీవల ఆ బలహీ నత ఒదలించుకొని సూటిగా కవితవెలువడటం యిటీవలి అతని కవితల్లో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకు కారణం అతని నిత్యకృషి, సాదన, అధ్యయనం పైపెచ్చు నీర్భీకత. ఈ నిర్భీకతతోనే అతని కవితలు పండుతున్నాయి. అందునా బాల్యంలో వలకూలీ అయిన తండ్రితో కలిసి సేద్యం చేసిన చేతులు ఈ నాడు కలం పట్టుకొని ముందుకు వచ్చినప్పుడు 'ఏరువాకై తిరిగి లేస్తాÑ అనే సంపుటిని ప్రకటించటంలోనే రైతుకూలీల పట్ల, రైతాంగం పట్ల అతని ఆవేదన అర్ధమవుతుంది. రైతుల ఆత్మ హాత్యలకి చలించిన తాను, కళ్లముందర ప్రవాహామైన పంట చేజారిన చేతిలోని బిడ్డలా ఆత్రంగా చేతులెత్తి కాపాడమని ఆక్రోశించినట్లుంది పంటపొలం. అంటా ఓ భావ చిత్రాన్ని మన ముందు వుంచుతాడు. అలాగే రైతుని కూలి తల్లి ముక్కుపుడకై వెలిగే భాస్కరుడుగా చిత్రీకరించటంలోనే అతని భావుకత వెల్లడవుతుంది. రాయటంగా కాక చెప్పడంగా వచన కవితని ముందుకు తీసికెళటంద్వారా ప్రప్రధమంగా ఒక మంచి దళిత కవిగా పేరుతెచ్చుకొన్న ఎజ్రా ఒక సిద్ధాంతం కాడే ఆగిపోకుండా నిరంతర ప్రయాణంలో భాగంగా తన కవిత్వాన్ని బహుజనుల కోసం తర్వాత తర్వాతి రోజుల్లో మలచటం అతని ఎదుగదలని సూచిస్తుంది.ఏకవికూడా ఏదో ఒక సిద్ధాంతం దగ్గరే నిలబడ్తే కొన్నాళ తర్వాత రాయలేడు. చెప్పిందేచెప్పి ఆతర్వాత కనుమరుగై పోతాడు. అలా కాకుండా నిరంతర చలన శీలతతో సమాజానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ కవిలో పరిణతి సాధ్యవుతుంది. ఆ పరిణతిని ఎజ్రా అందుకున్నాడని నేను భావిస్తున్నాను.
''మనస్సు తెరల మాటున నడిచి వెళిన నీ పాదముద్రల సవ్వడి మారు మ్రోగుతునే వుందిÑÑ అని నా నెచ్చెలి అనడంతో ఆ నెచ్చెలి అంబేడ్కర్‌ అనే మార్మికతని సాధించటం కూడా ఎజ్రా పరిణతలోని భాగవేు. అందుకే ఏరువాకైతిరిగి లేస్తా అని అనటంలో కూడా పాపులకోసం ఏసుక్రీస్తు మూడవదినం లేచినట్లుగా తానూ ముందుకు వస్తాననే మార్మిక ప్రయోగం చేయగలిగాడు. అంచేతనే ఏరువాకై తిరిగి లేస్తానని అనేక కవితలకి సూటి దనంతో పాటు అనేకానేక అర్థాలు పాఠకులు వెతుక్కోవల్సిన అవసరంవుంది. అందుకే ఈ సంకలనంలోని కవితలు ఏనాడు చదివినా పాఠకుడు ఫ్రేష్‌గా ఫీల్‌ అయ్యే వెసులు బాటుని అతని సంకలనంలో ని కవితలు కన్పిస్తాయి.
'నిప్పుల్లో దరువేయ్‌ వివక్షలను తరివేుయ్‌Ñ అనే వేుల్కొలుపుతో వచ్చిన మరో దీర్ఘకవిత ఎజ్రా యిటీవలనే వెలువరించిన సంకలనం! యిందులో మిగ్గు, ముడుసు, ఈరగ, గోరోజనం,శరాయి, బొక్కెన మొదలైన ప్రకాశం జిల్లా మాదిగపల్లె మాండలిక పదాలు కోకొల్లలుగా కన్పిస్తాయి. రచయిత తన ప్రాంతీయ స్పృహాని వెలువరించంద్వారా ఆరచనకి ఒక సజీవకతని సాధిస్తాడు. ఆ మాండలిక పదాలు చావకుండా అన్నమయ్య దగ్గర్నుంచి ఎజ్రాశాస్త్రి మొదలైన జానపద రచయితలంతా ఒకే మెలుకువతోనే ఆపదాలని బతికించగల్గుతున్నారు. భాషని సజీవం చేస్తున్నారు. భాష రచయిత చేతిలోని పనిముట్టు. దాన్ని ఒడుపుగా వాడుకోటంలోనే అతని నిర్మాణ కుశలత కన్పిస్తుంది. మాదిగ జాతిని వేుల్కొలిపే మాదిగ పురాణమిది అని ముక్తాయింగా వెలువరించిన 'నిప్పుల్లో నడిచే తప్పెటÑ మనల్ని మాదిగ పల్లెల్లోకి పరిగెత్తిస్తుంది.
''నా చేలో మొక్క / ఇటుకలో మట్టి/ చెప్పుకువేుకుÑÑ యిలాగ ప్రవాహా స్థాయిలో నడిచే యితని కవిత్వాన్ని పాడుకునే గుణం కూడావుంది. అందుకుతగ్గలయ, దరువు, అతని నిప్పుల్లో నడిచే తప్పెట కవిత్వంలో మనం వెతుక్కోవచ్చు. మిగతా దళిత కవుల మాదిరి ఆక్రోశం, నిందాస్తుతి, అపరిపక్వ పెళుసుదనం ఎజ్రా కవిత్వంలో ఎంతవెత్తుక్కున్నా కానరాదు. అందుకు భిన్నంగా మార్మికత, సూటిదనం, పరిగెత్తుతా, గెంతుతా ఆడుతూ పాడుతూ సాగే పరిమళాలు యితని కవిత్వంలో సాధారణ అంశాలు. ఎప్పుడూ గొప్ప మెళుకువతో కవిత్వం చెప్పిన లక్షణాలే మనకు కన్పిస్తాయి తప్ప స్పృహా దాటి గతి తప్పి నినాద స్థాయి రచనాతత్వం ఎజ్రా కవిత్వంలో మనకు కానరాదు. అందుకు భిన్నంగా నేడు సౌకుమార్యం, లాలిత్త్వం, పదాల ముప్పేటు దాడి, జాతిలోలత్వం నిండుగా యితని కవిత్వంలో వెదుక్కోవచ్చు. ఓ సుకుమార కవి ఎజ్రా! ఓ ప్రేమకుడి లాలిత్త్వం నిండివున్న యితని కవిత్వాన్ని ఎన్నాళయినా ఆస్వాదించవచ్చు. జాషువా కున్న నిర్భీకత, నిజాయితీ వున్న అసాధారణకవి ఎజ్రా శాస్త్రి. అతను ఆంధ్రుడు కావటం మన అదృష్టం. అందులోను కనిగిరి వాడు కావటం మరో గొప్ప అదృష్టం. ఒంగోలు గిత్త పౌరుషం యితని కవిత్వంలోనూ చూడచ్చు.
- శ్రీరామకవచం సాగర్‌
www. sriramakavachamsagar.wordpress.com

------------------------------------------------------------------------------------








ఆసుపత్రికి ఓమూల
పోస్టు మార్టం గదిలా
ఊరికి దూరంగా మాదిగ పల్లె
చర్మం లేని దట్టెంలా ఉంది
నాగజెముడు
బ్రహ్మాజెముడు
సర్కారుకంప
రేగి
కలివె
తుమ్మ
పరికి
ఒళంతాముళతో,
కంపల్లో రాలిపడుతున్న
రక్తపు చుక్కలు
తలమీద ముళకిరీటం
ఒళంతా గాయాలమయమైన
క్రీస్తులా ఉంది నా మాదిగపల్లె.
బతుకు భారమై
భుక్తికోసం
వలస జీవనం
సాగిస్తున్న
వాస్కోడిగామాలు
నా మాదిగ ప్రజలు
ఇంటి ముందర
రెండు ప్రయోగశాలలు
అమ్మసున్నం
అయ్యతంగేడు -
అయ్య వీరబాహుడిలా
కల్లుతాగి
కత్తులు పదును బెడ్తుంటాడు
కసాయి భాషనేర్వనికత్తి
అయ్యచేతిలో
కొవ్వొత్తిలా వెలుగుతుంది,
చెట్టుకింద కూర్చొని చెప్పులు కుడుతుంటే
బోధివృక్షం కింద
బుద్ధుడులా ఉండేవాడు
ఆరెకు,వారుకు, తోలుకు, నూలుకు మధ్య
''మిగ్గుÑÑలాంటి మనసున్న అయ్య
నే పాలు తాగక మారాంజేస్తె
వాల్లయ్య పేరుతో
నా పసితనానికి
పెద్దరికం తలపాగా చుట్టి
సంబరపడేవాడు
అమ్మ తొమ్మిదినెలలు
కడుపులో మోస్తే,
అయ్య తన గుండెలమీద,
బుజాల మీద మోసెవాడు.
తడుబ్బాత1 లేని అయ్య
నా పసి బెల్లానికి
''శరాయిÑÑ తొడిగి
సంబరపడేవాడు.
తన చద్దిబువ్వలో
నేను చిచ్చుళు పోస్తే
చీదరింపు లేక
కాటంరాజు తిరనాళలో
నన్ను బుజాలకెత్తుకొని... చిందయ్యెవాడు.
ఓ..న..మాలు రాని అయ్య
నాకు పెదబాల శిక్ష.
నా పలకా, బలపం,
నేను కలగటేరు
అయితే కల్లజూడాలని
కలలుగనేవాడు.
అయ్య తప్పెట దరువేస్తే
రైలు పట్టాలుదిగి
మాదిగ పల్లెలోకి
పరిగెత్తినట్లుండేది.
మా ఇంటిముందర
కల్పవృక్షం లేకపోయినా
చింతచెట్టుండేది
ఊరి పచ్చి బాలింతలకు
పత్యానికి పాతచింతకాయ పచ్చడి
కాసిన్ని కస్తూరి మాత్రలు,
చిటికెడు గోరోజనం అయ్యేవాడు అయ్య.
వేురు పర్వతమా
జాంబవతనయా
పసిడి నదులు
నీపాదాల గుండా
ప్రవహిాంచేవట
త్రేతాయుగంలో
శ్రీరాముని రాజకీయ సలహాదారుడివై
ద్వాపరయుగంలో
శ్రీకృష్ణునిపై
వీరోచితంగా పోరాడినావట
శూరుడా !
యుద్ధవీరుడా !
అద్భుత శమంతకమా,జాతిరత్నమా
కోహిానూర్‌ కూడా నీ ముందర వెలవెలే కదా!
నీవు నడిచొస్తుంటే
పొడిచొస్తున్న సూర్యుడిలా ఉంటావు!
బండా గుండ్రాయితో ఉగ్గునూరి
బుగ్గగిల్లి ఉగ్గుబెట్టి
తలకు సాంబ్రాణి ధూపవేుసి
దూలానికి జోలేసి
ఊగే ఉయ్యాల కాదు బాల్యం
నేను పీకి పారేసిన ముడుసు2
చదువుల్లో నేను సొలోమానురాజు
మా బడి మా ఊరిగుడి
అయ్యవారు పూజారి
నే గుడిముందర చెప్పులు
మెట్లవద్ద యాచకుణ్ణి
అక్షరాలు అయ్యవారి దయ
ఐదోతరగతి పుస్తకంలో
అంబేద్కర్‌ గుర్తొస్తుంటాడు
ఆరో తరగతి రాగానే
మహాకవి జాషువా
కష్టజీవిలా కనిపిస్తాడు.
జేెబులో రెండు ఈరగ (లివర్‌) ముక్కలు
నాకు చాక్‌లెట్స్‌,
కృష్ణ, కృపన్నలు
కరపత్రాల
కత్తులతో
కువ్వల్లో కనికట్టతేల్చి
జరుగుతున్న మోసాల్ని
లెక్కల్లో చిక్కు ముళువిప్పి
దండోరాకు నన్నొక
తప్పెట మూయాలనిరి
రాత్రి చర్చల చివరాకర్లో
క్రీస్తు రెండో రాకడ కొరకు
క్రైస్తవులంతా ఎదుర చూసినట్లు
మాదిగ మందిమంతా
మాదిగ నాయకుడికొరకు
ఎదురు జూస్తుండిరంటిని
ఎబిసిడిలు భాగవతం
బిబిసిలో బూర ఊదబడునని
మహానాయకుల సరసన
మాదిగ జాతికి కుర్చీలుంటాయని
జోష్యం జెప్పినానప్పుడు కాలజ్ఞానమై
మీరు ఆదర్శ స్వాప్నికులు
వెలకట్టలేని వెలుతురు దివ్వెలు
రేపటి తరాలకు నిప్పురవ్వలు
బాబూజీ వారసులు
బాబాసాహోబ్‌ ఆలోచనాపదŠంలో
పయనించే అరుంధతీ పుత్రులంటిని
కనకగిరి నెక్కి
కనక తప్పెటతో
దామాషాగురించి
కనిగిరి తాలూకాలో
దండోరా ఏసిన మొదటోన్ని
మా ఊరు సరస్వతికి
నిలయం కాకపోయినా
అరుంధతికి ఆలయం
పోలేరమ్మకు పుట్టిల్లు
ముత్యాలమ్మ తల్లి వేరేనా?
మా ఇంటి ఆడపడుచు
బక్క ఎద్దుచర్మం
బొక్కెన తోలు
బక్కరైతుకు చెప్పులు
తొండానికి తోలు
దండేనికి తునకలు.
పసుపురోగ పాడావు
చండ్రకోల వారులు అల్లి
బొడ్డారులు3 మెడగంటలు
తలకుచ్చులు.
కరువు కాటకాలు
పన్నుపోటు, వెన్నుపోటు
జమాబందీలకు
ఏలానికి, తాలానికి
చావులకు, సంబరాలకు
చాటింపు, దండోరాలై
పీర్లగుండాల నడిపించి
ప్రభలైనా
పూలబండ్లయినా
వెలిగేది వాళు
ఎగిరేది వేుము.
పాలు పెరుగు ఎరగని
పాలేరు బ్రతుకు మాది
వేగుచుక్క వేులుకొని
ఏడుగాల్ల పెడ
ఇంటిముందు కళాప
ఎరువు బండ్లు, బరువు బండ్లు
ఏడు బర్రెల పాడి
చిట్టు, పొట్టు
గాటిలో గడ్డి
దూడ మూతికి చిక్కం
నా ముంతలో పున్నీళు.
కాడెడ్లకు కొండగడ్డి
పాడి బర్రెకు పచ్చగడ్డి
పైటాలకు నాకు రాగిముద్ద
మాపైగుడ్డలు బాప్తీస్మాలు
పొందితేగాని చాకలన్నముట్టడు
దొరలు కాళు పట్టిన చేతులు
మా తల వెంట్రుకలేనాడు ముట్టాడుకనుక?
పై చదువులకు
నే పట్నం మెట్లెక్కితే
అమ్మా కళళో నే కన్నీళౌతా
అయ్య నా పాదాలకు చెప్పులై
ముద్దాడతాడు.
ఐదు రొట్టెలు
రెండు చేపలకై కాక
చర్మంచుట్టిన
ఎముకలగూడు
నడిచే అస్తిపంజరంనేను
నిత్యం పస్తులై, నిస్తులై
పాఠాలతో
పొట్ట నింపుకొని
ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణతే
శలవు దినాలన్నీ
నాకు పనిదినాలే
నేను పునాది రాయి
తీసిపారేసిన రాయి తలకు మూలరాయి
నే చేలో మొక్క
ఇటుకలో మట్టి
చెప్పుకు వేుకు
చేనుకు కంచె
చేలో ఎరువు
కంచెలో మంచె
మంచె విూద వడిశల
వడిశలలోన రాయి
తోకలేని పిట్టలెన్నో
తల ఊపుతూ మోకరిల్లి
ఉభయకుశలోపరి అంటూ
క్షేమాలను మోసుకొచ్చి
చావుకబుర్లు తీసుకొచ్చి
మసిబూస్తే మరణమని
పసుపైతే పెళని
నాతో పరిపరి చదివించుకొని
ఏడూళకు దారినేను
దిక్కునేను
నేనుపట్టా పట్టుకొని
నడిచొస్తుంటే
జమాబందికొస్తున్న
తహాసిల్‌దారులా
నా మాదిగపల్లె
''తునకల హారాలతో
స్వాగతం పలికేది
కరువు శిలువను మోస్తూ
కాలాన్ని ఎల్లదీస్తూ
పల్లేర్ల మీద బతుకుబండినీడిస్తూ
కట్టెల మోపులు
కలబందలు
గోగు, గురివిందలు
పావలో బేడో
అర్ధణో, అణాతో
పొట్ట పోసుకొని
ఆకలి కలెవకాయలు
నెమ్మిపండ్లు
దొంగిలిన
దోసకాయలు
వేరుశనక్కాయాలు
గెణుసుగడ్డలు
అడవిగడ్డలు, పిల్లేర్లతో
పొట్టనిండక
పస్తులై, నిస్తులై
పొగరాని పొయ్యిజీవితం
నారై, నీరై, మొక్కై
పుడమితల్లి పొత్తిళలోచేర్చి
పంటకు జోల పాటపాడి
వేుఘమా! వర్షమైవచ్చి
నారైతు పంటను ముద్దాడమని
తూర్పు, పడమటిగాలులు
వింజామరలై వీచమని
ఉత్తర దక్షణాదులుయ్యా లూపమని
చిరుపొట్ట కాగానే
వడిశలై పిట్టల్నితోలి
చిరుగాలులూ!
శ్రీమంతంచేయమని
గింజకాగానే
గాలిహాోరుల
తుఫానులు తాకొద్దని
ప్రకృతి నాల్గుదిక్కులమొక్కి
పంటను రైతు ఇంటచేర్చి
వేుమంతా చేలో
కొయ్య కాళలా మిగిలిపోతాం
కుప్పనూర్చి
తూర్పారబట్టి
గాలికి ఎగిరే తాలు గింజలం
రాసి అడుగుమట్టి గింజలం.
దేవుని మాన్యాలన్నీ
దెయ్యాల పాలు
నైవేద్యాలన్నీ బూతాలపాలు.
జానెడు కొమ్ములు తిరిగిన
మెడబలసిన దున్నపోతును సైతం
ఏటుకునరికి
పొలినై బలినైన
ఊడ్చడానికి
ఏడ్చడానికి సెంటుభూమిలేదు.
జీవితాన్ని తెగిన చెప్పులా ఈడుస్తున్నా
వేసక్టమీ అంటే అయ్యకు ఉరి
సారా కోసం సావుకైన సిద్దం
కుచేలుడు సంతానాన్ని
కలరా కబలిస్తున్నా
అతిసారా అంతమొందించినా
మసూచి మట్టుబెడుతున్నా
పోలియో అంగవైకల్యమైనా
వ్యాధినిరోధక టీకాలంటే
చెట్టు
పుట్ట
గాదే
గరిసెలై
ఏడూళు ఏకమై
ఏడుపులు
పెడబొబ్బలు.
పల్లె రాబందులకు విందు
తమలపాకులు తుంచారని
తలకాయలు తెంచారు
అరటిగెలనరికారని
అరికాళునరికారు.
గొర్రెల్లోబడ్డా తోడేళా
వేుకల్లోబడ్డా చిరుతల్లా
నాలుగెద్దుల కదŠలో పులిలా
విభజించి పాలించే
తెల్లదొరలకు తీసిపోరు
రైతుల పెళంటే
చెప్పులు పువ్వుల్లా
పాదాలకింద పోస్తాడు అయ్య
గజ్జల గుత్తైపోయి
చిందులు శివాలై
చిట్లిన తప్పెటలా
గోడకిందవాలి పోతాడు
పండగంటే
వడ్లగింజలో
బియ్యపుగింజ!
సంవత్సరానికో ప్రసాదం!!
ఈ వసంతాని కోసం
నా పల్లె ప్రజలు వలస పకక్షుల్లో
కలిసిపోయింది.
జబ్బుకు
జాడ్యానికి
జిల్లేడు పసరు నస్యం
కళల్లో కలికం
సొంటి
వొంటేలువైద్యం
కషాయం
పాషాణం
లంకణానికో పత్యం
వరిబువ్వగంజి
టీగ్లాసులే కాదు
మందుగ్లాసులు
ఊరిని పల్లెను రెండుగా
చీలుస్తాయి
కొంపలు నిప్పంటుకుంటే
కులం వాగులో
విద్యుత్‌లా ప్రవహిాస్తుంది
దాహానికి దోసెళతో
దేబిరించాల్సిందే
బూడిదలో ఉచ్చ
బుడ్డోడిమంత్రం
కొండ నాలుక పెరిగిందని
చిమట కాకర్లబోతే
ఉన్న నాలుక ఊడిపోయే
తేలు మంత్రం
భూతాలకు తంత్రం
చేతబడి
చిల్లంగి
బాణామతి
అమాయకత్వం
ఆసరాగ పెట్టుబడి
ముగ్గులేసి
నిగ్గుతేల్చి
మాదిగోడికి పాతాళం.
రైతు పంటచేతికొస్తే
నేను మగదŠ సామ్రాజ్య
యువరాజునే మరి
గంగిరెద్దుల ఆట, నిప్పుల్లో నడుస్తున్న
కణకతపెట్లు, కర్రసాములు
మల్లయుద్దాలు
వీధినాటకంలో నేనెప్పుడూ
వీర బాహున్నే
మాదిగ మాష్టీలు
ముష్టియుద్దాలు
మల్లయోధులై
సాముగరిడీలై
యుద్ధవీరులైన మాదిగసేన!
నాపేట కోట ప్రాకారం
అల్లంత దూరాన
నాడెక్కలి సుందరి
చెలికత్తెలతో
తన సౌందర్య సుమాల
సువాసనలతో నన్నా కర్షించి
ఆహ్వానం పలుకుతుంది.
కోరమీసాలు మెలివేసి
కిర్రుచెప్పులు కాల్లతొడిగి
నెత్తికి సమురుబూసి
నా నిలువెత్తు మూర్తి మత్వానికి
మాల కొండన్న
నూరు నెంబరు నూలుపంచ
ఖద్దరులాల్చి ఆరుమూరల కండువాతో,
వెనకాముందు సైన్యాలున్నట్లు
అశ్వాలు
ఐరావతాలు
కదులుతున్నట్లు నేనుకదులుతుంటే
అంతఃపుర సుందరాంగులు
లేలేత లేగదూడల కొవ్వుల పువ్వులతో
వసనెయ్యి4 ప్రమిదల తో
నాకు ఆహ్వానం పలికినట్లుండేది
నేను నాప్రియురాలు
మందహాసంతో
ఆ నులక మంచవేు పట్టుపరుపు
పందిరిమంచం
ఆపై మా ప్రణయ గాధలెన్నో?
నా జీవితపురాణం
నాలుకమీద లిఖించుకున్న 'ఆసాదిÑÑ
వల్లిస్తూ
జంబూద్వీపము
జాంబవ పురాణం
యజ్ఞ జ్వాలలనుండి
ఉద్భవించిన అరుంధతిని
వశిష్టుడు వలచి
కులపెద్దల ఆజ్ఞతో
పరిణయమాడి
ఆకాశంలో నక్షత్రమై
స్త్రీ జాతికి ఆదర్శవంతమై
నూతన దంపతులకు
దర్శన మొసంగుచు
వెలుగొందుతున్న మాదిగ
మహా పతివ్రత చరిత్రలివి.
కొమ్ము లూదుతూ
జయ జయ ధ్వనులతో
కీర్తిస్తున్న కొమ్ములవారు
నా ఆస్తాన పూజారి
వశిష్టుడి వేునమామ
నాజాతిగురువు మాదిగ దాసరి
జంధ్యాలతో
ఇంద్రలోకము నుండి
దిగివచ్చిన దేవేంద్రుడిలా
లక్ష్మణుడికి ప్రాణంప్రసాదించిన
సంజీవినిలా
పెళి పేరంటాలకు
మంత్రోచ్ఛరణలతో
ఉద్భవించిన ఓంకారానికి
కారణ భూతుడిలా
కాలాన్ని తాళపత్రగ్రందŠంజేసి
చేతబట్టి
చావు -
రేవుల
క్రతువులోనర్చి
అగ్నిహాోత్రుడు మాదిగదాసరి.
నేను సూర్యరదŠమెక్కి
కోట్లపగ్గాలు చేతబట్టి
తూర్పుతీరం నుండి
విజయ దుంధుభి మోగిస్తున్న
విజయ సారధినేను.
వందకోట్లు పాదాలు కందకుండా
కాలు కింద మోపకుండా
నాచర్మంతో చెప్పులు కుట్టినవాడను
మకుటములేని మహారాజులా
వెలగుతున్నవాడను.
నూరు కోట్ల భారతీయులను
పాలితులుగా జేసుకొని
రారాజు, మహారాజు కాగలవాడను.
బాటా, కరోనా, లోటస్‌, లిబర్టీ
నాతోలు ముక్కలు,
నాతోటకలుపు, మొక్కలు
చెప్పు నాజాతి జండా
డప్పు నా ఎజండా
చర్మం నా తంత్రి
జన సముద్రంలో
బాప్తీస్మం పొందిన వాడిని
మృత్యువుని జయించినవాడిని
కల్పవృక్షం నావంట చెఱకు,
కామధేనువు నాకూరాకు
అమృతం నా మధుపానం
మృత్యుంజయుడనై లేచిన వాడిని
నేను మాదిగోణ్ణి
నాకిక మరణంలేదు
నీలివేుఘాల పతాకం చేతబట్టి
లక్షల డప్పుల సింహా నాదంతో
ఐరావతాన్ని అధిరోహిాంచి
నేను రాజ్యంవైపు నడుస్తా.
-దుగ్గనపల్లి ఎజ్రాశాస్త్రి, ఇం.నెం. 43-3-714, ఓల్డ్ విజేత స్ట్రీట్, ఇందుర్తి నగర్, ఒంగోలు-523 001