రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ధర్మయుద్ధం మహాసభ (27 నవంబర్ 2016) వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ధర్మయుద్ధం మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
గచ్చిబౌలి : నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 27న జరగనున్న ధర్మ యుద్ధం మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం సా యంత్రం హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వర్సిటీ దళిత్ సూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ వాల్పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు, దళిత్సూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ సూడెంట్స్ యూని యన్ ప్రధాన కార్యదర్శి సుమన్ పలువురు విద్యార్డులు పాల్గొన్నారు.


ధర్మయుద్ధం' పోస్టర్ ఆవిష్కరణ G 620
చ్చిబౌలి: ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన ధర్మయుద్ధం మహాసహభకు సంబంధించిన పోస్టర్ ను సోమవారం రాత్రి గచ్చిబౌలి లోని హెచ్.సి.యూ వద్ద విడుదల చేశారు. హెచ్.సి.యూ దళిత్ సూడెంట్స్ యూనియన్(డీఎస్.యు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ ముఖ్యఅతిధిగా విచ్చేసి పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభను విజయవంతం చేసేందుకు అందరు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. హెచ్.సీ.యూ తెలుగు విభాగం ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు, డీఎస్ యు అధ్యక్షులు ఈశ్వర్, సూడెంట్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి సుమన్ దామెర, నాయకులు పద్మా రావు, వేణు, రమేష్ తదితరులున్నారు.ధర్మయుద్ధమహాసభలో దార్ల 

ధర్మయుద్ధమహాసభలో దార్ల 
No comments: