ఈనాడు సౌజన్యంతో...
పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలనుకోవడం ప్రతి విద్యార్ధికీ ఉండవలసిన ప్రధాన లక్ష్యం. కానీ కొన్ని సార్లు చిన్న చిన్న తేడాతో కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని బాధ పడుతుండటం సహజం. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ)లోనే ఎం.ఏ. చేశాను. ఒక్క మార్కుతో గోల్డ్ మెడల్ కోల్పోయాను. చాలా నిరుత్సాహానికి గురైయ్యాను. కానీ, ఎం.ఫిల్, పిహెచ్.డి. కూడా ఇదే యూనివర్సిటీలో చేశాను. ఇప్పుడు ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. పాఠాలు చెప్పిన ప్రొఫెసర్స్ తో కలిసి పనిచేస్తున్నాను. ఆనాడు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్ధి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. అందువల్ల ఒక పరీక్ష తప్పాడు వల్లనో, ఒక లక్ష్యాన్ని సాధించలేకపోవడం వల్లనో ఇక దేనికీ పనికి రాననుకోకూడదు. ఇక దేన్నీ సాధించలేననుకోకూడదు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొంతమందికి తమ ఫలితాల్లో వ్యత్యాసాలు కనిపిస్తే, మరలా రీవెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇంకా అనుమానం ఉంటే మొత్తం పరీక్ష పత్రాల్నే నకలు చేసి తీసుకోవాలి. ఆ అవకాశాలన్నీ ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు కల్పిస్తుంది కదా! కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు తార్మారయ్యే లేదా కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సమస్యను నేను స్వయంగా ఎదుర్కొన్నాను. బి.ఏ. ఫలితాలు విడుదల చేస్తే, పత్రికల్లో నా నెంబరు లేదు. అందరూ ఫెయిల్ అయిపోయావన్నారు. ఆ ఫలితాలు విడుదల చేసినప్పుడు నేను ఆంధ్రా యూనివర్సిటీలోనే ఉన్నాను. సెంట్రల్ యూనివర్సిటీ ఎం.ఏ. ఎంట్రన్స్ రాయడానికి అక్కడకు వెళ్ళాను. పరీక్షలు నియంత్రణాధికారి కార్యాలయంలో వాకబు చేశాను. నేను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడునవ్వటమేకాదు, నా సబ్జెక్టులో విశ్వవిద్యాలయ సర్వప్రథముడు (యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్) వచ్చిందని తెలిసింది. పత్రికల్లో కనపడినప్పుడు నేనూ ఆందోళనకు గురైన మాట నిజమే. కానీ, ఆందోళనను ఆత్మహత్య వైపు మళ్ళించకుండా, ఆలోచన వైపు మళ్ళించాను. తర్వాత అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఫోటోతో సహా వార్తలు ప్రచురించారు. ఫెయిల్ అయ్యావన్నవాళ్ళే మనస్ఫూర్తిగా అభినందించారు. అందుకే పరీక్షల ఫలితాలు సమయంలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి