"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

మాదిగ కవులు పత్రికలు దార్ల (విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మాదిగ కవులు పత్రికలు దార్ల (విద్యా సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15 అక్టోబర్, 2024

నెమలికన్నులు-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ఆత్మకథ... పల్లిపట్టు నాగరాజు, 29.9.2023

 నెమలికన్నులు-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ఆత్మకథ... పల్లిపట్టు నాగరాజు, 29.9.2023

         ఇది ఆచార్య దార్ల గారి జీవితగాథ మాత్రమే కాదు.నాలుగు దశాబ్దాల తెలుగు సమాజపు చరిత్ర కూడా.!

చదువుతూ చదువుతూ మనమూ...

ఆ ఊళ్లలోకి,చేలల్లోకి,ఆ వీధుల్లోకి,ఆ వాడల్లోకి వెళ్ళిపోతాము.అక్కడ కాయకష్టం చేస్తున్న తల్లులతో, తండ్రులతో,మాట్లాడి వస్తాము,అమాయక చూపుల బాల్యపుసైకిలు చక్రం వెంటనో,పుస్తకాలు పట్టుకుని వెళ్తున్న పాదాల వెంటనో పరిగెడుతాము.

కన్నీళ్లు, కష్టాలేనా,ఆత్మాభిమానవు కలలూ పలకరిస్తాయి.ఆత్మగౌరవాన్ని గుండెలనిండా నింపుకొని నడిచిన దారులు పిలుస్తాయి.

 దశాబ్దాల దళితవాడల కథలు,వ్యధలు అమాయకంగా చూసే నెమలికన్నుల బాల్యం ముందు కదలాడుతూ మనతో సంభాషిస్తాయి.

    ఇది ఒక వ్యక్తి ఆత్మకథ మాత్రమేకాదు.ఆంధ్రదేశపు దళితుల చరిత్ర,ఆత్మగౌరవాన్ని దివిటీగా చేతబట్టి ఎక్కడో మారుమూల ఊరినుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ దాకా నడిచిన బతుకు పోరాట యోధునిగాధ. అక్షరమే ఆయుధంగా గెలిచిన నిలబడ్డ విద్యావంతునికథ.

స్ఫూర్తిని,ప్రేరణను,చేతనను అందించే కథ.సాహితీ చరిత్రలో నిలిచిపోయే నిత్యసాహిత్యకారుని,

ఆచార్యుని నిండైన ఆత్మవిశ్వాసపు కథ.

చదువుతూ చదువుతూ...వాక్యాల వెంట పదాల వెంటా కదులుతూ కదులుతూ ఇలా నాలుగు వాక్యాలయ్యాను..!


           ఆత్మీయంగా నెమలికన్నులు పంపిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.నమస్సులు.💐💐💐

21 సెప్టెంబర్, 2023

తొలిరోజు గురజాడ జాతీయ సదస్సు,21.9.2023, hcu



*మానవసంబంధాల ఔన్నత్యమే గురజాడ సాహిత్యం*


మానవ సంబంధాలను సూటిగా,  శక్తివంతంగా చెప్పడంలో గురజాడ అప్పారావు ఎంతో విజయవంతం అయ్యారని, దాని ద్వారా మానవ సంబంధాల ఔనత్యాన్ని సాహిత్యంలో ప్రతిఫలింపజేశారని హెచ్ సి యు వైస్ ఛాన్సలర్ ఆచార్య బిజె రావు వ్యాఖ్యానించారు. తెలుగు శాఖ, హెచ్ సి యు గురజాడ ఫౌండేషన్ అమెరికా వారి సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగే 'మహాకవి గురజాడ అప్పారావు జీవితం, రచనలు ' జాతీయ సదస్సు ప్రారంభ సభలో గురువారం నాడు హెచ్ సియు వైస్ ఛాన్సలర్ ఆచార్య బిజె రావు ముఖ్యఅతిథిగా పాల్గొని, గురజాడ కథామంజరి పుస్తకం, దార్ల వెంకటేశ్వరరావు నెమలికన్నులు గ్రంథాల్ని ఆవిష్కరించి, గురజాడ సాహిత్యంపై విశేషంగా కృషిచేసిన కీ.శే.వేదగిరి రాంబాబు గారి సతీమణి శ్రీమతి సంధ్యారాణిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య బిజెరావు మాట్లాడుతూ గురజాడ దేశమంటే కేవలం మట్టిమాత్రమేకాదనీ, దేశమంటే మనుషులు కూడా అనే దృష్టితో మానవత్వ పతాకాన్ని ఆవిష్కరించారని అన్నారు. సులభమైన మాటల్లో సూటిగా చెప్పడం గురజాడ అప్పారావు గారు శైలి ప్రత్యేకత అని, పాఠశాలలో చదువుకున్నప్పుడే గురజాడ వారి దేశభక్తి గేయం గుండెల్లో సూటిగా దూసుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రారంభ సభకు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి, మూడుతరాల వారు ఈ సదస్సులో పాల్గొంటున్నారని, యువతకు అధికప్రాధాన్యాన్నిస్తూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురజాడ వారి జీవితంలోని అనేక అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, ఆయన ప్రయోగించిన ప్రతి పదానికి ఎంతో నేపథ్యం ఉందని ఆచార్య ఏల్చూరి మురళీధరరావు సోదాహరణంగా వివరించారు. బొంకులదిబ్బ నామనేపథ్యాన్నీ, గురజాడ రచనల్లో పేర్కొన్న వివిధ అంశాలపై పరిశోధకుల అభిప్రాయాలన ఉదాహరిస్తూ విశ్లేషించారు.గురజాడ రచనలపై వాద వివాదాలు, విమర్శలు ఉన్నప్పటికీ, కులం, మత, ప్రాంతాలకు అతీతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని గౌరవ అతిథిగా పాల్గొన్న డీన్, స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ ఆచార్య వి.కృష్ణ అన్నారు. విశిష్ట అతిథిగా అమెరికా నుండి పాల్గొన్న గురజాడ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రకాశిక త్రైమాసిక అంతర్జాల పత్రిక ప్రధాన సంపాదకులు మాట్లాడుతూ గురజాడ వారి జయంతులు, వర్థంతులు జరుపుకోవడమే కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన ఉద్బోధించారు. ఈ సదస్సు ప్రధానంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నంందుకు సంతోషంగా ఉందన్నారు. తర్వాత జరిగిన రెండు సమావేశాల్లో ఆచార్య రెడ్డి శ్యామల, డా.కోయికోటేశ్వరరావు, డా.ఎన్.రజని, డా.ఎన్.మృదుల, డా.పి.నీరజ వివిధ అంశాలపై పత్రాలు సమర్పించారు. తొలిరోజు ముగింపు సమావేశానికి ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా హెచ్ సియు ప్రొ-వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్. ఎస్. సర్రాజు మాట్లాడుతూ గురజాడ విశ్వమానవ వాది అని అన్నారు. తాను రాయవరం గ్రామానికి  చెందినవాడిననీ, గురజాడ భాషలోని వ్యంగ్యాన్ని సోదాహరణంగా వివరించారు. తాను మొట్టమొదటి సారిగా గురజాడ పైనే వ్యాసాన్ని రాశానని గుర్తుచేశారు. సమాపన ప్రసంగం చేసిన సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ అధ్యక్షులు ఆచార్య కె.సునీతారాణి మాట్లాడుతూ ప్రజల భాషల్లో విద్యాబోధన ఉండడం వల్ల‌ అనేకప్రయోజనాలు ఉన్నాయని గురజాడ భావించారని వివరించారు.ఆంగ్లంలోని షేక్స్పియర్, జార్జి బెర్నార్డ్ షాహెన్రీ క్రిప్షన్ లాంటి  వారి ప్రభావం కనిపిస్తుందన్నారు. సమాజంలోని రుగ్మతలను‌ నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళారని ఆమె చెప్పారు. ఆ దిశగా తురునాత్మక అధ్యయనాలు జరగవలసిన అనేక అంశాలను ఆమె ప్రస్తావించారు. విశిష్ట అతిథిగా ఆచార్య అయినవోలు ఉషాదేవి మాట్లాడుతూ  గురజాడ భాషాప్రయోగాల్లోని ప్రత్యేకతను వివరించారు. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబంలో వ్యవహారంలో ఉండే మాండలిక భాషగా చెప్తున్నారనీ, దాన్ని లోతుగగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఈ ముగింపు సదస్సు సమావేశానికి ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహిస్తూ గురజాడ పూర్ణమ్మ గేయాల్ని రాగయుక్తంగా ఆలపిస్తూ విశ్లేషించారు. కరుణరసభరితంగా ఆలపించిన ఆ గేయాలు ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేశాయి.ఈ సదస్సులో వివిధ సమావేశాలకు ఆహ్వానం, వందన సమర్పణ, సమావేశ కర్త లుగా ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, డా.భూక్యతిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి వ్యవహరించారు. ఈ సమావేశాల నిర్వహణలో , డా.శంకర్ అనంత, డా.సంగీతరావు, డా.రాగ్యానాయక్, మధుసూదన్ , దయాకర్, నవీన్ , టెక్నికల్ ఇంజనీర్ కుమారి మాలిని సహకరించారు. ప్రముఖ సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















18 జులై, 2023

కీ.శే.డా.నాగప్పగారి సుందర్ రాజు గార్కి, దళిత విద్యార్థి సంఘం (డియస్ యు, హెచ్ సియు) నిర్వహించిన వర్థంతి కార్యక్రమం

 



నాగప్పగారి సుందర్రాజు సేవలు చిరస్మరణీయుడు



ప్రముఖ రచయత, ఉద్యమ కారుడు డా. నాగప్పగారి సుందర్రాజు గారి దళిత సాహిత్యానికి చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ  సుందర్రాజు గారి 23 వ  వర్ధంతి సందర్భంగా సోమవారం  నాడు దళిత విద్యార్థి సంఘం (డి.యస్.యు) హెచ్ సియు వారు స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఘన నివాళి అర్పించారు. సుందర్రాజు చిన్న వయసులోనే  చనిపోవడం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని కూడా అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన చేసిన ఉద్యమాలు నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకమని వక్తలు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య  దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో నాగప్ప గారి సుందరరాజు దళిత సాహిత్య వేదిక, మాదిగ సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారని, దానిద్వారా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ధోరణికి ఆద్యుడు గా నిలిచారని వ్యాఖ్యానించారు, ఆయన సంపాదకత్వంలో వెలువడిన మాదిగ చైతన్యం‌ కవితా సంకల్పం కిందివర్గాలలో గొప్ప ఆశను కలిగించిందని అన్నారు. అలాగే ఆయన రాసిన మాదిగోడు కథలు తెలుగు సాహిత్యంలో మాండలిక భాషకు, ప్రాదేశిక చైతన్యానికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు. తులనాత్మక అధ్యయన కేంద్రం అధ్యక్షులు ఆచార్య భీమయ్య మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సుందర్ రాజుకు విశేషమైన స్థానం ఉందని అన్నారు. ఆయన కథలు ఆయన సాహిత్యం వివిధ భాషల్లోకి అనువాదం అయ్యాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  నాగప్ప గారి సుందర్రాజు గారి  సాహిత్యం గురించి తెలియజేస్తూ  దళిత  ఔన్నత్యం కోసం పోరాడిన వ్యక్తి అని, విశ్వ విద్యాలయాలలో విద్యార్థి ఉద్యమాలకు బాటలు వేసి, దళిత విద్యార్థి రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన సామాజిక ఉద్యమకారుడు అని దళిత విద్యార్థి సంఘం అధ్యక్షులు వేణు వివరించారు. మాదిగ జీవితాలను, మాదిగల సాంసృతిక జీవితాలను అక్షరీకరించిన రచయిత డా. సుందర్రాజు అని ఆయన కొనియాడారు.  ఈ కార్యక్రమంలో డి.ఎస్.యూ అధ్యక్షులు వేణు, కన్వీనర్ కుమార్ రాజ, సిలపాక వెంకటాద్రి, కమలాకర్, రాణాప్రతాప్, చరణ్, సందీప్, మిగతా డి.ఎస్.యూ  విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


కీ.











నిన్న (17.7.2023) జరిగిన కీ.శే.డా.నాగప్పగారి సుందర్ రాజు గార్కి, దళిత విద్యార్థి సంఘం (డియస్ యు, హెచ్ సియు) నిర్వహించిన వర్థంతి కార్యక్రమాన్ని పత్రికల వారు బాగా ప్రచురించారు. వారందరికీ ధన్యవాదాలు.


01 మార్చి, 2023

Darla Venkateswara Rao Presented a paper on Telugu Dalit Poetry -Dr.B.R.Ambedkar Ideology







హిందీ శాఖ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు 01-3-2023 వ తేదీన  ' భారతీయ సాహిత్యమే అంబేద్కర్ వాదీ చేతనా' అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.



ఈ సదస్సులో తెలుగు శాఖ  అధ్యక్షులు, మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ కి చెందిన  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'తెలుగు దళిత కవిత్వంలో అంబేద్కర్ భావజాల ప్రభావం' అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. ఈ సదస్సుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కి చెందిన ఆచార్య షకీలాఖనమ్  అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, హిందీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ జివి రత్నాకర్ సదస్సు సంచాలకులుగా వ్యవహరించారు. 


05 ఫిబ్రవరి, 2023

బైండ్ల సెంద్రయ్య కథలు పుస్తకంపై సాహితీ గోష్ఠి







 ఈరోజు (4.2.2023) సాయంత్రం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో డా. జిలకర శ్రీనివాస్ కథల సంపుటి బైండ్ల సెంద్రయ్య కథలు పుస్తకంపై సాహితీ గోష్ఠి జరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయం సోషల్ సైన్సెస్ డీన్, ఆచార్య సూరేపల్లి సుజాత, ప్రముఖ సాహిత్య విమర్శకులు డా. ఏ. కే. ప్రభాకర్, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా.గడ్డం మోహనరావు, పుస్తక రచయిత డా.జిలుకర శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైండ్ల కులస్తులను మాదిగలకు ఆశ్రిత కులాలని అనాలా? మాదిగలకు ఉప కులాలు అనాలా? ఉత్పత్తి కులాలు అనడం సమంజసమేనా? జిలుకర శ్రీనివాస్ తను చెప్పిన కొన్ని భావాలు తనకు తానే ఖండించుకున్నట్లు కొన్ని చోట్ల కనిపించడం లేదా? బైండ్ల చంద్రయ్య త్రాచుపామును కూడా నిలబెట్టి దాన్ని తన చూపులతో, మాటలతో వెనుకకు పంపగలిగిన శక్తి కలిగిన వాడని చెప్తూనే ఒక స్త్రీ విషయంలో అక్రమ సంబంధానికి ఎలా లొంగిపోయాడు? బైండ్ల వాళ్లు పూజలు చేసేటప్పుడు స్త్రీల ఎదపై పసుపు చల్లడం ఎక్కడైనా జరుగుతుందా? ఈ కథలలో స్త్రీలకు తగిన ప్రాధాన్యత లభించిందా? ఈ బైండ్ల చంద్రయ్యే జిలుకర శ్రీనివాస్ అవుతాడా? లేక మరొక ఏదైనా పాత్ర ఉంటే ఆ పాత్రకు సంబంధించిన చైతన్యాన్ని ఈ రచయిత బైండ్ల చంద్రయ్యగా మనముందుంచాడా? అసలు ఇవి రాసిన కథలా? చెప్పిన కథలా? ఇలా ఈ కథలపై లోతైన చర్చ చేశారు. వీటికి తమకు తోచిన కొన్ని సమాధానాలతో సభాధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, చర్చలో పాల్గొని ఈ కథలను ఎలా చదవాలో శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేసిన డాక్టర్ ఏకే ప్రభాకర్ ఈ కథల్లోని కొన్ని కోణాలను చర్చించారు. చివరిలో వీటి నేపథ్యాన్ని అంతటినీ జిలకర శ్రీనివాస్ చక్కగా వివరించాడు.


ఈ కార్యక్రమాన్ని దళిత విద్యార్థి సంఘం వారు నిర్వహించారు. వెంకటాద్రి, సందీప్ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయం చేశారు. ఇతర సభ్యులు కార్యక్రమం విజయవంతం కావడానికి బాగా కృషి చేశారు.



28 డిసెంబర్, 2022

ప్రముఖ భాషా శాస్త్రవేత్త వేత్త సురేశ్ కొలిచాల గారి ప్రసంగం

ఆర్థిక అవసరాలతోనే తెలుగు భాషాభివృద్ధి

  • ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా.సురేశ్ కొలిచాల వ్యాఖ్య.


ఆధునిక అవసరాలకు తగిన పదజాల రూపకల్పన జరగాలనీ, ఆర్థిక అవసరాలు కూడా భాషా వినియోగానికి ఉపయోగ పడేలా తెలుగు భాషాశాస్త్ర వేత్త లు కృషి చేయాలని ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ సురేశ్ కొలిచాల ( యు.ఎస్.ఏ) ఉద్బోధించారు. మంగళ వారం నాడు (27.12.2022) తెలుగు శాఖ, మానవీయ శాస్త్రాల విభాగం వారు ఎం.ఏ.తెలుగు, విద్యార్థులు, పరిశోధకుల కోసం 'గత వందేళ్ళ తెలుగు భాషా వికాసం ' అనే ప్రత్యేక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు .

ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తెలుగు భాష విస్తృతంగా వ్యాపించడానికి యూనికోడ్ ప్రాచుర్యంలోకి రావడానికి కృషి చేయాలని డా. సురేశ్ కొలిచాల అన్నారు. తన ఉపన్యాసాన్ని పవర్ పాయింట్ ద్వారా వివరించారు.

డా. బాణాలు భుజంగరెడ్డి ఈ ఉపన్యాస ప్రాధాన్యాన్ని వివరించి, వక్తను పరిచయం చేశారు. ప్రసంగం అనంతరం అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో తెలుగు భాషాభివృద్ధికి చేయాల్సిన పనులు గురించి చర్చించారు. 

 సినిమా, వ్యాపారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో తెలుగు భాషా వ్యవహారాన్ని ఆర్థికాంశంగా మార్చలగలగాలి అన్నారు. 

ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య డి. విజయలక్ష్మి, డాక్టర్ భూక్య తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





తరుణం దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 

జనప్రతిధ్వని దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 


తెలుగు న్యూస్ టైమ్ దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 


భూమిపుత్ర దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 



నమస్తే దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 

సాక్షి దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 


ఈనాడు దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 


ఆంధ్రజ్యోతి దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 


నవతెలంగాణ దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 


జనం న్యూస్ దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 


నమస్తే తెలంగాణ దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో 

దిశ దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో