ఆర్థిక అవసరాలతోనే తెలుగు భాషాభివృద్ధి
ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా.సురేశ్ కొలిచాల వ్యాఖ్య.
ఆధునిక అవసరాలకు తగిన పదజాల రూపకల్పన జరగాలనీ, ఆర్థిక అవసరాలు కూడా భాషా వినియోగానికి ఉపయోగ పడేలా తెలుగు భాషాశాస్త్ర వేత్త లు కృషి చేయాలని ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ సురేశ్ కొలిచాల ( యు.ఎస్.ఏ) ఉద్బోధించారు. మంగళ వారం నాడు (27.12.2022) తెలుగు శాఖ, మానవీయ శాస్త్రాల విభాగం వారు ఎం.ఏ.తెలుగు, విద్యార్థులు, పరిశోధకుల కోసం 'గత వందేళ్ళ తెలుగు భాషా వికాసం ' అనే ప్రత్యేక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు .
ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తెలుగు భాష విస్తృతంగా వ్యాపించడానికి యూనికోడ్ ప్రాచుర్యంలోకి రావడానికి కృషి చేయాలని డా. సురేశ్ కొలిచాల అన్నారు. తన ఉపన్యాసాన్ని పవర్ పాయింట్ ద్వారా వివరించారు.
డా. బాణాలు భుజంగరెడ్డి ఈ ఉపన్యాస ప్రాధాన్యాన్ని వివరించి, వక్తను పరిచయం చేశారు. ప్రసంగం అనంతరం అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులతో తెలుగు భాషాభివృద్ధికి చేయాల్సిన పనులు గురించి చర్చించారు.
సినిమా, వ్యాపారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో తెలుగు భాషా వ్యవహారాన్ని ఆర్థికాంశంగా మార్చలగలగాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య డి. విజయలక్ష్మి, డాక్టర్ భూక్య తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భూమిపుత్ర దినపత్రిక, 28.12.2022 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి