నెమలికన్నులు-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ఆత్మకథ... పల్లిపట్టు నాగరాజు, 29.9.2023
ఇది ఆచార్య దార్ల గారి జీవితగాథ మాత్రమే కాదు.నాలుగు దశాబ్దాల తెలుగు సమాజపు చరిత్ర కూడా.!
చదువుతూ చదువుతూ మనమూ...
ఆ ఊళ్లలోకి,చేలల్లోకి,ఆ వీధుల్లోకి,ఆ వాడల్లోకి వెళ్ళిపోతాము.అక్కడ కాయకష్టం చేస్తున్న తల్లులతో, తండ్రులతో,మాట్లాడి వస్తాము,అమాయక చూపుల బాల్యపుసైకిలు చక్రం వెంటనో,పుస్తకాలు పట్టుకుని వెళ్తున్న పాదాల వెంటనో పరిగెడుతాము.
కన్నీళ్లు, కష్టాలేనా,ఆత్మాభిమానవు కలలూ పలకరిస్తాయి.ఆత్మగౌరవాన్ని గుండెలనిండా నింపుకొని నడిచిన దారులు పిలుస్తాయి.
దశాబ్దాల దళితవాడల కథలు,వ్యధలు అమాయకంగా చూసే నెమలికన్నుల బాల్యం ముందు కదలాడుతూ మనతో సంభాషిస్తాయి.
ఇది ఒక వ్యక్తి ఆత్మకథ మాత్రమేకాదు.ఆంధ్రదేశపు దళితుల చరిత్ర,ఆత్మగౌరవాన్ని దివిటీగా చేతబట్టి ఎక్కడో మారుమూల ఊరినుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ దాకా నడిచిన బతుకు పోరాట యోధునిగాధ. అక్షరమే ఆయుధంగా గెలిచిన నిలబడ్డ విద్యావంతునికథ.
స్ఫూర్తిని,ప్రేరణను,చేతనను అందించే కథ.సాహితీ చరిత్రలో నిలిచిపోయే నిత్యసాహిత్యకారుని,
ఆచార్యుని నిండైన ఆత్మవిశ్వాసపు కథ.
చదువుతూ చదువుతూ...వాక్యాల వెంట పదాల వెంటా కదులుతూ కదులుతూ ఇలా నాలుగు వాక్యాలయ్యాను..!
ఆత్మీయంగా నెమలికన్నులు పంపిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.నమస్సులు.💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి