"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

30 సెప్టెంబర్, 2020

మాదిగ మూలాల్ని మరిచిపోని కవి ‘ఎజ్రాశాస్త్రి’ ( 30.9.2020, భూమిపుత్ర దినపత్రికలో ప్రచురితం)

 



‘‘చెప్పు నా జాతి జెండా

డప్పు నా అజెండా

చర్మం నా తంత్రి

నూరు కోట్ల పాదాలలో నుండి

మృత్యుంజయుడనై లేచిన వాడిని! నేను మాదిగోడిని’’ అని సాహిత్యం ద్వారాను, ఉద్యమాల ద్వారా కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో పయనిస్తూ, తాను చేసే ప్రతి పనిలోనూ తన బతుకు మూలాల్ని మరిచిపోని కవి దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి. ఈయన పేరు రికార్డ్సులో ‘దుగ్గనపల్లి ఎజ్రయ్య’ అని ఉంటుంది. కానీ, తాను చదువుకోవడానికి సహకరించి,  ఎంతగానో ప్రోత్సాహించిన తన ఒక గురువు తెలుగు పండితుడు ’’శాస్త్రి’’ గారి పేరుని తన పేరులో పెట్టుకొని శాశ్వతంగా గురువుగారి ఋణాన్ని తీర్చుకున్నారు. అప్పటి నుండి నేటి వరకూ తన పేరు ఎజ్రాశాస్త్రిగానే కొనసాగించారు. ‘‘ఒక సారి మా జూనియర్ కాలేజీ వార్షికోత్సవానికి  ఎస్.టి జ్ఞానానంద కవిగారు ముఖ్య అథిధిగా వచ్చారు ఆయనను ఉద్దేశించి కవిత రాసి చదివాను. అప్పుడు ఆయన నా తల నిమిరి భవిష్యత్ లో గొప్ప కవివవుతావోయ్ అని దీవించారు. అప్పటినుండి మా క్లాస్ మాష్టరు సవరపు ఆశీర్వాదంగారు. నా సహవిద్యర్దులు వొరే కవీ అని పలిచేవారు’’ అని తాను కవిగా మారడానికి గల నేపథ్యాన్ని ఈ వ్యాసకర్తకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు ఎజ్రాశాస్త్రి. ఆ విధంగా కవిత్వం పట్ల అభిలాష పెరిగి శ్రీశ్రీనీ, జాషువానీ బాగా చదువుకున్నారు. విద్యార్థి దశనుండే నాయకత్వ లక్షణాలుగల ఎజ్రాశాస్త్రి మొదట్లో పిడియస్ లోపనిచేసినా, తర్వాత దళిత సంఘాల్లో పనిచేశారు. ఆ పోరాటపటిమే నేటికీ మాదిగ హక్కుల కోసం పనిచేసేలా చేస్తుంది. ఆ నేపథ్యమే నేటికీ తన జాతి జీవితాన్ని సాహిత్యీకరించేలా ప్రేరేపిస్తుంది.

 

ఈమధ్య కరోనా నేపథ్యంలో ఎజ్రాశాస్త్రిగారు ‘రోడ్లు చిగురించాలి’’ పేరుతో రాసిన ఒక కవిత  ప్రథమ బహుమతి పొందింది. అది ఈనాడు మెయిన్ పేజీలో ప్రచురితమయ్యింది.  ఆ కవితను ప్రముఖనేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ఇష్టపడి చదివి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కవితలో కూడా మాదిగజీవితాన్ని వర్ణించకుండా వదల్లేదు ఎజ్రాశాస్త్రిగారు. ‘‘బతుకు రోడ్డు కోటి వ్యాపారాల కూడలి

మనషన్న వాడికి

రోడ్డే జీవనాధారం

ఫుట్‌పాత్‌ మీద చిల్లులుపడ్డ గొడుగు

గొడుగు కింద బడుగు

అతగాడి ఉనికేదిప్పడు!?

నాలుగు పాదాలకు

పాలిషైతేనే కదా కుటుంబం కడుపునిండేది,

ఇప్పుడు ఇంట్లో

దారాన్ని పెనవేస్తున్నాడు రేపటి

తెగిన చెప్పుకోసం!

మనకు కనిపించదు కానీ

రోడ్ల మీద కూడా బతుకు మొలుస్తుంది, చిగురిస్తుంది’’ అని రోడ్లు పక్కన చెప్పులు కుట్టుకునే మాదిగల జీవితాన్ని వర్ణించారు ఎజ్రాశాస్త్రి.  దీన్ని ఏప్రిల్ 30, 2020 వతేదీన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారే స్వయంగా తన ఫేస్ బుక్ వాల్ లో ప్రచురించారు.

 

1995లోప్రకాశం జిల్లా కనిగిరిలోమందా కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రిలే నిరహార దిక్షల్లో కూడా పాల్గొని, నాటి నుండి నేటి వరకూ మాదిగల కోసం పనిచేస్తూనే ఉన్నారు.

 

ఎజ్రాశాస్త్రి 1జూలై1962 న శ్రీమతి సంతోషమ్మ శ్రీరాజు దంపతులకు ఎర్రఓబెన్నపల్లి గ్రామం, కనిగిరి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన తండ్రి రాజుగారు పద్యకవిత్వాన్ని కూడా రాసేవారు. ఎజ్రాశాస్త్రి వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగి, ఇరిగేషన్ శాఖలో పనిచేస్తుంటారు. కానీ, ప్రవృత్తి మాత్రం చక్కని సాహిత్యాన్ని రాయడం. ప్రముఖ దినపత్రికలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, సూర్య, మనం, సాక్షి తదితర పత్రికలన్నింటిలోనూ ఆయన రాసిన వ్యాసాలు, కవితలు ప్రచురితమయ్యాయి. తన జాతి గురించెవరైన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినా, వక్రీకరించినట్లనిపించినా వెంటనే ప్రతిస్పందిస్తూ ఖండన లేదా వివరణాత్మకంగా వ్యాసాల్ని రాస్తుంటారు. తాను పుట్టి పెరిగిన మాదిగ జాతి పరిమళాల్ని సాహిత్యమంతా పరుచుకున్నప్పటికీ, దళితులంతా ఏకమైన నాడే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని నమ్మే దార్శనికుడు.

 ‘‘బువ్వొద్దు భూమికాలి

రాయతీలోద్దు రాజ్యం

కావాలి ఇస్తావా !?’’ అని ఏరువాకై తిరిగి లేస్తా (కవితా సంకలనం -  2006)అనే కవితాసంకలనంలో రాయగలిగారు.  తన బిడ్డ తల్లి అయినప్పుడు రాసుకున్న కవితలో ఒక తండ్రి స్పందన అద్భుతంగా పలికించి చక్కని అనుభూతి కవిత్వం కూడా రాయగలనని నిరూపించుకున్నారు.

‘‘తన చిట్టి పాదాలతో

నా గుండెల మీద

నడుస్తుంటే, నా శ్వాస

సముద్రకెరటమై ఉప్పొంగేది’’ అని అలా ఆడపిల్లని ఆడిస్తూ గుర్రంలా, ఏనుగులా ప్రతి తండ్రీ మారినట్లే తానూ మారినా కాలం గడిచే కొద్దీ ఆ పిల్ల వయసులో కొచ్చేసరికి తండ్రి  ఎలా ఫీలవుతాడో వర్ణిస్తూ

‘‘కాలంతో పాటువయస్సు తనను

వరదలా ముంచెత్తింది

మా ఇద్దరి మధ్య ఏదో

తెలియని తెర ఏర్పడింది’’ అని చక్కని అనుభూతితో తడిసిపోతారు కవి.

 

అందుకే ఒకవైపు మాదిగ, అనుబంధ కులాలతో పాటు షెడ్యూల్డు కులాలలోని అన్ని ఉపకులాలవారికి రాజ్యాంగం ప్రకారం దక్కవలసిని రిజర్వేషన్లు సమానంగా దక్కాలని భావిస్తుంటారు కవి.. అందుకు జరిగే ఉద్యమాల్లో క్రియాశీలంగా కూడా పాల్గొంటారు కవి.. మాదిగ హక్కుల కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు కవి.. మాదిగ ఉద్యమానికీ, సాహిత్యానికి కావలసిన తాత్త్విక ధారను అందించడంలో, మాదిగ సాహిత్యంలో మాదిగల సంస్కృతిని, దానిలోని ఔన్నత్యాన్ని వర్ణించడంలో ఎజ్రాశాస్త్రి పాత్ర చిరస్మరణీయమైంది.

''కర్రముక్కకదా అనుకుంటే పొరపాటే

 ఆకులు వలువలు ధరిస్తే, మహారణ్యం!,

ఆకులు విదిల్చిచేతే ఒక మహా సింహాసనం’’  అనీ ‘‘చర్మం తో చేయికలిపి దమనకాండ దౌర్జన్యాలపై దండోరా వేస్తా’’ నంటారు కవి. కర్రముక్క ( దీర్ఘకవిత -2005)లో. ఎజ్రాశాస్త్రి కవిత్వాన్ని ప్రముఖ విమర్శకుడు శ్రీరామకవచం సాగర్‌ వ్యాఖ్యానిస్తూ                    ‘‘ కవిత రాయట ద్వారా అతను రెండు ప్రయోజనాలు సాధిస్తున్నారు. ఒకటి అతని రచన సూటిగా వుంటుంది. రెండు అస్పష్టత ధరి దాపులకు వెలకుండా సూటిగా పాఠకుడికి అనుభూతిని ప్రసాదిస్తుంద’ని అంటారు .   నిప్పుల్లో నడిచే తప్పెట (దీర్ఘకవిత -  2008),  మా ఎర్రఓబన్నపల్లె (నవల 2018), పంచమాగ్ని, ఉత్తర కవితా సంపుటాలు. ఇంకెంతదూరం కవిత్వం, కథలు ,వ్యాసాలు రాశారు. వీటితో పాటు ముద్రణలో ఉండి, త్వరలోనే రాబోతున్న ‘చంద్రవంక’ నవల మొదలైన రచనలన్నీ ఎజ్రాశాస్త్రి గారి మాదిగల పట్ల గల నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఎజ్రాశాస్త్రి గారి రచనలపై అనేకమంది వ్యాసాలు రాశారు కవి.. ముఖ్యంగా ఆయన రాసిన ‘మా ఎర్రఓబెన్నపల్లె నవల దళితుల్లో మాదిగల ఆత్మగౌరవాన్ని నిలిపేనవల. కళ్యాణరావు ‘అంటరానివసంతం’ నవలలో మాలల్ని, మాదిగల్ని కలిపి వర్ణిస్తూనే మాలల సంస్కృతినీ, వారి అంటరానితనాన్నే ఉన్నతీకరించడం కనిపిస్తుంది.కానీ, ఎజ్రాశాస్త్రి మాదిగల ఆత్మగౌరవపోరాటాల్ని, భూమికోసం చేసిన పోరాటాల్ని ప్రతీకాత్మకంగా వర్ణిస్తుంది. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న నవల అందరు చదువుతున్న నవల. వివిధ పత్రికలలో, సామాజిక మాద్యమాలలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నవల "మా ఎర్ర ఓబన్న పల్లె" అని ప్రముఖకవి వనపట్ల సుబ్బయ్య ఈ నవల గురించి తన ఫేస్ బుక్ లో రాసుకున్నారు. ‘‘ఏడు తరాల అనామక మాదిగ జీవితాన్ని చాటింపు వేస్తున్న నవల. ఒక స్వతంత్ర వస్తువు, శిల్పం ,చరిత్ర లతో సాగిన నవల. రచయిత నవలలో తన మూలలను వెతుకున్న తీరు చాలా గొప్పగా ఉంది. అడుగడుగునా నవల మాదిగ వాసన వొచ్చింది. అభూతకల్పనలు కాకుండా జీవితాన్ని ఒక దృశ్య కావ్యం లాగా నవల చూయించిన తీరు ఆమోఘం. మా ఎర్ర ఒబాన్నపల్లె  చదువుతున్నంత సేపు మా గుడిపల్లి లోని మా తాతల చరిత్ర ను చదువు తున్నట్లు అనిపించింది. నా చరిత్రలాగే  ...నాలోకి నేనే చూసుకున్నట్లు ఉంది. మాదిగల జీవితాల మీద ఎన్ని కుట్రల చీకటి కోణాలు కప్పిన సగర్వమైన చరిత్ర మా మాదిగ జాతిది అని ఈ నవల నిరూపించింద’’ని ఈ నవల గురించి ప్రముఖ విమర్శకుడు గుడిపల్లి నిరంజన్ వ్యాఖ్యానించడం వాస్తవాన్ని సరిగ్గా అంచెనా వేసినట్లే.

 

మాదిగల గురించి కవిత్వం రాయడమే కాదు, మాదిగల గురించి వచ్చిన రచనల్ని పరిచయం చేయడానికి కూడా సమీక్షకుడిగా, మాదిగల జీవితాన్ని, సాహిత్యాన్ని వక్రీకరిస్తే దాన్ని శక్తివంతంగా ఎదుర్కొనే విమర్శకుడిగా కూడా ఎజ్రాశాస్త్రి పలు పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు కవి.. ఆత్మకూరి చెన్నయ్య రాసిన ‘‘ బహుజనులకు రాజ్యాధికారవేు లక్ష్యంగా జీవించిన మాన్సశ్రీ కాన్సీరామ్  పోరాట జీవితం’ గ్రంథాన్ని సమీక్షిస్తూ  మెజారిటి పీడితులు చిన్న చిన్న కులాలుగా విడిపోయి సంఘటిత శక్తిగా పోరాడే వీలు లేనపుడు వీరందరిని ఏకంచేసి బహుజన సిద్దాంతం ద్వారా రాజ్యాధికారంవైపు నడిపించడానికి ముందుకు సాగిన వ్యక్తి గా కాన్షీరామ్ జీవితపోరాటాన్ని చక్కగా రాసారని, కావ్య లక్ష్యాన్ని పట్టుకుంటారు కవి.. వ్యాసం చివరిలో

‘‘ఇప్పుడు పార్లమెంటు భవనం కూడా

 నాకు నా మాదిగ పల్లెలా కనబడుతుంది.

 మా వూరి ఆసామి

 నా తప్పెట ముందు చిందేసినట్లుంది

 ఎండు తునకల జండా

 పార్లమెంటు భవనం మీద

 ఎగరేసనంత సంబంరంగా ఉంద’’ తనకవితాత్మక పంక్తులతో తనదైన ముద్రవేస్తారు కవి..  దార్ల వెంకటేశ్వరావు రాసిన ‘నెమలికన్నులు’ కవిత్వం గురించి సమీక్షా వ్యాసం (ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం, 4 ఏప్రిల్ 2016) రాస్తూ ‘‘దార్ల విద్యార్థి దశ నుండే కవిత్వం రాయడం ప్రారంభించారు. ఈయనకు కవిత్వం కొత్తకాదు. కవిత్వంతో పాతికేళ్ళ అనుబంధం ఉంది. పరిచయాలు అక్కరలేని వ్యక్తి. వస్తువు, శిల్పము, ఎత్తుగడ, ముగింపులలో ఎక్కడా రాజీపడరు. దార్ల వెంకటేశ్వరరావు కవిత్వం వేరు. జీవితం వేరు కాదు జీవితమే కవిత్వమైనవారు. జీవితాన్నే కవిత్వీకరించినవారు’’ అని వ్యాఖ్యానించి, దార్ల రాసిన మాదిగ మ్యానిఫెస్టో కవితలో ఒక అంటరానివాడు ఇంకొకరిని అంటరానివారిగా చూడటం ఎంత విడ్డూరం/ అంటరానితనంలో/ మళ్ళీ అంటరాని తనం పెంచే/ ఇంటర్‌ సుపీరియారిటీ భరించలేక/ అంతరాంతరాల్లోని అగ్నిపర్వతం పగిలిందిప్పుడే. వామపక్షాలు, స్త్రీవాదం, మావోయిజం, మార్క్సిజం, ట్రాన్స్‌జండర్‌, పాలస్తీనా, అన్నీ వాదాల్లో ముందుండి ప్రపంచ రాజకీయాలదాకా మాసోదరులు మాట్లాడుతుంటారు. వర్గీకరణ వాదం వచ్చేసరికి మాట దాటవేస్తారు. అందితే స్వజాతినే తినేస్తున్న అవకాశవాద కొరమీనుల సమూహం పాడిన/ సమైక్యతా గీతాలనూ విన్నాను. మాదిగ మానిఫెస్టోలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌లా ధవళ వస్త్ర జిలుగుల్ని మెరిపించడం దళితులంతా బాబు జగజ్జీవన్‌రామ్‌లా అధికారంతో పోటీపడటం, మహాకవి గుర్రం జాషువాలా కమ్మని కావ్యాన్నాలపించండి అంటూ ఓ మంచి సందేశాన్నిచ్చాడ’ని వ్యాఖ్యానించారు. ఇలా ఒక విమర్శకుడిగా రాసినా తన జాతి వేదనను మరిచిపోని వారు ఎజ్రాశాస్త్రి.

 

ఈ మధ్య ఎజ్రాశాస్త్రి రాసిన ఒక కవిత మాదిగల ఔన్నత్యాన్ని, ఆత్మాభిమానాన్ని ఎంతో ఉదాత్తంగా ప్రకటితమైంది. కవిత పేరు ‘‘ప్రపంచ చెప్పుల ఘోష!’’ ఈ కవిత చూద్దాం.

‘‘జతలు, జతలుగా ఉండాల్సిన చెప్పులు

సైజుల తేడాలతో చెల్లాచెదురుగా

పడి ఉన్నాయి

ఎక్కడ చూసినా ఒక చెప్పే

రంగుల్లో తేడాలే కాని అన్నీ చెప్పులేగా

కొన్ని కొత్తచెప్పులుకూడా ఉన్నాయి

ఎంత వెదికినా జోడీ దొరకడం లేదు

వీళ్ళంతా ఏమయినట్టు !?

పోని ఇది గుడో ,బడో ,చర్చో ,మజీద్

అనుకుందామంటే అదీ కాదు

అంతా మనుషులు తిరగాడే నేలే

 ఒక చెప్పుతో నడక సాగుద్దా అంటే

అదీ కాదు!

దేహాలు అదృశ్యమై చెప్పులు

వదిలేసుంటారు ,మరలా తిరిగొస్తే కదా!

వాళ్ళ చెప్పులు  భద్రంగా గూట్లో

దాచుకొనేది ,ప్రాణం వదిలేసీ దేహంతో

వెళ్ళుంటే చెప్పులు వేసుకోవాలి కదా ?

మర్చిపోయుంటారు కాబోలు

 జీవం లేదు వీటికి ఉంటే ఒంటరి చెప్పు

జతకలిసేది జతలేకుండా జీవితం

గడిచేది ఎట్టా అని !

పాలీష్ లేదనో ,తెగిపోయిందనో

రోడ్డుపట్టుకు తిరిగే ఆ మనుషులు లేరు

కుక్కలెత్తుకు పోతాయని ఎంత బధ్రంగా

దాచుకునే వాళ్ళు ఇప్పుడవి యజమాని

పాదాల కోసం పరితపిస్తున్నాయి

వేలకు వేలు' బెట్టి కొని "వేలు" కూడా దూర్చలేదు

వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయారు చెప్పులు

కొత్తవి కదా ,ప్రాణంలా చూసుకొనే వాడు

చెప్పులు మిగిలాయి ప్రాణం పోయింది.

కొన్ని చెప్పులు కరుస్తుండేవి

కొన్ని సైజలు సరిపోక  అవే ఇరికుంచుకొని

తిరిగే వాడు, వాడు ఇప్పుడేడీ

చెప్పులున్నాయిగానీ మనిషిలేడు

అయినా బతికున్నప్పుడు

ఉచ్ఛ నీచాలు చెప్పుతో పోల్చేవాడు

చెప్పు బతికే ఉంది మనిషి కనబడటం లేదు

పసుపు పారాణికూడా ఆరలేదు

ప్రయాణమయ్యాడు చెప్పులు

మర్చిపోయాడు !!

ప్రపంచమంతా మనుషులకంటే

చెప్పులే ఎక్కువ !,జతలేని

చెప్పులే ఎక్కువ’’ ఈయన జీవితాన్ని, రచనలను పరిశీలిస్తే దళితసాహిత్యంలో గానీ, మాదిగ సాహిత్యంలో గానీ, యావత్తు తెలుగు సాహిత్యంలోగానీ ఒక చెరపలేని సంతకం ‘ఎజ్రాశాస్తి’ అని అభివర్ణించుకోవచ్చు. అయితే ఈయన పై పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధన పత్రాలను రాస్తున్నారు. కానీ ప్రభుత్వపరంగా కూడా తగిన గుర్తింపు రావలసిన  అవసరం ఎంతైనా ఉంది.

 

 -      ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్.

 

 

 

( 30.9.2020 భూమిపుత్ర పత్రికలో ప్రచురితం)


28 సెప్టెంబర్, 2020

భావవిప్లవాన్ని రగిలించిన విశ్వమానవకవి గుర్రం జాషువా ( 28.09.2020. Andhra Loyala College Special Lecture)


అంతర్జాలం ద్వారా మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

అంతర్జాలం ద్వారా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నప్పుడు పాల్గొన్న శ్రోతలు, ప్రేక్షకలు
తాను పుట్టి పెరిగిన నేలనూ, దేశాన్నీ విస్మరించకుండా భారత దేశ కీర్తి ప్రతిష్టలను మహోన్నత స్థాయికి పెంచిన నవయుగ కవి భావ విప్లవ కారుడు గుర్రంజాషువ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్  దార్ల వెంకటేశ్వరరావు గారు అన్నారు. సోమవారం విజయవాడలోని ఆంధ్ర లొయోల కళాశాల, ప్రాచ్య భాషా పరిషత్ (తెలుగు, సంస్కృతం మరియు హిందీ శాఖలు) ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన అంతర్జాల ప్రత్యేక ప్రసంగానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గుర్రం జాషువ 125 జయంతి సందర్భంగా జాషువ జీవితం, రచనల గురించి ఉపన్యసించారు. తెలుగు శాఖ అధ్యక్షుడు డా.కోలా శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గుర్రం జాషువ పేరు చెప్పగానే గబ్బిలం, ఫిరదౌసి స్మశానవాటిక పద్యాలు, కావ్యాలు మొదలైనవి గుర్తుకొస్తాయనీ,  తెలుగువారి సంస్కృతి భారతీయుల మధ్య సమైక్యత దానితోపాటు సమాజంలో రావాల్సిన సంస్కరణల గురించి జాషువ ఎంతో మానవతా దృక్పథంతో తన రచనలు కొనసాగించారని ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు వ్యాఖ్యానించారు. కేవలం తెలుగువారి కే కాకుండా భారతీయులందరినీ అన్ని వర్గాలకు అన్ని మతాలను ఆలోచింపజేసేలా గుర్రం జాషువా రచనలు చేశారని ఆయన ప్రశంసించారు..ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుర్రంజాషువ గాంధీ బాపూజీ వివేకానంద అంబేద్కర్ తదితరులపై రాసిన రచనలను సోదాహరణంగా విశ్లేషించి జాషువా విశ్వమానవతను వివరించారు. గుర్రం జాషువ తన జీవిత వ్యదనంతా 'నా కథ' ఆత్మకథలో వ్రాసిన అది కేవలం తన ఆత్మకథ గా మాత్రమే కాకుండా ఆనాటి దళితుల సామాజిక జీవన విధానాన్ని వివరించేది గా అభివర్ణించారు. జాషువాకు సాహిత్యంలో కవిగా మంచి పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చింది ఫిరదౌసి కావ్యమనీ, తన జీవిత సంఘర్షణను భారతదేశంలో దళితుల జీవన వ్యధను చిత్రించిన కావ్యం గబ్బిలం అని  ఆయన వివరించారు. (ఈ కార్యక్రమంపై వచ్చిన న్యూస్ క్లిప్పింగులు)

  
ఈనాడు, 30.9.2020 విజయవాడ వారి సౌజన్యంతో... 

సాక్షి, 30.9.2020 విజయవాడ వారి సౌజన్యంతో... 

ఆంధ్రజ్యోతి, 30.9.2020 విజయవాడ వారి సౌజన్యంతో... 

నమస్తే  30.9.2020 హైదరాబాద్ వారి సౌజన్యంతో... 

 ఈ కార్యక్రమంలో పలువురు జాషువ పద్యాలను వినిపించారు.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్  రెవ. ఫా. జి.యం. విక్టర్ ఇమ్మానియేల్ గారు, డాక్టర్ రవీంద్ర బాస్ గారు, డాక్టర్ సహాయం భాస్కరన్ గారు, డాక్టర్ కోలా శేఖర్, డాక్టర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ కృపారావు, శ్రీ గణేష్, శ్రీ వెంకటేశ్వరరావు, స్నేహల్ విమల్  తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యూట్యూబ్ లో ప్రత్యక్షంగా కూడా ప్రసారం అయింది.

27 సెప్టెంబర్, 2020

గుర్రం జాషువా సాహిత్యంపై ఆచార్య దార్ల ప్రత్యేక ప్రసంగం 28.9.2020

 

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 125 వ జయంతిని పురస్కరించుకుని 28.9.2020 వ తేదీన అతిధి ఉపన్యాసం.

వక్త: 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.

నిర్వహణ:
ప్రాచ్య భాషా పరిషత్

తెలుగు శాఖాధిపతి:
డాక్టర్ శేఖర్ కోలా

మరిచిపోలేని తెలుగు కవుల మాటలు

 తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో  చూద్దాం.


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

-దేవులపల్లి కృష్ణ శాస్త్రి


2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

డా.సి.నారాయణరెడ్డి


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

- కాళోజి


4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ 

- నన్నయ


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

-సుబ్బారావు పాణిగ్రాహి


6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ 

-బలిజేపల్లి లక్ష్మీకాంతం


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

-బసవరాజు అప్పారావు


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

-గుర్రం జాషువా


9. ‘‘అత్తవారిచ్చిన 

 నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

- కాళ్ళకూరి నారాయణరావు


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

- దాశరధి


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

-నార్ల వెంకటేశ్వర రావు


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

- తిరుపతి వెంకట కవులు


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

- గురజాడ


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

- గరిమెళ్ళ సత్యనారాయణ


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

- శ్రీనాథుడు


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

- పోతన


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

- గద్దర్


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

- శ్రీ శ్రీ


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 - వెన్నలకంటి


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

- కొనకళ్ల వెంకటరత్నం


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

- అల్లసాని పెద్దన

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

- చేమకూరి వేంకటకవి


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

- త్యాగయ్య


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

- ధూర్జటి


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ 

- బద్దెన


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

- వేమన


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

- కంచర్ల గోపన్న


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

- సుద్దాల హనుమంతు


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

- ఆరుద్ర


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

- వేముల శ్రీ కృష్ణ


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

- త్రిపురనేని రామస్వామి


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

- బాలాంత్రపు రజనీకాంతరావు


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

- అడవి బాపిరాజు


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

- కరుణశ్రీ

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

- గుడ అంజయ్య


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

- అలిసెట్టి ప్రభాకర్


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

- సావిత్రి


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

- ఖాదర్ మొహియుద్దీన్


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

- బాలగంగాధర తిలక్


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

- అన్నమయ్య


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

- ఏనుగు లక్ష్మణ కవి


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

- పాలగుమ్మి విశ్వనాథం


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

- చెలం


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

- విమల

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

-నండూరి సుబ్బారావు


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

- అందెశ్రీ


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

- చెరబండరాజు

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

- కందుకూరి రామభద్రరావు


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

- నందిని సిధారెడ్డి


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

- మిట్టపల్లి సురేందర్



"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)...


వీరినందరినీ మీ పిల్లలకు పరిచయం చేయండి..

26 సెప్టెంబర్, 2020

ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సాహిత్య విమర్శ దృక్పథం- ‘చర్చ‘ వ్యాససంపుటి పై ఆచార్య దార్ల అంతర్జాల పత్రసమర్ఫణ

 

ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సాహిత్య విమర్శక దృక్పథం- ‘చర్చ‘ వ్యాససంపుటి పై  ఈ రోజు ( 26.09.2020) మధ్యాహ్నం మద్రాసు క్రైస్తవ కళాశాల, చైన్నై వారు నిర్వహించిన అంతర్జాల, అంతర్జాతీయ సదస్సులో   చార్య దార్ల  వెంకటేశ్వరరావు పత్రసమర్పణ చేశారు. సాహిత్యాన్ని సృజన చేసేవారికి, పరిశోధకులకు, విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలనేది ఆచార్య రాచపాళెం వారి విమర్శ దృక్పథంగా ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు.



 2008లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ సాహిత్య పురస్కారం పొందిన ‘‘చర్చ’’ వ్యాససంపుటిలో 1988 నుండి 2005 మధ్య కాలంలో రాసిన ముఖ్యమైన 38 వ్యాసాలు ఉన్నాయని, వాటిని విశ్లేషించారు. వ్యక్తిని అంచెనా వేసే వ్యాసాలు, తులనాత్మక విమర్శను తెలియజేసే వ్యాసాలు, పరిశోధన, విమర్శ తీరుతెన్నుల్ని వివరించే వ్యాసాలు అనే మూడు భాగాలుగా వీటిని విభజించుకొోవచ్చని వర్గీకరించారు. ఆచార్యరాచపాళెం గారి విమర్శను అధ్యయనం చేయడం వల్ల సాహిత్యాన్ని విలువ కట్టే సూత్రాలు తెలుస్తాయనీ, పునర్మూల్యాంకనలో ఉన్న శాస్త్రీయత అర్థమవుతుందని ఆచార్యదార్ల పేర్కొన్నారు. ఈ సదస్సుని డాక్టర్ యజ్ఞశేఖర్ నిర్వహించారు. ఈపత్రాన్ని సమర్పించే సమయంలో ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య మేడిపల్లి రవికుమార్, ఆచార్య మాడభూషి సంపత్కుమార్, డాక్టర్ ఎన్. ఈశ్వర్ రెడ్డి, డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు తదితరులు అంతర్జాల సమావేశంలో ఉన్నారు. 





25 సెప్టెంబర్, 2020

నిరంతర శ్రమజీవి మధురగాయకుడు ఎస్సీబాలు

 ప్రముఖగాయకుడు ఎస్పీబాల సుబ్రహ్మణ్యం గారు సుమారు 50 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. కానీ, కరోనా వల్ల నిన్న 24.9.2020 న మరణించారు. ఆయన మరణానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. 

నేను రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు, ఈ నాడు ప్రతిధ్వని కార్యక్రమానికి వెళ్ళినప్పుడు , ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారిని సారధీ స్టుడియోలో చూశాను. ఒక పాటల కార్యక్రమానికి వారం వారం వస్తుంటారని, డబ్బింగ్ పూర్తి చేశాకే వెళతారని ఈటీవీ వారు చెప్పారు. అంత శ్రమపడతారు కనుకనే ఆయనకు అంత పేరు వచ్చిందని అనిపిస్తుంది. ఈ విషయంలో కూడా ఆయన ఎంతోమందికి ఆదర్శనీయులు. 

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్ 

24 సెప్టెంబర్, 2020

'విశ్వర్షి' వాసిలి గారి నేను యౌగిక కావ్యం-సౌందర్యదృక్పథం...(24.9.2020) అంతర్జాల సదస్సులో ఆచార్య దార్ల ప్రసంగం

విశ్వర్షి వాసిలి గారి ‘నేను’ దీర్ఘకావ్యం-సౌందర్య దృక్పథం
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, 
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 019, 
 


‘సౌందర్యం’ అనే పదానికి నిఘంటువుల్లో ‘చక్కదనం, అందం, అలంకారం అనే అర్థాలు ఉన్నాయి. దీన్ని మనం ఇంగ్లీషులో Beauty అనీ, Aesthetic అనీ అంటుంటాం. విద్యాత్మక అధ్యయనాల్లో ఈస్తటిక్స్ అనేది సాధారణంగా కావ్యం లేదా రచనలోని వస్తువు, దాన్ని అభివ్యక్తీకరించిన విధానాల్ని చర్చించే సౌందర్య చర్చగా కొనసాగుతోంది. కానీ, నిజంగా మనిషి ఆలోచించాల్సిన సౌందర్యం భౌతికమైంది మాత్రమేకాదని ‘నేను’ దీర్ఘకావ్యం చదివిన వారికి అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే  దీన్ని విశ్వర్షి వాసిలిగారు ‘‘నేను’’ దీర్ఘ కావ్యంలో ఎలా అభివ్యక్తీకరించారో నాకున్న పరిమిత జ్ఞానంతో ఈ పత్రంలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 
సౌందర్యాన్ని నిర్వచించడంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందుకని సౌందర్యాన్ని నిర్వచించడం కంటే దాని అనుభవించడమే సులభంగా చేయగలుగుతాం అని చాలామంది కళాతాత్వికులు అన్నారు. తెలుగులో సౌందర్యం గురించి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి వారిలో సంజీవ్ దేవ్  ఒకరు. ఒకచోట వ్యక్తిలోని ఆనందం తన బయటి అస్తిత్వంలో గోచరించడమే సౌందర్యం అని సమాధానమిచ్చారు. ఇది మాఘమహాకవి ‘శిశుపాలవధ’ కావ్యంలో…
 ‘‘శనై: శనై: యన్నవతా ముపైతి 
తదేవ రూపం రమణీయతాం’’ అనే శ్లోకంలోని భావమే. మొదట రూపంగా కనిపించినా లేదా రూపాన్ని ఆధారం చేసుకున్నా, తర్వాత ఆ రూపం కంటే మానవుని మనసు నుండి ఏదైతే మెలమెల్లగా ఆనందంగా బహర్గతమౌతుందో అదే సౌందర్యం. 


పదార్థాన్నిలేదా రూపాన్ని ఆశ్రయించి ఉన్నప్పటికీ అదే సౌందర్యం కాదు, దాన్ని ఆశ్రయించుకొని ఉన్న ఒక ఆనందంగా చెప్తారు. అలాగే మానవుడిగా కనిపించే ఈ పదార్థానికి కలిగే అనుభూతులు, ఆ అనుభూతుల్లోని ఆనందం, ఆ ఆనందం సత్యంగా, శివంగా, సుందరం. దీన్ని వివరించడంలో వ్యాఖ్యాతలు సౌందర్య తత్త్వాన్ని ఒక మతానికి అంటే గట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది. 
మనిషి తాను జీవించడానికి కావలసిన ప్రాథమిక అవసరాల గురించి నిరంతరం తపిస్తూ ఉంటాడు. ఆహారం దుస్తులు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం కోసం ముందుగా ప్రయత్నిస్తాడు. దీని కోసం తన చుట్టూ ఉన్న పరిసరాలు ని ముందుగా తనకనుకూలంగా మార్చుకున్నాడు. తాను ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఈ ఆనందం భౌతికమైన ఆనందం గా కనిపిస్తుంది. భౌతికమైన ఆనందం మనసు కూడా హాయినిస్తుంది. అంటే ఆనందం శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు. ఆనందం మనసుకు సంబంధించింది కూడా. 
మనిషి తాను హాయిగా జీవిస్తున్నానని సంతోషపడుతూనే దానితోనే సంతృప్తి పడడు. తన జీవితానికి గల పరమార్థం ఏమిటి? అని కూడా ఆలోచిస్తాడు. ఇలా ఆలోచిస్తూ,  జీవితాన్ని ఒక్కో మెట్టుగా ఎక్కుతూ నిజమైన  సౌందర్యపుటంచులు చూడాలనుకుంటాడు.  
కొంతమంది భౌతిక అవసరాలతోనే జీవితానందాన్ని అనుభవిస్తూ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారు. మరికొంతమంది భౌతికమైన ఆనందంతో పాటు దీనికి మించింది ఇంకా ఏదో ఉందని ఆలోచిస్తూ, దాన్ని చేరుకోవడానికి తపిస్తుంటారు. దీన్నే మనం ఆధ్యాత్మిక సౌందర్యం అనొచ్చు. దీన్ని వివరించేదే సౌందర్య తాత్వికత.
ఇక్కడే మనిషి తనును తాను తెలుసుకుంటాడు. నేను, మనం అనే భావనల నుండి విడివడతాడు. ఈ విశ్వంతో  మమేకం అవుతాడు. తన భవ బంధాలనుండి విముక్తి అవుతాడు. అందరిలో తననీ,  తనలో అందరినీ చూసుకోవడం మొదలుపెడతాడు. ఈ ఆనందం వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతంలా కనిపించే ఒక నిజమైన సౌందర్యం...నిరపేక్షమైన సౌందర్యం. అలాంటి సౌందర్య దృక్పథమే 'విశ్వర్షి' వాసిలి వసంతకుమార్ గారి 'నేను' దీర్ఘకావ్యంలో నాకు కనిపించింది. దాన్ని నేను తాత్త్విక సౌందర్యం అంటున్నాను.  
మానవుడు అలాంటి సౌందర్యానునుభూతికి రావడానికి ఎంతో పరిణతి పొందాలి. అందుకని సౌందర్యం అంటే అర్థం ఏమిటి? అనుకుంటే అందంగా జీవించడంగా చెప్పుకుంటాం. మరి-  అందం అంటే ఏమిటి? అందమంటే సత్యం. మరి - సత్యం అంటే ఏమిటి?  కేవలం భౌతికంగా కనిపించేది మాత్రమేనా సత్యం? సత్యం అంతా మన కళ్ళకు గోచరిస్తుందా? సత్యమంతా మనకు అవగతమై పోతుందా? అందుకని సత్యం ఒక అన్వేషణ. సత్యం ఒక నిరంతర అన్వేషణ. ఆ అన్వేషణను మనకు అందిస్తుందనుకుంటున్నాను- ఈ 'నేను' దీర్ఘ కావ్యం.  ఈ కావ్యానికి రెండవపుట అట్టమీద ఈ లక్ష్యం స్ఫష్టంగా కనిపిస్తుందన్నట్లుంది.
‘‘ప్రపంచంలో మనం ప్రతిబింబాలం
జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యక్షసాక్షులం
బింబంలో స్ఫష్టంగా అగుపిస్తాం
కానీ హృదయం కనిపించదు
నీడలో రేఖామాత్రంగా ప్రతిఫలిస్తుంది
కానీ మనసు వినిపించదు
ఇలా మనకు మనమే 
స్ఫష్టంగా రూపాలం... అస్పష్టంగా నీడలం
అయినా క్రాంతి ప్రసారణతోనే 
రూపం అయినా...నీడ అయినా...
అగుపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నెన్నో!
వినిపించే జీవితంలో వెలికిరాని రహస్యాలు ఇంకెన్నో! ’’
కొంతమంది సౌందర్యం గురించి చెప్తూ, వ్యక్తి అంతర్గతంగా ఉన్నదే బహిర్గత ప్రపంచంలో అక్షరాల రూపంలో గానీ, మాటల రూపంలో గానీ, చేతల రూపంలో గాని వ్యక్తమవుతుందంటారు. 
ఈ దీర్ఘకావ్యంలో సౌందర్య దృక్పథాన్ని అవగాహన చేసుకోవడమంటే సాహిత్యంలో మనం సర్వసాధారణంగా  చర్చించుకునే కళ- ప్రయోజనం గురించి చర్చించుకోవడం వంటిది కాదనుకుంటున్నాను. ఇందులో ఉన్న సౌందర్యం నిరపేక్ష మైన సౌందర్యం గురించి చర్చించుకోవడం వంటిది. విశ్వ చైతన్యాన్ని తెలుసుకోవాలనుకునే చైతన్యం గురించి చర్చించుకోవడం వంటిది. 
సాహిత్యంలో సాధారణంగా చర్చించుకొనే కళ కళ కోసమా? కళ ప్రజలకోసమా ? అనే ఒక చర్చ ఉంది. నిజానికి దీన్ని కూడా మనం స్వాగతించాల్సిందే. కనీస అవసరాలు తీరని వారికి ఆధ్యాత్మిక సౌందర్యం గురించి చెప్తే వాళ్ళకు అర్థం కాదు. అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వాళ్లకి సాహిత్యంలో అభివ్యక్తి నవ్యతల గురించి చెప్తే వాళ్లకు అర్థం కాదు. కాబట్టి అది కూడా అవసరమే . కానీ నేను దీర్ఘ కావ్యం ఆ స్థాయిని దాటిపోయింది. ఒక మేధోగత పాఠకుణ్ణి ఆలోచించేలా చేస్తుంది. ఆ మేథోగతపాఠకుడు దీన్ని అవగాహన చేసుకుంటే, దీని సారాంశాన్ని మళ్లీ సామాన్యులకు అందించగలుగుతాడు. శాస్త్రం చేసే పనికూడా ఇదే. సాంకేతికత సామాన్యులందరికీ అర్థం కాదు, కానీ, ఆ సాంకేతికతను ఉపయోగించి, రకరకాలుగా సామాన్యుడు ఉపయోగించుకునేలా శాస్త్రవేత్త ప్రయత్నిస్తాడు. 
నా అక్షరం 
ఆత్మ దర్శనాల నిఘంటువు
 సాధనారహస్యాల సర్వస్వం 
అన్నట్టు 
నీ ఆత్మ తలుపులు తెరిస్తేనే కదా 
నా అక్షరం నీకు ఉపదేశామృతమయ్యేది (పుట: 76)
ఈ వాక్యాలే చెప్తున్నాయి... పాఠకుడికి అర్థం కావాలంటే 'నేను' అనే వైయక్తిక స్థితి నుండి 'నేను లోనే నువ్వూ ఉన్నావు'  అనే స్థితికి ఎదిగినప్పుడు మాత్రమే ఈ కావ్యం అర్థమవుతుంది. అందుకే దీన్ని మేథోగతపాఠకుడు కావాలన్నాను.
'' నేను 
కోరికను
ఏకోరికా
నాదికానివాడను'' (పుట:80) అనడంలో తన అభిప్రాయాన్ని తానే ఖండించున్నట్లుండే వైరుధ్యంలా అనిపిస్తుంది. 
రససిద్ధాంతంలో శాంతరసం...దాని స్థాయీ భావం 'శమం' గురించి ఇక్కడోసారి ఆలోచించాలి.నిర్వికార చిత్తవృత్తి విశేషాన్ని కదా శమం అంటారు. ఆ స్థితిలో ఏ కోరికలపట్లా ఆసక్తి లేనట్లనిపిస్తుంది. కానీ తాను అనుభవించిన జీవితంలోని సుఖం దుఃఖాలు ఇతరులు అనుభ వించడంలో తనకు నిర్వికారత ఉండదు. అది పరిణత స్థితి. ఆ స్థితిలో కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించే వారిని  చూసి సంతోషిస్తాడు. మానవజీవితంలోని ఆధ్యంతాల పరిణామాన్ని గుర్తిస్తేనే ఇక్కడ కవి కోరికలోని వైరుధ్యం అర్థమవుతుంది.
‘‘నేను 
మనిషిని 
వందేళ్లు జీవించాల్సిన వాడిని 
నువ్వు వృక్షానివి
వందేళ్లు విస్తరించాల్సిన దానివి.
అయినా ఇద్దరమూ 
వర్తమానంలో కరుగుతున్నవాళ్ళమే!
అని చెప్పి ఈ చరాచర జగత్తులో మనిషీ,  ప్రకృతీ.. అంతా కూడా నశించి పోవాల్సిందేననే సత్యాన్ని విశదీకరిస్తూ 
.....
మిత్రమా 
కడచూపుకు
 నేనూ కట్టినే నువ్వూ కట్టెవే
 కట్టకడపటికి 
మనది విభూతి యోగమే' అంటారు. ఇది సత్యం. భౌతిక సత్యం. కానీ విభూతి అయినతరువాత దానితో ఉన్నటువంటి జీవశక్తి ఏమవుతుంది? అది జీవిత  సత్యాన్వేషణ.
(పుట: 94, 95)
ఇది అనుభూతుల సంగమం
ఇందులో నేను ద్వైతాద్వైతంరూపంగా కనిపిస్తాడు
ఒకమాతృమూర్తిలా కనిపిస్తాడు
ఇందులో నేను ఒక పసి పిల్లాడిలా కనిపిస్తాడు
ఇందులో నేను ఆవేశం ఉరకలెత్తే ఉడుకు రక్తం గల యువకుడిలా కనిపిస్తాడు
 ఇందులో నేను ఒక శ్రామికుడులా కనిపిస్తాడు
ఇందులో నేను దేనికోసం వెతుకుతున్నాడో
దేనికోసం బ్రతుకుతున్నా డో తెలియని వాడిలా కనిపిస్తాడు. తెలిసి సమాజాన్ని తనకనుకూలంగా మార్చుకునే తెలివైనవాడిగా మార్చుకునే మనిషిలా కనిపిస్తాడు
''నేను అమ్మతనాన్ని ఆరగించిన పనితనాన్ని
నాన్న తనాన్ని పోషించిన పాఠ్యాంశాన్ని
 పాఠశాలన వికసించిన జ్ఞానప్రసూనాన్ని 
కళాశాలన ప్రభవించిన విజ్ఞాన వలయాన్ని
 విశ్వవిద్యాలయాన శోధించిన అక్షరతత్వాన్ని'' (పుట.105)  అని కవిత్వంలో ఈ భావాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయనిపిస్తుంది.
నిజానికి ఈ దీర్ఘ కవితా సౌందర్యం మనకు తెలియాలంటే దీనిలో అనేక సందర్భాలలో ఉపయోగించిన ఆ పారిభాషిక పదాలు, ఆ పదాలలోని మార్మికత మనకి తెలిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఇది కేవలం సాహిత్య గ్రంథం మాత్రమే కాదు. ఇది ఒక తత్వ శాస్త్రానికి సంబంధించిన సాహిత్య దర్శనం.
ఇది ఇది మానవుడు నిరంతరం చేస్తున్న అన్వేషణకు ఒక మేధో గత వైజ్ఞానిక రచనా రూపం.
ఇది ఇది విశ్వాన్ని అక్షరరూపంలో వర్ణించే  ఒక మహోన్నత ప్రయత్నం. 
అందుకే ఒక చోట ఇలా అంటారు.
''నేను 
ఆత్మను అక్షరం లోకి దింపుతానంటే 
ఆత్మ అక్షయంగా కదలాడతానంది
 అక్షర అక్షరాన్ని దున్నుకుంటూ పొమ్మంది 
మట్టిపెళ్లలు దాగిన మనిషి కథను చూడమంది
 కథను చరిత్రగా మలిచిన తీరు కనమంది
 చరిత్రకెక్కని శేషభాగాన్ని  చేయమంది.(పుట.133)
నేను దీర్ఘ కావ్యం ఒక క్రైస్తవుడు చదువుకుంటే అది క్రైస్తవ దార్శనికతను వివరించే గ్రంథం గా కనిపిస్తుంది
నేను దీర్ఘ కావ్యం ఒక హిందువు చదువుకుంటే అది ఒక హిందూ జీవన దార్శనికతను చూపిస్తుంది.
నేను దీర్ఘ కావ్యాన్ని ఒక బౌద్ధ సన్యాసి చదువుకుంటే ఒక బౌద్ధ దార్శనికత కనిపిస్తుంది
ఒకవేళ మనిషిగా మాట్లాడలేని ఈ ప్రకృతి కనుక నేను దీర్ఘ కావ్యాన్ని చదువుకుంటే అది తన అస్తిత్వం గురించి చెప్తున్నదని సంతోషిస్తుంది. 
ఒక్క మాటలో నేను  దీర్ఘకావ్యం ఒక ప్రాంత, కాల, కుల, మత,జాతి భేదాలు లేకుండా మనిషికీ ఈ విశ్వానికీ మధ్య గల అవినాభావ సంబంధాన్ని అన్వేషించే గొప్ప  కావ్య సౌందర్యం అనుభూతిలోకి వస్తుంది.
ముగింపు
ఈ ‘నేను’ దీర్ఘ కావ్యం గురించి మాట్లాడ్డమంటే, మళ్ళీ కవిత్వమై మాట్లాడ్డమేనేమో అనిపిస్తుంది. విమర్శ రచనలోని గుణ గణాలను విశ్లేషిస్తుంది. పరిశోధన రచనలోని తత్వాన్ని అన్వేషిస్తుంది. కళాతాత్త్వికుడు సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. ప్రతిదానిలోనూ సౌందర్యాన్ని చూస్తాడు. ప్రతిదానిలోనూ మమేకమై ఒక మహా అనుభూతికి గురవుతాడు. ఈ కావ్యం చదివిన తర్వాత నాలో విమర్శకుడు, నాలో పరిశోధకుడు కంటే, నా కళా తాత్త్వికుడే నన్ను జయించాడు. మనకు తెలియనిదేదో విశ్వంలో ఉన్నట్లే, పాఠకునికే తెలియనిదేదో ఈ నేను దీర్ఘకావ్యంలో కూడా ఉందనడమే నిజమైన సౌందర్య దృక్పథంగా భావిస్తున్నాను. 

( యోగాలయ, సికిందరాబాద్ వారు 19 .09.2020 నుండి 25.09.2020 వరకు అంతర్జాలం ద్వారా జరుగుతున్న తెలుగు సాహిత్యంలో నేను యౌగిక కావ్య సప్తపథ సమాలోచన సదస్సు’లో  సమర్పించిన పత్రం)

21 సెప్టెంబర్, 2020

కవి సమ్మేళనం లో అతిథిగా ఆచార్య దార్ల

 


ఈరోజు (21.9.2020) సాయంత్రం ఒంగోలు శారద సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాల కవి సమ్మేళనం జరిగింది.ఈ కవి సమ్మేళనం ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు శ్రీ హనుమంతరావు గారి పర్యవేక్షణలో నిర్వహించారు. దీనికి నన్ను అతిధిగా పిలిచారు.ఈ వారం చదువు- సంస్కారం అనే అంశంపై కవితలను ఆహ్వానించారు. చాలా మంది మంచి కవితలు చదివారు. కొంతమంది పాటల రూపంలో,  మరికొంతమంది పద్యాల రూపంలో, ఇంకొంతమంది వచన కవిత్వాన్ని చదివారు. కవులంతా చదువు- సంస్కారం గురించి మంచి కవిత్వాన్ని చదివి వినిపించారు. ముఖ్యంగా అప్పుడే రచనా ప్రపంచం లోకి అడుగుపెడుతున్న వారు ఈ సాహితీ సాంస్కృతిక సంస్థ ద్వారా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వారిని ఈ సంస్థ బాగా ప్రోత్సహిస్తుంది.ఈ కరోనా లాక్డౌన్ సమయంలో కూడా ఉభయ రాష్ట్రాలలోని కవులు అంతర్జాల కవి సమ్మేళనం లో పాల్గొంటున్నారు. ఆ విధంగా ఇంటిదగ్గర అందరితో కలిసిమెలిసి ఉన్నామనే భావన కలిగేటట్లు
అంతర్జాల కవిసమ్మేళనాలు ఉపయోగపడతాయి. ఒక అంశం మీద కవిత్వం రాయడం వల్ల వాళ్ల ఆలోచన మంచి ఆలోచనలు రూపొందడానికి ఉపయోగపడుతుంది.అందుకని ఇటువంటి కవి సమ్మేళనంలో పాల్గొనమని ఆహ్వానించినప్పుడు నేనుకూడా పాల్గొంటున్నాను.  ఈ సందర్భంగా ఆంధ్ర మహా భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పిన 'చదివించిరి నను గురువులు' అనే పద్యం తర్వాత విద్య ప్రాధాన్యాన్ని తెలిపే  ఏనుగు లక్ష్మణ కవి  విద్య నిగూఢగుప్తమగు విత్తము... అనే పద్యం  చెప్పాను. అలాగే , విశ్వనాథ సత్యనారాయణ గారి ' మర,నిదేల...అనే పద్యం చెప్పి, ఎవరి అనుభవం వాళ్లకి కొత్తగా ఉంటుందని అందుకని ప్రతి పదంలోనూ కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్ళు ఒక కొత్త అనుభూతిని పొందుతారని వ్యాఖ్యానించాను. అటువంటి కొత్త తరానికి స్వాగతం చెప్తున్న  నిర్వాహకులను అభినందించాను.

మలేషియాలో తెలుగు సాహితీవేత్తతో ఆచార్య దార్ల సంభాషణ

 

తాపీ ధర్మారావు గారి గురించి స్నేహ టి.వి.వారు  20.9.2020,  మధ్యాహ్నం 12 గంటల నుండి 12.35 నిమిషాల వరకు  ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీన్ని విని నాకు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు కూడా చెప్పారు. కానీ మలేషియా నుండి సుధీర్ రెడ్డి గారని ఒకాయన   విపులమైన ఒక సందేశాన్ని రాసి పంపించారు.  ఇంటర్వ్యూ లో నిజాయితీ కనిపించిందని, తాపీ ధర్మారావు గారి మీద మంచి విశ్లేషణ చేశారని దాని సారాంశం. తర్వాత నేను ధన్యవాదాలు చెబుతూ ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. ధర్మారావు గారి గురించి బైట్ తీసుకుంటామని స్నేహ టి.వి.వాళ్ళు ఫోన్ చేశారని కానీ,  తర్వాత చాలా సేపు ప్రత్యక్ష ప్రసారం కొనసాగిందని రాశాను. పైగా ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేసే ముందు కనీసం ఒక రోజైనా ముందు చెప్తే బాగుండేది. కానీ ఒక ఐదు, పది నిమిషాలు ముందు చెప్పారు. కేవలం ఐదు నిమిషాలు మాట్లాడటమే కదా అనుకుని ఒప్పుకున్నాను. తీరా చూస్తే తాపీ ధర్మారావు గారి లోని అనేక కోణాలను వాళ్లు నా నుండి చూపించే ప్రయత్నం చేశారు. ఆ మోడరేటర్ పేరు దుర్గా ప్రసాద్ గారట. ఆయన గతంలో ఒక కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి తర్వాత మాధ్యమాల మీద ఉన్న ఆసక్తి, ప్రేమతో మీడియా రంగంలోకి వచ్చిన వారు ఆయన  బాగా అడిగేవారు. ఆయప మంచి భాష మాట్లాడుతున్నారు. అడిగే ప్రశ్నలు కూడా చాలా బాగున్నాయి. అందుకని అది నాకు తెలియకుండానే ప్రత్యక్ష ప్రసారం సుమారు 35 నిమిషాల పాటు కొనసాగింది .నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. తెలియనివి తెలియదని కూడా చెప్పాను. అందులో రాళ్ళూ- రప్పలూ అనే రచన గురించి అడిగినప్పుడు నేను చదవలేదని చెప్పాను. ఈ అంశమే ప్రధానంగా మలేషియా లో ఉన్న సుధీర్ రెడ్డి గారికి బాగా నచ్చింది. నిజాయితీ బాగా నచ్చిందని చెప్పి ఆయన నన్ను ప్రశంసించారు . ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన గొప్ప సాహితీవేత్త అనిపించింది. అంతకు ముందు ఒకసారి నా బ్లాగ్ నుండి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడారు. ప్రముఖ కవి దాసు శ్రీరాములు గారి గురించి నేను గతంలో ఒక జాతీయ సదస్సు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో నిర్వహించాను. ఆ సమాచారాన్ని చూసి నాకు ఫోన్ చేస్తున్నట్లు ఆయన అప్పుడు... చెప్పారు.దాసు శ్రీరాములు గారు తమ కృష్ణా జిల్లాకు సంబంధించిన కొన్ని విశేషాలతో ఆయన జీవితం ముడిపడి ఉందని తాను ఆయన పై పరిశోధన చేస్తున్నానని చెప్పారు. అందుకనే ఆ సమాచారం కావాలని అడిగారు. ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మదర్ తెరిసా జయంతి ఉత్సవాలలో ఉన్నాను. సరిగ్గా అ నేను ప్రసంగిస్తున్నప్పుడే ఆయన ఫోన్ వచ్చిం అయినా మధ్యలో బయటికి వెళ్లి నేను సమావేశంలో ఉన్నానని,  తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత మెసేజ్ లు పెట్టారు.దాసు శ్రీరాములు గారి గురించి సమగ్ర సమాచారం కావాలని! దానివల్ల దాసు అచ్యుతరావు గారిని,  శ్రీ రాములు గారి మనవడు ఆయన మంచి సైంటిస్ట్ అయినప్పటికీ దాసు శ్రీరాములు గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకు రావడంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఆయన వివిధ పత్రికల్లో కూడా వ్యాసాలు రాశారు. అందువల్ల ఆయన ఫోన్ నెంబర్ ని సుధీర్ రెడ్డి గారికి పంపించాను.అంతే ఆ తర్వాత నిన్న ధర్మారావు గారి మీద జరిగిన ప్రత్యక్ష ప్రసారం చూసి  నాకు ఫోన్ చేశారు. ధర్మారావు గారి రచనలపై వచ్చిన పరిశోధనను తాను చదివానని చెప్పారు.
నిన్న తాపీ ధర్మారావు గారి పై స్నేహ టి.వి.లో నేను వెల్లడించిన అభిప్రాయాలను విని మలేషియా లో ఉంటున్న సాహితీవేత్త సుధీర్ రెడ్డి గారు ఒక  మెసేజ్ పెట్టారు. నేను ధన్యవాదాలు చెప్తూ మెసేజ్ పెట్టిన తర్వాత మరలా ఫోను చేసి మాట్లాడారు. తాపీ ధర్మారావు గారి పై వచ్చిన సిద్ధాంత గ్రంథాన్ని చదివానని, మీ అభిప్రాయాలు, విశ్లేషణ, మీ ఆలోచనా దృక్పథం తనకెంతో నచ్చిందన్నారు. సుధీర్ రెడ్డి గారు, మీ విలువైన అభిప్రాయాలను నాతో పంచుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు.... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,21.9.2020

స్నేహ టి.వి. (19.9.2020) లోడా.బోయి భీమన్నగారి సాహిత్యం: ఆచార్య దార్ల ప్రత్యక్ష ప్రసారం

స్నేహ టి.వి. (19.9.2020) లో ఆచార్య దార్ల ప్రత్యక్ష ప్రసారం

 డాక్టర్ బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా స్నేహ టీ.వి 19.9.2020 వ తేదీన సాయంత్రం 6.30 నిమిషాలనుండి 7 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేశారు. నేను సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడాను.https://youtu.be/p0OlSYtXDds

తాపీ ధర్మారావు గారి గురించి స్నేహ టి.వి (20..9.2020) లో ప్రత్యక్ష ప్రసారం

తాపీ ధర్మారావు గారి గురించి స్నేహ టి.వి (20..9.2020) లో ప్రత్యక్ష ప్రసారం

 తాపీ ధర్మారావు గారి గురించి స్నేహ టి.వి.వారు  20.9.2020,  మధ్యాహ్నం 12 గంటల నుండి 12.35 నిమిషాల వరకు  ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిలో సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ 

 దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు.

20 సెప్టెంబర్, 2020

తాపీ ధర్మారావు గారి గురించి స్నేహ టి.వి (20..9.2020) లో ప్రత్యక్ష ప్రసారం

 తాపీ ధర్మారావు గారి గురించి స్నేహ టి.వి.వారు  20.9.2020,  మధ్యాహ్నం 12 గంటల నుండి 12.35 నిమిషాల వరకు  ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిలో సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ 

 దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు.


19 సెప్టెంబర్, 2020

స్నేహ టి.వి. (19.9.2020) లో ఆచార్య దార్ల ప్రత్యక్ష ప్రసారం

 డాక్టర్ బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా స్నేహ టీ.వి 19.9.2020 వ తేదీన సాయంత్రం 6.30 నిమిషాలనుండి 7 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేశారు. నేను సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడాను.https://youtu.be/p0OlSYtXDds



16 సెప్టెంబర్, 2020

Annual Report 2019-20

Academic Year:  2019-20 (1-4-2019 to 31-3-2020)

 

Chapter 11: (Academic Distinctions)

 Awards:

 1.       Received Pratibha Puraskaram Presented by Visala Sahitya Academy, Hyderabad at Ravidrabharati, Hyderabad held on 22 August 2019.

2.       Received Dr.Ambedkar National Award-2019 Presented by Dalit Open University, Guntur, A.P, held on 13 July 2019.

Member Ship

3.       Member, Board of Studies, Department of Telugu, TARA Govt. PG College (Autonomous), Sangareddy, Telangana State. 2018-2019.

4.       Member, Board of Studies, Department of Telugu, Parvataneni Bramayya Siddartha College of Arts & Science (Autonomous), Vijayawada, A.P. 2019 -2020, Attended on 28 September 2019

5.       Member as a subject expert in the Board of Studies, Department of Telugu, Andhra Loyala College (Autonomous), Vijayawada, A.P. 2019 -2020, Attended on 30  December 2019     

Co-cordinator,

1.       National Seminar on “Gunturu Seshendra Sharma Rachanalu –Samalochana”, conducted by Deans office, School of Humanities, and Department of Telugu, School of Humanities, University of Hyderabad on 22 October 2019.

2.       Conducted a National Seminar on “ Janapada Vignanam- Adhyana Avasyakatha”  conducted by Deans Office, School of Humanities, Department of Telugu and Janapada Kalalu, Srijanatmaka Academy, Govt. of A.P held on 16 April 2019.

3.      Conducted a Alumni Extension lecture by M.Nagaraju, IAS, Special Chief Secretary, Govt. of Tripura State, with support of PRO, University of Hyderabad, as  Deputy Dean, Students Welfare and Co ordinator, Alumni Cell, University of Hyderabad on 9 September 2019, at C.V.Raman Auditorium, University of Hyderabad.

 Academic Support:

1.            Dy.Dean, Students’ Welfare, University of Hyderabad,

2.            Co ordinator, Alumni Cell, University of Hyderabad

 National Seminars:

 1.    Presented a paper on          Kavisenamanifesto, National Seminar on Gunturu Seshendra Sharma Rachanalu –Samalochana”, conducted by Deans office, School of Humanities, and Department of Telugu, School of Humanities, University of Hyderabad on 22 October 2019.

                                

Workshop:

Participated  in the National Workshop on 'Fostering Social Responsibility &  Community Engagements in Higher Educational institutions in India' from 21st January 2020 to 22nd January 2020 at Inter-university Accelerator Centre, New Delhi.                                                                                        

Chapter 12: (Academic Outreach)

 Public Lectures:

1.                     Special Lecture on Moulana Abul Kalam Azad contribution in Higher Education’’, at Celebrations of National Education Day, jointly organized by Deans Office, Students Welfare and School of Department of Higher Education & Technology, University of Hyderabad held on 14 November 2019, Evening.

2.       Special Lecture on Voter Awareness, conducted by Friends Welfare Association, Hyderabad, at Sarada High School, Hyderabad held on 4th April 2019

3.       Participated as a Chief Guest and delivered Special Lecture on “Relevance of  Mahatma Gandhiji Ideology in the Present World” at Swathi High School, Madhapur, Hyderabad, conducted by Friends Welfare Association, Hyderabad held on 2nd October 2019

4.       Chief Guest of the Book releasing function of Velpuri Kameswara Rao’s Literary Essays on “Agnigolalu’, conducted by Office of the RailSakthi Monthly Magazine, Hyderabad held on 13  October 2019.

5.       Special Guest Speaker in Vikari Nama Ugadi Puraskaram Fuction, Sri Tyagarayagana Sabha,  conducted by Jyotsna Kalapeetham, Hyderabad held on 10th April 2019.

6.       Public Lecture on Contribution of Prof.Kolakaluri Enoch’s book Ambedkar Jeevita Charitra, at Sri Tyagarayaganasabha, Hyderabad held on 11 November 2019.

7.       Chief Guest for the Voter Awareness Camp, Conducted by at Sarada High School, Kondapur, Hyderabad, conducted by Friends Welfare Association, Hyderabad held on 5 Aprl 2019

 Chaired Session:

 1.                Chaired a Session Desabhakti in the One day National Seminar on “Telugu Sahityam lo Desabhaktiat Department of Telugu, University of Hyderabad, Jointly Organized by Jyothsna Kalapeetham and Chitkala Vahini, Hyderabad, held on January, 19, 2019.

2.                Chaired a Session in  National Seminar on “ Janapada Vignanam- Adhyana Avasyakatha”  conducted by Deans Office, School of Humanities, Department of Telugu and Janapada Kalalu, Srijanatmaka Academy, Govt. of A.P held on 16 April 2019

 Resource Person:

 1.       Special Lecture on Telugu Parisodhana Parinamam- Vividha Parishodhana Paddhatulu at conducted by OU Sahitya Vedika,   Department of Telugu, Osmania University, Hyderabad held on 14 November 2019 Morning Session.

2.       Special Lecture on  Telugu Parishodhana paddhatulu –Siddhantha Grantha Rachanalo patinchavalasina niyamalu, Conducted by Students Union, University of Hyderabad, at School of Humanities Conference Hall, Hyderabad on 1 November 2019

3.       Special Lecture on Siddhantha Grantha Rachana Melakuvalu at conducted by Department of Telugu, Osmania University, Hyderabad held on 31 August 2019

4.       Resource Person  ‘‘at Refresher Course, Department of Telugu, Osmania University, Hyderabad held on 19 November 2019 and gave a lecture on Samakaaleena Telugu Sahitya Adhyanam- Vistruthi’’

5.        Books: A

1 Details: Published

 ·         Paper published on Anubhavalni Saadharaneekarinchina Asaadharana Kavi Seetaram, Special Issue on Seetaram Sahityam, May, 2019,  pages: 295 to 302,Edited by Pagidipalli Venkateswarlu, Published by Pagidipalli Kiranchandra Chetan Chandra Publications, Khammam, ISBN No: 978-90-87896-20-8

·         Published a paper on My teaching experience in SAP College, Vikarabad, Special Souvenir on SAP College and Dr. Marri Chennareddy, published by    10

1.1. Editor, Gunturu Seshendhra Sharma Sahityam- Samalochana, book of National Seminar Proceedings, One of the Editor of the book. Chief Editor: Prof.S.Saratjyotsna Rani, Editors: Prof.Darla Venkateswara Rao & Prof.Pillala Marri Ramulu, Published by Deans Office, University of Hyderabad, on March, 2020, pages: xii +138, ISBN: 978-81-921658-2-0

1.2.  Paper pubished on Adhunika kavya sastram ‘Kavisenamanifesto”, in the book of Gunturu Seshendhra Sharma Sahityam- Samalochana,  National Seminar Proceedings,  Chief Editor: Prof.S.Saratjyotsna Rani, Editors: Prof.Darla Venkateswara Rao & Prof.Pillala Marri Ramulu, Published by Deans Office, University of Hyderabad, on March, 2020, page No.41-52, ISBN: 978-81-921658-2-0

1.3. Paper published on Tolimahila Upadhyani Gyana Jyothi Savotribai Phule, in Praja Manipoosa Monthly Magazine, March, 2020, Vol.1. No.2, Page No. 8-10, Published by Praja Media Publications, Visakhapatnam. A.P.

1.4. Paper published on Nibaddhataku nijamaina chirunama Sri Velpuri Kameswara Rao garu,  in Rail Shakti Special Issue, May, 2020, Vol. 20, No.5, page No: 32-38, Published by Rail Shakti Monthly, Hyderabad.

1.5. Paper on Dr.B.R.ambedkar Autobiography, in Praja Manipusa Monthly Magazine, Visakhapatnam, A.P.India

Book Reviews: C:

 6.       ee kavitwaniki saamaanyude kendram” preface for K.Satyam’s Poetry Book Satyam Cheppina Bhavalu”, Published by Ganesh daily Publications, Kurnool, March, 2019., pages: 4-9

7.       Telangana Christava Samaja Beejam ‘Atadu Abraham”, Telugu Novel, written by Kadiyam David & Dr.G.MohanaRao,  Published by   

8.       Tulanatmaka Bharatiya Dalita Chaitanya Dristikonam” Preface for Dr.G.V.Ratnakar’s Research Articles book “Gabbageeyam” published by  Latha Raja Foundation, Hyderabad, November 2019, pages: 7-12

9.       “Acchamaina Ambedkar Kavitwam”, Preface for Dr.G.V.Ratnakar’s Poetry Book                     Varnamaala” Published by Jaibheem Publications, Hyderabad 15 August 2019, pages: 17-24.

10.   Samakaaleena Telugu Sahityamlo Peedita Drikpatham” Preface for Banoth Mohan’s Research Articles Book “ Vyasalatha’ Published by Pragma Publications, Hyderabad, May, 2019, pages: viii -xi

 ·         Interview opinion  on indian Budget ‘Saswatha prayojanala Budget’ Namaste Telangana Telugu Daily, 6 July 2019 , page no. 26

·         Interview opinion  on New Revenue Act of Telangana ‘Vicharana Perutho kalayapana Cheyavaddu, Namaste Telangana Telugu Daily, 4 May 2019 , page no; 19

·         Counseling Opinion on Students Sucide, Avesapurita Niryalu Machidi kadu, Enadu Telugu Daily, 27 April 2019, page 12-13

·         Interview opinion  on Mothertongua-Telugu ‘Rendu Bhashalu Avasarame, Enadu Telugu Daily, 17 November 2019 , page no; 8-9

·          Special Interview on my literary Contribution, published by Bhumiputra Telugu Daily, Anathapuram, AP on 7 September 2019, Interview by Editor Srihari Murthy

Poems:

·         Pilupuki perantamela,  26 April 2019, Ganesh Telugu Daily, Kurnool, page’ 7

·         Jagannatakam,  29 April 2019, Ganesh Telugu Daily, Kurnool, page’ 7

·         Veellu naa biddalu, ( Khaleel Gibran Poem, Translation) 5 May 2019, Ganesh Telugu Daily, Kurnool, page’ 7

·