అంతర్జాలం ద్వారా మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
అంతర్జాలం ద్వారా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నప్పుడు పాల్గొన్న శ్రోతలు, ప్రేక్షకలు
తాను పుట్టి పెరిగిన నేలనూ, దేశాన్నీ విస్మరించకుండా భారత దేశ కీర్తి ప్రతిష్టలను మహోన్నత స్థాయికి పెంచిన నవయుగ కవి భావ విప్లవ కారుడు గుర్రంజాషువ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు గారు అన్నారు. సోమవారం విజయవాడలోని ఆంధ్ర లొయోల కళాశాల, ప్రాచ్య భాషా పరిషత్ (తెలుగు, సంస్కృతం మరియు హిందీ శాఖలు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాల ప్రత్యేక ప్రసంగానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గుర్రం జాషువ 125 జయంతి సందర్భంగా జాషువ జీవితం, రచనల గురించి ఉపన్యసించారు. తెలుగు శాఖ అధ్యక్షుడు డా.కోలా శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గుర్రం జాషువ పేరు చెప్పగానే గబ్బిలం, ఫిరదౌసి స్మశానవాటిక పద్యాలు, కావ్యాలు మొదలైనవి గుర్తుకొస్తాయనీ, తెలుగువారి సంస్కృతి భారతీయుల మధ్య సమైక్యత దానితోపాటు సమాజంలో రావాల్సిన సంస్కరణల గురించి జాషువ ఎంతో మానవతా దృక్పథంతో తన రచనలు కొనసాగించారని ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు వ్యాఖ్యానించారు. కేవలం తెలుగువారి కే కాకుండా భారతీయులందరినీ అన్ని వర్గాలకు అన్ని మతాలను ఆలోచింపజేసేలా గుర్రం జాషువా రచనలు చేశారని ఆయన ప్రశంసించారు..ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుర్రంజాషువ గాంధీ బాపూజీ వివేకానంద అంబేద్కర్ తదితరులపై రాసిన రచనలను సోదాహరణంగా విశ్లేషించి జాషువా విశ్వమానవతను వివరించారు. గుర్రం జాషువ తన జీవిత వ్యదనంతా 'నా కథ' ఆత్మకథలో వ్రాసిన అది కేవలం తన ఆత్మకథ గా మాత్రమే కాకుండా ఆనాటి దళితుల సామాజిక జీవన విధానాన్ని వివరించేది గా అభివర్ణించారు. జాషువాకు సాహిత్యంలో కవిగా మంచి పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చింది ఫిరదౌసి కావ్యమనీ, తన జీవిత సంఘర్షణను భారతదేశంలో దళితుల జీవన వ్యధను చిత్రించిన కావ్యం గబ్బిలం అని ఆయన వివరించారు. (ఈ కార్యక్రమంపై వచ్చిన న్యూస్ క్లిప్పింగులు)
ఈనాడు, 30.9.2020 విజయవాడ వారి సౌజన్యంతో...
సాక్షి, 30.9.2020 విజయవాడ వారి సౌజన్యంతో...
ఆంధ్రజ్యోతి, 30.9.2020 విజయవాడ వారి సౌజన్యంతో...
నమస్తే 30.9.2020 హైదరాబాద్ వారి సౌజన్యంతో...
ఈ కార్యక్రమంలో పలువురు జాషువ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రెవ. ఫా. జి.యం. విక్టర్ ఇమ్మానియేల్ గారు, డాక్టర్ రవీంద్ర బాస్ గారు, డాక్టర్ సహాయం భాస్కరన్ గారు, డాక్టర్ కోలా శేఖర్, డాక్టర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ కృపారావు, శ్రీ గణేష్, శ్రీ వెంకటేశ్వరరావు, స్నేహల్ విమల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యూట్యూబ్ లో ప్రత్యక్షంగా కూడా ప్రసారం అయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి