"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

21 సెప్టెంబర్, 2020

మలేషియాలో తెలుగు సాహితీవేత్తతో ఆచార్య దార్ల సంభాషణ

 

తాపీ ధర్మారావు గారి గురించి స్నేహ టి.వి.వారు  20.9.2020,  మధ్యాహ్నం 12 గంటల నుండి 12.35 నిమిషాల వరకు  ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీన్ని విని నాకు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు కూడా చెప్పారు. కానీ మలేషియా నుండి సుధీర్ రెడ్డి గారని ఒకాయన   విపులమైన ఒక సందేశాన్ని రాసి పంపించారు.  ఇంటర్వ్యూ లో నిజాయితీ కనిపించిందని, తాపీ ధర్మారావు గారి మీద మంచి విశ్లేషణ చేశారని దాని సారాంశం. తర్వాత నేను ధన్యవాదాలు చెబుతూ ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. ధర్మారావు గారి గురించి బైట్ తీసుకుంటామని స్నేహ టి.వి.వాళ్ళు ఫోన్ చేశారని కానీ,  తర్వాత చాలా సేపు ప్రత్యక్ష ప్రసారం కొనసాగిందని రాశాను. పైగా ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేసే ముందు కనీసం ఒక రోజైనా ముందు చెప్తే బాగుండేది. కానీ ఒక ఐదు, పది నిమిషాలు ముందు చెప్పారు. కేవలం ఐదు నిమిషాలు మాట్లాడటమే కదా అనుకుని ఒప్పుకున్నాను. తీరా చూస్తే తాపీ ధర్మారావు గారి లోని అనేక కోణాలను వాళ్లు నా నుండి చూపించే ప్రయత్నం చేశారు. ఆ మోడరేటర్ పేరు దుర్గా ప్రసాద్ గారట. ఆయన గతంలో ఒక కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి తర్వాత మాధ్యమాల మీద ఉన్న ఆసక్తి, ప్రేమతో మీడియా రంగంలోకి వచ్చిన వారు ఆయన  బాగా అడిగేవారు. ఆయప మంచి భాష మాట్లాడుతున్నారు. అడిగే ప్రశ్నలు కూడా చాలా బాగున్నాయి. అందుకని అది నాకు తెలియకుండానే ప్రత్యక్ష ప్రసారం సుమారు 35 నిమిషాల పాటు కొనసాగింది .నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. తెలియనివి తెలియదని కూడా చెప్పాను. అందులో రాళ్ళూ- రప్పలూ అనే రచన గురించి అడిగినప్పుడు నేను చదవలేదని చెప్పాను. ఈ అంశమే ప్రధానంగా మలేషియా లో ఉన్న సుధీర్ రెడ్డి గారికి బాగా నచ్చింది. నిజాయితీ బాగా నచ్చిందని చెప్పి ఆయన నన్ను ప్రశంసించారు . ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన గొప్ప సాహితీవేత్త అనిపించింది. అంతకు ముందు ఒకసారి నా బ్లాగ్ నుండి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడారు. ప్రముఖ కవి దాసు శ్రీరాములు గారి గురించి నేను గతంలో ఒక జాతీయ సదస్సు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో నిర్వహించాను. ఆ సమాచారాన్ని చూసి నాకు ఫోన్ చేస్తున్నట్లు ఆయన అప్పుడు... చెప్పారు.దాసు శ్రీరాములు గారు తమ కృష్ణా జిల్లాకు సంబంధించిన కొన్ని విశేషాలతో ఆయన జీవితం ముడిపడి ఉందని తాను ఆయన పై పరిశోధన చేస్తున్నానని చెప్పారు. అందుకనే ఆ సమాచారం కావాలని అడిగారు. ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మదర్ తెరిసా జయంతి ఉత్సవాలలో ఉన్నాను. సరిగ్గా అ నేను ప్రసంగిస్తున్నప్పుడే ఆయన ఫోన్ వచ్చిం అయినా మధ్యలో బయటికి వెళ్లి నేను సమావేశంలో ఉన్నానని,  తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత మెసేజ్ లు పెట్టారు.దాసు శ్రీరాములు గారి గురించి సమగ్ర సమాచారం కావాలని! దానివల్ల దాసు అచ్యుతరావు గారిని,  శ్రీ రాములు గారి మనవడు ఆయన మంచి సైంటిస్ట్ అయినప్పటికీ దాసు శ్రీరాములు గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకు రావడంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఆయన వివిధ పత్రికల్లో కూడా వ్యాసాలు రాశారు. అందువల్ల ఆయన ఫోన్ నెంబర్ ని సుధీర్ రెడ్డి గారికి పంపించాను.అంతే ఆ తర్వాత నిన్న ధర్మారావు గారి మీద జరిగిన ప్రత్యక్ష ప్రసారం చూసి  నాకు ఫోన్ చేశారు. ధర్మారావు గారి రచనలపై వచ్చిన పరిశోధనను తాను చదివానని చెప్పారు.
నిన్న తాపీ ధర్మారావు గారి పై స్నేహ టి.వి.లో నేను వెల్లడించిన అభిప్రాయాలను విని మలేషియా లో ఉంటున్న సాహితీవేత్త సుధీర్ రెడ్డి గారు ఒక  మెసేజ్ పెట్టారు. నేను ధన్యవాదాలు చెప్తూ మెసేజ్ పెట్టిన తర్వాత మరలా ఫోను చేసి మాట్లాడారు. తాపీ ధర్మారావు గారి పై వచ్చిన సిద్ధాంత గ్రంథాన్ని చదివానని, మీ అభిప్రాయాలు, విశ్లేషణ, మీ ఆలోచనా దృక్పథం తనకెంతో నచ్చిందన్నారు. సుధీర్ రెడ్డి గారు, మీ విలువైన అభిప్రాయాలను నాతో పంచుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు.... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,21.9.2020

కామెంట్‌లు లేవు: