ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సాహిత్య విమర్శక దృక్పథం- ‘చర్చ‘ వ్యాససంపుటి పై ఈ రోజు ( 26.09.2020) మధ్యాహ్నం మద్రాసు క్రైస్తవ కళాశాల, చైన్నై వారు నిర్వహించిన అంతర్జాల, అంతర్జాతీయ సదస్సులో చార్య దార్ల వెంకటేశ్వరరావు పత్రసమర్పణ చేశారు. సాహిత్యాన్ని సృజన చేసేవారికి, పరిశోధకులకు, విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలనేది ఆచార్య రాచపాళెం వారి విమర్శ దృక్పథంగా ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు.
2008లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ సాహిత్య పురస్కారం పొందిన ‘‘చర్చ’’ వ్యాససంపుటిలో 1988 నుండి 2005 మధ్య కాలంలో రాసిన ముఖ్యమైన 38 వ్యాసాలు ఉన్నాయని, వాటిని విశ్లేషించారు. వ్యక్తిని అంచెనా వేసే వ్యాసాలు, తులనాత్మక విమర్శను తెలియజేసే వ్యాసాలు, పరిశోధన, విమర్శ తీరుతెన్నుల్ని వివరించే వ్యాసాలు అనే మూడు భాగాలుగా వీటిని విభజించుకొోవచ్చని వర్గీకరించారు. ఆచార్యరాచపాళెం గారి విమర్శను అధ్యయనం చేయడం వల్ల సాహిత్యాన్ని విలువ కట్టే సూత్రాలు తెలుస్తాయనీ, పునర్మూల్యాంకనలో ఉన్న శాస్త్రీయత అర్థమవుతుందని ఆచార్యదార్ల పేర్కొన్నారు. ఈ సదస్సుని డాక్టర్ యజ్ఞశేఖర్ నిర్వహించారు. ఈపత్రాన్ని సమర్పించే సమయంలో ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య మేడిపల్లి రవికుమార్, ఆచార్య మాడభూషి సంపత్కుమార్, డాక్టర్ ఎన్. ఈశ్వర్ రెడ్డి, డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు తదితరులు అంతర్జాల సమావేశంలో ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి