30 ఆగస్టు, 2009
"తెలుగు సాహిత్య విమర్శ: నేటి ధోరణులు'' జాతీయ సదస్సు: 17-18,సెప్టెంబరు 2009.
ఈ రిజర్వేషన్ విద్వేషకారకం - సిహెచ్. విద్యాసాగర్ రావు

( ఆంధ్ర జ్యోతి http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/aug/28edit4 సౌజన్యం)
రాజ్యాంగ సభలో రిజర్వేషన్ల విషయమై కేవలం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల కోసమే ఏకగ్రీవ ఆమోదం లభించింది. రాజ్యాంగంలోని 341 అధికరణ లో దాన్ని చేర్చారు. ఈ అధికరణనే సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనలు అమలు పరచేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులు హిందూ షెడ్యూల్డు కులాలు, సిక్కుల్లో నాలుగు షెడ్యూల్డు కులాలు ఉండాలని నిర్వచించడం గమనార్హం.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మన శాసనసభ తీర్మానించింది. తద్వారా దేశ విచ్ఛిన్నానికి మరొక మొక్కను నాటింది. మజ్లిస్ సభ్యులు దళిత ముస్లింలను కూడా చేర్చాలని దానికి నీరు పోయడం ప్రారంభించారు. శాసనసభ బయట ప్రారంభించిన 'ఆకర్ష' పథకాన్ని ఏకంగా సభలోనే ప్రవేశపెట్టి తీర్మానించారు. ఈ వివాదం ఇదివరకు సుప్రీంకోర్టు విచారణలో ఉంది.
రాజ్యాంగ సభలో, పార్లమెంటులో దీనికి సంబంధించిన చర్చలను పరిశీలించినట్టయితే ఈ తీర్మానం వికర్షింప బడుతుందని చెప్పవచ్చు. కాని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న కుహనా లౌకికవాద ప్రయోగాల వరసలో ఇదొకటిగా చేరింది. మత విద్వేషాలతో పాటు, ఇదివరకే నష్టపోతున్న దళితులలో అభద్రతా భావాన్ని ఈ ప్రభుత్వం తీర్మానం ద్వారా పెంచింది.
భారత స్వాతంత్య్రోద్యమ సమయంలోనే- మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే, చట్ట సభల్లో సీట్లను రిజ ర్వు చేయాలనే బ్రిటీష్ ప్రభుత్వ 'కమ్యూనల్ అవార్డు' (1935) ప్రతిపాదనలను మహాత్మా గాంధీ వ్యతిరేకించా రు. రాజ్యాంగాన్ని రచించే సమయంలో కూడా మళ్ళీ ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే మతపరమైన రిజర్వేషన్లను వద్దని అందరూ తిరస్కరించారు.
ఇది కేవ లం మూర్ఖత్వమే కాక విపత్తుకు దారితీస్తుందని పండిట్ నెహ్రూ లాంటి వ్యక్తి కూడా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 2004లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించింది. 2005లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి ముస్లింల స్థితిగతుల అధ్యయనం కోసం జస్టిస్ రాజీందర్ సచార్ నేతృత్వంలో కమిటీ వేసింది.
ఇలాంటి ధోరణి కొనసాగితే హిందూ సమాజంలో మరిన్ని వర్గాలు మైనారిటీ హోదా కావాలని డిమాండ్ చేస్తాయి. మెజారిటీ మతంలో కొనసాగితే తమ పట్ల వివక్ష ఉంటుందని, ప్రయోజనాలు కోల్పోతామని, మెజారిటీగా ఉండడమే పొరపాటయింద ని విశాల హిందూ సమాజంలోని పలు వర్గాలు భావించే అసా«ధారణ సంకేతాలు వస్తాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే దేశ ఐక్యత, సమగ్రత దెబ్బ తింటుంది.
బహుశా అందుకే 1947 ఆగస్టులో రాజ్యాంగ సభలో మతపరమైన రిజర్వేషన్లను తిరస్కరించారు. 1947 ఫిబ్ర వరి 27న రాజ్యాంగసభలో సలహా కమిటీ నివేదికను సర్దార్ పటేల్ ప్రవేశపెట్టారు. ముస్లింల ప్రయోజనాల రీత్యా మాత్రమేకాక మొత్తం దేశ ప్రయోజనాల రీత్యా కూడా మతపరమైన మైనారిటీలకు చట్ట రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కమిటీ తీర్మానించింది. 'బ్రిటీష్ వారు మైనారిటీల పైన మమకారం ఉందని తరచు చెప్పుకుంటారని, కాని అది బూటకమని మనం రుజువు చేయాలని ఆయ న సూచించారు.
మనకన్నా మైనారిటీల పరిరక్షణపైన ఎవరికీ ఆసక్తి లేదని, మొత్తం జాతీయ ప్రయోజనాల రీత్యా వారిని అన్ని రంగాలలో సంతృప్తిపరచ డం, వారి ప్రయోజనాలు పరిరక్షించడం కర్తవ్యమని ఆయన భావించారు. దీర్ఘకాలంలో ఈ దేశంలో మెజారి టీ, మైనారిటీ అంటూ ఎవరూలేరని భారత్‌లో ఒకే జాతి నివసిస్తున్నదని అనుకునేలా చేయడం మనందరి లక్ష్యం అని ఉద్ఘాటించారు.
రాజ్యాంగ సభలో రిజర్వేషన్ల విషయమై కేవలం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల కోసమే ఏకగ్రీవ ఆమోదం లభించింది. రాజ్యాంగంలోని 341 అధికరణ లో దాన్ని చేర్చారు. ఈ అధికరణనే సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీన్ని అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధన లు అమలు పరచేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారు లు హిందూ షెడ్యూల్డు కులాలు, సిక్కుల్లో నాలుగు షెడ్యూల్డు కులాలు ఉండాలని నిర్వచించడం గమనించా లి. నెహ్రూ ప్రభుత్వం విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించేటప్పుడు ముస్లింలు, క్రైస్తవులను దాని పరిధి నుంచి తప్పించింది.
ఒక వేళ ఈ మైనారిటీ వర్గాలు రిజర్వేషన్ పరిధిలో ఉండాలనుకుంటే ఆనాడే చేర్చేవారు. చాలా కాలంగా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు అని చెప్పుకునే వారికి కూడా రిజర్వేషన్లు విస్తరించాలన్న డిమాండ్లు ఉన్నాయి. కాని వీటిని పట్టించుకోకపోవడానికి కారణం హిందూ సమాజంలో కులం అనేది ఒక లక్షణమ ని భారత రాజ్యాంగ నిర్మాతలు గమనించారు. ఒక తక్కు వ జాతి హిందువు ఇస్లాంకో, క్రైస్తవ మతానికో మారితే వారికి అందరితో పాటు సమాన హోదా లభిస్తుంది.
కులరహిత సమాజం అనే హామీ లభిస్తుంది. నెహ్రూ హయాంలో- ఒక వ్యక్తి తన హిందూమతాన్ని వదిలి మరో మతానికి మారి, ఆ తరువాత మళ్ళీ హిందువు అయితే, అతడికి మొదట ఉన్న షెడ్యూల్డు కులం హోదా లభిస్తుందా అనే అంశంపై చర్చ సాగింది. తిరిగి మతం మారడం వల్ల మొదలు లభించిన హక్కులు, సహాయం పొందే అర్హత లభిస్తుందని భారత ప్రభుత్వం నిర్దారణకొచ్చింది.
ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ముఖ్యమైన సర్కుల ర్ (భారత ప్రభుత్వం /నెం 18/4/ 54- ఎస్.టి.4, తేదీ 23 జూలై 1959) ద్వారా తెలిపింది. ఈ సర్కులర్ ద్వారా కులం అనేది హిందూ సమాజానికి మాత్రమే చెందినదిగా నెహ్రూ ప్రభుత్వం భావించింది. దళిత ముస్లింలు దళిత క్రిస్టియన్స్ షెడ్యూ ల్డు కులాలకు చెందినవారు కాదు కాబట్టి నెహ్రూ నుంచి పి.వి. వరకు ఏ ప్రభుత్వమూ వారికి రిజర్వేషన్స్ అవకాశాన్ని అందించలేదు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. షెడ్యూల్డు జాతులకు మాత్రం మతపరమైన సంబంధా లు, రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు అడ్డంకి లేదు. ఎందుకంటే వీరి నిర్ధారణ మత ప్రాతిపదికన కాదు కాబట్టి. కులం అనేది హిందూ సమాజానికి చెందిన ప్రత్యే క వర్గంగా రాజ్యాంగ నిర్మాతలు భావించారని స్పష్టమవుతున్నది. శాసనసభ తీర్మానం విప్లవాత్మక నిర్ణయం అని బయట కాంగ్రెస్ వారు అన్నారంటే దాని మతలబు అందరికీ తెలిసిందే!
-సిహెచ్. విద్యాసాగర్ రావు
(వ్యాసకర్త, కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకులు)
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సమంజసం కాదా? - చర్చించండి!
క్రైస్తవ, ముస్లింలు ఏనాడు తాము దళితులుగా అంగీకరించలేదు. పైగా దళితుల కోసం పోరాటం చేస్తున్న అంబేద్కర్‌కు మద్దతు ఇవ్వకుండా తాము అసలు దళితులమే కాదు అన్న వీరు నేడు రిజర్వేషన్ల రుచికి మరిగి తప్పుడు సరిఫికెట్లతో 80శాతం ఎస్సీ రిజర్వేషన్లను అనుభవిస్తూ అసలైన దళితులు అనుభవిస్తున్న ఆ కాస్త 20 శాతాన్ని కొట్టివేయడానికి కుట్రపన్నుతున్నారు.
దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా గుర్తిస్తూ రాష్ట్ర శాసన సభ మం గళవారం తీర్మానించడం దాన్ని బలపరుస్తూ తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెరాస, సిపిఎం మద్దతు తెలపడం రాజ్యాంగ నియమావళికి విరుద్ధం. రిజర్వేషన్ల రాజకీయాల ఉచ్చులో మాల, మాదిగలతో పాటు దళిత క్రైస్తవులను కూడా చేర్చి తన్నుకు చావండి అంటూ వైఎస్ వేసిన రాజకీయ ఎత్తుగడలకు ఇతర ప్రతిపక్షాలు మద్దతు తెలపడం వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం. ఎందుకంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా హిందుమతంలో భాగం కాని దళితులకు రిజర్వేషన్లను తిరస్కరించింది.
హిందుమతంలో భాగమైన సిక్కు, జైన, బౌద్ధ మత దళితుల కు రిజర్వేషన్లు వర్తిస్తాయనీ, క్రైస్తవ, ఇస్లాం మతం మారిన దళితులు షెడ్యూల్డు కులాల్లో భాగం కాదు అనీ భారత ప్రభుత్వ చట్టం 1935, భారత రాజ్యాంగ చట్టం 1950 పేరా 3 పేర్కొంటున్నాయి. భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా భారత సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాలలో మతం మార్చుకున్న ముస్లిం, క్రైస్తవులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి వీల్లేదని స్పష్టం చేసినా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేంద్రంలోని యు.పి.ఎ. ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిం చి వారికి దళితుల 15 శాతం రిజర్వేషన్‌లోనే వాటా కల్పించాలని ప్రయత్నించడం రాజ్యాంగ వ్యతిరేకం. భారత రాజ్యాంగ పిత అంబేద్కర్ జీవితాంతం హిందుమత విధానానికి బలైన అంటరాని కులాల కోసం రిజర్వేషన్ కల్పిస్తే, సోనియా గాంధీ కనుసన్నలలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సవరణలకు పూనుకుంటున్నది.
దళిత క్రైస్తవులు కొంత కాలంగా రాజ్యాంగ చట్టం 1950లోని 3వ పేరాను సవరించాలని చేస్తున్న డిమాండ్‌ను అంగీకరిం చి దళిత క్రైస్తవ, ముస్లింలను కూడా ఎస్సీలుగా గుర్తిస్తే అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్ల ఆశయానికే అర్థం లేకుండా పోతుంది. పి.వి. ప్రధానిగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులకు షెడ్యూల్డు కులాల పరిధిలో రిజర్వేషన్లు ఉండాలని ఒక బిల్లు తయారైంది.
నాటి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అయిన హనుమంత ప్ప ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు ఏకగ్రీవంగా నివేదిక ఇచ్చారు. దీంతో ప్రభుత్వ బిల్లు ప్రతిపాదనను విరమించుకుంది. అయితే సోనియా చెప్పుచేతలలోని ప్రభుత్వం జాతీయ భాషాపరమైన మైనారిటీ కమిషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి రాజ్యసభ సభ్యుడు అయిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో నివేదికను తమకు అనుకూలంగా ఇప్పించుకుంది.
వ్యక్తులు మారితే అధికార పక్షం మారితే రాజ్యాం గ బద్ధమైన కమిషన్ నివేదికలు మారతాయా? ఈ నివేదిక ఆధారంగా ప్రధాని మన్మోహన్ దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ కోటాలో రిజర్వేషన్ ఇవ్వడానికి తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ఇక్కడ వైఎస్ ఇందుకు పూనుకున్నారు. కాలేకర్ కమిషన్ మొదలుకొని మండల్ కమిషన్ వరకు అన్నీ దళిత క్రైస్తవులకు బిసి జాబితాలో రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించాయి. వారి సిఫారసుల ఆధారంగానే బిసి(సి) కోటాలో ఒకశాతం రిజర్వేషన్లను క్రైస్తవులు అనుభవిస్తున్నారు. ఇవికాక క్రైస్తవ మైనారిటీలు రాజ్యాంగ పరం గా అనేక రాయితీలు పొందుతున్నారు. విదేశాల నుంచి క్రైస్తవ మతం పేరున వచ్చే కోట్లాది రూపాయలు వీరి అభివృద్ధి కోసమే కేటాయిస్తున్నా రు.
ఎంతో మంది దళిత క్రైస్తవులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తీసుకుని షెడ్యూల్డు కులాలకు చెందాల్సిన రిజర్వేషన్లను అక్రమంగా పొందుతున్నారు. ఎస్సీల పేర ఉద్యోగాలు సంపాదించిన అధికారులు, పదవులు అనుభవిస్తున్న నాయకులు చాలా మంది దళిత క్రైస్తవులే. షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లలో 20 శాతం మాత్రమే అనుభవిస్తు న్న నిజమైన హిందు దళితులకు ఆ కాస్తా రిజర్వేషన్ దక్కకుండా చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. నిజంగా దళిత క్రైస్తవులకు చిత్తశుద్ధి ఉంటే బి.సి. (సి) కోటాను పెంచి వారిని ఆదుకోవాలి. ముస్లిం, క్రైస్తవ సమాజాల్లో కులవ్యవస్థ లేదు. షెడ్యూ ల్డ్ తెగలు లేవు. హిందువుల్లో మాత్రమే షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఉన్నాయి. మతపరమైన కట్టుబాట్ల కారణంగా హిందువులు అంటరానితనాన్ని పాటిస్తున్నారు.
హిందువు ఎవరైనా ఇస్లాం, క్రైస్తవం స్వీకరిస్తే అతను సహజంగా తమ కులాన్ని కూడా కోల్పోతా డు. దళిత క్రైస్తవులకు ఎస్సీలతో సమానంగా రిజర్వేషన్లు కావాలని కోరే క్రైస్తవ నాయకులు భారతీయ క్రైస్తవంలో సహోదరత్వం లేదనీ, క్రైస్తవం కులవివక్షను తొలగించలేకపోయిందని బహిరంగంగా అంగీకరిస్తారా? క్రైస్తవులు-దళిత క్రైస్తవుల మధ్య సామాజిక వివక్షలేదు. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే వారు క్రైస్తవ వ్యవస్థలోని ఆ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలి.
ఈ పోరాటం చేయకుండా దళితుల రిజర్వేషన్ల హక్కులలో వాటా లు కోరడం, వాటిని హరించబూనటం ఎంతవరకు సబబు? హిందూ సమాజం వలె క్రైస్తవంలో సామాజిక సంస్కరణలకు ఆయా మతాల పెద్దలు తయారుగా ఉన్నారా? ఆ పని చేయకుండా తమను కూడా ఎస్సీ రిజర్వేష్లను వర్తింపచేయాలని కోరడం సమంజసమా? ఇండియా కాన్షరెన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ సంస్థ వారు 1928లో (నవంబర్ 26న) సైమన్ కమిషన్ ముందు 'క్రైస్తవ సమాజంలో భారతీయ క్రైస్తవు లు, నిమ్మ వర్గాలు అంటూ వేరు వేరు వర్గాలేమీ లేవు' అని తమ వాదనలను వినిపించారు.
1931 జనాభా లెక్కల కమిషనర్ జె.ఎస్.హట్టన్ ప్రకారం-క్రైస్తవ మతం తీసుకున్న దళితులు అంటరాని వారు కారు. వీరు 1940 నాటి జనాభా లెక్కల కమిషనర్ ముందు 'భారతీయ క్రైస్తవ సమాజంలో కుల వ్యవస్థ లేదు. నిమ్న వర్గాలంటూ ప్రత్యేకంగా క్రైస్తవ మతంలో ఎవరూ లేరు. కనుక మేము అంబేడ్కర్ కోరుతున్న ప్రత్యేక నియోజక వర్గాలను, కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తున్నాము. మాది ఏకరూప సమాజం' అని తెలిపా రు. రాజ్యాంగ సభలో మతపరమైన రిజర్వేషన్ల విషయం కూడా చర్చకు వచ్చింది.
తుది నిర్ణయంగా మతపరంగా రిజర్వేషన్ల ను ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయమైంది. రాజ్యాంగ సభ లో రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్నప్పుడు క్రైస్తవ సభ్యులు తమ మతంలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేదు కనుక రిజర్వేషన్లు అవసరం లేదన్నారు. ఈ క్రైస్తవ, ముస్లింలు ఏనాడు తాము దళితులుగా అంగీకరించలేదు. పైగా దళితుల కోసం పోరాటం చేస్తున్న అంబేద్కర్‌కు మద్దతు ఇవ్వకుండా తాము అసలు దళితులమే కాదు అన్న వీరు నేడు రిజర్వేషన్ల రుచికి మరిగి తప్పుడు సరిఫికెట్లతో 80శాతం ఎస్సీ రిజర్వేషన్లను అనుభవిస్తూ అసలైన దళితులు అనుభవిస్తున్న ఆ కాస్త 20 శాతాన్ని కొట్టివేయడానికి కుట్రపన్నుతున్నారు.ఈకుట్రను భగ్నం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న మూల వాసులైన అది హిందూ దళితులు ఉపకులాలకు అతీతంగా ఉద్యమించడం ఒక్కటే పరిష్కారం.
-డా. గాలి వినోద్‌కుమార్
(వ్యాసకర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకులు)
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
29 ఆగస్టు, 2009
ప్రామాణిక భాష ప్రాంతాన్ని తెలిపేది కాదు!
ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గారి ప్రసంగం అనంతరం ఆయనతో కలిసి చాలా మంది ఫోటోలు తీయించుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు వారి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. వాటిలో కొన్ని దృశ్యాలను పరిశోధక విద్యార్థులు మద్దిరాల సిద్ధార్థ, రాంబాబు తదితరులు నాకు అందించారు. వాటిని ఇక్కడ అందిస్తున్నాను.
స్వాగత వచనాలు పలుకుతున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు
ప్రసంగిస్తున్న ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గారు
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారితో గ్రూపు ఫోటోలో వరసగా డా.పిల్లలమర్రి రాములు, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఐ. రామబ్రహ్మం తదితరులు
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారితో గ్రూపు ఫోటోలో వరసగా ఆచార్య పరిమి రామనరసింహం, డా.పిల్లలమర్రి రాములు, డా.దార్ల వెంకటేశ్వరరావు, విష్ణువర్థన్ రెడ్డి, ఆచార్య ఉమామహేశ్వరరావు, ఆచార్య ఐ. రామబ్రహ్మం తదితరులు
వందన సమర్పణ చేస్తున్న ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు
సమీక్షిస్తున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడుతున్న విద్యార్థులు 27 ఆగస్టు, 2009
వీచిక ఆవిష్కరణ-అంకితోత్సవం - రచయిత స్పందన
ఆగష్టు 29 న గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం మన తెలుగు వాళ్ళుతెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నిన్న (28-8-2009) హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, హైదరాబాదు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు " ప్రామాణికభాష - మాండలికాలు" అనే అంశం పై ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు శాఖ మరియు భాషాశాస్త్రజ్ణుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డా.అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు. సభకు ఆచార్య ఉమామహేశ్వరరావు గారు స్వాగతం పలికి, అతిథిని పరిచయం చేశారు. సభకు ఆచార్య బేతవోలు రామ బ్రహ్మంగారు అధ్యక్షత వహించారు
19 ఆగస్టు, 2009
ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి ప్రసంగం
డా.దార్ల వెంకటేశ్వరరావు రచించిన వీచిక ఆవిష్కరణ కార్యక్రమం ది. 14-8-2009 న హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాడ్ల భూమయ్య పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని కొంత భాగం ఇక్కడ అందిస్తున్నాను.