"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

29 ఆగస్టు, 2009

ప్రామాణిక భాష ప్రాంతాన్ని తెలిపేది కాదు!

భాషకు వైవిధ్యం ప్రాణం వంటిదని, ప్రామాణిక భాష వల్ల అన్ని ప్రాంతాల వాళ్ళు సులభంగా, శాస్త్రీయంగా భాషా సాహిత్యాలను అవగాహన చేసుకుంటారని ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి అన్నారు. తెలుగు శాఖ మరియు భాషాశాస్త్రజ్ఞుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డా.అంబేడ్కర్ ఆడిటోరియంలో గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి ప్రత్యేక ప్రసంగం చేశారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథి ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గార్ని ఆచార్య ఉమామహేశ్వరరావు పరిచయం చేశారు. ప్రతి సంవత్సరం ఆగష్టు 29 న గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రసంగాన్ని ఒక రోజు ముందే ఏర్పాటు చేశామని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వివరించారు. స్లైడ్స్ తో మాండలిక పటాలను ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు చేసిన ప్రసంగం ఆధ్యంతం ఆసక్తిగా కొన సాగింది. మాండలిక వృత్తి పదకోశ నిర్మాణంలో ఎదురైయ్యే సమస్యలను కూడా ఈ సందర్భంగా చర్చించారు. మన రాష్ట్రంలో ఆ వ్యవహార భాషను బట్టి కళింగాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలుగా గుర్తించవచ్చని వాటిని సోదాహరణంగా నిరూపించారు. అయినంత మాత్రం చేత అవి ప్రత్యేక భాషలు కాదని అన్నారు. ప్రామాణిక భాష ఏర్పడే పరిస్థితులను వారు రాసిన పుస్తకాల నుండి చదివి వినిపించారు. వాడుకకూ, రాతకూ భాషలో తేడా ఉంటుందని చెప్పారు. మాట్లాడినట్లే రాయడంలో కొన్ని సమస్యలు వస్తాయని అన్నారు. సభకు ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు గారు వందన సమర్పణ చేశారు.
ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గారి ప్రసంగం అనంతరం ఆయనతో కలిసి చాలా మంది ఫోటోలు తీయించుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు వారి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. వాటిలో కొన్ని దృశ్యాలను పరిశోధక విద్యార్థులు మద్దిరాల సిద్ధార్థ, రాంబాబు తదితరులు నాకు అందించారు. వాటిని ఇక్కడ అందిస్తున్నాను.


స్వాగత వచనాలు పలుకుతున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు
ప్రసంగిస్తున్న ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గారు

ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారితో గ్రూపు ఫోటోలో వరసగా డా.పిల్లలమర్రి రాములు, డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఐ. రామబ్రహ్మం తదితరులు


ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారితో గ్రూపు ఫోటోలో వరసగా ఆచార్య పరిమి రామనరసింహం, డా.పిల్లలమర్రి రాములు, డా.దార్ల వెంకటేశ్వరరావు, విష్ణువర్థన్ రెడ్డి, ఆచార్య ఉమామహేశ్వరరావు, ఆచార్య ఐ. రామబ్రహ్మం తదితరులు
వందన సమర్పణ చేస్తున్న ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు

సమీక్షిస్తున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడుతున్న విద్యార్థులు

కామెంట్‌లు లేవు: