"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

27 August, 2009

వీచిక ఆవిష్కరణ-అంకితోత్సవం - రచయిత స్పందన

భాషకు వైవిధ్యం ప్రాణం వంటిదని, ప్రామాణిక భాష వల్ల అన్ని ప్రాంతాల వాళ్ళు సులభంగా, శాస్త్రీయంగా భాషా సాహిత్యాలను అవగాహన చేసుకుంటారని ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి అన్నారు. తెలుగు శాఖ మరియు భాషాశాస్త్రజ్ఞుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డా.అంబేడ్కర్ ఆడిటోరియంలో గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి ప్రత్యేక ప్రసంగం చేశారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథి ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గార్ని ఆచార్య ఉమామహేశ్వరరావు పరిచయం చేశారు. ప్రతి సంవత్సరం ఆగష్టు 29 న గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రసంగాన్ని ఒక రోజు ముందే ఏర్పాటు చేశామని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వివరించారు. స్లైడ్స్ తో మాండలిక పటాలను ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు చేసిన ప్రసంగం ఆధ్యంతం ఆసక్తిగా కొన సాగింది. మాండలిక వృత్తి పదకోశ నిర్మాణంలో ఎదురైయ్యే సమస్యలను కూడా ఈ సందర్భంగా చర్చించారు. మన రాష్ట్రంలో కళింగాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలుగా ఆ వ్యవహార భాషను బట్టి విభజించవచ్చని వాటిని సోదాహరణంగా నిరూపించారు. ప్రామాణిక భాష ఏర్పడే పరిస్థితులను వారు రాసిన పుస్తకాలనుండి చదివి వినిపించారు. వాడుకకూ, రాతకూ భాషలో తేడా ఉంటుందని చెప్పారు. మాట్లాడినట్లే రాయడంలో కొన్ని సమస్యలు వస్తాయని అన్నారు. సభకు ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు గారు వందన సమర్పణ చేశారు. ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి గారి ప్రసంగం అనంతరం ఆయనతో చాలా మంది ఫోటోలు తీయించుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు వారి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. వాటిలో కొన్ని దృశ్యాలను పరిశోధక విద్యార్థులు మద్దిరాల సిద్ధార్థ, రాంబాబు తదితరులు నాకు అందించారు. వాటిని ఇక్కడ అందిస్తున్నాను.

ఆగష్టు 29 న గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం మన తెలుగు వాళ్ళుతెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నిన్న (28-8-2009) హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, హైదరాబాదు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు " ప్రామాణికభాష - మాండలికాలు" అనే అంశం పై ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు శాఖ మరియు భాషాశాస్త్రజ్ణుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డా.అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు. సభకు ఆచార్య ఉమామహేశ్వరరావు గారు స్వాగతం పలికి, అతిథిని పరిచయం చేశారు. సభకు ఆచార్య బేతవోలు రామ బ్రహ్మంగారు అధ్యక్షత వహించారు

No comments: