"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

చర్చ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చర్చ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31 జనవరి, 2025

గద్దర్ -- భిన్న కోణాలు (కృపాకర్ మాదిగ )

 (ప్రముఖ గాయకుడు చాలాకాలం పాటు నక్సలిజం ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, తన పాటల తోటలతో ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసిన వారు గద్దర్. ఆయన మరణించిన తర్వాత ఆయనను ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు కీర్తించటం కనిపిస్తుంది. సాహిత్య పరంగా ఆయన పాట ఎన్నో చర్చలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కృపాకర్ మాదిగ రాసిన ఒక వ్యాసం ఆయనలోని భిన్న కోణాలను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించిన తీరు చరిత్రలో, భవిష్యత్తులో పరిశోధన చేసే వారికి ఉపయోగపడే వ్యాసంగా అనిపించింది. అందుకని కృపాకర్ గారి అనుమతితో ఈ వ్యాసాన్ని నా బ్లాగులో పునర్ ముద్రిస్తున్నాను..దార్ల)


// గద్దర్ -- భిన్న కోణాలు //


ఉన్నది ఉన్నట్టుగా చూడు.

ఉన్నదాన్ని ఎక్కువ చెయ్యొద్దు.

తగ్గించవద్దు.

మాయం చెయ్యొద్దు --- బుద్దుడు.


యాలరో యీ మాదిగ బతుకూ,నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకూ - అనే పాట నలభై ఏళ్ళ  క్రితం మొదటి సారి విన్నాను.1980 - 85 సంవత్సరాల మధ్య కాలంలో విప్లవ విద్యార్థుల " విద్యార్థులారా! గ్రామాలకు తరలండి. " అనే వేసవి కార్యక్రమంలో,అనేక పాటల మధ్య ఈ పాటని ఎక్కువగా ప్రజల మధ్య పాడే వాళ్ళం. మంచినీటి కోసం,అధికారుల వద్ద సర్టిఫికెట్లు పొందడం కోసం,ఇంటి నిర్మాణ పనుల్లో,తెల్ల బట్టలు కట్టిన సందర్భంలో మాదిగలు ఎంత దారుణమైన కుల హింసలకు,వివక్షలకు గురౌతున్నారో,గద్దర్ ఈ పాటలో ఎంతో ఆర్తిగా రాశారు.1985 కారంచేడులో కమ్మ ఆధిపత్య కుల దురహంకార దాడిని ప్రతిఘటించి మృతవీరులైన మాదిగలపై గద్దర్ రాసి,పాడిన " దళిత పులులమ్మా!కారంచేడు భూస్వాముల మీద,కలబడి నిలబడి పోరు చేసిన... " అనే పాటని  సమాజం రోజూ నెమరు వేసుకుంటూనే వుంది.ఆగదు ఆగదు ఆగదు,ఈ ఆకలి పోరూ ఆగదు - అనే పాట,నాసా కింద,మీసా కింద నిన్నూ జైల్లో పెట్టీనారు,నీకూ నాకూ తేడా లేదయ్యో ఓ పోలీసన్న, పోరుదప్ప దారి లేదయ్యో ఓ పోలీసన్న - అనే పాట, వడ్డెరోళ్ళ మండి మేమూ - అనే పాట, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా - అనే పాట,యీ దేశం ఎవదిరిరా ఈ దేశం మనదేరా - అనే పాట,నడవరో రెంకన్న నడవరో! - అనే పాట,ఇంకా ఆనాడు గద్దర్ నోట గానమైన ప్రతీ పాట,ఎన్నో పాటలు సమాజంలోని వర్గ,కుల,జెండర్ అసమానతలను ఎత్తి చూపినాయి.పీడితుల దృక్పథంతో కొన్ని సార్లు దుఃఖాన్ని,సహానుభూతినీ పంచాయి.కొన్ని సార్లు దోపీడీ,పీడనలపై నిప్పులు కురిపించాయి. సమాజాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ పాటలు ప్రజల్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి.సమాజంలో అసమానతలు ఉన్నంత వరకూ కొన్ని గద్దర్ పాటలు ప్రాసంగికత కలిగి, పీడితులను కదిలిస్తూనే ఉంటాయి.ఇది సాంసృతిక రంగంలో గద్దర్ ముద్ర,కృషీ,ప్రభావం.ఇక,ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం,మానవ గౌరవం,కోల్పోయిన మానవ హక్కులు తిరిగి పొందటం కోసం జరిగిన మాదిగ దండోరా చారిత్రిక ఉద్యమాన్ని  పైకి బలపరిచినప్పటికీ,మాల కులస్తుడైన గద్దర్ కి లోపల వ్యతిరేకత ఉందనే దానికి రుజువులున్నాయి.మాదిగల విషయంలో గద్దర్ సమధర్మాన్ని పాటించలేదు.లోపల మాల మహానాడుగానే ఉన్నాడు.ధర్మాన్ని పాటించడం అంటే బౌద్ధాన్ని స్వీకరించడం కాదు.తనకంటే వెనుకబడిన సమూహాలకు న్యాయం జరగాలని ఆచరణలో ఉండటం.నిరంతరం బాధితులతో ఉండటం.సామాజిక న్యాయమంటే,యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు రిజర్వేషన్లలో సామాజిక గౌరవంతో కూడిన పంపిణీ న్యాయం జరిపించుకోడం. ఇందుకోసం కృషి చేయడం.అంతేకానీ,వేదికల మీద, పెదవులపై అంబేడ్కర్ పదాలను నర్తింపజేయడమంత ఈజీ కాదు.


అణగారిన కులాల సమస్యల మీద,ఇతర సామాజిక సమస్యల మీదా తాను పాటలు రాసి,పాడినపుడు  సాంసృతిక రాజకీయాల్లో గద్దర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు.తాను పాడిన హిట్టు పాటల్లో చాలా పాటలు ఇతరులు రాసిన హిట్టు పాటలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు : ఊరు మనదిరా,ఈ వాడ మనదిరా పాటని గూడ అంజయ్య రాసారు.కొండలు పగలేసినం,బండలను పిండినం పాటని చెరబండరాజు రాశారు.ఏం పిలడో ఎల్దమొస్తవా అనే పాట వంగపండు ప్రసాద్ రాశాడు. ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో అనే పాట అల్లం వీరయ్య రాశారు.ఇలా ఎందరో రాసిన,ఎన్నో హిట్టు పాటలను తాను పాడడం వలన,యీ పాటల క్రెడిట్స్ కూడా గద్దర్ కీర్తి ప్రతిష్టల అకౌంట్లోనే పడిపోయాయి.ఎర్ర జెండా అతనికి ఊతకర్ర అయింది.అంతే కాదు,అతనికి వచ్చిన అపరిమిత కీర్తి ప్రతిష్టల వెనుక,పీపుల్స్ వార్,ఇంకా మరెన్నో ప్రజా సంస్థల రాజకీయ,నైతిక,భౌతిక సంఘీభావం ఉంది. సంస్థాగత బలం తెచ్చి పెట్టిన యీ అపరిమిత కీర్తి ప్రతిష్టలను వొదులుకోవడం ఇష్టంలేక,దానిని కొనసాగించుకోవడానికిగాను,తానింకా విప్లవ పార్టీలోనే కొనసాగుతున్నట్లు గద్దర్ సమాజాన్ని భ్రమింప జేశాడు.ఇది ప్రజల్ని మోసం చెయ్యడమే.అలాగే,గద్దర్ మా పార్టీలో లేడు,బైటకు వెళ్ళాడు,అతనికీ మాకూ సంబంధం లేదని మావోయిస్టు పార్టీ కూడా ప్రముఖంగా ప్రకటించి,ప్రజల దృష్టికి తీసుకురాకపోవడం వలన,గద్దర్ ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడని సామాన్య,మధ్యతరగతి ప్రజలు భ్రమించడానికి ఆస్కారమయ్యింది.గద్దర్ ప్రజల పట్ల జవాబుదారీతనంతో, పారదర్శకతతో లేకపోవడం వలన,ఆయన అనుసరించిన అనేక అస్పష్ట రాజకీయ మార్గాలు ప్రజల్ని గందరగోళంలో పెట్టాయనేది  స్పష్టం.


భారత దేశంలో అధికార,ప్రతిపక్ష పార్టీలు,కమ్యూనిష్టు, విప్లవ పార్టీలు అనబడేవి అన్నీ పాలక కులాల నాయకత్వ నియంత్రణలలో వున్న పార్టీలే.అణగారిన సామాజిక వర్గాల అభ్యున్నతి అజెండాతో ఉన్నామని చెప్పే ఆధిపత్య కుల నాయకత్వాల పార్టీలన్నీ హిందూ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలే.త్రివర్ణ,సూద్రాధిపత్య కులాల రాజకీయ ప్రయోజనాలను పెంపొందించడం కోసం విశేషంగా కష్టపడే బహుజన సామాజిక వర్గాల వ్యక్తులకు,ఆధిపత్య కుల రాజకీయ వ్యవస్థలు రాముని సేవలో తరించే హనుమంతుడు వంటి సామాజిక స్థాయి నాయకత్వాన్ని కట్టబెట్టి,ప్రాచుర్యం కల్పిస్తాయి.వర్గ రహిత ఉద్యమ వ్యూహంలో గద్దర్ కి కల్పించిన ప్రముఖత్వం కూడా ఇటువంటిదే.అపరిమితమైన కీర్తి ప్రతిష్టలను పొందిన గద్దర్ పారదర్శకతతో,జవాబుదారీతనంతో బహుజన రాజకీయ సాంస్కృతిక ఉద్యమానికి పునరంకితమై ఉండేవాడు.కానీ,అట్లా లేడు.


రూలింగ్ మైనారిటీలైన హిందూ పాలక కులాల దగ్గర సంపద,అధికారం,శక్తివంతమైన ప్రసార సాధనాలైన మీడియా అపరిమితంగా,అసహజంగా కేంద్రీకృతమై ఉంది.వీటిని ఆధిపత్య సమూహాలు తమ సామాజిక, ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక ప్రయోజనాల కోసం లేదా వాటి ఆధిపత్యాలను నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయోగిస్తాయి.అవసరమైన పనుల్లో చురుకుదనం,చొరవ, తెలివి,బలము,రక్షణ,శిక్షణ,అభివృద్ధి,ప్రభావపూరిత కళాత్మకత,నిపుణతలు,నియంత్రణా శక్తిగల వారిని సమాజం వివిధ రంగాల్లో తమ నాయకులుగా, మార్గదర్శకులుగా,ఆదర్శనీయులుగా ప్రతి సమాజమూ నిలబెట్టుకుంది.సాపేక్షికంగా వెనకబడిన సమాజాల్లో ఇది ఇంకా ఎక్కువగా చూడగలం.


విముక్తి సిద్ధాంతాలను పుక్కిట బట్టి,వాటిని వ్యక్తిగత, ప్రైవేట్ ఉన్నతి కోసం,కేవలం ఒక టెక్నాలజీ (సాధనాలు)గా మాత్రమే వాడుకునే వారిని తోసిపుచ్చే స్థాయికి మన ప్రజల్లో పర్యవేక్షక చైతన్యం పెరగలేదు.ఇది వివిధ రంగాల్లో నాయకులుగా తిష్ట వేసిన మోసగాళ్ళకు పెద్ద సామాజిక వనరుల పెట్టుబడి అయి కూర్చుంది.గద్దర్ బతికుంటే,జాతీయంగా కాంగ్రెస్ వాళ్ళకి మేలు జరిగేదేమో?అతను చనిపోయి,ప్రాంతీయ పార్టీలకు అనుకూల బలముగా మారాడు! ప్రభుత్వ అధికార లాంఛనాలతో గద్దర్ అంత్య క్రియలు జరపడం ద్వారా,గద్దర్ మీద ప్రజల్లో వున్న సానుకూలత, ప్రముఖత్వాన్ని బిఆర్ఎస్ నాయకత్వం ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.ఇక  అంబేడ్కరైట్ పార్టీలన్నింటికీ గద్దర్ సమ దూరంలో ఉన్నాడు.అలాగే,మనువాద పార్టీలన్నింటికీ సమ దగ్గరలో ఉన్నాడు.


గద్దర్ ఎర్ర జెండా ఎత్తుకున్నాడు.కానీ,కొన్ని దశాబ్దాలుగా ఏ ఎర్ర పార్టీలోనూ లేడు.ఉన్నట్లు ప్రజల్ని కన్ఫ్యూషన్ కి  గురి చేశారు.అతను బుళుగు జెండా ఎత్తుకున్నాడు గానీ,కొన్ని దశాబ్దాలుగా ఏ బుళుగు పార్టీలోనూ లేడు! వున్నట్లు ప్రజల్ని గందరగోళానికి  గురిచేశాడు! రాజకీయ,సాంసృతిక సంతలో మోసంగా తన ప్రముఖత్వం తగ్గకుండా కాపాడుకున్నాడు.ప్రజల అభిమానాన్ని ఆరాధన స్ధాయికి తీసుకెళ్ళడంలో తిలా పాపమ్ తలా పిడికెడులా జరిగిపోయింది.గాంధీ,రణడే,జిన్నా అనే వ్యాసంలో డాక్టర్ అంబేడ్కర్ -- వ్యక్తి ఆరాధన సరైంది కాదనీ,మూఢులు మాత్రమే వ్యక్తి ఆరాధన చేస్తారని,నాయకులు మంచి పనులు చేసినప్పుడు,అభిమానులు అభినందించాలని, నాయకుల పట్ల అనుమానం కలిగితే,ప్రశ్నించాలని రాశారు.మూఢులు తాము ఆరాధించే వారి కోసం చావడానికీ,చంపడానికి వెనకాడబోరని రాశారు. అంతేకాదు,ఇది రాజ్యాన్ని నడిపించే వారికి లాభిస్తుంది.ఈ పరిస్థితిని హేతువుతో నిలవరించకపోతే, ఇక మూఢత్వమే మిగులుతుంది.


గతంలో యుద్ద నౌకగా,అమరులైన వారి కమిటీ నాయకునిగా పని చేశాననీ,కొన్ని దశాబ్దాలుగా,సాయుధ రాజకీయ కార్యక్రమాన్ని,పంథాని వదిలేశాననీ,గతంలో నా ఆట పాట మాట విని,విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై,పని చేసి,చదువులూ,ఉద్యోగాలు,ఆస్తులు,ప్రాణాలు,

భవిష్యత్తులు త్యాగాలు చేసిన వారికి,వారి కుటుంబాలకు గద్దర్ నిజాయితీగా క్షమాపణ చెప్పివుంటే బాగుండేది.గతి తార్కిక,చారిత్రిక భౌతిక వాదాలను వదిలేశాననీ,అందుకే, భద్రాద్రి,యాదాద్రి,మొదలగు గుళ్ళని సందర్శించడం, చినజియ్యర్ ఆశీర్వాదాన్ని పొందటం, ఇత్యాదులన్నింటికీ ప్రజలకు క్షమాపణ చెప్పగల అవకాశం వుండి కూడా,చాలా కాలం ఇలా చెప్పక పోవడం గద్దర్ బాధ్యతా రాహిత్యానికి గుర్తు.


ఇక ఇప్పుడు మీరు చూడండీ.గద్దర్ సంస్మరణ వేదికలపై అతని కులం వారినే డిస్ప్రపోర్షనేట్ సంఖ్యలో చూడగలం!అంతేగాదు, షెడ్యూల్డు కులాల మధ్య పాలక కులముగా అవకాశాలు కల్పించబడినది మాల కులం.చాలా మంది గద్దర్ స్వీయ కులస్తులు,తమ కుల సాంస్కృతిక,రాజకీయ ఏకీకరణకు గద్దర్ ఇమేజ్ ను వాడుకుంటున్నారని స్పష్టంగా అర్ధం చేసుకోగలం.ఇది తప్పేమీకాదు కూడా.అయితే,వీరిలో అత్యధికులు మాదిగలకు,మిగిలిన మార్జినలైజ్డ్ ఎస్సీ కుల సమూహాలకు,రిజర్వేషన్లలో పంపిణీ న్యాయాన్ని వ్యతిరేకించిన వారే వుండటం చాలా బాధాకరమైన సంగతి.ఇలాంటి వేదికలపై కొద్ది మంది మాదిగ స్పృహ లేని,లేదా డబుల్ స్టేట్మెంట్ మాదిగలను కూడా చూడగలం.మరి గద్దర్ ని అభిమానించే వారు అన్ని సమూహాల్లో వున్నారు కదా అంటే,అది కాలం అవసరం!అతన్ని ఎలా కావాలంటే,అలా కొరముట్టుగా వాడేసుకోడం నేడు వ్యక్తుల,రాజకీయ సమూహాల " అవసరం " అయింది.ఇలా రాజకీయ పార్టీల స్వార్ధాలకి బాగా పనికి వచ్చే సరుకుగా గద్దర్ ని తయారు చేసుకున్నారు.గద్దర్ ఇలా 'అందరి వాడ'య్యాడు.


సమాజం ఏ వ్యక్తికైనా అపరిమితమైన గుర్తింపు,గౌరవ మర్యాదలు,కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టినా,లేక ఆ వ్యక్తి వాటిని నిర్మించుకుని,నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినా,అవి డబ్బుపెట్టి కొనలేని డిస్ప్రపోర్షనేట్ సోషల్ అసెట్ (ఆదాయానికి మించిన ఆస్తిని అక్రమంగా కూడబెట్టడం) అవుతుంది.ఇలా ఉండటం రాజ్యాంగం లోని పంపిణీ న్యాయ అధికరణాలు 38,39 లను అతిక్రమించడమే అవుతుంది.ఏ మనిషైనా సామాజిక,సాంసృతిక,రాజకీయ పరివర్తన కోసం కృషి చేస్తే,అది ఆ వ్యక్తి గుర్తించిన సామాజిక బాధ్యత మాత్రమే,అవుతుంది.ప్రతి మనిషీ,ఆ మాటకొస్తే ప్రతీ రంగంలో విజయం సాధించిన నాయకుడు లేదా నాయకురాలు " పంపిణీ న్యాయం,తగిన గౌరవం " పొందడానికి మాత్రమే అర్హులౌతారు.ఇందుకు మాత్రమే వారు పరిమితం కావాలి.ప్రజల అభిమానాన్ని  అపరిమిత కీర్తి ప్రతిష్టలు అనే సోషల్ క్యాపిటల్ కింద గద్దర్ కూడబెట్టుకోకుండా ఉండవలసింది.


                         --- కృపాకర్ మాదిగ

                             సామాజిక ఉద్యమాల కార్యకర్త

10 సెప్టెంబర్, 2023

తొలి తెలుగు పదం ‘నాగబు’ కాదు.. ‘అంధిర లోకము’!

 (ఇది మా విద్యార్థుల అవగాహన కోసం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక సౌజన్యంతో పునర్ముద్రిస్తున్నాను. నాగబు, అంధిర లోకము పదాలపై మరింత స్ఫష్టత రావాలసిన అవసరం ఉంది.... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు)




క్రీస్తుకు పూర్వమే తెలుగు!
తొలి తెలుగు పదం ‘నాగబు’ కాదు..
‘అంధిర లోకము’!
కర్నూలు జిల్లాలో ఎనిమిది శాసనాల్లో లభ్యం

కుట్ర.. మహా కుట్ర.. తెలుగు ప్రాచీనతను వేల ఏళ్ల మేర కుదించేందుకు తమిళులు పన్నిన కుట్ర! క్రీస్తుపూర్వం 3000-2500 సంవత్సరాల నాటికే తెలుగు ఒక భాషగా విలసిల్లిందని నిరూపించే శాసనాలు మూడు దశాబ్దాల క్రితమే బయటపడ్డాయి! అయినా.. ఆ శాసనాలు వెలుగు చూస్తే తెలుగు కన్నా ప్రాచీనమైనదిగా భావిస్తున్న తమ భాషకు ఎక్కడ ఆ హోదా దక్కకుండా పోతుందో అన్న భయంతో వాటిని చెన్నైలోని సెంట్రల్ లైబ్రరీకి పరిమితం చేశారు! తెలుగు భాష ఔన్నత్యాన్ని తగ్గించిన ఆ చీకటి నిజాలు.. తమిళుల కుట్ర.. ఇప్పుడు బయటపడ్డాయి.

 అమరావతిలోని ఒక స్తూపం మీద ‘నాగబు’ అనే పదం ఉంది. శాసనాల్లో తొలి తెలుగు పదం అదే అని పలువురు భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, ‘నాగబు’ పదానికి నిజంగా ఆ ఘనత లేదా? క్రీస్తు పూర్వం నాటికే తెలుగు ప్రత్యేక భాషగా ఉండేదా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ‘అంధిర లోకము’.. తెలుగులో శాసనబద్ధమైన తొలి పదం ఇదేనని పురావస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇందుకు ఆధారమైన క్రీ.పూ.3000-2500 ఏళ్లనాటి శాసనాన్ని.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలలో కనుగొన్నారు.

ఈ శాసనంలో “అంధిరలోకము” అనే పదం ఉంది. ప్రస్తుతం మనం ‘ఆంధ్ర లోకము’గా పలుకుతున్న పదాన్నే పూర్వం ఇలా అనేవారని గుర్తించిన పరిశోధకులు దీనిని ప్రపంచంలోనే శాసనపూర్వకమైన తొలి తెలుగు పదంగా గుర్తించారు. ఓర్వకల్లు మండలంలోని వివిధ గ్రామాల్లో దొరికిన మరో ఎనిమిది పురాతన శాసనాల్లోనూ తెలుగు పదాలను కనుగొన్నారు. కన్నమడకలలోనే.. “అంధిరపతి” అనే పదం ఉన్న మరో శాసనాన్ని కూడా కనుగొన్నారు. అలాగే తెలుగు, బ్రాహ్మీ లిపిలో ఐదు పంక్తులు కలిగిన క్రీ.పూ.300 నాటి మరో శాసనం కూడా అక్కడే లభించింది.

ఈ శాసనంలో ఆంధ్రము అనే పదాన్నే “అంధిరం”గా పేర్కొన్నారు. బొల్లవరం గుట్టలవద్ద క్రీ.పూ.400 కాలం నాటి మరో శాసనం లభ్యం కాగా ప్రాచీన తెలుగు బ్రాహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనంలో “గిబ్బతీగల” అని రాసి ఉంది. తీగల అనేది కూడా అచ్చ తెలుగు పదం. క్రీ.పూ.4వ శతాబ్దం నుంచి ఇప్పటివరకూ కూడా బొల్లవరం సమీపాన ఉన్న ఈ రాళ్లగుట్టను గిబ్బతీగల అనే పిలుస్తుండటం విశేషం. గిబ్బతీగల గుట్ట రాళ్లపై క్రీ.పూ.500 నాటి మరో శాసనం ఉండగా అందులో ‘పొల్లావరం’ అనే పదాన్ని గుర్తించారు.

అలాగే.. కేతవరం గ్రామంలో లభించిన క్రీ.పూ.4వ శతాబ్దం నాటి మరో శాసనంలో “యు.సిద్ధాంతము” అనే పదాన్ని “యు.చిత్ థాన్ తము”గా పేర్కొన్నారు. “కేశవులు మువ్వడి” అని రాసి ఉన్న క్రీ.పూ.625 నాటి మరో శాసనాన్ని కూడా కేతవరంలోనే గుర్తించారు. క్రీ.శ.800 నాటి మరో శాసనంలో.. “తుంగభద్ర” అనే అచ్చ తెలుగు పదాన్ని కూడా కనుగొన్నారు. అంటే.. క్రీ.పూ.3000-2500 కాలం నాటికే తెలుగు ప్రత్యేక భాషగా ఏర్పడిందనే విషయం స్పష్టమవుతోంది.

కారణాలేవైనాగానీ.. అమరావతిలోని ‘నాగబు’ పదం కంటే అత్యంత పురాతనమైన తెలుగు పదాలను కర్నూలు జిల్లాలో కనుగొన్నా ఆ విషయం బయటికి రాకపోవడంతో తెలుగు భాష సముజ్వల చరిత్రను, ప్రాచీన్యతను కూడా కోల్పోవాల్సి వచ్చింది. తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచే వాస్తవాలు ఎందుకు మరుగునపడ్డాయి? లాంటి ప్రశ్నలకు విస్పష్ట సమాధానాలున్నాయి.

ఎనిమిదో దశకంలోనే..
1977లో అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ సూర్యన్ కాశీపాండ్యన్ ఓర్వకల్లు మండలంలో సాగించిన పరిశోధనల్లో కేతవరం, పూడిచెర్ల ప్రాంతంలో ప్రాచీన లిపి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలిసి, 1980ల్లో.. తమిళనాడు భాషా పరిశోధకుడు సుబ్రమణ్య మలయాండి కర్నూలు జిల్లాలో పరిశోధనలు సాగించి పురాతన తెలుగుపదాలను కనుగొన్నారు. ‘అంధిరలోకము’నే తొలి తెలుగుపదంగా ఆయన కూడా గుర్తించారు.

“హిస్టారికల్ స్టడీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. ఎ కంపారిటివ్ స్టడీ ఆఫ్ తుంగభద్ర అండ్ వ్యాలీ” పేరిట పరిశోధన పత్రాన్ని మలయాండి సమర్పించారు. ఈ విషయంలో ఆయనకు తోటి తమిళుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. క్రీస్తు పూర్వం 2500 నాటికే తెలుగు భాషా, లిపి ఉందని నిర్ధారిస్తే తమిళానికి తెలుగు తర్వాతి స్థానమే లభిస్తుంది. అందుకే మలయాండి పరిశోధనాంశాలను ప్రాచుర్యంలోకి తేవడానికి తమిళులు అంగీకరించలేదు. దీంతో మలయాండీ కన్నమడకలలో శోధించి సాధించిన శాసనాలు చెన్నై సెంట్రల్ లైబ్రరీలో పడిపోయాయి.

దీని ఫలితంగానే ‘నాగబు’ కంటే ప్రాచీనమైన తొలి తెలుగు పదం గురించి తెలియకుండాపోయింది. అయితే మలయాండి విదేశంలో సమర్పించిన పరిశోధన పత్రం ప్రతులు కొన్ని బయటకు వచ్చాయి. అలా ఒక ప్రతి.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చేరగా, అది కర్నూలు జిల్లాకు చెందిన సాహితీ పరిశోధకరత్న.. వైద్యం వెంకటేశ్వరాచార్యులు చేతికి చేరింది. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని వైద్యం వెంకటేశ్వరాచార్యులు ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా “కర్నూలు జిల్లా కవి తరంగిణి” పేరిట అనే పుస్తకాన్ని రచించిన వైద్యం.. “ఆంధ్రలోకము” పదానికి చెందిన ప్రాచీన లిపిని ఆ పుస్తక ముఖచిత్రంగా ముద్రించారు.

హంద్రీ నుంచే ఆంధ్ర!
ప్రాచీన తెలుగు భాష ఆనవాళ్లు లభించడమే కాదు.. ఆంధ్ర అనే పదం కూడా కర్నూలు జిల్లాలోనే పుట్టిందని కూడా భాషా పరిశోధకులు చెబుతున్నారు. ఈ జిల్లాలో ప్రవహించే హంద్రీ అనే చిన్న నది నుంచే “ఆంధ్ర” అనే పేరు వచ్చి ఉం టుందని ప్రముఖ తెలుగు పరిశోధక పండితులు మల్లంపల్లి సోమశేఖర శర్మ గతంలో వెలిబుచ్చిన అభిప్రాయం నిజమేనని చెప్పడానికి కావాల్సిన ఆధారాలున్న శాసనాలు కూడా ఇక్కడ లభించాయి.

దాదాపు 1400 ఏళ్ల క్రితం నాటి ఒక తామ్ర శాసనంలో ఇం దుకు ఆధారాలున్నాయి. ఆ శాసనంలో ఈ నదిని “అందిరి”అని పేర్కొన్నారు. ఈ నది ప్రవహించే గూడూరు, కోడుమూరు ప్రాంతాలలో కానుగ చెట్లను పోలి ఉండే అంద్రిక చెట్లు ఇప్పటికీ ఉంటాయి. ఈ చెట్ల కారణంగానే ఈనదికి అందిరి నది అని పేరు వచ్చిందని.. కాలక్రమంలో ఆ పేరు హంద్రీగా మారిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఆధారం : ఆంధ్రజ్యోతి కథనం

10 సెప్టెంబర్, 2018

తెలంగాణ ఆత్మగౌరవమే భాష (కాళోజీ 104 జయంతి సందర్భంగా...)

మాట్లాడే భాషనే పుస్తకాల్లో కూడా ఉన్నప్పుడు ఆ భాష సులభంగా అర్థం అవుతుందని ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు.శనివారం నాడు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపి నగర్ లో గల బి.సి. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో  కాళోజీ నారాయణరావు 104వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్  తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సాక్షి దినపత్రిక, 10 సెప్టెంబరు 2018



 స్థానిక భాషా పదాలు నిఘంటువులలో చేర్చకుండా కొన్ని ప్రాంతాల భాషా పదాలను నిఘంటువులో చేర్చటం వలన తెలంగాణ భాష వివక్షకు గురైందని తెలంగాణ ప్రజలు భావించారని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించారు విద్యార్థులకు ఆహార పదార్థాలను పంపిణీ చేసి కాళోజీ నారాయణరావు తెలంగాణ ఏర్పాటు, భాషా, సాంస్కృతిక చైతన్యానికి చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. మనం మాట్లాడుకునే భాష లోనే మన మాతృభాష అయిన తెలుగును చదువు కోవడం వలన ఇతర భాషలైన ఆంగ్లం, హిందీ తదితర భాషలను నేర్చుకోవడం వీలవుతుందని రామస్వామి యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గోపాల్, అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, శ్రీను విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి 10 సెప్టెంబరు 2018




17 ఏప్రిల్, 2017

మహీధర రామమోహనరావు ‘ఓనమాలు’ : తెలంగాణా పోరాటం

పుట్టిందీ, పెరిగిందీ సనాతన సంప్రదాయ యజ్ఞ యాగాదులు చేసుకునే కుటుంబంలోనే అయినా, అభ్యుదయ భావాలతో జీవించి అనేక ఉద్యమాల్లో పాల్గొని, ఆ జీవిత సారాంశాన్ని అందిస్తున్నట్లుగా అనేక నవలలు రాసిన రచయిత మహీధర రామమోహనరావు. 
మహీధర రామమోహనరావు సుమారు 15 నవలల్ని రాశారు. అనేక రచనల్ని అనువదించారు. 1954లో రథ చక్రాలు; 1956లో ఓనమాలు; 1957లో మృత్యువు నీడల్లో; 1959లో ఎవరికోసం; 1960 లో కత్తుల వంతెన; 1965లో కొల్లాయిగట్టితేనేమి? 1969లో స్వయంవరణం; 1972లో అగ్ని గుండం; 1984లో దేశం కోసం; 1993లో జ్వాలా తోరణం నవలల్ని గ్రంథ రూపంలో వెలువరించారు. రథ చక్రాలు నవల 1948లోనే 
రాసినా అది 1954కి గాని గ్రంథ రూపంలోకి రాలేదు. మిగిలిన రచనలు కూడా వివిధ పత్రికల్లో సీరియల్‌గా వచ్చినా, గ్రంథ రూపంలోకి రావడం మాత్రం ఆలస్యమైంది. వీటితో పాటు మబ్బు తెర, పరిష్కారము వంటి నాటకాల్ని కూడా రాశారు. మరికొన్ని అభ్యుదయ రచనలను అనువదించారు. తన స్వగ్రామం ముంగండలో విశ్వసాహిత్యమాలను స్థాపించి, దాని ద్వారా మార్క్సిస్టు గ్రంథాలను అనువాదం చేసి, ఆ భావాల్ని ప్రచారం కల్పించేవారు. కమ్యూనిస్టు నిషేద కాలంలో రాయలసీమలో రహస్య జీవితాన్ని గడిపారు. పీడితుల పక్షాన నిలబడిన మహీధర రామమోహనరావు తాను పుట్టి పెరిగిన ప్రాంతం కాకపోయినా, తెలంగాణాలో జరిగిన సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ, ఆ చారిత్రక నేపథ్యాన్ని ఓనమాలు నవలలో ఎంతో విపులంగా రాశారు. 
తూర్పు గోదావరి జిల్లాలోని ఒక విస్మృత ప్రాంతంలో తాను భాగస్వామిగా ఉండిన పరిణామాలు కేంద్రంగా స్వాతంత్రోద్యమ తీరుతెన్నుల్ని, ఆ ప్రాంత తెలుగు సమాజంలో కలిగిన సామాజిక చలనాన్ని స్వాతంత్రానంతరం కాలంలో మహీధర కొల్లాయి గట్టితేనేమి'', "దేశం కోసం'', జ్వాలా తోరణం'' అనే నవలాత్రయంగా రచించార''ని ఆ రచనల గురించి రాస్తూ ప్రముఖ విమర్శకుడు బి. సూర్య సాగర్‌ పేర్కొన్నారు. 
కొల్లాయి గట్టితేనేమి'' 1920 వ సంవత్సరంలో గాంధీ సహాయ నిరాకరణోద్యమ నేపథ్యాన్ని, దేశం కోసం'' 1935-39 కాలానికి, జ్వాలా తోరణం'' 1939-45 కాలానికి చెందిన ఇతివృత్తాలతో కూడిన నవలలు. ప్రపంచ యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాత్ర, అంతర్జాతీయ ప్రభావం వంటి వన్నీ వీటిలో కనిపిస్తాయి. మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే, గాంధీ సంస్కరణ వాదం కొల్లాయి గట్టితేనేమి'' లోనూ, కమ్యూనిస్టు పోకడల్ని దేశం కోసం'' లోనూ, సామ్యవాద వాస్తవికతను జ్వాలా తోరణం'' లోనూ ఆయన వివరించారు. కొల్లాయి గట్టితేనేమి''లో కథానాయకుడు రామనాథం ఆ సంస్కరణ భావాల ప్రభావంతో నాడు హరిజనుల్ని పిలిచే దళితులకు తన తోటలోని మంచినీటి బావిని 
తాగునీటి కోసం కేటాయిస్తాడు. రామనాథానికి, గాంధీ ఉద్యమం కోరేదేమిటో స్పష్టంగా తెలియక పోయినా, గాంధీ సంస్కరణ భావాల్ని ఆచరించే పాత్రగా కనిపిస్తాడు. ఈ నవల లక్ష్యాన్ని వ్యాఖ్యానిస్తూ బి. సూర్య సాగ?ర్‌ ఇలా అన్నారు. కొల్లాయి గట్టితేనేమి''లో సంస్కరణ వాదము కేంద్ర దృక్పథంగా ఉన్నది. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మార్గం యొక్క నిస్సారతను ఆ నవలలో పసికట్టడం కష్టమేమి కాదు. అయితే ఆ నిస్సారతను వెల్లడించడం మహీధర లక్ష్యం కాకపోవచ్చు అందువల్లనే మౌలికమైన మార్పుల్ని గాంధీ సంస్కరణ వాదం కలిగించ లేకపోయిందనీ, రామనాథం దళితులకు బావిని కేటాయించినా, దానిపై హక్కుని సాధించలేక పోయారని స్పష్టంగ?ా దీన్ని బట్టి తెలుస్తుంది. రామనాథం దళితులకు బావిని కేటాయించినా, దానిపై హక్కుని సాధించలేక పోయారని స్పష్టంగా దీన్ని బట్టి తెలుస్తుంది. 
జ్వాలా తోరణం'' నవల శోభాదేవి (మంగమ్మ) వర్ణనతో ప్రారంభమవుతుంది. ముంగండ సత్యనారాయణ కూతురు మంగ?ాదేవి, బాల వితంతువు. అతడు ఆమెను మద్రాసు తీసుకెళ్ళి చదివిస్తాడు. పునర్వివాహాన్ని ప్రోత్సహించినా, కులాంతర వివాహాన్ని మాత్రం వ్యతిరేకిస్తాడు. వయొలిన్ నేర్చుకుని మంగమ్మ తన పేరుని శోభాదేవి''గా మార్చుకుంటుంది. ఆమె కుల, మతాంతరుడూ అయిన కుట్టన్‌ ను వివాహం చేసుకుంటుంది. ఈ నవలలో కులాంతర వివాహాలతో పాటు, వితంతు పునర్వివాహాల్ని చర్చలోకి తెచ్చారు రచయిత. ఈ మూడు నవలల్ని వరుసగా చదివితే రాష్ట్రంలో చారిత్రకంగా వచ్చిన, ముఖ్యంగా కోనసీమలో వచ్చిన సామాజిక పరిణామాలను, సంస్కృతిలో వచ్చిన మార్పులను అవగాహన చేసుకోవచ్చునని విమర్శకుల అభిప్రాయ పడ్డారు. 
దేశం కోసం'' నవలలో కథానాయకుడు వెంకట్రామయ్య. వామపక్ష భావాలకు ఆకర్షితుడవుతాడు. కొంతమంది యువకులతో కలిసి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడు. గ్రామంతో ప్రారంభించి, క్రమేపీ చుట్టు ప్రక్కల గ్రామాలు, తాలుకా, జిల్లా స్థాయి వరకు 
ఉద్యమాన్ని విస్తరిస్తాడు. గ్రంథాలయాలు, గురుపీఠాలు, యువజన సంఘాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని మేల్కొలుపుతాడు. మతం పేరుతో జరిగే దోపిడీల్ని వెల్లడి చేసి ప్రజల్ని చైతన్య పరుస్తాడు. మత భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసే రామానుజాచారిని కూడా ప్రజా సాహిత్యం సాంస్కృతిక కార్యక్రమాల వైపు దృష్టి మళ్ళించ గలుగుతాడు. 
వెంకట్రామయ్య వివాహమైనా బతుకు తెరువు కోసం పది మందికి పాఠాలు చెప్తాడు. కానీ, తన లక్ష్యం మాత్రం సమ సమాజ స్థాపనే! అతడు తనకోసం, తన కుటుంబం కోసం ఆస్తి కూడ బెట్టక పోవటమే కాకుండా, సంతానం కూడా వద్దనుకుంటాడు. భార్య అన్నపూర్ణకు తెలియకుండా ఆపరెషన్‌ చేయించుకుంటాడు. అది భార్యకు తెలిసి ఇద్దరి మధ్య స్పర్థలొస్తాయి. భార్యా భర్తలిద్దరూ విడిపోతారు. వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా, సమాజం కోసమే బతకాలనుకునే తన భర్త త్యాగాన్ని అర్థం చేసుకొని, ఆమె అతని దగ్గరకు చేరుకుందామనుకునేసరికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధిస్తారు. దీనితో నవల ముగుస్తుంది. కమ్యూనిస్టు ప్రాధమిక దశలో ఉద్యమకారులు పడిన కష్ట, నష్టాల్ని వారి వ్యూహాల్ని అర్థం చేసుకొని, ఆ సిద్ధాంతం లోటు పాట్లను గుర్తించడానికి ఈ నవల ఉపయోగపడుతుంది. 
మానవ సంబంధాలలో స్వేచ్ఛను ప్రతిపాదించటమే మహీధర నవలల్లోని రచనా ఉద్దేశ్యమని ప్రముఖ విమర్శకుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. 
స్వయంవరణం నవల కులాంతర వివాహాన్ని చర్చిస్తుంది. పెళ్ళి చూపులు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటూ ప్రేమ'' లేని జీవితాన్ని కొనసాగించటం కంటే ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించగలిగే ప్రేమ వివాహాలే ఆదర్శనీయం అని చెప్తుంది. ఈ నవలలో పితృస్వామ్య ఈ వ్యవస్థకు చెందిన పెళ్ళి చూపుల్ని తిరస్కరించి సమ్ముఖం'' పద్ధతిని ప్రవేశ పెట్టారు. యువతీ, యువకులు చదవడం వల్లనో, వృత్తి చేయడం వలనో ఒకరినొకరు పరిచయమై, ఒకరినొకరు అర్థం చేసుకుని, అభిప్రాయాలు పంచుకుని ప్రేమను పెళ్ళిలో పరవశింప 
చెయ్యడం సమ్ముఖం. ఈ పద్ధతి అభ్యుదయమైనదని రచయిత ప్రతిపాదన. 
సుధ బ్రాహ్మణ అమ్మాయి. కామేశ్వరరావు బ్రాహ్మణేతరుడు. ఇద్దరూ కాలేజీలో లెక్చరర్స్‌గా పనిచేస్తూ ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటారు. అలాగే రుక్మిణి బ్రాహ్మణేతర కులస్తురాలు. ప్రభాకరరావు బ్రాహ్మణుడు. ఈ రెండు జంటలూ ప్రేమ పయనంలో సమాజంలో జరిగే సంఘర్షణ అంతా స్వయం వరణం'' చిత్రించి అంతిమ విజయం కుల రహిత ప్రేమ సమాజానికేనని తేల్చారు రచయిత. 
శుభలేఖ? నవల ప్రేమ కోసం తపించే లక్షణమున్నా దానికి తగిన చైతన్యం కొరవడితే కలిగే పర్యవసాలను చిత్రించింది. చంద్రశేఖర శాస్త్రి, సత్యవతి దంపతులు. వాళ్ళ సంతానం ఉమాదేవి, రామక్రిష్ణ. భాస్కరరావు అనే యువకుడిని ఉమాదేవి ప్రేమించినా, ఆమె తన తండ్రిలోని సనాతన తత్వాన్ని పోగొట్టలేకపోతుంది. రామక్రిష్ణ వర్ణాంతర వివాహం చేసుకోవడంతో పాటు, తన చెల్లెలు ఉమాదేవి ప్రేమ వివాహం కూడా విజయవంతం కావాల్ని ఆశిస్తాడు. అయినా ఆమె ప్రేమ వైఫల్యం చెందడానికి సమాజంలో పాతుకుపోయినా సంప్రదాయ సంకెళ్ళు ఒక వైపు, ఆ సంకెళ్ళు మానసికంగా కనిపించినా అధైర్యం మరొక వైపు స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నాయని నిరూపించే దిశగా శుభలేఖ నవలా రచన కొనసాగింది. 
తెలంగాణలో జరిగిన విప్లవ పోరాటాన్ని మూడు దశలుగా విభజించుకోవచ్చు. 1930 నుండి 1944 వరకు ఆంధ్ర మహాసభ పరిణామం చెందుతూ, భాషా సాంస్కృతిక ఉద్యమంతో పాటు రైతాంగ సమస్యలపై ఆందోళన, పోరాటం చేసే స్థితికి, ఆ తరువాత మిలిటెంటు ఉద్యమ స్థాయికీ అభివృద్ధి చెందిన మొదటి దశ నిజాం రెవిన్యూ పోలీసుల అధికారుల దౌర్జన్యాలు, దేశంలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోలీసు, రజాకార్లను, ఎదుర్కొనటం, సాయుధంగా దున్నేవానికే భూమిని రైతాంగమే అమలు పరచుకుంటూ, గ్రామ రాజ్యాలను ఏర్పరచుకోవటం, ఈ దశలోనే 3000 గ్రామాలలో నిజాం ప్రభుత్వం లేకుండా స్థానిక 
స్వరూపాలను నెలకొల్పుకోవటం జరిగింది. ఇది 1944 నుండి 1948 సెప్టెంబర్‌ లో యూనియన్‌ సైన్యాలు పోలీసు యాక్షన్‌ పేరుతో ప్రవేశించే దాకా సాగింది. ఇందులో రెండు సంవత్సరాలు సాయుధంగా సాగింది. దీన్ని రెండవ దశగా చెప్పుకోవచ్చు. మూడవ దశ భూమిని కాపాడుకొంటూ యూనియన్‌ సైనిక బలాన్ని ఎదుర్కొంటూ, గెరిల్లా రైతాంగ పోరాటం వరకు సాగినదశ మూడవది. అది 1948 నుండి 1951 వరకు సాగింది. 
  దీనిలో మొదటి దశకు చెందిన నవల ఓనమాలు. రచయితే దీనిలోని కథా వస్తువుని ఇలా వివరించారు. ..నాటి తెలంగాణ ఒక అగ్ని గుండం. దుస్సహనమైన జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించగల పోరాటాల్ని ప్రజానీకం కొనసాగిస్తుంది. వాటినన్నింటినీ ఒకే జెండా కిందికి తెచ్చి, రాజకీయ నాయకత్వం సమకూర్చడానికై ఆంధ్ర మహా సభా, కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు సాగిస్తున్నాయి. రెండో వైపున విదేశీ పాలనకు, సంస్థానాధీశుల నిరకుశ పాలనకూ వ్యతిరేకంగా జాతీయ ప్రజాతంత్ర పోరాటాలు తెలంగాణాని అలుముకుంటున్నాయి. ఈ దశలో విచ్చిన్నమై పోతున్న జాగీర్దారీ వ్యవస్థను రక్షించగల శక్తి నిజాం ప్రభుత్వానికి లేదని గ్రహించిన భూస్వామ్య వర్గం, నూతన నాయకత్వం కొరకు వెతుకులాడుతూ జాతీయోధ్యమంలో తనకు రక్షణ ఇవ్వగల శక్తుల్ని చూసుకుంది. సమాజంలో తనకున్న బలం క్రమంగా క్షీణించి పోతూంటే కూలిపోతున్న తన అధికారాన్ని పరిరక్షించు కొనేటందుకై మత వాదుల్ని, రౌడీల్ని సమీకరించీ విధ్వంస కాండకు పూనికొంది నిజాం సర్కారు. ప్రజానీకానికీ, ప్రతి నిరోధక శక్తులకు మధ్య జరిగిన ఈ ఘర్షణలతో తెలంగాణా ఒక అగ్నిగుండమే అయ్యింది. ఆనాటి సంఘర్షణలే నాయీ నవలకు కథా వస్తువు''.
తెలంగాణా ప్రాంతంలో దొరలు ఒక కుటుంబానికి బంజరు భూమినిచ్చి, దాన్ని పంటపొలంగా వాళ్ళు బాగ?ు చేసిన తర్వాత ఆ పొలాన్ని ఆ దొర కొడుకులు, మనవలు ఎలా లాగేసుకుంటారో, దాన్ని కాపాడుకోవడానికి ఆ పొలాన్ని ఆ దొర కొడుకులు, మనవలు ఎలా 
లాగేసుకుంటారో, దాన్ని కాపాడుకోవడానికి ఆ పొలాన్ని నమ్ముకున్న వాళ్ళెలా బాధ పడతారో ఓనమాలు నవలలో చెప్పారు రచయిత. సత్తెమ్మ, వాళ్ళమ్మ వీరమ్మ, రంగయ్యలు దీనిలో ఆ కుటుంబ సభ్యులు. ఆ కుటుంబానికి భూమినిచ్చి, మళ్ళీ దాన్ని లాక్కున్న కుటుంబం శివరామిరెడ్డి, ఆయన కొడుకులు రఘనందనుడు, రమణారెడ్డులు. దీన్ని ఆసరా చేసుకొని తెలంగాణా ప్రాంతంలో జరిగిన అనేక చారిత్రక సంఘటల్ని నవలలో చేర్చారు. చివరికి సత్తెమ్మ దొరలపై తిరగబడ్డంతో, వాళ్ళు పారిపోవడంతో నవల ముగుస్తుంది. 
తెలంగాణ ప్రాంతంలో నైజాం ప్రభుత్వం, దాన్ని బూచిగా చూపి పోలీసులు, జాగీర్థారులు, కొంతమంది ముస్లింలు చేసే అకృత్యాలు, దుర్మార్గ?ాల్ని అవగాహన చేసుకోడానికి "ఓనమాలు' నవల ఎంతగానో సహకరిస్తుంది. అప్పుడు జరిగిన చారిత్రక సంఘటనలన్నీ సన్నివేశాలుగా, పాత్రలుగా రూపొందించటంలో రచయిత మహీధర రామ్మోహనరావు ప్రదర్శించిన సృజనశీలత ప్రశంసనీయం. ఒక కుటుంబంలో జరుగుతున్న కథనే చెప్తున్నట్లున్నా, ఆ సంఘటనల తీవ్రతను అద్భుతంగా వర్ణించి ఆ సమస్యల్ని ఒక కుటుంబానికే పరిమితమైనవి కాదని పాఠకుడు గ్రహించేటట్లు, ఆనాటి చారిత్రక సంఘటనల్ని అర్థం చేసుకునేట్లు నవల్ని అద్భుతంగా కొనసాగించారు. 
తెలంగాణలో ఉర్దూ, పారశీక భాషల ఆధిపత్యం మధ్య నలిగిపోయిన తెలుగు భాష "ఓనమాలు'' నేర్చుకోవాలన్నా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుందో దొంగబాటుగా "ఓనమాలు'' పుస్తకాన్ని తెచ్చుకొని, సత్తెమ్మ చేసే బోళ్ల పోలంలో సంగం సభ్యులు రహస్యంగా చదువుకోవటం తెలుపుతుంది. ఆ పుస్తకం కూడ దొరల మనుషులు చింపేస్తుంటే కొన్ని కాగితాలు దాచుకున్నారట! 
నాడు ఆంధ్ర మహాసభ కలిగించిన చైతన్యం విప్లవాత్మకమైంది. పేద వర్గాల సమస్యల్ని పోరాట పంథాలో భాగ?ం చేయగలగడం వల్ల మరింత శక్తివంతంగా సంగం'' సామాన్య జన వ్యవహారంలోకి రాగలిగింది. చిలుకూరులో వెట్టి వ్యతిరేక తీర్మానం చేసినా, దాన్ని భువనగిరి మహా సభ 
కార్య రూపంలో పెట్టిన తర్వాత సంగం సామాన్య జనంలోకి చొచ్చుకుపోగలిగింది. అనేక ప్రాంతంల్లో జరిగిన వెట్టి వ్యతిరేక పోరాటాన్ని సంగం'' ప్రోత్సహించింది. ఆ వార్తల్ని ప్రజాశక్తి పత్రికలో అందిస్తుంటే, వాటిని రహస్యంగా మరో వారం రోజుల తర్వాతనైనా చదివి చైతన్యం పొందే వారంటే సంగం, ఆ పత్రికలు తెచ్చిన చైతన్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. 
సంగం'' అన్ని కుల వృత్తుల వాళ్ళనీ ఐక్యం చేసి నిర్భంధ చాకీరి నుండి విముక్తి కలిగించాల్ని ప్రయత్నించింది. సంగం'' సభ్యుల మీద ఎన్ని నిషేధాలు ఉన్నా చాకలి మంగమ్మ వంటి వాళ్ళు ఆ నాయకుల్ని కాపాడేవారని తెలుస్తుంది. ఆ నాయకులు కూలీ రాజ్యం వస్తుందనే వారు. అప్పుడు అణగారిన వర్గాల వారే 
పాలకులవుతారని, వారి సమస్యల్ని వాటి పరిష్కారాల్ని వారి చేతనే చెప్పించటం వలన సంగం సభ్యులు ఎలాంటి కార్య చరణను కొనసాగించే వారో అర్థమవుతుంది. 
వెంకటయ్యను సత్తెమ్మ రెండో పెళ్ళి చేసుకోవాలనుకోవటం సావిత్రి తల్లి, అనసూయమ్మ, ముంతాజ్‌ వంటి స్త్రీల అక్రమ సంబంధాలు విషయంలో నాటి పాలకుల, ప్రజల విధానాల్ని, ఆకాంక్షల్ని అర్థం చేసుకోవచ్చు. 
బుడాన్‌ పొద్దున్నుండి రాత్రి వరకు అనసూయమ్మ ఇంటి దగ్గరుండి, ఓ దొర నరిసిరెడ్డి లాగేసుకున్న యాభైయ్యెకరాల భూమిని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఖాసీం రజ్వీ అనుయాయీ, పెద్ద జాగీర్దార్‌ ఖాజీ మహమ్మద్‌ రసూల్‌తో మాట్లాడానని చెప్పి, అత్తా కోడళ్ళను మోసగించి కోడల్ని శారీరకంగా అనుభవించే సంఘటల్ని చదివినప్పుడు, ప్రజలెలా మోసపోయేవారో అర్థమవుతుంది. నాడు ప్రభుత్వం, కోర్టులు, చట్టం, పట్టించుకోని భూవ్యాజ్యాల్ని పరిష్కరించుకోవటానికి అక్రమ'' సంబంధాల్ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించవలిసి వచ్చేదని, అది ప్రజలక తెలిసి పరువు, ప్రతిష్ఠల్ని కోల్పోవలసి వచ్చేదని స్పష్టమవుతుంది. 
వ్యక్తిగతంగా హిందూ - ముస్లింల మధ్య కుటుంబాల్లో కలిసి మెలిసి ఉండే సంబంధాలున్నా, నైజాం నవాబుల పాలనలో హిందువుల పట్ల నిర్లక్ష్యం, ఖాశీం రజ్వీ పోషించే రజాకారుల దురాగతాల వల్ల ముస్లింలంతా వ్యవస్థీకృతంగా హిందువుల్ని వ్యతిరేకించే భావన కలిగించగలిగే వారని తెలుస్తుంది. అది ముస్లిం అయినా ముంతాజ్‌ ఇంటికి సత్తెమ్మ వెళ్ళటం, ఆమె ఇంటికి వెంకటయ్య రావటం, బుడాన్‌ ఆజాద్‌ - హైదరాబాద్‌'' ప్రచారం వంటివన్నీ స్పష్టం చేస్తున్నాయి. 
తెలంగాణాలో నైజాం ప్రభుత్వం ఢిల్లీ పాలకులతో, అసాంఘిక శక్తులతో సంబంధాలు పెట్టుకొని రహస్యంగా ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటూ, వాటిని అన్ని ప్రాంతాల్లో హిందువులపై జరిగే అల్లర్లలో ఉపయోగించుకోవడానికి సహకరించేదని తెలుస్తుంది. అలాంటి ఆయుధాల్ని వెంటబెట్టుకుని కొంతమంది లారీల్లో ఊరేగింపుగా వచ్చి, జనాన్ని భయ భ్రాంతులకు గురి చేసి, ముసలి వాడ్ని చంపేస్తారు. కారుతున్న రక్తం చూసి, అతడు చనిపోయాడని గమనించి, ఊరేగింపు చేస్తున్నవాళ్ళు పారిపోతారు. ఊళ్ళో ప్రజలు వాళ్ళు పారిపోతున్నారని తెలిసి, ముసలివాడి దగ్గరకు వస్తారు. వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళంతా పారిపోతారు. అలాగే అంతకు ముందు కూడా సత్తెమ్మ కర్ర తీసుకుని బోళ్ళబావి పొలాన్ని స్వాధీనం చేసుకోబోతున్న దొర మనుషుల్ని కొట్టడానికి వెళ్ళినపుడు కూడా ప్రజలు చాలా మంది తిరగబడాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారు కాదు. అయినా గుంపులుగా వస్తున్న మనుషుల్నీ చూసి వాళ్ళు పారిపోయారు. కాబట్టి స్థానిక ప్రజల్లో దొరలు నైజాం ప్రభుత్వం, పోలీసులు పట్ల భయం ఉన్నా అవకాశం వస్తే తిరగబడాలనే ఆకాంక్షే ఉందని స్పష్టమవుతుంది. అదే పద్ధతి ముగింపులోనూ కనిపిస్తుంది. 
తెలంగాణాలో సాయుధ పోరాటం జరగడానికి వెనక ఎంతో నేపథ్యం ఉంది. సాయుధ పోరాటం ఒక్కసారిగా ఎగిసి పడలేదు. ప్రజల కష్టనష్టాల నుండి వచ్చింది. పాలకుల, పాలకుల ఉదాసీన వైఖరి వల్లా, పాలకులను ఆశ్రయించుకున్న హిందు జాగీర్దారీ పీడనను అవగాహన 
చేసుకోవాలంటే ఓనమాలు నవల చదివి తీరాల్సిందే. 
తెలంగాణా సాయుధ పోరాటం జరగడానికి సమాజంలో స్పష్టంగా వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భూస్వాములు, ఉన్నంత వర్గం, మధ్య తరగతి, పేద వర్గంగా వాళ్ళు విడిపోయారు. కులం, వారి వృత్తులతో సంబంధం లేకుండా అందరూ ఒకే రకమైన పీడనను అనుభవించినట్లు నవలలో కనిపిస్తుంది. బహుశా, కుల సమస్య ఉన్నా, పీడన ప్రధానమైనప్పుడు దాన్నుండి రక్షించుకోవడానికి కొన్ని కులాలు ప్రయత్నించేవని కూడా అర్థమవుతుంది. అయితే రచయిత మాల, మాదిగలను ముస్లింలుగా మార్చుకోవడాన్ని మరోలా వివరించే ప్రయత్నం చేశారు. 
సిలారు ముస్లిం అయినా, హిందువుల పట్ల బుడాన్‌ లాంటి ద్వేషం ఉన్నవాడు కాదు. బుడాన్‌ ఒకసారి పందినీ, ఒక హిందువునీ చంపిన వాడు. ఆ తర్వాత ఖాసీం రజ్వీ ముఠాలో చేరినవాడు. ఆ దుర్మార్గం చూసిన తర్వాత బుడాన్‌ని తన అల్లుడుగా సిలార్‌ అంగీకరించలేదు. అలాంటి బుడాన్‌, ఒకరోజు సమాజ్‌ చేసుకొనే సమయంలో సిలార్‌ దగ్గర కొచ్చి ముస్లింల స్థితిగతుల గురించి వివరిస్తాడు. నిజాం నవాబుల పాలననూ, ఖాసీ రజ్వీసేనల అవసరాన్నీ చెప్తున్న సందర్భంలో రచయిత ఇలా వ్యాఖ్యానిస్తాడు. 
సిలారుకు అవన్నీ తెలీదు, పల్లెటూళ్ళలో మాల మాదిగలకు ఇతర దళిత జాతులకూ తురక మతం ఇప్పించి వారిని ఇతర కులాల మీదికి ఎగతోలేటందుకే ఖాజీ తీవ్రమైన వుద్యమం సాగిస్తున్నాడు. ఆ విధంగా మతం మార్చుకున్నవాళ్ళ మీద పెద్ద కులాల వాళ్ళు ఆర్థిక ఆంక్షలు ప్రయోగించి లొంగదీసుకుంటున్నారు. ఆర్య సమాజం వారి ద్వారా వారిని శుద్ధి చేస్తున్నారు. ఖాజీ ముస్లిం మత ప్రచారానికి తీసుకున్న శ్రద్ధ మూలంగానే ఆయన భూముల్ని రైతులు వదలకుండా చేయిస్తున్నారని బుడన్‌ చెప్పేడు.'' (ఓనమాలు, తృతీయ ముద్రణ, 1980:163) కులం చేత సమాజంలో అవమానాలు ఉన్నా, రచయిత ఆ కోణం నుండి చూడడం కంటే, వర్గ దృక్పథంతోనే వివరించే ప్రయత్నం చేశాడు. 
ప్రముఖ విమర్శకుడు దివికుమార్‌ ఒక వ్యాసంలో వ్యాఖ్యానించినట్లు బ్రిటీషు వలస వాదులు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమ విభిన్న దశలను, పరిణామాలను, తొలి కమ్యూనిస్టు ఉద్యమ కృషినీ, వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట నేపథ్యాన్ని, పోరాటాన్ని, కోస్తా జిల్లాలలో జమిందారీ వ్యతిరేక పోరాట కాలం నాటి రాజకీయ ఉద్యమ సంఘర్షణాత్మక చరిత్రను మహీధర రామ మోహనరావు అక్షర బద్దం చేయడంలో ఎంతగానో కృతకుత్యులయ్యారు. ఆ చరిత్రను, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఆయన రచనలు ఎంతగానో సహకరిస్తాయనడంలో సందేహం లేదు. 

30 ఆగస్టు, 2016

కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన (18 సెప్టెంబరు 2016)

ప్రసిద్ధ కవి, ఉద్యమకారుడు కుసుమ ధర్మన్న సాహిత్యంపై ఒకరోజు సదస్సుని సాహితీ స్రవంతి వారు ఆనం కళాకేంద్రం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిలాలో   నిర్వహించబోతున్నారు. ఈ సదస్సు 18 సెప్టెంబరు 2016న ఉదయం నుండి సాయంత్రం వరకు జరుపుతున్నట్లు సాహితీస్రవంతి వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో కుసుమధర్మన్న రాసిన పుస్తకాలను, ఆయనపై రాసిన వ్యాసాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. వ్యాసాలు రాసిన వారి స్పందనలతో పాటు వివిధ కుసుమధర్మన్న గారి వివిధ భావాలపై సదస్సులో సాహితీవేత్తలు మాట్లాడతారు. నేను కూడా ఒక కుసుమధర్మన్న గారి గురించి ఒక వ్యాసం రాశాను. అందువల్ల నన్ను కూడా సభకు రమ్మని ఆహ్వానించారు.  

28 ఆగస్టు, 2016

రాజనీతి శాస్త్ర ప్రాథమిక పారిభాషిక పదకోశ నిర్మాణం: కార్యశాల విశేషాలు

 కమీషన్ ఫర్ సైంటఫిక్ & టెక్నికల్ టెర్మినాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆంగ్ల, హిందీ, తెలుగు భాషల్లో ‘‘రాజనీతి శాస్త్ర ప్రాథమిక పారిభాషిక పదకోశ నిర్మాణం’’ గురించి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ది: 22 ఆగస్టు 2016 నుండి 26 ఆగస్టు 2016 వరకు కార్యశాల (వర్క్ షాప్ ) జరిగింది. డా.షహజాద్  అహ్మద్ అన్సారి (Dr. Shahzad Ahmad Ansari), డా.నవీద్  జమాల్ (Dr. Naveed Jamal), పర్యవేక్షణ వహించిన ఈ కార్య శాలకు డా.సయ్యద్ నజీవుల్లా సమన్వయకర్తగా వ్యవహరించారు.

విషయ నిపుణులుగా   ఈ కార్యశాలలో పాల్గొన్న ప్రతినిథులు.  ఆచార్య ఈశ్వరయ్య (హైదరాబాదు విశ్వవిద్యాలయం), డా. చందా రాములు,  డా. సయ్యద్  నజీవుల్లా (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం), డా.ఇ.వెంకటేశు,  (హైదరాబాదు విశ్వవిద్యాలయం), డా. ఆకుమర్తి నాగేశ్వరరావు (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ), డా.వి.వసుంధరాదేవి ( మహిళా కళాశాల, నిజామాబాద్), డా.పల్లవి కాబ్డే (డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం), డా.చలమల్ల వెంకటేశ్వర్లు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), కె.సీతామహాలక్ష్మి (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం), డా.భాస్కర్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట, నల్గొండ), డా.వి.ఎమ్.రాజశేఖర్ ( యన్. టి.ఆర్ . ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వాల్మీకిపురం, చిత్తూరు), డా.దార్ల వెంకటేశ్వరరావు (హైదరాబాదు విశ్వవిద్యాలయం) 
ఒక సాంకేతిక పదాన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్మించవలసి ఉంటుందో ఈ కార్యశాలలో గమనించాను. రాజనీతి, ప్రభుత్వ పాలనా శాస్త్రాలతో పాటు తెలుగు భాష మీద కూడా మంచి పట్టు ఉన్న వీరంతా చక్కని పదకోశాన్ని తయారుచేయడానికి విస్తృతమైన చర్చలు చేసిన తర్వాతనే ఆ పారిభాషిక పదాన్ని అంగీకరించేవారు. కొన్ని పదాలకు ఆంగ్ల పారిభాషిక పదాలనే యథాతధంగా ఉంచడం బాగుంటుందన్నారు. రాయాల్సిన పదాన్ని కంప్యూటర్ తెరపై చూపించి దాన్ని ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఎలా ప్రయోగిస్తున్నారో ప్రకటిస్తారు. తర్వాత దాన్ని తెలుగులో ఎలా ప్రయోగించాలో దానికి అనుగుణంగా పదాన్ని రూపొందిస్తారు. ఒక పదం వెనుక ఉండే భావన, సిద్ధాంతం, ప్రయోగం మొదలైన వన్నీ చర్చించిన తర్వాతనే ఆ పదాన్ని అంగీకరిస్తారు. ఈ ఐదు రోజుల కార్యశాలలో సుమారు పదహారు వందల పదాల వరకు  తయారు చేశారు. రాజనీతి, ప్రభుత్వ పాలనా శాస్త్రాల్లో సుమారు నాలుగువేల పదాల వరకూ వాడుకలో ఉన్నాయి. మిగతా పదాలను కూడా త్వరలోనే తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యశాలలో ఇప్పటికే వాడుకలో ఉన్న పదాలను, నిఘంటువుల్లోని పదాలను, తెలుగు అకాడమి తయారు చేసిన పదకోశాలను, పత్రికల కోసం తయారు చేసిన పదకోశాలను, నిఘంటువులను కూడా సునిశితంగా పరిశీలించి మాత్రమే ఈ పదకోశాన్ని తయారు చేస్తున్నారు. 

కంప్యూటర్ తెరపై పదాల్ని ప్రదర్శించి, చర్చించిన తర్వాత పదకోశాన్ని తయారుచేస్తున్న సభ్యులు


వైస్ ఛాన్సలర్ తదితరులతో కార్యశాలలో పాల్గొన్న విషయ నిపుణులు, తదితరులు  

 ఈ కార్యశాలలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర శాఖాధ్యక్షుడు డా.అఫ్రోజ్ ఆలమ్ ప్రారంభ, ముగింపు సమావేశాల్లో పాల్గొన్నారు. సభను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య షకీల్ అహ్మద్ ప్రారంభించగా,  వైస్ ఛాన్సలర్ ఆచార్య మహ్మద్ అస్సలామ్ పర్వేజ్ ముగింపు సమావేశంలో పాల్గొని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. వీరితో పాటు ఈ సమావేశాల్లో  ఎస్ ఎ అండ్ ఎస్ ఎస్ డీన్ ఆచార్య షహీదా, డా.షబ్ననా పర్హీన్ తదితరులు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో కార్యశాలలో పాల్గొన్నవారందరికీ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.

సర్టిఫికెట్ స్వీకరిస్తున్న డా. దార్ల వెంకటేశ్వరరావు


19 అక్టోబర్, 2015

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం గ్రంథావిష్కరణ సభ విశేషాలు

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభావేదికలో కట్టిన ఆవిష్కరణ బ్యానర్
ఆహ్వాన పత్రం 
ఆవిష్కరణ నాటి గ్రంథ ముఖచిత్రం
స్వాగతం పలుకుతున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభ ప్రారంభానికి ముందున్న సభలో ప్రేక్షకులు, వక్తల దృశ్యం
గ్రంథాన్ని ఆవిష్కరించిన మాట్లాడుతున్న డా. సి.నారాయణరెడ్డి గారు, పక్కనే ఆసక్తిగా వింటున్న పరిశోధకురాలు డా.పుట్ల హేమలతగారు.
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథ ఆవిష్కరణానంతరం
 అధ్యక్ష ఉపన్యాసం చేస్తున్న ఆచార్య ఎన్. గోపిగారు.
సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు

సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు
ప్రసంగిస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
ప్రేక్షకుల్లో డా. మంజుశ్రీ

ప్రేక్షకుల్లో కవులు జుగాష్ విలీ, డా. రఘు పరిశోధక విద్యార్థులు
తెలంగాణ సారస్వత పరిషత్ ముఖద్వారం, దాని కిందుగా ఆవిష్కరణ వివరాలతో కూడిన బ్యానర్

సభలో పాల్గొన్న కథారచయిత్రులు అద్దేపల్లి జ్యోతి, సమ్మెట ఉమాదేవి. కన్నెగంటి అనసూయ, కవయిత్రి మెర్సీ మార్గరెట్ తదితరులు 

రచయిత్రి వలబోజు జ్యోతి గారు, డా. వాసాప్రభావతిగారు  తదితరులు

సభ ప్రారంభానికి ముందు నల్లమోతు శ్రీధర్ గారిచ్చిన పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
భూమిక మాసపత్రిక ఎడిటర్ సత్యవతిగారు తదితరులు 
ప్రముఖ పరిశోధకుడు, అధ్యాపకుడు ఆచార్య బన్న అయిలయ్యగారు, ప్రముఖరచయిత్రులు అరుణగారు, తరిమిశ జానకిగారు తదితరులు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి సమ్మెట ఉమాదేవిగారు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి కన్నెగంటి అనసూయగారు 
పరిశోధక విద్యార్థులు సతీస్, ప్రకాశ్ , ఆదినారాయణ, కవి జుగాష్ విలీ తదితరులు 
డా.హేమలతగార్ని ఆలింగనం చేసుకుంటున్న ఒక ఆత్మీయురాలు 
ఆచార్య ఎన్. గోపిగారు ఏదో చెప్తున్న విషయాన్ని ఆసక్తిగా, వినయంగా వింటున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, పక్కనే నల్లమోతు శ్రీధర్ గారు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కవయిత్రి మెర్సి మార్గరెట్, రచయిత్రి తరిమిశ జానకిగార్లు ఉమాదేవిగారు 
రచయిత్రులతో డా. హేమలతగారు 
ప్రసంగాలను ఆసక్తిగా వింటున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగార్లు  
ఆచార్య బి.రాజశేఖర్ గారి కుటుంబసభ్యులతో ఆత్మీయంగా డా.హేమలతగారు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులతో డా. దార్ల, ఆచార్య రాజశేఖర్, డా. హేమలతగార్లు

సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావుగారు

సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావుగారు. కింద వీడియో

సభ ప్రారంభానికి ముందు సభావేదికపై వక్తలు
సభాధ్యక్షలు ఆచార్య ఎన్.గోపి గారి ప్రసంగ దృశ్యం
డా.రఘుగారు, డా.యాకూబ్ గార్ల గుసగసలేమిటో...

చయిత్రి డా.హేమలత గారితో సమ్మెట ఉమాదేవిగారు, డా.వాసా ప్రభావతిగారు, తరిమిశ జానకిగారు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి తరిమిశ జానకిగారు
 డా.అద్దేపల్లి జ్యోతి, సమ్మెట ఉమాదేవి, కన్నెగంటి అనసూయ, డా.మంజుశ్రీ, డా. దార్ల, మెర్సీ మార్గరెట్ గార్లు


(ఫోటోలు: డా.హేమలత గారి సౌజన్యంతో)