"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

Dean లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dean లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

09 మే, 2018

University of Hyderabad, Non-Teaching Election Commission (2018)

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు బోధనేతరసిబ్బంది ఎన్నికల కోసం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మంగళవారం (8 మే 2018) ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.వై.సురేశ్, డా.శ్రీపర్ణదాస్ ఎలక్షన్ కమీషన్ సభ్యులుగాను, శ్రీ అజయ్ బాబు కన్వీనర్ గాను వ్యవహరిస్తారని ఆ నోటిఫికేషన్ లో వివరించారు. ఈ ఎన్నికలను మే 23 వతేదీ 2018 లోగా పూర్తిచేయాలని దానిలో పేర్కొన్నారు. 

26 నవంబర్, 2017

సెంట్రల్ యూనివర్సిటి లో భారత రాజ్యాంగ దినోత్సవం

ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైన రాజ్యాంగం భారత దేశానికి ఉందని, అది అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయాన్ని అందిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలి అన్నారు.భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం (26-11-2017) ఉదయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.

దీనిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలే మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత పెద్దదైన లిఖిత రాజ్యాంగం భారత దేశానికి ఉందన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించడంలో అన్ని కోణాలనుండి వివిధ అంశాలను పొందుపరిచి, వాటిని విజయవంతంగా అమలవుచేస్తున్న ఏకైక రాజ్యాంగం భారత దేశానికి ఉండడం మనందరికీ గర్వకారణం అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఉద్యోగులతో భారత రాజ్యాంగ  ప్రవేశికను, ఆదేశిక సూత్రాలను అందరి చేతా చదివించి వాటిని ఆచరిస్తామనీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య పి. ప్రకాశబాబు, రిజిస్ట్రార్  సర్దార్ సింగ్, ఫైనాన్స్ ఆఫీసర్ ఎం.సి.గుణశేఖర్, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేబాశిస్, డిప్యూటీ  డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,డీన్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆచార్య రాజశేఖర్ , పలువురు ప్రొఫెసర్స్, విశ్వవిద్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

01 నవంబర్, 2017

అందుబాటులో ఉన్న అవకాశాల్ని వినియోగించుకోవాలి’- ప్రో.వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రకాశబాబు

రేపటి కోసం నేడే ప్రణాళికలు వేసుకోవాలనీ, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకొని విజయపథం వైపు పయనించాలని యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ ప్రొ.వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ప్రకాశబాబు ఉద్భోధించారు. యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన యూజిసి-నెట్ & జెఆర్ ఎఫ్ శిక్షణాశిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారం (1 నవంబరు 2017) న యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, జాకిర్ హుస్సేన్ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ డీన్,స్టూడెంట్స్ వెల్ఫేర్, ఆచార్య దేవాశిస్ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం Coaching Schemes for SC/ST/OBC (Non-Creamy Layer) & Minority Students, కోఆర్డినేటర్ డా. బి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

మాట్లాడుతున్న ఆచార్య దేవాశిస్ ఆచార్య 

నివేదిక సమర్పించి మాట్లాడుతున్న డా.బి.నాగేశ్వరరావు
ప్రొ.వైస్-ఛాన్సలర్ ఆ చార్య జి.ప్రకాశబాబుగార్ని సత్కరిస్తున్న దృశ్యం

ఆచార్య దేవాశిస్ ఆచార్యను సత్కరిస్తున్న దృశ్యం

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న దృశ్యం

డా.బి.నాగేశ్వరరావుని సత్కరిస్తున్న దృశ్యం


సమావేశానికి ముందు ప్రొ.వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ప్రకాశబాబు గార్ని కలిసి మౌలాన ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ అధ్యాపకులు

సమావేశానికి ముందు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారితో మౌలాన ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ అధ్యాపకులు

సమావేశానికి హాజరైన విద్యార్థినీ విద్యార్థులు

ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నప్రొ.వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ప్రకాశబాబు గారు

ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నడా.బి.నాగేశ్వరరావు

 -0-
ఫోటోల సౌజన్యం: శ్రీ సతీష్, బడిగె ఉమేష్, అల్లూరు మస్తాన్ 

19 సెప్టెంబర్, 2017

స్వచ్ఛతా పక్షోత్సవ కమిటీ నివేదిక - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

( భారతప్రభుత్వం ఆదేశాల మేరకు ది 1-9-2017 నుండి 15 -9-2017 వరకు జరగాల్సిన స్వచ్చతా పక్షోత్సవాలను యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు నిర్వహించింది. దీని నిర్వహణకు గాను యూనివర్సిటి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని చైర్మన్ గా నియమించింది. దీనిలో భాగంగా పదిహేను రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన నివేదికను ముగింపు ఉత్సవంలో సమర్పించారు. ఈ సమావేశానికి యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.పి.సంజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రత్యేక అతిథులుగా హైదరబాదు  మున్సిపల్ జోనల్ కమీషనర్ హరిచందన విచ్చేశారు. గౌరవ అతిథులుగా ఛీప్ వార్డెన్ ఆచార్య వాసుకి బలవాడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేవాశిస్ ఆచార్య అధ్యక్షత వహించగా, కార్యక్రమాన్ని డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డా. జి.పద్మజ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ మరియు చైర్మన్, స్వచ్ఛతా పక్షోత్సవ కమిటి చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన నివేదికను సమర్పించారు. దాని సారాంశాన్ని తెలుగులో అందిస్తున్నాను.... దార్ల ) 


వేదికపైన, సభలోను ఉన్న పెద్దలకు నా నమస్కారాలు. సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు నా శుభాకాంక్షలు
·         UGC వారి ఆదేశాల మేరకు, Govt. of India, Ministry of Human Resources Development వారి మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు వారు ఈ నెల ( సెప్టెంబర్) 1 నుండి 15వ తేదీ వరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం.
·         ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చైర్మన్ గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు వారు ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో సభ్యులుగా చీఫ్ వార్డెన్ ( లేదా వారి నామినీ), డా.బి.శామన్న, డా.వి.శ్రీనివాసరావు, డా.జి.పద్మజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (హార్టీ కల్చర్ &శానిటేషన్) వారు సభ్యులుగా ఉన్నారు. కార్యక్రమ విస్తృతిని బట్టి డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డా. కె.వి. రాజశేఖర్ గార్ని కూడా సభ్యులుగా కో ఆప్ట్ చేసుకోవడం జరిగింది.
·         సెప్టెంబరు 2 వ తేదీన స్వచ్ఛతా పక్షోత్సవాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె ప్రారంభించారు. వీరితో పాటు తొలిరోజు కార్యక్రమంలో , ప్రొ- వైస్-ఛాన్సలర్ ఆచార్య పి. ప్రకాశబాబు, అసిస్టెంటు రిజిస్ట్రార్స్ శ్రీ సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.
·         రెండవ రోజున Clean Hostel day, నాల్గవ రోజున Clean Mess day సందర్భంగా J & K Hostels లో స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగంగా వంటశాల, మెస్ హాల్, హాస్టల్ పరిసరాల్ని పరిశీలించాం. విద్యార్థులకు పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేశాం. ఈ కార్యక్రమంలో Dy.రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.చంద్రశేఖర్, j హాస్టల్ వార్డెన్ డా.డి. రామచంద్రరావు, k.హాస్టల్ వార్డెన్ డాక్టర్ శ్యామల్ బిశ్వాస్, విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు.
·         మూడో రోజు  Green Campus Day లో భాగంగా South Campus హాస్టల్ పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనిలో ముఖ్య అతిథిగా తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ పాల్గొన్నారు. జూనియర్ హార్టీకల్చరిస్ట్ శ్రీ సుబ్బారావు  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీరితో పాటు డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేవాశిస్ ఆచార్య,  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, శ్రీ బి. చంద్రశేఖర్ , విద్యార్థులు పాల్గొన్నారు.
·         ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా “ Innovative ways for spreading the message of hydiene”  అనే అంశంపై హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించాం.
·         ఆరో రోజు Clean Surroundings : Roads leading to the Institution లో భాగంగా యూనివర్సిటి మెయిన్ క్యాంపస్ నుండి SBI, HUC బ్రాంచి వరకు GHMC సిబ్బంది, విద్యార్థుల సహకారంతో డా.జి.పద్మజ, శ్రీ బి. చంద్రశేఖర్ గార్ల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించాం.
·         ఏడొవ రోజు Care for the surroundings, Visit to slum/ villages to explain the concepts of cleaniness లో భాగంగా చందానగర్, శ్రీరాజీవ్ గృహకల్ప పరిసరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎన్. ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డా.వసంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, స్థానిక మున్సిపాలిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
·         ఎనిమిది, తొమ్మిదవ, పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలను శేరిలింగంపల్లి, హెల్త్ సెంటర్, మార్కెట్ పరిసరాల్లో పరిశుభ్రతా అవగాహన కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించాం.
·         పదకొండో రోజు Care for the surroundings : Visit to institutions for the poor (Orphanage etc.) లో భాగంగా చందానగర్ లోని ‘Samkalpa’ Home for the deprived Children ని సందర్శించాం. అక్కడ వారికి పండ్లు పంచి, వారితో కలిసి ఆరోగ్యం, పరిసరాల గురించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సుందర్, NSS వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
·         పన్నెండో రోజు Care for the Surroundings: Debriefing session with the commissioner local Body about the system for cleanlinessలో భాగంగా శేరిలింగంపల్లి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాం. డా.బిందుమాధవి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో విద్యార్థులకు పరిశరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
·         పదమూడో రోజు Cleanest Hostel Room లో భాగంగా అంతకు ముందుగానే చీఫ్ వార్డెన్ గారి పర్యవేక్షణలో Cleanest Room  ఎలా ఉండాలో ఈకార్యక్రమ ప్రణాళికను ప్రకటించారు. తర్వాత ఒక్కో హాస్టల్ వార్డెన్, తమ సిబ్బందితో హాస్టల్ రూములను పరిశీలించి, Cleanest Room ని ఎంపిక చేశారు.
·         పద్నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా Elocution contest on “ Health and Hygiene is the real wealth” నిర్వహించాం. దీన్ని ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో పోటీలు ఉంటాయని ప్రకటించాం. అయితే, ఇంగ్లీషు, తెలుగు భాషలకు చెందిన విద్యార్థుల పాల్గొన్నారు.
·         విజేతలకు వ్యాసరచన, Elocution contests  పాల్గొన్న విజేలతకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించాం. వరుసగా రూ. 3,000/-, రూ.2000/-, రూ. 1000/- నగదు పారితోషికంతో పాటు, సర్టిఫికెట్ ప్రదానిస్తామని ప్రకటించాం.
·         Cleanest Hostel Room  ఒక్కొక్క హాస్టల్ ని ఒక యూనిట్ గా తీసుకొని, ఒక్కొక్క హాస్టల్ రూమ్ కి ఒక బహుమతిని ప్రకటించాం. ఒక్కొక్క బహుమతికి గాను రూ.1000/- నగదు, సర్టిఫికెట్ లను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించాం.
·         స్వచ్ఛతా పక్షోత్సవాల్లో పాల్గొన్న స్వచ్ఛందంగా పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంసాపత్రాలను ఇవ్వాలని నిర్ణయించాం.  పూర్తి వివరణాత్మక నివేదికను సంబంధిత అధికారులకు సమర్పించడం జరుగుతుంది.
·         స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం వల్ల విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిసర గ్రామాల ప్రజలు పరిశుభ్రత, ఆరోగ్యాల పట్ల మరింతగా చైతన్యవంతమైయ్యారని భావిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రత, దానివల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించేలా చైతన్యపరచడమే స్వచ్ఛతా పక్షోత్సవాల ప్రధాన ఆశయం. ఈ ఆశయం నెరవేరడంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
15 సెప్టెంబర్ 2017

చైర్మన్, స్వచ్ఛత పక్షోత్సవాల కమిటి, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్

18 సెప్టెంబర్, 2017

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం- ప్రొ. వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.పి.సంజయ్

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొ. వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.పి.సంజయ్ అన్నారు. గత 15 రోజులుగా జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవాలసందర్భంగా శుక్రవారం జరిగిన ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

సి.వి.రామన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీమతి హరిచందన మాట్లాడుతూ పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడానికి అవసరమైన సహాయ సహకారాలను తమవంతు అందిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్చత పక్షోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, శుభ్రమైన హాస్టల్ గది మొదలైన పోటీలలో విజేతలకు ఆమె బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛతా పక్షోత్సవాల కమిటీ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన నివేదికను సమర్పించారు.

డాక్టర్ జి. పద్మజ, డిప్యూటీ డీన్,  స్టూడెంట్స్ వెల్ఫేర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీన్,  స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేవాశిష్ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ వార్డెన్  ఆచార్య వాసుకి బలవాడీ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్ , డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు పౌర సంబంధాల అధికారి ఆశిష్ జాకబ్,  అధ్యాపకులు విద్యార్థులు, యూనివర్సిటీ పారిశుధ్య కార్మికులు, మున్సిపాలిటీ కార్యకర్తలు బోధనేతర సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











Report on Valedictory Programme of Swachhta Pakhwada on 15.09.2017

‘Cleanliness contributes to complete health hence it requires coordinated effort from every
one’ said Prof. B. P. Sanjay, Pro. Vice-Chancellor of University of Hyderabad in his
valedictory address of the Swacchhta Pakhwada (cleanliness fortnight) programme at
University of Hyderabad. He was the Chief Guest of the programme organized from 1-15
September, 2017. He requested GHMC authorities to make possible the cleanliness as a daily
effort at UoH. He expressed concern for the ecological Balance and lauded the initiatives
taken by University students in their representation to Telangana Government in this regard.
He appreciated the efforts of the committee in organizing Swacchata Pakhwada for the whole
fortnight successfully.
The zonal commissioner of GHMC Ms. Harichandana, IAS who was the guest of honour at
the programme, assured the cooperation in maintaining the clean campus and in the clean-up
of Peacock Lake. She invited the students to work with community in creating awareness
about the cleanliness and hygiene. She emphasized on the need for a change in the attitude of
community in not only learning ways of enhancing cleanliness but also maintaining the clean
habits consistently. In the University campus, she suggested that campus community may
start with small things like segregation of waste for disposal, and doing away with plastic
bags. She welcomed participation of students and student clubs of University and offered
help if they take up projects and internships related to clean lakes, clean surroundings etc. As
an alumnus of the University she expressed her happiness at such programmes being taken up
by University.
The cheifWarden of university of Hyderabad, Prof. Vasuki Belavadi congratulated everyone
who participated in the cleanliness fortnight programmes and emphasized on the fact that
clean mind can create clean surroundings. Dean, Students’ Welfare Prof. Debashis Acharya
in his residential remarks appreciated the efforts of GHMC Zonal commissioner Ms. Hari
Chandana who is an alumni from University of Hyderabad and her cooperation with
University.
Prizes were distributed to the winners of essay writing, Elocution and Cleanest hostel room
contest which were organized as a part of the fifteen day Swachhta Pakhwada .
The valedictory programme started with display of film on Anti-Ragging. Dr. G. Padmaja
Deputy DSW introduced about the programme to the audience, the report of the fortnight
programmes was presented by Prof. Darla Venkateswara Rao, Chairman, Swachhta
Pakhwada committee and Deputy Dean, Students’ Welfare. The programme was presided by
Prof. Debashis Acharya. This was followed by the insights shared by the chief guest, guest of
honour, Chef Warden and presidential remarks. The programme concluded with vote of
thanks by Dr. G. Padmaja. The dignitaries who participated in the programme included included