రేపటి కోసం నేడే ప్రణాళికలు వేసుకోవాలనీ, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకొని విజయపథం వైపు పయనించాలని యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ ప్రొ.వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ప్రకాశబాబు ఉద్భోధించారు. యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన యూజిసి-నెట్ & జెఆర్ ఎఫ్ శిక్షణాశిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారం (1 నవంబరు 2017) న యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, జాకిర్ హుస్సేన్ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ డీన్,స్టూడెంట్స్ వెల్ఫేర్, ఆచార్య దేవాశిస్ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం Coaching Schemes for SC/ST/OBC (Non-Creamy Layer) & Minority Students, కోఆర్డినేటర్ డా. బి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఆచార్య దేవాశిస్ ఆచార్య
నివేదిక సమర్పించి మాట్లాడుతున్న డా.బి.నాగేశ్వరరావు
ప్రొ.వైస్-ఛాన్సలర్ ఆ చార్య జి.ప్రకాశబాబుగార్ని సత్కరిస్తున్న దృశ్యం
ఆచార్య దేవాశిస్ ఆచార్యను సత్కరిస్తున్న దృశ్యం
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న దృశ్యం
డా.బి.నాగేశ్వరరావుని సత్కరిస్తున్న దృశ్యం
సమావేశానికి ముందు ప్రొ.వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ప్రకాశబాబు గార్ని కలిసి మౌలాన ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ అధ్యాపకులు
సమావేశానికి ముందు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారితో మౌలాన ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ అధ్యాపకులు
సమావేశానికి హాజరైన విద్యార్థినీ విద్యార్థులు
ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నప్రొ.వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ప్రకాశబాబు గారు
ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నడా.బి.నాగేశ్వరరావు
-0-
ఫోటోల సౌజన్యం: శ్రీ సతీష్, బడిగె ఉమేష్, అల్లూరు మస్తాన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి