ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైన రాజ్యాంగం భారత దేశానికి ఉందని, అది అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయాన్ని అందిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలి అన్నారు.భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం (26-11-2017) ఉదయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.
దీనిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు పొదిలే మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత పెద్దదైన లిఖిత రాజ్యాంగం భారత దేశానికి ఉందన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించడంలో అన్ని కోణాలనుండి వివిధ అంశాలను పొందుపరిచి, వాటిని విజయవంతంగా అమలవుచేస్తున్న ఏకైక రాజ్యాంగం భారత దేశానికి ఉండడం మనందరికీ గర్వకారణం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఉద్యోగులతో భారత రాజ్యాంగ ప్రవేశికను, ఆదేశిక సూత్రాలను అందరి చేతా చదివించి వాటిని ఆచరిస్తామనీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య పి. ప్రకాశబాబు, రిజిస్ట్రార్ సర్దార్ సింగ్, ఫైనాన్స్ ఆఫీసర్ ఎం.సి.గుణశేఖర్, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేబాశిస్, డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,డీన్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆచార్య రాజశేఖర్ , పలువురు ప్రొఫెసర్స్, విశ్వవిద్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి