"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

10 January, 2016

నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది

ఈ వారంలో నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది.నా కవిత్వం గురించి చాలా మంది గతంలో రాసిన అభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించాను.  దీనికి ముఖచిత్రంగా  ప్రసిద్ధ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ గారు అర్ధవంతమైన కవర్ పెయింటింగ్ వేసిచ్చారు.  ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



. నెమలికన్నులు  ముఖచిత్రం పై ఉన్న పెయింటింగ్ అంతరార్థమేమై ఉంటుందనే దానికి  డా.మల్లెగోడ గంగా ప్రసాద్ తన ఫేస్ బుక్ లో ఇలా వ్యాఖ్యానించారు. దాన్నిక్కడ పునర్ముద్రిస్తున్నాను. 
డా. మల్లెగోడ గంగా ప్రసాద్ Facebook లో రాసిన వ్యాఖ్యలను కింద పునర్ముద్రిస్తున్నాను.


భారతీయ సామాజిక వ్యవస్థ ప్రధానంగా చాతుర్వర్ణమూలాల్ని కలిగి నిర్మితమైంది. దానికి అనుబంధంగా వచ్చిందే పంచమవర్ణం. వీటిని ప్రతీకాత్మకంగా చిత్రకారుడు జంతువుల్ని చిత్రించి ఉండొచ్చు.
  • చాతుర్వర్ణం నుండే రకరకాల ఉపకులాలు మళ్ళీమళ్ళీ పుట్టుకొచ్చినా, వాటిలో ‘ పంచమవర్ణం’ సమాజానికి దూరంగా నెట్టివేయబడింది. దీన్ని విడిగా దూరంగా ఉన్న జంతువు ప్రాతినిథ్యం వహిస్తుందనుకుంటున్నాను.
  • భారతదేశంలోని సాంఘికహోదానీ, ఆర్థిక, రాజకీయాధికారాలను అనుభవిస్తూ విలాసవంతంగా జీవించే లక్షణాలున్న వర్ణాలవారిని నాలుగు జంతువుల్లోను చిత్రకారుడు చిత్రించి ఉండొచ్చు. వీటిని వాటి కొమ్ములకున్న రకరకాల రంగుల ద్వారాను, వాటి శరీరఛాయ, వాటి హావభావాల ద్వారా గమనించేలా చేశాడనుకుంటున్నాను.
  • నాలుగు బలిసిన దున్నపోతులు అలంకరించుకొని సమాజాన్ని ఆక్రమించుకొన్నస్థితి చిత్రంలో కనిపిస్తుంది. ఒకటి మాత్రమే విడిగా ఉంది. దానికి ఎలాంటి అలంకరణా లేదు. దాని కళ్ళల్లో విషాదం తొణికిసలాడుతున్నట్లుంది.
  • ఒక బాలుడు కర్రపట్టుకొని మార్గానికి అడ్డంగా నిలబడిన ఆ పశువుల్ని విదిలిస్తున్నాడు.
  • ఆ బాలుడు నీలిరంగు నిక్కరు , ఎరుపురంగు చొక్కాలను ధరించాడు. నీలిరంగు అంబేద్కరిజానికీ, ఎరుపురంగు కమ్యూనిజానికీ ప్రతీకలుగా చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నవాళ్ళు కమ్యూనిస్టులైతే, ప్రజాస్వామిక పంథానే ప్రధానం చేసుకొని ఉద్యమాలు చేస్తున్నవాళ్ళు అంబేడ్కరిస్టులు.
  • అడ్డంగా నిలబడిన పశువుల్ని బాలుడు తన చేతిలో ఉన్న కర్రతో విదిలిస్తున్నాడు.
  • దూరంగా కనిపిస్తున్న ఊరు, ఇళ్ళు, పక్కన పచ్చనిపొలాలు... వాటివైపు ఈ నాలుగు పశువులు దృష్టిని కేంద్రీకరించాయి. వాటిని కర్రతో కొడుతూ బాలుడున్నాడు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు రాజకీయాల ద్వారా ఆ గ్రామాన్నీ, ఆ ఇళ్ళనీ, ఆ పచ్చదనాన్నీ తామెలా స్వాధీనం చేసుకోవాలో ఆలోచిస్తున్న నాలుగు వర్ణాల వారు ఆలోచిస్తున్నట్లుంది. దాన్ని నెరవేరనివ్వనన్నట్లు బాలుడి చేతిలోని కర్ర కనిపిస్తుంది.
  • తాగడానికి కొన్నినీళ్ళు, కట్టుకోవడానికి బట్ట ఉన్న ఆ బాలుడు తినడానికి భుజాన తువ్వాల్లో ఏదొక ఆహారపదార్థం మూటకట్టుకున్నాడు.
  • ఆ బాలుడు చదువుకున్న కవి, రోడ్డుకడ్డంగా నిలబడ్డ పశువులు ఊరుని నాశనం చేయాలనుకునే ఆధిపత్యవర్ణాలు, వర్గాలు గా చెప్పుకోవచ్చుననుకుంటున్నాను. నెమలికన్నులు కవిత్వంలో ఉన్న వస్తువు అంతా దీన్ని ప్రతీకాత్మకం చేసేలా చిత్రకారుడు చిత్రించాడనుకుంటున్నాను. 

No comments: