(బాధించని బోధలు పేరుతో ఆంధ్రజ్యోతిలో 2-2-2009 న వచ్చిన వ్యాసం )
ఒక కాలానికి ఒక ధర్మం విధించబడటం ఒక చారిత్రక విశేషం. ప్రాచీన సాహిత్యంలో ఈ కాలంలోని ధర్మం, చట్టం, విధులు లేవనుకొనటం వృధా. అది ఆశించటం వృధా ప్రయాస. మన చరిత్ర, మన సంస్కృతీ సభ్యతలకు సాహిత్యం ప్రతిరూపం. ప్రాచీన సాహిత్యం, నాల్గు వర్ణములను, వారి వారికి విధించిన విధులను జ్ఞాపకం చేస్తే, దానిని చారిత్రక సత్యంగా భావించాలి, ఆ వ్యవస్థ ఈ కాలంలో కాల బాహ్యం (ౌఠ్టఛ్చ్ట్ఛీఛీ) అయిందనే విషయం ఎవరికీ ప్రత్యక్షంగా పనిగట్టుకొని బోధించవలసినదేమీ కాదు, కళ్లకు కట్టినట్టుగా నిత్య జీవితంలో పసిపిల్ల బాలాది వృద్ధులకు కరతలామలకమైనదే కాబట్టి.
అప్పటికి వర్తిస్తున్న ఈ విషయంతోబాటు మన భారతాది ప్రాచీన గ్రన్థాలు ఇప్పటికి గూడా, నిత్య నూతన వ్యవస్థలో కూడా అనుసరణీయమైన అనేక మహత్తర నీతులను, ధర్మాలను, కర్తవ్యాలను, సంస్కరములనూ, ఇబ్బడిముబ్బడిగా బోధిస్తున్నాయి, వానిని సద్భావాత్మకంగా, బలకర- ఔషధంగా (ఞౌటజ్టీజీఠ్ఛి) గ్రహించి సమాజ ప్రగతిని సాధించవచ్చు. ఏ హిందూ శాస్త్రముగానీ గ్రన్థముగానీ (ప్రామాణికమైనది) అస్పృశ్యతను బోధించలేదు, అంగీకరించలేదు. ఈ మూలవ్యాధి నివారణకు అలనాటి త్రిమఠాచార్యులను మొదలుకొని నారాయణ గురు, అంబేడ్కరు వరకు ఎంతోమంది మహామనీషులు తమ ప్రాణాలు ధారవోశారు. ఇంకా శ్రమిస్తున్నారు.
దళితోద్ధరణకు, కుల వైషమ్య జాడ్య నివారణకు నడుం బిగించిన సంఘసంస్కర్తలు అవి యెట్లా మన జాతిప్రగతికి తోడ్పడుతాయో వివరిస్తూ ముందుకు నడిస్తే బాగుంటుంది, దానితో సంస్కృత భాషకు ముడి పెట్తూ ఆ భాషను తొలగించాలనటం అన్యా యం. ఎవరైనా హేతు పురస్సరంగా మనుస్మృతినో వేరొకదాన్నో విరోధించవచ్చు,కాని అది సంస్కృతంలో వ్రాయబడింది కాబట్టి సంస్కృతాన్ని తొలగించమనటం అకారణ ద్వేషమే. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు-ఇతర కులాలకు చెందినవారే. సంస్కృతారాధకులైన పెక్కురు విదేశీయులు అగ్రవర్ణపక్షపాతు లు కారు. మన జాతీయ నాయకులలో పెక్కుమంది సంస్కృతానికి పెద్దపీట వేయమన్నవారు అగ్రవర్ణీయులు కాదు, ముస్లిములలోను ఉన్నారు. డా.బిఆర్ అంబేడ్కర్‌గారు రాజ్యాంగ పరిషత్సమావేశాలలో సంస్కృతాన్ని అనుసంధాన భాషగా (ఔజీnజుఔ్చnజఠ్చజ్ఛ) చేయాలని ఒక సవరణను ప్రతిపాదించారనే విషయం ఎందుకో మఱుగున పడిపోయింది. - ఎన్.సి.టి.ఆచార్యులు, హైదరాబాద్
'బాధించే పాఠాలు' వ్యాసం గాలిని దెయ్యమన్నట్లుంది! వినోదిని గారు చెప్పిన కథలే కాకుండా మొత్తం ప్రాచీన తెలుగు సాహిత్యంలోంచి ఏ కావ్యం నుండి ఏ కథ తీసుకున్నా ఇట్లాంటి పేలవమైన విమర్శ చేయవచ్చు. కానీ ఆ మాత్రం చరిత్ర నేపథ్యం, ఆయా కావ్యాలు జనించిన యుగాలు ధర్మాలు, నేపథ్యాలూ తెలియకుండా ఎంఏలు చదివేసి పిహెచ్డీలు చేసేసి మాష్టార్లయిపోతే ఇలాగే గజిబిజిపడిపోతారు.. బాధలు పడిపోతారు. సాహిత్య అధ్యాపకం మాటల్లో విషయం కాదు. వినోదిని గారు చెప్పిన అస్తిత్వ చైతన్య ఉద్యమాలు కేవలం నిన్నటివి మాత్రమే కదా.
తెలుగు సాహిత్య చరిత్ర చదువుకొన్నవారికి ఆయా యుగాల ధర్మాల ప్రకారం కావ్య రూపాలు, విషయం మారుతుండడం గమనిస్తాం కదా! వీటిని అర్థం చేసుకొని పాఠం చెప్పాలి మనం. మనమే కుచించుకుపోయి వుండ డం మన లోపమా? కావ్యాల లోపమా? ఇక బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఆవిడ చెప్పినట్లు దళిత ప్రతినిధుల్ని, స్త్రీవాదుల్ని, మానవ హక్కుల నేతల్నే కాకుండా ఇతరత్రా సవాలక్ష కుల ప్రతినిధుల్నీ, జంతు, పర్యావరణ ప్రేమికుల్నీ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది! ఆవిడ సూచించినట్లుగా సంస్కృతం పేపరూ తీసేయడంతోపాటు తెలుగులో వున్న సంస్కృత పదాల్నీ తొలగించి పాఠాలు పెడితే బావుంటుందేమో!
- పిరాట్ల ఏసుపాదం, కాకినాడ

1 కామెంట్:
It is funny that "పిరాట్ల ఏసుపాదం, కాకినాడ" wants to remove Sanskrit words from Telugu literature or books.
Tomorrow another enuguపాదం from Europe may want to enslave all Indians beacuse they are a inferior race!.
కామెంట్‌ను పోస్ట్ చేయండి