"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

రామస్వామి యాదవ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామస్వామి యాదవ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

04 జనవరి, 2019

‘‘స్త్రీవిద్యవల్లనే సమాజ పురోభివృద్ధి సాధ్యం ’’ (సాహిత్రి బాయి ఫూలే జయంతోత్సవంలో ఆచార్య దార్ల )


నమస్తే తెలంగాణ దినపత్రిక, 4 జనవరి 2019

ఆంధ్రప్రభ దినపత్రిక, 4 జనవరి 2019
స్త్రీవిద్యవల్లనే సమాజ పురోభివృద్ధి సాధ్యమవుతుందని నిరూపించి, బడుగు, బలహీన వర్గాల్లో అక్షరాస్యత అవసరాన్ని చాటిన గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని హెచ్ సీయు స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటి డీన్, ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పాపిరెడ్డి నగర్ లో గల శారదా విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి, ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. కులవ్యవస్థ వల్ల అక్షరాస్యతకు దూరమైన వర్గాల్ని దగ్గరకు తీసుకొని అక్షరాస్యుల్ని చేయడానికి స్వయంగా పాఠాల్ని బోధించి, మహిళల కొరకు పాఠశాలల్ని స్థాపించిన ఘనత సాహిత్రిబాయి ఫూలేకే దక్కుతుందని, ఆయన అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె ప్రసిద్ధిపొందారనీ, అనేక స్వచ్ఛందసంస్థలు ఆమె పేరుతో మహిళా ఉపాధ్యాయదినత్సవాన్ని జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. పితృస్వామ్యవ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు చేశారని, స్త్రీలకెందరికో ప్రసవాల సమయంలో సహాయం చేసేవారని, మహారాష్ట్రలో ప్లేగువ్యాధి ప్రబలమననప్పుడు ఆమె ఎంతో ధైర్యంతో రోగులకు సేవలు చేశారనీ ఆయన వివరించారు. నేడు స్త్రీలు చదువుకోవడానికి అం బేద్కర్, పెరియార్ రామస్వామినాయకర్, జ్యోతిభాపూలే వంటి ఎంతో మంది మహానుభావులు చేసిన కృషితో సమానంగా సాహిత్రిబాయి ఫూలే పనిచేశారని ఆయన ప్రశంసించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్చందసంస్థ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షోపన్యాసం చేస్తూ,  విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, గుణాత్మకమైన విద్యను స్త్రీలకు కూడా అందించినప్పుడే అన్నిరంగాల్లోనో అభివృద్ధిని సాధించవచ్చునని అన్నారు. సావిత్రిబాయి ఫూలే జీవితం ప్రతి మహిళకు ఆదర్శనీయం కావాలని, ఆమె కృషిని కొనసాగించాలని ఉద్బోధించారు. హెచ్ సీయు పిహెచ్.డి. రీసెర్చ్ స్కాలర్ వాహిని సావిత్రిబాయి ఫూలే జీవితాన్ని వివరించి, ఆమె పేరుతో పూనేలో ఒక విశ్వవిద్యాలయానికి పేరు పెట్టారనీ, భారతప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసిందనీ పేర్కొన్నారు. శారదా విద్యానికేతన్ ఉన్నతపాఠశాల ప్రిన్సిపాల్ డా.జి.రోజి సమన్వయ కర్తగా వ్యవహిరిస్తూ, తమ పాఠశాలలో సావిత్రిబాయిఫూలే జయంతి వేడుకలు జరపడం వల్ల విద్యార్థినీ విద్యార్ధుల్లో ఈ కార్యక్రమం ఎంతగానో ప్రేరణనిస్తుందని అన్నారు. తమ పాఠశాలలో ఉచితంగా విద్యను అందిస్తున్నామనీ, శ్రీమతిశారదగారు తమకు విద్యవల్ల కలిగే ప్రయోజనాల్ని చెప్పి చైతన్యం చేయడం వల్ల ఆమె పేరుతో ఈ పాఠశాల నిర్వహిస్తున్నామన్నారు. సూపర్ విజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామమోహనరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుండే ఆదర్శభావాల్ని అలవర్చుకోవాలని, అందుకు ప్రసిద్ధ సంఘసంస్కర్తలు, సామాజికసేవకులు, దేశభక్తులు జీవితాలు గురించి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంకితభావంతో పనిచేస్తున్న శ్రీమతి రజని, శ్రీమతి తేజ, శ్రీమతి లత, శ్రీమతి కమల, శ్రీమతి లక్ష్మి అనే ఐదుగురు మహిళా ఉపాధ్యాయినులకు  ‘సావిత్రిబాయి ఫూలే ఉత్తమ మహిళా ఉపాధ్యాయినుల పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ లోక్ నాథ్, శారదా విద్యానికేతన్ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులూ పాల్గొన్నారు. 
ఈనాడు దినపత్రిక, 4 జనవరి 2019



సూర్య దినపత్రిక, 4 జనవరి 2019


                                                  సాక్షి దినపత్రిక, 4 జనవరి 2019

మనతెలంగాణ దినపత్రిక, 4 జనవరి 2019


జనం సాక్షి  దినపత్రిక, 4 జనవరి 2019

నమస్తే  దినపత్రిక, 4 జనవరి 2019


14 అక్టోబర్, 2018

శాస్త్రానికి మానవీయ కోణాన్నివ్వడమే డాక్టర్ అబ్దుల్ కలామ్ లక్ష్యం

ప్రతిభకు కుల,మత,జాతి,లింగభేదాలు ఆటంకం కాదని, శాస్త్రానికి మానవీయకోణాన్ని సమన్వయిస్తే సాధించే ఉత్తమ ఫలితాలు ఎలాగుంటాయో నిరూపించిన ఆదర్శనీయ శాస్త్రవేత్త, మాజీ భారత రాష్ట్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ అని సెంట్రల్ యూనివర్సిటి స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటి డిఎస్ డబ్ల్యూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 
సాక్షి దినపత్రిక, హైదరాబాదు టాబ్లాయిడ్, శేరిలింగంపల్లి జోన్, 14 అక్టోబరు 2018

 ఐక్యరాజ్యసమితి అబ్దుల్ కలామ్ జయంతి (అక్టోబరు, 15)ని ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’ గా ప్రకటించిన నేపథ్యంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్  ఆధ్వర్యంలో తారానగర్ విద్యానికేతన్ మోడల్ ఉన్నత పాఠశాలో భారతమాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాఖశాస్త్రవేత డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఇంటింటికీ పత్రికలు సరఫరాచేసి, ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నాడన్నారు. తన పేదరికం, తన మతం తన ప్రతిభకు ఏనాడూ ఆటంకంగా మారలేదనీ, నిజమైన కృషీ, పట్టుదల ఉంటే ప్రతిభను గుర్తించేవాళ్ళెప్పుడూ ఉంటారని నిరూపించారన్నారు. రక్షణరంగంలోను, అంతరిక్షపరిశోధనల్లోను శాస్త్రవేత్తగా ప్రవేశించిన కలామ్, అంచెలంచెలుగా భారతదేశానికి రాష్ట్రపతిగా ఎంపికయ్యారనీ, ఆయనకు సుమారు 40 దేశాలు గౌరవ డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశాయన్నారు. 

ఆంధ్రజ్యోతిదినపత్రిక, హైదరాబాదు టాబ్లాయిడ్, శేరిలింగంపల్లి జోన్, 14 అక్టోబరు 2018

తేలికపాటి విమానాలు, హెలీకాప్టర్లు, కృత్రిమ అవయవాలకు ఉపయోగపడే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కృషి అసామాన్యమైందని ఆచార్య వెంకటేశ్వరరావు కొనియాడారు. నేడు దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే రాకెట్స్ రూపొందించడంలో, అలాగే సామాన్య ప్రజానీకానికీ మొబైల్, ఇంటర్నెట్, టీవి వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని రావడానికి కలామ్ చేసిన పరిశోధనలు ఎన్నో మంచిఫలితాల్ని ఇచ్చాయన్నారు.

ఆంధ్రప్రభ దినపత్రిక, హైదరాబాదు టాబ్లాయిడ్, శేరిలింగంపల్లి జోన్, 14 అక్టోబరు 2018

  భావిభారత పౌరులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలనీ, ఐక్యరాజ్యసమితి అన్నిదేశాల్లోని ఉత్తమ క్రమశిక్షణ, ఆదర్శనీయ గుణాలున్న వ్యక్తిగా అబ్దుల్ కలామ్ ని గుర్తించి ఆయన జయంతిని ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’గా ప్రకటించిందటే ఆయన గొప్పతనం తెలుస్తుందన్నారు. ఆయన జీవితాన్ని ప్రతి విద్యార్థీ ఆదర్శనీయంగా తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న సెంట్రయూనివర్సిటి రీసెర్స్ స్కాలర్ గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ   విద్యార్థులు మహోన్నతమైన కలలు కనాలనీ, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషిచేయాలని చెప్పి, నిరూపించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అన్నారు. ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకొని తమలోని శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కిరణ్ పేర్కొన్నారు.

నమస్తేతెలంగాణ  దినపత్రిక, హైదరాబాదు టాబ్లాయిడ్, శేరిలింగంపల్లి జోన్, 14 అక్టోబరు 2018

 ఈ కార్యక్రమంలో సూపర్ విజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామమోహనరావు, ఆహార పోషణానిపుణురాలు శ్రీమతి శ్రీచందన, డిగ్రీ కళాశాల  ప్రిన్సిపాల్  నరసింహులు, విద్యానికేతన్ మోడల్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రామాచారి, ప్రిన్సిపాల్ శ్రీమతి కనకదుర్గ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, జనార్థనరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే న్యూస్   దినపత్రిక, హైదరాబాదు టాబ్లాయిడ్, శేరిలింగంపల్లి జోన్, 14 అక్టోబరు 2018

13 అక్టోబర్, 2018

ఘనంగా ప్రపంచ విద్యార్థి దినోత్సవం













ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , 13 -10-2018 కార్యక్రమం
ప్రతిభకు కుల,మత,జాతి,లింగభేదాలు ఆటంకం కాదని, శాస్త్రానికి మానవీయకోణాన్ని సమన్వయిస్తే సాధించే ఉత్తమ ఫలితాలు ఎలాగుంటాయో నిరూపించిన ఆదర్శనీయ శాస్త్రవేత్త, మాజీ భారత రాష్ట్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ అని సెంట్రల్ యూనివర్సిటి స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటి డిఎస్ డబ్ల్యూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి అబ్దుల్ కలామ్ జయంతి (అక్టోబరు, 15)ని ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’ గా ప్రకటించిన నేపథ్యంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్  ఆధ్వర్యంలో తారానగర్ విద్యానికేతన్ మోడల్ ఉన్నత పాఠశాలో భారతమాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాఖశాస్త్రవేత డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఇంటింటికీ పత్రికలు సరఫరాచేసి, ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నాడన్నారు. తన పేదరికం, తన మతం తన ప్రతిభకు ఏనాడూ ఆటంకంగా మారలేదనీ, నిజమైన కృషీ, పట్టుదల ఉంటే ప్రతిభను గుర్తించేవాళ్ళెప్పుడూ ఉంటారని నిరూపించారన్నారు. రక్షణరంగంలోను, అంతరిక్షపరిశోధనల్లోను శాస్త్రవేత్తగా ప్రవేశించిన కలామ్, అంచెలంచెలుగా భారతదేశానికి రాష్ట్రపతిగా ఎంపికయ్యారనీ, ఆయనకు సుమారు 40 దేశాలు గౌరవ డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశాయన్నారు. తేలికపాటి విమానాలు, హెలీకాప్టర్లు, కృత్రిమ అవయవాలకు ఉపయోగపడే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కృషి అసామాన్యమైందని ఆచార్య వెంకటేశ్వరరావు కొనియాడారు. నేడు దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే రాకెట్స్ రూపొందించడంలో, అలాగే సామాన్య ప్రజానీకానికీ మొబైల్, ఇంటర్నెట్, టీవి వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని రావడానికి కలామ్ చేసిన పరిశోధనలు ఎన్నో మంచిఫలితాల్ని ఇచ్చాయన్నారు.  భావిభారత పౌరులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలనీ, ఐక్యరాజ్యసమితి అన్నిదేశాల్లోని ఉత్తమ క్రమశిక్షణ, ఆదర్శనీయ గుణాలున్న వ్యక్తిగా అబ్దుల్ కలామ్ ని గుర్తించి ఆయన జయంతిని ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’గా ప్రకటించిందటే ఆయన గొప్పతనం తెలుస్తుందన్నారు. ఆయన జీవితాన్ని ప్రతి విద్యార్థీ ఆదర్శనీయంగా తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న సెంట్రయూనివర్సిటి రీసెర్స్ స్కాలర్ గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ   విద్యార్థులు మహోన్నతమైన కలలు కనాలనీ, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషిచేయాలని చెప్పి, నిరూపించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అన్నారు. ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకొని తమలోని శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ విజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామమోహనరావు, ఆహార పోషణానిపుణురాలు శ్రీమతి శ్రీచందన, డిగ్రీ కళాశాల  ప్రిన్సిపాల్  నరసింహులు, విద్యానికేతన్ మోడల్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రామాచారి, ప్రిన్సిపాల్ శ్రీమతి కనకదుర్గ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, జనార్థనరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

02 అక్టోబర్, 2017

శాంతి, అహింసల స్ఫూర్తి ప్రదాత గాంధీజి

గాంధీజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


గాంధీజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


గాంధీజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆచార్య దార్ల వెంటేశ్వరరావుని సత్కరిస్తున్న ఫ్రెండ్స్ వెల్పేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, స్కూల్ కరస్పాండెంట్  శ్రీ ఫణికుమార్ 

సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు





విద్యార్థినీ విద్యార్థుల చేత గాంధీ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు