నమస్తే తెలంగాణ దినపత్రిక, 4 జనవరి 2019
ఆంధ్రప్రభ దినపత్రిక, 4 జనవరి 2019
స్త్రీవిద్యవల్లనే సమాజ పురోభివృద్ధి సాధ్యమవుతుందని నిరూపించి, బడుగు, బలహీన వర్గాల్లో అక్షరాస్యత అవసరాన్ని చాటిన గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని హెచ్ సీయు స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటి డీన్, ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పాపిరెడ్డి నగర్ లో గల శారదా విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి, ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. కులవ్యవస్థ వల్ల అక్షరాస్యతకు దూరమైన వర్గాల్ని దగ్గరకు తీసుకొని అక్షరాస్యుల్ని చేయడానికి స్వయంగా పాఠాల్ని బోధించి, మహిళల కొరకు పాఠశాలల్ని స్థాపించిన ఘనత సాహిత్రిబాయి ఫూలేకే దక్కుతుందని, ఆయన అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె ప్రసిద్ధిపొందారనీ, అనేక స్వచ్ఛందసంస్థలు ఆమె పేరుతో మహిళా ఉపాధ్యాయదినత్సవాన్ని జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. పితృస్వామ్యవ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు చేశారని, స్త్రీలకెందరికో ప్రసవాల సమయంలో సహాయం చేసేవారని, మహారాష్ట్రలో ప్లేగువ్యాధి ప్రబలమననప్పుడు ఆమె ఎంతో ధైర్యంతో రోగులకు సేవలు చేశారనీ ఆయన వివరించారు. నేడు స్త్రీలు చదువుకోవడానికి అం బేద్కర్, పెరియార్ రామస్వామినాయకర్, జ్యోతిభాపూలే వంటి ఎంతో మంది మహానుభావులు చేసిన కృషితో సమానంగా సాహిత్రిబాయి ఫూలే పనిచేశారని ఆయన ప్రశంసించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్చందసంస్థ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షోపన్యాసం చేస్తూ, విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, గుణాత్మకమైన విద్యను స్త్రీలకు కూడా అందించినప్పుడే అన్నిరంగాల్లోనో అభివృద్ధిని సాధించవచ్చునని అన్నారు. సావిత్రిబాయి ఫూలే జీవితం ప్రతి మహిళకు ఆదర్శనీయం కావాలని, ఆమె కృషిని కొనసాగించాలని ఉద్బోధించారు. హెచ్ సీయు పిహెచ్.డి. రీసెర్చ్ స్కాలర్ వాహిని సావిత్రిబాయి ఫూలే జీవితాన్ని వివరించి, ఆమె పేరుతో పూనేలో ఒక విశ్వవిద్యాలయానికి పేరు పెట్టారనీ, భారతప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసిందనీ పేర్కొన్నారు. శారదా విద్యానికేతన్ ఉన్నతపాఠశాల ప్రిన్సిపాల్ డా.జి.రోజి సమన్వయ కర్తగా వ్యవహిరిస్తూ, తమ పాఠశాలలో సావిత్రిబాయిఫూలే జయంతి వేడుకలు జరపడం వల్ల విద్యార్థినీ విద్యార్ధుల్లో ఈ కార్యక్రమం ఎంతగానో ప్రేరణనిస్తుందని అన్నారు. తమ పాఠశాలలో ఉచితంగా విద్యను అందిస్తున్నామనీ, శ్రీమతిశారదగారు తమకు విద్యవల్ల కలిగే ప్రయోజనాల్ని చెప్పి చైతన్యం చేయడం వల్ల ఆమె పేరుతో ఈ పాఠశాల నిర్వహిస్తున్నామన్నారు. సూపర్ విజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామమోహనరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుండే ఆదర్శభావాల్ని అలవర్చుకోవాలని, అందుకు ప్రసిద్ధ సంఘసంస్కర్తలు, సామాజికసేవకులు, దేశభక్తులు జీవితాలు గురించి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంకితభావంతో పనిచేస్తున్న శ్రీమతి రజని, శ్రీమతి తేజ, శ్రీమతి లత, శ్రీమతి కమల, శ్రీమతి లక్ష్మి అనే ఐదుగురు మహిళా ఉపాధ్యాయినులకు ‘సావిత్రిబాయి ఫూలే ఉత్తమ మహిళా ఉపాధ్యాయినుల పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ లోక్ నాథ్, శారదా విద్యానికేతన్ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులూ పాల్గొన్నారు.
ఈనాడు దినపత్రిక, 4 జనవరి 2019
సూర్య దినపత్రిక, 4 జనవరి 2019
మనతెలంగాణ దినపత్రిక, 4 జనవరి 2019
జనం సాక్షి దినపత్రిక, 4 జనవరి 2019
నమస్తే దినపత్రిక, 4 జనవరి 2019
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి