"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26 ఏప్రిల్, 2023

ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య బాల శ్రీనివాసమూర్తిగార్ల సంస్మరణ సభ

ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య బాల శ్రీనివాసమూర్తిగార్ల సంస్మరణ సభ 














నిత్య అధ్యయనశీలి, సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు, ఉత్తమ అధ్యాపకుడు, పరిపాలనాదక్షుడు ఆచార్య రవా శ్రీహరి అని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం (25.4.2023) హైదరాబాద్ విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో జాకీర్ హుస్సేన్ భవనంలో ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తిగార్ల  సంస్మరణ సభ జరిగింది. ఈ సంస్మరణ సభకు తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలుగు శాఖకు ఆచార్య రవ్వా శ్రీహరి గారు రెండు పర్యాయాలు అధ్యక్షులుగా పని చేశారని, సుదీర్ఘ కాలం పాటు తెలుగు శాఖలో పాఠాలు బోధించారని సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప పండితుడని ఆయన వ్యాఖ్యానించారు. ఆచార్య రవ్వా శ్రీహరి ఒక పేద కుటుంబం నుండి వచ్చిఅత్యున్నమైన విశ్వవిద్యాలయ స్థాయిలో వైస్ ఛాన్సలర్ ఎదగడం సామాన్యమైన విషయం కాదని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఒక చేనేత కుటుంబం నుండి వచ్చిన ఆచార్య శ్రీహరి యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సంస్కృత పాఠశాల నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు కొనసాగిన విద్యాభ్యాసం, ఆయన చేసిన ఉద్యోగాలు, చేసిన రచనలను ఆచార్య పిల్లలమర్రి రాములు సోదాహరణంగా వివరించారు. ఆచార్య రవ్వా శ్రీహరి గారితో పాటు ఇటీవల గుండెపోటుతో మరణించిన తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తిగార్ల సాహిత్య సేవను గుర్తుచేసుకున్నారు.త ఇరువురు తెలంగాణ భాష, సాహిత్యాలకు ఎనలేని కృషి చేశారని వక్తలు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా.భూక్యా తిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని నివాళులు అర్పించారు.

02 సెప్టెంబర్, 2021

సవరభాషలో గిడుగు వారిది సాధికారిక పరిశోధన ( 1.9.2021 కార్యక్రమం)

 1.9.2021, HCU, Department of Telugu Programme on Gidugu Venkata Ramamurty 


నవతెలంగాణ దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో


సవర జాతి వారు మోసపోకుండా వారి భాషలోనే సాధికారికంగా పరిశోధన చేసిన భాషోద్యమ కారుడు గిడుగు వేంకట రామమూర్తి అని ప్రముఖ భాషావేత్త, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర పూర్వపీఠాధిపతి  ఆచార్య అయినవోలు ఉషాదేవి పేర్కొన్నారు.


                                         సాక్షి దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో

గిడుగు వేంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు శాఖ, మాతృభాషలు, అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం సంయుక్తంగా  బుధవారం నాడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన  ప్రత్యేక ప్రసంగ కార్యక్రమంలో *గిడుగు భాషోద్యమం-తెలుగు భాషాభివృద్ది* అనే అంశంపై ఆచార్య అయినవోలు ఉషాదేవి మాట్లాడారు.పరిపాలనారంగంలో ఉన్నవారు ప్రజల భాషను పట్టించుకున్నప్పుడే ఆ భాష అన్ని రంగాల్లోను వ్యవహారాల్లోకి రాగలుగుతుందని ఆమె  వ్యాఖ్యానించారు. 



నమస్తే తెలంగాణ దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో


ఈనాడు దినపత్రిక, 2.9.2021సౌజన్యంతో

నమస్తే దినపత్రిక, 2.9.2021స సౌజన్యంతో

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో

భూమిపుత్ర దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో



ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన మాతృభాషలు, అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ఆచార్య పమ్మి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతియేడాదీ గిడుగు, కాళోజీ జయంతులను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు వివిధ శాఖల సమన్వయంతో చేస్తున్నారని తెలిపారు.  ఆ విధంగా తెలుగు భాష, భాషా సాహిత్య వేత్తలను స్మరించుకోవడం అంటే నిత్యం భాషను సమీక్ష చేసుకోవడమే నని ఆయన అన్నారు. తెలుగు శాఖ అధ్యక్షుడు తొలిపలుకులు పలుకుతూ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి సంఘసంస్కరణ, స్త్రీ సమస్యల సంస్కరణ, గిడుగు రామ్మూర్తి భాషాసంస్కరణ చేసిన సంస్కరణ త్రయంగా అభివర్ణించారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కాళోజీ నారాయణరావు జయంతులను తెలుగు శాఖ నిర్వహిస్తుందని ఆయన అన్నారు.  ఈ అంతర్జాల  కార్యక్రమంలో ఆచార్య ఎం.గోనానాయక్,  ఆచార్య డి.విజయలక్ష్మి, డా.డి.విజయకుమారి, ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు, డా.జె.వి.చలపతిరావు, డా.ఎం.అన్వర్ హుస్సేన్ , పరిశోధకులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

23 జులై, 2021

‘దాశరథి స్ఫూర్తి నేటికీ అవసరమే’ దాశరథి జయంతి సభలోవక్తలు ( 22.7.2021)

 

సాక్షి దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో... 

తెలంగాణాలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలాన్ని, గళాన్ని అందించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని హెచ్ సి యు మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి. కృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచార్య వి. కృష్ణ  ముఖ్య అతిథిగా విచ్చేసి దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి నుండి పోరాట స్ఫూర్తితో సాహిత్యాన్ని వెలువరించిన గొప్ప కవి దాశరథి అనీ, ఆ పోరాట స్ఫూర్తిని నేటికీ ఉద్యమకారులు అందుకోవలసిన అవసరం కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.  తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని నిలిపిన దాశరథి గురించి పలువురు వక్తలు మాట్లాడారు. హెచ్ సి యు అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ దాశరథి బహుముఖ ప్రజ్ఞావంతుడనీ, ఒకవైపు పోరాట గీతాలు రచించినా, తదనంతర కాలంలో ఉత్తమమైన సినిమా పాటలు, విలువైన విమర్శనా వ్యాసాలను వెలువరించారనీ, గాలిబ్ గీతాల ద్వారా ఉర్దూసాహిత్య మాధుర్యాన్ని అందించారని అన్నారు. ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా.డి.విజయకుమారి తదితరులు  మాట్లాడుతూ దాశరథి గారి సాహిత్య వైశిష్ట్యాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని వివరించారు.


ఆంధ్రప్రభ దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో... 

ఈనాడు  దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో... 

 

నమస్తేతెలంగాణ దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో...