"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 September, 2021

సవరభాషలో గిడుగు వారిది సాధికారిక పరిశోధన ( 1.9.2021 కార్యక్రమం)

 1.9.2021, HCU, Department of Telugu Programme on Gidugu Venkata Ramamurty 


నవతెలంగాణ దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో


సవర జాతి వారు మోసపోకుండా వారి భాషలోనే సాధికారికంగా పరిశోధన చేసిన భాషోద్యమ కారుడు గిడుగు వేంకట రామమూర్తి అని ప్రముఖ భాషావేత్త, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర పూర్వపీఠాధిపతి  ఆచార్య అయినవోలు ఉషాదేవి పేర్కొన్నారు.


                                         సాక్షి దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో

గిడుగు వేంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు శాఖ, మాతృభాషలు, అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం సంయుక్తంగా  బుధవారం నాడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన  ప్రత్యేక ప్రసంగ కార్యక్రమంలో *గిడుగు భాషోద్యమం-తెలుగు భాషాభివృద్ది* అనే అంశంపై ఆచార్య అయినవోలు ఉషాదేవి మాట్లాడారు.పరిపాలనారంగంలో ఉన్నవారు ప్రజల భాషను పట్టించుకున్నప్పుడే ఆ భాష అన్ని రంగాల్లోను వ్యవహారాల్లోకి రాగలుగుతుందని ఆమె  వ్యాఖ్యానించారు. 



నమస్తే తెలంగాణ దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో


ఈనాడు దినపత్రిక, 2.9.2021సౌజన్యంతో

నమస్తే దినపత్రిక, 2.9.2021స సౌజన్యంతో

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో

భూమిపుత్ర దినపత్రిక, 2.9.2021 సౌజన్యంతో



ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన మాతృభాషలు, అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ఆచార్య పమ్మి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతియేడాదీ గిడుగు, కాళోజీ జయంతులను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు వివిధ శాఖల సమన్వయంతో చేస్తున్నారని తెలిపారు.  ఆ విధంగా తెలుగు భాష, భాషా సాహిత్య వేత్తలను స్మరించుకోవడం అంటే నిత్యం భాషను సమీక్ష చేసుకోవడమే నని ఆయన అన్నారు. తెలుగు శాఖ అధ్యక్షుడు తొలిపలుకులు పలుకుతూ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి సంఘసంస్కరణ, స్త్రీ సమస్యల సంస్కరణ, గిడుగు రామ్మూర్తి భాషాసంస్కరణ చేసిన సంస్కరణ త్రయంగా అభివర్ణించారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కాళోజీ నారాయణరావు జయంతులను తెలుగు శాఖ నిర్వహిస్తుందని ఆయన అన్నారు.  ఈ అంతర్జాల  కార్యక్రమంలో ఆచార్య ఎం.గోనానాయక్,  ఆచార్య డి.విజయలక్ష్మి, డా.డి.విజయకుమారి, ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు, డా.జె.వి.చలపతిరావు, డా.ఎం.అన్వర్ హుస్సేన్ , పరిశోధకులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

No comments: