ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య బాల శ్రీనివాసమూర్తిగార్ల సంస్మరణ సభ
నిత్య అధ్యయనశీలి, సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు, ఉత్తమ అధ్యాపకుడు, పరిపాలనాదక్షుడు ఆచార్య రవా శ్రీహరి అని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం (25.4.2023) హైదరాబాద్ విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో జాకీర్ హుస్సేన్ భవనంలో ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తిగార్ల సంస్మరణ సభ జరిగింది. ఈ సంస్మరణ సభకు తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలుగు శాఖకు ఆచార్య రవ్వా శ్రీహరి గారు రెండు పర్యాయాలు అధ్యక్షులుగా పని చేశారని, సుదీర్ఘ కాలం పాటు తెలుగు శాఖలో పాఠాలు బోధించారని సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప పండితుడని ఆయన వ్యాఖ్యానించారు. ఆచార్య రవ్వా శ్రీహరి ఒక పేద కుటుంబం నుండి వచ్చిఅత్యున్నమైన విశ్వవిద్యాలయ స్థాయిలో వైస్ ఛాన్సలర్ ఎదగడం సామాన్యమైన విషయం కాదని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఒక చేనేత కుటుంబం నుండి వచ్చిన ఆచార్య శ్రీహరి యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సంస్కృత పాఠశాల నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు కొనసాగిన విద్యాభ్యాసం, ఆయన చేసిన ఉద్యోగాలు, చేసిన రచనలను ఆచార్య పిల్లలమర్రి రాములు సోదాహరణంగా వివరించారు. ఆచార్య రవ్వా శ్రీహరి గారితో పాటు ఇటీవల గుండెపోటుతో మరణించిన తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తిగార్ల సాహిత్య సేవను గుర్తుచేసుకున్నారు.త ఇరువురు తెలంగాణ భాష, సాహిత్యాలకు ఎనలేని కృషి చేశారని వక్తలు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా.భూక్యా తిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని నివాళులు అర్పించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి