"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

చలపతిరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చలపతిరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23 జనవరి, 2026

అమ్మా భారతీ! జ్ఞాన మార్గము జూపుమమ్మా!,

 అమ్మా!భారతీ!

జ్ఞాన మార్గము జూపుమమ్మా!


 ఆ.వె. 

మావి చిగురుదొడిగె! మలయాద్రి పవనాల

కోయిలమ్మ పాడె కుహుకుహుమని!

చదువులమ్మవీవు జగతివిద్యనొసగ!

బ్రతుకు బాటనిలుపు!భారతీమ!


తే.గీ. 

తెల్ల పద్మము నందున తెలివితోడ

వీణ మీటుచు కొలువైన వేదమాత!

జ్ఞాన భిక్షను కోరెడి జనులకెల్ల

దీవెనలనంద జేయుము దివ్యముగను!


ఆ.వె.

ధనము దోచబడును!విద్య దోచగలేరు!

తరగిపోని ధనమె తనదువిద్య!

విద్యనొసగుతల్లివి!వసుధ జనులకెల్ల!

శారదాంబ!నిన్ను సన్నుతింతు!


తే.గీ.

మంచి బుద్ధిని మాకిచ్చి మమ్ముగాచు!

ధారణాశక్తి నందించి దారిజూపు!

విద్యలందున బోధనావెలుగు నీవె!

విశ్వ ప్రగతికి విద్యలె వేదికగును!


తే.గీ. 

పసిడి వర్ణపు కాంతుల పట్టమహిషి!

వీణనొకచేత ధరియించు విరులబోణి!

పుస్తకము నొకచేతియందు‌ పొందు పరచి

వాక్కులమ్మగ!విద్యల వాణినీవె!


వసంత పంచమి శుభాకాంక్షలతో …


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగు శాఖ, యూని

వర్సిటీ ఆఫ్ హైదరాబాద్.

23-01-2026


19 జనవరి, 2026

తేటతెలుగు వాత్సల్య రసమూర్తికి! తేటగీతి! (డా.జె.వి.చలపతిరావుగారిపై ప్రశంస పద్యాలు)

 

                        తేటతెలుగు వాత్సల్య రసమూర్తికి! తేటగీతి!

డా.జె.వి.చలపతిరావుగారు

వెలుగు కంటెను దీవెనల్ వేల్పు మాకు!

ధన్యమగు మాదు గుణములే ధరణి నిలచు!

పరమ వాత్సల్య రసములై ప్రబలు నార్య!

 

ఉప్పు కప్పురమును బోలు నొప్పు గుణము!

కవుల కనులకె వెలుగులు కలుగు నయ్య!

మేము చేసిన పుణ్యమా! మీదు రచన!

మీదు గుణములే యక్షర మెరపులార్య!

 

కల్ప వృక్షము నీడన కలిమి కలుగు

కామధేనువు చెంతను కరువు లేదు

యటులె మీ పద్య దీవనల్ మాకు దొరికె

చలపతియె మమ్ము నిరతము చక్కదీర్చె!

 మల్లె పూవుల తావియే మహినిదాక

బిరుదమది కవికోకిల పెంపుమీర!

శ్రీనివాసుని కృపయది సిద్ధినొసగె!

చలపతియె మాకు దొరికిన చతురమతి

యు!

 

కవికి మించిన దాతయు కాన రాడు!

దీవనలనిచ్చు గురువుకు ధీటు లేరు!

చలపతికి మేము మ్రొక్కెద విలసితముగ!

నక్షరమ్ముల దీవించె నార్యవర్య!

(నన్ను, నా జీవితభాగస్వామిని,  నా కుమారుడినీ అనేక పద్యాలలో వర్ణించిన ‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావుగార్కి కృతజ్ఞతలతో…!)

 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

 తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్, 18.1.2026

 


 

20 ఏప్రిల్, 2023

బాబుపై డా.జె.వి.చలపతిరావుగారి పద్యాలు (2023)

 ఆ.వె.

పరిమళంబిది పసిబాలుని ముఖమది

పరిణతిగొనగానిది పరిఢవిల్లు

దార్లవారి సుతుని దర్శనమిదియెగా!

దంపతులిట నవ్యతనిక పెంపు!



కం.

పసిబాలుని మిసిమి కనులు

శశిరేఖల వెలుగు జగతి సంబర మిదియే!

దశదిశలందు జనులు సా

రసమొప్పగ దీవనలిడు రమణీయంబై!

కవికోకిల డా. జె.వి.చలపతిరావు, 19.4.202 తెలుగు అధ్యాపకులు