వెలుగు కంటెను దీవెనల్ వేల్పు
మాకు!
ధన్యమగు మాదు గుణములే ధరణి నిలచు!
పరమ వాత్సల్య రసములై ప్రబలు
నార్య!
ఉప్పు కప్పురమును బోలు నొప్పు గుణము!
కవుల కనులకె వెలుగులు కలుగు
నయ్య!
మేము చేసిన పుణ్యమా! మీదు రచన!
మీదు గుణములే యక్షర మెరపులార్య!
కల్ప వృక్షము నీడన కలిమి కలుగు
కామధేనువు చెంతను కరువు లేదు
యటులె మీ పద్య దీవనల్ మాకు దొరికె
చలపతియె మమ్ము నిరతము చక్కదీర్చె!
కవికి మించిన దాతయు కాన రాడు!
దీవనలనిచ్చు గురువుకు ధీటు లేరు!
చలపతికి మేము మ్రొక్కెద విలసితముగ!
నక్షరమ్ముల దీవించె నార్యవర్య!
(నన్ను, నా జీవితభాగస్వామిని, నా కుమారుడినీ
అనేక పద్యాలలో వర్ణించిన ‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావుగార్కి కృతజ్ఞతలతో…!)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్,
18.1.2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి