గౌతమీనది తీరాన…పుస్తకావిష్కరణ, అంకితోత్సవం
ప్రజాకాంక్ష దినపత్రిక, రాజమహేంద్రవరం 28.6.2026 సౌజన్యంతో
ప్రముఖ కథా రచయిత రత్నాకర్ పెనుమాక రచించిన ‘గౌతమీ నది తీరాన…’ కథల సంపుటి శనివారం మధ్యాహ్నం (27.6.2026) ఆవిష్కరణ, అంకితోత్సవ సభ ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జ్యోతి ప్రజ్వలనం చేసిన ఆర్.డి.విల్సన్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తదితులు
పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్య అతిథి తెలుగు & సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ గారుపుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్య అతిథి తెలుగు & సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ గారు .
రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్న దృశ్యం.రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్న దృశ్యం.
రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్న దృశ్యం.రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథ ఆవిష్కరణ వేదిక.
ఆయన మాట్లాడుతూ సమకాలీన కథా రచయితలలో రత్నాకర్ పెనుమాక తూర్పు గోదావరి, ముఖ్యంగా కోనసీమ జీవితాలను కథలుగా వర్ణించడంలో ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగిన గొప్ప భావోద్వేగాలు ఉన్న రచయిత అని వ్యాఖ్యానించారు. ఆయన రచించిన గౌతమీ నది తీరాన…సంపుటిలో గల కథలలో తెలుగు పలుకుబడి, భాషలోని పరిమళాన్ని, జీవన వాస్తవికతను కళాత్మకంగా వర్ణించగలిగిన గొప్ప రచయిత కనిపిస్తాడని, ఆయన ‘ధోని గంగమ్మ’అనే కథ ద్వారా ప్రపంచస్థాయి కథకుడుగా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. ఆయన కథ ‘ఈపొలం అమ్మబడును’ డిగ్రీ స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక కావడం ఆయన కథల్లో గల నిజమైన ప్రతిభకు నిదర్శనమని ఆర్.డి విల్సన్ వ్యాఖ్యానించారు. ఈ కథా సంపుటిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావుకి ఘనంగా అంకితం చేశారు. సామాన్యుడిగా కనిపించే రత్నాకర్ లో అసామాన్యుడైన కథకుడు ఉన్నాడని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధునాపంతుల సత్యనారాయణమూర్తి అన్నారు. గ్రామ సర్పంచ్ స్టాలిన్ మాట్లాడుతూ జేవురుపాడుకి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది, దాన్ని సాహితీ ప్రపంచానికి కూడా పరిచయం చేసి గుర్తింపు తెచ్చిన కథకుడిగా రత్నాకర్ నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. సినీ నటుడు, టీవీ కళాకారుడు నువ్వు బిళ్ళ సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ జేగురుపాడు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజల సాంస్కృతిక జీవనాన్ని, వాస్తవిక జీవనస్థితిగతుల చరిత్రను కథల ద్వారా భద్రపరిచిన గొప్ప సాహిత్య సృజనకారుడు రత్నాకర్ అని అభివర్ణించారు. కథా రచయిత రత్నాకర్ వ్యక్తిత్వాన్ని కథల నేపథ్యాన్ని హైదరాబాదులోని గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ దిగుమర్తి సురేష్ ఆత్మీయంగా పరిచయం చేశారు. ఈ ప్రాంతంతో ముడిపడిన జీవితాన్ని కథలుగా మలిచిన తీరుని ఆయన ఆసక్తిగా వివరించారు. ఐఐ ఐ టి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఉడుము ఝాన్సీ మాట్లాడుతూ ఆచార్య దార్ల వెంకటేశ్వరావు జీవితాన్ని, ఆయన బోధనా ప్రభావాన్ని, సాహిత్య కృషినీ,సాహితీవేత్తలను ప్రోత్సహించే తీరుతెన్నులను సోదాహరణంగా కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.
రత్నాకర్ పెనుమాక రచించిన 'గౌతమీ నది తీరాన...కథా సంపుటి గ్రంథ ఆవిష్కరణ సభలో జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఐఐఐటి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఉడుము ఝాన్సీ... తదితరులు
తాను ఆయన విద్యార్థిగా మాట్లాడడం తన అదృష్టంగా ఆయన ఆమె వ్యాఖ్యానించారు. రమ్య సాహితి సమితి పక్షాన అధ్యక్షులు ఎం ఆర్ వి సత్యనారాయణమూర్తి గౌతమీ నదీ తీరాన…కథల సంపుటికి ఉత్తమ కథల సంపుటి పురస్కారాన్ని రత్నాకర్ పెనుమాక కు ఇచ్చి ఆయనను వేదికపై సత్కరించారు.
తనకు ప్రత్యక్షంగా ఆయనతో పరిచయం లేకపోయినా రత్నాకర్ తనకు పుస్తకం అంకితం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన కథలు చదివి ఆ కథలలోని జీవితాన్ని, అభివ్యక్తి వైచిత్రినీ ముఖ్యంగా తూర్పుగోదావరి కోనసీమ జీవితాలను అక్షయకరించడంలో ఆయన చూపిన ప్రత్యేకతలను చూసి తానెంతో ఆశ్చర్యపోయాననీ పేర్కొన్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వాస్తవిక జీవితం కథల ద్వారా కళాత్మకం కావడం ఈ మధ్య రత్నాకర్ పెనుమాక కథలోనే గమనించానని ఆచార్య దార్ల పేర్కొన్నారు.
అంకితం తీసుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగౌతమీ నదీ తీరాన… కథలలో స్థానికతను, సంస్కృతిని కథనీకరించడంలో గూగుల్ మ్యాప్ లా ఆ ప్రాంతాలన్నింటినీ మనకు చూపిస్తున్నట్లు, ఆ ప్రాంతంలోని వ్యక్తులు మనతో సజీవంగా మాట్లాడుతున్నట్లు వర్ణించగలిగిన సామర్థ్యం, ఈ ప్రాంతంలోని మనుషుల ప్రేమను, మానవత్వాన్నీ అత్యంత భావోద్వేకంతో వర్ణించిన గొప్ప రచయితగా వ్యాఖ్యానించారు. ఆయన రచించిన ‘దోని గంగమ్మ’కథ నిజంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన తెలుగు కథగా పేర్కొనవచ్చుననీ, ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) గారి సంపాదకత్వంలో వచ్చిన ఉషా పత్రిక నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి రావడం ఆయనకు లభించిన గొప్ప పురస్కారం వంటిదని అన్నారు. ఆనాటి నుంచి ఆయన ప్రపంచ స్థాయి కథకుడుగా నిలిచిపోయారన్నారు.ప్రపంచ స్థాయి కథలుగా చెప్పే ‘గాలివాన’, ‘నీలి’ కంటే కూడా ‘దోని గంగమ్మ’ కథ ప్రేమ, మానవత్వం చూపిన అట్టడుగు వర్గాల జీవితాలకు ప్రాతినిథ్యం వహించే గొప్ప కథగా ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. అటువంటి గొప్ప కథలను తనకు అంకితం ఇవ్వడం, అది కూడా ప్రముఖ రచయిత శరత్ చంద్ర గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, ఆయన ఆధ్వర్యంలో తనకు అంకితం చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తన కథలకు ప్రేరణగా నిలిచిన తన గ్రామానికీ, గ్రామస్తులకు, కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు కథా రచయిత రత్నాకర్ పెనుమాక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
'గౌతమీ నది తీరాన...కథా రచయిత రత్నాకర్ పెనుమాక కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం
తన కథలలో వాస్తవికతకు ప్రాధాన్యాన్ని ఇవ్వడంతో పాటు, కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని కేంద్రంగా చేసుకొని కథలు రాశానని, ప్రేమ తత్వాన్ని చాటి చెప్పడమే తన కథల లక్ష్యంగా పేర్కొన్నారు. తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన కథ డిగ్రీ స్థాయిలో పాఠ్యాంశంగా రావడానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ప్రత్యక్షంగా గురువు కాకపోయినా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తనకు గురువు లాంటి వారిని, ఎందరినో నిష్కల్మషంగా ప్రోత్సహించే ఆయనకు తన పుస్తకం అంకితం ఇవ్వాలనుకున్నానని తెలిపారు. ప్రముఖ కథకుడు శరత్ చంద్ర గారు తనకు ప్రపంచ కథకుడిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. అధిక సంఖ్యలో జేగురుపాడు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, సాహితీవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉద్వేగ భరితంగా కొనసాగింది.


















కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి