"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

30 August, 2021

తెలుగు భాషా దినోత్సవం-2021 (నార్వే)

 





నిర్వాహకులు ప్రచురించిన కరపత్రాల్లో ఒకటి.

ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ఉప రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం.వెంకయ్యనాయుడు గారు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వంశీ రామరాజు గార్లు ఈ చిత్రంలో ఉన్నారు.

29.8.2021... దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సమావేశం

ప్రజల భాషలో పాలన వల్లే ప్రభుత్వం పై విశ్వాసం

ప్రజల అవసరాలను గుర్తించిన పాలకులే  ఆ రాష్ట్రంలో అత్యధికులు మాట్లాడే భాషలో తమపాలనను కొనసాగిస్తారని, దాని వల్ల పాలకులు ప్రవేశపెట్టిన పథకాలు సమర్థవంతంగా అమలు చేయవచ్చుననీ, ప్రజలకు ప్రభుత్వాలపై విశ్వాసం పెరుగుతుందని హెచ్ సి యూ తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.  గిడుగు రామమూర్తి పంతులు 158 లో జయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నార్వే దేశం కేంద్రంగా  79 దేశాల ప్రతినిధులతో ఆదివారం అంతర్జాలం ద్వారా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న వివిధ సమావేశాల్లో పాలనా రంగంలో తెలుగు భాష-నాడు:నేడు అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు.

సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

సభా నిర్వాహకుల్లో ఒకరైన ప్రొఫెసర్ శ్రీ గణేశ్ తొట్టెంపూడి గారు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది శ్రీ సుంకర రాజేంద్రప్రసాద్ గారు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు

తెలుగు భాష న్యాయ స్థానాల్లో అమలు జరగడం, దానిపై వచ్చే సమస్యలను, న్యాయశాస్త్రం పారిభాషిక పదకోశాలు రావాల్సిన అవసరాన్ని  హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వివరించారు.సంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన అంశాల్లో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు పాల్గొన్నారు. 



సభలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు. సభలో ఆచార్య దార్ల, నిర్వాహకులు విక్రమ్ పెట్టూరు, వెంకట్ తరిగోపుల, డా.శ్రీగణేశ్ తొట్టెంపూడి తదితరులు







 దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వాహకులు విక్రమ్ పెట్టూరు, వీధి అరుగు వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల, జర్మనీ ప్రొఫెసర్ శ్రీ గణేశ్, ఆంధ్ర జ్యోతి సంపాదకుడు శ్రీనివాస్, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు,  బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ చల్లా శ్రీరామచంద్రమూర్తి, యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ మసనచెన్నప్ప, పంచసహస్రావధాని డా.మేడసాని మోహన్, గిడుగు రామమూర్తి పంతులు గారి మనవుడు గిడుగు రామదాసు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, సినీనటుడు లోహిత్ కుమార్, ఓల్గా, వంశీ రామరాజు తదితరులు ఈ సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

No comments: