"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

07 September, 2021

బుల్లెట్ బండి పాట...ఒక విశ్లేషణ

 *సేకరణ* 

" బుల్లెట్టు బండి " పాట గురుంచి నా విశ్లేషణ  


“ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని “ ఈపాట అత్యంత ప్రజాధరణ పొందుతోంది. ఈపాట ఇంత ప్రజా ధరణ పొందటానికి గల కారణాలేమిటి? వాటిని తెలుసుకొందామని అపాట సాహిత్యం, పాడినవారు గురించి వివరాలు సేకరించాను. 


ఈపాట ప్రజాదరణ పొందడానికి గల కారణాలు మూడు. అవి

• మొదటిది : అదృష్టం 

• రెండొవది : సాహిత్యం

• మూడొవది : పాట పాడిన తీరు 


 మొదటిది అదృష్టం గురించి::

ఈపాట ఆల్బము  దాదాపు మూడునెలల క్రిందనే తయారు చేశారు.అయితె ఆంతగా ప్రజలలోకి  రాలేదు. కానీ 


సాయిశ్రీయ (నూతన మధువు)  ఆమె విప్రో సంస్థలో సాఫ్ట్ వేరు  ఇంజినీరుగా  పని చేస్తున్నారు, అలాగే ఆకుల అషోక్ గారు GHMC లో టవును  ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరి వివాహం జరిగి  అప్పగింతలో  సమయంలో నూతన వధువు ఈపాటను ఎంచుకొని నాట్యము చేస్తూ అక్కడ ఉన్న బంధువులను, భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను మరియు అక్కడున్నవారిని  ఆననంద డోలికలలో ముంచెత్తించింది. అటుపిమ్మట  ఈపాటని వాట్సపులో ప్రవేశపెట్టింది.  అంతే ఈపాట అన్ని ప్రాంత ప్రజలను బాగా ఆకట్టుకోవడమే కాదు,  ఈరోజు వైద్య విభాగంలో పని చేసే నర్సులు కూడా  పక్షవాత రోగులముందు ఈపాటకు నాట్యము చేస్తుంటే ఆ రోగి కూడా పక్షవాతాన్ని గూడా మరచిపోయి తన రెండు చేతులను పైకి లేపుతూ తను కూడ చేతులు ఎత్తి తిప్పుతూ  చేయ నారంబించాడు.  అంతే కాకుండ ప్రతినోట, ప్రతి వాడన ఈ పాటకు నృత్యం చేస్తూ ఆనంద డోలికలలో మునుగి పోతున్నారు.           

    ఇంత ఆధరణ లభించిన తరువాత ఈపాట వ్రాసిన లక్ష్మన్ గారికి పాట పాడి నృత్యం చేసిన మొహనా భోగరాజుగారికి మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు వచ్హింది.  


 పాట  రచయిత లక్ష్మన్ గారికి పాట పాడిన మొహన భోగరాజు గారికి  అదృష్టం అనేది ఈ నూతన వధూవరులు చేసిన  నృత్యం ద్వారా కలసి వచ్హింది.  అందుకే ప్రతి మనిషికి  అదృష్టం ఎలా వస్తుందో ఎలా పోతుందో అంతా  ఆ భగవంతుడి నిర్ణయం అంటారు.          


సాహిత్యం

రెండొవది పెళ్ళి కాబోతున్న ఆడపిల్ల మనస్సులోని భావాలను  చక్కగా అందించిన లక్ష్మణ్ గారి సాహిత్యం :


ముందుగా ఈ పాట వ్రాసిన లక్ష్మణ్ గారికి అభినందనలు చెప్పాలి.  ఈపాట సాహిత్యం ఒక పల్లెలో పెరిగిన అమ్మాయి తన అభిరుచులను తన మనసులోని భావాలను ఒక్క పాటతో తన భర్తముందు ఉంచింది.  తను మేడలూ మిద్దెలు, కార్లు కావాలని అడగలేదు.  తన గురించి వర్ణిస్తూ చక్కటి పట్టు చీరకట్టుకొని, టిక్కీ బొట్టు పెట్టుకొని, నడుముకు వడ్డాణం ధరించి, దిష్టి చుక్క బుగ్గన పెట్టుకొని, చెవులకు దిద్దులు ధరించి పెళ్ళికూతురై ముస్తాబుతో  నువ్వు ఎక్కడినుండి వస్తావో అని ఎదురు చూస్తూ నా చెయ్యిని నీకు ప్రేమతో అందిస్తానురా, నీ అడుగులో నేను అడుగు వేస్తూ నడవాలని కోరుకొంటూ, నేను మెచ్హిన, నన్ను మెచ్హిన నీ వెంట ఇట్టే వచ్హేస్తానురా  అని చెబుతూ,      


నీతో బుల్లెట్టు బండెక్కి డుగు డగు డగు డుగు అంటూ మా ఊరు అందాలను, మల్లె తోటలను, బంతి తోటలను చూపిస్తూ ఆపూలను త్రెంపి మాలలుగా కట్టి నన్నేల బోతున్న   నీ మెడలో  వేస్తాను పద పద అంటూ  


నేను మంచి మర్యాదలు తెలిసిన దానిని, మట్టి మనషులలోన పెరిగిన దానిని, నేను అమ్మచాటున పెరిగిన ఆడపిల్లను, మా నాన్న నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమతో పెంచాడు, ఏడుగురు అన్నదమ్ముల మద్య  నెనొక్క ఆడపిల్ల అవడంవలన నన్ను గారబంగా పెంచి పువ్వు వలే నీచేతికి అందిస్తున్నారు.   


నా కుడికాలు నీ ఇంట్లో పెట్టి నీకు సిరి సంపదలు కలిగేటట్లు నే మసలుకొంటా, నిన్ను కంటికి రెప్పలా చూసుకొంటా, నీ కష్టాల్లో భాగం పంచుకొంటా      


చుక్క ప్రొద్దుకే నిద్రలేచి చుక్కలు ముగ్గులు వాకిట్లో వేసి చుక్కలే నిన్ను నన్ను చూసి మురిసి పోయాలా నీతో కలసి నా ఏడుజన్మలు నికిచ్చుకుంటా నితోడులో నన్ను నే మెచ్చుకుంటా  


అందాల ప్రపంచాన్నే నీకు చూపిస్తా   అని తన భర్తతో తన భావాలను పంచుకొంటుంది ఈ నవ వధువు   

 

లక్ష్మణ్ గారు అందించిన సాహిత్యం  

• ఏ పట్టు చిరనే కట్టుకున్న కట్టుకునోల్లో కట్టుకున్నా

• టిక్కి బొట్టే పెట్టుకున్న పెట్టుకునోల్లో పెట్టుకున్న

• నడుముకు వడ్డలం చుట్టుకున్న చుట్టుకునోల్లో చుట్టుకున్న

• దిష్టి చుక్కనే దిద్దుకున్న దిద్దుకునోల్లో దిడ్డుకున్న

• పెళ్ళికూతురు ముస్తాబురో నువ్వు ఎడకనస్తావురో

• చెయ్యి నీ చేతికి యీస్తనురో అడుగు నీ అడుగులో ఎస్తనురో

• నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ ఇట్టే వస్తా రా నివెంట

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

• చెరువు కట్టపోంటి చేమంతి వనం బంతివనం చేమంతివనం

• చేమంతులు తెంపి దండా అల్లుకున్న   అల్లుకునోల్లో అల్లుకున్న

• మా ఊరు వనంచూడు మల్లేవనం మల్లేవనముల్లో మాల్లేవనం

• మా మల్లేలు తెంపి ఒళ్ళో నింపుకున్న నింపుకునోల్లో నింపుకున్న

• నువ్వు నన్నెలుతున్నవురో దండ మెల్లోన వేస్తనురో

• నేను నీ యేలు పట్టుకుని మల్లే జెల్లోనా పెడతనురో

• మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషులోన పెరిగినా దాన్ని 

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డుగు డుగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

• నే అవ్వ సాటు ఆడపిల్లనాయ్యో పిల్లనాయ్యో ఆడపిల్లనాయ్యో

• మా నాన్న గుండెల్లోనా ప్రేమనాయ్యో ప్రేమనాయ్యో నేను ప్రేమనాయ్యో

• ఏడు గడపల్లోన ఒక్కదానిరయ్యో దాని రయ్యో ఒక్కదానిరయ్యో

• మా అన్నదమ్ములకు ప్రణమయ్యో ప్రణమయ్యో నేను ప్రణమయ్యో

• పండు వెన్నెల్లో ఎత్తుకుని వెన్నేముద్దలు పెట్టుకొని

• ఎన్ని మరాములు చేస్తూన్న నన్నుగరాలు చేసుకొని చేతుల్లో పెంచారు

• పువ్వల్లేనన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేనూ 

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

• నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకా పెట్టినంకుల్లో పెట్టినంకా

• సిరి సంపదసంబురం కల్గునింకా కల్గునుంకుల్లో కల్గునుంకా

• నిన్ను కన్నుల్లే కన్నులా అల్లుకుంటా అల్లుకుంటుల్లో ఆల్లుకుంటా

• నీ కష్టల్లో బాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా

• చుక్క పొడ్డుకే నిద్రలేసి చుక్కల ముగ్గులు అకిట్లా యేసి

• చుక్కలే నిన్నునన్ను చూసి మురిసిపోయేలానితో కలిసి

• నా ఏడుజన్మలు నికిచ్చుకుంటా నితోడులో నన్ను నే మెచ్చుకుంటా  

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

• నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డగు డగు డుగు అని

• అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 


పాట పాడిన తీరు 

మూడొవది గాయని మొహన భోగరాజు గారు పాట పాడిన తీరు :

ఈ గాయని ఇంతకుముందు చాలా సినిమాలలో పాడింది. అయితే ఈ పాటలోని పదాలను ఆమె పాడిన తీరు, ఆమె వ్యక్తం చేసిన భావము, పల్లెలలోని అందాలను వర్ణించడం, కొత్త పెళ్ళి కూతురు ఆనందంతో భావ వ్యక్తీకరణ చేయడం, ఆ పాడిన యాస,  ప్రజల మనస్సులోకి జొచ్హుకు పోయింది. ఈపాట గాయనిగా     తన  జీవితంలో ఒక మైలు రాయి వంటిది. ముందు ముందు సినీ గాయనిగా తనకు ఎంతగానో ఉపయోగ పడగలదని మనమందరం  ఆశిద్దాము. ఆమెకు మన అందరి తరపున శుభాకాంక్షలు తెలియ చేద్దాము.  


 *ఇట్లు మీ శ్రేయోభిలాషి 

నందిరాజు  రామ్మొహన్ రావ్*

No comments: